NEW APPS.
సెల్ఫీలు ఇక సూపర్‌
హాయ్‌.. బాయ్‌లన్నీ సెల్ఫీలతోనే. అందుకు డీపాల్ట్‌గా ఉండే యాప్‌లను వాడడం మామూలే. కొత్తగా ఏవైనా ప్రయత్నించారా? ‘ఫేస్‌యాప్‌’ని వాడి చూడండి. కృత్రిమ మేధస్సుని జోడించి రూపొందించారు. ఒక్కసారి సెల్ఫీ తీసుకున్నాక పలు రకాలుగా ‘ఏఐ’తో మార్పులు చేయవచ్చు. సాదా సీదాగా ఉన్న ముఖంలో చక్కని స్మైల్‌ వచ్చేలా చేయవచ్చు. వయసు పైబడినట్లుగా కనిపించే ఫేస్‌కి యవ్వనపు ఛాయల్ని అద్దొచ్చు. ఉరకలేసే వయసులో ఉన్నవారు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో చూసుకునే వీలుంది. ఇంకా చెప్పాలంటే... ‘జెండర్‌’నీ మార్చేసే వీలుంది. సరదాగా అబ్బాయిలు.. అమ్మాయిలుగా... అమ్మాయిలు అబ్బాయిలుగా మారితే ఎలా ఉంటారో చూసుకోవచ్చు. పలు రకాల ఫిల్టర్లను వాడి సెల్ఫీలను మరింత ఆకట్టుకునేలా మార్చేయవచ్చు. ‘జిఫ్‌’లను క్రియేట్‌ చేసుకునే వీలుంది. అన్ని మార్పులు చేశాక యాప్‌ నుంచే షేర్‌ చేయవచ్చు. గూగుల్‌ ప్లే, ఐట్యూన్స్‌ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మీకున్న ‘రిస్క్‌’ ఎంత?
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నవారెందరో! అలాంటి వారి గురించి విన్నప్పుడు మన గుండె ఎంత మేరకు ఆరోగ్యంగా పని చేస్తోంది? అనే సందేహం రాక మానదు. అందుకు ఆసుపత్రికే వెళ్లాల్సిన అవసరం లేదు. ‘సీవీ రిస్క్‌ అసిస్ట్‌ ఆప్‌’ స్మార్ట్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. ఇంగ్లిష్‌లోనే కాకుండా పలు ప్రాంతీయ భాషల్లోనూ ఆప్‌ని ఓపెన్‌ చేసుకునే వీలుంది. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక తెలుగులో ఓపెన్‌ చేసి వయసు, జెండర్‌, టోటల్‌ కొలస్ట్రాల్‌, హెచ్‌డీఎల్‌ కొలస్ట్రాల్‌, బీపీ, షుగర్‌, అలవాట్లను ఎంటర్‌ చేస్తే చాలు. విశ్లేషించి మీరున్న స్థితిని చెబుతుంది. ‘రిస్క్‌’ శాతం ఆధారంగా సంబంధిత డాక్టర్లను సంప్రదించొచ్చు. 8 ప్రాంతీయ భాషల్లో ఆప్‌ని వాడుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/2PhxiZ
కొత్త ‘ఆక్సిజన్‌’
వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ప్రత్యేకమైన ‘ఆక్సిజన్‌ ఓఎస్‌’ సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొస్తోంది. ఆండ్రాయిడ్‌ ఓరియో ఫీచర్లతో కూడిన ‘ఆక్సిజన్‌ ఎస్‌ 5.0.1 వెర్షన్‌ని వన్‌ప్లస్‌ 5 మోడళ్లలో అప్‌డేట్‌ రూపంలో అందిస్తోంది. కొత్త ఇంటర్ఫేస్‌లో లాంచర్‌, కెమెరా యూఐ, ఫొటో గ్యాలరీ, ఫేస్‌లాక్‌, పోట్రైట్‌ మోడ్‌లు కొత్తగా కనిపించనున్నాయి. పేర్లల్‌ ఆప్స్‌, క్విక్‌ సెట్టింగ్స్‌ డిజైన్‌, వై-ఫై ఆప్టిమైజేషన్‌... ఫీచర్లను యాక్సెస్‌ చేయవచ్చు.

తెర మీద వాచీ

పాత తరం మొబైల్‌ ఫోన్ల స్క్రీన్‌ లాక్‌ వేసినప్పుడు దాని మీద తెలుపు రంగులో మెరుస్తూ ఓ వాచ్‌ కనిపించేది. ఇప్పుడొస్తున్న కొన్ని ఫోన్లలో ఈ ఆప్షన్‌ ఉంది. అన్నింటికీ అలా వాచ్‌ కనిపించాలంటే Always On AMOLED ఆప్‌ మీ మొబైల్‌లో ఉండాల్సిందే. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక అవసరమైన అనుమతులు ఇస్తే ఇకపై మీ మొబైల్‌ లాక్‌ అవ్వగానే వాచ్‌ కనిపిస్తుంది. దీంతోపాటు మీకు మెసేజ్‌లు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా అందులో కనిపిస్తాయి.
* https:///goo.gl/U9rmpn

అన్నీ ఒకే దగ్గర

స్నేహితులతో ముచ్చట్ల కోసం ఛాటింగ్‌ ఆప్స్‌, సమాచార శోధన కోసం సెర్చ్‌ ఇంజిన్‌, సినిమా వీడియోల కోసం స్ట్రీమింగ్‌ ఆప్స్‌, హోటళ్ల వివరాల కోసం ఇంకో రకం ఆప్‌... ఇలా మీ మొబైల్‌లో చాలా ఆప్స్‌ ఉండుంటాయి. వీటన్నింటిని ఒకే ఆప్‌లో అందిస్తే సూపర్‌ కదా. ఆ ఆప్‌ పేరే Flochat. సాధారణ మెసెంజర్‌ ఆప్స్‌లా దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని యాక్టివేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మెసేజ్‌ ద్వారా మీ స్నేహితుల్ని దీంట్లోకి ఆహ్వానించొచ్చు. పైన హెడర్‌లో ఉండే కళ్ల జోడు బొమ్మను క్లిక్‌ చేస్తే... మీకు పెద్ద వసతుల గని కనిపిస్తుంది. సమాచార శోధన, ఆఫర్ల వివరాలు, క్యాబ్‌ బుకింగ్‌ లాంటి చాలా ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
* https://goo.gl/H5Zc49

గుండె గుట్టు చెబుతుంది

చదువుకునే రోజుల్లో చేతి పిడికిలి బిగించి గుండె ఇలా ఉంటుంది... ఇలా కొట్టుకుంటుంది అని చూపించేవారు. అంతకుమించి గుండె సంగతులు ఏవీ మనకు తెలిసేవి కావు. కానీ మీ మొబైల్‌లో bodyxq heart ఆప్‌ ఉంటే గుండె పని చేసే విధానాన్ని త్రీడీలో చూడొచ్చు. నడిచినప్పుడు ఏ భాగం ఎలా పని చేస్తుంది, ధమనులు, సిరలు ఎలా స్పందిస్తాయి లాంటి వివరాలూ తెలుస్తాయి. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులు వచ్చినప్పుడు దాని పనితనంలో ఎలాంటి మార్పులొస్తాయనే విషయమూ దీని ద్వారా తెలుసుకోవచ్చు.
* https://goo.gl/arglYy

మెరుగులు కొత్తగా

ఫొటోలకు బేసిక్‌ ఎడిటింగ్‌ చేసి, ఫిల్టర్లు అద్ది, ఎమోజీలు జోడించడం ఎప్పటినుంచో చేస్తున్నదే. కాస్త ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుంటున్నారా? అయితే Framy ఆప్‌ ఒకసారి వాడి చూడండి. లైవ్‌ ఇమేజెస్‌ దీని ప్రత్యేకత. దీని కెమెరాతో ఫొటోను క్లిక్‌ చేసి... నీటి ప్రవాహం, జలపాతం, జంతువులు లాంటి లైవ్‌ ఇమేజెస్‌ను జోడించొచ్చు. ఆ తర్వాత వాటిని అదే ఆప్‌లో షేర్‌ చేసుకోవచ్చు. లేదంటే డౌన్‌లోడ్‌ చేసుకొని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చు.
* https:///goo.gl/LU8VTS

కలిపేయ్‌... విడదీసేయ్‌

పాట నుంచి ఓ భాగాన్ని కత్తిరించాలంటే ఒక ఆప్‌... రెండు పాటల్ని కలపాలంటే ఇంకో ఆప్‌... వీడియోను ఆడియోగా కన్వర్ట్‌ చేయాలంటే మరొక ఆప్‌... ఇలా ఒక్కోదాని కోసం ఒక్కో ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేదాని కన్నా అన్నింటికీ ఒకే ఆప్‌ ఉంటే బాగుంటుంది కదా. Timbre: Cut, Join, Convert mp3 అలాంటిదే. ఈ ఆప్‌తో ఎంపీ3 పాటను జాయిన్‌, కట్‌, కన్వర్ట్‌, స్లి్పట్‌ చేసుకోవచ్చు. వీడియోలను కూడా ఇలా ఎడిట్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు వీడియోల నుంచి ఫ్రేమ్స్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చేసుకోవచ్చు. వీడియో ప్లే అయ్యే వేగాన్ని కావల్సినట్లు మార్చుకోవచ్చు.
* https:///goo.gl/gohJce

త్రికోణంతో ఆదా

స్మార్ట్‌ఫోన్లలో మొబైల్‌ డేటా వినియోగంపై ఓ కన్నేసే థర్డ్‌ పార్టీ ఆప్‌లు చాలా ఉన్నాయి. ఏ ఆప్‌ ఎంత డేటాను వాడుతోంది, దేన్ని నిలువరిస్తే డేటా వృథాను అడ్డుకోవచ్చు అంటూ కొన్ని సూచనలు కూడా ఇస్తుంటాయి. ఇలాంటి అంశాలతో గూగుల్‌ ట్రయాంగిల్‌ అనే కొత్త ఆప్‌ను రూపొందించింది. ఇటీవల ఈ ఆప్‌ను ఫిలిప్పీన్స్‌లో లాంచ్‌ చేసింది. దీన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీ మొబైల్‌ డేటా వినియోగాన్ని లెక్క కట్టి చూపిస్తుంది. మీ ఫోన్‌లోని ఏవైనా కొన్ని ఆప్స్‌ నెట్‌ యాక్సెస్‌ చేయక్కర్లేదు అని మీకనిపిస్తే దాన్ని ట్రయాంగిల్‌ ఆప్‌ ద్వారా చేయొచ్చు. త్వరలో మన దేశంలోనూ ఈ ఆప్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మొబైలే... కంప్యూటర్‌లా

స్మార్ట్‌ఫోన్‌ తెర, ఆప్‌ ఐకాన్లు లాంటివాటిలో మార్పులు తీసుకొచ్చే లాంచర్లు చాలా ఉన్నాయి. అయితే మొబైల్‌ను ఏకంగా కంప్యూటర్‌లా మార్చేవి మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో Leena Desktop UI ఒకటి. దీన్ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే స్క్రీన్‌ కంప్యూటర్‌ తరహాలో కనపిస్తుంది. మెనూ బార్‌ కనిపించే విధానం నుంచి, ఆప్‌ ఐకాన్‌లు వరకు అన్నీ మారిపోతాయి. ఒకేసారి స్క్రీన్‌ మీద ఒకటికిమించి ఆప్‌లు ఓపెన్‌ చేసుకోవచ్చు.
* https://goo.gl/BF3xyk

కదిపితే మోత మోగుతుంది

జనసందోహం ఎక్కువగా ఉన్నచోట జేబు దొంగలు చోర కళను ప్రదర్శిస్తుంటారు. ఎక్కువగా మొబైల్స్‌ దొంగిలిస్తుంటారు. జేబు నుంచి మొబైల్‌ తీశారో లేదో వెంటనే సైరన్‌ మోగితే... ఎలా ఉంటుంది? మీ మొబైల్‌లో Pocket Sense ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అదే జరుగుతుంది. ఈ ఆప్‌ ఇన్‌స్టాల్‌ అయి ఉన్న మొబైల్‌ను జేబు నుంచి తీసిన వెంటనే దాని నుంచి సైరన్‌ మోగుతుంది. అంతేకాదు చాలా సేపటి నుంచి కదపకుండా ఉన్న ఫోన్‌ను ఏ మాత్రం కదిపినా ఇదే సూచన వస్తుంది.
* https://goo.gl/ugZexK

సులువుగా... దారి!

మూడో ఫ్లోర్‌లోకి ఎంటర్‌ అవ్వగానే కుడివైపు నాలుగు అడుగులేయ్‌... ఆ తర్వాత ఎడమవైపు పది అడుగులేస్తే... అదే మీకు కావల్సిన డిపార్ట్‌మెంట్‌. చాలా ఆఫీసుల్లో అడ్రస్‌లు ఇలానే చెబుతుంటారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు అక్కర్లేదు. ఆఫీసులు, పెద్ద ఇల్లు, షాపింగ్‌ మాల్స్‌లో దారి చెప్పడానికి వీలుగా PathGuide పేరుతో మైక్రోసాఫ్ట్‌ ఓ ఆప్‌ను విడుదల చేసింది. ఈ ఆప్‌ తొలుత దారిని రికార్డు చేసుకుంటుంది. దీని కోసం నమోదు ప్రక్రియ ప్రారంభంలో మీరు నిల్చున్న స్థానంలో ఉన్న ల్యాండ్‌మార్క్‌ను ఫొటో తియ్యాలి. మళ్లీ లక్ష్యానికి చేరగానే మరో ఫొటో తియ్యాలి. మధ్యలో మీరు వేసిన అడుగుల సంఖ్య, తిరిగిన మలుపుల్ని ఆప్‌ రికార్డు చేసుకుంటుంది. ఆ వివరాల్ని సామాజిక అనుసంధాన వేదికల్లో షేర్‌ చేసుకోవచ్చు.
* https:///goo.gl/oTXSmL

క్లిక్‌ చేయ్‌... సెర్చ్‌ చేయ్‌

ప్రయాణంలో ఏదో పుస్తకం చదువుతున్నారు... అందులోని సమాచారంలో ఏదో సందేహం వచ్చింది... వెంటనే మొబైల్‌లో గూగుల్‌ ఆన్‌ చేసి దాని కోసం సెర్చ్‌ చేస్తారు. సమాచారం శోధన వరకు సరే కానీ... దాని కోసం పుస్తకం పట్టుకొని కీబోర్డు మీద టైప్‌ చేయాలంటే ఇబ్బంది. అలాకాకుండా ఆ సందేహం లేదా ప్రశ్నను ఫొటో తీస్తే సమాధానం వచ్చేలా ఉంటే బాగుంటుంది కదా. Socratic- Homework answers ఆప్‌తో ఈ పని చేయొచ్చు. దీంట్లోని కెమెరా ఐకాన్‌తో ఆ ప్రశ్నను ఫొటో తీస్తే... అది అంతర్జాలంలో దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తుంది.
* https://goo.gl/wMECpm

స్మార్ట్‌ఫోన్‌ వైద్యుడు

మనకు అనారోగ్యం చేసి వైద్యుని దగ్గరికెళ్తే ఆయన రకరకాల టెస్టులు రాస్తారు. ఆ ఫలితాలు చూసి వైద్యం చేస్తారు. అలానే మొబైల్‌ స్థితి తెలుసుకోవడానికి వైద్యుడు ఉంటే బాగుంటుంది కదా. ఈ పని చేయడానికి Phone Doctor Plus అనే ఆప్‌ ఉంది. దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓపెన్‌ చేస్తే మీ మొబైల్‌ను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లినట్లే. బ్యాటరీ, స్టోరేజీ, సీపీయూ, మెమొరీ, నెట్‌వర్క్‌ ఎలా ఉన్నాయనేది ఆప్‌ హోమ్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. టెస్ట్‌ ట్యాబ్‌లోకి వెళ్తే మల్టీ టచ్‌, టచ్‌ స్క్రీన్‌, డిస్‌ప్లే, ఇయర్‌ ఫోన్స్‌, వాల్యూమ్‌ కంట్రోల్‌, గైరో స్కోప్‌, లైట్‌ సెన్సార్‌, స్టెప్‌ కౌంటర్‌ లాంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని క్లిక్‌ చేస్తే అవి సరిగా పని చేస్తున్నాయో లేదో అని టెస్ట్‌ చేస్తుంది. దీంతోపాటు మీ మొబైల్‌లో ఆన్‌లో ఉన్న ఆప్షన్లను ఆఫ్‌ చేస్తే ఎంత బ్యాటరీ మిగులుతుందనేదీ తెలుస్తుంది. దాని బట్టి మొబైల్‌ను జాగ్రత్తగా వాడుకోవచ్చు.
* https:///goo.gl/ibG4fG

స్వైప్‌ చేస్తే చాలు

ఎక్కువగా వాడే ఆప్స్‌, షార్ట్‌కట్‌లను మొబైల్‌ హోమ్‌ స్క్రీన్‌ మీద పెట్టుకుంటుంటాం. ఆ ఐకాన్లు నోటిఫికేషన్‌ బార్‌లోనే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎంచక్కా మొబైల్‌ స్క్రీన్‌ మీద పై నుంచి కిందకు స్వైప్‌ చేస్తే మీరు ఎంచుకున్న ఆప్స్‌ కనిపిస్తాయి. ఈ ఆప్షన్‌ మీకు కావాలంటే Snap Swipe Drawer ఆప్‌ మీ మొబైల్‌లో ఉండాల్సిందే. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక అవసరమైన ఆప్స్‌, షార్ట్‌కట్స్‌ ఎంచుకునే ఆప్షన్‌ వస్తుంది. అలా మీరు సెలెక్ట్‌ చేసుకునేవి మొబైల్‌ నోటిఫికేషన్‌ బార్‌లో కనిపిస్తాయి.
* https:///goo.gl/5b1HlX

పట్టు జారిందా... పండు గోవిందా

మిక్సీ జార్‌లో రకరకాల ఫలాలు వేసి జ్యూస్‌ సిద్ధం చేస్తుంటే... మనమేమో రుచికరమైన పళ్ల రసం వస్తుందని ఆనందంగా ఉంటాం. అదే సమయంలో ఆ ఫలాలు ఏం అనుకుంటాయి... ఎంత బాధపడతాయి. మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటాయి కదా. అలా పళ్లను రక్షించే ఆట ఒకటి ఉంది. దాని పేరు Don't Grind. ఈ ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే తర్వాత ముళ్ల చక్రాల మధ్య ఇరుక్కొని నలిగిపోవడానికి ఓ పండు సిద్ధంగా ఉంటుంది. అది పళ్ల చక్రంపై పడి నలిగిపోయే ముందు మొబైల్‌ స్క్రీన్‌ మీద వేళ్లతో టచ్‌ చేస్తే అది గాల్లో ఎగురుతుంది. అలా వరుసగా వచ్చే ముళ్ల చక్రాలను చాకచక్యంగా దాటుకుంటా వెళ్లాలి. దీనికి మీరు సిద్ధమైతే https:///goo.gl/xKjfkA ఈ లింక్‌లో గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ ఆట పళ్లతోనే కాకుండా కూరగాయలు, డబ్బాలు లాంటి ఇతర వస్తువులతోనూ ఆడుకోవచ్చు.

యూట్యూబ్‌తో కలసి

సిస్టమ్‌లో అయితే ఒక బ్రౌజర్‌ ట్యాబ్‌లో యూట్యూబ్‌ చూస్తూ... వేరే ట్యాబ్‌లో మనకు కావల్సిన పని చేసుకోవచ్చు. అదే మొబైల్‌ దగ్గరకు వచ్చేసరికి యూట్యూబ్‌ చూస్తుంటే వేరే ఇంకేం పని చేయలేం. ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్‌లో పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌తో ఒకేసారి రెండు ఆప్‌లు వాడుకోవచ్చు. పాత తరం ఓఎస్‌ వాడుతున్నా మీకు అలాంటి ఫీచర్‌ కావాలనుకుంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో float tube video player ఆప్‌ ఉండాల్సిందే. దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని, అందులో వీడియోలు వీక్షించొచ్చు. ఈ ఆప్‌ను ఓపెన్‌ చేసినప్పుడు వీడియో విండో పాప్‌అప్‌లా ఓపెన్‌ అవుతుంది. దాన్ని స్క్రీన్‌పై ఎక్కడకి కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు. దీంతో యూట్యూబ్‌ చూస్తూనే మిగతా పనులూ చేసుకోవచ్చు.
* https:///goo.gl/zqdBv6

ఒకే ఆప్‌... వంద ఆటలు

నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు... అనేది బాషా డైలాగ్‌. అలా ‘నేను ఒక్క ఆప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే వంద గేమ్‌లు డౌన్‌లోడ్‌ చేసినట్లు’ అని మీరు అనొచ్చు. దానికి చేయాల్సిందల్లా 100 in 1 free games ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. ఇందులో వంద రకాల ఆటలున్నాయి. తొలుత పది ఆటలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని ఆడుతుంటే గోల్డ్‌ కాయిన్స్‌ వస్తాయి. వాటితో కొత్త గేమ్‌ను అన్‌లాక్‌ చేయొచ్చు.
* https:///goo.gl/ZyeZvG

మీ ఫొటో... మీ స్టిక్కర్‌

ఎవరో రూపొందించిన స్టిక్కర్‌ మనమెందుకు వాడటం, ఇంకెవరో క్రియేట్‌ చేసి జిఫ్‌ను మనం ఎఫ్‌బీలో పోస్ట్‌ చేయడం ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీకు మీరే జిఫ్‌, స్టిక్కర్‌, ఎమోజీలను తయారు చేసుకోండి. అదీ మీ ఫొటోలతోనే. Bobble keyboard ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా ఈ పని చేయొచ్చు. ఈ ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోగానే మీ ఫొటో తీసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని ఆర్ట్‌గా మార్చి మీకు వివిధ ఆకారాల్లో చూపిస్తుంది. అందులో మీకు నచ్చినదాన్ని ఎంచుకొని స్టిక్కర్‌, జిఫ్‌, ఎమోజీలు తయారు చేసుకోవచ్చు. వాటిని సామాజిక అనుసంధాన వేదికల్లో వాడుకోవచ్చు.
* https://goo.gl/qDYwI9

ముఖం మార్చేయండి

ఒకరి మొండం, మరొకరి తల... ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫొటోలు ఎక్కువవుతున్నాయి. సరదాగా ఉండే ఇలాంటి ఫొటోలు రూపొందించడానికి గూగుల్‌ ప్లేస్టోర్‌లో కొన్ని ఆప్స్‌ ఉన్నాయి. ఫొటో స్వాపింగ్‌లో నాణ్యత పెంచుతూ Face Swap అనే ఆప్‌ను రూపొందించింది మైక్రోసాఫ్ట్‌. ఈ ఆప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని సెల్ఫీ తీసుకోండి. ఆ తర్వాత ఆ ఫొటో ఓ ముఖం ఆకారంలో పొందికగా అమరుతుంది. ఇప్పుడు మీ ఫొటోకు కావల్సిన బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోండి. ఇప్పుడు మీ ముఖం ఆ ఫొటోలో చక్కగా అమరి ఫేస్‌ స్వాప్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ఆప్‌ ద్వారా అలా మార్చిన ఫొటోలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది.
* https:///goo.gl/lvo7Nk

కాంతిని గమ్యం చేరుస్తారా?

