SSC Jr. Engineers - Notification

ఎస్ఎస్‌సీ - జూనియ‌ర్ ఇంజినీర్‌ ఎగ్జామ్‌, 2019

* ఎనిమిది విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో పరిశోధన సంస్థలు, రక్షణ రంగ విభాగాలు. వీటిలో ఇంజినీరింగ్‌ పనుల పర్యవేక్షణ, పథకాల అమలుకు సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏటా స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేస్తుంది. డిప్లొమా అర్హతతో ఈ కొలువులను సాధించుకోవచ్చు. మంచి జీతం, ఇతర అలవెన్స్‌లు, సౌకర్యాలు ఉంటాయి. రెండంచెల నియామక పరీక్షలు దాటితే సర్కారీ ఇంజినీరుగా స్థిరపడిపోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సాంకేతిక అర్హతలున్న నిరుద్యోగులకూ, చిరుద్యోగులకూ ఇదో బంగారు అవకాశం. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ లేదా డిప్లొమా చదివి, 18- 32 సంవత్సరాల మధ్య వయసుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకాల కోసం పేపర్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, పేపర్‌-2 రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైతే గ్రూప్‌ బి (నాన్‌-గెజిటెడ్‌)లో జూనియర్‌ ఇంజినీర్స్‌ పోస్టుల్లో మంచి వేతనంతో సెంట్రల్‌ కొలువు పొందవచ్చు.

జూనియర్‌ ఇంజినీర్‌గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సి.పి.డబ్ల్యు.డి., మిలిటరీ, ఇంజినీరింగ్‌ సర్వీసు, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ తదితర సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. వీరికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ. 35,400 - 1,12,400 స్కేలుతో దాదాపు రూ. 50- 55 వేల జీతం వస్తుంది. ఒక జూనియర్‌ ఇంజినీర్‌ అదే విభాగంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువ. డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా పదోన్నతి లభిస్తుంది.

డిప్లొమా అభ్యర్థులు అదనంగా శ్రమించాలి
* ముందుగా పరీక్ష విధానాన్నీ, సిలబస్‌నూ పూర్తిగా అవగతం చేసుకోవాలి. ఇది ప్రిపరేషన్‌లో మొదటి మెట్టు.
* సిలబస్‌ను ఒకటి రెండుసార్లు క్షుణ్నంగా పరిశీలిస్తే ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అర్థమౌతుంది.
* మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలు ఎంచుకోవడం ప్రధానం.
* ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్‌ ఆధారంగా ఉంటాయి. కానీ డిప్లొమాతోపాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీ పడతారు.అందుకని డిప్లొమా విద్యార్థులు కొంత ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.
* అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. రోజూ కనీసం 5 నుంచి 6 గంటల సమయం కేటాయించాలి.
* ప్రాథమికాంశాలపై అవగాహన తెచ్చుకొని, ఆపై గత సంవత్సరాల, ఆన్‌లైన్‌ మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. ప్రతి వారాంతం, నెలకొకసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి.
* పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్య అంశాలను చిన్న చిన్న పట్టికల రూపంలో సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. ఇవి రివిజన్‌కు ఉపయోగం.
* పునశ్చరణ ఎంతో ముఖ్యం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా రివిజన్‌ చేయాలి.
* ప్రిపరేషన్‌ అనంతరం ఎస్‌.ఎస్‌.సి. జేఈ మాక్‌టెస్ట్‌లు రాయడం చాలా కీలకం. ఇవి రాసిన తర్వాత చేసిన తప్పులను గుర్తించి సవరించుకోవాలి.
* వీలైనంత వరకు సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటూ, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించాలి. ఏ సమయంలోనూ ఒత్తిడికి గురికాకూడదు.

ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 12.09.2019
* ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేది: 14.09.2019
* అభ్యర్థులు http://ssc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు పూరించాలి. చేతిరాత ద్వారా, పోస్టులో దరఖాస్తులను స్వీకరించరు.
* పరీక్ష రుసుము రూ. 100. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి ఫీజు మినహాయింపు ఉంది.

