NEW ARRIVALS
ఇంకు బాటిళ్లతో
పెన్నులో ఇంకు అయిపోతే నింపుకొని వాడుకోవడం గుర్తుందా? అదే మాదిరిగా వాడుతున్న ప్రింటర్‌లోనూ ఇంకుని నింపుకొని వాడుకుంటే? కెనాన్‌ ‘పిక్స్‌మా సీ3010’ ప్రింటర్‌ అలాంటిదే. ‘హైబ్రిడ్‌ ఇంక్‌ సిస్టమ్‌’తో ఇది పని చేస్తుంది. ప్రింటర్‌కి ముందు భాగంలో ఏర్పాటు చేసిన ‘ఇంక్‌ ట్యాంకు’లో కావాల్సిన రంగులు నింపుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంకు ఎంత ఉందో చెక్‌ చేసుకోవడం సులభం. వైర్‌లెస్‌ పద్ధతిలో పరికరాలకు (ఫోన్‌, ట్యాబ్లెట్‌, పీసీ) అనుసంధానమై పని చేస్తుంది. ప్రింట్‌, కాపీ, స్కాన్‌ చేయొచ్చు. 1.2 అంగుళాల ఎస్‌సీడీ డిస్‌ప్లేతో కంప్యూటర్‌ అవసరం లేకుండానే ప్రింట్స్‌ని మేనేజ్‌ చేయడం సులభం. నాలుగు ఇంకు బాటిళ్లతో 6,000 నలుపు, తెలుపు ప్రింట్‌లు లేదంటే 7,000 రంగుల డాక్యుమెంట్‌లను ప్రింట్‌ తీసుకోవచ్చు. * ధర రూ.13,995
స్మార్ట్‌ లాంతర్‌
చిన్నప్పుడు ఎప్పుడో చూసిన లాంతర్‌లా కనిపిస్తోంది కదూ! నిజమేగానీ ఇది ఇప్పటి జనరేషన్‌ లాంతర్‌. 36 ఎల్‌ఈడీ లైట్‌లతో వెలుగుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రోజంతా వెలుగుతుంది. అంతేకాదు... యూఎస్‌బీ పోర్టుతో ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్‌లనూ ఛార్జ్‌ చేయొచ్చు. దీంట్లోని పవర్‌ బ్యాంకు సామర్థ్యం 4,500ఎంఏహెచ్‌. ఎస్‌డీ కార్డుని పెట్టుకుని పాటలు వినొచ్చు. ఎఫ్‌ఎం కూడా ఉంది. కరెంటు పోతే ఆటోమాటిక్‌గా లైట్‌ వెలుగుతుంది. * ధర రూ.3,000
బుల్లి ‘జేబీఎల్‌’
పోర్టబుల్‌ స్పీకర్ల జాబితాలో మ్యూజిక్‌ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న జేబీఎల్‌ మరో కొత్త వెర్షన్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ని దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అదే జేబీఎల్‌ గో2. నాణ్యమైన ఆడియో అవుట్‌పుట్‌తో వాటర్‌ప్రూఫ్‌ కవచంతో ముందుకొచ్చింది. దీంతో వచ్చే వానా కాలమంతా మ్యూజిక్‌ జడిలో మునిగితేలడమే. సముద్ర తీరాల్లో... కెరటాల అంచుల్లోనూ... మ్యూజిక్‌ ట్రాక్స్‌తో మస్తీ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఐదు గంటలు మ్యూజిక్‌ వినిపిస్తుంది. బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌తో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడొచ్చు. బయటి శబ్దాల్ని అడ్డుకుని ఫోన్‌ మాట్లాడుతున్న వారి మాటల్ని మాత్రమే వినిపిస్తుంది. 12 రంగుల్లో స్పీకర్లను అందిస్తున్నారు. * ధర రూ.2,999
అదిరే హెడ్‌ఫోన్‌
తోలుతో డిజైన్‌ చేసిన హెడ్‌బ్యాండ్‌తో ఆకట్టుకునేలా ముందుకొచ్చింది Ambrane WH-1100 హెడ్‌ఫోన్‌. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్‌లో జతకట్టి మ్యూజిక్‌ వినిపిస్తుంది. 10 మీటర్ల వరకూ నెట్‌వర్క్‌ని అందుకుంటుంది. ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 300ఎంఏహెచ్‌. ‘క్విక్‌ఛార్జ్‌’తో 90 నిమిషాల్లోనే ఫుల్‌ఛార్జ్‌ అవుతుంది. మైక్రోఫోన్‌తో ఫోన్‌కాల్స్‌ మాట్లాడొచ్చు. హెడ్‌సెట్‌కి ఒకవైపు వాల్యూమ్‌ కంట్రోల్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. * ధర రూ.2,199
బుల్లి స్పీకర్‌
కీచైన్‌ మాదిరిగా చేతిలో ఒదిగిపోయే బుల్లి బ్లూటూత్‌ స్పీకర్‌ ఇది. పేరు EDIFIER MP100. బ్లూటూత్‌ 4.0 వెర్షన్‌ టెక్నాలజీతో ఇతర గ్యాడ్జెట్‌లతో జత కట్టేస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డుని పెట్టుకుని కూడా మ్యూజిక్‌ వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 20 గంటలు నాన్‌స్టాప్‌ మ్యూజిక్‌ మస్తీ చేయొచ్చు. నీళ్లలో పడినా రక్షణగా వాటర్‌ప్రూఫ్‌ కవచం ఉంది. స్పీకర్‌తో ఫోన్‌కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు.
* ధర రూ.3,400
‘ప్రొజెక్టర్‌’లో ఆండ్రాయిడ్‌
అత్యుత్తమైన వీడియో క్వాలిటీతో కూడిన ప్రొజెక్టర్‌లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. అయితే, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేసే ప్రొజెక్టర్లు ప్రత్యేకమైనవి. వాటిల్లో ‘ఒప్టోమా ఎంఎల్‌330’ ఒకటి. హోం యూజర్లకు ఇది ప్రత్యేకం. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఆండ్రాయిడ్‌ 4.4 (కిట్‌క్యాట్‌) ఓఎస్‌ వెర్షన్‌తో ఇది పని చేస్తుంది. సినిమాలే కాకుండా వీడియో గేమ్స్‌ ఆడొచ్చు. పీసీ అవసరం లేకుండా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్స్‌ రన్‌ చేసుకుని చూడొచ్చు. వై-ఫై నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో నెట్టింట్లో అందుబాటులో ఉన్న వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసుల్ని యాక్సెస్‌ చేసి చూడొచ్చు. ఆప్స్‌ని (నెట్‌ప్లిక్స్‌, యూట్యూబ్‌...) రన్‌ చేసుకునే వీలుంది. 3డీ కంటెంట్‌ని సపోర్ట్‌ చేస్తుంది. హెచ్‌డీఎంఐ, మైక్రోఎస్‌డీ, యూఎస్‌బీ పోర్ట్‌, వై-ఫై, బ్లూటూత్‌, బిల్ట్‌ ఇన్‌ స్పీకర్లు ఉన్నాయి. ఇంట్లో హోం థియేటర్‌ స్పీకర్లను బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు.
* ఇతర వివరాలకు https://goo.gl/d36APF
సర్ఫేస్‌ ప్రొ వచ్చేసింది
మైక్రోసాఫ్ట్‌ మరో నాజూకైన మోడల్‌ని ‘సర్ఫేస్‌ ప్రొ’ పేరుతో దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. మందం 8.5 ఎంఎం. 4జీబీ మొదలుకుని 16జీబీ వరకూ ర్యామ్‌ని సపోర్ట్‌ చేస్తుంది. 13.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ మరో ప్రత్యేకత. ‘ల్యాప్‌టాప్‌, స్టూడియో, ట్యాబ్లెట్‌’ మోడ్‌ల్లో మల్టీపర్పస్‌గా దీన్ని వాడుకోవచ్చు. తాకేతెర పరిమాణం 12.3 అంగుళాలు. ‘పిక్సల్‌సెన్స్‌ టచ్‌ డిస్‌ప్లే’తో తీర్చిదిద్దారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ‘సర్ఫేస్‌ పెన్‌ 4’తో చిత్రలేఖనం చాలా సులభం. ‘సర్ఫేస్‌ ప్రొ సిగ్నేచర్‌ టైప్‌ కవర్‌4’ని డాక్‌ చేసి ల్యాప్‌టాప్‌ మోడ్‌లో ఆఫీస్‌ పని చేసుకోవచ్చు. 1.3 ఎంఎం మందంతో కూడిన కీబోర్డు టైపింగ్‌కి ఎంతో అనుకూలం. ఐదు వేళ్లతో మల్టీటచ్‌పై మ్యాజిక్‌ చేసేలా ‘ట్రాక్‌ప్యాడ్‌’ కీబోర్డులో ఉంది. ఇంటెల్‌ కోర్‌ ఎం3, ఐ5, ఐ7 ప్రాసెసర్లతో మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. బరువు 767 గ్రాములు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ అంగళ్లలో కొనుగోలు చేయొచ్చు. ఇతర వివరాలకు https://goo.gl/MKAJxK
ఈ బ్యాగులోవి కొట్టేయలేరు
కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు బ్యాక్‌పాక్‌ లేకుండా బయటికి పోలేని స్థితి. వస్తువుల్ని భద్రంగా మోసుకెళ్లాలంటే? LUGGబ్యాగు ధరిస్తే సరి. వైవిధ్యమైన డిజైన్‌తో బ్యాగుని తీర్చిదిద్దారు. తగిలించుకున్న బ్యాగు జిప్‌ని ఓపెన్‌ చేయడం ఇతరులకు అసాధ్యం. సామర్థ్యం 20 లీటర్లు. 15 అంగుళాల పరిమాణం ఉన్న ల్యాపీని సులువుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక అర ఉంది. ట్యాబ్లెట్‌, ఐపాడ్‌, మొబైల్‌... లాంటి ఇతర యాక్ససరీస్‌ని పెట్టుకునేందుకు లోపల ప్రత్యేక అరలు ఉన్నాయి. వర్షంలో ‘రెయిన్‌ ప్రూఫ్‌’ కవచంతో బ్యాగుని తడవకుండా కాపాడుకోవచ్చు.LUGG Plus మోడల్‌తో నీళ్ల బాటిల్‌ని పెట్టుకునేందుకు వీలుగా ‘బాటిల్‌ హోల్డర్‌’ని అందిస్తున్నారు. ధర రూ.1,500. పవర్‌ బ్యాంకుని బ్యాగులోపల ఏర్పాటు చేసిన యూస్‌బీ పోర్ట్‌కి అనుసంధానం చేసి ఫోన్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. ఇతర వివరాలకు https://goo.gl/FRU3jM
బుల్లి 4కే పీసీ
డెస్క్‌టాప్‌ కంప్యూటర్ల పక్కన చూసే సీపీయూని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే? భుజంపై పెట్టుకుని మోసుకెళ్లాల్సిందే. దీనికి పూర్తి భిన్నంగా సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (సీపీయూ)ని జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. కావాలంటే ‘లివా క్యూ’ కంప్యూటర్‌ని చూడండి. ఇది ప్రపంచంలోనే అతిచిన్న ‘4కే పాకెట్‌ పీసీ’. ఇంచుమించి మౌస్‌ అంతే ఉంటుంది. 2, 4 జీబీ ర్యామ్‌. 32, 64 జీబీ స్టోరేజ్‌ మెమొరీ. మైక్రో ఎస్‌బీ కార్డుతో మెమొరీ సామర్థ్యాన్ని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ముందు భాగంలో రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు (3.0, 2.0 వెర్షన్లు), కుడివైపు మైక్రో ఎస్‌డీ స్లాట్‌, వెనక హెచ్‌డీఎంఐ పోర్ట్‌, ఇథర్నెట్‌, మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. బ్లూటూత్‌, వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ‘ఇంటెల్‌ అపోలో లేక్‌ ఎస్‌ఓసీ’ ప్రాసెసర్‌ని వాడారు. బరువు 260 గ్రాములు. ఇంటెల్‌ గ్రాఫిక్స్‌ హెచ్‌డీ సపోర్ట్‌తో 4కే రిజల్యూషన్‌ వీడియోలను ప్రాసెసర్‌ సపోర్ట్‌ చేస్తుంది. ధర రూ.15,000. ఇతర వివరాలకు https://goo.gl/PMDWDb
నాజూకు ల్యాపీ
స్మార్ట్‌ ఫోన్లే కాదు. ల్యాపీలు కూడా తెరల తీరుని ఆధునికంగా మార్చుకుంటూ ముందుకొస్తున్నాయి. కావాలంటే ‘అసుస్‌ వివోబుక్‌ ఎస్‌14’ ల్యాపీని చూడండి. 14.8ఎంఎం మందంతో నాజూకుగా తీర్చిదిద్దారు. చూడ్డానికి 13 అంగుళాల సైజు ల్యాప్‌టాప్‌లా కనిపించినా... అంచుల వరకూ తెరతో 14 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే తెరని కలిగిఉంది. అందుకే ‘నానోఎడ్జ్‌ డిస్‌ప్లే’గా పిలుస్తున్నారు. కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ని వాడారు. 8జీబీ ర్యామ్‌, 512జీబీ ఇంటర్నల్‌ మెమొరీ అందిస్తున్నారు. ల్యాపీని సురక్షితంగా వాడుకునేలా టచ్‌ ప్యాడ్‌లో ‘ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌’ని నిక్షిప్తం చేశారు. బరువు 1.2కేజీలు. ఇతర వివరాలకు https://goo.gl/2uqRc1
గుండెకు రక్షణ
వ్యాయామానికి ఫిట్నెట్‌ ట్రాకర్లు వాడడం కొత్తేం కాదు. మార్కెట్‌లో పలు కంపెనీల బ్యాండ్‌ల సందడే సందడి! వీటికి తోడు GOQii సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ‘హార్ట్‌-రేట్‌ సెన్సర్‌’తో గుండె లయపై ఓ కన్నేయడమే కాకుండా నిపుణులైన డాక్టర్లతో నిరంతర పర్యవేక్షణని అందుబాటులోకి తెచ్చింది. GOQii Heart Care service పేరుతో సేవలు అందిస్తోంది. 3, 6, 12 నెలలకు నిర్ణీత ఫీజు చెల్లించి గుండె సంబంధిత డాక్టర్లకు డేటాని షేర్‌ చేయవచ్చు. ట్రాకర్‌ సేకరించిన డేటాని డాక్టర్లు విశ్లేషించి యూజర్లకు సూచనలు, సలహాలు అందిస్తారు. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ధర రూ.1,999. ఇతర వివరాలకు https://goo.gl/N5JtYr
ఇవి ఛార్జర్లే
చూస్తుంటే ఇవి పవర్‌బ్యాంకుల్లా అనిపించడం లేదు కదా! కానీ, ఇవో బుజ్జి పవర్‌ బ్యాంకులు. రొటీన్‌ పవర్‌ బ్యాంకుల్ని వాడి బోర్‌ అనిపిస్తే ఈ ‘మీట్‌ ఫింగర్‌ ఫౌ’ పోర్టబుల్‌ ఛార్జింగ్‌ పాడ్స్‌ని ప్రయత్నించొచ్చు. అయస్కాంత శక్తితో ఫోన్‌ ఛార్జింగ్‌ పోర్టుకి కనెక్ట్‌ అయ్యి ఛార్జ్‌ చేస్తాయి. ఐఫోన్‌ 8 మోడల్‌ని 30 నిమిషాల్లో 25 శాతం వరకూ ఛార్జ్‌ చేస్తుంది. డాక్‌ స్టేషన్‌పై నాలుగు పాడ్స్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. ఒక్కో పాడ్‌ మెమొరీ సామర్థ్యం 600ఎంఏహెచ్‌. పాడ్‌ బరువు 15 గ్రాములు.

శామ్‌సంగ్‌ స్పీకర్‌

స్మార్ట్‌ఫోన్లలో పిలిస్తే పలికే బిక్స్‌బీ అసిస్టెంట్‌ని పరిచయం చేసిన శామ్‌సంగ్‌ త్వరలోనే స్మార్ట్‌ స్పీకర్‌ని మార్కెట్‌లోకి తేనుంది. గూగుల్‌, అమెజాన్‌ స్పీకర్లలో మాదిరిగానే శామ్‌సంగ్‌ స్పీకర్‌ బిక్స్‌బీతో జట్టుకట్టి పని చేస్తుందట. అంతేనా.. శామ్‌సంగ్‌ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లతోనూ సింక్‌ అయ్యి సంగతులు చెబుతుంది. ఇంటినీ స్మార్ట్‌గా మార్చేసి బల్బ్‌లు, తాళాల్ని స్పీకరే కంట్రోల్‌ చేస్తుందట. ఇప్పటికే సందడి చేస్తున్నవి..
* గూగుల్‌- గూగుల్‌ హోమ్‌ విత్‌ అసిస్టెంట్‌
* అమెజాన్‌- ఎకో విత్‌ అలెక్సా
* యాపిల్‌- సిరి విత్‌ హోంప్యాడ్‌
* మైక్రోసాఫ్ట్‌- కార్టానా విత్‌ ఇన్‌వోక్‌

‘ఫైర్‌ టీవీ’లో ఫైర్‌ఫాక్స్‌

అమెజాన్‌ తీసుకొచ్చిన ‘ఫైర్‌ టీవీ స్టిక్‌’తో ఇక మీదట టీవీల్లో ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ని వాడుకోవచ్చు. ఇప్పటి వరకూ ప్రయోగాత్మకంగా ‘సిల్క్‌’ బ్రౌజర్‌తో మాత్రమే పరిచయం చేసిన వెబ్‌ విహారాన్ని ఇక మీదట ఫైర్‌ఫాక్స్‌ని వేదిక చేసుకుని కూడా వెబ్‌ సర్వీసుల్ని చూడొచ్చు.

వ్యసనానికో ‘డమ్మీ’

స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో లేనిదే దిక్కు తోచని పరిస్థితి. ఫోన్‌తో పని ఉన్నా... లేకపోయినా.. పదే పదే అన్‌లాక్‌ చేయడం... స్క్రోల్‌ చేయడం... చేస్తుంటారు. దీన్నో వ్యసనంగానూ, మానసిక రోగంగానూ పరిగణిస్తూ ‘నొమోఫోబియా’ అని పేరు కూడా పెట్టేశారు. మరి, ఈ వ్యసనం నుంచి ఎవరిని వారు కాపాడుకోవడం ఎలా? స్మార్ట్‌ ఫోన్‌కి దూరంగా గడపడం ఎలా? ఏముందీ... ఓ డమ్మీ ఫోన్‌ని చేతిలో పెట్టుకుంటే సరి. పక్కన కనిపించేది అలాంటిదే. ‘సబ్‌స్టిట్యూట్‌ ఫోన్‌’గా దీన్ని పిలుస్తున్నారు. అచ్చంగా స్మార్ట్‌ ఫోన్‌ మాదిరిగానే ప్రత్యేక ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. పరిమాణం 5.5 అంగుళాలు. అడ్డం, నిలువు, మూలగా... పలు కోణాల్లో చిన్న బంతుల్ని ఒక వరుసలో అమర్చారు. చిత్రంలో మాదిరిగా కనిపించే వీటిపై యూజర్లు వేళ్లతో తాకుతూ స్క్రోల్‌, స్వైప్‌, జూమ్‌ఇన్‌, జూమ్‌అవుట్‌ చేయవచ్చు. దీంతో మొబైల్‌ ఫోన్‌ చేతిలోనే ఉన్న అనుభూతిని పొందుతూ నిజమైన తాకేతెరలకు దూరమవ్వచ్చు. ఆ తర్వాత మెల్లగా ఫోన్‌ వ్యసనానికి దూరం కావొచ్చట. ఈ డమ్మీ ఫోన్‌ని ఆస్ట్రేలియాకి చెందిన క్లెమెన్స్‌ స్కిల్లింగర్‌ తీర్చిదిద్దారు.

హాయిగా నిద్రపోండి

రాత్రి బస్సులో ప్రయాణాలు చేసేటప్పుడు ఎల్‌సీడీలో సినిమా పెట్టేస్తారు. మీకు ఇష్టం ఉన్నా... లేకపోయినా... సినిమా సందడిని చెవులు వినాల్సిందే. నిద్రపోవాలంటే కొంచెం కష్టమే. ఇంకా చెప్పాలంటే... ఒకే మంచం.. పక్కనే జీవిత భాగస్వామి గురక. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టని పరిస్థతి. ఇలాంటి సందర్భల్లో హాయిగా నిద్రపోవాలంటే? ‘బోస్‌ స్లీపింగ్‌బడ్స్‌’ని చెవిలో పెట్టుకుంటే సరి. ఇప్పటి వరకూ స్పీకర్లు, హెడ్‌ఫోన్‌ల తయారీలోనే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బాస్‌ కంపెనీ కొత్తగా ఈ బడ్స్‌ని రూపొందించింది. వీటిని చెవిలో పెట్టుకుంటే బయటి నుంచే వచ్చే శబ్దాల్ని అడ్డుకుని చెవిలో ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ని ప్లే చేస్తూ ప్రశాంతంగా నిద్రించడానికి తోడ్పడతాయి. సెలయేటి గలగలలు, చిటపట చినుకులు, సముద్రపు అలల, ప్రకృతి పిలుపులు... ఇలా మీ అభిరుచికి తగిన శబ్దాల్ని సెలెక్ట్‌ చేసుకుని వింటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రత్యేక ఆప్‌తో అలారం సెట్‌ చేసుకుని నిర్ణీత సమయానికి నిద్రలేవొచ్చు.

బుల్లి ప్రింటర్‌

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లతో జతకట్టి... జేబులోనే ఒడిగిపోయేలా హెచ్‌పీ కంపెనీ బుల్లి ప్రింటర్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు హెచ్‌పీ ‘స్ప్రాకెట్‌’. ఫొటోగ్రఫీ, పర్యాటక ప్రియుల్ని దృష్టిపెట్టుకుని దీన్ని తీర్చిదిద్దారు. ఫోన్‌తో తీసిన ఫొటోని బ్లూటూత్‌ కనెక్టివిటీతో చిటికెలో కలర్‌ ఫొటో ప్రింట్‌ తీసుకోవచ్చు. ఫొటో పరిమాణం 2x3 అంగుళాలు. రిజల్యూషన్‌ 313x400 డిపీఐ. హెచ్‌పీ ‘జింక్‌ పేపర్‌’ని ప్రింటింగ్‌కి వాడారు. ప్రింటర్‌ బరువు 170 గ్రాములే. బ్లూటూత్‌ కనెక్షన్‌తో ఫోన్‌, ట్యాబ్‌లతో జట్టుకడుతుంది. ఫోన్‌ లేదా ట్యాబ్‌ నుంచి ప్రింట్‌ తీసుకునేందుకు అనువుగా ప్రత్యేక హెచ్‌పీ స్ప్రాకెట్‌ని ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆప్‌తో ఫొటోలను ఆకట్టుకునేలా ఎడిట్‌ చేయవచ్చు. ధర రూ.8,999.
ఇతర వివరాలకు https://goo.gl/3oesNY

వ్యాలెట్‌ లాంటిదే... కానీ!