సూర్యుడి కిరణాలను రకరకాల దర్పణాలపై ప్రసరింపజేసి అవి పయనించే దారిని మారుస్తూ ఆడే ఆట గుర్తుందా? అచ్చంగా అలాంటి ఆటను స్మార్ట్‌ఫోన్‌లోనూ ఆడుకోవచ్చు. అదే Mirror Reflect. ఈ ఆట ఇన్‌స్టాల్‌ చేసి ఓపెన్‌ చేయగానే ఒక మూల నుంచి కాంతి కిరణం ప్రసరిస్తూ ఉంటుంది. దాన్ని గమ్యస్థానానికి చేర్చడానికి కొన్ని దర్పణాలు మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని నేర్పుగా సరైన స్థానాల్లో నిలిపితే కాంతి వాటిపై ప్రసరించి పరావర్తనం చెంది అలా అలా గమ్యస్థానానికి చేరుతుంది. ఈ క్రమంలో కొన్ని కదపడానికి వీల్లేని దర్పణాలూ ఉంటాయి. వాటిని వాడుకుంటూ ఆటను పూర్తి చేయాలి.
* https:///goo.gl/dCOC8X

కళ్లకు ఇబ్బంది లేకుండా

నిద్రలేమికి, కళ్ల సమస్యలకు స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్‌ ఒక కారణమని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. దీన్ని తగ్గించడానికి Twillightఆప్‌ ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే స్క్రీన్‌ గులాబి రంగులోకి మారుతుంది. దీని వల్ల కళ్ల మీద ఒత్తిడి తగ్గిపోతుంది. రాత్రివేళల్లో మొబైల్‌లో చదువుకునేవారికి స్క్రీన్‌ తక్కువ వెలుతురుతో బాగుంటుంది. స్క్రీన్‌ లైటింగ్‌ ఎప్పుడు, ఎలా మారాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. మీరున్న ప్రాంతాన్ని జీపీఎస్‌ ఆధారంగా పసిగట్టి దానికి తగ్గట్టుగా ఆప్‌ నడుచుకుంటుంది.
* https:///goo.gl/PttKxj

మొబైల్‌లో బైనాక్యులర్‌

దూరంగా ఉన్న వస్తువు లేదా మనుషుల్ని చూడాలంటే బైనాక్యులర్‌ వాడుతుంటాం. ఇప్పుడు అన్నీ స్మార్ట్‌ఫోన్లలోకి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు బైనాక్యులర్‌ ఎందుకు రాకూడదు? Binoculars Macro Shooting 30X ఆప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే బైనాక్యులర్‌ను వాడుకోవచ్చు. దీంతో 30 ఎక్స్‌ వరకు జూమ్‌ చేసుకోవచ్చు. అంటే సుమారు అర కిలోమీటరు దూరంలో ఉన్న వస్తువును కూడా దగ్గర నుంచి చూడొచ్చు. దాన్ని ఫొటో తీసుకోవచ్చు కూడా. లైటింగ్‌లో హెచ్చుతగ్గులు, ఫోకస్‌, ఫ్లాష్‌ లాంటి సదుపాయాలూ ఉన్నాయి. ఈ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మీరూ ఓ సారి ట్రై చేయండి!
* https:///goo.gl/nQdeIf

మీటలతో లెక్కల ఆట

3X9 అంటే ఎంత? అంటే ఠక్కున 27 అని చెప్పేస్తారు. ఇలాంటి ఓ పది ప్రశ్నలు అడిగినా చెప్పేస్తారు. అదే పది సెకన్లలోపు సమాధానాలు చెప్పమంటే తడబడతారు కదా. అలా తడబాటుకు గురవ్వకుండా లెక్కలు పూర్తి చేయగలరా! అయితే Math Tricks Workout ఆప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇందులో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు లాంటి కొన్ని విభాగాలున్నాయి. ఒక్కోదాంట్లో మూడు, నాలుగు పార్టులున్నాయి. అందులో వివిధ రకాల లెక్కలున్నాయి. వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి.
* https:///goo.gl/u6UgrG

జవాబులు... డబ్బులు

గూగుల్‌ చకచకా ప్రశ్నలు అడుగుతుంటే... మీ ఠకీ ఠకీమని జవాబులు చెప్పాలి... అప్పుడు గూగుల్‌ మీకు డబ్బులు ఇస్తుంది. ఇదేదో బాగుందే అంటారా? అయితే ఇంకెందుకు ఆలస్యం Google Opinion Reward ఆప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆప్‌ అడిగే ప్రాథమిక సమాచారం అందించి లాగిన్‌ అవ్వండి. ఆ తర్వాత ఆప్‌ వరుస ప్రశ్నలు అడుగుతుంది. వాటికి ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆప్షన్లు ఉంటాయి. వాటిలోంచి సరైన సమాధానం ఎంచుకోవాలి. తొలి సర్వేకు గూగుల్‌ డబ్బులేమీ చెల్లించదు. రెండో సర్వే నుంచి ఒక్కోదానికి రూ.32.50 చెల్లిస్తుంది.

మాటలు... కొనుగోళ్లు

ఏదైనా వస్తువు కొనేముందు... దాని గురించి అడిగి తెలుసుకుంటుంటాం. ఇది నేరుగా దుకాణానికి వెళ్లినప్పుడే వీలవుతుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఆప్‌ షాపింగ్‌లో ఇది కుదరదు. అయితే Goodbox ఆప్‌ మీ మొబైల్‌లో ఉంటే ఇది కుదురుతుంది. మీ పరిసర ప్రాంతాల్లోని రెస్టరెంట్లు, మెడికల్‌ షాపులు, గ్రాసరీ స్టోర్లు, లాండ్రీ తదితర వివరాలు ఇందులో ఉంటాయి. ఉదాహరణకు రెస్టరెంట్ల విభాగంలోకి వెళ్తే... మీకు దగ్గరలోని రెస్టరెంట్ల పేర్లు, వాటిలో దొరికే ఆహార పదార్థాల వివరాలూ కనిపిస్తాయి. ఆ తర్వాత రెస్టరెంట్‌ ప్రతినిధితో ఛాటింగ్‌ చేసి వివరాలు తెలుసుకొని అందులోనే కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ ఆప్‌ హైదరాబాద్‌, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. త్వరలో అందరూ వినియోగించొచ్చు.
* https:///goo.gl/x5nS2P

‘వర్చువల్‌’లో ముచ్చట్లు

వీడియో కాల్స్‌ వచ్చాక దూరాలు బాగా దగ్గరైపోయాయి. అయినా పక్కపక్కన నిలుచొని మాట్లాడుతున్నట్లు లేదే అని ఎక్కడో చిన్న వెలితి. ఒకోలస్‌ రిఫ్ట్‌తో కలసి ఫేస్‌బుక్‌ తీసుకొచ్చిన స్పేసెస్‌ ఆప్‌తో ఆ వెలితి తీరుతోంది. వర్చువల్‌ రియాలిటీ సాంకేతికతతో పని చేసే ఈ ఆప్‌ ద్వారా స్నేహితులతో టచ్‌లో ఉండొచ్చు. ఒకోలస్‌ కార్డ్‌బోర్డును పెట్టుకొని ఈ ఆప్‌ ద్వారా మీ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ కాల్స్‌ చేస్తే వాళ్ల వర్చువల్‌ అవతార్‌ మీ కళ్ల ముందు కనిపిస్తుంది. దాని పక్కనే ముందుగా మీరు తయారు చేసుకున్న మీ అవతార్‌ వస్తుంది. మీరు మీ స్నేహితుడితో మాట్లాడుతున్న మాటలన్నీ మీ అవతార్‌ మీ స్నేహితుడి అవతార్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అలా ఈ ఆప్‌ ద్వారా గ్రూప్‌ కాల్స్‌ కూడా మాట్లాడుకోవచ్చు.

ముఖ్యమైనవన్నీ ఒకే దగ్గర

తరచూ కాల్‌ చేసే నంబర్లు, మెసేజ్‌ చేసే కాంటాక్ట్‌లు, ఎక్కువగా వాడే ఆప్స్‌ ఒకే దగ్గర గుత్తగా ఉంటే బాగుంటుంది కదా. అవసరమైనప్పుడు వెతుక్కునే అవసరం ఉండదు. EazLi – Quick access to apps ఆప్‌ మీ మొబైల్‌లో ఉంటే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక కావల్సిన ఆప్స్‌, నెంబర్లను ఎంచుకునే బాక్స్‌ వస్తుంది. అందులో మీకు కావల్సినవి ఎంచుకోండి. ఆ ఆప్‌ మీ స్క్రీన్‌ మీద టచ్‌’ బటన్‌గా కావాలన్నా పెట్టుకోవచ్చు. అంటే ఓ ఐకాన్‌ స్క్రీన్‌ మీద ఓ పక్కకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఆప్‌ను ఓపెన్‌ చేసినట్లే. * https://goo.gl/Vlnl2s

విని తర్జుమా చేస్తుంది

ఒక భాషలోని పదాలను మరో భాషలోకి అనువాదం చేయడానికి చాలా ఆప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పదాలను విని తర్జుమా చేసేవి మాత్రం తక్కువగా ఉంటాయి. అలాంటి ఆప్స్‌లో ఒకటి Voice Translator. 32 భాషలను ఈ ఆప్‌ యాక్సెస్‌ చేస్తుంది. మాట్లాడే భాష, ట్రాన్స్‌లేట్‌ అవ్వాల్సిన భాషను ఎంచుకొని, దిగువనున్న మైక్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ఆ పదం/వాక్యం మీకు కావల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్‌ అయ్యి కనిపిస్తుంది. దాన్ని అక్కడి నుంచే షేర్‌ చేసుకోవచ్చు.
* https://goo.gl/xS56vY

పూర్తి వివరాలు కావాలా?

మీ ఫోన్‌ మెమొరీ ఎంత? బ్యాటరీ పరిమాణం ఎంత? దాని వోల్టేజీ ఎంత? ఏ హార్డ్‌వేర్‌తో పని చేస్తోంది?
- ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంత సులభమేమీ కాదు. ఇలాంటి వివరాలను పద్ధతి ప్రకారం అందించే ఆప్‌లు కొన్ని ఉన్నాయి. వాటిలో MyDevice ఒకటి. స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్‌లో ‘అబౌట్‌ ఫోన్‌’ ట్యాబ్‌లో కొన్ని వివరాలుంటాయి. అయితే ఈ ఆప్‌ ద్వారా ఆ అంశాలకు సంబంధించిన లోతైన విశ్లేషణ పొందొచ్చు. ఇందులో ఓఎస్‌, సీపీయూ, బ్యాటరీ, మెమొరీ, ఫీచర్స్‌, సెన్సార్లు అంటూ కొన్ని ట్యాబ్‌లుంటాయి. సెన్సార్‌ విభాగంలోకి వెళ్తే మీ ఫోన్‌లో ఉండే సెన్సార్ల పేర్లు, వాటి వివరాలు కనిపిస్తాయి.
* https:///goo.gl/ZQj2hB

కొత్త వాల్‌పేపర్లు

మొబైల్‌ తాకే తెర మీద రెండుసార్లు టచ్‌ చేస్తే ఫుల్‌ స్క్రీన్‌.. పక్కకు జరిపితే కొత్త వాల్‌ పేపరు. ఒకసారి టచ్‌ చేస్తే ఆ వాల్‌పేపరు ఫొటోకు సంబంధించిన సంక్షిప్త సమాచారం... ఇలాంటి ఆప్షన్లు మీకూ కావాలా? అయితే Pixtory ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతాలు, చారిత్రక కట్టడాలకు సంబంధించిన ఫొటోలుంటాయి. వాటిని మొబైల్‌ వాల్‌పేపర్లుగా సెట్‌ చేసుకోవచ్చు. వాల్‌పేపరు మీద డబుల్‌ ట్యాప్‌ చేసి బొమ్మలు మార్చుకోవచ్చు. ఆ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం వాల్‌పేపరు మీద సింగిల్‌ టచ్‌ చేస్తే చాలు. మీ మొబైల్‌లో ఉన్న ఫొటోలను కూడా ఈ ఆప్‌ ద్వారా వాల్‌పేపరుగా పెట్టుకోవచ్చు.
* https://goo.gl/8KUjuc

క్లిక్‌ చేయ్‌.. లెక్కేసేయ్‌

మొబైల్‌లో వచ్చాక సాధారణ క్యాలెక్యూటలేర్‌ వాడకం తగ్గిపోయింది. మొబైల్‌లోని క్యాలెక్యూలేటర్‌తో ఆప్‌తోనే ఇప్పుడు లెక్కలేసేస్తున్నాం.అలాంటి ఆప్‌లో ఓ ప్రత్యేకతతో వస్తోంది Photo math. ఇందులో లెక్కలేయాలంటే నంబర్లు టైప్‌ చేయాల్సిన పని లేదు. ఆ లెక్క రాసిఉన్న పేపరును ఫొటో తీస్తే సరి. ఆటోమేటిక్‌గా ఆ లెక్క పూర్తయి సమాధానం వచ్చేస్తుంది. గతంలో ఈ ఆప్‌ వాడి లెక్కించిన వాటి వివరాలు హిస్టరీ ట్యాబ్‌లో పొందొచ్చు. దీంట్లోనే సాధారణ క్యాలెక్యూలేటర్‌ కూడా ఉందనుకోండి.
* https://goo.gl/NpfzdL

పాలలో బిస్కెట్లు

గాల్లో ఎగురుతున్న రకరకాల పళ్లను కత్తితో ముక్కలు ముక్కలు చేసే ఆట గుర్తుందా? చాలా కాలం క్రితం వచ్చిన ఆట ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి ఆటను బిస్కెట్లతో ఆడాలని ఉందా? అయితే Oreo: Twist, Lick, Dunk ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. మొబైల్‌ తెరపై గాల్లో ఎగురుతున్న బిస్కెట్లను చేతితో విరగొట్టి పక్కనే ఉన్న పాల గ్లాసులో వేయాలి. నిర్ణీత సమయంలో ఆ బిస్కెట్లను తాకకపోతే అవి కిందకు పడిపోతాయి. అలా ఎన్ని ఎక్కువ బిస్కెట్లు గ్లాసులో వేస్తే అన్ని ఎక్కువ గోల్డ్‌ కాయిన్లు మీ ఖాతాలో పడతాయి. ఈ ఆట ఆడటానికి కిచెన్‌, ఫ్రాన్స్‌, చైనా, కుకీ వరల్డ్‌ అంటూ కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆట ప్రారంభించగానే కిచెన్‌ స్టేజీ ఓపెన్‌ అవుతుంది. మిగలిన స్టేజీలను మీరు సంపాదించిన గోల్డ్‌ కాయిన్లతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
* https://goo.gl/lDNXNA

కార్టూన్‌ వీడియో చేస్తారా?

ఎస్టెల్‌, ట్రాయ్‌, ట్విస్టీ, జాగ్స్‌, అలెక్స్‌.... ఈ పేర్లు ఎక్కడో విన్నట్లు ఉంది కదా? ఇవన్నీ ప్రముఖ కార్టూన్‌ సినిమాలు, సిరీస్‌ల క్యారక్టర్ల పేర్లు. ఇవి ప్రధాన పాత్రలుగా రూపొందిన కార్టూన్‌లు చూసుంటారు. మరి వాళ్లతో ఓ కార్టూన్‌ వీడియో రూపొందించే అవకాశం మీకు దక్కితే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా. అయితే Toontastic 3d ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. దీని ద్వారా మూడు, ఐదు భాగాలతో కార్టూన్‌ వీడియోలను రూపొందించొచ్చు. దీని కోసం 30కిపైగా కార్టూన్‌ పాత్రలు సిద్ధంగా ఉంటాయి. వీడియో రూపొందించడానికి అనువైన ప్రాంతాలు, నేపథ్య సంగీతం, పాత్రల బొమ్మలు ఈ ఆప్‌లో ఉంటాయి. ఆయా పాత్రల బొమ్మలను ఎంచుకొని మీకు కావల్సినట్లు నడిపిస్తూ, వాయిస్‌ ఓవర్‌ చెప్పాలి. ఆ తర్వాత ఎక్స్‌పోర్ట్‌ చేసి వీడియోను పొందొచ్చు. ఆ తర్వాత దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసుకొని వీక్షించవచ్చు. https://goo.gl/U93UAv

ఇది ఆట కాదు

ఈ ఆప్‌ ఎందుకు డౌన్‌లోడ్‌ చేశావ్‌!... అసలు డౌన్‌లోడ్‌ చేయమని ఎవరు చెప్పారు? ఆప్‌ ఓపెన్‌ చేస్తే చేశావ్‌ కానీ ప్లే నౌ బటన్‌ క్లిక్‌ చేయకు... ప్లే చేసినా ఆట ఆడకు? ఇవి మేం అంటున్న మాటలు కావు. There Is No Game గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసి ఆడటానికి ప్రయత్నిస్తే తొలుత వచ్చే మాటలు ఇవి. పేరుకు తగ్గట్టే ఆటంతా అలానే ఉంటుంది. కానీ ఆడుతుంటే మాత్రం భలే మజా వస్తుంది. ఇంకా చెప్పాలంటే మామూలుగా ఏదైనా గేమ్‌ను ఓపెన్‌ చేయగానే లోడింగ్‌ అని వస్తుంది. కానీ ఈ ఆప్‌ ఓపెన్‌ చేస్తే నాట్‌ లోడింగ్‌ అని వస్తుంది. ఇక ఆటలోకి వస్తే... ఆప్‌ ఓపెన్‌ చేయగానే There Is No Game అని కనిపిస్తుంది. ఇందులో ‘O’ అక్షరాన్ని టచ్‌ చేస్తే అది ఆ వరుస నుంచి కిందకు పడిపోయి ఆట మొదలవుతుంది. అక్కడి నుంచి ఆప్‌ చెప్పిన మాటలకు పూర్తి వ్యతిరేకంగా చేస్తే మీరు ఆడగలుగుతారు. అలా ఆడుతూ వెళ్తే కొన్ని క్లూస్‌ వస్తాయి. వాటి సాయంతో ఓ మేకను చెర నుంచి విడిపించాలి. ఇలా వద్దనే పని చేస్తూ వినోదం పొందాలంటే ఈ లింక్‌లో (https://goo.gl/M9QhMp) గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడేయండి.

వర్ణ అంధత్వ నివారణకు...

రంగుల్ని గుర్తించడానికి ఇబ్బంది పడేవాళ్ల కోసం శాంసంగ్‌ ఓ ఆప్‌ను రూపొందించింది. మనుషుల్లో ఉన్న వర్ణ అంధత్వం (కలర్‌ బ్లైండ్‌) తీవ్రతను తెలిపేలా ఈ ఆప్‌ ఉంటుంది. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే వివిధ రంగులను మేళవిస్తూ ఓ స్ట్రిప్‌ కనిపిస్తుంది. ఆ వ్యక్తి అందులోని రంగులను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలు వస్తాయి. వాటి ద్వారా వర్ణ అంధత్వ తీవ్రత తెలుస్తుంది. ఈ ఫలితాల ఆధారంగా ఆ వ్యక్తికి చెందిన శాంసంగ్‌ టీవీలో కనిపించే రంగుల్లో మార్పులు చేస్తారు. ఇప్పటికే విడుదలైన శాంసంగ్‌ ఎస్‌యుహెచ్‌డీ టీవీలో ఈ తరహా సాంకేతికతను పొందుపరిచారు. ప్రస్తుతానికి రొమేనియా, హంగేరీ, బల్గేరియా దేశాల్లోనే ఈ ఆప్‌ విడుదలైంది.

దీని కథ ఏంటంటే?

విచిత్రమైన ప్రదేశాల ఫొటోలు, ప్రశాంతంగా కనిపించే ప్రదేశాల ఫొటోలను మొబైల్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకుంటున్నారా? అయితే ఆ ఫొటో వెనుక కథేంటో మీకు తెలుసా? ఆ కట్టడాలను ఎవరు నిర్మించారో, ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఈ వివరాలు తెలియడం అంత సులభం కాదు. కానీ neArt ఆప్‌తో ఈ పని సాధ్యమవుతుంది. ఈ ఆప్‌లో కొన్ని వందల ఫొటోలున్నాయి. వాటిని మొబైల్‌ వాల్‌పేపరుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు... ఆ ఫొటో వెనుకున్న చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు. దానికి అనుబంధంగా ఉన్న వీడియోలు, వెబ్‌సైట్‌ వివరాలనూ పొందొచ్చు. ఆ ఫొటోలో ఉన్న ప్రాంతం మీకు దగ్గర్లో ఉంటే గూగుల్‌ మ్యాప్స్‌లో అక్కడకు వెళ్లడానికి దారి తెలుసుకోవచ్చు. * https://goo.gl/wgsXzi

ఒకే తెర... రెండు ఆప్‌లు

మొబైల్‌లో ఒకేసారి రెండు ఆప్‌లు వాడుకోవచ్చా? రెండేముంది... ఎన్నయినా వాడుకోవచ్చు అంటారా! అయితే రెండు ఆప్‌లను ఒకేసారి తెరపై వాడుకోవచ్చా? Screens - Multi Window Manager ఆప్‌తో ఇది సాధ్యమవుతుంది. దీని కోసం స్క్రీన్‌ ఆప్‌ ఓపెన్‌ చేసుకొని సెట్టింగ్స్‌ విభాగంలోకి వెళ్లండి. అక్కడ మీరు ఒకేసారి వాడుకుందామనుకుంటున్న ఆప్‌లను ఎంచుకొని షార్ట్‌కట్‌లు క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ షార్ట్‌కట్‌ ఓపెన్‌ చేస్తే ఆ రెండు ఆప్‌లు మీ స్క్రీన్‌ మీద పైన, కింద కనిపిస్తాయి. అలా ఎన్ని షార్ట్‌కట్‌లైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆప్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

శాంతా సమయమిది

క్రిస్‌మస్‌కు సిద్ధమవుతున్నారా? క్రిస్‌మస్‌ చెట్టు, కేకులు, స్టార్‌, కుకీస్‌ రెడీనా... ఎలాగూ పండక్కి మూడు రోజులుంది కదా. ఈ లోగా గూగుల్‌ శాంతా తీసుకొచ్చిన ఆటలాడేయండి... సరదా వీడియోలు చూస్తూ మొబైల్‌లో సందడి చేసేయండి! దీనికి మీరు చేయాల్సిందల్లా గూగుల్‌ Santa Tracker ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. ఇందులో క్రిస్‌మస్‌ నేపథ్యంలోని పెంగ్విన్‌ స్విమ్‌, సిటీ క్విజ్‌, స్నోబాల్‌ రన్‌, గమ్‌ బాల్‌, మెమొరీ, రాకెట్‌ స్లెయ్‌, డాష్‌ డ్యాన్సర్‌, స్నో డౌన్‌ లాంటి ఎనిమిది ఆటలుంటాయి. ఇవి సాధారణ మొబైల్స్‌ గేమ్స్‌లానే ఉంటాయి. అయితే వేటికవే భిన్నంగా ఉంటాయి. వీటితో కావల్సినంత టైమ్‌ పాస్‌. క్విజ్‌ గేమ్‌లో అయితే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల ఫొటోలు ఇచ్చి... అవి ఏ నగరానికి సంబంధించినవో అని అడుగుతారు. ఈ ఆటలతోపాటు ఇన్‌ స్ట్రీమ్‌ వీడియోలు కూడా ఉంటాయి. ‘శాంతా ప్రజెంట్‌ క్వెస్ట్‌’ విభాగానికి వెళ్తే పోకెమన్‌ తరహాలో మ్యాప్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో చూపించే నిర్దేశిత ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఒక గేమ్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ ఆట ఆడుతూ మీకు దగ్గరల్లో ఉన్న బహుమతులను అందుకోవాలి.

ఎవరెక్కడున్నారు

* మీ స్నేహితులంతా ఒక ప్రాంతంలో కలుద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరెక్కడున్నారో.. నిర్ణీత ప్రదేశానికి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకోవడం ఎలా?
* మీరేమో ఆఫీసులో ఉన్నారు. పిల్లలు స్కూలు నుంచి వచ్చేశారో లేదో ఎలా తెలుస్తుంది?
ఇలాంటి వివరాలు తెలుసుకోవడం గూగుల్‌ Trusted contacts ఆప్‌తో సాధ్యం అవుతుంది. జీపీఎస్‌, లొకేషన్‌ షేరింగ్‌ ద్వారా ఈ ఆప్‌ పని చేస్తుంది. మీ మెయిల్‌ ఐడీతో అనుసంధానమై ఉన్న వ్యక్తులు (కాంటాక్ట్స్‌) ఎక్కడున్నారనేది ఈ ఆప్‌తో తెలుసుకోవచ్చు. దీనికి మీరు ఆప్‌లో ముందుగా ట్రస్ట్‌డ్‌ కాంటాక్ట్స్‌ను యాడ్‌ చేసుకోవాలి. అంటే మీరు మీ క్షేమ సమచారం, మీరున్న ప్రదేశం లాంటి వివరాల్ని ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వాళ్ల కాంటాక్ట్స్‌ పొందుపరచాలి. ఆ తర్వాత ‘షేర్‌ లొకేషన్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీరు ఎక్కడున్నారనే విషయం అవతలి వాళ్లకు తెలుస్తుంది. అలాగే అవతలి వ్యక్తి ఎక్కడున్నారనే విషయాన్ని మీరు ఈ ఆప్‌ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. ఇలా మీ ట్రస్ట్‌ కాంటాక్స్‌... మీరున్న ప్రాంతం వివరాలు అడిగినప్పుడు మీరు ఐదు నిమిషాల్లో ఇవ్వకపోతే ఈ ఆప్‌ దానంతట అదే వివరాలు పంపించేస్తుంది. https://goo.gl/klGR35

గిటార్‌ నేర్చుకుంటారా?