ఏ పేపర్‌కు ఎలా సిద్ధం కావాలి?
పేపర్‌- I: ఈ పేపర్‌ 3 భాగాలుగా ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు. సమయం మాత్రం 120 నిమిషాలుంటుంది. అంటే సమయ పాలన అత్యంత కీలకం. ప్రణాళికాబద్ధంగా, కాన్సెప్టువల్‌గా సరైన సాధన అవసరం. ప్రశ్నలు డిప్లొమా స్థాయిలో ఉంటాయి. థియరీ బేస్డ్‌ ప్రశ్నలు ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ తగినంత సమయం కేటాయించాలి. ప్రశ్నలకు సరైన సమాధానాలను వేగంగా గుర్తించటం ముఖ్యం. జవాబులు త్వరగా గుర్తించాలంటే విస్తృతమైన సాధన అవసరం. పరీక్షా సమయంలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగిన ప్రశ్నలను మొదట ఎంచుకొని తక్కువ సమయంలో పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని, ఎక్కువ వ్యవధి పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్చు.
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: వెర్బల్, నాన్‌ వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డెసిషన్‌ మేకింగ్, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, అనాలజీస్‌ అంశాలు ముఖ్యం. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివినవారికి ఈ అంశాలు వారు చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో సాధన చేస్తే మార్కులు సాధించవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌: అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహననూ, సమాజంపై అవి చూపే ప్రభావాన్నీ పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై సాంకేతిక అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ రోజూ వార్తా పత్రికలు, ముఖ్యమైన వార్తా సంచికలు, ప్రామాణిక పాఠ్యపుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేస్తే జవాబులు గుర్తించడం సులువ.
జనరల్‌ ఇంజినీరింగ్‌: ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రశ్నలు అడుగుతారు.
సివిల్‌ ఇంజినీరింగ్‌: అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహనను పొంది తమ అభ్యాసనను మొదలుపెట్టడం మంచిది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే- బిల్డింగ్‌ మెటీరియల్స్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, సర్వేయింగ్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ఎంతో కీలకం.
మెకానికల్‌ ఇంజినీరింగ్‌: గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషీన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో అధిక ప్రశ్నలు వస్తున్నాయి.
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పాత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఎలక్ట్రికల్‌ మెషీన్స్, పవర్‌ సిస్టమ్స్, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయిదు జవాబులు రాస్తే చాలు
పేపర్‌ - II (కన్వెన్షనల్‌ టైప్‌): పేపర్‌-ఖి లో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులను పేపర్‌-II రాయటానికి అనుమతిస్తారు. పూర్వపు ప్రశ్నపత్రాలను బట్టి... ఇందులో మొత్తం ఆరు ప్రశ్నలు; ప్రతి ప్రశ్నకూ 60 మార్కులు. కానీ ప్రతి ప్రశ్ననూ 3-4 విభాగాలుగా విభజించారు. ప్రతి విభాగానికీ 10- 20 మార్కులు కేటాయించారు. మొత్తం ఆరు ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
సివిల్‌ ఇంజినీరింగ్‌లో గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్, సర్వేయింగ్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్, స్ట్రక్చరల్‌ అనాలిసిస్‌ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం గమనించవచ్చు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి వస్తే ప్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషీన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్, ఐసీ ఇంజిన్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ సబ్జెక్టులు ముఖ్యమైనవి. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ మెషీన్స్, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, పవర్‌ సిస్టమ్‌లు ప్రాధాన్యమున్న సబ్జెక్టులు.

పరీక్షా విధానం, నమూనా ప్రశ్నలు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌:
01. In the following question, select the related word from the given alternatives. Horse: Jockey: : Car : ?
(A) Chauffeur (B) Steering
(C) Mechanic (D) Brake
02. In the following question, select the related number from the given alternatives. 94 : 36 : : 47 : ?
(A) 32 (B) 28
(C) 11 (D) 21

జనరల్‌ అవేర్‌నెస్‌:
01. Indus river water treaty is a water distribution treaty between
(A) India and China (B) India and Myanmar
(C) India and Pakistan (D) India and Bangladesh
02. India’s first oil refinery is
(A) Vishakapatnam refinery (B) Digboi refinery
(C) Barauni refinery (D) Guwahati refinery