డబ్బులు దాచుకునే వ్యాలెట్‌కు సాంకేతిక హంగులు జోడించింది వాల్టర్‌మాన్‌. ఈ వ్యాలెట్‌ చూడటానికి సాధారణ పర్సులానే ఉంటుంది. ఇందులో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు లాంటివి పెట్టుకోవచ్చు. ఇందులో ఓ ప్రత్యేకమైన చిప్‌ కూడా ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. తొలుత వ్యాలెట్‌ను బ్లూటూత్‌ సాయంతో మొబైల్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఆ తర్వాత వ్యాలెట్‌ అనుబంధ ఆప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీని సాయంతో మీ మొబైల్‌ను ట్రాక్‌ చేయొచ్చు. దీనిపై ఉండే బటన్‌ను టచ్‌ చేస్తే మొబైల్‌ నుంచి రింగ్‌ వస్తుంది. మొబైల్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఈ రింగ్‌ ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మొబైల్‌ చోరీ అయితే వ్యాలెట్‌ వెబ్‌సైట్‌లో దాని కదలికల్ని తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లో కెమెరా ఆప్షన్‌ కూడా ఉంది. దీంతో సులభంగా ఫొటోలు తీసుకోవచ్చు.

ఇదో రకం వాచీ

‘కు కు కు...’, ‘టింగ్‌ టింగ్‌...’ లాంటి అలారమ్‌ శబ్దాలన్నీ ఇప్పుడు మొబైల్‌ ఫోన్లలోనే. ఉదయాన్నే నిద్రలేపే అలారం వాచీల స్థానంలో ఎప్పుడో మొబైళ్లు వచ్చేశాయి. అయినా పాత తరం అలారం వాచీని వాడాలనుకుంటున్నారా? అయితే కాస్త స్మార్ట్‌గా పని చేసే Lexon’s In-Out clock ని వాడి చూడండి. రెండు భాగాలుగా కనిపించే ఈ వాచీలో కింది భాగంలో సాధారణ సమయం కనిపిస్తే, పైన ఉండే రెండో భాగంలో అలారం సెట్‌ చేసుకున్న సమయం కనిపిస్తుంది. మొబైల్‌లో అయితే అలారమ్‌ పెట్టుకుంటే పైన ఐకాన్‌ కనిపిస్తుంది. మరి ఇందులో ఎలా అంటారా? దానికీ ఓ ఆప్షన్‌ ఉంది. ఈ వాచీపైన ఉన్న చిన్న ముక్క లాంటి బాక్స్‌ పైకి కనిపిస్తుంటే అలారం సెట్‌ చేసుకున్నట్లు. అదే లోపలకు వెళ్లిపోయుంటే అలారం ఆన్‌లో లేనట్లు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర సుమారు రూ. 3050.

మీటల్లేవ్‌.. మాటలే

జోరు వర్షంలో బ్లూటూత్‌ స్పీకర్‌లో పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తే బాగుంటుంది కదా! ఎలా కుదురుతుంది.. నీళ్లు పడి స్పీకర్‌ పాడైపోతుంది కదా అంటారా? మామూలు స్పీకర్లు అయితే మీరన్నది కరక్టే. అదే ‘బియోప్లే పీ2’ బ్లూటూత్‌ స్పీకర్‌ వాడితే ఆ ఇబ్బందేం ఉండదు. అల్యూమినియం, లెదర్‌తో తయారు చేసిన ఈ స్పీకర్‌ వాటర్‌ రెసిస్టెంట్‌. అంతేకాదు దీనికి బటన్‌లు కూడా ఉండవు. పాటలు ప్లే అవ్వాలన్నా, ఆగాలన్నా స్పీకర్‌పై ఒకసారి తడితే సరి. పాటల్ని మార్చాలనుకుంటే షేక్‌ చేస్తే సరి. దీని అనుబంధ ఆప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని దాంతో యాక్సెస్‌ చేయొచ్చు. ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేసుకుంటే పది గంటలపాటు దీన్ని వాడుకోవచ్చు.

‘వేలెత్తు’... ఫోన్‌ మాట్లాడు

అదేదో సినిమాలో వేలిని చెవి దగ్గర పెట్టి ఫోను మాట్లాడుతుంటాడు అలీ. ఇదేంటి అంటే కొత్త సాంకేతికత అంటాడు. అప్పుడు అందరూ నవ్వుకున్నారు కానీ... ఇప్పుడు అలా వేలు చెవుల దగ్గర పెట్టి ఫోన్‌ మాట్లాడొచ్చు. Orii smart ring తో ఇది వీలవుతుంది. వేలికి పెట్టుకునే ఉంగరంలా ఉండే దీన్ని బ్లూటూత్‌తో మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని వేలికి తగిలించుకోవాలి. అప్పుడు మొబైల్‌కు కాల్‌ వస్తే వేలిని చెవి దగ్గర తాకించి కాల్‌ అటెండ్‌ చెయ్యొచ్చు. చెవి దగ్గర వేలును టచ్‌ చేసినప్పుడు వేలి కదలిక వల్ల దానికున్న రింగ్‌ యాక్టివేట్‌ అయ్యి కాల్‌ అటెండ్‌ అవుతుంది. అంతేకాదు ఈ రింగ్‌తో ఆపిల్‌ సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ను కూడా యాక్సెస్‌ చేయొచ్చు. కిక్‌స్టార్టర్‌ వెబ్‌సైట్‌లో ఇది వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తుంది.

బొమ్మ... శబ్దం కలసి

టీవీ తెర ఇప్పటి వరకు బొమ్మ మాత్రమే చూపిస్తోంది... శబ్దం వినిపించడానికి స్క్రీన్‌ వెనుకో లేక కిందో స్పీకర్లు ఉంటాయి. త్వరలో స్పీకర్లు కనిపించని టీవీలు రాబోతున్నాయి. చక్కనైన బొమ్మ చూపిస్తూ, వినసొంపైన శబ్దం వినిపించేలా సోనీ కొత్త తరహా స్క్రీన్లతో టీవీని రూపొందించింది. సోనీ ఏ1ఈ టీవీ పేరుతో త్వరలో లాంచ్‌ కానున్న ఈ టీవీ తెర ప్రత్యేకంగా ఉండబోతోంది. ఓఎల్‌ఈడీ తరహాలో ఉండే వీటిలో స్పీకర్లు కూడా ఉండబోతున్నాయి. ఓఎల్‌ఈడీ తెరకు లైట్ల అవసరం లేకపోవడంతో వాటి స్థానంలో స్పీకర్‌ను ఇమిడ్చి కొత్త టీవీలు రూపొందించారు. ‘4కె హెచ్‌డీఆర్‌ ప్రోసెసర్‌ ఎక్స్‌ 1 ఎక్స్‌ట్రీమ్‌’ ప్రోసెసర్‌ వల్ల ఇది సాధ్యమవుతుంది. డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ సాంకేతికతతో రూపొందే ఈ టీవీ తెరలు చాలా పలుచగా ఉంటాయి. ఇందులో 55, 65, 77 అంగుళాల వెర్షన్లున్నాయి.

ఎలా ఉన్నారో చెబుతుంది

‘ఈ డ్రెస్‌ ఎలా ఉంది... నాకు సూట్‌ అవుతుందా?’- కొత్త బట్టలు వేసుకుంటున్నపుడు లేదా ట్రయిల్‌ వేస్తున్నప్పుడు మీ స్నేహితుడినో, స్నేహితురాలినో అడిగే మాట ఇది. త్వరలో మీరీ మాట ఓ కెమెరాను అడగొచ్చు. దానికి ఆ కెమెరా ఎంచక్కా సమాధానం కూడా చెప్పేస్తుంది. అవును... అలాంటి సాంకేతికతతో అమెజాన్‌ ఓ గ్యాడ్జెట్‌ను రూపొందించింది. వాయిస్‌ అసిస్టెంట్‌ అమెజాన్‌ ఎకో తరహాలో పని చేసే ఈ సరికొత్త గ్యాడ్జెట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతతో పని చేస్తుంది. ఇది మీ మాటలు విని దానికి తగ్గట్టు నడుచుకుంటూ, అవసరమైన సమాధానాలు చెబుతుంది. కొత్త బట్టలు ట్రయిల్‌ వేస్తున్నప్పుడు దాని ముందు నిలబడి ‘అలెక్సా టేక్‌ ఏ పిక్చర్‌’ అంటే మీ ఫొటోను క్లిక్‌ చేసి మీ ఫ్యాషన్‌ను అంచనా వేసి చెబుతుంది. దాని బట్టి ఆ డ్రెస్‌ కొనాలో వద్దో మీరే నిర్ణయించుకోవచ్చు. అలా మీరు తీసుకున్న ఫొటోలను కలిపి ఓ లుక్‌బుక్‌ కూడా రూపొందించుకోవచ్చు.

భావాలు తెలిపే ట్రాకర్లు

పెంపుడు జంతువులు కనిపించకపోతే వాటి జాడ తెలుసుకోడానికి ట్రాకర్లను వాడుతుంటారు. ఇవి ఆ జంతువుల మనోభావాలు కూడా చెబితే...! విచిత్రంగా ఉంది కదా ఈ ఆలోచన. Kyon అనే సంస్థ రూపొందించిన పెట్‌ ట్రాకర్‌తో ఇది సాధ్యమవుతోంది. బ్లూటూత్‌, జీపీఎస్‌, మొబైల్‌ డేటా ఆధారంగా పని చేసే ఈ ట్రాకర్‌ని శునకం మెడకు తగిలించాలి. ఆ తర్వాత దాన్ని మొబైల్‌కు అనుసంధానం చేసుకోవాలి. ట్రాకర్‌ ఎప్పటికప్పుడు పెంపుడు జంతువు స్థితిని అంచనా వేసి మీకు సమాచారం అందిస్తుంది. శునకం కోపంతో మొరిగితే ట్రాకర్‌ నుంచి ఓ రకమైన శబ్దం వస్తుంది. దీంతో శునకం మొరగడం ఆపేస్తుంది. దీంతోపాటు జంతువు శరీర ఉష్ణోగ్రత వివరాలను మీ మొబైల్‌కు పంపిస్తుంది. దీని వల్ల శునక పోషణ సులభమవుతుంది. మీ పెంపుడు జంతువు మీరున్న ప్రాంతం నుంచి 300 మీటర్లకు మించి దూరంగా వెళ్తే ట్రాకర్‌ మీ మొబైల్‌కు సమాచారం పంపిస్తుంది. ధర సుమారు 250 డాలర్లు.

గుండెచప్పుడూ వింటుంది

ఎన్ని అడుగులేశాం, ఎంత దూరం నడిచాం... లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను వాడుతుంటాం. మీ హార్ట్‌బీట్‌ మీదా కన్నేసి ఉంచే ట్రాకర్‌లు కొన్ని ఉన్నాయి. అలాంటి సాంకేతికతతో లెనోవో ఓ ట్రాకర్‌ను విడుదల చేసింది. ‘లెనోవో స్మార్ట్‌బ్యాండ్‌ హెచ్‌డబ్ల్యూ 01’ పేరుతో రూపొందిన దీని ధర రూ. 1999. కసరత్తులు చేసినప్పుడు ఖర్చయిన కెలోరీలు, నడిచిన దూరం లాంటి వివరాలను ఇది నమోదు చేసుకుంటుంది. ప్రతి 15 నిమిషాలకొకసారి మీ గుండె కొట్టుకునే విధానాన్ని మోనిటర్‌ చేస్తుంది. హార్ట్‌బీట్‌లో భారీ మార్పులు వచ్చినప్పుడు ఈ ట్రాకర్‌ వైబ్రేషన్‌ ద్వారా మీకు సూచిస్తుంది.

‘ఐ’తో రెండు మొబైళ్లు

ఐఫోన్‌లో ఆండ్రాయిడ్‌... ఈ మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే అది లాంచర్ల వరకు పరిమితమైపోయింది. ఆండ్రాయిడ్‌ తరహా లాంచర్‌ వేసుకోవడం వల్ల ఐఫోన్‌ స్క్రీన్‌, ఐకాన్లు కనిపించే విధానం మాత్రమే మారుతుంది. ఇప్పుడు ఏకంగా ఐఫోన్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌గా వాడుకోగలిగే గ్యాడ్జెట్‌ సిద్ధమవుతోంది. దీని పేరు Eye. మొబైల్‌ బ్యాక్‌ కేస్‌లా ఉండే ఈ గ్యాడ్జెట్‌ను జోడించి మీ ఆపిల్‌ ఫోన్‌ను, ఆండ్రాయిడ్‌ ఫోన్‌గానూ వాడుకోవచ్చు. తాకే తెర, సిమ్‌ స్లాట్‌ లాంటి అంశాలతో ఈ బ్యాక్‌ కవర్‌ అచ్చంగా మొబైల్‌ లాగే కనిపిస్తుంది. మీ ఐఫోన్‌ను దీనికి కనెక్ట్‌ చేస్తే.. గ్యాడ్జెట్‌ తెర యాక్టివేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి ఒకవైపు ఆపిల్‌ ఫోన్‌, మరోవైపు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను వాడుకోవచ్చు. ‘ఐ’ స్పెసిఫికేషన్లు చూస్తే... అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. డ్యూయల్‌ సిమ్‌ స్లాట్‌, ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయాలుంటాయి. దీని ధర సుమారు 189 డాలర్లు. ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి ఐఫోన్‌ 6,7 సిరీస్‌ మొబైళ్లకు ఈ కేస్‌ సపోర్టు చేస్తుంది.

అన్నీ నమోదు చేస్తుంది

* ఆఫీసు మీటింగ్‌లో మీరు మాట్లాడిందంతా ఎవరైనా నోట్‌ చేసిస్తే బాగుండనిపించిందా?
* జాగింగ్‌ చేస్తుండగా వచ్చిన ఆలోచనలు రాద్దామంటే పరుగు ఆపాల్సి వస్తోందా?
మీకూ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఉంటాయి. ఇలా రాసుకోలేని పరిస్థితుల్లో మీరు చెప్పిన విషయాలు రికార్డు అయి, తర్వాత వినగలిగితే, ఆ మాటలను అక్షరాల రూపంలో చూడగలిగితే బాగుంటుంది కదా. Senstone వాయిస్‌ రికార్డర్‌ ఈ పని చేసి పెడుతుంది. పెద్దసైజు చొక్కా బటన్‌లా ఉండే దీన్ని కాలర్‌కు తగిలించుకోవాలి. ఆ తర్వాత మీరు ఏదైనా రికార్డు చేయాలనుకున్నప్పుడు దానిపై తడితే చాలు. మీ మాటల్ని అది రికార్డు చేసుకుంటుంది. మళ్లీ తడితే రికార్డింగ్‌ ఆగిపోతుంది. బ్లూటూత్‌తో మొబైల్‌కు కనెక్ట్‌ చేస్తే ఆ సమాచారమంతా అనుబంధ మొబైల్‌లో ఆప్‌లో నిక్షిప్తమైపోతుంది. వాయిస్‌తోపాటు, టెక్స్ట్‌ కూడా ఆప్‌లో కనిపిస్తుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ రికార్డరును త్వరలో మార్కెట్‌లోకి తీసుకొస్తారు. ఇది 11 భాషలను డిటెక్ట్‌ చేస్తుంది.

ఆపిల్‌ ఏఆర్‌ అద్దాలు

ఇప్పుడు సాంకేతిక ప్రపంచం అంతా ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) వైపే చూస్తోంది. నిజ జీవితానికి, సాంకేతికతకు లంకె కుదిర్చి అద్భుతాలు చేయడం దీని ప్రత్యేకత. మొబైల్‌ దిగ్గజం ఆపిల్‌ కన్ను దీనిపై పడింది. ఏఆర్‌ ఆధారంగా ఐగ్లాసెస్‌ అనే కళ్లజోడును రూపొందిస్తోంది. ఆపిల్‌ సంస్థ ఏర్పాటై ఈ ఏడాదికి పదేళ్లవుతోంది. ఈ ప్రత్యేక సమయంలో ఆపిల్‌ నుంచి ఏ ఉత్పత్తి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగా ఈ విషయం బయటికి వచ్చింది. ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీలో అనుభవం ఉన్న రాబర్ట్‌ స్కోబల్‌తో కలసి ఆపిల్‌ ఐగ్లాసెస్‌ను రూపొందిస్తోంది.

చల్లగా ఉంచుతుంది

వేసవి వచ్చేస్తోంది... వేడి పెరుగుతోంది. ఈ సమయంలో ఒంటి మీద చొక్కా కూడా కుంపటిలాగే అనిపిస్తుంది. అలా కాకుండా చల్ల దనాన్ని ఇచ్చే కోటు ఉంటే బాగుంటుంది కదా. అలాంటి కూలింగ్‌ కోటును ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) తయారు చేసింది. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ కోటు ధర సుమారు రూ. రెండు వేలు. ఈ కోటును మూడు లేయర్లతో రూపొందించారు. ఒక లేయర్‌లో కాటన్‌ క్లాత్‌ ఉంటుంది. దాని దిగువన లాటెక్స్‌ ట్యూబింగ్‌, దాని కింద ఇంటర్‌ స్పేస్డ్‌ కోటింగ్‌ ఉన్న రబ్బరైజ్డ్‌ సొల్యూషన్‌ ఉంటాయి. అందులో ప్రత్యేకమైన నీటిని నిల్వ ఉంచుతారు. బ్యాటరీ సాయంతో ఆ నీళ్లు ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుతం ఈ సాంకేతికతతో నొయిడాలోని కూథీ హెల్త్‌ కేర్‌ సంస్థ కోట్లు తయారు చేస్తోంది. మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి వీటి ధర ఇంకా తగ్గుతుందని సమాచారం. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పని చేసేవాళ్లు ఆ ఉష్ణోగ్రత వల్ల ఇబ్బంది పడకుండా ఈ కోటు ఉపయోగపడుతుంది.

టోపీ నుంచి లైవ్‌

వీడియోల ప్రత్యక్ష ప్రసారం కోసం సోషల్‌ మెసేజింగ్‌ ఆప్‌ స్నాప్‌చాట్‌ ఇటీవల కళ్లద్దాలు విడుదల చేసింది. ఇవి విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ తరహాలో గూగుల్‌ ఓ టోపీని రూపొందిస్తోంది. టోపీ బ్రిమ్‌లో (ముందు భాగం) ఉండే కెమెరాతో వీడియోను చిత్రీకరించి అనుబంధ ఆప్‌ ద్వారా సోషల్‌ నెట్‌వర్క్స్‌లో షేర్‌ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పేటెంట్‌ను గూగుల్‌ ఇటీవల పొందింది. గతంలో ఇదే తరహాలో గూగుల్‌ గ్లాస్‌ను రూపొందించింది. అయితే ధర ఎక్కువగా ఉండటంతో అవి అనుకున్న స్థాయిలో మార్కెట్‌లో ఆదరణకు నోచుకోలేదు. అందుకే ఈ సారి తక్కువ ధరలో టోపీని తయారు చేసే పనిలో పడింది. గూగుల్‌ గ్లాస్‌ తరహాలోనే ఇందులోనూ ఇయర్‌ ఫోన్లు ఉండవు. ప్రత్యేక సాంకేతికత ద్వారా ఎముకల ఆధారంగా శబ్దం మెదడులోకి చేరుతుందట.

తాకొచ్చు...వాసన ఆస్వాదించొచ్చు

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) హెడ్‌సెట్‌ పెట్టుకొని మనం కూర్చున్న చోటు నుంచే అంతరిక్షంలో విహరించినట్టో, నీటిలో ఈదుతున్నట్టో... ఇలా చాలా అనుభూతులు పొందుతున్నాం. త్వరలో అయా ప్రాంతాల్లో ఉండే వాసనలు ఆస్వాదించడం, చేతి కందే వస్తువులను తాకిన అనుభూతిని పొందొచ్చు. ప్లే స్టేషన్‌ వీఆర్‌ ఆధారంగా రూపొందించిన వీఆర్‌ సెన్స్‌ క్యాబిన్‌లతో ఇది సాధ్యమవుతుంది. ఈ క్యాబిన్‌లో కూర్చుని వీఆర్‌ హెడ్‌సెట్‌తో వీడియోలను వీక్షిస్తే ఆ ప్రాంతంలో ఉన్నట్లు అనిపించడంతోపాటు, ఆక్యాబిన్‌లో చేసిన ప్రత్యేక ఏర్పాటు వల్ల శరీరానికి నీళ్లు తాకుతున్న అనుభూతి కూడా కలుగుతుంది. పరిసరాల వాసన కూడా తెలుస్తుంది. క్యాబిన్‌లోని కుర్చీ వీడియోకు తగ్గట్టుగా కదులుతూ ఆ ప్రాంతంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. Dynasty Warriors, GI Jockey Sense, Horror Sense లాంటి కొన్ని ఆటలకూ ఈ వీఆర్‌ క్యాబిన్‌ పని చేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేస్తారు.

ఇద్దరికీ తెలిసేలా...

పైన ఫొటోలో ఉన్నది మామూలు బ్రాస్లెట్‌ కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ‘కడుపులో బిడ్డ తంతోంది’ అంటూ ఆనందంతో చెబుతుంటుంది తల్లి. అలాంటి ఆనందం తండ్రికి కూడా తెలిస్తే బాగుంటుంది కదా అనుకొంది స్వీడన్‌కు చెందిన ఓ డైపర్ల సంస్థ. అందుకే ఈ బ్రాస్లెట్‌ తయారు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఈ బ్రాస్లెట్‌ను ధరించాలి. ఆ తర్వాత కడుపులో బిడ్డ తన్నినప్పుడు, గుండ్రంగా అటూ ఇటూ తిరిగినప్పుడు తన బ్రాస్లెట్‌ పైనున్న అలర్ట్‌ బటన్‌ను టచ్‌ చేయాలి. అప్పుడు తండ్రి చేతికున్న బ్రాస్లెట్‌లో వైబ్రేషన్‌ వస్తుంది. అలా బిడ్డ కదలికల గురించి తండ్రి తెలుసుకోవచ్చన్నమాట. దీని కోసం తల్లిదండ్రులు పక్కపక్కనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు బ్రాస్లెట్లను మొబైల్‌ ఆప్‌కు అనుసంధానం చేసుకుంటే సరి. బ్లూటూత్‌ ఆధారంగా ఇది పని చేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది.

