Multi Tasking Staff

ఎస్సెస్సీలో 8300 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

-ప‌దో త‌ర‌గ‌తి చ‌దివిన‌వారికి అవ‌కాశం
-ఏపీలో 125, తెలంగాణ‌లో 127 ఖాళీలు
-ఏప్రిల్‌, మేలో ప‌రీక్షలు

స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) 8300 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హత ఉన్నవాళ్లు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్‌, మేలో ప‌రీక్షలు నిర్వహిస్తారు. ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్ ప‌రీక్షల ద్వారా

పేప‌ర్‌-1 (ఆబ్జెక్టివ్ ప‌రీక్ష): ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 150 మార్కులు. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్ 25, న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ 25, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 50, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. ప్రశ్నప‌త్రం ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

పేప‌ర్‌-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో భాగంగా ఏదైనా అంశంపై పొట్టి వ్యాసం, ఉత్తరం రాయాల్సి ఉంటుంది. న‌చ్చిన భాష‌లో రాసుకునే వెసులుబాటు ఉంది. ప‌రీక్ష వ్యవ‌ధి 30 నిమిషాలు. మొత్తం మార్కులు 50. ఇది కేవ‌లం అర్హత ప‌రీక్ష మాత్రమే. అభ్యర్థికి సంబంధిత భాష‌లో ప్రాథ‌మిక ప‌రిజ్ఞానం ఏ మేర‌కు ఉందో ప‌రిశీలిస్తారు. పేప‌ర్-1లో అర్హత సాధిస్తేనే పేప‌ర్‌-2 మూల్యాంక‌నం చేస్తారు.

ప్రాంతాల‌వారీ ఖాళీలిలా...
సెంట్రల్ రీజియ‌న్‌-325, ఈస్టర్న్ రీజియ‌న్‌-634, క‌ర్ణాట‌క రీజియ‌న్‌-666, నార్తర్న్ రీజియ‌న్‌- 3186, నార్త్‌-ఈస్ట్ రీజియ‌న్‌- 226, నార్త్‌-వెస్ట్ రీజియ‌న్‌- 534, మ‌ధ్యప్రదేశ్ రీజియ‌న్‌-536, సౌతర్న్ రీజియ‌న్‌-705, వెస్టర్న్ రీజియ‌న్ -1488.

పే స్కేల్‌: రూ.5200-20200 + గ్రేడ్ పే రూ.1800 (కొత్త పే స్కేల్ అమ‌ల్లోకి రాగానే వేత‌న శ్రేణి మారుతుంది)

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత ఉండాలి. (ఆగ‌స్టు 1, 2017 నాటికి ఉత్తీర్ణత సాధిస్తే స‌రిపోతుంది)

వ‌య‌సు: 01.08.2017 నాటికి 18-25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. అంటే ఆగ‌స్టు 2, 1992 కంటే ముందు; ఆగ‌స్టు 1, 1999 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం: 31.12.2016.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.01.2017.
రాత‌ప‌రీక్ష: 16.04.2017, 30.04.2017, 07.05.2017
ప‌రీక్ష ఫీజు: మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు. మిగిలిన‌వాళ్లు రూ.వంద చెల్లించాలి.
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, నిజామాబాద్‌.

posted on 31.12.2016