ఇంటర్‌తో స్టెనో ఉద్యోగాలు

ఇంటర్మీడియట్‌ విద్యార్హతలో తక్కువ వయసులోనే కేంద్రప్రభుత్వ కొలువు పొందే అవకాశం వచ్చింది. కేంద్రప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల్లోని దాదాపు 20 వేల గ్రూప్‌-సి, గ్రూప్‌-డి స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నియామక ప్రకటన విడుదల చేసింది!
ఈ పోస్టుల నియామకం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు రెండో దశలో స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌ టెస్ట్‌) నిర్వహిస్తారు. గ్రూప్‌-సి పోస్టుకు 20,000/-, గ్రూప్‌-డి పోస్టుకు 15,000/- నెల జీతాలతో పాటు కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఉండే వివిధ సౌకర్యాలు వర్తిస్తాయి.
* 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్‌/ దానికి సమానమైన కోర్సును పూర్తిచేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* 01-08-2016 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.

Read More