శాంసంగ్‌ మూడో వాచీ

కొత్త ఏడాదిలో శాంసంగ్‌ నుంచి తొలి ఉత్పత్తిగా శాంసంగ్‌ గేర్‌ 3 వాచీ విడుదలైంది. గతేడాది బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏలో ఈ వాచీని ప్రదర్శించారు. ఇందులో బిల్ట్‌ ఇన్‌ స్పీకర్‌ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్‌ వల్ల మొబైల్‌కు వాచీని అనుసంధానం చేసుకొని కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. 1.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 1.0 జీహెచ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. 768 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. 380 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. బరువు 63 గ్రాములు. సుమారు రూ.55 వేల ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

టచ్‌ చేస్తే ఆగుతుంది

తలకు హెడ్‌ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటున్నారు... ఇంతలో పక్కనున్న వాళ్లు ఏదో చెబుతున్నారు! ఆ మాటలు వినాలంటే హెడ్‌ఫోన్‌ తీయక్కర్లేదు. దానిపై అలా తడితే చాలు పాట ప్లే అవ్వడం ఆగిపోతుంది. మళ్లీ చేయి తీసేస్తే పాట ప్లే అవుతుంది. ఇది ‘క్యూ అడాప్ట్‌ ఆన్‌ ఇయర్‌’ హెడ్‌ ఫోన్‌తో సాధ్యమవుతుంది. బ్లూటూత్‌తో ఈ హెడ్‌ఫోన్‌ను మొబైల్‌తో కనెక్ట్‌ చేసుకోవాల్సి. ఇందులో వాల్యూమ్‌ తగ్గించడానికి బటన్స్‌ ఏమీ ఉండవు. స్పీకర్‌ బాక్స్‌ మీద చేత్తో అపసవ్య దిశలో సున్నా చుడితే వాట్యూమ్‌ తగ్గిపోతుంది. ప్లే, పాస్‌ను కూడా ఇలానే చేయొచ్చు. మీ హెడ్‌సెట్‌లో ప్లే అవుతున్న పాటలను బ్లూటూత్‌ ద్వారా మరొకరితో షేర్‌ చేసుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి కూడా ఇదే హెడ్‌సెట్‌ వినియోగించాల్సి ఉంటుంది. మూడు గంటలపాటు ఛార్జ్‌ చేస్తే 20 గంటల వరకు వాడుకోవచ్చు. దీని ధర సుమారు రూ. 13,000. https://www.libratone.com లో అమ్మకానికి ఉన్నాయి.

ముద్దుకో పరికరం

నువ్వక్కడుండి... నేనిక్కడుంటే ప్రాణం విలవిలా... అంటూ ఇక విరహ గీతాలు పాడుకోనవసరం లేదు. మనుషులు ఎక్కడున్నా... మనసైన వారికి ముద్దు పెట్టొచ్చు. మీ మొబైల్‌లో ముద్దు పెడితే అవతలి వ్యక్తికి ఆ అనుభూతి కలిగేలా ఓ గ్యాడ్జెట్‌ రూపొందించారు. దాని పేరు కిసెంజర్‌. మెసెంజర్‌లా కిసెంజర్‌ అన్నమాట. ఎమ్మా యాన్‌ జాంగ్‌ అనే శాస్త్రవేత్త దీన్ని తీర్చిదిద్దారు. ఈ కిసెంజర్‌ను వినియోగించాలనుకుంటే ముందుగా ఇద్దరూ తమ మొబైల్‌కు ఈ గ్యాడ్జెట్‌ను అటాచ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియో కాల్‌ చేసి... ఇద్దరూ ఆ గ్యాడ్జెట్‌పై పెదాలు ఆనించాలి. అప్పుడు ఒకరు తన ఫోన్‌లో ఈ గ్యాడ్జెట్‌పై ముద్దు పెడితే అవతలి వ్యక్తికి ఆ స్పర్శ తెలుస్తుందిట. ప్రయోగ దశలో ఉన్న ఈ గ్యాడ్జెట్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.


గాల్లో తేలియాడే స్పీకర్‌

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది స్పీకర్‌ అంటే నమ్మగలరా! దీని పేరు ‘పీజే 9’. బ్లూటూత్‌ ఆధారంగా పని చేసే ఈ స్పీకర్‌ను ఎల్‌జీ రూపొందించింది. దీంట్లో పాటల్ని ప్లే చేసిన వెంటనే ఇలా గాల్లో తేలుతూ పాటలు వినిపిస్తుంది. విద్యుదయస్కాంత పరిజ్ఞానంతో ఈ స్పీకర్‌ ఇలా గాల్లో నిలుస్తుంది. దీని వల్ల దాని శబ్దంలో చక్కటి బేస్‌ ఉంటుందట. ఈ స్పీకర్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టుకుంటే 10 గంటలపాటు పాటల్ని ప్లే చేసుకోవచ్చు. అలా గాల్లో తేలుతుంటే బ్యాటరీ ఎంత ఉందనేది ఎలా తెలుస్తుంది అంటారా? ఆ ఇబ్బంది మనకు అవసరం లేకుండా... బ్యాటరీ తక్కువగా ఉన్న విషయాన్ని అదే తెలుసుకొని ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ పెట్టుకుంటుందట. ఆ సమయంలో స్పీకర్‌ గాల్లో తేలకుండా కిందనున్న బాక్స్‌ మీదకు చేరుతుంది. దానికున్న ప్రత్యేక సాంకేతికత ద్వారా కేబుల్‌ లేకుండానే ఛార్జ్‌ అవుతుంది.


హెచ్‌పీ బుల్లి ప్రింటర్‌

మొబైల్‌ ఫోన్‌లా పాకెట్‌లో ఇమిడిపోయే ప్రింటర్‌ గురించి విన్నారా? అదే ఇది. దీని పేరు స్ప్రాకెట్‌. 4.5 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల పొడవున్న ఈ ప్రింటర్‌ను బ్లూటూత్‌తో మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత మొబైల్‌లో క్లిక్‌మనిపించిన ఫొటోలను అనుబంధ ఆప్‌తో ప్రాథమికంగా ఎడిట్‌ చేసుకొని అక్కడి నుంచే ప్రింట్‌ ఇవ్వొచ్చు. అంతేకాదు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫ్లికర్‌ లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లోని ఫొటోలను కూడా నేరుగా ప్రింట్‌ తీసుకోవచ్చు. దీని ద్వారా ఒక్కో ఫొటో ప్రింట్‌ తీసుకోవడానికి సుమారు ఒక నిమిషం పడుతుంది. ఆన్‌లైన్‌ అంగడిలో సుమారు రూ. 14 వేలకు ఇది అందుబాటులో ఉంది.


360 డిగ్రీల కెమెరా

స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకోవచ్చు, వీడియోలు చిత్రీకరించొచ్చు. కొత్త తరం స్మార్ట్‌ఫోన్లతో అయితే 360 డిగ్రీల ఫొటోలు తీయొచ్చు. ఆ తరహా వీడియోలు తీయాలంటే మాత్రం మొబైల్‌కి అదనపు 360 డిగ్రీల కెమెరా ఉండాల్సిందే. అలాంటి వాటిలో ‘ఇన్‌స్టా 360 ఎయిర్‌’ఒకటి. చిన్న బంతిలా ఉండే ఈ కెమెరాను మొబైల్‌పైన ఆడియో పోర్ట్‌కు తగిలించుకుంటే సరి. మీ మొబైల్‌లో ఎంచక్కా 360 డిగ్రీల వీడియోలు చిత్రీకరించొచ్చు. మామూలుగా అయితే 360 డిగ్రీల వీడియోలు చిత్రీకరించడానికి ఉపయోగించే కెమెరా ధర సుమారు రూ. 20 వేల వరకు ఉంటుంది. ఇన్‌స్టా 360 ఎయిర్‌ సుమారు రూ.6500కే అందుబాటులో ఉంటుంది. దీంతో 3కె, 2కె రిజల్యూషన్‌లో 360 డిగ్రీల వీడియోలు చిత్రీకరించొచ్చు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ గ్యాడ్జెట్‌ అమ్మకాలు మొదలవుతాయి. దీన్ని నోట్‌బుక్‌ కంప్యూటర్‌కు జోడించి లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వొచ్చు.


గాలిని శుభ్రపరిచి...

కిందనొక డబ్బా, పైన ఒక పొడవాటి పెద్ద రింగు లాంటి ఆకారం... ఇదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా? దీని ఆకారం వింతగా ఉంటుంది కానీ ఎంతో ఉపయోగపడుతుంది. దీని పేరు డైసన్‌ ప్యూరిఫైర్‌. గాలిని పీల్చుకొని అందులోని దుమ్ము, దూళిని తొలగించి స్వచ్ఛమైన గాలిని బయటకు పంపించే శుద్ధి యంత్రమిది. ప్రస్తుతం మనిషిని బతికించని స్థాయికి వాయు కాలుష్యం చేరిపోయింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మరోవైపు మన దగ్గరా అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వాయు శుద్ధి యంత్రాల అవసరం పెరిగింది. ఈ ఇబ్బందిని తప్పించడానికి డైసన్‌ ప్యూరిఫైర్లు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి బ్రిటన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర సుమారు 400 డాలర్లు. వచ్చే ఏడాది వీటిని మన దేశ మార్కెట్‌లోకి ప్రవేశపెడతారు. దీన్ని మొబైల్‌లోని అనుబంధ ఆప్‌తో ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఇటీవల జియామీ నుంచి ఓ ఎయిర్‌ పూర్తిఫైర్‌ మార్కెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాని ధర సుమారు రూ. 10 వేలు.


పొట్టి డేటా కేబుల్‌

‘మొబైల్‌ బ్యాటరీ అయిపోతోంది, కేబుల్‌ ఎక్కడా!’... ‘ఇంత పెద్ద కేబుల్‌, ఎప్పుడూ చిక్కులు పడిపతోంది’ - ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి దాటే వచ్చుంటారు. ‘ఇన్‌ఛార్జ్‌’ అనే ఈ డేటా కేబుల్‌తో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. కీచెయిన్‌లా ఉండే ఈ కేబుల్‌లో డేటాను స్టోర్‌ చేసుకోవచ్చు కూడా. ఈ కేబుల్‌లో అయస్కాంతం ఉండటంతో సులభంగా మడతపెట్టుకొని కీచెయిన్‌లా వాడుకోవచ్చు. 1.5 అంగుళాల పొడవుతో చిన్నగా ఉండటం వల్ల చిక్కులు పడే సమస్య కూడా ఉండదు. www.incharge.rocks వెబ్‌సైట్‌లో సుమారు రూ.వెయ్యికి అందుబాటులో ఉంది. ఆపిల్‌, ఆండ్రాయిడ్‌, విండోస్‌ ఆధారిత ఫోన్లకు పని చేస్తుంది.


సెల్ఫీ కోసం ఫ్లాష్‌ లైట్‌

స్నేహితులతో సెల్ఫీ, సహోద్యోగులతో సెల్ఫీ, బంధువులతో సెల్ఫీ... మనుషులు మారినా సెల్ఫీ మాత్రం మారదు. అయితే సరైన వెలుతురు లేకపోతే సెల్ఫీ మసకగా మారిపోతుంది. అలాంటప్పుడే స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ఉండే ఫ్లాష్‌లైట్‌ ముందువైపున కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. ఇటీవల కొన్ని కంపెనీలు ముందువైపున ఫ్లాష్‌లైట్‌ ఇస్తున్నారు. మరి పాత ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాపీల సంగతి? ఇప్పుడు దీని కోసం ఓ ఎల్‌ఈడీ లైట్‌ మార్కెట్‌లోకి వస్తోంది. దీన్ని మీ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీలకు అమర్చుకొని ప్రకాశవంతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. ఫోన్‌ బ్యాటరీ ద్వారా ఇది పని చేస్తుంది. ఈ లైట్‌కు క్లిప్‌ లాంటి అమరిక ఉంటుంది. దాని ద్వారా ఫోనుకు తగిలించొచ్చు. ఈ సెల్ఫీ లైట్‌ ధర సుమారు రూ.3000. ఈ నెల 26న అమెజాన్‌ ద్వారా అమెరికన్‌ విపణిలోకి అందుబాటులోకి వస్తుంది. మన దేశంలో ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది తెలియాల్సి ఉంది.


ఈ బొమ్మ నిద్రపుచ్చుతుంది

మీ ఇంట్లో చిన్న బాబో, పాపో నిద్రపోకుండా ఏడుస్తుంటే ఏం చేస్తారు! మొబైల్‌లో పాటలు ప్లే చేసి పక్కన పెడతారు, లేదంటే ఫోన్‌లో వీడియో ఆన్‌ చేసి చూపిస్తారు.. ఇంకా లేదంటే చేతికో చిన్న డోరెమాన్‌ లాంటి బొమ్మ ఇస్తారు. ఆ బొమ్మ చూసి మీ చిన్నారి నిద్రపోతుందని చెప్పలేం. ఇటీవల పిల్లల్ని నిద్రపుచ్చే బొమ్మలు వస్తున్నాయి. అలాంటిదే ఈ ‘సౌండ్‌ బబ్‌’. బొమ్మ రూపంలో ఉండే బ్లూటూత్‌ స్పీకర్‌ ఇది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా కొన్ని సముద్రం, జలపాతం, వర్షం... లాంటి శబ్దాలుంటాయి. లేదంటే మీకు నచ్చిన శబ్దాలు, మాటలను రికార్డు చేసుకోవచ్చు. ఉదాహరణకు అమ్మమ్మ మాట వింటే చిన్నారి బుద్ధిగా ఉంటుందనుకుంటే ఆమె మాటలను రికార్డు చేసి అవసరమైనప్పుడు ప్లే చేయొచ్చు. ఇంకా కావాలంటే మీ మొబైల్‌లోని పాటలను ఈ సౌండ్‌ బబ్‌ ద్వారా ప్లే చేయొచ్చు. అయితే దీని కోసం సౌండ్‌ బబ్‌ అనుబంధ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్‌లో ఈ సౌండ్‌ బబ్‌ అందుబాటులో ఉంది. దీని ధర: 7,492.


మణికట్టుకు చిన్న ట్యాబ్‌

అనేక రకాల ట్యాబ్‌లు చూసుంటారు... మణికట్టుకు అమరిపోయే స్మార్ట్‌వాచ్‌లు చూసుంటారు... మరి మణికట్టుకు కట్టుకోగలిగే చిన్నసైజు ట్యాబ్‌ను చూశారా! లాస్‌ఏంజిలెస్‌కు చెందిన రూఫస్‌ ల్యాబ్స్‌ మణికట్టుకు వాచ్‌లా పెట్టుకునే గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. ‘రూఫస్‌ కఫ్‌’గా పిలుస్తున్న దీని ధర సుమారు రూ. 27 వేలు. సాధారణ స్మార్ట్‌వాచ్‌లను కచ్చితంగా మొబైల్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అదే రూఫస్‌ కఫ్‌కు అయితే ఇది కచ్చితమేమీ కాదు. మొబైల్‌కు అనుసంధానం చేసి వాడుకోవచ్చు లేదంటే దీన్నే ట్యాబ్‌లానూ వాడుకోవచ్చు. 3.2 అంగుళాల తాకే తెర ఉన్న ఈ కఫ్‌ 16/32/64 జీబీ అంతర్గత సామర్థ్యంతో లభిస్తుంది. ట్యాబ్‌లో ఉండే చాలా ఆప్షన్లు ఇందులో ఉంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 1175 ఎంఏహెచ్‌. దీన్ని బార్‌ కోడ్‌ స్కానర్‌గానూ వినియోగించుకోవచ్చు. ఈ కఫ్‌కు ఇచ్చిన ఛార్జర్‌... డేటా దాచుకునే డ్రైవ్‌గానూ ఉపయోగపడుతుంది. ఛార్జింగ్‌ చేసుకుంటున్నప్పుడే డేటాను డ్రైవ్‌లోకి పంపించుకోవచ్చు.


ఒకేసారి రెండు పనులు

ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టుకోవడం, ఫోన్‌లోని డేటాను హార్డ్‌డిస్క్‌లోకి బ్యాకప్‌ తీసుకోవడం... స్మార్ట్‌ఫోన్‌ అన్నాక ఈ రెండూ చాలా ముఖ్యం. అయితే ఈ రెండింటికీ కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. మరోవైపు బయటకు వెళ్తే పవర్‌బ్యాంకు, హార్డ్‌ డిస్క్‌లను ఒకేసారి క్యారీ చేయడమూ ఇబ్బందే. అయితే ఈ రెండూ ఒకేదాంట్లో వస్తే ఎలా ఉంటుంది! ఈ ఆలోచనకు ప్రతిరూపమే Kingston Mobile Lite Wireless. దీన్ని హార్డ్‌ డిస్క్‌, పవర్‌బ్యాంకుగా వాడుకోవచ్చు. ఇందులో రెండు రకాలున్నాయి. కింగ్‌స్టన్‌ మొబైల్‌ లైట్‌ వైర్‌లెస్‌ ప్రోలో 6700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. దీని ధర రూ. 8,999. ‘కింగ్‌స్టన్‌ మొబైల్‌ లైట్‌ వైర్‌లెస్‌ జీ3’లో అయితే కేవలం పవర్‌బ్యాంక్‌ మాత్రమే ఉంటుంది. స్టోరేజీ కోసం ప్రత్యేకంగా మెమొరీ కార్డు లేదా పెన్‌ డ్రైవ్‌ను జోడించాల్సి ఉంటుంది. దీని ధర రూ. 4,999. అంతేకాదు వీటిని వై-ఫై రూటర్‌లగానూ వినియోగించుకోవచ్చు. దీని కోసం మీ ఫోన్‌లో కింగ్‌స్టన్‌ అనుబంధ ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అంతేకాదు ఈ వైర్‌లెస్‌ రూటర్ల ద్వారా ఎక్కువ పరిమాణంలో ఉన్న ఫైళ్లను ఒక ఫోన్‌ నుంచి వేరే ఫోన్‌కు సులభంగా పంపించుకోవచ్చు. అయితే ఆ రెండు ఫోన్లు ఈ వైర్‌లెస్‌ డివైజ్‌కు అనుసంధానమై ఉండాలి.


ఒకేసారి మూడు కంప్యూటర్లతో

బాల్‌ మౌస్‌, ఆప్టికల్‌ మౌస్‌, లేజర్‌ మౌస్‌... ఇలా కంప్యూటర్‌ మౌస్‌లలో చాలారకాలు వచ్చాయి. దేనికదే అద్భుతం అనిపించుకున్నాయి. ఇప్పుడు తనవంతుగా లాజిటెక్‌ ఎంఎక్స్‌ మాస్టర్‌ మౌస్‌ వచ్చింది. యూఎస్‌బీ - బ్లూటూత్‌ అనుసంధానంతో పని చేసే ఈ మౌస్‌ను ఒకేసారి మూడు సిస్టమ్స్‌కు కనెక్ట్‌ చేయొచ్చు. ఇందులో ఇచ్చిన ప్రత్యేక బటన్‌ ద్వారా మీరు ఏ సిస్టమ్‌లో ఈ మౌస్‌ను వాడాలో మీరే నిర్ణయించుకోవచ్చు. రీచార్జిబుల్‌ బ్యాటరీలతో ఈ మౌస్‌ పని చేస్తుంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 40 రోజులు వస్తుంది. ఈ మౌస్‌లోని బటన్‌లను మీకు కావల్సిన అంశాలకు జోడించుకోవచ్చు. మౌస్‌ సెట్టింగ్స్‌లో ఉన్న ఆప్షన్ల నుంచి ఏ బటన్‌కు ఏ యాక్షన్‌ ఉండాలో మీరే నిర్ణయించుకోవచ్చు. గాజు ప్లేట్‌పై కూడా ఈ మౌస్‌ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఎక్కువ పేజీలున్న డాక్యుమెంట్‌ను సులభంగా స్క్రోల్‌ చేయడానికి హైపర్‌ ఫాస్ట్‌ స్క్రోల్‌ ఆప్షన్‌ ఉంది. దీని ధర 9,499.


ఈ ప్లేట్‌పై నిలబడితే

* మీ శరీరంలో కొవ్వు ఇంత ఉంది.. ఇంకా తగ్గాలి!
* మీరు ఇన్ని కిలోల బరువు తగ్గారు... గుడ్‌!
* మీ బాడీలో నీటి శాతం ఇంతుంది.. ఇంకా పెంచాలి!
ఇలా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ఓ వస్తువు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఈ సమాచారమంతా మీ స్మార్ట్‌ఫోన్‌లో కనిపిస్తే ఇంకా సూపర్‌ కదా. body cardio హెల్త్‌ ట్రాకర్‌తో ఇది సాధ్యమవుతుంది. సాధారణ బరువు చూసుకునే ప్లేట్‌లా ఉండే ఈ ట్రాకర్‌లో శరీరంలో కొవ్వు శాతం, మజిల్‌ మాస్‌, శరీరంలో నీటి శాతం, గుండెకొట్టుకునే వేగం లాంటి అంశాలు కూడా తెలుస్తాయి. అంతేకాకుండా గుండెకొట్టుకున్నప్పుడు దానికి దగ్గరలో ఉన్న రక్తనాళాలు కదిలే వేగం (పీఎండబ్ల్యూ)ను ఈ ట్రాకర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వై-ఫై సాయంతో అందులోని సమాచారాన్ని మీ మొబైల్‌లోకి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని పరిశీలించుకొని మీ కసరత్తుల్లో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. దీని ధర సుమారు రూ. 12,500. ఆన్‌లైన్‌ అంగడి అమెజాన్‌లో లభ్యమవుతోంది.
పూర్తి వివరాలకు: http://goo.gl/ZgsyWU


 

 

పిల్లల బండి.. పవర్‌ జనరేటర్‌

మీ పసిపాపను స్ట్రోలర్‌లో పడుకోబెట్టి... బయటకు షికారుకి తీసుకెళ్లారు. ఇంతలో మీ ఫోన్‌ బ్యాటరీ తక్కువగా ఉందని తెలిసింది... ఇప్పుడెలా? ఛార్జింగ్‌ పెట్టడం కుదరదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయితే ఇబ్బంది. మీరు తీసుకెళ్తొంది ‘మోక్షి స్ట్రోలర్‌’ అయితే ఫోన్‌ ఛార్జింగ్‌ విషయంలో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ‘మోక్షి స్ట్రోలర్‌’ చక్రాలు విద్యుత్తు శక్తిని ఉత్పత్తి చేసే జనరేటర్లు కాబట్టి. స్ట్రోలర్‌ను ముందుకు నెడుతుంటే చక్రాలు తిరిగి దానికి అమర్చిన టర్బైన్‌ను తిప్పుతాయి. అప్పుడు విద్యుత్తు జనరేట్‌ అవుతుంది. దాని ద్వారా మీ మొబైల్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. అక్టోబరులో ఈ స్ట్రోలర్‌ మన మార్కెట్‌లోకి రానుంది. దీనికి హెడ్‌లైట్లు కూడా ఉంటాయి. చక్రాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుతో ఆ లైట్లు వెలిగించి రాత్రి వేళల్లోనూ స్ట్రోలర్‌ను వాడొచ్చు. దీనికి అమర్చిన ఎల్‌సీడీ తెర ద్వారా మీరు ఎంత దూరం నడిచారు, ఎంత విద్యుత్తు జనరేట్‌ ఉత్పత్తి అయిందనే విషయాలూ తెలుసుకోవచ్చు.


