Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎలా చదవాలి?

 

      స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా ఎస్‌ఐ, అసిస్టెంట్‌ ఎస్‌ఐ కొలువుల నియామకం జరగబోతోంది. మొత్తం 2902 ఉద్యోగాల్లో 2651 పురుషులకూ, 251 మహిళలకూ కేటాయించారు. జూన్‌ 21న జరగనున్న రాతపరీక్షకు సన్నద్ధమయ్యే విధానం తెలుసుకుందాం!
రాతపరీక్షలోని పేపర్‌-1లో కనీస అర్హత మార్కు సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పీఈటీ, ఇతర పరీక్షల్లో అర్హత సాధించి రాతపరీక్షలోని పేపర్‌-2లో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్ష 400 మార్కులకు, మౌఖికపరీక్ష 100 మార్కులకు. మొత్తం 500 మార్కుల్లో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు పోస్టులను కేటాయిస్తారు.
1) పేపర్‌-1: పేపర్‌-1ను 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. దీనిలో నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి.
ఎ. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ బి. జనరల్‌ నాలెడ్జ్‌ సి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ డి. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌
2. పేపర్‌-2: ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌ పేపర్‌ నుంచి 200 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు కేటాయించిన ఈ పేపర్‌ను 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి.
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికీ 0.25 రుణాత్మక మార్కులున్నాయి.
సన్నద్ధత విధానం
రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారికే పీఈటీ/ పీఎస్‌టీ పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి రాతపరీక్షపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరీక్ష పూర్తయిన తరువాత పీఈటీ/ పీఎస్‌టీ పరీక్షలపై దృష్టి సారిస్తే మేలు.
1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌
ఇందులో ప్రశ్నలు బొమ్మలు, సంఖ్యలు, అక్షరాల ఆధారంగా ఉంటాయి. ప్రశ్నల్లో ఉన్న తర్కాన్ని బట్టి సమాధానం పూర్తిచేయాలి.
వాస్తవికతకు దగ్గరగా సమాధానాలు ఉండేలా చూడాలి. రీజనింగ్‌ నుంచి వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు వస్తాయి.
* సిరీస్‌, అనాలజీ, క్లాసిఫికేషన్‌, కోడింగ్‌- డీకోడింగ్‌ ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
* క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల్లో అడ్రస్‌ మ్యాచింగ్‌, స్పేస్‌ మ్యాచింగ్‌ ప్రశ్నలు వస్తాయి.
* జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి పేపర్‌ కటింగ్స్‌, పజిల్స్‌ మిర్రర్‌ ఇమేజ్‌, వెన్‌ డయాగ్రమ్స్‌, ఎంబెడెడ్‌ ఫిగర్స్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* హై లెవల్‌ రీజనింగ్‌ అంశాలైన డెసిషన్‌ మేకింగ్‌, స్టేట్‌మెంట్స్‌ & అసంప్షన్స్‌, కన్‌క్లూజన్స్‌, జడ్జ్‌మెంట్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, సిలాజిజమ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే అధిక మార్కులు సాధించవచ్చు. 50 ప్రశ్నలకు 50 మార్కులు సాధించే అవకాశాలు ఈ విభాగంలో మెండుగా ఉంటాయి.
2. జనరల్‌ అవేర్‌నెస్‌
సమాజంలో జరుగుతున్న అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి అభ్యర్థికి సామాజిక స్థితిగతులపై, కరెంట్‌ అఫైర్స్‌పై ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి.
భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఇతర దేశాలతో సంబంధాలు, జాగ్రఫీ, ఆర్థిక స్థితి, పాలిటీ, భారతదేశ రాజ్యాంగం, సైన్స్‌& టెక్నాలజీ, రీసెర్చ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గడిచిన నాలుగు నెలలు, ఏప్రిల్‌, మే నెలల్లో జరగబోయే అంశాలపై దృష్టిసారిస్తే మంచిది. ఉపగ్రహ ప్రయోగాలు, వ్యాక్సిన్స్‌, వైరస్‌, నదులు, దేశాధినేతలు, రాజధానులు, కరెన్సీ, స్పోర్ట్స్‌, అవార్డులు, వార్తల్లోని ముఖ్యమైన మనుషులు, పుస్తకాలు- రచయితలు, యునెస్కో ప్రదేశాలు వంటివి బాగా చదువుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.
3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
సూక్ష్మీకరణ పద్ధతులు పాటించి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం నేర్చుకోవాలి. నంబర్‌ సిస్టమ్‌, డెసిమల్స్‌, ఫ్రాక్షన్స్‌, స్క్వేర్స్‌, స్క్వేర్‌ రూట్స్‌ మొదలైనవాటిపై పట్టు సాధించాలి. శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం-పని- దూరం అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
త్రికోణమితి, బీజగణితం, రేఖాగణితం, వైశాల్యం- ఘనపరిమాణం అంశాలను అవగాహన చేసుకుని వాటి ఫార్ములాలను ప్రతిరోజూ మననం చేసుకోవాలి.
4. ఇంగ్లిష్‌ & కాంప్రహెన్షన్‌
ఇంగ్లిష్‌ భాషపై అభ్యర్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. పేపర్‌-1లో 50 మార్కులతోపాటు పేపర్‌-2లో 200 మార్కులు కేవలం ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి వస్తాయి. కాబట్టి అభ్యర్థికి ఈ భాషపై అవగాహన ఉండాలి.
వ్యాకరణం, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, వెర్బ్స్‌, ఖాళీలను పూరించడం, వాక్యాలను సరిచేయడం, అరేంజ్‌మెంట్‌, యాంటనిమ్స్‌, సిననిమ్స్‌, ఇడియమ్స్‌, ఫ్రేజెస్‌, స్పెలింగ్స్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నపత్రంలోని ఇతర సెక్షన్లలోని ప్రశ్నలు ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆంగ్ల దినపత్రిక చదవడం, వార్తలు వినడం వ్యాకరణ పుస్తకాల్లోని ప్రశ్నలు సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షకు సంబంధించి మెటీరియల్‌, మాదిరి ప్రశ్నపత్రాలను www.eenadupratibha.net వెబ్‌సైట్లో పొందవచ్చు. సరైన ప్రణాళికతో, మంచి మెటీరియల్‌ సేకరించి సాధన చేస్తే ఈ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడవచ్చు.

posted on 14.4.2015