గిటార్‌, పియానో నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు వీటిని ప్లే చేయడంలో బేసిక్స్‌ చెప్పడానికి ఓ టీచర్‌ సిద్ధంగా ఉంది. అది ఎవరో కాదు మీ మొబైలే. మీ ఫోన్‌లో Yousician ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అదే మీకు శిక్షణ ఇస్తుంది. ఈ ఆప్‌లో గిటార్‌, పియానో వాయించడంలో కిటుకులు, ప్రాథమిక విషయాలు వీడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి. డైలీ గోల్స్‌ ఆప్షన్‌లో రోజుకు ఎన్ని పాఠాలు నేర్చుకోవాలనేది ఉంటుంది. ప్రాచుర్యం పొందిన సుమారు 1070 ఆంగ్ల గీతాల సంగీతానికి సంబంధిం చిన వీడియోలు ఈ ఆప్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్తూ పియానో, గిటార్‌ వాయించడం నేర్చుకోవచ్చు. https://goo.gl/iZvMXd

మొబైల్‌లో వార్తలు వింటారా

ప్రపంచవ్యాప్త సమాచారాన్ని రేడియోలోలాగా వినాలనుకుంటే Khabri ఆప్‌ ఉంది. ఇండియా, ప్రపంచం, ఆటలు, వినోదం... లాంటి వివిధ విభాగాలున్నాయి. వాటిని క్లిక్‌ చేస్తే సంక్షిప్త వార్తలు కనిపిస్తాయి. ఆ వివరాల్ని వినాలనుకుంటే పైన ఉన్న స్పీకర్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ఒక్కో వార్తను న్యూస్‌ రీడర్‌ చదివి వినిపిస్తుంది. మొబైల్‌ డేటాతో న్యూస్‌ వింటే ఎక్కువ డేటా ఖర్చవుతుందనుకుంటే వైఫై ఉన్నప్పుడు వార్తల్ని ఆఫ్‌లైన్‌ చేసుకునే సౌకర్యమూ ఉంది. https://goo.gl/pO4p5f

మొబైల్‌లో ఫొటోషాప్‌

ఫొటోలను క్రాప్‌ చేయడం, బ్రైట్‌నెస్‌ పెంచుకోవడం.. తగ్గించుకోవడం, కలర్‌ టోన్‌ మార్చుకోవడం... మొబైల్‌లో ఫొటోషాప్‌ చేయగలిగే ఆప్స్‌లో ఈ ఆప్షన్‌లే ఎక్కువగా కనిపిస్తాయి. కంప్యూటర్లలో వాడే ఫొటోషాప్‌లో ఉండే కొన్ని ఆప్షన్లను మొబైల్‌లో వాడుకునేలా అడోబ్‌ తన ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌కు మొబైల్‌ వెర్షన్‌ ‘అడోబ్‌ ఫొటోషాప్‌ ఫిక్స్‌’ను విడుదల చేసింది. సిస్టమ్‌ ఫొటోషాప్‌లో ఉండే బ్లర్‌, లిక్విఫై, వ్రాప్‌, హీలింగ్‌ లాంటి చాలా ఆప్షన్లు ఈ ఆప్‌లో ఇందులో ఉన్నాయి. ఈ ఆప్‌తో మొబైల్‌లోని ఫొటోలు, అడోబ్‌ క్రియేటివ్‌లోని ఫొటోలు ఎడిట్‌ చేసుకోవచ్చు. https://goo.gl/d85Ehi

కంప్యూటర్‌ కోర్సు కోసం

హెచ్‌టీఎమ్‌ఎల్‌, జావా, సీ++, ఎస్‌క్యూఎల్‌, జావా స్క్రిప్ట్‌ లాంటి కంప్యూటర్‌ కోర్సులంటే ఆసక్తి ఉందా? దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? లేదంటే శిక్షణ తీసుకుంటూ అదనపు సమాచారం కోసం అంతర్జాలంలో ఎప్పటికప్పుడు వెతుకుతున్నారా? అయితే మీకు Solo learn ఆప్‌లు ఉపయుక్తంగా ఉంటాయి. వీరి నుంచి కంప్యూటర్‌ కోర్సులకు సంబంధించిన తొమ్మిది ఆప్స్‌ ఉన్నాయి. వాటి ద్వారా కంప్యూటర్‌ సంబంధిత కోర్సులను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు Learn HTML ఆప్‌ను తీసుకుంటే... ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే హెచ్‌టీఎంఎల్‌ ఓవర్‌వ్యూ, బేసిక్స్‌, ఛాలెంజెస్‌, హెచ్‌టీఎంఎల్‌ సర్టిఫికెట్‌ లాంటి ట్యాబ్‌లు కనిపిస్తాయి. ఓవర్‌ వ్యూ ట్యాబ్‌లోకి వెళ్తే What is HTML అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని జవాబు చదివి.. ఆ తర్వాత అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే తర్వాత లెవల్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలా మీకు కావాల్సిన ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. కంప్యూటర్‌ కోర్సు నేర్చుకోండి. https://goo.glPZJZJ

వై-ఫై ఇక్కడ దొరుకుతుంది

వ్యాపారం, ఉద్యోగ వ్యవహారాల్లో భాగంగా ఎక్కువగా టూర్లకు వెళ్తుంటారా... తరచుగా విహార యాత్రలకు వెళ్తుంటారా? అలాంటప్పుడు ఆయా ప్రాంతాల్లో మొబైల్‌ డేటా కంటే... వై-ఫై వాడటానికి ప్రాధాన్యమిస్తారా? అక్కడ ఏమైనా ఉచిత వై-ఫై సర్వీసులు ఉన్నాయా అని చూస్తుంటారా? అయితే మీకు Wifire ఆప్‌ ఉపయుక్తంగా ఉంటుంది. మీరున్న ప్రాంతంలో వై-ఫై జోన్లు ఎక్కడ ఉన్నాయో ఈ ఆప్‌ తెలుపుతుంది. ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక జీమెయిల్‌/ఫేస్‌బుక్‌తో లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జీపీఎస్‌ ఆధారంగా మీరున్న ప్రాంతాన్ని ఆప్‌ తెలుసుకుంటుంది. మీకు దగ్గర్లో ఉన్న వై-ఫై జోన్ల వివరాలను మ్యాప్‌ రూపంలో అందిస్తుంది. మీరున్న ప్రాంతానికి ఆ జోన్‌ ఎంత దూరంలో ఉందనే విషయమూ తెలుపుతుంది. ప్రస్తుతం టాటాడొకోమో, ఎంటీఎస్‌, జియో, ఎయిర్‌టెల్‌ తదితర సంస్థలు ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆప్‌తో వై-ఫై కేంద్రాల గురించి సులభంగా తెలుసుకోవచ్చు.
* https://goo.gl/zMcTD2

3500 పుస్తకాలు

పుస్తకాన్ని మించిన మంచి స్నేహితుడు లేరంటారు. పుస్తకాలతో దోస్తీ మనిషికి, మనసుకు మంచి చేస్తుంది. అందు లోనూ భక్తి పుస్తకాలైతే ఇంకా మంచిది. వీలైనప్పుడు గ్రంథాలయానికి వెళ్లి నాలుగు పుస్తకాలు చదవండి. ఏంటి... మాకంత సమయం లేదంటారా. అయితే మీ మొబైల్‌నే గ్రంథాలయంగా మార్చేయండి. 3500 తెలుగు పుస్తకాలతో మీ మొబైల్‌ గ్రంథాలయాన్ని తెరవండి. దీని కోసం 3500 Free Telugu Bhakti Books ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. అందులో 33 విభాగాల్లో సుమారు 3500 ఈ-బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆంగ్లంలోనూ పుస్తకాలు లభ్యమవుతాయి. అంతర్జాలం సౌకర్యం ఉన్నప్పుడు ఈ-బుక్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తర్వాత చదువుకోవచ్చు. ఆ పుస్తకాల పీడీఎఫ్‌ పేజీలను షేర్‌ చేయొచ్చు కూడా.
* https://goo.gl/Abn14O

నడుస్తూ...టైప్‌ చేస్తూ

ఆఫీస్‌ పని, అత్యవసర మెసేజ్‌లు, సోషల్‌ మీడియా పోస్ట్‌లతో మీరు ఎప్పుడూ బిజీనా. ఒక్కోసారి నడుస్తూ కూడా టెక్ట్స్‌ టైప్‌ చేసిన సందర్భాలున్నాయా? అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు పరిసరాలు మరచిపోయి రోడ్డు మీద గతుకులు, రాళ్లు చూసుకోకుండా వెళ్తున్నారా? ఇలాంటి ఇబ్బంది లేకుండా టైప్‌ చేస్తుంటే ఫోన్‌లోనే మీ ముందున్న రోడ్డు కనిపించే సౌకర్యం వచ్చేసింది. అందుకోసం Text while walking ఆప్‌ ఉంది. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే మీ ఫోన్‌ వెనుక కెమెరా ఓపెన్‌ అవుతుంది. దీంతో మీ ముందు ఉన్న పరిసరాలు, వస్తువులు.. మీ మొబైల్‌ తెర మీద కనిపిస్తాయి. పైన టెక్స్ట్‌ టైప్‌ చేసుకునే బాక్స్‌ కనిపిస్తుంది. అందులో మీరు టైప్‌ చేసి ఆ తర్వాత ఆ టెక్స్ట్‌ను కాపీ చేసుకొని మీకు అవసరమైన ప్రాంతంలో పేస్ట్‌ చేసుకోవచ్చు. టైప్‌ చేస్తున్నప్పుడు ఫాంట్‌ రంగు, సైజ్‌ను కూడా మార్చుకోవచ్చు. నేరుగా ఈ ఆప్‌ నుంచే మెసేజ్‌ పంపించుకునే సౌలభ్యమూ ఉంది. రాత్రి వేళలో నడిచినప్పుడు ఇబ్బంది లేకుండా మొబైల్‌లోని టార్చ్‌ను ఈ ఆప్‌ నుంచే ఆన్‌ చేసుకోవచ్చు. http://goo.gl/1qIvkO

యువత కోసం క్రేజీగా

ఫేస్‌బుక్‌ వచ్చి చాలా రోజులైంది... తొలుత యువతను టార్గెట్‌ చేసుకున్న ఎఫ్‌బీ ఇప్పుడు అన్ని తరాల వారి చేరికతో బరువెక్కిపోయింది. ఇది మేమంటున్న మాట కాదు. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆలోచన. అందుకే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆప్‌ సిద్ధం చేయించారు. ‘లైఫ్‌ స్టేజ్‌’ పేరుతో రూపొందిన ఈ ఆప్‌ ప్రస్తుతం అమెరికాలోని 21 ఏళ్ల లోపు వారికి అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్‌కు భిన్నంగా యువతకు నచ్చే ఆప్షన్లతో రూపొందించారు. ఇప్పటికే అమెరికాలోని ఐఫోన్‌ వినియోగదారులు ఈ ఆప్‌ వాడుతున్నారు. ఇందులో ఖాతా ప్రారంభించాలనుకునే వ్యక్తి, అతని విచిత్రమైన ఫొటోను వాడాల్సి ఉంటుంది. ఆప్‌లో లాగిన్‌ అయినప్పుడు ఇచ్చిన వివరాల ఆధారంగా అదే స్నేహితుల్ని గ్రూప్‌గా మార్చేస్తుంది. అంటే స్కూలు, కాలేజీ... లాంటి గ్రూప్‌లు ఆటోమేటిక్‌గా సిద్ధమవుతాయి. ఫొటోలు, పోస్టులు, వీడియోలతో సందడి షూరూ చేయొచ్చు. ఇందులో పోస్ట్‌ చేసిన వీడియోలు, పోస్టులు ఫేస్‌బుక్‌లో కనిపించవు. ఈ ఆప్‌ మన దేశంలోకి ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఆండ్రాయిడ్‌లో బ్లాక్‌బెర్రీ హబ్‌

ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా నోటిఫికేషన్లు, సాధారణ మెసేజ్‌లు... ఇవన్నీ ఒకేచోట కనిపిస్తే సౌకర్యంగా ఉంటుంది కదా. అస్తమానం జీమెయిల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఓపెన్‌ చేయనక్కర్లేదు. అన్నీ ఒకేసారి అందులోనే చూసుకోవచ్చు. ఇలాంటి సౌకర్యం బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ఉంది. ‘బ్లాక్‌బెర్రీ హబ్‌’ ఆప్‌తో ఆ ఫోన్లలో ఆల్‌ ఇన్‌ వన్‌ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడీ సౌకర్యం ఆండ్రాయిడ్‌ ఫోన్లకూ వచ్చింది. 30 రోజుల వరకే ఈ ఆప్‌ ఉచితం. ఆ తర్వాత నెలకు ఒక డాలర్‌ చొప్పున చెల్లించాలి. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఓఎస్‌ ఆధారిత ఫోన్లలోనే పని చేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్‌ లాలిపాప్‌ ఓఎస్‌లోనూ ఈ ఆప్‌ పని చేస్తుంది.

అన్నీ మీరే... ఈ ఆప్‌తో

మీకు వ్యోమగామి అవ్వాలనుందా?... ‘24’ సినిమాలో సైంటిస్ట్‌ సూర్యలా కనిపించాలనుందా? ‘అవతార్‌’లో హీరోలా విచిత్రంగా మారిపోవాలని ఉందా? లేక ‘బ్యాట్‌మ్యాన్‌’లా కనిపించాలని ఉందా? ఇవన్నీ నిజ జీవితంలో జరగడం కష్టం కానీ MSQRD (Masquerade) ఆప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చిటికెలో మీకు కావల్సినట్లుగా కనిపించొచ్చు. ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ఈ ఆప్‌తో విచిత్రమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. వాటిని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికల ద్వారా స్నేహితులతో పంచుకోవచ్చు. ఫేస్‌బుక్‌ ఐడీతో ఈ ఆప్‌లో లాగిన్‌ అయిన వెంటనే ఫోన్‌ ముందువైపు కెమెరా ఓపెన్‌ అవుతుంది. దాని కింద వివిధ రకాల ఫిల్టర్లు (మాస్క్‌లు) ఉంటాయి. కుంగ్‌ఫు పాండా, చార్లీ చాప్లిన్‌, నక్క, బీస్ట్‌, వృద్ధురాలు... లాంటి వివిధ ఫిల్టర్లుంటాయి. మీకు కావాల్సిన ఫిల్టర్‌ ఎంచుకొని కెమెరాను క్లిక్‌మనిపిస్తే సరి. మీ ముఖంలో ఆ మాస్క్‌ కలసిపోయి విచిత్రమైన సెల్ఫీ వచ్చేస్తుంది. వెనుక వైపు ఉన్న కెమెరాతో ఇతరులనూ కొత్తగా ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. ఇందులో సుమారు 50 వరకు ఫిల్టర్లు ఉన్నాయి.
* https://goo.gl/a8FOIW

పాట... పరుగు

ఓ చేతిలో ఎంపీ3 ప్లేయర్‌, మరో చేతికి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌... ఉదయాన్నే వాకింగ్‌/ రన్నింగ్‌కు వెళ్తున్నప్పుడు ఇదేనా మీ పరిస్థితి. ‘పెబెల్‌ కోర్‌’
ఫిట్‌నెస్‌ ట్రాకర్‌తో ఆ పరిస్థితిని సింపుల్‌ చేయొచ్చు. పాటల పెట్టె, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను కలిపి ఒకటిగా చేసిన పరికరం ఇది. చేతి గడియారం పరిమాణంలో ఉండే పెబెల్‌ కోర్‌ను చొక్కా కాలర్‌కు లేదంటే డ్రెస్‌కు తగిలించేయొచ్చు. దానికి ఇయర్‌ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ ఉదయపు నడక కొనసాగించొచ్చు. ఇది మొబైల్‌ డేటా లేదా వై-ఫై ఆధారంగా జీపీఎస్‌ పరిజ్ఞానంతో పని చేస్తుంది. నాలుగు సెంటీమీటర్ల పరిమాణంలో, 50 గ్రాముల బరువు ఉంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మన దేశ మార్కెట్‌లోకి వస్తుంది. ధర సుమారు రూ.ఐదు వేలు. పెబెల్‌ ట్రాకర్‌పై రెండు బటన్స్‌ ఉంటాయి. పెద్ద బటన్‌ను ఒత్తితే మీ రన్నింగ్‌ యాక్టివిటీ నమోదు చేసుకోవడం మొదలవుతుంది. మీరు ఎంతసేపు నడిచారో, పరిగెత్తారో తెలియాలంటే మరోసారి ఆ పెద్ద బటన్‌ నొక్కాలి. యాక్టివిటీ పూర్తయినప్పుడు ఆ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేస్తే సరి. దానిపైన ఉండే చిన్న బటన్‌ను ఒత్తడం ద్వారా అత్యవసర సమయాల్లో దీని నుంచి నేరుగా మీ మిత్రునికి సందేశం పంపొచ్చు. మిత్రుని నెంబరును ముందుగా నమోదు చేసుకొని ఉండాలి. ఈ మొత్తం యాక్టివిటీని సంబంధిత ఆప్‌ ద్వారా మీ మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకొని చూడొచ్చు. * https://goo.gl/yJcqgh

వీడియో డౌన్‌లోడ్‌ సులభంగా

ఫేస్‌బుక్‌లో ఓ ఫన్నీ వీడియో చూశారు... డౌన్‌లోడ్‌ చేద్దామంటే దానికోసం ప్రత్యేకమైన ఆప్‌ ఉండాలి. ఇదంతా గతం. ఇప్పుడు ఆ అవసరం లేదు. మీ ఫోన్‌లో ఒపెరా మినీ బ్రౌజర్‌ కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఎంచక్కా దాని నుంచే నేరుగా ఫేస్‌బుక్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ బ్రౌజర్‌ ఆప్‌లో ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయండి. ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్‌ చేయండి. సాధారణంగా అయితే క్లిక్‌ చేయగానే వీడియో ప్లే అవుతుంది. ఈ బ్రౌజర్‌లో అయితే ఆ వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్‌ వస్తుంది. అలా ఒపెరాలో ఇతర సోషల్‌ నెట్‌వర్క్‌ వీడియోలు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. * https://goo.gl/N1aZCn

తల్చుకుంటే మనసులో... చెప్పేస్తా చిటికెలో

ఒకరి మనసులో మాట చెప్పడం ఇంకొకరికి సాధ్యమా? అస్సలు సాధ్యం కాదు. మనుషుల సంగతేమో కానీ ఓ ఆప్‌ ఈ పని చేస్తోంది. అయితే మనసులో మాటను ప్రశ్నలడిగి కనిపెట్టేస్తుంది. సరదాగా ఉండే ఈ ఆటలో మీరు మనసులో తలుచుకున్న ఏ ప్రముఖుడినైనా అది చెప్పేసి ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఆప్‌ పేరు Akinator. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే ఓ చిన్న అవతార్‌ (మనిషి లాంటి బొమ్మ) వస్తుంది. మీరు మనసులో ఎవరినైనా తల్చుకోవాలి. ఆప్‌లో అవతార్‌ మీకు ప్రశ్నలు సంధించడం మొదలుపెడుతుంది. దానికి మీరు అవుననో, కాదనో, తెలియదనో చెబితే చాలు. ఉదాహరణకు మీరు మనసులో మహాత్మా గాంధీని తల్చుకున్నారనుకోండి. వరుస ప్రశ్నల ద్వారా ఆయన బొమ్మ చూపిస్తుంది. కొన్ని ప్రశ్నలయ్యేసరికల్లా మీరు తల్చుకున్న ప్రముఖుడి బొమ్మను చూపించేస్తుందది! మీరు మనసులో అనుకున్నది సెలెబ్రిటీని కాకపోయినా, లేదా మీరు సమాధానాలు తప్పుగా చెప్పినా ఆప్‌ సమాధానం ఇవ్వలేదు. ఈ ఆటను ఆప్‌లోను, http://en.akinator.mobi/personnages/jeu వెబ్‌సైట్‌లోనూ ఆడొచ్చు. ఒకవేళ ఈ ఆప్‌ను చిన్నపిల్లలు వాడే పక్షంలో ఆప్‌ సెట్టింగ్స్‌లో ‘చైల్డ్‌ లాక్‌’ను ఎనేబుల్‌ చేసి ఇవ్వొచ్చు. * https://goo.gl/lY4MHM * https://goo.gl/KLasvg

త్రీడీ ఫొటో తీద్దామా

స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాతోనే త్రీడీ ఫొటోలు తీయొచ్చు తెలుసా? దీనికి మీ ఫోన్‌లో Seene ఆప్‌ ఉంటే చాలు. ఆప్‌ ఓపెన్‌ చేయగానే కొన్ని త్రీడీ ఫొటోలు కనిపిస్తాయి. పైన ఉన్న కెమెరా బటన్‌ను ఒత్తితే సాధారణమైన ఫొటో తీసే ఆప్షన్‌ వస్తుంది. కెమెరా షట్టర్‌ బటన్‌ను ఒత్తితే ఫొటో క్లిక్‌ అయ్యి... దాని మీద పసుపు రంగులో చిన్న చుక్కలు కనిపిస్తాయి. ఆ తర్వాత మీ ఫోన్‌ను కాస్త ఎదురుకి జరిపితే మరోసారి కెమెరా క్లిక్‌ అయ్యి ఫొటో తీయడం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆప్‌లోని గ్యాలరీలో ఆ ఫొటోను ఓపెన్‌ చేసి త్రీడీలో చూడొచ్చు. వీటిని వీఆర్‌ హెడ్‌సెట్‌లో చూస్తే ఆ మజా రెట్టింపవుతుంది. https://goo.gl/tNXFRx

స్పామ్‌ కాల్స్‌ గుర్తిస్తుంది

మీకు క్రెడిట్‌ కార్డు కావాలా... ఫలానా రీఛార్జ్‌ చేసుకొండి... ఇవిగో కొత్త ఆఫర్లు అంటూ ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. మీరు బిజీగా ఉన్న సమయంలో అలాంటి కాల్స్‌ చికాకు పెడతాయి. అలాంటి కాల్స్‌ అడ్డుకోవడానికి, అసలు ఆ కాల్‌ ఎవరు చేశారో చూడటానికి ‘ట్రూ కాలర్‌’ లాంటి ఆప్స్‌ ఉన్నాయి. ఇకపై అలాంటి థర్డ్‌ పార్టీ ఆప్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. గూగుల్‌ సొంతంగా అలాంటి పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. గూగుల్‌ ఆప్‌లో కొత్తగా ‘స్పామ్‌ కాల్స్‌’ గుర్తించే సదుపాయం ప్రవేశపెట్టింది. మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో ‘కాలర్‌ ఐడీ’ ఆప్షన్‌ను ఆన్‌ చేసి ఉంచితే... ఇకపై వచ్చే కాల్స్‌ను గూగుల్‌ ఓ కంట కనిపెడుతుంది. అనవసర కాల్స్‌ను గుర్తించి మీకు సమాచారం అందిస్తుంది. దీని ద్వారా మీరు ఆ కాల్స్‌ను బ్లాక్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఈ అవకాశం నెక్సస్‌, ఆండ్రాయిడ్‌ వన్‌ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

ఆఫ్‌లైన్‌లో ఎఫ్‌బీ వీడియో

ఫేస్‌బుక్‌లో ఓ వీడియో చూద్దామంటే మొబైల్‌ డేటా స్లోగా ఉంది. వీడియో ఆగి ఆగి ప్లే అవుతోంది. మరెలా?
ఎఫ్‌బీలో వీడియోలు చూద్దామంటే అంత డేటా మీ మొబైల్‌లో లేదు. వైఫై ఉన్నప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకొని తర్వాత చూసుకునే ఆప్షన్‌ ఉంటే బాగుండు!
ఈ ప్రశ్నలకు ‘ఆఫ్‌లైన్‌ వీడియో’ ఆప్షన్‌ ద్వారా ఎఫ్‌బీ సమాధానమిచ్చింది. యూట్యూబ్‌లో ఉన్న ఆఫ్‌లైన్‌ వీడియో విధానాన్ని ఫేస్‌బుక్‌ మొబైల్‌ ఆప్‌లో వినియోగించుకోవచ్చు. మీకు కావాల్సిన ఎఫ్‌బీ వీడియో పోస్టు పైన కుడివైపు డ్రాప్‌ డౌన్‌ మెనూ గుర్తును ఒత్తితే... ‘సేవ్‌ వీడియో’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని టచ్‌ చేస్తే ఆ వీడియో మీ ‘సేవ్డ్‌’ ట్యాబ్‌లో చేరిపోతుంది. ఆప్‌ మెనూలోని ‘సేవ్డ్‌’ ట్యాబ్‌లోకి వెళ్లి ఆ వీడియోను చూసుకోవచ్చు. ఈ సౌకర్యం కొన్ని వీడియోలకే ఉంది.

బాబోయ్‌... ఫొటోలో దెయ్యం!