జనరల్‌ ఇంజినీరింగ్‌:
సివిల్‌ ఇంజినీరింగ్‌:
01. When timber is burnt in the wood fire over a depth of about 15 mm, the process of treatment is known as
(a) charring (b) rueping process
(c) bethel process (d) boucherie process
02. Calculate the volume (cubic meter) of earthwork for an embankment of length 30 m and width 4 m. The mean depth of the embankment is 4 m and side slope is 2 : 1. Using mid-sectional are method.
(a) 480 (b) 960 (c) 1440 (d) 1920
మెకానికల్‌ ఇంజినీరింగ్‌:
01. For reciprocating steam engine, when the crank is at the inner dead centre then the velocity of the piston will be
(A) Minimum (B) Zero
(C) Maximum (D) None of these
02. In a two dimensional flow in x-y plane, if (u and v are the velocity components in the x and y directions respectively) then the fluid element will undergo
(A) translation only
(B) translation and rotation
(C) translation and deformation
(D) rotation and deformation
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌:
01. A dc motor running at 2000 rpm has a hysteresis loss of 500 W and eddy current loss of 200 W. The flux is maintained constant but the speed is reduced to 1000 rpm. At the reduced speed the total iron-loss would be
(a) 500 W (b) 400 W (c) 300 W (d) 200 W
02. Kirchhoff’s current law is based on the law of
(a) conservation of energy (b) conservation of charge
(c) conservation of momentum (d) conservation of mass

మాదిరి ప్రశ్నలు:
సివిల్‌ ఇంజినీరింగ్‌:
01. (a) Describe plate load test as per IS 1888. Discuss the limitations. What are the effects of size of plate on bearing capacity and settlement? 20 M
(b) A classroom is of the size 8.5 m × 3.6 m. Design a simply supported roof slab for this room. The surperimposed load is 5 kN/m2. Use M 20 grade concrete and HYSD Fe 415 steel. Use limit state method for the design. 25 M

(c) Explain the steps for the design of column with helical reinforcement in limit state method. 15 M

మెకానికల్‌ ఇంజినీరింగ్‌:
01. (a) Define density, specific volume, weight density, specific gravity and Bulk Modulus. (15)
(b) A ship weighing 4000 tons and having an area of 465 m2 at water line submerging to a depth of 4.5 m in sea water with a density of 1024 kg/m3 moves to fresh water. Determine the depth of submergence in fresh water. Assume that the sides are vertical at the water line. (15)
(c) What is cavitation? How does it affect the performance of hydraulic machines? (15)
(d) The following details refer to centrifugal pump: Outer diameter : 30 cm, Eye diameter : 15 cm, Blade angle at inlet : 30°, Blade angle at outlet : 25°, Speed 1450 rpm. The flow velocity remains constant. The whirl at inlet is zero. Determine the work done per kg. If the manometric efficiency is 82%, determine the working head. If width at outlet is 2 m, determine the power ηo = 76%. (15)

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌:
01.a). A 3-phase balanced load which has a power factor of 0.707 is connected to a balanced supply. The power consumed by the load is 5kW. The power is measured by the two-wattmeter method. Find the readings of the two wattmeters. (10M)
b). A 3-phase, 50 Hz generator supplies power of 3 MW at 17.32 kV to a balanced 3-phase inductive load through an overhead line. The per phase line resistance and reactance are 0.25 Ω and 3.925 Ω respectively. If the voltage at the generator terminal is 17.87 kV, find the power factor of the load. (20M)
c). Two 1-phase 6600/2200V transformers have the following short circuited data:Transformer A (200 KVA) : 62V, 30.3A, 370W Transformer B (400KVA) : 66V, 60.6A, 650W
These transformers are put in parallel and connected to a load of 0.8 pf lag with primary voltage held fixed at 6600V. Find the maximum kw load that can be supplied by these transformers without causing the load voltage to fall below 2150V. (20M)
d). A Three-phase induction motor 6 pole, 50Hz drives a load running a constant torque at a speed of 950 rpm. If supply voltage drops to 90%. Find the percentage reduction in speed is (10M)

గత పరీక్షల కటాఫ్‌ మార్కులు, ఉద్యోగ బాధ్యతల వివరాల కోసం

Posted on 03.09.2019