మనసు గుట్టు చెప్పేస్తుంది

ఆఫీసులో రాజుని బాస్‌ చెడామడా తిట్టేశారు. దీంతో అతని మనసు బరువెక్కింది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు! సుభాష్‌ తను మనసిచ్చిన అమ్మాయిని తొలిసారి డిన్నర్‌కు తీసుకెళ్లాడు. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. సుభాష్‌, రాజు మనసులో కలిగిన భావాల్ని, దాని పరిణామాల్ని భద్రపరుచుకోవడం సాధ్యమా? అస్సలు కాదు. కానీ ఆ సంఘటనల వల్ల వాళ్ల ఆలోచనా విధానంలో జరిగిన మార్పును పసిగట్టే పరికరం ఒకటుంది. అదే ‘జెంటా బ్రాస్‌లెట్‌’. మనిషి నాడి కొట్టుకునే వేగం ఆధారంగా ఆ వ్యక్తి ఒత్తిడికి గురవుతున్నాడా, లేదంటే సంతోషంగా ఉన్నాడా అనే విషయాల్ని ఈ బ్రాస్‌టెట్‌ పసిగడుతుంది. నోటిఫికేషన్ల రూపంలో ఆ విషయాల్ని బ్రాస్‌లెట్‌ తెరపై చూడొచ్చు. అంతేకాకుండా ఆ వివరాలను ప్రాంతం, సమయం ఆధారంగా బ్రాస్‌లెట్‌ ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటుంది. మీరున్న ప్రదేశం ఆధారంగా ఎలాంటి కసరత్తులు చేస్తే బాగుంటుందనే విషయాన్నీ సూచిస్తుంది. ఓ వ్యక్తి ఎప్పుడు, ఎలా ఒత్తిడి గురవుతున్నారనే విషయాన్నీ ‘జెంటా బ్రాస్‌లెట్‌’ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. బ్రాస్‌లెట్‌ను మొబైల్‌కు కనెక్ట్‌ చేసి వివరాలు చూసుకోవచ్చు. దీంతోపాటు ఈ బ్రాస్‌ లెట్‌ను ఫిట్‌నెస్‌ ట్రాకర్‌, స్లీప్‌ ట్రాకర్‌గానూ వాడుకోవచ్చు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/416Gy0


పవర్‌ బ్యాగ్‌

పవర్‌ బ్యాంకులు గురించి వినుంటారు... మరి పవర్‌ బ్యాంక్‌ బ్యాక్‌పాక్‌ గురించి తెలుసా? హెచ్‌పీ సంస్థ నుంచి కొత్తగా వచ్చిన గ్యాడ్జెట్‌ ఇది. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, ఫోన్‌... ఇలా అన్నింటికి ఒకేసారి ఛార్జింగ్‌ పెట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఈ బ్యాగ్‌ పైఅరలో పవర్‌ బ్యాంకు ఉంటుంది. కింది అరల్లో ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, ఫోను పెట్టుకోవచ్చు. పైఅర నుంచి మిగిలిన అరలకు ఛార్జింగ్‌ కేబుల్స్‌ పంపించే సదుపాయం ఉంటుంది. ఇక పవర్‌ బ్యాంకు బ్యాటరీ విషయానికొస్తే... దీని సామర్థ్యం 22400 ఎంఏహెచ్‌. దీని ద్వారా ల్యాప్‌టాప్‌ను ఒకసారి ఛార్జ్‌ చేసుకోవచ్చు. ట్యాబ్‌ను 3 సార్లు, స్మార్ట్‌ఫోన్‌ను 10 సార్లు ఛార్జ్‌ చేయొచ్చు. అక్టోబరు 1 నుంచి ఆన్‌లైన్‌ అంగడి అమెజాన్‌లో ఈ పవర్‌ బ్యాంక్‌ బ్యాక్‌పాక్‌ అమ్మకాలు మొదలవుతాయి. * https://goo.gl/f8YXfC


హార్డ్‌ డిస్క్‌లో వేసేయండి!

మీ స్మార్ట్‌ డిజిటల్‌ కెమెరా ఫొటోలతో నిండిపోయిందా? స్మార్ట్‌ఫోన్‌ వీడియోలు, ఫైల్స్‌తో ఫుల్‌ అయ్యిందా? అయితే వాటిని హార్డ్‌డిస్క్‌లోకి పంపించేయండి. హార్డ్‌ డిస్క్‌లోకి డేటా పంపాలంటే సిస్టమ్‌కు ఫోన్‌ కనెక్ట్‌ చేయాలి... ఆ తర్వాత హార్డ్‌ డిస్క్‌ను... అప్పుడు డేటాను డిస్క్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు అంత ఝంఝాటం అవసరం లేదు. వై-ఫైతో మీ డేటాను హార్డ్‌ డిస్క్‌లోకి పంపించుకునేలా వెస్ట్రన్‌ డిజిటల్‌ నుంచి ‘మై పాస్‌పోర్ట్‌ వైర్‌లెస్‌ ప్రో’ హార్డ్‌ డిస్క్‌ వచ్చింది. ఇందులో 2 టీబీ, 3 టీబీ స్టోరేజీ వెర్షన్లు ఉన్నాయి. ఈ హార్డ్‌ డిస్క్‌ను పది గంటల పాటు వినియోగించుకునేలా రీఛార్జబుల్‌ బ్యాటరీ అమర్చారు. అంతేకాదు ఈ హార్డ్‌డిస్క్‌ను మొబైల్స్‌కు పవర్‌బ్యాంక్‌గా వాడుకోవచ్చు. ఈ డిస్క్‌ను క్లౌడ్‌ సర్వీసుగాను వినియోగించుకోవచ్చు. ఈ హార్డ్‌ డిస్క్‌ను హాట్‌స్పాట్‌ హబ్‌గా మార్చుకొని ఎనిమిది గ్యాడ్జెట్‌లకు వై-ఫైని అందించొచ్చు. మరిన్ని వివరాలకు: https://goo.gl/VNCIlq


మూడింటికీ ఒకటే

ల్యాపీలో ఆఫీస్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇంతలో మీ స్నేహితుడు మెసెంజర్‌లో ఏదో మెసేజ్‌ పెట్టాడు. అంతలోనే ఇంటి నుంచి మీ ఫోన్‌కు మెసేజ్‌ ‘ఎప్పుడు వస్తున్నావు’ అని. ఈ పనులన్నింటికీ ఒకే కీబోర్డు వాడుకోగలిగితే బాగుంటుంది కదా. దీని కోసం లాజిటెక్‌ నుంచి ఓ కీబోర్డు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన బ్లూటూత్‌ కీబోర్డులతో ఒకసారి ఒక గాడ్జెట్‌ను మాత్రమే ఉపయోగించొచ్చు. ఒకేసారి ల్యాపీ, ట్యాబ్‌, ఫోన్‌ను వాడుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా... కీబోర్డు ఎడమవైపున ఉండే నంబర్ల చక్రాన్ని మీకు కావాల్సినట్లు తిప్పడమే. ఆ చక్రంపై 1 నుంచి 3 వరకు నెంబర్లు ఉంటాయి. ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లను బ్లూటూత్‌ ఆప్షన్‌ ద్వారా ఆ కీబోర్డుకు అనుసంధానం చేయాలి. అప్పుడు కీబోర్డులోని చక్రంపై ఉండే ఒకటో నంబరుకు ల్యాప్‌టాప్‌, రెండో నెంబరుకు ఫోన్‌, మూడో నెంబరుకు ట్యాబ్‌ అసైన్‌ అవుతాయి. కీబోర్డుతో మూడు ఫోన్లు లేదంటే రెండు ఫోన్లు, ఒక ట్యాబ్‌... మూడు ల్యాప్‌ టాప్‌లను అనుసంధానం చేసుకొని వాడుకోవచ్చు. పూర్తివివరాలకు: https://goo.gl/joXQ3j


ఫోన్‌లా.. ట్యాబ్‌లా

సరికొత్త గేమింగ్‌ అనుభూతినివ్వడానికి లావా నుంచి ‘ఎక్స్‌ 80’ అనే కొత్త ట్యాబ్‌ విడుదలయ్యింది. ఇందులో ఇంటెల్‌ బేట్రైల్‌ గ్రాఫిక్‌ చిప్‌సెట్‌ వాడటం వల్ల ఈ ట్యాబ్‌ గేమింగ్‌కు మరింత ఉపయోగకరంగా ఉంటుందని లావా చెబుతోంది. దీన్ని ట్యాబ్‌గానే కాకుండా ఫోన్‌లానూ వినియోగించొచ్చు. ఇయర్‌ఫోన్‌ సహాయంతో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. దీని ధర 9,999. ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. ఎనిమిది అంగుళాల తాకే తెర ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4,200 ఎంఏహెచ్‌. ఒక జీబీ రామ్‌, 16 జీబీ అంతర్గత స్టోరేజీ ఉంటాయి. మొమొరీ కార్డు సహాయంతో 32 జీబీ వరకు అదనపు మొమొరీని పొందొచ్చు. ఈ ట్యాబ్‌కు ముందువైపు 3.2 మెగాపిక్సల్‌ కెమెరా, వెనుకవైపు 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంటాయి.


పిల్లల కోసం

చదువు, ఆటలు, పాటలు... పిల్లలకు ఇప్పుడు ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ల్లోనే. అంతగా పిల్లలతో మమేకమైపోయాయి ఈ గ్యాడ్జెట్లు. విద్యకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, ఈ- బుక్స్‌, సరదా కోసం గేమ్స్‌ను వాటిలో డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. వీటికే ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ ఉంటే బాగుంటుంది కదా. లెనోవో అలాంటి ఓ ట్యాబ్‌ను విడుదల చేసింది. ‘సీజీ స్లేట్‌’ పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక ట్యాబ్‌ ధర రూ. 8,499. దీంట్లో పిల్లలకు అవసరమయ్యే చాలా సమాచారం ప్రీలోడెడ్‌గా ఉంటుంది. కావాలంటే అదనపు సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్పెషిఫికేషన్స్‌ విషయానికొస్తే... ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. 7 అంగుళాల తాకేతెర ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3450 ఎంఏహెచ్‌. ఒక జీబీ రామ్‌, 8 జీబీ అంతర్గత స్టోరేజీ ఉంటాయి. మెమొరీ కార్డు సహాయంతో స్టోరేజీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.


యాక్షన్‌ కెమెరా

ప్రతికూల వాతావరణంలో సాహసాలు చేసే రియల్‌ హీరోలు తమ సాహసాల్ని చిత్రీకరించేందుకు దృఢమైన కెమెరాని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది ఒలంపస్‌ కంపెనీ. పేరేంటో తెలుసా? Tough! TG-Tracker. 30 మీటర్ల లోతులో నీటి అడుగున చిత్రీకరణ చేసేలా వాటర్‌ప్రూఫ్‌ కవచం ఉంది. అలాగే, 10 డిగ్రీల గడ్డకట్టే మంచులోనూ Freezeproof కవచంతో వీడియోలు చిత్రీకరించొచ్చు. CMOS సెన్సర్‌తో కూడిన 7.2 మెగాపిక్సల్‌ కెమెరాతో 4కే క్వాలిటీతో హెచ్‌డీ వీడియోలను చిత్రీకరణ చేయవచ్చు. 204 డిగ్రీల వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో ఫ్రేమ్‌ విశాలంగా కనిపిస్తుంది. వీడియోలను చిత్రీకరిస్తున్నప్పుడే 1.5 అంగుళాల ఎస్‌సీడీ తెరపై చూడొచ్చు. వెలుతురు చాలకపోయినా... రాత్రి సమయంలో... చిత్రీకరణకు ప్రత్యేక ‘హెడ్‌లైట్‌’ని కెమెరాలో నిక్షిప్తం చేశారు. నీళ్లలో చిత్రీకరణ చేయాల్సివస్తే ‘అండర్‌వాటర్‌ డిటెక్టర్‌’ ఆప్షన్‌తో 50 సెంటీమీటర్ల లోతు దాటగానే ఆటోమాటిక్‌గా కెమెరా మోడ్‌ మారిపోయి, నీటి అడుగు చిత్రీకరించేందుకు అనువుగా సిద్ధం అవుతుంది. ఒక్కసారి కెమెరాని ఛార్జ్‌ చేస్తే సుమారు 90 నిమిషాల పాటు చిత్రీకరణ చేయవచ్చు. కెమెరా కదలకుండా పట్టుకునేందుకు ప్రత్యేక ‘హ్యాండ్‌గ్రిప్‌’ కెమెరాకి తగిలించి వాడుకోవచ్చు. అంతేనా... ప్రత్యేక సెన్సర్‌ సిస్టంతో GPS, Compass, Barometer, Thermometer, Acceleration sensor సేవల్ని అందిస్తుంది. అన్ని వివరాల్ని వీడియోతో పాటు రికార్డ్‌ చేసి అందిస్తుంది. ధర సుమారు రూ.24,000. వీడియో, ఇతర వివరాలకు: https://goo.gl/8dARrb


రెండింటికీ...

ఇంట్లో ఎప్పటి నుంచో ల్యాపీ వాడుతున్నారు. అలాగే, స్మార్ట్‌ మొబైల్‌ కూడా ఉంది. మరైతే, రెండింటిలో డేటాని ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే? యూఎస్‌బీ కేబుల్‌తో ఫోన్‌ని ల్యాపీకి కనెక్ట్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటాం. ఇది పాత పద్ధతి. మరింత స్మార్ట్‌గా డేటాని చిటికెలో ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు సరికొత్త యూఎస్‌బీ డ్రైవ్‌లు వస్తున్నాయి. ‘యూఎస్‌బీ టైప్‌-సీ’ పేరుతో తెగ సందడి చేస్తున్నాయి. ఫోన్‌తో పాటు ల్యాపీ కూడా స్మార్ట్‌ అయితే యూఎస్‌బీ టైప్‌-సీ డ్రైవ్‌లను వాడేయవచ్చు. మరి, మీరు వాడేది పాత తరం ల్యాపీ అయితే! ‘టైప్‌-సీ’ని సపోర్ట్‌ చేయకపోతే! అప్పుడెలా? ఏం కంగారుపడక్కర్లేదు. శాన్‌డిస్క్‌ ‘అల్ట్రా డ్యూయల్‌ డ్రైవ్‌’లను అందుబాటులోకి తెస్తోంది. కావాలంటే కొత్తగా పరిచయం చేసిన Ultra Dual Drive USB Type-C ఫ్లాష్‌ డ్రైవ్‌ని చూడండి. దీనికి ఒకవైపు ‘యూఎస్‌బీ-ఏ’ ఉంటే మరోవైపు ‘యూఎస్‌బీ-సీ’ పోర్ట్‌లను నిక్షిప్తం చేశారు. డ్రైవ్‌కి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బటన్‌ని జరపడం ద్వారా ఇరువైపులా కావాల్సిన పోర్ట్‌ని పొందొచ్చు. ల్యాపీలోని ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ని కాపీ చేయాలనుకున్నప్పుడు టైప్‌-ఏ పోర్ట్‌తో కనెక్ట్‌ చేయవచ్చు. అదే డేటాని ఫోన్‌లో పొందేందుకు టైప్‌-సీ పోర్ట్‌ని వాడొచ్చు. ఇంకా చెప్పాలంటే... ఎక్కువ మెమొరీతో కూడిన వీడియో ఫైల్స్‌ని ఫోన్‌లోకి కాపీ చేయకుండానే డ్రైవ్‌లోనే ఉంచి చూడొచ్చన్నమాట. ఈ తరహా సరికొత్త డ్రైవ్‌లను వాడి సెకన్‌కి 150 మెగాబైట్స్‌ డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. మెమొరీ సామర్థ్యం వరుసగా... 16జీబీ, 32జీబీ, 64జీబీ, 128జీబీ. త్వరలోనే దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.


బుల్లి మైక్రోలెన్స్‌

ఆధునిక హంగులతో ఫోన్‌ కెమెరాలు చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాం. డిజిటల్‌ కెమెరాల మాదిరిగా అదనపు లెన్స్‌ని ఫోన్‌ కెమెరా లెన్స్‌కి తగిలిస్తూ భిన్నమైన ఫొటోలు తీసేందుకూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనేక రకాల లెన్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ల కోసం పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో ఇప్పుడు కొత్తగా రెండు మినీ లెన్స్‌ సందడి చేస్తున్నాయి. అవే Blips Lenses. ప్రపంచంలోనే అత్యంత పల్చటి మైక్రోస్కోప్‌ లెన్స్‌ ఇవేనట. స్మార్ట్‌ ఫోన్‌లు, ట్యాబ్లెట్‌ కెమెరాలకు వీటిని చిత్రంలో మాదిరిగా అతికించి మైక్రో ఫొటోగ్రఫీ చేయవచ్చు. సూక్ష్మ ప్రపంచాన్ని ఫోన్‌ కెమెరా కంటితో సులువుగా చూడొచ్చు. Macro, Micro మోడ్స్‌లో రెండు రకాల లెన్స్‌ని వాడుకోవచ్చు. మ్యాక్రో లెన్స్‌ని వాడి 10ఎక్స్‌ మ్యాగ్నిఫికేషన్‌తో ఫొటోలు తీయొచ్చు. రెండు లెన్స్‌ మందం వరుసగా 0.5, 1.2ఎంఎం. వీటిని ఏటీఎం కార్డ్‌ల మాదిరిగా పర్సులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. వాడుతున్న ఫోన్‌ మోడల్‌కి అనుగుణంగా లెన్స్‌ని కెమెరాకి అతికించొచ్చు. లెన్స్‌తో కూడిన టేపు ఎన్నిసార్లయినా అతుక్కుంటుంది. ఒక్కసారి అతికించి ఫోన్‌కి అలానే వదిలేయవచ్చు కూడా. ఎందుకంటే ఫోన్‌ని వాడేటప్పుడు లెన్స్‌తో ఎలాంటి అసౌకర్యం ఉండదు. ఫోన్‌ కెమెరా సెన్సర్‌ ఆధారంగా లెన్స్‌ పని చేస్తాయి. లెన్స్‌ ధర సుమారు రూ.1400 ఉండొచ్చని అంచనా. వీడియో, ఇతర వివరాలకు: https://goo.gl/bgDfvn


అదనపు స్టోరేజ్‌

ఫోన్‌లోని మెమొరీ సామర్థ్యాన్ని ఎక్స్‌టర్నల్‌ మెమొరీ కార్డ్‌లతో పెంచుకోవడం తెలిసిందే. ఏదైనా ముఖ్యమైన వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు ‘మెమొరీ ఫుల్‌’ అంటూ చిత్రీకరణ ఆగిపోతుంది. ఇక చేసేది లేక స్టోరేజ్‌ నుంచి కొంత డేటాని తొలగించేందుకు ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో కొన్ని సార్లు ముఖ్యమైన డేటానీ అనుకోకుండా తొలగిస్తుంటాం. ఇలాంటి సమస్యలేం రాకుండా ఉండాలంటే? శాన్‌డిస్క్‌ అందిస్తున్న iXpand Flash డ్రైవ్‌ని వాడితే సరి. ఐఫోన్‌, ఐప్యాడ్‌లకు ఇది ప్రత్యేకం. దీన్ని ఫోన్‌కి కనెక్ట్‌ చేస్తే చాలు. ఆటోమాటిక్‌గా ఫోన్‌ కెమెరాతో తీసిన ఫొటోలు, వీడియోలను బ్యాక్‌అప్‌ చేస్తుంది. అవసరం నిమిత్తమో... ప్రయాణాల్లోనో... డ్రైవ్‌లో సేవ్‌ చేసిన వివిధ ఫార్మెట్‌ వీడియోలను ఫోన్‌లోనే చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే... డ్రైవ్‌ని కనెక్ట్‌ చేసి చిత్రీకరించే వీడియోని సరాసరి దాంట్లోనే సేవ్‌ అయ్యేలా చేయవచ్చు. యూఎస్‌బీ 3.0తో డేటాని మెరుపు వేగంతో సిస్టంలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. డేటాని ఆటోమాటిక్‌గా బ్యాక్‌అప్‌ చేసేందుకు iXpand మొబైల్‌ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 128, 64, 32, 16 జీబీ మెమొరీ సామర్థ్యంతో డ్రైవ్‌ని అందిస్తున్నారు. వీటి ధరలు వరుసగా... రూ.9,990, రూ.6,990, రూ. 4,990, రూ.3,990. వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/QJRvuP


పాటలు మాత్రమే వినిపిస్తాయి!

ప్రయాణాల్లో హాయిగా మ్యూజిక్‌ విందాం అనుకుంటాం. హెడ్‌సెట్‌ పెట్టుకుని పాటలు ప్లే చేస్తాం. కానీ, బయటి నుంచి వెలువడే శబ్దాలు ఆహ్లాదకరమైన ట్యూన్స్‌ని వినిపించకుండా చేస్తాయి. దీంతో వినాలనే ఆసక్తి పోతుంది. మరైతే... బయటి నుంచి వెలువడే శబ్దాల్ని చెవిని చేరకుండా కేవలం మ్యూజిక్‌ని మాత్రమే వినిపించే హెడ్‌సెట్‌ని పెట్టుకుంటే! సోనీ కంపెనీ అలాంటి హెడ్‌సెట్‌నే దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. హెడ్‌సెట్‌ పేరు MDR-100ABN. యువతని ఆకట్టుకునేలా ట్రెండీగా భిన్నమైన రంగుల్లో తీర్చిదిద్దారు. దీన్ని కనెక్ట్‌ చేయడానికి వైర్‌లు అక్కర్లేదు. బ్లూటూత్‌ లేదా ఎన్‌ఎఫ్‌సీ నెట్‌వర్క్‌ ద్వారా చిటికెలో పరికరాలకు అనుసంధానం అవుతుంది. Digital Noise Cancelling టెక్నాలజీతో బయటి శబ్దాల్ని వినిపించకుండా చేస్తుంది. సాధారణ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ కంటే మూడు రెట్లు ఎక్కువగా డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. దీంతో నాణ్యమైన ఆడియో అపుట్‌పుట్‌తో మ్యూజిక్‌ వినొచ్చు. ఇంతకీ... ధరెంతో తెలుసా? రూ.21,990. ఆన్‌లైన్‌ అంగళ్లలో అందుబాటులో ఉంది.
ఇతర వివరాలకు http://goo.gl/NL7HDH

ఐడియా ప్యాడ్‌...