రాజ్‌ చాలా కాలం తర్వాత చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకున్నాడు. అందరూ సరదాగా సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అందరూ తీసిన ఫొటోలు మామూలుగానే వచ్చాయి. కానీ రాజ్‌ తీసిన ఫొటోలో దెయ్యాలు, ఆత్మలు కనిపించాయి. ఆ ఫొటోలు చూసి స్నేహితులు కాస్త భయపడినా తర్వాత అది రాజ్‌ చేసిన ఫొటో మ్యాజిక్‌ అని తెలిసి నవ్వుకున్నారు. మీరూ రాజ్‌లాగా మీ స్నేహితులను థ్రిల్‌ చేయాలంటే ‘ఘోష్ట్‌ కెమెరా’ ఆప్‌ల గురించి తెలుసుకోవాలి.
ఘోష్ట్‌ కెమెరా ఆప్‌ల్లో మూడు రకాలున్నాయి. వాటిలో మీకు ఏది అనువైనదో తేల్చుకోవాలి. దీంతోపాటు ఈ ఆప్‌లతో ముందుగా తీసుకున్న ఫొటోలపై దెయ్యం బొమ్మలు వచ్చేలా ఎడిట్‌ చేసుకోవచ్చు కూడా.
ఫొటో ఇలా
‘ఘోష్ట్‌ కెమెరా’ ఓపెన్‌ చేయగానే గ్యాలరీ, కెమెరా అనే ఆప్షన్లు కనిపిస్తాయి. గ్యాలరీ బటన్‌ను ఒత్తితే మీ ఫోన్‌లో గతంలో తీసిన ఫొటోలు కనిపిస్తాయి. వాటిలోంచి ఒకటి ఎంచుకొని దానిపై దెయ్యం బొమ్మలు జోడించొచ్చు. కెమెరా బటన్‌ను ఒత్తితే మీ ఫోన్‌ కెమెరా ఆన్‌ అవుతుంది. దాని దిగువ దెయ్యం బొమ్మలు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకొని దానికి తగ్గట్లు ఫొటో తీస్తే సరి. ముందుగా ఫొటో తీసి తర్వాత దెయ్యం బొమ్మలు జోడించొచ్చు. ఇది కాకుండా మీరు ఫొటో తీసిన వ్యక్తినే మసకగా దెయ్యంలా మార్చే ఆప్‌ కూడా ఉంది. ఈ ఆప్‌లో మీరు రెండు సార్లు ఫొటో తీయాల్సి ఉంటుంది. తొలుత తీసిన ఫొటో దెయ్యంలా మారుతుంది. రెండోసారి తీసిన ఫొటో సవ్యంగా ఉంటుంది. అలా మీ ఫొటోలోకి దెయ్యాన్ని తీసుకురావొచ్చు.
* https://goo.gl/0xBLdh * https://goo.gl/ZGn8mr * https://goo.gl/o8tSH5 * https://goo.gl/ag4Yu7 * https://goo.gl/nYtsyt * https://goo.gl/Lu5GHu * https://goo.gl/ZFnnvG * https://goo.gl/wsM4aD
త్రీడీలో దెయ్యం
దెయ్యంతో ఫొటోనే కాదు, వీడియో కూడా చిత్రీకరించొచ్చు. దీని కోసం Ghost Camera 3d అనే ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆప్‌ ఓపెన్‌ చేయగానే దెయ్యం, దాని చేతులు లాంటి కొన్ని త్రీడీ బొమ్మలు వస్తాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకుంటే కెమెరా ఆన్‌ అవుతుంది. అప్పుడు మీకు కావాల్సిన రీతిలో ఫొటో, వీడియో చిత్రీకరించొచ్చు. ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో షేర్‌ చేసుకోవచ్చు.
* https://goo.gl/zS0eUN * https://goo.gl/c2T37t

 

 

 

 

 

 

యాపిల్‌కి గూగుల్‌

ఎప్పటి నుంచో ఐఫోన్‌ని వాడుతున్నారా? టైపింగ్‌ నిమిత్తం థర్డ్‌ పార్టీ కీబోర్డ్‌లను వాడదాం అనుకుంటే గూగుల్‌ అందిస్తున్న ‘జీబోర్డ్‌’ ఆప్‌ని ప్రయత్నించండి. ఐఫోన్‌ యూజర్లకు ఇది ప్రత్యేకం. చూడడానికి అచ్చంగా ఐఫోన్‌ బిల్ట్‌ఇన్‌ కీబోర్డ్‌ మాదిరిగానే కనిపిస్తుంది. అదనంగా గూగుల్‌ లోగోని జత చేశారు. దాన్ని సెలెక్ట్‌ చేసి సరాసరి కీబోర్డ్‌ నుంచే గూగుల్‌ సెర్చ్‌ చేయవచ్చు. మీరే ఛాటింగ్‌ చేస్తున్నప్పుడు కావాల్సిన జిఫ్‌లు, ఎమోజీలను కీబోర్డ్‌లోనే గూగుల్‌ సెర్చ్‌ చేసి పంపొచ్చు. సెర్చ్‌లో మీ స్పందనకి తగిన ఎమోజీలను వెతికితే... పాప్‌అప్‌ మెనూలో కీబోర్డ్‌పైనే ఎమోజీలు కనిపిస్తాయి. సెలెక్ట్‌ చేసి చిటికెలో పంపొచ్చు. స్నేహితుడితో ఛాట్‌ చేస్తూ హోటల్‌కి వెళ్దాం అనుకుంటే... వెంటనే జీబోర్డ్‌లో దగ్గర్లోని హోటల్‌ వివరాల్ని వెతకొచ్చు. థంబ్‌ నెయిల్‌ ఇమేజ్‌లతో హోటల్‌ వివరాల్ని షేర్‌ చేయవచ్చు. వీడియోలు, ఇమేజ్‌లను వెతికి పంపొచ్చు. వార్తాంశాలు, ఇతర వ్యాసాల్ని కీబోర్డ్‌లోనే బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. నచ్చిన వాటిని వెంటనే షేర్‌ చేయవచ్చు. కీబోర్డ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కావాల్సిన మార్పులు చేయవచ్చు. Emoji Suggestions, Auto-Correction, Enable caps lock.... లాంటి మరిన్ని ఆప్షన్స్‌ని ఎనేబుల్‌, డిసేబుల్‌ చేయవచ్చు. ప్రైవసీ మాటేంటి? అనే సందేహం అక్కర్లేదు. మీరు టైప్‌ చేస్తున్న సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/srGfo8

బిల్లుతో డిస్కౌంట్‌

ఈ-షాపింగ్‌లో డీల్స్‌, డిస్కౌంట్‌లను వాడుకోవడం తెలుసు. కూపన్‌ కోడ్‌లను వాడుకునీ అనేక ఉత్పత్తుల్ని కొంటున్నాం. కానీ, మీరు ఎప్పుడైనా చెల్లించిన బిల్లుని ఆప్‌లోకి అప్‌లోడ్‌ చేసి క్యాష్‌బాక్‌ని పొందారా? అదెలా సాధ్యమో తెలియాలంటే Zaggle ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ‘రెస్టారెంట్‌ క్యాష్‌బాక్‌’లను అందించే ఆప్‌ ఉంది. ఎలాగంటే... ఇంటిల్లిపాదీ హోటల్‌కి వెళ్లారు... తిన్నాక బిల్లు చెల్లించారు. మరు నిమిషం చెల్లించిన అదే బిల్లుని ఆప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తే చాలు. ఆప్‌ ద్వారా ఆ హోటల్‌ అందించే డిస్కౌంట్‌ మొత్తాన్ని క్యాష్‌బాక్‌ రూపంలో పొందొచ్చు. ఇలా డిపాజిట్‌ అయిన Earned Points మొత్తాన్ని ఈ-ఓచర్‌గా వాడుకోవచ్చు. అంటే... ఫోన్‌ని రీఛార్జ్‌ చేయవచ్చు. సినిమా టిక్కెట్టు బుక్‌ చేసుకోవచ్చు. ఈ-షాపింగ్‌ చేసిన తర్వాత బిల్లు చెల్లింపులో Redeem చేయవచ్చు. ఆప్‌ స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేశాక వాడుతున్న మెయిల్‌ ఐడీతో సభ్యులవ్వాలి. తర్వాత మీరు ఉన్న చోటుకి దగ్గర్లో ఉన్న హోటళ్లు అందించే క్యాష్‌బాక్‌ ఆఫర్లను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. జాబితాలోని హోటళ్లలో తిన్న తర్వాత హోం స్క్రీన్‌ కింద కనిపించే Upload Bill ఆప్షన్‌తో ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. 24 గంటల్లో క్యాష్‌బ్యాక్‌ మొత్తం ఎకౌంట్‌కి డిపాజిట్‌ అవుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లను ఆప్‌ సపోర్ట్‌ చేస్తుంది.
https://goo.gl/v0XXa0, https://goo.gl/zNana1

క్లిక్‌ చాలు..

క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నారా? ఇంట్లో... ఆఫీస్‌లో రోజూ ఏదోకటి బ్రౌజ్‌ చేస్తుంటాం. రోజువారీ బ్రౌజింగ్‌ హిస్టరీ కూడా బ్రౌజర్‌లో భద్రంగా సేవ్‌ అవుతుంది. ఎప్పుడైనా బ్రౌజింగ్‌ హిస్టరీనీ తొలగించాలంటే? బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ విభాగంలోకి వెళ్తేగానీ క్లియర్‌ చేయలేం. మీకు తెలుసా? దీనికో సులువైన మార్గం ఉంది. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లోకి వెళ్తే History Eraser ఆప్‌ ఉంది. స్టోర్‌ నుంచి బ్రౌజర్‌కి జత చేసి ఎప్పుడైనా వాడొచ్చు. క్రోమ్‌ ఆప్స్‌ జాబితాలో ఐకాన్‌లా కనిపించే అప్లికేషన్‌ని సెలెక్ట్‌ చేస్తే చాలు. ప్రత్యేక విండోలో ఆప్‌ ఓపెన్‌ అవుతుంది. ఇక బ్రౌజింగ్‌ హిస్టరీ నుంచి ఏమేం తొలగిపోవాలో చెక్‌ చేసి Run Eraser ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. హిస్టరీని నాలుగు రకాలుగా (Easy, Medium, Hard, Dev) సెలెక్ట్‌ చేసుకుని క్లియర్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/E1tF3p

ఆంగ్లం కోసం...

ఏదైనా కొత్త భాషపై పట్టు సాధించాలంటే మాతృభాషనే మాధ్యమంగా చేసుకుని నేర్చుకోవడం సులభం. అందుకే ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలనుకునే వారు కూడా తెలుగుని మాధ్యమంగా నేర్చుకుంటే? అదెలా అనేగా సందేహం. జేబులోని స్మార్ట్‌ ఫోన్‌ తీయండి. గూగుల్‌ ప్లేలోకి వెళ్లి Hello English: Learn English ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ఆంగ్ల భాషని సుమారు 15 ప్రాంతీయ భాషల్ని మాధ్యమంగా చేసుకుని అభ్యసించొచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక మీ మాతృభాషని సెలెక్ట్‌ చేసుకోవడమే. తర్వాత మీరు బేసిక్స్‌ నుంచి ఇంగ్లిష్‌ నేర్చుకోవచ్చు. లేదంటే... మీరు వచ్చిన ఇంగ్లిష్‌తో పరీక్ష రాయాలి. దాంట్లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీరు ఏ లెవల్‌ నుంచి నేర్చుకోవడం మంచిదో నిర్ణయిస్తారు. తర్వాత మీరు అభ్యసించాల్సిన పాఠాల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వాటిని చదివిన తర్వాత గేమ్‌లా రూపొందించిన పరీక్ష రాయాలి. జాబితాగా పొందుపరిచిన అన్ని పాఠాల్ని చూసేందుకు 'అన్ని లెసన్స్‌' మెనూలోకి వెళ్లండి. ఏదైనా ఆంగ్ల పదానికి అర్థం కావాలంటే 'డిక్షనరీ' ఉంది. ఆప్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/wUXziR

ఒత్తిడి దూరం

చదువు... ఉద్యోగం... వ్యాపారం... ఏ రంగంలోనైనా రోజూ ఉరుకులు పరుగులే. రోజుకి 24 గంటలు కంటే ఎక్కువ ఉంటే బాగుంటుందని అనుకునేవారూ లేకపోలేదు. ఇంతటి బిజీ బిజీ కార్యాచరణతో ఒత్తిడిని ఎదుర్కోవడం అనివార్యం. అందుకే స్మార్ట్‌ మొబైల్‌ని తీయండి. కాసేపు మనసుని ప్రశాంతంగా ఉంచేందుకు Calm ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేయండి. ఆప్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకుని రోజులో కొంత సమయం ప్రశాంత జీవనం కోసం సాధన చేయవచ్చు. అందుకు Meditate విభాగంలో కొన్ని ఉచిత కోర్సులు (7 Days of Calm, Body Scan, Calm...) ఉన్నాయి. మీకు అనువైన సమయంలో రోజూ సాధన చేయవచ్చు. క్యాలెండర్‌తో విభాగాల వారీగా మీరు చేస్తున్న సాధనని ట్రాక్‌ చేసి చూడొచ్చు. Scenes మెనూలోకి వెళ్లి యానిమేషన్‌ గ్రాఫిక్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లను మార్చుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/tZ0ISy

బతుకమ్మ పాటలు...

బతుకమ్మ పాటల ప్రత్యేకతే వేరు. అందరూ ఓ చోట చేరి బతుకమ్మ చుట్టూ కలిసికట్టుగా నృత్యం చేస్తూ పాడుకునే పాటల్ని ఆప్‌ రూపంలో పొందొచ్చు తెలుసా? కావాలంటే Bathukamma Paatalu ఆప్‌ని ప్రయత్నించి చూడండి. ఆప్‌ని రన్‌ చేసి 'సాంగ్స్‌' బటన్‌పై నొక్కితే చాలు. అన్ని పాటలు జాబితాగా కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఉన్న అన్ని పాటల్ని చూసేందుకు జాబితా కిందే నావిగేషన్‌ బటన్లు ఉన్నాయి. వాటిపై తాకుతూ చూడొచ్చు. నచ్చిన పాటల్ని Favourite మెనూలో పెట్టుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/6z1mmL

సందేహమా?

విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఏవేవో సందేహాలు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సందేహాల సంఖ్య మరింత పెరుగుతుంది. అందుకే మీకు వచ్చిన సందేహాన్ని తీర్చేందుకు ఓ మొబైల్‌ ఆప్‌ బీటా వెర్షన్‌లో సిద్ధంగా ఉంది. గూగుల్‌ ప్లే నుంచి DoubtNut ఆప్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆప్‌లో పోస్ట్‌ చేసిన ప్రశ్నలకు నిపుణులు ఒకటి లేదా రెండు రోజుల్లో సమాధానాన్ని పోస్ట్‌ చేస్తారు. ప్రస్తుతానికి ఆప్‌లో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రశ్నల్ని స్వీకరించి సమాధానాల్ని అందిస్తున్నారు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక మెయిల్‌ ఐడీ వివరాలతో రిజిస్టర్‌ అవ్వాలి. ఆప్‌ హోం పేజీలోని Select Chapter Name బాక్స్‌లో ప్రశ్న తాలూకు పాఠ్యాంశాన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాతి బాక్స్‌లో ప్రశ్నని టైప్‌ చేసి Submit Question సెలెక్ట్‌ చేయాలి. ఒకవేళ ఫొటో రూపంలో పంపాల్సివస్తే కెమెరా గుర్తుతో కనిపించే బటన్‌ని సెలెక్ట్‌ చేయాలి. అడిగిన మొత్తం ప్రశ్నల జాబితాని చూసేందుకు ఆప్‌ హోం మెనూలోని My Previous Doubts ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. https://goo.gl/Horic7

'జవాన్ల' కథలు!

భారత జావాన్ల వీర గాధల్ని ఎన్నో రకాలుగా చదువుకున్నాం... విన్నాం... వీడియోల్లో చూశాం. మరో సారి సైనికుల పోరాట పటిమల్ని కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు మరో వేదిక సిద్ధంగా ఉంది. అదీ ఆప్‌ రూపంలో! కావాలంటే Indian War Heroes ఆప్‌ని స్మార్ట్‌ మొబైల్‌లో నిక్షిప్తం చేసుకోండి. రియల్‌ హీరోల విజయగాధల్ని కామిక్‌ బుక్స్‌, వీడియోల రూపంలో ఆప్‌లో పొందొచ్చు. కామిక్‌ బుక్‌లా చదువుకుందాం అనుకుంటే Books మెనూని సెలెక్ట్‌ చేయాలి. జాబితాగా కామిక్‌ బుక్స్‌ కనిపిస్తాయి. వాటిల్లో కావాల్సిన కామిక్‌ని సెలెక్ట్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. ఇక వీడియోల విభాగంలో జవాన్ల జీవితాలపై తెరకెక్కించిన సీరియల్‌ చిత్రాల్ని చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు https://goo.gl/KWoqf5 నుంచి పొందొచ్చు.
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. https://goo.gl/nSxb6k

గీస్తూనే ఛాట్‌

మెసెంజర్లు లేని మాటలు నెటిజన్లు వూహించలేరు. కానీ, ఎప్పుడూ ఛాటింగ్‌ టెక్స్ట్‌తోనేనా? కాస్త భిన్నంగా బొమ్మలు గీస్తూ చేస్తే! అదేనండీ... స్నేహితుడిని ఛాయ్‌ తాగడానికి రమ్మని పిలవడానికి ఛాటింగ్‌లో టీ కప్పు బొమ్మ వేసి ఆహ్వానిస్తే! మీ ఆహ్వానానికి ప్రతి స్పందనగా మిత్రుడు ఎన్ని గంటలకు? అని అడిగేందుకు గడియారం బొమ్మతో కూడిన ప్రశ్న గుర్తు వేస్తే? మీరేమో సమయాన్ని 5 పీఎం అని రాసి తిరిగి పోస్ట్‌ చేస్తే! ఇదంతా ఎలా సాధ్యం అంటారా? అయితే, మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో DRAWFT ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. రియల్‌ టైంలోనే బొమ్మలు గీస్తూ ఛాట్‌ చేసేందుకు ఇదో అనువైన వేదిక. దీంట్లో ఎక్కడా కీబోర్డ్‌ కనిపించదు. ఆప్‌ని ఓపెన్‌ చేశాక వాడుతున్న మొబైల్‌ నెంబర్‌తో సభ్యులవ్వాలి. బొమ్మలు గీసేందుకు నచ్చిన రంగుల్ని సెలెక్ట్‌ చేసుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. https://goo.gl/hRaJyl
* యాపిల్‌ ఫ్లాట్‌ఫాంలోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది.

పేస్‌బుక్‌ ఫొటోలను సులువుగా వాడొచ్చు!

పేస్‌బుక్‌ ఫొటోలను సులువుగా మేనేజ్‌ చేసుకునేందుకురూ పొందించిన Moments ఆప్‌ ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని గ్యాలరీలోని ఫొటోలను చిటికెలో మేనేజ్‌ చేయవచ్చు. ఉదాహరణకు స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లారు. అక్కడ బోల్డన్ని ఫొటోలు తీశారు. వాటిల్లో మీ మిత్రుల్ని క్లిక్‌ మనిపించిన శ్నాప్‌లూ ఉన్నాయి. అప్పుడు ఎవరి ఫొటోలు వారికి సులువుగా పంపేసి మీ ఫొటోలనూ వారితో షేర్‌ చేయాలంటే? ఇక పెద్ద పనేం కాదు. సింపుల్‌ ఫొటోలను 'మూమెంట్స్‌'లోకి అప్‌లోడ్‌ చేస్తే చాలు. ఆప్‌ అన్నీ చేసేస్తుంది. అన్ని ఫొటోలను ఒకేచోట మేనేజ్‌ చేయవచ్చు. కావాల్సిన ఫొటోలను మూమెంట్స్‌లో వెతకొచ్చు. ఆప్‌ నుంచే ఫొటోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్లలో షేర్‌ చేసే వీలుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆప్‌ని గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. https://goo.gl/vewbHm
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌లోకి వెళ్లండి. https://goo.gl/De7JMj

రాఖీకో ఆప్‌

రక్షా బంధన్‌ వచ్చేస్తోందిగా! మరి, మీరు రాఖీ ఎలా కొంటున్నారు? ఎలా పంపుతున్నారు? ప్రతి ఏడాదిలానే సంప్రదాయ పద్ధతిలోనేనా? సులువైన మార్గం ఏమైనా అన్వేషించారా? అబ్బే... అంత సమయం లేదంటారా! అయితే, జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ తీయండి. DTDC Rakhi Express ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీ అభిరుచి మేరకు రాఖీలను సెలెక్ట్‌ చేసుకుని ఆర్డర్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌ https://goo.gl/oZToUl

అప్‌డేట్స్‌కి 'దారి'

మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకో వడం కనీస బాధ్యత. అందుకే వ్యక్తిగతంగా మీకో 'పర్సనల్‌ డిజిటల్‌ మ్యాగజైన్‌' ఉంటే బాగుంటుంది కదూ! అయితే, Way2News ఆప్‌ని ప్రయత్నించండి. దేశం, రాష్ట్రాల్లో చోటు చేసుకున్న సంఘటనల్ని సంక్షిప్తంగా ఆప్‌లో చదువుకోవచ్చు. ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ వార్తాంశాల్ని అందిస్తున్నారు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక తెలుగు భాషని సెలెక్ట్‌ చేసుకుని వార్తాంశాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. తాకేతెరపై వేలితో పైకి స్క్రోల్‌ చేస్తూ ఒక్కో అప్‌డేట్‌ని చదువుకోవచ్చు. వార్తల్ని ఇతరులతో షేర్‌ చేసుకునేందుకు పైనే 'షేరింగ్‌' బటన్‌ని ఏర్పాటు చేశారు. వాట్స్‌ఆప్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయవచ్చు. కావాలంటే జీమెయిల్‌ కాంటాక్ట్‌లకూ మెయిల్‌ చేయవచ్చు కూడా. మరింత ఆసక్తిగా అనిపించిన వాటిని ఆప్‌ నుంచి సరాసరి 'గూగుల్‌ కీప్‌'లోకి పంపుకునే వీలుంది. ఆప్‌ హోం పేజీలోని మెయిన్‌ మెనూని సెలెక్ట్‌ చేసి విభాగాల వారీగా వార్తాంశాల్ని బ్రౌజ్‌ చేయవచ్చు. ఇప్పటికి తెలుగు, హిందీ భాషల్లోనే ఆప్‌డేట్స్‌ని అందిస్తున్నారు. డౌన్‌లోడ్‌ లింక్‌ https://goo.gl/ijYxZd

అందుబాటులో ఎవరున్నారు?

అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేం. తెలిసిన ఫ్యామిలీ డాక్టర్‌ ఉంటే సరే! కానీ, మీరు ఉంటున్న ప్రాంతంలో ఎవ్వరూ తెలియకపోతే? అనారోగ్య సమస్యకి తగిన వైద్యుడిని వెతకడం ఎలా? సింపుల్‌... చేతిలోకి స్మార్ట్‌ ఫోన్‌ తీసుకోండి. Practo ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. దేశంలోని ప్రధాన నగరాల్లోని వైద్యుల వివరాల్ని తెలుసుకునేందుకు ఇదో అనువైన ఆప్‌. ఓపెన్‌ చేయగానే సెర్చ్‌బాక్స్‌ కనిపిస్తుంది. దాంట్లో మీరు ఉన్న లొకేషన్‌ని ఎంటర్‌ చేయాలి. తర్వాత బాక్స్‌లో వ్యాధి లక్షణాల్ని ఎంటర్‌ చేస్తే చాలు. సెర్చ్‌ రిజల్ట్స్‌ వచ్చేస్తాయి. డాక్టర్‌, ఆసుపత్రి పేరు, అనుభవం, కస్సల్టేషన్‌ ఫీజు... లాంటి మరిన్ని వివరాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. అంతేకాదు... ఎంపిక చేసుకున్న ఆసుపత్రి మీరు ఉన్న లొకేషన్‌కి ఎంత దూరంలో ఉందో చూడొచ్చు. ఆసుపత్రి వివరాల పక్కనే కనిపించే 'కాల్‌' ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి ఫోన్‌ నెంబర్‌ చూడొచ్చు. ఆప్‌ నుంచే సరాసరి అపాయిట్‌మెంట్‌ తీసుకుందాం అనుకుంటే వివరాల పక్కన ఉన్న 'బుక్‌' ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/EKaoHh

లైట్‌గా వాడండి

స్మార్ట్‌ ఫోన్‌ని 2జీ నెట్‌వర్క్‌తోనే వాడుతున్నారా? మీరు ఉన్న ప్రాంతంలో నెట్‌వర్క్‌ సరిగా ఉండదా? అయినప్పటికీ మీ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్‌ని చిటికెలో చూడొచ్చు. అదెలా సాధ్యం? ఫోన్‌లో ఫేస్‌బుక్‌ని ఇన్‌స్టాల్‌ చేయడానికే బోల్డంత మెమొరీ తీసుకుంటుంది. ఇక లోడ్‌ అవ్వడమూ అంతే! నెమ్మదిగా అప్‌డేట్స్‌ని చూపిస్తుంది. ఇలాంటిది, నెట్‌వర్క్‌ సరిగా లేకున్నా ఫేస్‌బుక్‌ని ఎలా వేగంగా యాక్సెస్‌ చేయవచ్చు? అనే సందేహం కచ్చితంగా వస్తుంది. అందుకే గూగుల్‌ ప్లేలోకి వెళ్లండి. Facebook Lite ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ఇన్‌స్టాలేషన్‌కి తీసుకునే మెమొరీ ఎంతో తెలుసా? 1 ఎంబీ కంటే తక్కువే. అత్యంత తక్కువ నెట్‌వర్క్‌ డేటాని తీసుకుని చిటికెలో ఇన్‌స్టాల్‌ అవుతుంది. తాకేతెరపై Lite పేరుతోనే కనిపిస్తుంది. ఓపెన్‌ చేస్తే సులువైన ఇంటర్ఫేస్‌తో ఎఫ్‌బీ హోం పేజీ కనిపిస్తుంది. వాల్‌పై ఫొటోలు మాత్రం థంబ్‌నెయిల్స్‌ వ్యూలోనే కనిపిస్తాయి. వాటిపై తాకి ఫుల్‌స్క్రీన్‌లో ఫొటోని చూడొచ్చు. ఎప్పుడు ఆప్‌ని ఓపెన్‌ చేసినా తెరని నొక్కి ఉంచి కిందికి లాగడం ద్వారా కొత్త ఆప్‌డేట్స్‌ని చూడొచ్చు. హోం పేజీలోని సెర్చ్‌తో కావాల్సిన డేటాని వెతకొచ్చు. అలాగే, హోం స్క్రీన్‌ మెనూలోని Chat ఓపెన్‌ చేయవచ్చు. అదే మెనూలో మీ ప్రొఫైల్‌, పోస్ట్‌ చేసిన పొటోలను చూడొచ్చు. ప్రస్తుతం ఆప్‌ వీడియోలను సపోర్ట్‌ చేయదు. త్వరలోనే వీడియోలను ప్లే అయ్యేలా చేస్తామని ఫేస్‌బుక్‌ నిర్వాహకులు చెబుతున్నారు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు https://goo.gl/BVIIpT లింక్‌లోకి వెళ్లండి.

