SSC CGL - Notification

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) ఎగ్జామ్ 2018 (చివ‌రి తేది: 04.06.2018)

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌)పరీక్ష 2018కు స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివ‌రాలు:
1. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌
2. అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌
3. అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌
4. అసిస్టెంట్‌
5. అసిస్టెంట్‌/ సూప‌రింటెండెంట్‌
6. ఇన్‌స్పెక్ట‌ర్ (సెంట్ర‌ల్ ఎక్సైజ్‌)
7. ఇన్‌స్పెక్ట‌ర్ (ప్రివెంటివ్ ఆఫీస‌ర్‌)
8. ఇన్‌స్పెక్ట‌ర్ (ఎగ్జామిన‌ర్‌)
9. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస‌ర్‌
10. స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్
11. ఇన్‌స్పెక్ట‌ర్ పోస్ట్స్‌
12. డివిజ‌న‌ల్ అకౌంట్స్‌
13. ఇన్‌స్పెక్ట‌ర్
14. స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్
15. జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్‌
16. ఆడిట‌ర్‌
17. అకౌంటెంట్‌
18. అకౌంటెంట్‌/ జూనియ‌ర్ అకౌంటెంట్‌
19. సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌/ యూడీసీ
20. టాక్స్ అసిస్టెంట్‌
21. అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌
అర్హ‌త‌:
* అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్ర‌టరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ మాస్ట‌ర్స్ ఇన్ బిజినెస్ ఎక‌నామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
* జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60% ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, 10+2లో మేథమేటిక్స్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* మిగిలిన అన్ని పోస్టులకూ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ.
తెలంగాణ: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. నాలుగో అంచె (టయర్‌-4) కొన్ని పోస్టులకు మాత్రమే. అభ్యర్థులందరూ మూడు అంచెల విధానాన్ని పాటించాల్సిందే.
ముఖ్య‌మైన తేదీలు:
* దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.06.2018.
* టయర్‌-1 కంప్యూటర్‌ రాతపరీక్ష: 25.07.2018 నుంచి 20.08.2018.
* టయర్‌-2 పరీక్ష: 27.11.2018 నుంచి 30.11.2018.

Posted on 04.05.2018

CGL Notification Info.

  • Notification
  • Website