బడ్జెట్‌లో ఏదైనా నోట్‌బుక్‌ని కొందాం అనుకుంటే లెనోవో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన IDEAPAD 100S గురించి తెలుసుకోవాల్సిందే. 11.6 అంగుళాల తెరతో నాజూకుగా తీర్చిదిద్దారు. రిజల్యూషన్‌ 1366X768 పిక్సల్స్‌. విండోస్‌ 10 హోం ఆపరేటింగ్‌ సిస్టంని బిల్ట్‌ఇన్‌గా అందిస్తున్నారు. Intel Atom Z3735F Quad-Core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 32 జీబీ. మైక్రోఎస్‌బీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 0.3 మెగాపిక్సల్‌ వెబ్‌ కెమెరాతో పాటు డ్యూయల్‌ మైక్రోఫోన్‌లను నిక్షిప్తం చేశారు. Dolby Advanced స్పీకర్లతో ఆడియో వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 8 గంటల పాటు వెబ్‌ బ్రౌజింగ్‌ చేయవచ్చు. బ్లూటూత్‌, వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ అవుట్‌, మైక్రోఎస్‌బీ కార్డ్‌ స్లాట్‌, హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి. మరో ప్రత్యేక ఆఫర్‌ ఏంటంటే... ఏడాది పాటు ‘మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365’ సర్వీసుని ఉచితంగా వాడుకోవచ్చు. దీంతో పాటు 1 టీవీ వన్‌డ్రైవ్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ని పొందొచ్చు. దేశీయ మార్కెట్‌లో నోట్‌బుక్‌ ధర రూ.14,499. శ్నాప్‌డీల్‌ ఆన్‌లైన్‌ అంగడి నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఇతర వివరాలకు http://goo.gl/NUoVGf

మరో రకం సెల్ఫీ

ఫోన్‌... సెల్ఫీ స్టిక్‌తో... సెల్ఫీలు తీసుకుని ఉంటారు. కానీ, ఎప్పుడైనా ‘ఫ్లెయింగ్‌ సెల్ఫీ’ తీసుకున్నారా? అదెలా అనే సందేహం వస్తే... ROAMe Flying Selfies గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో ఎగురుతూ కనిపించేది అదే. డ్రోన్‌ మాదిరిగా 25 మీటర్ల పరిధిలో ఎగురుతూ సెల్ఫీల్ని చిత్రీకరిస్తుంది. 360 డిగ్రీల కోణంలో పనోరమిక్‌ ఫొటోలను క్యాప్చర్‌ చేస్తుంది. ఫోన్‌తో కనెక్ట్‌ అయ్యి పని చేస్తుంది. అంటే... ఫోనే రిమోట్‌ అన్నమాట. దీంతో ఫొటోలను తీసిన వెంటనే చూడొచ్చు. ‘ల్రైవ్‌ స్ట్రీమింగ్‌’తో వీడియోలను కూడా చిత్రీకరిస్తూనే వీక్షించొచ్చు. Smart Facial Recognition టెక్నాలజీతో ఎంతమందిలో ఉన్నా మీ ముఖాన్ని గుర్తించి ఫొటో అవుతుంది. 3 మీటర్ల పరధిలో మీ చుట్టూనే తిరుగుతుంది. ఎంత సేపు ఎగురుతుంది? అనేగా... ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 20 నిమిషాల పాటు ఎగురుతుందట. ఫుల్‌ ఛార్జ్‌ చేసేందుకు పట్టే సమయం రెండు గంటలు. 5 Megapixel CMOS సెన్సర్‌తో కూడిన కెమెరాని దీంట్లో నిక్షిప్తం చేశారు.
వీడియో, ఇతర వివరాలకు http://flyingselfies.com

బ్లూటూత్‌ స్కూటర్‌

విహారానికి వెళ్లినప్పుడు ఎక్కువగా కాలి నడకన తిరగాల్సి వస్తుంది... అప్పుడేం చేస్తారు? ఇదిగో ఈ బ్లూటూత్‌ స్కూటర్‌ని వెంటే తీసుకెళ్లండి. దీని పేరు Lab’elle Electric Scooter. బరువు ఎంతో తెలుసా? 12 కేజీలు. సుమారు నాలుగు గంటలు ఛార్జ్‌ చేస్తే 35 కీలోమీటర్ల పాటు ప్రయాణం చేయవచ్చు. గంటలకు 32 కిలోమీటర్ల వేగంతో నడపొచ్చు. 120 కేజీల వరకూ స్కూటర్‌ మోయగలదు. దీంట్లోని ప్రత్యేకతేంటంటే... బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌కి కనెక్ట్‌ అవుతుంది. ఏంటి ప్రయోజనం అంటారా? స్కూటర్‌ని ఎవ్వరూ దొంగిలించలేరు. ఎందుకంటే దీంట్లో బిల్ట్‌ఇన్‌గా ‘యాంటీ థెప్ట్‌ అలారం’ని నిక్షిప్తం చేశారు. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో స్మార్ట్‌ ఫోన్‌కి కనెక్ట్‌ అయ్యి... ఎవరైనా స్కూటర్‌ని దొంగతనంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే ఫోన్‌లో అప్రమత్తం చేస్తుంది.
వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/L5Wcfr

ఇదో సీపీయూ...

మీ పర్సనల్‌ కంప్యూటర్‌ని ఎక్కడికైనా జేబులో పెట్టుకుని తీసుళ్లొచ్చు తెలుసా? అదెలా అనే సందేహం వస్తే.... చిత్రంలో కనిపించే మిని పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. దీని పేరు Kangaroo Plus. ఇన్ఫోకస్‌ కంపెనీ తయారు చేసింది. Intel Atom X5 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 64 జీబీ. ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌తో కంప్యూటర్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 4 గంటలు వాడుకోవచ్చు. స్మార్ట్‌ టీవీ, కంప్యూటర్‌ మానిటర్‌లకు పీసీని కనెక్ట్‌ చేసేందుకు హెచ్‌డీఎంఐ పోర్ట్‌ ఉంది. కీబోర్డ్‌, మౌస్‌ లాంటివి కనెక్ట్‌ చేసేందుకు యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. వై-ఫై బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. పీసీని సురక్షితంగా వాడుకునేందుకు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ని కూడా నిక్షిప్తం చేశారు. పీసీలో విండోస్‌ 10 లేదా లినక్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు.

స్మార్ట్‌ బ్యాండ్‌

ఇప్పుడంతా స్మార్ట్‌ బ్యాండ్‌లు, వాచ్‌ల హవానే! ఫోన్‌తో జతకట్టి మణికట్టుపైనే అనేక మాయలు చేస్తున్నాయి. ఆ స్మార్ట్‌ బ్యాండ్‌ల జాబితాలోకి ENRG ActiWear వచ్చి చేరింది. ఇది ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ మాత్రమే కాదు. స్మార్ట్‌ వాచ్‌లా మారి OLED తాకేతెరపైనే అన్ని నోటిఫికేషన్స్‌ని చూపిస్తుంది. పగటి పూట ఎండలోనూ తెరపై ఉన్న వాటిని స్పష్టంగా చూడొచ్చు. సమయం, తేదీ, బ్యాటరీ స్టేటస్‌, కనెక్టివిటీ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రోజూ మీరెన్ని మెట్లు ఎక్కారు? ఎంత దూరం నడిచారు? ఎన్ని కేలరీలు కరిగాయి?... లాంటి ఇతర ఫిట్‌నెస్‌ వివరాల్ని ట్రాక్‌ చేసి అందిస్తుంది. అంతేకాదు... మీ నిద్రపై కూడా ఓ కన్నేసి ఎంత సమయం గాఢనిద్రలో ఉన్నారో చూపిస్తుంది. రోజూ మీరే సమయానికి నిద్ర లేస్తున్నారో కూడా ట్రాక్‌ చేసి చూపిస్తుంది. బ్యాండ్‌లో రిమైండర్స్‌ని కూడా పెట్టుకునే వీలుంది. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌కి కనెక్ట్‌ అయ్యి ఫోన్‌కాల్స్‌ బ్యాండ్‌పైనే చూడొచ్చు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్స్‌ఆప్‌, స్కైప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ని చెక్‌ చేయవచ్చు. ఎస్‌ఎంఎస్‌లనూ బ్యాండ్‌లో చూడొచ్చు. ఈమెయిల్‌ నోటిఫికేషన్స్‌ని కూడా బ్యాండ్‌కి కాన్ఫిగర్‌ చేయవచ్చు. ఒక్కసారి దీన్ని ఛార్జ్‌ చేస్తే ఆరు రోజుల పాటు పని చేస్తుంది. Zeroner ఆప్‌తో మొత్తం డేటాని ఫోన్‌లో మేనేజ్‌ చేయవచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ల్లో ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు. ధర సుమారు రూ.3,200.

సోలార్‌ కోటు...

ట్రెండ్‌ని ఫాలో అవుతూ వివిధ రకాల కోటుల్ని కొని ధరిస్తుంటాం. చలి కాలంలో అయితే అందరూ తప్పకుండా కోటుని ధరించడం అవసరం కూడా! అయితే, మీరెప్పుడైనా వూహించారా? వేసుకున్న కోటు పగటి పూట సూర్య కాంతిని గ్రహించి... సోలార్‌ విద్యుత్‌గా మలుచుకుని... తిరిగి అదే సోలార్‌ విద్యుత్‌తో కోటు లోపల వేడిని విడుదల చేస్తే బాగుంటుందని! ప్రపంచంలో తొలిసారి అందుబాటులోకి వచ్చిన ఈ ThermalTech Smart Jacket అలాంటిదే. రెండే నిమిషాల్లో సోలార్‌ విద్యుత్‌ని గ్రహించి 20 డిగ్రీల ఉష్ణోగ్రతతో కోటుని వేడి చేస్తుందట. తక్కువ బరువుతో కోటుని రూపొందించారు. శరీర ఉష్ణోగ్రతకి అనువుగా వేడిని విదుదల చేయగలగడం దీంట్లోని ప్రత్యేకత. మూడు రకాల అవసరాలకు తగినట్టుగా Street, Explore, Extreme పేర్లతో కోటులను తీర్చిదిద్దారు. కోటు తడిసినా ఏం కాదు. ఎందుకంటే వాటర్‌ప్రూఫ్‌ రక్షణ ఉంది. వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/v9HVDQ లింక్‌ని చూడండి.

ప్రత్యేక పవర్‌ బ్యాంకులు

స్మార్ట్‌ ఫోన్‌తో పాటు పవర్‌ బ్యాంకులు జేబులోకి వచ్చేశాయి. భిన్నంగా ప్రవేశపెట్టిన Skin4Gadgets పవర్‌ బ్యాంకుల్ని ప్రయత్నించి చూడండి. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? అధికారిక సైట్‌లోకి వెళ్లి పవర్‌ బ్యాంకుల్ని మీకు నచ్చినట్టుగా డిజైన్‌ చేసుకోవచ్చు. కస్టమైజ్‌ చేయడానికి ముందుగా 10000 mAh, 15000 mAh సామర్థ్యంతో పవర్‌ బ్యాంకుల్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ లోకల్‌ హార్డ్‌డ్రైవ్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫొటోలను సెలెక్ట్‌ చేసి పవర్‌ బ్యాంకు కవర్‌ ఫొటోగా పెట్టుకోవచ్చు. ఫొటోపై ఏదైనా టెక్స్ట్‌ని ఇన్‌సర్ట్‌ చేయవచ్చు. పవర్‌ బ్యాంకులకు రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఒకేసారి రెండు ఫోన్లను ఛార్జ్‌ చేయవచ్చన్నమాట. LED లైట్స్‌తో బ్యాటరీ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. 10000 mAh పవర్‌బ్యాంకుతో జెన్‌ఫోన్‌ 2, ఐఫోన్‌ 6ఎస్‌, లుమియా 950ఎక్స్‌ఎల్‌ ఫోన్లను 100 శాతం ఛార్జ్‌ చేయవచ్చట. పవర్‌ బ్యాంకుల ఖరీదు సుమారు రూ.2,499 నుంచి మొదలు. కొందాం అనుకుంటే http://www.skin4gadgets.com లింక్‌లోకి వెళ్లండి.

మణికట్టుపై స్టైల్‌గా...

స్మార్ట్‌వాచ్‌ల సందడి అంతా... ఇంతా కాదు. ఆ హల్‌చల్‌కి మరింత వూపు అందిస్తూ ఆసుస్‌ కంపెనీ ‘జెన్‌వాచ్‌2’ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రెండు పరిమాణాల (1.45, 1.63 అంగుళాలు) తాకేతెరలతో అందిస్తున్నారు. వాచ్‌ నుంచి మరో వాచ్‌కి ప్రత్యేక టెక్స్ట్‌ మెసేజింగ్‌కి ఫ్లాట్‌ఫాంని అందిస్తున్నారు. అంటే... ఫోన్‌తో పని లేకుండానే వాచ్‌ నుంచి మరో వాచ్‌కి మెసేజ్‌లు పంపొచ్చు. రిప్లై ఇవ్వొచ్చు. వాచ్‌లోని బిల్ట్‌ఇన్‌ ట్రాకర్స్‌తో వ్యాయామంపై ఓ కన్నేయవచ్చు. నడక, పరుగుని ట్రాక్‌ చేసి వివరాల్ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆప్‌తో ప్రోగ్రస్‌ రిపోర్ట్‌లను అందిస్తుంది. ఫోన్‌ కెమెరాకి రిమోట్‌లా వాచ్‌ని వాడుకుని కళాత్మకంగా ఫొటోలు దిగొచ్చు. ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని సైలెన్స్‌లో పెట్టాలంటే వాచ్‌ తాకేతెరపై తాకితే చాలు. రింగ్‌టోన్‌ మ్యూట్‌ అవుతుంది. ఇంట్లోనే ఫోన్‌ని ఎక్కడైనా మర్చిపోతే వాచ్‌ని రింగ్‌ చేసే సౌకర్యం ఉంది. వాచ్‌ని పెట్టుకుంటే ఫోన్‌ని పదే పదే అన్‌లాక్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే... ఫోన్‌ వాచ్‌కి దగ్గరగా ఉన్నంత వరకూ ఆటోమాటిక్‌గా అన్‌లాక్‌ అవుతుంది. ధర సుమారు రూ.11,999. వివరాలకు https://goo.gl/ZX2ks0

చౌక స్మార్ట్‌వాచ్‌

ఫోన్‌ స్మార్ట్‌గానే ఉంది. కానీ, మణికట్టుపై వాచ్‌ మాత్రం స్మార్ట్‌గా లేదనే వెలితి అక్కర్లేదు. చౌక ధరలో Huawei Honor Band Z1 స్మార్ట్‌వాచ్‌ మార్కెట్‌లో ప్రవేశించింది. ధర రూ.5,499. స్టీల్‌ బ్యాండ్‌తో ట్రెండీగా వాచ్‌ని రూపొందించారు. వాచ్‌ తాకే తెర పరిమాణం 2.69 సెంటీమీటర్లు. OLED డిస్‌ప్లే. నీళ్లలో తడిసినా పాడవకుండా వాటర్‌ప్రూఫ్‌ రక్షణ ఉంది. మణికట్టుపై స్టెల్‌గా ఒదిగిపోయి రోజువారి దినచర్యని మానిటర్‌ చేస్తుంది. ఎంత దూరం నడిచారు... ఎన్ని మెట్లు ఎక్కారు... రోజులో ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యాయో లెక్కగట్టి చెబుతుంది. అంతేకాదు... నిద్రని మానిటర్‌ చేసి ఎంత సమయం హాయిగా నిద్రించారో చెబుతుంది. ఫోన్‌లో ప్రత్యేక ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ట్రాక్‌ చేసిన అన్ని వివరాల్ని మేనేజ్‌ చేయవచ్చు. వాచ్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3 రోజులు వాడుకోవచ్చు. వేగంగా ఛార్జ్‌ అవ్వడం వాచ్‌లోని మరో ప్రత్యేకత. కేవలం పది నిమిషాలు ఛార్జ్‌ చేసి రోజంతా వాచ్‌ని వాడుకోవచ్చట. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లతో జతకట్టి పని చేస్తుంది. బ్లూటూత్‌ 4.1 నెట్‌వర్క్‌తో అనుసంధానం అవుతుంది. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. http://goo.gl/92v70L

మోటో 'రెండు'

స్మార్ట్‌ వాచ్‌ల సందడిలో మోటో మరో సరికొత్త వెర్షన్‌తో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. Moto 260 (Second Generation) పేరుతో టెక్‌ ప్రియుల్ని అలరించనుంది. వాచ్‌ ప్రారంభ ధర రూ.19,999. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆడ, మగ వారికి వేరు వేరుగా మోడల్స్‌ని తీర్చిదిద్దారు. వాచ్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... 1.37, 1.56 అంగుళాల పరిమాణాల్లో రెండు రకాలుగా తెరలతో అందిస్తున్నారు. తెరల రిజల్యూషన్‌ వరుసగా 360X325 పిక్సల్స్‌, 360X330 పిక్సల్స్‌. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4జీబీ. 1.2GHz quad-core Snapdragon 400 ప్రాసెసర్‌ని వాడారు. వాచ్‌ వెనక నిక్షిప్తం చేసిన ప్రత్యేక సెన్సర్లతో గుండె లయని రికార్డ్‌ చేసి చూడొచ్చు. రోజు వారీ దిన చర్యపై ఓ కన్నేయవచ్చు. వాడుతున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ని పదే పదే జేబులో నుంచి తీయకుండానే మణికట్టుపైనే చాలా వరకూ ముగించేయవచ్చు. అలాగే, వాచ్‌ని ప్రత్యేక డాక్‌ స్టేషన్‌తో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ చేయవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 300mAh. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఒకటిన్నర రోజులు వాడుకోవచ్చు. తడిచినా పాడవకుండా Water Resistant రక్షణ ఉంది. బ్లూటూత్‌, వై-ఫై కనెక్టివిటీని సపోర్ట్‌ చేస్తుంది. ఇతర వివరాలకు: http://goo.gl/S0gc6T

యాక్షన్‌ కెమెరా

రెడీ... కెమెరా... యాక్షన్‌ అంటూ ఏ షార్ట్‌ ఫిల్మో... సినిమానో తీస్తున్నారా? అయితే, త్వరలోనే మీకో బుల్లి యాక్షన్‌ కెమెరా పరిచయం కానుంది. పేరు Vidi Action Camera. ప్రపంచ వ్యాప్తంగా అందరూ వాడుకునేలా బడ్జెట్‌లో కెమెరాని రూపకల్పన చేశారు. ఇప్పటి వరకూ మార్కెట్‌లో తెగ సందడి చేస్తున్న GoPro కెమెరాకి పోటీగా 'విడి' కెమెరాల్ని తీర్చిదిద్దారట. కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సల్‌. 1080 పిక్సల్‌ క్వాలిటీతో వీడియోలు చిత్రీకరించొచ్చు. తక్కువ వెలుతురులో క్వాలిటీ తగ్గకుండా ఉండేలా CMSO సెన్సర్‌తో పని చేస్తుంది. 140 డిగ్రీల వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ని ఏర్పాటు చేశారు. లెన్స్‌తో డిజిటల్‌ జూమ్‌ 4x వరకూ చేయవచ్చు. 4జీబీ ఎస్‌కార్డ్‌తో కెమెరాని అందిస్తున్నారు. కావాలంటే 64 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. కెమెరా వెనక భాగంలో 1.5 అంగుళాల తెర ఉంది. నీళ్లలో తడిసినా పాడవకుండా వాటర్‌ ప్రూఫ్‌ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌తో వాయిస్‌ని రికార్డ్‌ చేయవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 700mAh. ఒక్కసారి ఛార్జ్‌ చేసి 90 నిమిషాల పాటు వాడుకోవచ్చు. త్వరలోనే మార్కెట్‌లోకి ప్రవేశించనున్న ఈ యాక్షన్‌ కెమెరా ధర సుమారు రూ.7,000 లోపే ఉండొచ్చని అంచనా. ఇతర వివరాలకు: https://vidicameras.com

ఇంటికో 'సర్కిల్‌'

ఎక్కడున్నా ఇంటిపై ఓ కన్నేయాలనుకుంటాం... ఇంట్లో వాళ్లు ఏం చేస్తున్నారో చూడాలనుకుంటాం... అందుకు రక్షణ నిమిత్తం ఏవేవో కెమెరాల్ని వాడేస్తున్నాం! మరి, మీకు Circle కెమెరా తెలుసా? లాగీటెక్‌ కంపెనీ దీన్ని రూపొందించింది. స్టాండ్‌పై గుండ్రంగా కనిపించే కెమెరాని కావాల్సిన కోణంలోకి తిప్పుకుని సెట్‌ చేయవచ్చు. లైవ్‌ వీడియో లేదా చిత్రీకరించిన ఫుటేజ్‌ని 8X వరకూ జూమ్‌ చేసి చూడొచ్చు. రాత్రిళ్లు చీకట్లో ఉన్న వాటిని కూడా స్పష్టంగా చిత్రీకరించి అందిస్తుంది. వై-ఫై నెట్‌వర్క్‌ ద్వారా వాడుతున్న స్మార్ట్‌ మొబైల్‌తో జత కట్టి ఇది పని చేస్తుంది. ఒక్కసారి కెమెరాని ఛార్జ్‌ చేసిన తర్వాత ఇంట్లో ఎక్కడికైనా తీసుకెళ్లి సెట్‌ చేసుకుని 12 గంటల పాటు వాడుకోవచ్చు. ఇక కెమెరా చుట్టూ కనిపించే స్పీకర్‌ నుంచి ఇరువైపులా ఉన్న వ్యక్తుల సంభాషణల్ని స్పష్టంగా వినొచ్చు. అంటే... వీడియో ఛాట్‌ చేసే సమయంలో కెమెరా చుట్టూ కనిపించే స్పీకర్‌ మైక్రోఫోన్‌లానూ పని చేస్తుందన్నమాట. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/3FPWB2

స్మార్ట్‌ కీబోర్డ్‌

ఎప్పటి నుంచో స్మార్ట్‌ టీవీలను వాడేస్తున్నాం. కంప్యూటర్‌, స్మార్ట్‌ మొబైల్‌, ట్యాబ్‌లు, ల్యాపీలు... ఇలా ఉన్న అన్నింటినీ టీవీతో సింక్‌ అయ్యేలా చేస్తున్నాం. మరి, స్మార్ట్‌ టీవీని హాయిగా సోఫాలో కూర్చుని యాక్సెస్‌ చేసేందుకు కేవలం రిమోట్‌ మాత్రమేనా? మరోటి ఏదైనా ప్రయత్నించారా? అయితే, మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన Wireless Touch Keyboard K400 Plus కీబోర్డ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. కంప్యూటర్‌ని టీవీకి అనుసంధానం చేసి వాడుకునే సమయంలో 10 మీటర్ల దూరంలో కూర్చుని కూడా టీవీలో కంటెంట్‌ని సులువుగా మేనేజ్‌ చేసేలా కీబోర్డ్‌ని తీర్చిదిద్దారు. క్వర్టీ కీబోర్డ్‌లానే కనిపించే దీంట్లో కర్సర్‌ కంట్రోల్‌ కోసం ప్రత్యేక 'టచ్‌ప్యాడ్‌'ని ఏర్పాటు చేశారు. టచ్‌ప్యాడ్‌ పరిమాణం 3.5 అంగుళాలు. మునివేళ్లతో తాకుతూ టీవీపై కర్సర్‌ని ఎక్కడికైనా సులువుగా కదపొచ్చు. టీవీ సౌండ్‌ని తగ్గించాలన్నా... పెంచాలన్నా కీబోర్ట్‌లోనే బిల్ట్‌ఇన్‌ షార్ట్‌కట్‌ బటన్లు ఉన్నాయి. టచ్‌ప్యాడ్‌పైనే వీటిని చూడొచ్చు. విండోస్‌ సరికొత్త ఓఎస్‌ వెర్షన్లతో పాటు క్రోమ్‌ఓఎస్‌, ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ ఓఎస్‌లను కీబోర్డ్‌ సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ పోర్ట్‌తోనూ అనుసంధానం చేసుకోవచ్చు. కీబోర్డ్‌లో బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేసిన బ్యాటరీ 18 నెలలు వస్తుంది. ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేయాల్సిన అవసరం లేదు. నాజూకుగా తయారు చేసిన కీబోర్డ్‌ బరువు 380 గ్రాములు. ధర సుమారు రూ.3,695. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/NzY0vf

మైక్రోసాఫ్ట్‌ మాయ!