వ్యాకరణానికి ఒకటి

భాషపై పట్టు సాధించాలంటే? కచ్చితంగా వ్యాకరణానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిందే. అదీ ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనుకునేవారికి వ్యాకరణం మరింత అవసరం. అందుకే బుల్లి తెరపైనా ఇంగ్లిష్‌ గ్రామర్‌ నేర్చుకునేందుకు అనువైన ఆండ్రాయిడ్‌ ఆప్‌ ఒకటి ఉంది. అదే English Grammar Ultimate. ఆప్‌ని ఓపెన్‌ చేస్తే అంశాల వారీగా వ్యాకరణ పాఠాలు కనిపిస్తాయి. Active or Passive Voices, Adjectives, Adverbs, Articles... ఇలా అంశాల వారీగా జాబితా పొందుపరిచారు. మీరు నేర్చుకోవాలనుకునే పాఠాన్ని సెలెక్ట్‌ చేస్తే Introduction, Usage, Statements రూపంలో మెటీరియల్‌ కనిపిస్తుంది. ఉదాహరణలతో పాటు వివరిస్తూ వ్యాకరణ మెటీరియల్‌ని రూపొందించారు. ప్రయత్నిద్దాం అనుకుంటే http://goo.gl/XBG1zc లింక్‌లోకి వెళ్లండి.

ఆప్‌తో రాయొచ్చు!

తాకేతెరపై స్త్టెలస్‌తో రాయడం తెలుసు... వేలితో ఎప్పుడైనా రాశారా? అలా రాసింది డిజిటల్‌ టెక్స్ట్‌లా మారితే! అదెలా సాధ్యం అంటారా? అయితే, గూగుల్‌ అందించే ఆప్‌ ఉండాల్సిందే. అందుకు Google Handwriting Input ఆప్‌ అందుబాటులోకి వచ్చింది. రన్‌ చేసిన తర్వాత తెరపై వచ్చే ఆప్షన్స్‌ని ఒక్కొక్కటిగా ఎనేబుల్‌ చేస్తూ వెళ్లొచ్చు. ముందుగా Enabel Google Handwriting Input ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. దీంతో సెట్టింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి. అక్కడ కనిపించే 'గూగుల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ ఇన్‌పుట్‌'ని ఎనేబుల్‌ చేయాలి. అవసరమైన యాడ్‌ఆన్‌ ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత Choose input method ద్వారా ఇంగ్లిష్‌ భాషని సెలెక్ట్‌ చేయాలి. మొత్తం ప్రక్రియ ముగిశాక అక్కడే వేలితో రాసి సరి చూసుకోవచ్చు. ఇక మీరు ఏది టైప్‌ చేయాలన్నా రాయడమే. ఉదాహరణకు వాట్సప్‌ ఓపెన్‌ చేసి టైప్‌ బాక్స్‌లోకి వెళ్తే అక్కడ ఖాళీగా టైప్‌బోర్డ్‌ వస్తుంది. దానిపై మీరు పంపాలనుకునే మెసేజ్‌ని టైప్‌ చేయడమే. అక్షరం, పదం వేలితో రాయడం ముగియగానే డిజిటల్‌ టెక్స్ట్‌ టైప్‌ బాక్స్‌లో వచ్చేస్తుంది. ఇంకా ఫోన్‌లోని కాంటాక్ట్‌లను రాస్తూనే వెతకొచ్చు. ఎక్కడ టెక్స్ట్‌ ఇన్‌పుట్‌ ఇవ్వాలన్నా ఇక రాయడమే. అంతేకాదు... బోర్డ్‌ పై భాగంలో రాసిన రాతని సరిపడే పదాల్ని జాబితాగా సూచిస్తుంది. సెలెక్ట్‌ చేస్తే రాసిన మేటర్‌లోకి పదం చేరిపోతుంది. టెక్స్ట్‌ ఒక్కటే కాదు. ఎమోటికాన్స్‌ని కూడా గీయవచ్చు. వేలితో రాసి బోర్‌ కొట్టినా... కష్టంగా అనిపించినా ఇన్‌పుట్‌ విధానాన్ని తిరిగి కీబోర్డ్‌లోకి మార్చేయవచ్చు. అందుకు రైటింగ్‌ బోర్డ్‌ కింద కనిపించే గ్లోబ్‌ గుర్తుపై తాకితే చాలు. English Android Keyboard ఆప్షన్‌తో తిరిగి ఆండ్రాయిడ్‌ కీబోర్డ్‌ని ఇన్‌పుట్‌గా పొందొచ్చు. ఆండ్రాయిడ్‌ 4.0.3 వెర్షన్‌ లేదా ఆపై లేటెస్ట్‌ వెర్షన్స్‌తో కూడిన మొబైళ్లు, ట్యాబ్లెట్‌ల్లో ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు. ఆప్‌ డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/A6La3w లింక్‌ని చూడండి.

ఇలా ట్యాబ్‌లోనే!

బోర్‌ అనిపిస్తే చాలు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటాం. ఛానల్స్‌ క్రియేట్‌ చేసుకుంటాం. కొత్త ఛానల్స్‌ బ్రౌజ్‌ చేసి సభ్యత్వం తీసుకుంటాం. ఏది చేసినా అధికారిక యూట్యూబ్‌ వేదికపైనే. కానీ, మీరు వాడుతున్న బ్రౌజర్‌లోని ట్యాబ్‌ విండోని యూట్యూబ్‌ వీడియోల ప్లేయర్‌గా మార్చేస్తే! అదెలా సాధ్యం అంటారా? మీరు క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే ఓ చిట్కా ఉంది. అదే myTab online. క్రోమ్‌ అందించే వెబ్‌ స్టోర్‌లోకి వెళ్లి బ్రౌజర్‌కి ఆప్‌ రూపంలో జత చేయవచ్చు. ఇక ఎప్పుడు యూట్యూబ్‌ వీడియోలు చూడాలనుకున్నా ఆప్‌పై క్లిక్‌ చేస్తే కొత్త ట్యాబ్‌లో సర్వీసు ఓపెన్‌ అవుతుంది. డీఫాల్ట్‌గా కొన్ని వీడియోలు థంబ్‌నెయిల్‌ బాక్సుల్లో కనిపిస్తాయి. చూడాలనుకుంటే క్లిక్‌ చేయండి చాలు. ఒకవేళ మీరు చూడాలనుకునే వీడియోలను వెతకాలనుకుంటే సెర్చ్‌బాక్స్‌ ఉంది. మీరు చూడాలనుకునే ఆల్బమ్‌ పేరుని ఎంటర్‌ చేసి సెర్చ్‌ కొడితే చాలు. వరుసగా ఆల్బమ్‌లోని వీడియోలు వచ్చేస్తాయి. క్లిక్‌ చేసి ఒక్కోటి చూడొచ్చు. హై డిఫినెషన్‌లో వీడియోలు ప్లే అవుతాయి. ఆడియో మాత్రమే విందాం అనుకుంటే వీడియోను మినిమైజ్‌ చేసుకునే వీలుంది. అందుకు వీడియో పైభాగంలోని మైనస్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. వాల్యూమ్‌ బార్‌ వీడియో ప్లేయర్‌కి ఎడమవైపు చూడొచ్చు. ఆప్‌ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్పులు చేయవచ్చు. ప్రయత్నిద్దాం అనుకుంటే http://goo.gl/1yDy3j లింక్‌లోకి వెళ్లండి.

ఫేస్‌బుక్‌ వాడితే...

ఛాటింగ్‌ ముచ్చట్లకు వేదికలు ఒకటా... రెండా! వాటిల్లో ఫేస్‌బుక్‌ మెస్సెంజర్‌ ఒకటి. టెక్స్ట్‌, ఎమోటికాన్స్‌, ఇమేజ్‌లు, క్లిప్‌ఆర్ట్‌లు... లాంటి మరిన్ని మాధ్యమాలతో ఛాటింగ్‌ చేస్తున్నారు. భిన్నంగా సౌండ్‌ క్లిప్‌లను పోస్ట్‌ చేస్తూ ఎప్పుడైనా ఛాటింగ్‌ని మరింత ఆహ్లాదకరంగా మార్చారా? అయితే, మీరు Sound Clips for Messenger ఆప్‌ని వాడి చూడండి. ఆప్‌ హోం పేజీలో ఐకాన్‌ గుర్తులతో సౌండ్‌ క్లిప్స్‌ కనిపిస్తాయి. Happy, LOL, Sad, Angry, Animals, Phrases... పేర్లతో విభాగాలుగా పొందుపరిచారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీ విభాగంలోకి వెళ్లి Baby Laughing, Crowd Laughing... లాంటి ఇతర క్లిప్స్‌ని సెలెక్ట్‌ చేసి ఫేస్‌బుక్‌ మెస్సెంజర్‌లో పంపొచ్చు. ఇలాగే, మీరున్న చోట వర్షం పడుతుందన్న విషయాన్ని సౌండ్‌ క్లిప్‌ ద్వారా చెప్పాలనుకుంటే Weather మెనూలోకి వెళ్లి Rain సెలెక్ట్‌ చేసి పంపొచ్చు. ఇలా మెస్సెంజర్‌లో పోస్ట్‌ చేసిన వాటిని అక్కడే రీప్లే చేసుకుని వినొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. ఆప్‌ డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/nV979k లింక్‌లోకి వెళ్లండి.

ఎన్ని డ్రైవ్‌లు అయినా..

అవసరం నిమిత్తం సిస్టంకి ఎక్కువ యూఎస్‌బీ డ్రైవ్‌లను కనెక్ట్‌ చేస్తున్నారా? అయితే, వాటిని సులువైన పద్ధతిలో మేనేజ్‌ చేసుకోవాలంటే? అదనపు టూల్‌ ఉంటే బాగుంటుంది. అదే USBDeview. కనెక్ట్‌ చేసిన అన్ని డ్రైవ్‌ల పేర్లు, సీరియల్‌ నెంబర్లు, తేదీ... లాంటి ఇతర వివరాల్ని చూపిస్తుంది. అప్పటికి కనెక్ట్‌ చేసి ఉన్నవి మాత్రమే కాదు. గతంలో వాడిన వాటి వివరాల్ని కూడా అందిస్తుంది. టూల్‌లో నిక్షిప్తమైన మొత్తం డ్రైవ్‌ల సమాచారాన్ని వివిధ ఫైల్‌ ఫార్మెట్‌ల్లో ఎక్స్‌పోర్ట్‌ చేసుకునే వీలుంది. డ్రైవ్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ కూడా చేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/1U39BI లింక్‌ని చూడండి.

కునుకుకో ఆప్‌

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మీరూ ఓ ఉద్యోగా? పని ఒత్తిడి ఎక్కువా? రోజులో ఏదైనా సమయంలో చిన్న కునుకు తీస్తే! మళ్లీ రీఛార్జ్‌ అయ్యి పని చేయవచ్చు కదా! బాగానే ఉందిగానీ... కునుకే కదాని కన్ను మూస్తే ఎప్పటికి లేస్తామో? అనేగా సందేహం. అయితే, స్మార్ట్‌ మొబైల్‌ తీయండి. 'పవర్‌న్యాప్‌' ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ఆప్‌ని వాడేటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఎంత సమయం మీరు కునుకు తీస్తారనేది చెప్పి సెట్‌ చేయాలి. న్యాప్‌ సమయాన్ని 5, 10, 15, 20... నిమిషాలకు సెట్‌ చేసుకోవచ్చు. ఇక మిమ్మల్ని నిద్ర లేపేందుకు వాడే 'వేక్‌ఆప్‌ మెలోడీ'ని మీరే సెట్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఫోన్‌ని వాడుతుంటే గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

తెలుగులోనే...

ఏదైనా తెలుగు పదానికి ఇంగ్లిష్‌ అర్థం కావాలంటే? వెంటనే నిఘంటువు తీస్తాం. పేజీలు తిరగేస్తాం. ఒక్కో పదం చూస్తాం. అంత కష్టం అక్కర్లేదు. జేబులో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని లాక్‌ ఓపెన్‌ చేసినా సరిపోతుంది. ఎందుకంటే Telugu- English Dictionary ఆప్‌ ఉంది. ఆప్‌ హోం పేజీలోని సెర్చ్‌బాక్స్‌ ఉంటుంది. దాంట్లో ప్రత్యేక తెలుగు కీబోర్డ్‌ ద్వారా పదాల్ని టైప్‌ చేసి ఇంగ్లీష్‌ అర్థాన్ని చూడొచ్చు. టైప్‌ చేయకుండానే డ్రాప్‌డౌన్‌ మెనూలో ఉన్న తెలుగు పదాల్ని స్క్రోల్‌ చేసి కూడా తెలుగు పదాల్ని ఎంపిక చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. చిటికెలో ఆంగ్ల పదానికి తెలుగులో అర్థం తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకుందాం అనుకుంటే http://goo.gl/3WFaW8 లింక్‌లోకి వెళ్లండి.

ఆప్స్‌ వాడుకోండి

గ్యాడ్జెట్‌లే కాదు. స్మార్ట్‌ మొబైల్‌లో ప్రత్యేక ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని కూడా జ్ఞాపకాల్ని భద్రం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
Evernote Food
స్నేహితులతోనో... కుటుంబ సభ్యులతోనో కలిసి భోజనం చేయడం చాలా సరదాగా ఉంటుంది. మరి, అలాంటి విలువైన జ్ఞాపకాల్ని రికార్డ్‌ చేసుకునేందుకు అనువైన ఆప్‌ ఇది. ఉదాహరణకు వారాంతంలో ఏదైనా హోటల్‌లో మీరు తిన్న ఆహారాన్ని ఫొటోలు తీసి ఆప్‌లో దాచుకోవచ్చు. ఆప్‌ మీరు ఉన్న లోకేషన్‌ వివరాల్ని కూడా అందిస్తుంది. అంతేకాదు... మీరు తిన్న వంటకానికి సంబంధించిన వివరాల్ని కూడా జత చేయవచ్చు. వంటకాన్ని ఎలా వండాలనేది కూడా వివరించొచ్చు. మొత్తం విషయాన్ని స్నేహితులతో పంచుకునే వీలుంది. ఆప్‌ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసిన వంటల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఇష్టమైన వంటలతో My Cookbook క్రియేట్‌ చేసుకోవచ్చు. http://goo.gl/LvCBrc
DayCatcher Journal
మదిలో ఎప్పటికప్పుడు ఏవేవో ఆలోచనలు... అనుభవాలు... అన్నింటినీ సులువైన ఇంటర్ఫేస్‌తో రాసుకోవాలనుకుంటే? ఈ ఆప్‌ని ప్రయత్నించొచ్చు. రోజులోని 24 గంటల్లో ఏ నిమిషంలోనైనా ఓ విలువైన ఆలోచన రావచ్చు. అప్పటికప్పుడే వాటిని నోట్‌ చేసుకునేందుకు అనువైన డైరీ. రాసుకున్న నోట్స్‌కి ఫొటోలు జత చేయవచ్చు. రోజువారీ పనుల్ని మేనేజ్‌ చేసుకునేందుకు కూడా అనువైంది. ఎందుకంటే అన్నింటికీ రిమైండర్స్‌ని సెట్‌ చేసుకోవచ్చు. http://goo.gl/lEp8xU
Friday
వారాంతం వచ్చిందంటే చాలు. రిలాక్స్‌ అవుతాం. ఎప్పుడైనా రిలాక్స్‌ అయినప్పుడు గతం తాలూకు జ్ఞాపకాల్ని ఓసారి నెమరు వేసుకుందాం అనుకుంటే? ఈ ఆప్‌ని ఓపెన్‌ చేయండి చాలు. వారం మొత్తం మీరేం చేశారు? ఎక్కడెక్కడ తిరిగారు? సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై మీ అప్‌డేట్స్‌ ఏంటి? ఏం పాటలు విన్నారు?.... లాంటి మొత్తం వివరాల్ని క్షణాల్లో అందిస్తుంది. కావాలంటే ఆయా జ్ఞాపకాల్ని స్నేహితులతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయవచ్చు. http://goo.gl/Q9txAX
Dreamboard
కలలు కనాలి... వాటిని నిజం చేసుకోవాలి. ఇదో జీవిత సారం. మరి, మీరు ఎలాంటి కలలు కంటున్నారు. అవి వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటున్నాయి. తెలుసుకోవాలంటే? ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని చూడండి.కలకి సంబంధించిన వివరాలు ఆప్‌లో ఎంటర్‌ చేయాలి. అంటే... Narration, Mood, Type... లాంటి వివరాలన్నమాట. కలపై మీ భావాన్ని ఎమోటికాన్స్‌ రూపంలో తెలపొచ్చు. ఇక 'డ్రీమ్స్‌ జర్నల్‌' మెనూ ఓపెన్‌ చేసి నెలలో మీరు కన్న మొత్తం కలలు, వాటి తాలూకు భావజాలాల్ని విశ్లేషించొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో కలల డైరీ అన్నమాట. http://goo.gl/90YO5g
Wally+
జ్ఞాపకాలు... అనుభవాలు.. ఆశలు... ఆలోచనలు... ఇలాంటివేనా భద్రం చేసుకునేది. ఖర్చు మాటేంటి? ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? సందర్భానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి? రోజువారీ ఆదాయ, వ్యయాలు ఏంటి? లాంటి మరిన్ని వివరాల్ని ఆప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆప్‌లోని మరో ప్రత్యేకత అంశం ఏంటంటే? పీజీఎస్‌ సౌకర్యంతో ఏయే ప్రాంతాల్లో ఖర్చు చేశారో కూడా తెలుసుకోవచ్చు.ముఖ్యమైన ఫైనాన్షియల్‌ అప్‌డేట్స్‌ని నోటిఫికేషన్స్‌ రూపంలో పొందొచ్చు. http://goo.gl/05zNfB

బుల్లి తెరపై...

కొత్త ఏడాది వచ్చిందంటే... ఎన్నో కలలు, ప్రణాళికలు. వాటన్నింటినీ అక్షరాల్లో లిఖించి వాస్తవానికి దగ్గరగా... ఆచరణలోకి తీసుకురావాలంటే? అందుకో డైరీ కచ్చితంగా ఉండాల్సిందే. రోజూ రాయాల్సిందే. మరి, మీరే డైరీ వాడుతున్నారు? డిజిటల్‌ డైరీ ప్రయత్నించారా? అదీ మీ బుల్లితెరపైనే. ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌ ఓఎస్‌తో మొబైల్‌ వాడుతున్నట్లయితే Private Diary Free ఆప్‌ని ప్రయత్నించండి. డైరీకి ముందుగానే పాస్‌వర్డ్‌ని పెట్టుకోవచ్చు. సాధారణ డైరీ మాదిరిగానే తేదీల వారీగా ఎంట్రీలు కనిపిస్తాయి. డైరీ నోట్స్‌కి ఫొటోలను ఎటాచ్‌చేసి పెట్టుకోవచ్చు. ఎంట్రీలను కావాలంటే మెయిల్‌ చేసే వీలుంది. డైరీ ఆకట్టుకునేలా ఉండేందుకు థీమ్స్‌ని మార్చుకోవచ్చు. http://goo.gl/9639S7, http://goo.gl/gBj9dv

ఆరోగ్యానికో 'సిస్టం'

స్మార్ట్‌ మొబైల్‌ వాడతారు. ఆప్స్‌ని ప్రయత్నిస్తారు. బిల్లు చెల్లిస్తారు. ఇంకా ఎన్నెన్నో చేస్తారు. కానీ, వాడుతున్న మొబైల్‌తో ఆరోగ్యంపై ఎప్పుడైనా నిఘా వేశారా? అందుకు అనువైన సిస్టం గురించి వెతికే ప్రయత్నం చేశారా? అయితే కచ్చితంగా మీరు PEAR Training Intelligence KIT గురించి తెలుసుకోవాల్సిందే. ఒక బ్లూటూత్‌ హార్ట్‌రేట్‌ మానిటర్‌, ఇయర్‌ఫోన్‌, ట్రైయినింగ్‌ ఆప్‌. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లలో ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని స్మార్ట్‌గా ఆరోగ్యంపై నిఘా పెట్టొచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక బ్లూటూత్‌ హార్ట్‌రేట్‌ మానిటర్‌ని ధరించి గుండె లయని ట్రాక్‌ చేయవచ్చు. హార్ట్‌రేట్‌ మానిటర్‌ బ్యాండ్‌ని చిత్రంలో మాదిరిగా ఛాతికి కట్టుకోవచ్చు. ఒక్కసారి హార్ట్‌రేట్‌ని ట్రాక్‌ చేశాక సలహాలు, సూచనల్ని చేతిలోని ఇయర్‌ఫోన్‌ ద్వారా వెంటనే వినొచ్చు. చేయాల్సిన వ్యాయామం, ప్రయోజనాలు వినొచ్చు. అంతేకాదు... ప్రేరణ కలిగించే ఆరోగ్య చిట్కాల్ని ఇయర్‌ఫోన్స్‌ అందిస్తాయి. ఇక మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్‌ ద్వారా మీ రోజువారీ వర్క్‌అవుట్స్‌ వివరాల్ని ట్రాక్‌ చేసి చూడొచ్చు. ఉదాహరణకు పరిగెత్తిన దూరం, అందుకు పట్టిన సమయం, ఖర్చయిన కేలరీలు... లాంటి వివరాలు అన్నమాట. ఇయర్‌ ఫోన్స్‌తో ఫోన్‌లోని మ్యూజిక్‌ ట్రాక్స్‌ని కూడా వినొచ్చు. అంతేకాదు... ఇయర్‌ఫోన్స్‌ చెవులకు పెట్టుకునేందుకు అనువుగా తయారు చేశారు. http://goo.gl/s9tg9z

కొత్తగా రెండు..

