Constables - News

సీఏపీఎఫ్ ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తులు ఆగ‌స్టు 17 నుంచి

సీఏపీఎఫ్ కానిస్టేబుల్ జీడీ, ఎన్ ఐ ఏ, ఎస్ ఎస్ ఎఫ్‌, రైఫిల్ మెన్ జీడీ అస్సాం రైఫిల్స్ లో 54953 పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ( ఎస్ ఎస్ సీ) ప్ర‌క‌ట‌న వెలువ‌డిన విష‌యం తెలిసిందే. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉన్న ఈ ఉద్యోగాల‌కు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తులు జులై 21 నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ఎక్కువ సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తుల కార‌ణంగా వెబ్ సైట్ పై ఒత్తిడి పెర‌గ‌డంతో రిజిస్ట్రేష‌న్లు సాధ్యం కావ‌డం లేదు. దీంతో అభ్య‌ర్థులకు ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఈ స‌మ‌స్య‌ను గుర్తించిన ఎస్ ఎస్ సీ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది. జులై 28 రాత్రి 8 గంట‌ల నుంచి వీటిని స్వీక‌రించ‌డం లేదు. ఇర‌వై రోజుల పాటు అంటే ఆగ‌స్టు 16 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం సాధ్య‌ప‌డ‌దు. ఈ వ్య‌వ‌ధిలో వెబ్ సైట్‌, స‌ర్వ‌ర్ల‌ను మెరుగుప‌ర్చుతామ‌ని ఎస్ ఎస్ సీ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. తిరిగి ఆగ‌స్టు 17 ఉద‌యం 10 నుంచి సెప్టెంబ‌రు 17 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. అయితే ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్న చేసుకున్న అభ్య‌ర్థులు మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌నిలేదు.

Posted on 04.08.2018

Constables Notification Info.

  • Notification
  • Online Application
  • Website‌