కంప్యూటర్‌లపై మీరో పరికరాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పరికరాన్ని 3డీలో చూడడం తెలుసు. అదే పరికరాన్ని సిస్టం టేబుల్‌ పక్కనే పెట్టుకున్నట్టుగా ప్రత్యక్షంగా చూస్తే! అంతేనా... ఇష్టమైన యాంగ్రీ బర్డ్స్‌ గేమ్‌ మొబైల్‌లో ఆడాం. అదే యాంగ్రీ బర్డ్స్‌ గేమ్‌ మీ కళ్ల ముందు ప్రత్యక్షమైతే. బర్డ్స్‌ని మీ చేత్తో పట్టుకుని కావాల్సిన కోణంలో లా.....గి వదిలితే! ఇంకా చెప్పాలంటే... మీకు ఇష్టమైన సినిమాని ఉన్న చోటే ఇంటి గోడపైనే ప్లే చేస్తే! ఇవన్నీ ఎలా సాధ్యం అంటారా? మైక్రోసాఫ్ట్‌ త్వరలోనే అందుబాటులోకి తేనున్న HoloLens పరికరాన్ని ధరిస్తే సరి. వేళ్లని కదలిస్తూ చిత్రంలో మాదిరిగా అన్నీ కళ్లముందే ప్రత్యక్షమయ్యేలా చేయవచ్చు. చేతుల్ని కదుల్చుతూ కనిపించే వాటిల్లో కావాల్సిన మార్పులు చేయవచ్చు. మాట్లాడుతూ వాయిస్‌ కమాండ్స్‌ని అందించొచ్చు.

నాజూకుగా...

మణికట్టుపై మరింత స్మార్ట్‌గా వాచ్‌లు మారిపోతున్నాయి. కావాలంటే Pebble కంపెనీ అందిస్తున్న స్మార్ట్‌ వాచ్‌ని చూడండి. పేరు Time Round. ప్రపంచంలోనే అత్యంత నాజూకుగా రూపొందిన వాచ్‌ ఇదే. దీని మందం 7.5mm. కేవలం సమయాన్ని చూడడమే కాదు. స్మార్ట్‌ ఫోన్‌తో అనుసంధానమై తెరపై మరిన్ని అద్భుతాలు చేస్తుంది. క్యాలెండర్‌లో ఈవెంట్స్‌ని చూపిస్తుంది. ఫోన్‌కి వచ్చిన టెక్స్ట్‌ మెసేజ్‌లను వాచ్‌లోనే చదువుకోవచ్చు. ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ని చూడొచ్చు. వాచ్‌ బ్యాటరీ సామర్థ్యమూ ఎక్కువే. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చు. ఛార్జ్‌ చేయడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? కేవలం 15 నిమిషాలే. వాచ్‌ బ్యాండ్స్‌ని కావాల్సినట్టుగా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఐదు రకాల స్త్టెల్స్‌లో వాచ్‌ని అందిస్తున్నారు.

ఇదో పియానో కీబోర్డ్‌...

సిస్టం క్వర్టీ కీబోర్డ్‌లా పోర్టబుల్‌ పరిమాణంలో అందుబాటులోకి వస్తే బాగుంటుంది కదూ! అనుకుంటున్నారా? అయితే, చిత్రంలో కనిపించేది అదే. పేరు Seaboard Rise. తాకేతెరపై మునివేళ్లతో కదిపినట్టుగా దీనిపై వేళ్లు నాట్యం చేస్తే చాలు. ముచ్చటైన మ్యూజిక్‌ ట్రాక్‌లు వినిపిస్తాయి. ఎందుకంటే ఈ మ్యూజిక్‌ కీబోర్డ్‌ని 'టచ్‌ సెన్సిటివ్‌' మీటలతో డిజైన్‌ చేశారు. Slide ఎఫెక్ట్‌తో వేళ్లను గీసినట్టుగా పైకి కదిలిస్తే చాలు. Press, Glide, Lift ఎఫెక్ట్‌లతో ట్రాక్స్‌ని కంపోజ్‌ చేయవచ్చు. Equator సాఫ్ట్‌వేర్‌లను సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని మరిన్ని నాణ్యమైన ట్రాక్‌లను కంపోజ్‌ చేసుకునే వీలుంది. MIDI ప్రత్యేక ఇంటర్ఫేస్‌తో సిస్టమ్స్‌కి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. బ్లూటూత్‌ సపోర్ట్‌ కూడా ఉంది. విండోస్‌ 7 తర్వాత వెర్షన్లను సపోర్ట్‌ చేస్తుంది. మ్యాక్‌లకు కనెక్ట్‌ చేసుకుని వాడుకోవచ్చు. ప్రత్యేక కేస్‌లో కీబోర్డ్‌ని పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/MzP0df

సరికొత్త ట్రాకర్స్‌

రోజూ చేసే వ్యాయామాన్ని స్మార్ట్‌గా మార్చేద్దాం అనుకుంటే? 'మిష్‌ఫిట్‌ ఫిట్‌నెట్‌ ట్రాకర్స్‌'ని ధరిస్తే సరి. దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన సరికొత్త ఉత్పత్తులు ఇవి. పేర్లు వరుసగాMisfit Shine, Misfit Flash, Misfit Link. మూడు పరికరాలతో ఫిట్‌నెస్‌ని మెరుగు పరుచుకోవచ్చు. సింపుల్‌... రోజులో మీరెంత దూరం నడిచారు... ఎన్ని మెట్లు ఎక్కారు... ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యేయో ట్రాక్‌ చేస్తుంది. ఈత మీరు రోజువారీ దినచర్య అయితే షైన్‌తో నీటిలో మీ ఈత సామర్థ్యాన్ని కొలవొచ్చు. దీంట్లోని బ్యాటరీని 6 నెలల పాటు పని చేస్తుంది. ఐఫోన్‌, శామ్‌సంగ్‌, గూగుల్‌ నిక్సస్‌ స్మార్ట్‌ మొబైళ్లకి అనుసంధానం చేసి వాడుకోవచ్చు. రంగు రంగుల డిజైన్లతో 30 అడుగుల నీటి లోతులోనూ వాడుకోవచ్చు.మ్యూజిక్‌ రిమోట్‌లా వాడుకోవచ్చు. ఫిట్‌నెస్‌ ట్రాకర్‌గానూ పని చేస్తుంది. ఆన్‌లైన్‌ అంగళ్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://misfit.com సైట్‌ని చూడండి.

ఇవో రెండు

రోజు రోజుకీ పవర్‌ బ్యాంకులు అనివార్యం అవుతున్నాయి. ఇక మార్కెట్‌లో వీటి సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కావాలంటే Yu Jyuice సిరీస్‌ పవర్‌ బ్యాంకులు చూడండి. వీటి సామర్థ్యం 5000mAh, 10000 mAh. యూఎస్‌బీ 2.0 పోర్ట్‌, మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌లతో వీటిని రూపొందించారు. వీటి ధరలు వరుసగా రూ.699, రూ.1,099. ఆన్‌లైన్‌ అంగడి శ్నాప్‌డీల్‌.కామ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. పవర్‌ బ్యాంకులోని ప్రత్యేక ఎల్‌ఈడీ లైట్‌తో ఛార్జింగ్‌ లెవల్‌ని తెలుసుకోవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/qylvHX

ప్రత్యేక 'పవర్‌'

రేసింగ్‌, ట్రెక్కింగ్‌ లేదా మరేదైనా సాహస యాత్రలు చేసే వారికి ఫోన్‌ వెంటే ఉండడం చాలా అవసరం. ఫోన్‌లో నిత్యం ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవడం మరింత అనివార్యం. అందుకే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా పవర్‌ బ్యాంకుని పక్కనే ఉంచుకుందాం అనుకుంటే AXL Power Bank గురించి తెలుసుకోవాల్సిందే. వాటర్‌ప్రూఫ్‌ రక్షణ కవచం ఉంది. ఒక మీటర్‌ నీటి లోతున కూడా ఫోన్‌ని నిక్షేపంగా ఛార్జ్‌ చేస్తుంది. అంతేకాదు... దుమ్ము, ధూళిలోనూ ఛార్జ్‌ చేసేలా డస్ట్‌ప్రూఫ్‌ కవచం ఉంది. దీంట్లోని ఇంటర్నల్‌ బ్యాటరీ సామర్థ్యం 5,100mAh. ఏ మోడల్‌ మొబైల్‌ని అయినా దీంతో ఫుల్‌ ఛార్జ్‌ చేయవచ్చు. పచ్చని లెడ్‌ లైట్స్‌తో బ్యాటరీ ఛార్జ్‌ లెవల్స్‌ని తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రమాదంలో ఉన్నట్లయితే ప్రత్యేక లెడ్‌ ఫ్లాష్‌ లైట్‌ ద్వారా తెలిపే వీలుంది. ధర సుమారు రూ.2,799.

క్లౌడ్‌ కెమెరా

ఇంట్లో సెక్యూరిటీ కెమెరా పెట్టుకోవడం అంటే పెద్ద ప్రక్రియే అనుకుంటారు. కానీ, TP-Link NC200 Cloud కెమెరాతో చాలా సులభం. క్షణాల్లోనే కెమెరాని సెట్‌ చేసుకుని నిఘా పెట్టుకోవచ్చు. అందుకు మీకు కావాల్సిందల్లా కెమెరాకి దగ్గర్లో పవర్‌ సాకెట్‌, ఈథర్నెట్‌ కనెక్షన్‌. అంతే... ఇట్టే సెట్‌అప్‌ చేసుకుని ఇంట్లోని పిల్లలు, పెంపుడు జంతువులు, ఖరీదైనా వస్తువులపై కెమెరా కన్నేసి ఉంచొచ్చు. లైవ్‌లోనే. కావాలంటే ఫోన్‌తో ఫొటోలు తీయొచ్చు. వీడియోని రికార్డ్‌ చేసే వీలుంది.
నిఘా పెట్టిన లొకేషన్‌లో ఏదైనా కదలికని గమనిస్తే వెంటనే ఫోన్‌కి నోటిఫికేషన్‌ వచ్చేలా చేయవచ్చు. కెమెరాని ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్లపై సులువుగా యాక్సెస్‌ చేసేందుకు TP Camera ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆప్‌ అందించే సూచనల మేరకు ఫోన్‌లో సులువుగా కెమెరాని సెట్‌అప్‌ చేయవచ్చు. అంతేనా... కెమెరాని వై-ఫై నెట్‌వర్క్‌కి అనుసంధానం చేసి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుని వాడుకోవచ్చు. ధర సుమారు రూ.2,200. http://goo.gl/NBGJcD

ఎటైనా సరే...

ఫోన్‌ ఛార్జ్‌ చేయాలన్నా లేదా డేటాని కాపీ చేసుకోవాలన్నా మైక్రో యూఎస్‌బీ కేబుళ్లనే ఎక్కువగా వాడేస్తున్నాం. కానీ, మీరెప్పుడైనా చూడకుండా లేదా చీకట్లో ఎన్ని సార్లు మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ని ఫోన్‌కి సరైన పద్ధతిలో ఇన్‌సర్ట్‌ చేశారు? MicFlip మైక్రో యూఎస్‌బీ కేబుల్‌ పోర్ట్‌ని చూడకుండానే కనెక్ట్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఎటైన కనెక్ట్‌ చేసి వాడుకునేలా ప్రపంచంలోనే తొలిసారి ఈ తరహా Reversible micro USB కేబుల్‌ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. చిత్రంలో కనిపించే కేబుల్‌ అదే. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/Lzsm3A లింక్‌ని చూడండి.

ఇదే అత్యుత్తమం!

4కే రిజల్యూషన్‌ అంటేనే అబ్బో! అనుకుంటాం. అదే 4కే రిజల్యూషన్‌కి 30 రెట్లు ఎక్కువ క్వాలిటీతో వీడియోలు చిత్రీకరిస్తే? కెనాన్‌ కంపెనీ అందుకు సరిపడే ఇమేజ్‌ సెన్సర్‌ని రూపొందించింది. దాని సామర్థ్యం ఎంతో తెలుసా? ఏకంగా 250 మెగాపిక్సల్స్‌. ప్రపంచంతో ఇదే అత్యుత్తమైన పిక్సల్‌ క్వాలిటీతో చిత్రీకరించగలిగే CMOS Sensor అని నిపుణులు చెబుతున్నారు. దీంతో 18 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని కూడా చాలా స్పష్టంగా చిత్రీకరించొచ్చట!

బుల్లి ప్రింటర్‌

మైక్రోమ్యాక్స్‌ YU సిరీస్‌ స్మార్ట్‌ మొబైళ్ల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే సిరీస్‌లో పోర్టబుల్‌ ఫొటో ప్రింటర్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. పేరేంటో తెలుసా? YUPIX. చిత్రంలో కనిపించేది అదే. జేబులో పట్టేంత పరిమాణంలో ఈ బుల్లి ప్రింటర్‌ని రూపొందించారు. వై-వై లేదా ఎన్‌ఎఫ్‌సీ నెట్‌వర్క్‌ ద్వారా ఫోన్‌కి అనుసంధానం అవుతుంది. 60 సెకన్లలో ఫొటోని ప్రాసెస్‌ చేసి ప్రింట్‌ అందిస్తుంది. ఫొటోల పరిమాణం ఎంతో తెలుసా? 2.1X3.4 అంగుళాలు. ఒకేసారి 10 ఫొటోలను ప్రింట్‌ తీసుకోవచ్చు. ఫొటో రిజల్యూషన్‌ 291dpi. ప్రింటర్‌ని యూజర్‌ ఫ్రెండ్లీగా వాడుకునేందుకు YUPIX ఆప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 750mAh బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుంది. వాటర్‌ప్రూఫ్‌ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌లతో కలిసి పని చేస్తుంది. అంటే... వాడుతున్న స్మార్ట్‌ మొబైల్‌ నుంచే ఫొటో ప్రింట్‌లు తీసుకోవచ్చన్నమాట. ధర సుమారు రూ.6,999. ఆన్‌లైన్‌ అంగడి అమెజాన్‌.ఇన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/ucjrcY లింక్‌ని చూడండి.

బంగారంతో 'స్మార్ట్‌'గా!

కనిపించేది స్మార్ట్‌ వాచ్‌ అని తెలుస్తోందిగా! కానీ, దీంట్లో ప్రత్యేకత ఏంటో తెలుసా? వాచ్‌ని 23 క్యారట్‌ బంగారంతో తయారు చేశారు. ఎల్‌జీ కంపెనీ దీన్ని అందిస్తోంది. పేరేంటో తెలుసా? LG Watch Urbane Luxe. వాచ్‌ తెర పరిమాణం 1.3 అంగుళాలు. గొరిల్లా గ్లాస్‌ 3 రక్షణ ఉంది. 1.2 GHz Qualcomm Snapdragon 400 ప్రాసెసర్‌ని వాడారు. బిల్ట్‌ఇన్‌ మైక్‌ ఉంది. స్మార్ట్‌ ఫోన్‌తో కనెక్ట్‌ అయ్యి వాచ్‌ నుంచే అన్నీ ముగించొచ్చు. 'ఓకే గూగుల్‌' అని పిలిస్తే చాలు. వాచ్‌తోనే మెసేజ్‌లు వెళ్తాయి. పాటలు ప్లే అవుతాయి. నెట్టిల్లు మొత్తం కదిలొస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 410 mAh. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. ధర ఎంతుంటుందో? అనే సందేహం రాకమానదు. సుమారు రూ.80,000. వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/rBJMKZ లింక్‌లోకి వెళ్లండి.

3డీ స్కానర్‌లా...

ఎక్కడికి వెళ్లినా ఫొటోలు... వీడియోలు తీస్తుంటాం. కానీ, మీరెప్పుడైనా 3డీలో ఏదైనా చిత్రీకరించారా? ఉదాహరణకు మీరు తాజ్‌మహాల్‌ దగ్గరకు వెళ్లారు. కట్టడాన్ని 3డీలో చిత్రీకరిస్తే! వెంటనే స్నేహితులతో షేర్‌ చేస్తే! ఎలా సాధ్యం అంటారా? మైక్రోసాఫ్ట్‌ రిసెర్చ్‌ ప్రాజెక్ట్‌ 'మొబైల్‌ఫ్యుజన్‌' 3డీ స్కానర్‌ ఆప్‌ ఉంటే చాలు. ఫోన్‌లో ఎలాంటి అదనపు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లు అక్కర్లేకుండానే సులువుగా 3డీ స్కానింగ్‌ చేయవచ్చు. ఇలా చిత్రీకరించిన వాటిని 3డీ ప్రింటర్‌లోనూ వాడొచ్చు. అంతేనా... మీరేదైనా ఉత్పత్తుల్ని మార్కెట్‌ చేస్తున్నట్లయితే వాటిని 3డీలో చిత్రీకరించి అమ్మకానికీ పెట్టొచ్చు కూడా. అన్ని మొబైల్‌ ఓఎస్‌లకు సరిడేలా తీర్చిదిద్ది త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/w0dkKH లింక్‌ని చూడండి.

అన్నీ ఒకేదాంట్లో...

స్మార్ట్‌ మొబైల్‌ వాడేవారు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు రెండు... ఒకటి తక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్‌. రెండు డేటా స్టోరేజ్‌. కానీ, మీకు తెలుసా? కింగ్‌స్టన్‌కంపెనీ సరికొత్త పరికరాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. పేరు MobileLite Wireless G2. అరచేతిలో ఒదిగిపోయే ఈ పరికరాన్ని ఫోన్‌ని ఛార్జ్‌ చేసే పవర్‌ బ్యాంకులానూ, ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌లను రీడ్‌ చేసే స్టోరేజ్‌ హబ్‌గానూ వాడుకోవచ్చు. డివైజ్‌ బ్యాటరీ సామర్థ్యం ఎంతో తెలుసా? 4,640mAh. మైక్రోఎస్‌డీ పోర్ట్‌తో రెండు స్లారు ఫోన్‌ని ఫుల్‌ ఛార్జ్‌ చేయవచ్చు. అంతేకాదు... యూఎస్‌బీ డ్రైవ్‌, ఎస్‌డీ కార్డ్‌లను కనెక్ట్‌ చేసి ఒకేసారి రెండింటినీ యాక్సెస్‌ చేయవచ్చు. డేటాని రెండింటిలోకి ఒకేసారి అప్‌లోడ్‌ చేయవచ్చు. MobileLite మొబైల్‌ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా డేటాని మేనేజ్‌ చేయవచ్చు. అంతేకాదు...పరికరాన్ని బుల్లి వై-ఫై రౌటర్‌లా మార్చేయవచ్చు. వాడుతున్న అన్ని పరికరాల్ని నెట్‌వర్క్‌కి అనుసంధానం చేసి ఫైల్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు. ఉదాహరణకు నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అయ్యి ఆప్‌ని వేదికగా చేసుకుని ట్యాబ్‌లోని ఫైల్స్‌ని ఫోన్‌లోకి... ఫోన్‌లోని ఫైల్స్‌ని ట్యాబ్‌లోకి కాపీ చేసుకోవచ్చు. యూఎస్‌బీ డ్రైవ్‌ లేదా మైక్రోఎస్‌డీ కార్డ్‌లోని వీడియో ఫైల్స్‌ని ఆప్‌లోనే ప్లే చేసి చూడొచ్చు. ఒకేసారి 8 మంది యూజర్లు కంటెంట్‌ని స్ట్రీమింగ్‌ చేయవచ్చట. ధరెంతో తెలుసా? సుమారు రూ.4,000. ఇతర వివరాలకు http://goo.gl/Pr8lYr లింక్‌లోకి వెళ్లండి.

ఇక వై-ఫైతో...

ఎక్కడైనా ఒదిగిపోయేలా కనిపించే ఈ బుల్లి కెమెరా చూశారా? పరిమాణం ఎంతో తెలుసా? 1.4 అంగుళాలు. కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సల్‌. 124 డిగ్రీల వైడ్‌-యాంగిల్‌ లెన్స్‌తో కెమెరాని రూపొందించారు. దీంతో 1080 పిక్సల్‌ క్వాలిటీతో కూడిన హెచ్‌డీ వీడియోలను చిత్రీకరించొచ్చు. అంతేకాదు... కెమెరా వై-ఫై నెట్‌వర్క్‌తో పని చేయడం మరో ప్రత్యేకత. నీళ్లలోనూ వాడుకునేందుకు అనువుగా వాటర్‌ప్రూఫ్‌తో కెమెరాకి రక్షణ ఏర్పాటు చేశారు. సుమారు 90 నిమిషాల చిత్రీకరణ చేయవచ్చు. వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ చేసి చిత్రీకరించే వీడియోని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్‌కి అనుసంధానం అయ్యి వాటితోనే కెమెరాని ఆపరేట్‌ చేయవచ్చు కూడా. అందుకు ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్లలో Polaroid Cube+ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌ కూడా ఉంది. కెమెరా అడుగున నిక్షిప్తం చేసిన అయస్కాంతంతో కెమెరాను సులువుగా సెట్‌అప్‌ చేయవచ్చు. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 64 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. దేశీయ మార్కెట్‌లోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ధర సుమారు రూ.8,200.

లెడ్‌ టీవీ!