అందరి ఫోన్లూ స్మార్టే. ఏది ఆసక్తిగా కనిపించినా క్లిక్‌ మనిపిస్తుంటారు. వివిధ సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేస్తుంటారు. మరి, ఏవి ఎక్కడ షేర్‌ చేశామన్న విషయాన్ని కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంటాం. కానీ, మీకు తెలుసా? మీ ఫొటో షేరింగ్‌ని పూర్తిస్థాయిలో రివ్యూ చేసేందుకు ప్రత్యేక ఆప్‌ ఉంది. అదే Kwilt. ఐఫోన్‌ యూజర్లకు ఇది ప్రత్యేకం. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక మీరు వాడుతున్న అన్ని సోషల్‌ నెట్‌వర్క్‌ వివరాలతో దీంట్లోకి లాగిన్‌ అయితే సరి. ఫొటోలన్నింటినీ వివిధ రకాలుగా అమర్చుకోవచ్చు. ఆప్‌ నుంచే ఫొటోలు తీసుకుని సరాసరి మిత్రులతో షేర్‌ చేయవచ్చు. ఫొటోలను కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకునే వీలుంది. ఆల్బమ్స్‌ని కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకునే వీలుంది. వ్యక్తిగతమైన ఫొటోలను మాయం చేయవచ్చు. తెరపై ఉన్న వాటిని స్క్రీన్‌షాట్‌ తీసుకునే వీలుంది. ఆప్‌ కోసం http://goo.gl/cnawXz లింక్‌లోకి వెళ్లండి.
* ఇలాంటిదే మరో ఫొటో మేనేజ్‌మెంట్‌ ఆప్‌ Mylio. వృత్తిపరంగా ఫొటోగ్రఫీ చేసేవారికి ప్రత్యేకం. తీసుకున్న అన్ని ఫొటోలను సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. ఫేస్‌బుక్‌, ఫ్లిక్కర్‌, ఎస్‌డీకార్డ్‌, కెమెరాల్లోని అన్ని ఫొటోలను సింక్‌ చేసి ఒకేచోట ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు. Calender, People, Locations... ఆధారంగా ఫొటోలను కావాల్సినట్టుగా వెతుక్కునే వీలుంది. మరిన్ని అదనపు సర్వీసులు చాలానే ఉన్నాయి. వాడదాం అనుకుంటే http://goo.gl/gqeKDP లింక్‌ని చూడండి.

కేలరీలెన్ని?

స్మార్ట్‌ఫోన్ల శకం మొదలయ్యాక యూత్‌ పని తేలికైంది. ఏ ఫుడ్‌లో ఎన్ని కేలరీలున్నాయో చెప్పే ఆప్స్‌ సెల్‌ఫోన్లలో నిక్షిప్తం అయిపోతున్నాయ్‌. ఎవరికి ఏం కావాలో కొలిచి మరీ తినేస్తున్నారు. కానీ రోజుకు ఇన్ని కేలరీలు మాత్రమే తీసుకోవాలనుకుంటే అవి ఏఏ పదార్థాల్లో దొరుకుతాయో చెప్పే ఆప్స్‌ మాత్రం ఇంతవరకు రాలేదు. ఆ కొరత తీర్చడానికే Calorific వచ్చింది. ఇందులో మనం కేలరీలు టైపు చేస్తే చాలు ఏఏ పదార్థాల్లో అవి దొరుకుతాయో చిత్రాలతో సహా తెరపై ప్రత్యక్షం అవుతాయి. రోజువారీ తీసుకునే వేరుశనగ, టమాటా, బర్గర్‌, బెర్రీస్‌, .. ఇలా నూట నలభై ఫుడ్స్‌ వేల ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు. నిక్‌ ముల్వానీ ఈ ఆప్‌ సృష్టికర్త.

కృతజ్ఞతలు మిత్రమా!

ముఖపుస్తకం... ప్రస్తుతం ప్రపంచంలో స్నేహ పరిమళాలు విరబూయిస్తున్న వేదిక ఇది. మనసుల మధ్య దూరం తగ్గిస్తున్న సాధనమిది. మరి ఇందులో మీతో స్నేహం చేస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పాలనుందా! మీకోసం ఫేస్‌బుక్‌ ఆ అవకాశాన్ని తీసుకొచ్చింది. 'సే థ్యాంక్స్‌' పేరుతో ఒక ఆప్‌ను సిద్ధం చేసింది. అందులోకెళ్లి మీ స్నేహితుడిని ఎంచుకుంటే... మీ ఇద్దరి స్నేహం గురించి తెలిపే విధంగా నిమిషం నిడివి ఉన్న వీడియో ప్లే అవుతుంది. దాన్ని మీ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసుకోవచ్చు. మీ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, కలసి పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఈ వీడియోను రెండు రకాల ఫార్మెట్‌లలో రూపొందించుకునే అవకాశం కూడా ఉంది. మరి మీ స్నేహితులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పడానికి సిద్ధమా.

నీళ్లు తాగండి బాబూ

రోజూ ఎక్కువ పరిమాణంలో నీళ్లు తాగండి... ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు వైద్యులు. అయితే ఉద్యోగుల విషయంలో ఇది కష్టమే. పని ఒత్తిడిలో భోజన సమయం మరచి పోతున్న వాళ్లూ ఉన్నారు. దీంతోపాటు ఒకేసారి అంత మోతాదులో నీళ్లు తీసుకోవడమూ కష్టమే. ఇలాంటి సమయంలో 'మీరు నీళ్లు తాగే సమయం వచ్చింది' అంటూ ఎవరైనా గుర్తు చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మీ చేతిలో తాకేతెర ఫోన్‌ ఉంటే ఇది సాధ్యమే. 'వాటర్‌ యువర్‌ బాడీ' పేరుతో ఓ ఆప్‌ను రూపొందించారు. ఇందులో మీ బరువు ఎంటర్‌ చేస్తే మీరు రోజుకి ఎంత పరిమాణంలో నీరు తాగాలి అనేది చూపిస్తుంది. అంతేకాదు.. ప్రతి గంటకోసారి నీళ్లు తాగమని గుర్తు చేస్తుంది. మీరు తీసుకున్న నీటి పరిమాణాన్ని అందులో పొందుపరిస్తే ఇంకా ఎంత నీరు తాగాలో చూపిస్తుంది. బాగుంది కదా ఈ నేస్తం.

వీడియోలు, ఫొటోలు కనిపించవు

మొబైల్‌ మెమొరీలో చాలానే భద్రం చేస్తుంటాం. డాక్యుమెంట్స్‌తో పాటు వీడియోలు, ఫొటోలు కచ్చితంగా ఉంటాయి. మరి, వాటిల్లో ఏవైనా కొన్ని వీడియోలు, ఫొటోలను ఇతరుల కంటపడకుండా చేయాలంటే? ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుకో ఆప్‌ ఉంది. అదే Gallery Vault-Hide Video&Photo ఆప్‌ని ప్రయత్నించండి. తెరపై వచ్చిన గుర్తుపై తాకి ముందుగా పాస్‌వర్డ్‌ని సెట్‌ చేసుకోవాలి. ఇక గ్యాలరీలోని ఏదైనా వీడియోని మాయం చేయాలంటే సెలెక్ట్‌ చేసి Add Video ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఇమేజ్‌ ఫైల్స్‌ని హైడ్‌ చేసేందుకు Add Picture ఉంది. ఇలా మాయం చేసిన అన్నింటినీ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా Gallery Vault లో చూడొచ్చు. సరాసరి ఫోన్‌ కెమెరాతో క్లిక్‌ కొట్టిన వాటిని వెంటనే మాయం చేసేందుకు Capture Picture ఆప్షన్‌ ఉంది. హైడ్‌ చేసిన మొత్తం మీడియా ఫైల్స్‌ అన్నీ ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లో సేవ్‌ అవుతాయి. ఆప్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే http://goo.gl/395BXZ లింక్‌లోకి వెళ్లండి.

'లైట్‌' ఉందా?

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని స్మార్ట్‌ మొబైళ్లలోనూ ఫ్లాష్‌లైట్‌ ఉంటుంది. ఫొటోలు తీసేప్పుడే కాదు. కరెంటు పోయినప్పుడు టార్చ్‌లైట్‌గా వాడుకుంటున్నారు కూడా. మీకు తెలుసా? ఫ్లాష్‌లైట్‌ని మరో రకంగా వాడుకోవచ్చు. మీరు చీకట్లో దూరంగా ఎక్కడైనా ఉన్నప్పుడు ఫ్లాష్‌లైట్‌ని 'బ్లింక్‌' కొడుతూ ఇతరులకు సంకేతాలు ఇవ్వొచ్చు. అంతేకాదు... బ్లింక్‌ కొట్టే సమయంలో శబ్దం వచ్చేలా చేయవచ్చు కూడా. అందుకు అనువైన ఆప్‌ Super-Bright LED Flashlight. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత హోం స్క్రీన్‌లోని బటన్‌ నొక్కి ఫ్లాష్‌లైట్‌ని ఆన్‌ చేయవచ్చు. లైట్‌ని బ్లింక్‌ అయ్యేలా చేసేందుకు Strobe బటన్‌న్ని జరిపితే చాలు. వేగంగా లైట్‌ బ్లింక్‌ అవుతుంది. బ్లింక్‌ అయ్యే వేగాన్ని పెంచడం, తగ్గించడం చేయవచ్చు. ఆప్‌ని పొందేందుకు http://goo.gl/OoXiDn లింక్‌లోకి వెళ్లండి.

Swip-Lock ఆప్‌..

స్మార్ట్‌ ఫోన్‌కి వివిధ రకాలుగా తాళం వేస్తుంటాం. మరి, మీరు ఎలా లాక్‌ చేస్తున్నారు? కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకుంటే Swip-Lock ఆప్‌ని ప్రయత్నించండి. మొబైల్‌ హోం స్క్రీన్‌పై ఎంపిక చేసుకున్న చోట వేలితో ఒక్కసారి స్వైప్‌ చేస్తే చాలు. ఫోన్‌ లాక్‌ అవుతుంది. తిరిగి తాళం తీయాలంటే తెరపై ఎక్కడైతే స్వైప్‌ చేశారో అక్కడే మళ్లీ స్వైప్‌ చేస్తే సరిపోతుంది. తెరపై స్వైప్‌ ఎక్కడ చేయాలనేది సెలెక్ట్‌ చేసుకునేందుకు Activation area location ఆప్షన్‌లోకి వెళ్లాలి. స్వైప్‌ చేసేప్పుడు Activation area height ఆప్షన్‌తో ఎంత మేర స్వైప్‌ చేయాలనేది నిర్ణయించొచ్చు. ఇదే మాదిరిగా Activation area thickness కూడా మీరే నిర్ణయించొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://goo.gl/Mk2pmC లింక్‌ నుంచి ఆప్‌ని పొందండి.

సిస్టంలో మాదిరిగానే...

సిస్టంలో ఫైల్స్‌, ఫోల్డర్స్‌ని బ్రౌజ్‌ చేయడం అందరికీ బాగా అలవాటే. మొబైల్‌లోనూ ఇదే మాదిరిగా ఫైల్స్‌, ఫోల్డర్స్‌ని బ్రౌజ్‌ చేస్తే! అదెలా సాధ్యమో తెలియాలంటే Computer ఆప్‌ని ప్రయత్నించి చూడండి. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఇది ప్రత్యేకం. ఆప్‌ని రన్‌ చేసి విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌లో ఓపెన్‌ చేసినట్టుగా ఫైల్స్‌, ఫోల్డర్స్‌ని చూడొచ్చు. Open With ఆప్షన్‌తో ఫైల్‌ని ఓపెన్‌ చేసుకునే వీలుంది. ట్యాబ్‌ల రూపంలో ఫోల్డర్స్‌ని ఓపెన్‌ చేసుకోవచ్చు. 'టాస్క్‌ మేనేజర్‌' ఉంది. రన్‌ చేసి అక్కర్లేని వాటిని క్లోజ్‌ చేయవచ్చు. అన్‌ఇన్‌స్టాల్‌ చేయవచ్చు కూడా. ఇమేజ్‌ ఫైల్స్‌ని ఓపెన్‌ చేసుకునేందుకు వివిధ రకాల Viewer ఫార్మెట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/6MFG05 లింక్‌ని చూడండి.

మరింత ఆహ్లాదం

మొబైల్‌ తెర ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్‌. ఏదైనా ఆకట్టుకునే థీమ్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే Ocean GO Locker Theme ఆప్‌ ఉంది. నాలుగు రకాల ఇన్‌బిల్ట్‌ థీమ్స్‌తో 'లాక్‌ స్క్రీన్స్‌'ని ఏర్పాటు చేసుకోవచ్చు. హై క్వాలిటీ వాల్‌పేపర్లను సెట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ బిల్ట్‌ఇన్‌గా ఉన్నవి నచ్చకపోతే మీ ఫొటోలను జత చేసుకుని లాక్‌స్క్రీన్‌లను క్రియేట్‌ చేసుకోవచ్చు. తెరపై తేదీ, సమయం కనిపిస్తుంది. ఆన్‌రీడ్‌ మెసేజ్‌ నోటిఫికేషన్స్‌, మిస్డ్‌ కాల్స్‌ని వాల్‌ పేపర్‌పై చూడొచ్చు. బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు తెరపై చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆప్‌ కోసం http://goo.gl/3wde8T లింక్‌ని చూడండి

వంటింట్లోకి...

ఎంత సేపు ఆటలు... పాటలు... ఆన్‌లైన్‌ విహారాలేనా? కాసేపు వంటింట్లోకి వెళ్లి రోజుకో వంట చొప్పున సెలవుల్లో పాక శాస్త్రాన్ని పఠించండి. బాగానే ఉందిగానీ... ఏం వంటలు చేయాలి? ఎలా చేయాలి? సింపుల్‌ జేబులో నుంచి మొబైల్‌ తీయండి. నెట్‌ని ఆన్‌ చేయండి. Indian Recipes Free ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేయండి. గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక ఆఫ్‌లైన్‌లోనూ వంటల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఆప్‌లోని వంటలు సుమారు 10,000 పైనే ఉన్నాయి. http://goo.gl/11Z9UK
* ఇలాంటిదే మరోటి Sweet 'N' Spicy. కావాల్సిన వంటల్ని సెర్చ్‌ ఆప్షన్‌తో వెతకొచ్చు. http://goo.glGKRlV

పండగ... ఫొటోలు

నాణ్యమైన మెగాపిక్సల్‌ కెమెరాలతో స్మార్ట్‌లు చేతిలో ఉంటే వేరే చెప్పాలా? పండగ సందడుల్ని క్లిక్‌ మనిపించేస్తారు. మరి, బిల్ట్‌ఇన్‌గా ఉన్న కెమెరాకి అదనపు ఆప్షన్స్‌ని జత చేసి పండగ ఫొటోలను మరింత కళాత్మకంగా తీర్చిదిద్దొచ్చు తెలుసా? అందుకు అనువైన ఆప్స్‌ బోల్డన్ని. ఇవిగో కొన్నింటిని ప్రయత్నించండి. Cymera ఆప్‌ని వాడొచ్చు. ఇది ఫొటో ఎడిటర్‌గానే కాకుండా కెమెరా కంటికి అదనపు హంగులు జత చేయవచ్చు. ఫొటో క్లిక్‌ మనిపించేటప్పుడే సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. తీసిన ఫొటోలను ఎడిటింగ్‌ టూల్‌తో ఎడిట్‌ చేయవచ్చు. వెంటనే షేర్‌ చేయవచ్చు కూడా.ఆండ్రాయిడ్‌ http://goo.gl/EEhoqP లింక్‌లోకి వెళ్లండి.
* తీసిన ఫొటోలను Collageస్త్టెల్‌లో డిజైన్‌ చేసుకునేందుకు Photo Collage Editor ఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/qi3MEJ
* ఆకట్టుకునే లేఅవుట్స్‌తో ఫొటోలకు అదనపు సొగసులు అద్దేందుకు Pixlr Express ఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/Pnv6fP

వాయిద్యం ఏదైనా...

మీకు తబలా అంటే ఇష్టం... సరదాగా వాయిద్దాం అంటే ఇంట్లో లేదు! గిటార్‌ ప్లే చేయడం అంటే మరీ ఇష్టం. కానీ, కొనేంత బడ్జెట్‌ లేదు. డ్రమ్స్‌ వాయించడం మీకో డ్రీమ్‌. అదీ లేదు. కానీ, మీ చేతిలో స్మార్ట్‌ మొబైల్‌ ఉంటే ఇవన్నీ వాయించొచ్చు. అదెలా సాధ్యం అంటారా? అందుకు తగిన ఆప్స్‌ చాలానే ఉన్నాయి. కావాలంటే ప్రయత్నించి చూడండి. ముందు తబలా వాయిద్దాం. అదే పేరుతో ఉన్న Tabla ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. రన్‌ చేయగానే తెరపై తబలా వచ్చేస్తుంది. ఇక వాయించడమే. 13 రకాల స్వరాల్ని వాయించొచ్చు. వాయించేప్పుడు వీణ స్వరం తోడైతే బాగుంటుంది అనిపిస్తే తెరపై కనిపించే వీణ గుర్తుపై తాకండి. అలాగే, తెరపై రంగుల్లో చిన్న ఆకారాలు ఉంటాయి. వాటిపై తాకుతూ భిన్నమైన స్వరాల్ని పలికించొచ్చు. 'రికార్డ్‌' బటన్‌పై క్లిక్‌ చేసి వాయిస్తూనే రికార్డింగ్‌ చేయవచ్చు. ఇలా రికార్డ్‌ చేసిన వాటిని తిరిగి ప్లే చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/Kriqet మీరు ఐఫోన్‌ వాడుతున్నట్లయితే Tabla HD Freeఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. http://goo.gl/r0QmNw
* ఇప్పుడు పియానో. ఆలస్యం చేకుండా My Piano ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసేయండి. రన్‌ చేయగానే తెరపై బుల్లి పియానో వచ్చేస్తుంది. ఇక మునివేళ్లతో ప్లే చేయడమే. మరిన్ని పియానో సౌండ్స్‌ కోసం తెరపై కనిపించే పియానో గుర్తుపై క్లిక్‌ చేయండి. 11 రకాల వాయిద్యాల్ని సెలెక్ట్‌ చేసుకుని ప్లే చేయవచ్చు. అలాగే, సౌండ్‌ ఎఫెక్ట్‌లను కూడా మార్చుకోవచ్చు.సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేసి మార్చుకోవచ్చు. ప్లే చేస్తూ రికార్డింగ్‌ కూడా చేయవచ్చు. http://goo.gl/1rd0lU యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి
Real Pianoఆప్‌ని పొందొచ్చు. http://goo.gl/1HzGbM
* ఇంకా డ్రమ్స్‌ వాయించాలనే కోరిక ఉంటే Real Drum ఆప్‌ని నిక్షిప్తం చేసుకోండి. 13 రకాల డ్రమ్‌ ప్యాడ్స్‌ ఉన్నాయి. అన్నిటిపై 19 రకాల స్వరాల్ని ప్లే చేయవచ్చు. 12 బ్యాక్‌గ్రౌండ్‌ ట్రాక్స్‌ కూడా ఉన్నాయి. దీంట్లోనూ ప్లే చేస్తూ రికార్డింగ్‌ చేయవచ్చు. టుటోరియల్‌ మోడ్‌ సెట్‌ చేసుకుని సాధన చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు http://goo.gl/18C1rj లింక్‌లోకి వెళ్లండి. యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. http://goo.gl/gBSeQh
* స్త్టెల్‌గా గిటార్‌ వాయిద్దాం అనుకుంటే Real Guitar ఉంది. మూడు రకాల గిటార్‌లను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. Solo, Chords మోడ్స్‌లో ప్లే చేయవచ్చు. http://goo.gl/hSq3CT

చక్కని సామెతలు

'కురూపీ... కురూపీ... ఎందుకు పుట్టావే? అంటే... స్వరూపాలెంచటానికి అందిట.'... 'అంచు డాబే కానీ, పంచె డాబు లేదు'... ఇలాంటి సామెతలు తెలుగు తీయదనాన్ని చెప్పకనే చెబుతాయి. అందుకే కాసేపు స్మార్ట్‌ మొబైల్‌పై ఆంగ్లంతో ఆటలు... ఆప్స్‌ని క్లోజ్‌ చేద్దాం. మన భాషలోని Telugu Samethalu ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆప్‌లో వరుసగా సామెతల్ని పొందుపరిచారు. ఒక్కోటి క్లిక్‌ చేస్తూ చదువుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రత్యేక సామెత కావాలంటే వెతికే వీలుంది. నచ్చిన వాటిని షేర్‌ చేయవచ్చు కూడా. ఆప్‌ కోసం http://goo.gl/yN92m2 లింక్‌ని చూడండి.

ఫోనే తాళం

బయటికి వెళ్లేప్పుడు ఇంటికి తాళం వేస్తాం. కీ జేబులో వేసుకుంటాం. తిరిగివచ్చి జేబులు తడిమితే కీ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? తాళం కప్పని పగలగొట్టడం ఒక్కటే మార్గం. అంతేకాదు... మీరేమో ఊరు వెళ్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వెళ్తారు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు ఎలా? ఇంకేముందీ... అప్పుడు చేసేది లేక పగలగొట్టడమే. అదే మీరు స్మార్ట్‌ యూజర్లు అయితే! మీ జేబులోని స్మార్ట్‌ మొబైల్‌తోనే తాళం వేయొచ్చు. తిరిగి వచ్చాక జేబులు తడుముకోవక్కర్లేదు. జేబులోని ఫోన్‌ని తీసి టచ్‌స్క్రీన్‌పై తాకితే చాలు. తాళం ఓపెన్‌ అవుతుంది. ఇదంతా ఎలా సాధ్యం అనేగా సందేహం. అయితే, మీరు NOKE గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో కనిపించే తాళం కప్ప అదే. దీన్ని వాడుతున్న ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లతో అనుసంధానం చేసుకుని వాడుకోవచ్చు. అందుకు అనువుగా తాళం కప్ప బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో పని చేస్తుంది. ప్రత్యేక ఆప్‌ని ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుని తాళంని చిటికెలో తీయవచ్చు. అంతేకాదు... స్నేహితులు ఎవరైనా మీరు లేని సమయంలో ఇంటికి వెళ్తే తాళం యాక్సెస్‌ని వారితో షేర్‌ చేయవచ్చు. నీళ్లలోనూ సురక్షితంగా వాడుకునే 'వాటర్‌ ప్రూఫ్‌'తో తాళం కప్పని రూపొందించారు. బ్యాటరీ ఛార్జింగ్‌ కూడా ఏడాది పాటు వస్తుంది. ఫోన్‌ లేని సమయంలో ప్రత్యేక కోడ్‌ ద్వారా తాళం తీయవచ్చు. ధర సుమారు రూ.4,550. ఇతర వివరాలకు http://fuzdesigns.com/pages/Noke లింక్‌ని చూడండి.

'సీక్రెట్‌' ఆప్‌ తెలుసా?

ప్రేమికులు వూసుల్ని పంచుకునేందుకు మొబైల్‌ ఓ ప్రధాన వారధి. ఇక వారి మాటల్ని రహస్యంగా చేరవేసేందుకు అనేక ఆప్స్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరి, మీకు 'సీక్రెట్‌' ఆప్‌ తెలుసా? ప్రేమికులు పంచుకునే విషయాల్ని సురక్షితంగా చేరవేసేందుకు దీన్ని వాడుకోవచ్చు. ఫొటోలు, టెక్ట్స్‌ మెసేజ్‌లు.... అన్నింటినీ రహస్యంగా చేరవేస్తుంది. గ్రూపుగా ఏర్పడి ఒకే వేదికపై గోప్యంగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. http://goo.gl/VSdTZG

ఇలా విన్నారా?
ఒకే మొబైల్‌లో హెడ్‌సెట్‌ ద్వారా ఇద్దరు వ్యక్తులు వేరు వేరు పాటల్ని వినడం సాధ్యమేనా? అదెలా కుదురుతుందంటారా? అయితే, మీరుDouble Player ఆప్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఐఫోన్‌ యూజర్లకు ఇది ప్రత్యేకం. ఆప్‌ని ఓపెన్‌ చేయగానే రెండు ప్లేయర్లతో ఓపెన్‌ అవుతుంది. కుడి వైపు స్పీకర్‌లో ఒక పాట... ఎడమ వైపు మరో పాట ప్లే అవుతాయి. మరెందుకాలస్యం... ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://goo.gl/9e604w

అదిరే క్యాలెండర్‌
చెయ్యాల్సిన పనుల్ని మేనేజ్‌ చేసుకునేందుకు ఇప్పటి వరకూ అనేక క్యాలెండర్లను వాడుంటారు. కానీ, SolCalendar వాడారా? అదనపు సౌకర్యాలతో క్యాలెండర్‌ని మరింత స్మార్ట్‌గా వాడుకోవచ్చు. ఉదాహరణకు అప్పటికే మీరు వాడుతున్న క్యాలెండర్స్‌కి సింక్‌ అయ్యి డేటాని ఇంపోర్ట్‌ చేసుకుని చూపిస్తుంది. ఆకర్షణీయమైన థీమ్స్‌ని క్యాలెండర్‌ బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్‌ చేసుకోవచ్చు. హోం స్క్రీన్‌కి40 రకాల Widgetsసెట్‌ చేసుకోవచ్చు. క్యాలెండర్‌లోనే వాతావరణ వివరాల్ని పొందొచ్చు. పెట్టుకునే ఈవెంట్స్‌కి సరిపడే 'స్టిక్కర్ల'ను ఇన్‌సర్ట్‌ చేసుకునే వీలుంది. ఈవెంట్స్‌ని చిటికెలో షేర్‌ చేయవచ్చు కూడా. ఆప్‌ కోసం http://goo.gl/H 9N9le లింక్‌లోకి వెళ్లండి.