21 అంగుళాల తెరతో ఇంటెక్స్‌ కంపెనీ సరికొత్త హెచ్‌డీ లెడ్‌ టీవీని అందుబాటులోకి తెచ్చింది. పేరు LED 2111-FHD. తెర రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. 16.7 మిలియన్‌ రంగుల్ని సపోర్ట్‌ చేస్తుందట. టీవీ చూసేటప్పుడు కళ్లు ఒత్తిడికి లోనవకుండా ఉండేలా Eye Safe T సౌకర్యం ఉంది. బిల్ట్‌ఇన్‌ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. సామర్థ్యం 3WX2. టీవీకి కింది భాగంలో స్పీకర్లను నిక్షిప్తం చేశారు. అంతేనా... Digital Noise ఫిల్టర్‌తో సౌండ్‌ క్వాలిటీ అదుర్సేనట. 'స్మార్ట్‌ పవర్‌ సేవింగ్‌'తో విద్యుత్‌ని ఆదా చేయవచ్చు. యూఎస్‌బీ డ్రైవ్‌ని టీవీకి కనెక్ట్‌ చేసి హాయిగా సినిమాల్ని చూడొచ్చు కూడా. ఇంతకీ టీవీ ధరెంతో తెలుసా? రూ.9,990. ఇతర వివరాలకు http://goo.gl/hGwj88 లింక్‌ని చూడండి.

బుల్లి కంప్యూటర్‌

విండోస్‌ ఓఎస్‌తో పని చేసే కంప్యూటర్‌ సీపీయూ ఒక చిన్న యూఎస్‌బీ డ్రైవ్‌లా అందుబాటులోకి వస్తుందని ఎప్పుడైనా వూహించారా? చిత్రంలో కనిపించేది అదే. ఇంటెల్‌ కంపెనీ తయారు చేసిన దీని పేరు Computer Stick mini-PC. హెచ్‌డీఎంఐ పోర్ట్‌తో మానిటర్‌, స్మార్ట్‌ టీవీలకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. విండోస్‌ 8.1 వెర్షన్‌ని సపోర్ట్‌ చేస్తుంది. Intel HD Graphics, Quad Core Intel Atom ప్రాసెసర్లని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32 జీబీ. మైక్రోఎస్‌డీ స్లాట్‌తో మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్లూటూత్‌ 4.0, వై-ఫై నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తుంది. పెన్‌డ్రైవ్‌ లాంటి ఇతర యూఎస్‌బీ డ్రైవ్‌లను కనెక్ట్‌ చేసి వాడుకునేందుకు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌ కూడా ఉంది. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌.కామ్‌లోకి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. ధర సుమారు రూ.9,999. ఇతర వివరాలకు http://goo.gl/SGGnZY లింక్‌లోకి వెళ్లండి.

ఒకేసారి మూడు

ల్యాపీ, ట్యాబ్‌, స్మార్ట్‌ మొబైల్‌ వాడేస్తుంటారు. అన్నింటిలోనూ ఏవేవో టైప్‌ చేస్తుంటారు. కానీ, ఎప్పుడైనా అనుకున్నారా? మూడు పరికరాల్ని ఒకేసారి సపోర్ట్‌ చేసే కీబోర్డ్‌ ఉంటే బాగుంటుందని! అలాంటిదే చిత్రంలో కనిపించే బ్లూటూత్‌ కీబోర్డ్‌. లాగీటెక్‌ కంపెనీ దీన్ని రూపొందించింది. పేరు Multi-Device Keyboard K480. ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన తొలి కీబోర్డ్‌ ఇదేనట. బ్లూటూత్‌ సపోర్ట్‌తో పని చేసే మూడు పరికరాలకు ఒకేసారి కనెక్ట్‌ అయ్యి పని చేస్తుంది.
విండోస్‌, యాపిల్‌ మ్యాక్‌, ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంలను సపోర్ట్‌ చేస్తుంది. కీబోర్డ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్విచ్‌ని నొక్కుతూ అనుసంధానం చేసిన మూడు పరికరాలను సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. సాధారణ క్వర్టీ కీబోర్డ్‌ మాదిరిగా రూపొందించారు. కీబోర్డ్‌లోని మరో ప్రత్యేకత ఏంటంటే... చిత్రంలో మాదిరిగా ఫోన్‌, ట్యాబ్‌లను టైపింగ్‌కి అనువుగా డాక్‌ చేసి పెట్టుకోవచ్చు. ధర సుమారు రూ.2,795. ఇతర వివరాలకు http://goo.gl/35w9wz

సౌండ్‌ అదరాలి

చుట్టూ అత్యాధునిక గ్యాడ్జెట్‌లే. అన్నింటిలోనూ మ్యూజిక్‌ ఫైల్స్‌ ఉన్నాయి. అప్పుడు వైర్‌లెస్‌ పద్ధతిలో కనెక్ట్‌ అయ్యి అదిరే సౌండ్‌తో పాటలు వినాలంటే? ఏముందీ లాగీటెక్‌ కంపెనీ దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన బుల్లి స్పీకర్‌ ఉంటే సరి. పేరు UE Boom. ఇదో పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌. 360 డిగ్రీల కోణంలో సౌండ్‌ వెలువడడం దీని ప్రత్యేకత. 8 డివైజ్‌లతో వైర్‌లెస్‌ పద్ధతిలో కనెక్ట్‌ చేయవచ్చు. అంతేకాదు... ఒకేసారి రెండు డివైజ్‌లను యాక్సెస్‌ చేయగలుగుతుంది. NFC తోనూ కనెక్ట్‌ చేయవచ్చు. ఫోన్‌కాల్స్‌ కూడా స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. స్పీకర్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 15 గంటల పాటు వినొచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లతో పని చేసే మొబైళ్లలో ప్రత్యేక ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని స్పీకర్‌ని మరింత అనువుగా వాడుకోవచ్చు. స్పీకర్‌పై కనిపించే ప్లస్‌, మైనస్‌ గుర్తుల్ని నొక్కి బ్యాటరీ సామర్థ్యం ఎంతుందో వినొచ్చు. ధర సుమారు రూ. 14,995. ఇతర వివరాలకు http://goo.gl/r8v6eE లింక్‌ని చూడండి.

త్రీడీ ప్రింటర్‌

కంప్యూటర్‌ పక్కనే ప్రింటర్‌ ఉండడం సర్వసాధారణం. అవసరం మేరకు డాక్యుమెంట్స్‌ని చిటికెలో ప్రింట్‌ తీసుకుంటాం. ఇప్పుడు వీటితో మరో ప్రింటర్‌ జత కట్టేందుకు సిద్ధం అవుతోంది. అదే త్రీడీ ప్రింటర్‌. టెక్నాలజీ రంగంలో వీటి హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మీదట మీరు రూపొందించిన వాటి గురించి టెక్స్ట్‌ డాక్యుమెంట్స్‌ని మాత్రమే కాదు. ఇంట్లోనే మీరు రూపొందించిన ఉత్పత్తుల్ని త్రీడీలో ప్రింట్‌లు తీసుకోవచ్చు. అందుకు అనువుగా రూపొందిన త్రీడీ ప్రింటరే Micro M3D. పేరుకి తగ్గట్టుగానే కంప్యూటర్‌ పక్కనే అమర్చుకుని వాడుకోవచ్చు. ఈ తరహాలో వినియోగదారుల అవసరాలు తీర్చేలా (first consumer 3D printer) అందుబాటులోకి రానున్న తొలి ప్రింటర్‌ ఇదేనట. 'మైక్రో మోషన్‌ టెక్నాలజీ'తో దీన్ని రూపొందించారు.ప్రింటర్‌ కింది భాగంలో నిక్షిప్తం చేసినత్రీడీ ఇంక్‌ని వాడుకుని ఆకారాల్ని ప్రింటర్‌ నిర్మిస్తుంది. సాధారణ ప్రింటర్‌ మాదిరిగానే కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేయవచ్చట. ఇంకేముందీ... త్రీడీలో ఆకారాల్ని క్రియేట్‌ చేసి ప్రింట్‌ ఇవ్వడమే. దీంతో క్షణాల్లో మీరు రూపొందించిన త్రీడీ మాడ్యూల్‌ ప్రత్యక్షంగా తాకి సరి చూసుకునేందుకు సిద్ధం అవుతుంది. ఉదాహరణకు సివిల్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదుతున్న విద్యార్థులు వారు రూపొందించిన క్యాడ్‌ డిజైన్లను నిమిషాల్లో ఆకారాలుగా మలిచి సరి చూసుకోవచ్చు. ప్రస్తుతం నమూన దశలో ఉన్న ప్రింటర్‌ త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఇతర వివరాలకు https://printm3d.com లింక్‌ని చూడండి.

సరికొత్త ప్లేయర్‌

మీరు మ్యూజిక్‌ ప్రియులా? ఇప్పటికీ మ్యూజిక్‌ ప్లేయర్లలోనే పాటలు వినేందుకు ఇష్టపడతారా? అయితే, త్వరలోనే మార్కెట్‌లోకి మరో మ్యూజిక్‌ ప్లేయర్‌ అందుబాటులోకి రానుంది. పేరు Pono Music Player. చిత్రంలో మాదిరిగా త్రికోణాకారంలో ప్లేయర్‌ని రూపొందించారు. హై క్వాలిటీలో పాటలు వినొచ్చు. ప్లేయర్‌ మెమొరీ సామర్థ్యం 64 జీబీ. కావాలంటే మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 128 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. సుమారు 2000 హై రిజల్యూషన్‌ పాటల్ని ప్లేయర్‌లో కాపీ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్లేయర్‌ని ఛార్జ్‌ చేస్తే సుమారు 8 గంటలు పాటలు వినొచ్చట. 2.5 అంగుళాల తాకేతెరతో ట్రాక్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు. హెడ్‌సెట్‌తో పాటలు వినేందుకు 3.5 ఎంఎం జాక్‌ ఉంది. వాల్యూమ్‌ కంట్రోల్స్‌ ప్లేయర్‌ పై భాగంలోనే కనిపిస్తాయి. ఇతర వివరాలకు http://goo.gl/d1Oxw9 లింక్‌ని చూడండి.

పెన్ను అనుకునేరు!

చూస్తుంటే ఇదేదో పెన్నులా ఉందే అనుకుంటే పోరబాటే. ఇదో మౌస్‌! పేరు 'పీఆర్‌-08 పెన్‌ స్టెల్‌ మౌస్‌'. కంప్యూటర్‌, ల్యాపీ, ఫోన్‌, ట్యాబ్‌లను అనుసంధానం చేసి వాడుకోవచ్చు. బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేసిన యూఎస్‌బీ రిసీవర్‌ ద్వారా ఇది పని చేస్తుంది. వాడదాం అనుకుంటే మీరు చేయాల్సిందల్లా రిసీవర్‌ని వాడుతున్న పరికరానికి కనెక్ట్‌ చేయడమే. ఉదాహరణకు ల్యాపీకి వాడదాం అనుకుంటే రిసీవర్‌ని యూఎస్‌బీ పోర్ట్‌కి కనెక్ట్‌ చేయాలి. అంతే... పెన్ను ల్యాపీకి మౌస్‌గా మారిపోతుంది. ఏముందీ... చిత్రంలో మాదిరిగా పెన్నులా పట్టుకుని నెట్‌ బ్రౌజ్‌ చేయవచ్చు. పెన్ను కింది భాగం ఉన్న పాయింటర్‌ ఆప్టికల్‌ సెన్సర్‌లా పని చేస్తూ కర్సర్‌ని కంట్రోల్‌ చేస్తుంది. దాని పైనే వరుసగా మౌస్‌ బటన్లను ఏర్పాటు చేశారు. అంతేనా... బ్రౌజ్‌ చేసేటప్పుడు పేజీలను జరుపుకునేందుకు 'స్క్రోల్‌ వీల్‌' కూడా ఉంది. మరో ప్రత్యేకత ఏంటేంటే... మౌస్‌, స్టైలస్‌లానే కాదు. ప్రెజంటేషన్స్‌ లాంటివి ప్రదర్శించేటప్పుడు లేజర్‌ పాయింటర్‌లానూ వాడుకోవచ్చు. పెన్నుకి మరో వైపు పై భాగం స్టైలస్‌లా పని చేస్తుంది. అంటే... ట్యాబ్‌లతో పని చేసేటప్పుడు పెన్నుని స్టైస్‌లా వాడుకుని పనిని సులువుగా ముగించేయవచ్చు. ధర సుమారు రూ.1300.

ఫోన్‌ నుంచి ఫోన్‌కి...

ఇప్పటి వరకూ ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోతే ఏం చేశారు? ఏముందీ... పవర్‌ బ్యాంకుల్ని ఆశ్రయిస్తాం! వాటిలోనూ ఛార్జింగ్‌ లేకుంటే అప్పుడేం చేస్తారు? సింపుల్‌... పక్కనే ఉన్న ఫ్రెండ్‌ మొబైల్‌ తీసుకుని మీ ఫోన్‌ని ఛార్జ్‌ చేసుకోండి. జోక్‌ చేస్తున్నాడేంటి? అనుకోవద్దు. నిజమే... రాబోయే రోజుల్లో ఇది సాధ్యమే! కావాలంటే HD key పరికరాన్ని చూడండి. దీన్ని Photo to Phone ఛార్జర్‌గా పిలుస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందిన ఫోన్‌ టూ ఫోన్‌ ఛార్జర్‌ ఇదేనట. మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌తో దీన్ని తయారు చేశారు. కావాలంటే ఫోన్‌ నుంచి డిజిటల్‌ కెమెరానీ ఛార్జ్‌ చేయవచ్చట. చూడ్డానికి ఈ ఛార్జర్‌ 'కీహోల్డర్‌'లా కనిపించడమే కాదు. కీహోల్డర్‌లా పని చేస్తుంది కూడా. ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కి ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌లానూ వాడుకోవచ్చు. హై స్పీడ్‌తో డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. ఎంతో తెలుసా? ప్రస్తుతం మీరు వాడుతున్న బ్లూటూత్‌ కంటే 20 రెట్లు ఎక్కువ వేగంతో డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే... బిల్ట్‌ఇన్‌ NFC పరికరంగానూ పని చేస్తుంది. దీని బరువు కేవలం 6 గ్రాములేనట. త్వరలోనే దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. http://goo.gl/thbWYi

Nikon 1 AW1 డిజిటల్‌ కెమెరా

నికాన్‌ అందించే డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి, డిజిటల్‌ కెమెరాల మాటేంటి? వాటినీ ఇప్పుడు సరికొత్త హంగులతో ముందుకు తీసుకొస్తోంది. కావాలంటే కొత్తగా అందుబాటులోకి తెచ్చిన Nikon 1 AW1 డిజిటల్‌ కెమెరాని చూడండి. చిత్రంలో కనిపిస్తున్న ఈ డిజిటల్‌ కెమెరా అన్ని Nikon 1 లెన్స్‌ని సపోర్ట్‌ చేస్తుందట. అంటే డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాల్లో ఎక్కువగా వాడే లెన్స్‌ని దీనికీ అమర్చుకుని ఆకట్టుకునేలా ఫోటోలను క్లిక్‌ మనిపించొచ్చు అన్నమాట. అంతేనా... ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన మొదటి కెమెరా ఇదేనట. వాటర్‌ప్రూఫ్‌, షాక్‌ప్రూఫ్‌, ఫ్రీజ్‌ప్రూఫ్‌ కూడా. అంటే నీళ్లలో ఫొటోలు తీసుకోవచ్చు. మంచులో క్లిక్‌ మనిపించొచ్చు. ఇంకా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కెమెరాని స్వేచ్ఛగా వాడేయవచ్చు. 14 MP CMOS sensor సామర్థ్యంతో ఫొటోలు, హెచ్‌డీ వీడియోలను చిత్రీకరించొచ్చు. సెకన్‌లో 15 ఫ్రేమ్‌లను బంధిస్తుంది. బిల్ట్‌ఇన్‌ ఫ్లాష్‌ ఉంది. 3 అంగుళాల ఎల్‌సీడీ తెర, మిని హెచ్‌డీఎంఐ, జీపీఎస్‌, వై-ఫై సౌకర్యాలు ఉన్నాయి. ధరెంతో తెలుసా? రూ. 39,950. ఇతర వివరాలకు http://goo.gl/0X9MRk లింక్‌లోకి వెళ్లండి.

ఇదో 'ట్రాన్స్‌పోర్టర్‌'

మీకు చాలా క్లౌడ్‌ సర్వీసులు తెలుసు. ఇప్పటి వరకూ డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌, స్కైడ్రైవ్‌... లాంటి చాలా సర్వీసుల్ని వాడుంటారు. కానీ, మీదైన క్లౌడ్‌ సర్వర్‌ని ఎప్పుడైనా ఏర్పాటు చేసుకున్నారా? అయితే, మీరు Transporter Sync గురించి తెలుసుకోవాల్సిందే. ఒక్కసారి దీన్ని నెట్‌కి కనెక్ట్‌ చేస్తే చాలు. ఎలాంటి క్లౌడ్‌ సర్వీసుల్లోకి లాగిన్‌ అవ్వకుండానే మీ ఫైల్స్‌ని ఎక్కడి నుంచైనా యాక్సెస్‌ చేయ వచ్చు. మొబైల్‌, కంప్యూటర్‌, ట్యాబ్లెట్‌, ల్యాపీల్లో దేంట్లోనైనా ఫైల్స్‌ని సింక్‌ చేసుకునే వీలుంది. డాక్యుమెంట్‌లు, ఫొటోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌, వీడియోలను దీంట్లో భద్రం చేసుకోవచ్చు. ఈ పరికరం ఆన్‌లైన్‌లో ఉన్నంత వరకూ ప్రపంచంలో ఏ మూల నుంచైనా మీ డేటాని యాక్సెస్‌ చేసి వాడుకోవచ్చు. స్టోర్‌ చేసిన సినిమాల్ని మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్‌, ట్యాబ్‌లతో కనెక్ట్‌ అయ్యి చూడొచ్చు. అనివార్య పరిస్థితుల్లో మీరు వాడుతున్న డివైజ్‌ల్లోని డేటాని ట్రాన్స్‌పోర్టర్‌లోకి ఆటోమాటిక్‌గా సింక్‌ అయ్యేలా చేయవచ్చు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఆయా ఆప్‌ స్టోర్‌ల్లో నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పరికరం సుమారు 4టీబీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉన్న డ్రైవ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ధర సుమారు రూ.6,016. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/OygP7S లింక్‌లోకి వెళ్లండి.

ఇక ఏదీ పోదు

వేలల్లో ఖరీదైన ఫోన్లు... లక్షల్లో ల్యాపీలు... ఇలా అన్నీ కొంటాం వాడేస్తుంటాం. కానీ, ఆయా పరికరాల రక్షణ నిమిత్తం ఏం వాడుతున్నారు? ఉదాహరణకు వాడుతున్న స్మార్ట్‌ మొబైల్‌ని పార్క్‌లోని బెంచ్‌పై మార్చిపోయి వచ్చేస్తే? ఎవరో ఒకరు జేబులో వేసుకుంటారు. ఇక అంతే సంగతులు! కానీ, మీరు iCookieపరికరాన్ని వాడితే బాధలేదు. చిత్రంలో కనిపించేది అదే. దీన్ని మీ మొబైల్‌తో అనుసంధానం చేస్తే చాలు. మీ మొబైల్‌ని ఎక్కడా మర్చిపోరు. ఒకవేళ మర్చిపోయినా 'ఐకూకీ' గుర్తు చేస్తుంది. ప్రత్యేక ఆప్‌తో బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఫోన్‌కి కనెక్ట్‌ అయ్యి వాడుకోవచ్చు. సుమారు 10 మీటర్ల వరకూ ఈ ట్రాకింగ్‌ పరికరం పని చేస్తుంది. కేవలం ఒక మొబైల్‌ని ట్రాక్‌ చేయడానికే కాదు. మీరు వాడే హ్యాండ్‌ బ్యాగులోనూ దీన్ని వాడుకోవచ్చు. అంతేకాదు... పిల్లలతో బయటికి వెళ్తే వారికి కీచైన్‌ రూపంలో తగిలించి కూడా తప్పిపోకుండా జాగ్రత్త పడొచ్చు. కారు, బైకు తాళాలకు తగిలించి వాడుకోవచ్చు. దీంతో తాళాలు భద్రం. జీపీఎస్‌ ద్వారా పోగొట్టుకున్న పరికరాన్ని మ్యాపింగ్‌పై చూసే వీలుంది. ధర సుమారు రూ.1,950. ఇతర వివరాలకు http://goo.gl/MyU లింక్‌లోకి వెళ్లండి.

స్మార్ట్‌ 'హెల్మెట్‌'

ప్రయాణాల్లో... ఇంజినీరింగ్‌ పనుల్లో... ట్రెక్కింగ్‌లో... ఇంచు మించు అన్ని పనుల్లోనూ హెల్మెట్‌లను వాడుతున్నాం. కానీ, హాలీవుడ్‌ సినిమాల్లో మాదిరిగా పెట్టుకున్న హెల్మెట్‌ కంప్యూటర్‌లా పని చేస్తే? మీ ముందున్న వాటిని గుర్తించి సమాచారాన్ని అందిస్తే? ఎలా సాధ్యం అంటారా? అయితే, మీరు DAQRI Smart Helmet గురించి తెలుసుకోవాల్సిందే. దీంట్లో రెండు రకాల డిస్‌ప్లే స్క్రీన్స్‌ని ఏర్పాటు చేశారు. కళ్లజోడు మాదిరిగా ఒకటి... హెల్మెట్‌ ముందు భాగంలో కనిపించే అద్దంలో మారోటి కనిపిస్తాయి. అలాగే, హెల్మెట్‌లో నాలుగు కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. వాటితో చూట్టూ ఉన్న పరిసరాల్ని సులువుగా స్కాన్‌ చేయవచ్చు. ఉదాహరణకు ఏదైనా ఫ్యాక్టరీలో మెషీన్‌ సెక్షన్‌లో పని చేసే వ్యక్తి హెల్మెట్‌ ధరించి మొత్తం పరిసరాల్ని గమనించొచ్చు. మెషీన్‌లో ఏదైనా సమస్య ఉంటే హెల్మెట్‌ వెంటనే గుర్తించి స్క్రీన్‌పై డిస్‌ప్లే చేసి ఎలర్ట్‌ చేస్తుంది. అంతేకాదు... మీరు ఎక్కడికి వెళ్లినా చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించి మ్యాపింగ్‌ చేస్తుంది. సంబంధిత డేటాని కళ్ల ముందు ఉంచుతుంది. 3డీలో మొత్తం వివరాల్ని అందిస్తుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు మొత్తం పరిసరాల్ని చిత్రీకరించొచ్చు. రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా ఇంట్లోని కంప్యూటర్‌లను బయట ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఈ తరహాలో రూపొందించిన స్మార్ట్‌ హెల్మెట్‌ ప్రపంచంలో ఇదే మొదటిదట. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/339B2G లింక్‌లోకి వెళ్లండి.