'లెక్క' తేలుస్తుంది!
చదువులో గణిత శాస్త్రానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ కూడా అందుకు బాసటగా నిలుస్తోంది. ఉదాహరణకు Sin 53 విలువ ఎంతో తెలుసుకోవాలంటే? పెన్నుతో నోట్‌ బుక్‌లో రాసినట్టుగానే... తాకే తెరపైన రాస్తే చాలు. వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం అంటారా? అయితే, My Script Calculator ఆప్‌ని ప్రయత్నించండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. కూడికలు, తీసివేతలు లాంటి బేసిక్‌ ఆపరేషన్స్‌ని మాత్రమే కాకుండా త్రికోణమితి, Inverse Trigonometry, Logarithms, Constants... లెక్కల్ని పరిష్కరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో 'హ్యాండ్‌ రైటింగ్‌ కాలిక్యులేటర్‌' అన్నమాట. అన్నింటినీ నోట్‌బుక్‌పై రాసినట్టుగానే తెరపై రాస్తే సరి. స్త్టెలస్‌ కావాలేమో? అనే సందేహం అక్కర్లేదు. స్మార్ట్‌ మొబైల్‌పై వేళ్లతో రాసేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు http://goo.gl/1ORw36 నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
* యాపిల్‌ యూజర్లు http://goo.gl/FalZ92 లింక్‌ నుంచి పొందండి.

ఆప్‌లో 'మీటర్‌'
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే ఆటో లేదా కారులో వెళ్లేందుకు సంకోచిస్తాం. ఎందుకంటే ఎంత ఛార్జ్‌ చేస్తారో అని సందేహం ఉంటుంది. మరి, ఇలాంటి సందేహాలు తీర్చేందుకు ఓ ఆప్‌ సిద్ధంగా ఉంది. అదే MeterUp. దేశంలోని ముఖ్యమైన పట్టణాల్లో టాక్సీ ఛార్జీలను తెలుపుతూ అప్‌ని రూపొందించారు. ఇన్‌స్టాల్‌ చేశాక హోం పేజీలోని నగరాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాల్ని ఎంటర్‌ చేసి వెతకాలి. సెర్చ్‌ రిజల్ట్స్‌లో వెళ్లాల్సిన దూరం, అందుబాటులో ఉన్న ఆటో, టాక్సీ వివరాలు కనిపిస్తాయి. కాల్‌ లోగోపై క్లిక్‌ చేసి టాక్సీ సర్వీసులకు ఫోన్‌ చేయవచ్చు కూడా. గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాలంటే http://goo.gl/MrQxBk లింక్‌లోకి వెళ్లండి.

తలుపు తట్టక్కర్లేదు!
ముఖ్యమైన పనేదో చేస్తున్నప్పుడో... గాఢ నిద్రలో ఉన్నప్పుడో... కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఏముందీ... విసుక్కుంటూ వెళ్లి డోర్‌ తీస్తామంటారా? ఇక మీదట ఇంత కష్టం అక్కర్లేదు. సింపుల్‌గా చేతిలోకి మొబైల్‌ తీసుకుంటే చాలు. వచ్చింది ఎవరో... ఎందుకు వచ్చారో తెలిసిపోతుంది. అదెలాగో తెలియాలంటే మీరు DoorBot గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో ఉన్న మాదిరిగా కాలింగ్‌ బెల్‌ బటన్‌, వెబ్‌ కెమెరాతో దీన్ని రూపొందించారు. ముఖ ద్వారానికి దగ్గరే దీన్ని అమర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వారు ఎవరైనా దీంట్లోని కాలింగ్‌ బెల్‌ బటన్‌ నొక్కగానే మొబైల్‌లో మోగుతుంది. బుల్లి తెరపైనే వచ్చిన వారు ఎవరో చూడొచ్చు. వారితో మాట్లాడొచ్చు. ఎరిగిన వారైతే తలుపుని ఆన్‌లాక్‌ చేసి లోపలికి రమ్మనొచ్చు. ఒకవేళ వచ్చింది ఏ సేల్స్‌ బాయ్‌ అయితే సమాధానం ఇచ్చి పంపొచ్చు. వై-ఫై నెట్‌వర్క్‌ ద్వారా ఇది పని చేస్తుంది. దీంతో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కాలింగ్‌ బెల్‌ కొట్టిన వారితో మాట్లాడొచ్చు. ప్రత్యేక ఆప్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా డోర్‌బోట్‌ని సౌకర్యంగా వాడుకోవచ్చు. మాట్లాడేందుకు అనువుగా డోర్‌బోట్‌లో ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌ని ఏర్పాటు చేశారు. డోర్‌బోట్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏడాది పాటు వాడుకోచ్చు. వచ్చిన వారిని కలవడం మీకు ఇష్టం లేకపోతే 'డిక్త్లెన్‌' చేయవచ్చు. హోం వై-ఫై నెట్‌వర్క్‌తోనే పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ స్టోర్‌ల నుంచి ఆప్‌ని పొందొచ్చు. ఇంతకీ దీని ధరెంతో అనేదేగా మీ ప్రశ్న? సుమారు రూ.12,000.వీడియో, ఇతర వివరాలకు www.getdoorbot.com సైట్‌ చూడండితెలుగులోనే..!
కంప్యూటర్‌లో తెలుగుని టైప్‌ చేస్తున్నాం. డాక్యుమెంట్స్‌ని రూపొందించే క్రమంలో తెలుగుకి స్థానం కల్పిస్తున్నాం. మరి, మొబైళ్ల సంగతేంటి? తెలుగులో మెసేజ్‌నో... మరేదైనా సమాచారాన్నో రాసుకుని భద్రం చేసుకోవాలంటే? అందుకు తగిన ఆప్స్‌ సిద్ధంగా ఉన్నాయి. కావాలంటే Telugu Pad ఆప్‌ని ప్రయత్నించండి. మీ మొబైల్‌కి Unicode సపోర్ట్‌ ఉన్నట్లయితే క్వర్టీ కీబోర్డ్‌పైనే తెలుగులో టైప్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా తెలుగులో టైప్‌ చేసుకునే వీలుంది. ఉదాహరణకు 'అమ్మ భాష' అని టైప్‌ చేయాలంటే amma bhasha అని టైప్‌ చేస్తే సరిపోతుంది. ఇలా టైప్‌ చేసిన మేటర్‌ని ఫైల్‌ రూపంలో సేవ్‌ చేయవచ్చు. మెసేజ్‌ పంపాలనుకుంటే మేటర్‌ని టైప్‌ చేశాక SMSపైన క్లిక్‌ చేస్తే పరిపోతుంది. టెక్స్ట్‌ని మెయిల్‌ కూడా చేయవచ్చు. సెలెక్ట్‌ చేసి కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/TDl4gK
* ఇలాంటిదే మరోటి Lipikaar Telugu Typing. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత కీబోర్డ్‌ని ఎంపిక చేసుకోవడం ద్వారా టైప్‌ చేయవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి కీబోర్డ్‌ని ఎనేబుల్‌ చేయవచ్చు. http://goo.gl/o7bYg4
* ట్యాబ్లెట్‌ యూజర్లు Teluguఆప్‌ని ప్రయత్నించొచ్చు. http://goo.gl/0lAj6vస్కాన్‌ చేద్దామా!
పొద్దునే వార్తలు చదివేప్పుడు ఏదైనా ఆకట్టుకున్న కథనాన్ని స్కాన్‌ చేసి సాఫ్ట్‌ కాపీగా భద్రం చేసుకోవాలంటే? చెల్లించిన ఏదైనా రసీదుని స్కాన్‌ చేసుకుని సేవ్‌ చేయాలంటే? అందుకు స్కానరే అక్కర్లేదు. జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ని స్కానర్‌లా మార్చేవయచ్చు. కావాలంటే Mobile Doc Scanner ఆప్‌ని ప్రయత్నించండి. మొబైల్‌ కెమెరా ద్వారా స్కాన్‌ చేసిన వాటిని వివిధ రకాల 'ప్రీసెట్స్‌'లో సేవ్‌ చేసుకోవచ్చు. రంగుల్లో అక్కర్లేదనుకుంటే 'బ్లాక్‌ అండ్‌ వైట్‌'లో సేవ్‌ చేయవచ్చు. ఎలాంటి మార్పులు లేకుండా స్కాన్‌ చేసేందుకు No Enhancementఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకోండి. స్కాన్‌ చేసిన వాటిని కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకునే వీలుంది. మొత్తం ప్రక్రియ ముగిశాక ఫైల్స్‌ని ఎస్‌డీ కార్డ్‌లో సేవ్‌ చేయవచ్చు. ఇంకా స్కాన్‌ కాపీలను క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసు 'డ్రాప్‌బాక్స్‌'లో దాచుకోవచ్చు. బ్లూటూత్‌తో ఇతరులు పంపొచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌ల్లోనూ షేర్‌ చేసే వీలుంది. స్కాన్‌ చేసిన మొత్తం ఫైల్స్‌ని 'మై స్కాన్స్‌'లో బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు http://goo.gl/XQfRvC లింక్‌ నుంచి పొందండి.
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. http://goo.gl/nSgWZhపెన్‌డ్రైవ్‌ పరిశుభ్రం
జేబులో పర్సుతో పాటు పెన్‌డ్రైవ్‌ కూడా చోటు సంపాదించుకుంది. అందరం వాడేస్తున్నాం. ఎప్పుడైనా మీ యూఎస్‌బీని ఫార్మెట్‌ చేయాలంటే? లేదా ఏవైనా బ్యాడ్‌ సెక్టార్స్‌ ఉంటే క్లీన్‌ చేయాలంటే? అదేం పెద్ద క్లిష్టమైన ప్రక్రియేం కాదు. Rufusఅనే ఉచిత సాఫ్ట్‌వేర్‌తో చిటికెలో చేయవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే సిస్టంకి కనెక్ట్‌ చేసి ఉన్న మొత్తం యూఎస్‌బీ డ్రైవ్‌ను చూపిస్తుంది. డ్రైవ్‌లను ఫార్మెట్‌ చేయడంతో పాటు ఎలాంటి సమస్యా లేకుండా వాటిని బూట్‌ చేయవచ్చు కూడా. ఫార్మెట్‌ చేయాలంటే మెనూ నుంచి కావాల్సిన పెన్‌డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేసుకునిPartition Scheme సెట్‌ చేసి ఫార్మెట్‌ చేయవచ్చు. వాడాలనుకుంటే http://goo.gl/7VPlHE లింక్‌లోకి వెళ్లండి.

పాతవన్నీ సురక్షితం...
వాడేది ఏదైనా కావచ్చు. డేటాని సురక్షితంగా బ్యాక్‌అప్‌ చేసుకోవడానికి MoboGenieటూల్‌ని వాడొచ్చు. ఒకే క్లిక్కుతో ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌ని పీసీ నుంచి ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని బ్యాక్‌అప్‌ చేయవచ్చు. కాంటాక్ట్‌లు, మెసేజ్‌లను పీసీ నుంచే మేనేజ్‌ చేయవచ్చు. ముఖ్యమైన డేటాని బ్యాక్‌అప్‌, రీస్టోర్‌ చేయవచ్చు. ఎక్స్‌పీ, విస్టా, విండోస్‌ 8, 7 ఓఎస్‌లో వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆప్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకుని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. కావాలంటే www.mobogenie.comసైట్‌లోకి వెళ్లండి.

ప్రకృతి ఒడిలోనే...
సముద్రపు ఒడ్డున కూర్చుని కంపెనీ వర్క్‌ చేస్తే ఎలా ఉంటుంది... దట్టమైన అడవిలో పక్షుల కువకువల సందడిలో ప్రొగ్రాం రాస్తే... జడివాడ జోరులో నెట్‌ బ్రౌజింగ్‌ చేస్తే... ఇదంతా ఎలా సాధ్యం? సినిమాల్లో ఐతే ఒకే అంటారా? అదేం కాదు. ఉచితంగా టూల్‌ని మీ పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. అదే Sound Valley. పేరుకి తగ్గట్టుగానే దీని పని తీరు కూడా ఉంది. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే బీచ్‌లోని సముద్రపు హోరుని మీరున్న గదిలోకి వచ్చేస్తుంది. అంతేకాదు... చిటికెలో మీరు దట్టమైన అరణ్యంలోకి వెళ్లి పక్షుల కువకువలు వినొచ్చు. అబ్బా... ఇప్పుడు వర్షం వస్తే ఎంత బాగుంటుందోనని అనిపిస్తే... వర్షాన్ని పిలవొచ్చు. http://goo.gl/mO7K0v లింక్‌ నుంచి పొందండి.

 

ముఖ్యం అనుకుంటే...
ఇంట్లో మీకు ఇష్టమైన వారి పుట్టిన రోజుగానీ... మీకు ఇష్టమైన పండగగానీ... తుది పరీక్షల గడువుగానీ వస్తుందంటే చాలా హ‌డావుడి చేస్తుంటాం. రోజులు లెక్కిస్తుంటాం. అందుకు తగ్గట్టుగా ప్లానింగ్‌ చేస్తుంటాం. ఆ పని మీరు వాడుతున్న స్మార్ట్‌ మొబైల్‌కి అప్పగిస్తే. అందుకు తగిన ఆప్‌ Days Left Widget. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఏడాదిలో ముఖ్యమైన తేదీలను ఆప్‌లో సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. దీంతో రోజువారీ లెక్కింపుని తాకేతెరపై చూడొచ్చు. అందుకు తగినట్టుగా ప్లాన్‌ చేసుకోవచ్చు. రిమైండర్లకు తగిన ఇమేజ్‌లను సెట్‌ చేసుకునే వీలుంది. ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే http://go o.gl/Ey4hCR లింక్‌లోకి వెళ్లండి.

డైరీ రాయండి
పీసీలోనే కాకుండా మొబైల్‌లోనూ విండోస్‌ ఓఎస్‌నే ఫోన్‌ వాడుతున్నారా? అయితే, తాకేతెరలోనే మీ దినచర్యని రాసుకునేందుకు Diary ఆప్‌ సిద్ధంగా ఉంది. మీ ఆలోచనలు, కలలు, కోరికల్ని అక్షర రూపంలో అరచేతిలోనే భద్రం చేసుకోవచ్చు. టెక్ట్స్‌ మేటర్‌ మాత్రమేనా? అని అనుకోవద్దు... ఫోటోలను కూడా డైరీలో దాచుకోచ్చు. రాసుకున్న ఎంట్రీలను జాబితాగా సేవ్‌ చేసుకునే వీలుంది. తేదీల ఆధారంగా కావాల్సిన ఎంట్రీని చూడొచ్చు. ఎవ్వరైనా చూస్తారేమో అనే సందేహం అక్కర్లేదు. పాస్‌వర్డ్‌తో డైరీకి తాళం వేయవచ్చు. Auto Save సౌకర్యంతో డైరీ ఆటోమాటిక్‌గా సేవ్‌ అవుతుంది. కావాలంటే http://goo.gl/kOzUzo లింక్‌ నుంచి పొందొచ్చు.

అదనపు హంగులు
స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉందంటే ఫొటోలే.. ఫొటోలు. ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఎఫెక్ట్‌లేనా? మరిన్ని కొత్తవి ప్రయత్నించొచ్చు. అందుకు అనువైన ఆప్స్‌ చాలానే ఉన్నాయి. వాటిల్లో Photo Wonders ఒకటి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆప్‌ని నిక్షిప్తం చేసుకున్నాక ఫొటో గ్యాలరీ నుంచి ఫొటోలను సెలెక్ట్‌ చేసుకుని ఎఫెక్ట్స్‌ని అప్లై చేయవచ్చు. 30 రకాల ఫొటో ఎఫెక్ట్‌లు ఉన్నాయి. కెమెరాతో ఫొటోలు తీసేట‌ప్పుడే ఎఫెక్ట్‌లను ఆప్లై అయ్యేలా చేయవచ్చు. ఫేస్‌బుక్‌లోని ఫొటోలను కూడా మార్పులు చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసే ముందు లేటెస్ట్‌ యాంటీ వైరస్‌తో స్కాన్‌ చేయడం మర్చిపోవద్దు. కావాలంటే http://goo.gl/LQoqH1 లింక్‌ నుంచి ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఫాంట్‌ల చిట్టా!
డీటీపీ వర్క్‌లు చేస్తుంటారా? డిజైన్స్‌ చేసేప్పుడు కొత్త ఫాంట్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటారా? ఉన్న ఫాంట్‌లను ప్రివ్యూ చూసుకోవాలా? ఇలాంటి పనుల్ని సులభంగా చేసేలా ముందుకొచ్చింది NexusFont సాఫ్ట్‌వేర్‌. ఇదో ఫాంట్‌ మేనేజర్‌. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టంలోని అన్ని ఫాంట్‌లను కలెక్ట్‌ చేసుకుని జాబితాగా చూపిస్తుంది. జాబితాలో ఏవైనా నకిలీ ఫాంట్‌లు ఉన్నాయో తెలుసుకునేందుకు టూల్స్‌ మెనూలోని Find Duplicate Fonts ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ఇన్‌బిల్ట్‌గా ఉండే ఫాంట్‌ ఫోల్డర్‌ని ఓపెన్‌ చేయాలంటే కంట్రోల్‌ ప్యానల్‌ని వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు. టూల్స్‌ మెనూలోని Open System Font Folder app పై క్లిక్‌ చేయండి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/gaw8F5 లింక్‌లోకి వెళ్లండి.

'ప్లాన్‌' చేయాలా?
సబ్జెక్ట్‌లు... రోజంతా క్లాసులు... హోం వర్క్‌లు... ప్రాజెక్ట్‌ ఎసైన్‌మెంట్స్‌... ఇవన్నీ మేనేజ్‌ చేసుకోవడం అంత కష్టమేం కాదు. విండోస్‌ మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లయితే Study Planner ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. విండోస్‌ ఫోన్‌ మార్కెట్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా నిక్షిప్తం చేసుకోవచ్చు. రోజువారీ తరగతుల 'టైం టేబుల్‌' కి ప్రత్యేక విభాగం ఉంది. పాఠ్యాంశాలకు సంబంధించిన ఎసైన్‌మెంట్స్‌ని సబ్జెక్ట్‌ల వారీగా రూపకల్పన చేసుకోవచ్చు. పరీక్షలకు సంబంధించిన 'రిమైండర్స్‌' ని కూడా పెట్టుకోవచ్చు. http://goo.gl/AEADLR

సోషల్‌ కలయిక!
ఛాటింగ్‌లు... షేరింగ్‌లు!
లైక్‌లు... కామెంట్‌లు!
సోషల్‌ మీడియా అంటే ఇంతేనా?
కాదు.. ఇంకేదో ఉంది!
తెలియాలంటే Enabli లోకి వెళ్లండి!

రోజువారీ జీవితంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అనివార్యమైన అంశంగా మారిపోయింది. ఎన్ని పనులున్నా ఓ కన్ను మాత్రం అటు వేస్తూనే ఉంటాం. ఫేస్‌బుక్‌... ట్విట్టర్‌... గూగుల్‌ ప్లస్‌... వేదిక ఏదైనా పెద్ద కమ్యూనిటీనే ఉంటుంది. వందలు... వేలల్లో పోస్టింగ్స్‌.. ఆప్‌డేట్స్‌. వాటిలో అన్నీ ప్రయోజనకరమైనవి ఉండవు. కానీ, అన్ని అప్‌డేట్స్‌ని చూస్తూ బోలెడంత‌ సమయం వృథా చేస్తుంటాం.

అలా కాకుండా అన్ని వేదికల్ని ఒక దగ్గర చేర్చి వాటిల్లో ఏవి ప్రయోజనకరమైనవో సులువుగా బ్రౌజ్‌ చేసి చూడాలంటే? అందుకో ప్రత్యేక వేదిక అవసరమే. అలాంటిదే www.enabli.com. ఇది మన తెలుగు డెవలపర్స్‌ అందిస్తున్న వేదిక. వాడుకోవాలంటే సభ్యులవ్వాల్సిందే.

విలువైన వేదిక
హోం పేజీలో కనిపించే Start Enabling పై క్లిక్‌ చేసి లాగిన్‌ అవ్వండి. దీంతో సర్వీసు నిర్వాహకులకు మీరు ఆహ్వానం కోరుతున్నట్టుగా 'ఇన్విటేషన్‌' వెళుతుంది. వెంటనే నిర్వాహకులు మీకో పరీక్ష పెడతారు. మీరు పాస్‌ అయితేనే సైట్‌లో సభ్యత్వానికి అర్హులు. ప్రశ్నలంటే జనరల్‌ నాలెడ్జ్‌ అనుకునేరు. అదేం కాదు... కామన్‌ సెన్స్‌ ప్రశ్నలు. కేవలం మీరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునే ప్రశ్నలు. వాటికి తడుముకోకుండా సమాధానాలు అందిస్తూ వెళ్లాలి. మొత్తం పూర్తయ్యాక మీ ఫలితాన్ని తెలియజేస్తూ సభ్యత్వాన్ని అందిస్తారు. అంటే సోషల్‌ లైఫ్‌లో మీకంటూ కొంత ప్రత్యేక జాగా క్రియేట్‌ అయినట్టే అన్నమాట. ఇక మీరు అన్ని నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని ఒక ప్రత్యేక మెయిల్‌లో చూడొచ్చు. రోజుకో మెయిల్‌ రూపంలో నెట్‌వర్క్‌లోని సభ్యుల 'ముఖ్యమైన రిక్వెస్ట్‌' లను పంపుతారన్నమాట. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లోని మీ నెట్‌వర్క్‌ సభ్యుల్లో ఎవరైనా రక్తం అవసరమని చేసిన పోస్ట్‌ కచ్చితంగా రిక్వెస్ట్‌ల జాబితాలో ఉంటుంది. మరి, మీకు సాయం కావాలన్నా... మీరు సాయం చేయాలన్నా ఈ వేదికపై చేతులు కలపండి

నెట్‌కి రక్షణ
సిస్టం ఉందంటే నెట్‌ని వాడేస్తుంటాం. సైట్‌లు... డేటా డౌన్‌లోడ్స్‌... ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌... ఇలా చాలానే చేస్తుంటాం. మరి, రక్షణ వ్యవస్థ మాటేంటి? నెట్‌ నుంచి ప్రవేశించే మాలిషియస్‌ ఫైల్స్‌, మాల్వేర్‌లు, ఫిషింగ్‌ సైట్స్‌ నుంచి సిస్టంలోకి చేరే వైరస్‌లను ఆపడం ఎలా? అందుకో 'ఇంటర్నెట్‌ సెక్యూరిటీ' యాంటీవైరస్‌ సిద్ధంగా ఉంది. పేరు 360 Internet Secrutiry 2013.యాంటీవైరస్‌ ఇంజన్లను వాడుకుని దాగున్న వైరస్‌లను ఏరిపారేస్తుంది. 'రియల్‌ టైం ప్రొటెక్షన్‌' ద్వారా ఏవైనా మాలిషియస్‌ ఫైల్స్‌ని గుర్తిస్తే వెంటనే హెచ్చరిస్తుంది. మాలిషియస్‌ యూఆర్‌ఎల్స్‌, ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లను గుర్తించి బ్లాక్‌ చేసేస్తుంది. ఇతరులు ప్రమాదకరమైన సైట్‌లు ఓపెన్‌ చేయకుండా సెట్‌ చేయవచ్చు.Quick Scan, Full Scan, Custum Scan ఆప్షన్స్‌తో స్కానింగ్‌ ప్రక్రియను చేపట్టవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/yFmucp

వెబ్‌ కెమెరా లేదా?
వీడియో ఛాటింగ్‌ చేయాలంటే వెబ్‌ కెమెరా ఉండాల్సిందే! మరి, పీసీకి వెబ్‌ కెమెరా లేదా? పని చేయకుండా మొరాయిస్తోందా? అయితే, స్మార్ట్‌ ఫోన్‌ వాడేయండి! మెగాపిక్సల్‌ కెమెరాని వెబ్‌ కెమెరాగా మార్చొచ్చు. అందుకు సాఫ్ట్‌వేర్‌ ఉంది. అదే Smart Cam. వై - ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ల ద్వారా ఫోన్‌ని పీసీకి కనెక్ట్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేసే స్మార్ట్‌ మొబైళ్లను సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ చేస్తుంది. http://goo.gl/H7wSiF

దిగుమతి కోసం...
స్మార్ట్‌ మొబైల్‌లో ఎక్కువగా వీడియోలు చూస్తుంటాం. అందుకు యూట్యూబే ప్రధాన వారధి. దాంట్లో నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేయాలంటే? ఆండ్రాయిడ్‌ యూజర్లు Tube Video Downloader ఆప్‌ని వాడొచ్చు. వివిధ రకాల ఫార్మెట్స్‌లో (ఎఫ్‌ఎల్‌వీ, ఎంపీ4, 3జీపీ, ఎంఓవీ....) వీడియోలను పొందొచ్చు. 2 జీబీ వరకూ సపోర్ట్‌ చేస్తుంది. కావాలంటే http://goo.gl/gh41G లింక్‌లోకి వెళ్లండి.

చిటికెలో చెల్లింపు
స్మార్ట్‌ ఫోన్‌ నుంచి బిల్లుల చెల్లింపులు చేస్తున్నాం. అందుకు ఆన్‌లైన్‌ సర్వీసులు చాలానే. అయితే, ఆప్‌ రూపంలో మొబైల్‌లో బిల్లు చెల్లింపులు చేస్తోంది Happay ఆప్‌. కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలోనే. కావాలంటే మీరు మొబైల్‌ రిఛార్జ్‌ చేసుకోవచ్చు. వాడుతున్న డీటీహెచ్‌ రిఛార్జ్‌ చేయవచ్చు. స్నేహితులకు డబ్బుని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. బ్యాంకు వివరాలతో అనుకునేరు. సర్వీసులో సభ్యులై మీకు కేటాయించిన ప్రత్యేక పిన్‌ నెంబర్‌తో వ్యవహారాలు చేయవచ్చు. ఇక ఎవరికైనా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వ్యక్తిని ఎంపిక చేసి పంపడమే. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మాత్రమే ఆప్‌ని వాడుకోగలరు. http://goo.g l/JEgHj

ఎంసెట్‌ ఆప్‌
ఐఫోన్‌ వాడుతుంటే అరచేతిలోనే మీ మాక్‌ కౌన్సిలింగ్‌ చేయవచ్చు. అందుకు అనువైన ఆప్‌ని ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆప్‌ పేరు Eamcet. ఆప్‌ హోం పేజీలో మీకొచ్చిన ర్యాంకుని టైప్‌ చేసి Reservation, Region, Course, FindCourse మెనూల ఆధారంగా కౌన్సిలింగ్‌ డేటాని చూడొచ్చు. కాలేజీ వివరాల్ని కూడా పొందొచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/vnrxF

రక్షక వలయం
పీసీలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? బ్యాకింగ్‌ వ్యవహారాలు చక్కబెడుతున్నారా? ప్రయాణపు టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే, కంప్యూటర్‌ రక్షణ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాల్సిందే. అందుకు Ad-Aware Free Antivirus వాడాల్సిందే. నిత్యం మానిటర్‌ చేస్తూ హెచ్చరిస్తుంది. ఆటోమాటిక్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు పొందొచ్చు. పాస్‌వర్డ్‌ స్టీలర్స్‌, కీలార్స్‌, స్పైవేర్‌, ట్రోజన్స్‌... దాడుల నుంచి పూర్తి రక్షణ పొందొచ్చు. ప్రైవసీని సురక్షితం చేస్తుంది కూడా. వాడే బ్రౌజర్‌ ఏదైనా హిస్టరీని ఇతరుల కంటపడకుండా చేస్తుంది. http://goo.gl/tsNgL

కొత్త వెర్షన్‌
పీసీకి రక్షణగా నిలిచే ఉచిత యాంటీ వైరస్‌ల్లో ఒకటైన ఏవీజీ ఫ్రీ ఎడిషన్‌ కొత్త వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇన్‌స్టాల్‌ చేసుకుని వైరస్‌లను కట్టడి చేయవచ్చు. నెట్‌ సర్ఫింగ్‌ చేస్తున్నప్పుడు, మెయిల్‌కి వచ్చిన లింక్స్‌ని క్లిక్‌ చేసేప్పుడు యాంటీ వైరస్‌ రక్షణగా నిలుస్తుంది. అందుకు అనువైన 'లింక్‌స్కానర్‌ యాక్టివ్‌ సర్ఫ్‌షీల్డ్‌' సిద్ధంగా ఉంది. ఇతర వివరాలకు http://goo.gl/5Bwi0

వెతికేస్తుంది!
పీసీలో ఏదైనా ప్రత్యేక ఫైల్‌, ఫోల్డర్‌ని వెతకడానికి ఓ సులువైన మార్గమే Everything అప్లికేషన్‌.ఇక ఎప్పుడైనా ఏదైనా వెతకాలంటే సిస్టం ట్రేలోని ఐకాన్‌పై క్లిక్‌ చేయవచ్చు. టూల్‌ హోం విండోలో కనిపించే బాక్స్‌లో మీరు వెతకాలనుకునే పేరుని టైప్‌ చేయగానే సెకన్ల సమయంలోనే ఫైల్స్‌, ఫోల్డర్ల జాబితాను చూపిస్తుంది. ఫైల్‌పాత్‌, సైజు, Date Modified వివరాలతో చూడొచ్చు. చూడాలనుకునే ఫైల్‌ని అక్కడే ఓపెన్‌ చేసి చూడొచ్చు. ఒకవేళ మీరు Case sensitive పద్ధతిలో వెతుకుతున్నట్లయితే మెనూ బార్‌లోని Match Case ఆప్షన్‌ని చెక్‌ చేయండి. అవసరం మేరకు మెనూబార్‌లోని ఆప్షన్ల ద్వారా కొత్త పద్ధతుల్లో వెతికే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/nUpNl

అలా అనిపిస్తే!
'అంజలి నన్ను తప్పుగా అర్థం చేసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను! రేపు జరిగిందేంటో వివరంగా చెప్పాలి...' ఇలా మదిలోని మాటల్ని డైరీలో రాసే అలవాటుందా? అయితే, www.daileez.comలో సభ్యులైపోండి. ఇదో మొట్టమొదటి ఐకాన్‌ ఆన్‌లైన్‌ డైరీ. ఆకట్టుకునే బొమ్మలతో మీ రోజువారీ జీవితంలోని ఆసక్తికరమైన విషయాల్ని రాసుకోవచ్చు.

'సాఫ్ట్‌'కార్నర్‌! ఏమేం ఉన్నాయో?
సిస్టంపై పని చేస్తున్నప్పుడు ఏయే ప్రొగ్రాంలు రన్‌ అవుతున్నాయో ప్రత్యేక విండోలో చూడాలనుకుంటే అందుకు ప్రత్యేక అప్లికేషన్‌ ఉంది. అదే Process Explorer. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే విండోలో అన్ని ప్రొగ్రాంలు కనిపిస్తాయి. అవి తీసుకునే మెమొరీ కూడా తెలుసుకునే వీలుంది. రన్‌ అవుతున్న అన్ని ప్రొగ్రాంలను Processవిండోలో చూడొచ్చు. అప్లికేషన్స్‌కి సంబంధించిన అదనపు సమాచారాన్ని తెలుసుకునేందుకు Descriptionమెనూలో చూడొచ్చు. సాఫ్ట్‌వేర్‌లను తయారు చేసిన కంపెనీ పేరుని తెలుసుకునేందుకుCompany Nameలో చూడొచ్చు. సీపీయూ వేగాన్ని ప్రత్యేక గ్రాఫ్‌లో మానిటర్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/qnBkv

'సైటే'ద్దాం! పంచండిలా!
ఫోన్‌, కంప్యూటర్‌, ట్యాబ్‌.. వాడేది ఏదైనా. మీరు బ్రౌజ్‌ చేస్తున్న సైట్‌లను ఇతరులతో పంచుకునేందుకు Feedlyవెబ్‌ సర్వీసుని వాడుకుంటే సరి. మొత్తం అప్‌డేట్స్‌ని ప్రత్యేక ఇంటర్ఫేస్‌లో మెయిల్స్‌ మాదిరిగా పొందొచ్చు. చదివిన వ్యాసాలు, చిత్రాలు, ఇతర విషయాల్ని ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌, ఎవర్‌నోట్‌.... లాంటి ఇతర నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేయవచ్చు. పీసీ యూజర్లు క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లలో యాడ్‌ఆన్‌ మాదిరిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. నిక్షిప్తం చేశాక ఆయా బ్రౌజర్లను రీస్టార్ట్‌ చేసి సర్వీసుని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఐఫోన్‌ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ని నుంచి మొబైల్‌ ఆప్‌గా ఇన్‌స్టాల్‌ చేసుకునే వీలుంది. http://goo.gl/7Fx4y ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు.http://goo.gl/s6RRt

పద్యాల ప్రవాహం
ఆంగ్ల పద్యాల్ని చదవడం ఇష్టమైతే విలియం బ్లేక్‌ రాసిన Songs of Innocence and Experienceపుస్తకాన్ని మీ స్మార్ట్‌ మొబైల్‌, ట్యాబ్‌, కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదీ ఉచితంగా! కావాలంటే గూగుల్‌ ప్లేలోకి వెళ్లి పొందొచ్చు. 109 పేజీల పుస్తకాన్ని ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లోనూ, బ్రౌజర్‌లోనూ చదువుకోవచ్చు. http://goo.gl/LEusM

జేబులోనే..
పెద్ద ఇంగ్లిష్‌ నిఘంటువుని జేబులో పెట్టుకుని తిరిగేయండి. అదే Audio Oxford Dictionary.ఆండ్రాయిడ్‌ యూజర్లు ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. సుమారు 75,000 పదాలల్ని విని, వాటిని పలికే విధానాన్ని తెలుసుకోవచ్చు. నిఘంటువులో మొత్తం 3,50,000 పదాలకు అర్థాలున్నాయి. కావాల్సిన పదాన్ని సెర్చ్‌ ద్వారా వెతకొచ్చు. నచ్చిన పదాలకు బుక్‌మార్క్‌లను పెట్టుకునే వీలుంది. హిస్టరీలో సుమారు 50 పదాలుంటాయి. పదాల అర్థాల్ని సులువుగా గుర్తుంచుకునేందుకు గేమ్స్‌ ఉన్నాయి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకుhttp://goo.gl/ELPTi

బ్యాక్‌అప్‌ కోసం!
ముఖ్యమైన ఫైల్స్‌ని కేవలం ఒకచోట సేవ్‌ చేయడం అంటే ఏ మాత్రం సురక్షితం కాదు. బ్యాక్‌అప్‌ ఉండాల్సిందే. అందుకు ముఖ్యమైన ఫోల్డ్డర్లను మరోచోట సింక్రనైజ్‌ చేయాలంటే? అందుకు SyncFoldersఅప్లికేషన్‌ వాడితే సరి. కావాల్సిన ఫైల్స్‌, ఫోల్డర్లను మరో ఫోల్డర్‌లోకి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు.అంతేనా... బ్యాక్‌అప్‌ చేసుకున్న ఫోల్డర్‌ని తాళం వేసి సురక్షితం చేయవచ్చు. కావాలంటే ఫోల్డర్‌ని మాయం చేయవచ్చు కూడా. ఏ విధంగా సిక్రనైజ్‌ అవ్వాలో ముందే మీరు నిర్ణయించొచ్చు. అందుకు 'రూల్స్‌' ఉన్నాయి. దీన్ని వాడేందుకు మీ సిస్టంలో కచ్చితంగా మైక్రోసాఫ్ట్‌ డాట్‌నెట్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ 3.5 సాఫ్ట్‌వేర్‌ ఉండాల్సిందే. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/vJxaX

తెలివిగా తొలగిస్తుంది
డ్రైవ్‌ల్లో దాగున్న అక్కర్లేని చెత్తని వెతికి తొలగించాలంటే అందుకో ప్రత్యేక టూల్‌ సిద్ధంగా ఉంది. అదే Wise Desk Cleaner. టూల్‌ని రన్‌ చేసి డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేసి స్కాన్‌ చేస్తే అనవసర ఫైల్స్‌గా పరిగణించిన వాటిని (టెంపరరీ ఫైల్స్‌, ఇన్‌కంప్లీట్‌ అన్‌ఇన్‌స్టాల్స్‌, ఇంటర్నెట్‌ ఫైల్స్‌....) జాబితాగా చూపిస్తుంది. మీకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువైతే విండోలో డీఫాల్ట్‌గా సెట్‌ చేసి ఉన్న సెట్టింగ్స్‌ని అలానే ఉంచి వాడుకోవాలి. ఒకవేళ మీరు అడ్వాన్స్‌ యూజర్లరైతే సెట్టింగ్స్‌ని కస్టమైజ్‌ చేసుకుని వాడుకోవచ్చు. డిలీట్‌ చేసే ప్రక్రియలో అక్కర్లేని వాటిని శాశ్వతంగా తొలగించొచ్చు. సందేహం అనిపిస్తే రిసైకిల్‌బిన్‌లోకి వెళ్లేలా చేయవచ్చు. చెత్తని తొలగించాక Defrag తో ఎక్కడివి అక్కడే సర్దేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/hBp25

రహస్యమా?
మీ సిస్టంని ఇతరులు వాడే సందర్భాల్లో ముఖ్యమైన ఫైల్స్‌, ఫోల్డర్లను ఇతరుల కంట పడకుండా చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిద్ధంగా ఉంది. అదే SecretFolder. ఉచితంగా దీంతో సీక్రెట్‌ ఫోల్డర్‌ నుంచి ఎంపిక చేసుకున్న ఫోల్డర్‌, ఫైల్‌ బయటికి వస్తుంది. మార్పు చేర్పులేమైనా ఉంటే చేసి తిరిగి 'లాక్‌' చేయాలి. ఒకవేళ సీక్రెట్‌ఫోల్డర్‌ జాబితా నుంచి ఏదైనా ఫోల్డర్‌, ఫైల్‌ని తొలగించాలంటే Remove పై క్లిక్‌ చేయండి. ఇలా చేయడం ద్వారా ఫైల్‌, ఫోల్డర్‌ జాబితా నుంచి తొలగిపోతుందేగానీ డేటా డిలీట్‌ అవ్వదు. మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని ఎప్పుడైనా మార్చుకోవాలంటే టూల్‌బార్‌లోని Preferences లోకి వెళ్లి ChangePassword పై క్లిక్‌ చేయాలి. డీఫాల్ట్‌గా సీక్రెట్‌ఫోల్డర్‌ సిస్టం స్టార్ట్‌ సమయంలోనే రన్‌ అవుతుంది. ఇలా అక్కర్లేదు అనుకుంటే Run at windows startup ఆప్షన్‌ని అన్‌చెక్‌ చేయండి. టూల్‌ని క్లోజ్‌ చేసినా సిస్టం ట్రే నుంచి పొందొచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/TJwr1

ముద్ర వేయండి
మీరు తీసిన ఫొటోలను మీ సంతకంతోనో, మరేదైనా సింబల్‌తోనో వాటర్‌ మార్క్‌ చేయాలంటే అందుకు సాఫ్ట్‌వేర్‌ కొనక్కర్లేదు. My Watermark టూల్‌ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఫొటో పరిమాణం ఆధారంగా టెక్స్ట్‌ ఆటోమాటిక్‌గా సెట్‌ అవుతుంది. 'బ్యాచ్‌ ప్రాసెస్‌'తో ఫొల్డర్‌లోని అన్ని ఫొటోలకు ఒకేసారి వాటర్‌మార్క్‌ని అప్లె చేయవచ్చు. ఫుల్‌ జూమ్‌తో ఫొటోలను ప్రివ్యూ చూడొచ్చు. టూల్‌ని రన్‌ చేయాలంటే సిస్టంలో మైక్రోసాఫ్ట్‌ డాట్‌నెట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ఉండాల్సిందే. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/xygPM

ఫార్మెట్‌ ఏదైనా!
పీసీ, మ్యాక్‌ వాడుతున్నారా? ఎరుగని ఫార్మెట్‌లో జిప్‌ చేసిన ఫైల్స్‌ ఇన్‌బాక్స్‌ని చేరాయా? మరి, వాటిని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి చూడాలంటే ఎం చేయాలి? అందుకు అనువైన ఉచిత సాఫ్ట్‌వేర్‌ సిద్ధంగా ఉంది. అదే IZArc. దీన్ని నిక్షితం చేసుకుని ZIP, RAR ఫైల్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయవచ్చు. అంతేనా! ముఖ్యమైన ఫైల్స్‌ని పాస్‌వర్డ్‌ లాక్‌తో భద్రం చేసుకునే వీలుంది. 7-ZIP, A, ACE, ARC, ARJ, B64, BH, BIN, BZ2... లాంటి మరిన్ని ఇతర ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. కావాల్సిన ఫైల్స్‌ని డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో సాఫ్ట్‌వేర్‌లోకి ఎంపిక చేసుకోవచ్చు. ఒకేసారి Multiple Archives క్రియేట్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/163s1

ప్లే చేయండి!
పీసీ, ట్యాబ్‌, మొబైల్‌... ఇలా డివైజ్‌ ఏదైనా యూట్యూబ్‌ వీడియోలకు అడ్డానే. మరి, బ్లాక్‌బెర్రీలో సులువైన ఆప్‌తో వీడియోలను చూడాలంటే? ఆప్‌స్టోర్‌లోకి వెళ్లి Player for YouTube డౌన్‌లోడ్‌ చేసుకోండి. సులువైన ఇంటర్ఫేస్‌తో వీడియోలను బ్రౌజ్‌, సెర్చ్‌ చేసి చూడొచ్చు. నచ్చిన వాటిని స్నేహితులతో షేర్‌ చేయవచ్చు. తర్వాత చూద్దాంలే అనుకుంటే బుక్‌మార్క్‌ చేసి పెట్టుకోవచ్చు కూడా. http://goo.gl/EU7Rl

ఫన్నీగా..!
చంద్ర మండలంపై కాలుపెట్టిన నీల్‌ అర్మ్‌ స్ట్రాంగ్‌ మాదిరిగా మీరో ఫోజిస్తే! అమెరికన్‌ డాలర్‌ నోటుపై ప్రెసిడెంట్‌లా మీ ఫొటోని పెట్టేస్తే! ఇంకా చెప్పాలంటే అవతార్‌ సినిమాలో హీరోలా మారిపోతే! ఎలా సాధ్యం అంటారా? Funny Photo Maker టూల్‌ని ప్రయత్నించి చూడండి. ఇదో ఉచిత అప్లికేషన్‌. సుమారు 150 రకాల టెంప్లెట్స్‌ ఉన్నాయి. వాటిల్లో కావాల్సింది సెలెక్ట్‌ చేసుకుని ఫొటోని అప్‌లోడ్‌ చేసుకుంటే సరి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/ChF1A

సెకన్లలోనే!
ఎక్కువ మెమొరీతో కూడిన ఫైల్స్‌ని మెయిల్‌ చేయడం సాధ్యం కాకపోతే GE.TTవెబ్‌లోకి లాగిన్‌ అయిపోంది. ఇదో ఫైల్‌ షేరింగ్‌ వెబ్‌ సర్వీసు. బ్రౌజ్‌పై క్లిక్‌ చేసి ఫైల్స్‌ని సెలక్ట్‌ చేయడం.... అప్‌లోడ్‌ చేయడం... ఇవేం అక్కర్లేదు. షేర్‌ చేయాల్సిన ఫైల్‌ని డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో సైట్‌లోకి అప్‌లోడ్‌ చేయవచ్చు. 2 జీబీ వరకూ ఉచితంగా వాడుకోవచ్చు.జీమెయిల్‌, అవుట్‌లుక్‌, ట్విట్టర్‌ల్లో కలుపుకుని ఈ వెబ్‌ సర్వీసుని వాడుకునే వీలుంది. http://ge.tt

'సాఫ్ట్‌' కార్నర్‌!
కొత్త ఏడాదిలో క్యాలెండర్‌ కోసం వెతకడం మామూలే. కానీ, Vueminder Lite USB టూల్‌ మీ పెన్‌డ్రైవ్‌లో ఉంటే ఎక్కడా వెతకక్కర్లేదు. ఎందుకంటే ఈ క్యాలెండర్‌ టూల్‌ని యూఎస్‌బీలోనే ఇన్‌స్టాల్‌ చేసుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈవెంట్స్‌ని సెట్‌ చేసుకుని అలారంతో రిమైండర్‌ పెట్టుకునే వీలుంది. లోకల్‌ వాతావరణ వివరాల్ని క్యాలెండర్‌లో చూడొచ్చు. మీకు కావాల్సిన వ్యూలో క్యాలెండర్‌ని సెట్‌ చేసుకోవచ్చు. సెట్‌ చేసిన ఈవెంట్స్‌ని డెస్క్‌టాప్‌పై నిత్యం మానిటర్‌ చేయవచ్చు. టూల్‌ని రన్‌ చేయాలంటే సిస్టంలో మైక్రోసాఫ్ట్‌ డాట్‌ నెట్‌ 3.5 ఉండాల్సిందే. http://goo.gl/hkMQT

ఇంగ్లిష్‌ టీచర్‌
తెలుగు మాట్లాడినంత ధారాళంగా ఇంగ్లిష్‌ మాట్లాడలేకపోతున్నారా? అయితే, మీరు వాడుతున్న స్మార్ట్‌ మొబైల్‌ని ఇంగ్లిష్‌ టీచర్‌గా మార్చేయాలంటే? అందుకు గూగుల్‌ ప్లే నుంచి Fluent English ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఉచితంగా స్టోర్‌ నుంచి పొందొచ్చు. 'ఆడియో బుక్‌ రీడర్‌'గా దీన్ని వాడుకోవచ్చు. అర్థం కాని పదాలకు డిక్షనరీలో చూసి తెలుసుకునే వీలుంది. పదాల్ని ఎలా పలకాలో చదివి వినిపిస్తుంది. అందుకు తెరపై కనిపించే స్పీకర్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే సరి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/2gtJ3

ఛార్జింగ్‌ ఆదా!
స్మార్ట్‌ మొబైల్‌ కోసం బ్యాటరీ ఛార్జింగ్‌ని సేవ్‌ చేసే అప్లికేషన్‌ ఒకటి సిద్ధంగా ఉంది. అదే Shake-Screen Off. పేరులో మాదిరిగానే మొబైల్‌ని చిత్రంలో మాదిరిగా ఒకసారి షేక్‌ చేస్తే చాలు. స్క్రీన్‌ ఆఫ్‌ అవుతుంది. ఎలాంటి ప్రత్యేక బటన్లను నొక్కాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/jai3q
Wise Folder Hider
ఇంట్లో అందరికీ ఒకే సిస్టం ఉంటే ఎవరి డేటా వారిది. ఎవరి ప్రైవసీ వారిది. మరి, మీకు సంబంధించిన వ్యక్తిగత ఫైల్స్, ఫోల్డర్‌లను ఇతరులకు కనిపించకుండా చేయాలంటే? అందుకు Wise Folder Hider సిద్ధంగా ఉంది. జిప్ ఫార్మెట్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఫోల్డర్‌ని EXE ఫైల్‌ని రన్ చేస్తే చాలు. మాస్టర్ పాస్‌వర్డ్‌ని పెట్టుకుని ఫైల్స్‌ని సురక్షితం చేసుకోవచ్చు. విండోలోకి కావాల్సిన ఫైల్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ పద్దతిలో సెలెక్ట్ చేసుకోవాలి. మాయం చేయాల్సింది ఫైల్ అయితే Hide File ని క్లిక్ చేయాలి. ఒకవేళ ఫోల్డర్ అయితే Hide Folder ఉంది. అలాగే, యూఎస్‌బీ డ్రైవ్‌లో కూడా హైడ్ చేయాలంటే Hide USB Drive ఉంది. http://goo.gl/uzJa1
FreeVimager
ఫొటోలను ఎడిట్ చేయాలంటే ఎక్కువగా ఫొటోషాప్ లాంటి అప్లికేషన్లనే వాడతాం. కానీ, ఫొటోషాప్‌లో వీడియో ఫైల్స్‌ని ప్లే చేసి చూడగలరా? దాన్ని సాధ్యం చేసే సాఫ్ట్‌వేర్ ఒకటుంది. ఫొటోలను ఎడిట్ చేసుకోవడంతో పాటు వీడియో, ఆడియో ఫైల్స్‌ని ప్లే చేసి చూసుకునే వీలు కల్పించే దాని పేరే FreeVimager. ఫొటోల ఎడిటింగ్‌కు Rotate, Resize, Adjust Brightness, Red Eye... లాంటి ఆప్షన్లు ఉన్నాయి. ఫొటోలకు బోర్డర్లను పెట్టుకునే వీలుంది. ఎడిట్ చేసిన ఫొటోలను పీడీఫ్ ఫార్మెట్‌లో సేవ్ చేసుకోవచ్చు కూడా. 'ఓపెన్ డాక్యుమెంట్'తో వీడియో, ఆడియో ఫైల్స్‌ని ప్లే చేసుకోవచ్చు. వీడియో ఫైల్‌ని 'పాజ్' చేసి కావాల్సిన సన్నివేశాన్ని 'శ్నాప్‌షాట్' ద్వారా ఇమేజ్ ఫైల్‌గా మార్చుకోవచ్చు. http://goo.gl/Pevcb