'సెల్ఫీ' కెమెరా

ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫీలే. మొబైల్‌తో క్లిక్‌ మనిపించేస్తున్నారు. ఫోన్‌తో సరే! డిజిటల్‌ కెమెరాతో సెల్ఫీ తీసుకున్నారా? కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ, నికాన్‌ కంపెనీ కొత్తగా తయారు చేసిన CoolPix S6900 మోడల్‌తో చాలా సులభం. చిత్రంలో కనిపించేది అదే కెమెరా. మూడు అంగుళాల తాకేతెరతో కెమెరాని తయారు చేశారు. 16 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో ఫొటోలు తీసుకోవచ్చు. జూమ్‌ కెపాసిటీ 12ఎక్స్‌. చిత్రాల్లో మాదిరిగా కెమెరాని పట్టుకుని సెల్ఫీ ఫొటోలు తీసుకోవచ్చు. కెమెరాకి ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తాకేతెరని వివిధ కోణాల్లోకి తిప్పుకుని ఫొటోలు క్లిక్‌ మనిపించొచ్చు. Gesture Control సౌకర్యం ద్వారా ఫొటోలు తీసుకోవచ్చు. కెమెరాలో బిల్ట్‌ఇన్‌గా ఏర్పాటు చేసిన వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ ద్వారా మొబైల్‌, ట్యాబ్‌, ల్యాపీలకు కనెక్ట్‌ అయ్యి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. నికాన్‌ అందించే Wireless Mobile Utlity ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా కెమెరాతో షూట్‌ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే 20 రకాల 'సీన్‌ మోడ్స్‌' ఉన్నాయి. 1920X1080 పిక్సల్‌ క్వాలిటీతో వీడియోలను చిత్రీకరించొచ్చు. కెమెరా బరువు 181 గ్రాములు. ధరెంతో తెలుసా? సుమారు రూ.20,000. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/cpfs9c లింక్‌ని చూడండి.

గాల్లో స్పీకర్‌!

మ్యూజిక్‌ వినేందుకు ఇప్పటి వరకూ చాలానే స్పీకర్లను చూశాం. వాడాం. కానీ, గాల్లో తిరుగుతూ పాటలు వినిపించే స్పీకర్‌ని చూశారా? కనిపించేది అదే. పేరు OM/ONE. ఇదో బ్లూటూత్‌ స్పీకర్‌. చిత్రంలో మాదిరిగా ప్రత్యేకంగా తయారు చేసిన బేస్‌కి సుమారు అంగుళం ఎత్తులో గాల్లో తిరుగుతూ పాటలు వినిపిస్తుంది. స్పీకర్‌కి కింద కనిపించేది డాకింగ్‌ స్టేషన్‌లా పని చేస్తుందన్నమాట. ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన మొదటి levitating బ్లూటూత్‌ స్పీకర్‌ ఇదేనట తెలుసా? ఒక్క స్పీకర్‌లానే కాదు. బిల్ట్‌ఇన్‌గా ఏర్పాటు చేసిన మైక్రోఫోన్‌ ద్వారా ఫోన్‌కాల్స్‌ని కూడా మాట్లాడొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 15 గంటల పాటు పాటలు వినొచ్చు. డాకింగ్‌ స్టేషన్‌ పైన తిరిరే స్పీకర్‌ని తీస్తే చాలు. ఆఫ్‌ అవుతుంది. వీడియో, ఇతర వివరాలకు www.omone.com సైట్‌ని చూడండి.

బుల్లి స్పీకర్లు

పనిలోనూ... ప్రయాణాల్లోనూ బోర్‌ అనిపిస్తే మొబైల్‌, కంప్యూటర్‌, ల్యాపీల్లో హెడ్‌సెట్‌తో కాకుండా స్పీకర్లను కనెక్ట్‌ చేసి పాటలు వినొచ్చు. అబ్బో... స్పీకర్లు మోసుకెళ్లడం అంటే కష్టం అనుకుంటున్నారా? అంత ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే ఇవి బుల్లి స్పీకర్లు. జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. ల్యాపీ బ్యాగులో ఒదిగిపోతాయి. హ్యాండ్‌ బ్యాగులో చేరి వెంటే వచ్చేస్తాయి. స్పీకర్ల పేరు NudeAudio Move Speaker. చిత్రంలో మాదిరిగా వీటిని ఎక్కడైనా తగిలించి వినేందుకు అనువుగా రూపొందించారు. Small, Medium, Large సైజుల్లో స్పీకర్లను అందిస్తున్నారు. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీటిని మొబైల్‌, ట్యాబ్‌, ల్యాపీలకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. ధర సుమారు 3 వేలు నుంచి 6 వేలు.

వెంటనే ఫొటో...

బాగా నచ్చిన ఫొటోలను ప్రింట్‌ తీసుకోవాలంటే? అబ్బో... పెద్ద ప్రక్రియే. ఎడిట్‌ చెయ్యాలి. స్టూడియోకి వెళ్లాలి. ప్రింట్‌లు తీసుకోవాలి. లేదంటే... ప్రింటర్‌ ఉండాలి. అవేం లేకుండా కూడా శుభకార్యాలకు తీసుకున్న ఫొటోలను ప్రింట్‌ తీసుకోవచ్చు. Socialamtic ఇన్స్‌స్టెంట్‌ కెమెరాతో ఇట్టే సాధ్యం. చిత్రంలో కనిపిస్తున్న ఈ కెమెరాతో క్లిక్‌లు కొట్టడం మాత్రమే కాకుండా ప్రింట్‌లు తీసుకోవచ్చు. 2X3 అంగుళాల పరిమాణంతో కూడిన ఫొటోలను ప్రింట్‌ తీసుకునే వీలుంది. వై-ఫై నెట్‌వర్క్‌ ద్వారా కెమెరాకి కనెక్ట్‌ అవ్వొచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 14 మెగాపిక్సల్‌ కెమెరాతో పాటు వెనక 2 మెగా పిక్సల్‌ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. వీడియో, ఇతర వివరాలకు www.social-matic.com సైట్‌ని చూడండి.

'కన్ను'గీటండి!

మీ సిస్టంలో ఇతరులు లాగిన్‌ అవ్వకుండా ఉండేందుకు ఏం చేస్తారు? ఏముందీ... లాగిన్‌ పాస్‌వర్డ్‌ సెట్‌ చేస్తాం అంటారా? ఇదేం కొత్త కాదు. ఇంకేమైనా చెప్పండి అంటే... శివాజీ సినిమాలో రజినీకాంత్‌లా వాయిస్‌ లాక్‌ సెట్‌ చేస్తాం అంటారా? రెండో జవాబు కాస్త భిన్నంగా ఉంది. కానీ.. అది సినిమా! మీకు తెలుసా? ఆధునిక టెక్నాలజీ మరోలా మీ కంప్యూటర్‌కి సెక్యూరిటీని సెట్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా మీ కళ్లనే పాస్‌వర్డ్‌లా సెట్‌ చేయవచ్చు. అదెలా సాధ్యమో తెలియాలంటే EyeLock Myris పరికరం గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో మాదిరిగా ఇదో మేకప్‌ బాక్స్‌లా ఉంటుంది. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా దీన్ని పీసీకి కనెక్ట్‌ చేస్తే... కంటి రెటీనాని స్కాన్‌ చేసి పాస్‌వర్డ్‌గా సెట్‌ చేస్తుంది. కంటిని స్కాన్‌ చేయడానికి తీసుకునే సమయం కేవలం 15 సెకన్లేనట. చిత్రంలో మాదిరిగా అద్దంలా పట్టుకుని దాంట్లోని చూస్తే చాలు. వీడియో, ఇతర వివరాలకు www.eyelock.comలోకి వెళ్లండి.

త్రీడీ కెమెరా..

ఐప్యాడ్‌ వాడుతున్నారా? అయితే, చిత్రంలో కనిపించే 3డీ కెమెరాతో వీడియోలు, ఫొటోలను చిత్రీకరించొచ్చు. పేరు Structure Sensor 3D Camera. కనిపిస్తున్న మాదిరిగా ఐప్యాడ్‌కి డాక్‌ చేయవచ్చు. దీంతో మీకు నచ్చిన ఏదైనా కట్టడం కావచ్చు... ఫర్నిచర్‌ కావచ్చు... ఏదైనా 3డీలో చిత్రీకరించొచ్చు. ఇలా రికార్డ్‌ చేసిన వాటిని త్రీడీ ప్రింటర్‌లకు ప్రింట్‌ ఇవ్వొచ్చు. 3డీ గేమింగ్‌ రూపకల్పనలో వాడుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే 3డీ కెమెరా కంటితో ప్రపంచాన్ని చూడొచ్చు అన్నమాట. కెమెరా ధర సుమారు రూ.22,000. వీడియో కోసం http://goo.gl/DkWaJ8 లింక్‌లోకి వెళ్లండి.

ఇంటెల్‌ 'బౌల్‌'

జేబులోనూ... చేతిలోనూ... బ్యాగ్‌లోనూ... ఏదో ఒక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ కచ్చితంగా ఉంటుంది. ఇంటికి చేరగానే అన్నింటినీ ఓ చోట పెట్టేస్తాం. మీకు తెలుసా? ఆ పెట్టిన చోటే అన్ని గ్యాడ్జెట్‌లను ఛార్జ్‌ చెయ్యొచ్చు. అందుకు తగిన పరికరాన్ని ఇంటెల్‌ కంపెనీ తయారు చేసింది. చిత్రంలో కనిపించేది అదే. పేరు Intel Smart Bowl. గిన్నె మాదిరిగా కనిపించే దీంట్లో వాడుతున్న మొబైల్‌, ఐపాడ్‌, ఐప్యాడ్‌, కీచైన్‌, బ్యాటరీలు... ఛార్జింగ్‌తో పని చేసే వాటిని ఉంచితే చాలు. ఛార్జ్‌ అవుతాయి. భవిష్యత్‌ అవసరాలకు అనువుగా ఈ నమూనా పరికరాన్ని రూపొందించారు. ప్రస్తుతానికి ఇంటెల్‌ తయారు చేసిన 'స్మార్ట్‌ హెడ్‌సెట్‌' మాత్రమే ఛార్జ్‌ అవుతుంది. ముందు ముందు ప్రత్యేక 'వైర్‌లెస్‌ పవర్‌' ద్వారా అన్నింటినీ ఛార్జ్‌ చేస్తుందట. బౌల్‌ వ్యాసార్థం 10 అంగుళాలు.

సామర్థ్యం ఎక్కువే

డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో కాకుండా క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేసే బడ్జెట్‌ మొబైల్‌ కావాలంటే? Gionee P3 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే.మల్టీ టాస్కింగ్‌తో ఒకటి కంటే ఎక్కువ ఆప్స్‌ని వాడాలనునేవారికి ఇది ప్రత్యేకం. తాకేతెర పరిమాణం 4.3 అంగుళాలు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. వెనక భాగంలో ఫొటోలకు 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఆటోఫోకస్‌తో ఫొటోలు తీయవచ్చు. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే వీలుంది. ర్యామ్‌ 512 ఎంబీ. బ్యాటరీ సామర్థ్యం 1700 mAh. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటల పాటు వాడుకోవచ్చు. ధర సుమారు రూ.7,499. ఇతర వివరాలకు http://goo.gl/4jUNmE

ట్రెండీగా ఉండాలా?

రంగుల్లో యూత్‌ఫుల్‌గా ఉండే మొబైల్‌ని వాడాలనుకుంటే తక్కువ బడ్జెట్‌లో Nokia Lumia 520 మోడల్‌ ఉంది. బేసిక్‌ స్మార్ట్‌ మొబైల్‌గా దీన్ని పరిగణించొచ్చు. రోజువారీ అవసరాలకు (కాల్స్‌, మెసేజ్‌లు, మెయిల్స్‌, ఛాటింగ్‌, నెట్‌బ్రౌజింగ్‌...) సరైన ఎంపిక. తెర పరిమాణం 4.3 అంగుళాలు. 1GHzడ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 64 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ఎఫ్‌ఎం, జీపీఎస్‌, వై-ఫై, బ్లూటూత్‌ 4.0 సౌకర్యాలు ఉన్నాయి. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో కెమెరా లేదు. బ్యాటరీ బ్యాక్‌అప్‌ కూడా కాస్త తక్కువే. ధర సుమారు రూ.7,800. ఇతర వివరాలకు http://goo.gl/DnZBQQ

ఆండ్రాయిడ్‌తోనే...

స్మార్ట్‌ మొబైల్‌ అంటే... ఐదు అంకెల బడ్జెట్‌ అక్కర్లేదు. కాస్త తక్కువకే కొనొచ్చు! అలాంటివో మూడు... నాణ్యమైన తాకేతెరతో స్మార్ట్‌గా వాడుకోవాలన్నా... ఆడుకోవాలన్నా... Lava Xolo A600 మోడల్‌ని ప్రయత్నించొచ్చు. 4.5 అంగుళాల తాకేతెరపై గేమ్స్‌ ఆకట్టుకుంటాయి. అన్ని కోణాల్లోనూ డిస్‌ప్లేలో ఎలాంటి మార్పు ఉండదు. దీంట్లోని బ్యాటరీ బ్యాక్‌అప్‌ మరో ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 16 గంటల పాటు ఫోన్ని వాడుకోవచ్చు. అందుకు 1900 mAh బ్యాటరీని ఏర్పాటు చేశారు. 1.3Ghzడ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 5 మెగాపిక్సల్‌, ముందు వీడియో ఛాటింగ్‌కి 0.3 మోగాపిక్సల్‌ కెమెరాలు ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. జీపీఎస్‌, వై-ఫై, బ్లూటూత్‌ 3.0, ఎఫ్‌ఎం రేడియో సౌకర్యాలు ఉన్నాయి. ఓఎస్‌ జెల్లిబీన్‌ 4.2. ఇంతకీ ధరెంతో తెలుసా? సుమారు రూ.7,500. ఇతర వివరాలకు http://goo.gl/XoOu1v

 

 

తక్కువలో కావాలా?

త్రీజీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ ఉండి కాస్త తక్కువ ధరలో మొబైల్‌ కావాలంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న My Phone SM3513 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఇదో 3జీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌. 3.5 అంగుళాల తాకే తెరతో పని చేస్తుంది. డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో రూపొందించారు. డ్యూయల్‌ సిమ్‌తో ఫోన్ని వాడుకోవచ్చు. 32 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. డ్యుయల్‌ కెమెరాలు (వెనక 3 మెగాపిక్సల్‌, ముందు 1.3 మెగాపిక్సల్‌) ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 4.2.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. టాక్‌టైం సుమారు 6 గంటలు. బ్యాటరీ సామర్థ్యం 1,300mAh.ఎఫ్‌ఎం రేడియోని రికార్డ్‌ చేయవచ్చు కూడా. వై-ఫై, 3జీబీ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ర్యామ్‌ 512 ఎంబీ. ధరెంతో తెలుసా? రూ.4,499.

ఎటైనా సరే...

సోనీ కంపెనీ సరికొత్త మోడల్‌తో ముందుకు రానుంది. అదే Vaio Flip. చిత్రంలో మాదిరిగా దీన్ని ల్యాప్‌టాప్‌లానే కాకుండా ట్యాబ్లెట్‌లా మడిచి వాడుకోవచ్చు. 13, 14, 15 అంగుళాల తెరలతో మోడల్‌ని అందిస్తున్నారు. ధర సుమారు రూ. 99,990 నుంచి మొదలు. ల్యాప్‌టాప్‌లో వాడుకునే సమయంలో 'టచ్‌ప్యాడ్‌'ని వాడుకోవచ్చు. చేతుల్ని అనువుగా పెట్టుకునేందుకు ప్యానల్‌ని విశాలంగా రూపొందించారు. తక్కువ వెలుగులోనూ టైపింగ్‌ సులువుగా చేసుకునేందుకు backlitకీబోర్డ్‌ని నిక్షిప్తం చేశారు. హెచ్‌డీ డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. 4th Generation Intel Core i5, i7ప్రాసెసర్లను వాడారు. వీటి బరువు కేవలం 1.31 కేజీలు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 7.5 గంటలు పని చేస్తుంది. ల్యాపీ షట్‌డౌన్‌ చేసి ఉన్నప్పుడు కూడా యూఎస్‌బీ డ్రైవ్‌కి కనెక్ట్‌ చేసి ఫోన్లను ఛార్జ్‌ చేయవచ్చు. మరిన్ని వివరాలకు http://goo.gl/kMj7mg లింక్‌లోకి వెళ్లండి.

కొత్తగా మరోటి

పీసీ, ల్యాపీల తయారీ కంపెనీ డెల్‌ ట్యాబ్లెట్‌లపై దృష్టి పెట్టింది. Dell Venue 7, 8 పేర్లతో సరికొత్త ట్యాబ్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో మొదటిసారి అందుబాటులోకి వచ్చిన ట్యాబ్‌లు ఇవే. వెన్యూ 7 విషయానికొస్తే... ధర సుమారు రూ.10,999. తాకే తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X800పిక్సల్స్‌. డ్యుయల్‌ కోర్‌ 1.6GHz Intel Atom Z2560ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. నాణ్యమైన గ్రాఫిక్స్‌ సపోర్ట్‌కి 'ఇంటెల్‌ హెచ్‌డీ గ్రాఫిక్స్‌' వాడారు. డ్యూయల్‌ కెమెరాలు (ముందు వీజీఏ కెమెరా, వెనక 3 మెగాపిక్సల్‌) ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. ఇక వెన్యూ 8 మోడల్‌ ట్యాబ్‌ తెర పరిమాణం 8అంగుళాలు. కెమెరాల సామర్థ్యం పెరిగింది. ముందు 2 మెగాపిక్సల్‌, వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. 2GHz dual core intel Atom ప్రాసెసర్‌ని వాడారు. బ్యాటరీ సామర్థ్యం 4100mAh.ధరెంతో తెలుసా? రూ.17,499.

 

 

మరింత నాజూకుగా..

లెనోవా కొత్త మారో అల్ట్రాబుక్‌తో అలరించనుంది. అత్యంత తక్కువ బరువుతో ముందుకొస్తున్న తొలి ఆల్ట్రాబుక్‌ ఇదే. బరువు కేవలం 1.4 కేజీలు. పేరు ThinkPad X1 Carbon. 14 అంగుళాల లెడ్‌ తెరతో రూపొందించారు. టైపింగ్‌కి మరింత సౌకర్యంగా ఉండేలా కీబోర్డ్‌ని డిజైన్‌ చేశారు. Intel Core i5-3427Uప్రాసెసర్‌ని వాడారు. Intel HD Graphics 4000 గ్రాఫిక్స్‌. ర్యామ్‌ 4 జీబీ. విండోస్‌ 7 హోం ప్రీమియం ఓఎస్‌ వెర్షన్‌తో అల్ట్రాబుక్‌ని అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే. కేవలం 35 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్‌ అవుతుంది. పూర్తి ఛార్జ్‌ అయ్యాక 8.2 గంటలు వాడుకోవచ్చు. డ్యుయల్‌ స్పీకర్లు ఉన్నాయి.

మరో మోడల్‌

ఇంటెక్స్‌ కంపెనీ Mediatek's 1.7 Ghz true octa core ప్రాసెసర్‌తో కొత్త మోడల్‌ని అందిస్తోంది. పేరు Aqua Octa. ఈ పవర్‌ ప్రాసెసర్‌తో దేశంలో తొలిసారి అందుబాటులోకి మొబైల్‌ ఇదే. డ్యూయల్‌ సిమ్‌తో ఫోన్ని వాడుకోవచ్చు. తాకే తెర పరిమాణం 6 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720పిక్సల్స్‌. ఫోన్ని నాజూకుగా 7ఎంఎం మందంతో రూపొందించారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. డ్యుయల్‌ కెమెరాలు (ముందు 5 మెగాపిక్సల్‌, వెనక 13 మెగాపిక్సల్‌...) ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 2,300 mAh. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఆరు గంటలు వస్తుంది. ఉచితంగా 5 జీబీ క్లౌడ్‌స్టోరేజ్‌ని అందిస్తున్నారు కూడా. ధర సుమారు రూ.19,999.

ఇదే మొదటిది!

డ్యూయల్‌ సిమ్‌తో ట్యాబ్లెట్‌ వాడాలనుకుంటే ఐబాల్‌ కంపెనీ తయారు చేసిన Slide 3G Q1035 గురించి తెలుసుకోవాల్సిందే. మొట్టమొదటిగా అందుబాటులోకి వచ్చిన దేశీయ డ్యూయల్‌ ట్యాబ్‌ ఇదేనట. తాకేతెర పరిమాణం 10.1 అంగుళాలు. 1.2Ghz quad core ప్రాసెసర్‌ని వాడారు. 3జీ నెట్‌వర్క్‌తో వెబ్‌ విహారం చేయవచ్చు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. ఎక్సటర్నల్‌ మెమొరీని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. తెర రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 2 మెగాపిక్సల్‌, వెనక 8 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో నిక్షిప్తం చేశారు. వెనక కెమెరా లెడ్‌ ఫ్లాష్‌తో ఫొటోలు తీయొచ్చు. ఎఫ్‌ఎం రేడియోని రికార్డ్‌ చేసుకునే వీలుంది. మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్‌ ఉంది. దీంతో ట్యాబ్‌ని స్మార్ట్‌ టీవీకి అనుసంధానం చేసి స్క్రీన్‌ని షేర్‌ చేయవచ్చు. అంటే... ట్యాబ్‌లోని ఫొటోలు, వీడియోలు, సినిమాలను స్మార్ట్‌ టీవీలోనే చూడొచ్చన్నమాట. బ్యాటరీ సామర్థ్యం ఎక్కువే. 6,000mAh బ్యాటరీతో వీడియోని 6 గంటలు చూడొచ్చు. వై-ఫై, బ్లూటూత్‌, మైక్రో యూఎస్‌బీ ఉండేనే ఉన్నాయి. ఇంతకీ ధరెంతో తెలుసా? రూ.17,999.

 

 

బెండయ్యింది!

ఇప్పటి వరకూ టీవీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఇక 'కర్వ్‌' ఆకారంలో ముస్తాబయ్యాయి. కావాలంటే ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన LG Curved OLED టీవీని చూడండి. ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన మొదటి టీవీ కూడా ఇదే. తెర పరిమాణం 55 అంగుళాలు. హెచ్‌డీ డిస్‌ప్లేతో సినిమాలు చూడొచ్చు. ఎల్‌జీకి ప్రత్యేకమైన '4 కలర్‌ పిక్సల్‌ టెక్నాలజీ'ని వాడారు. 2డీలోనే కాకుండా 3డీలోనూ వీడియోలను చూడొచ్చు. ఇన్‌బిల్ట్‌గానే వై-ఫై, డీఎల్‌ఎన్‌ఏ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ సౌకర్యాలు ఉన్నాయి. రిజల్యూషన్‌ నాణ్యత 1920X1080పిక్సల్స్‌. టీవీలో నిక్షిప్తం చేసిన స్పీకర్లు 40 వాట్స్‌తో వినిపిస్తాయి. టీవీ రిమోట్‌లో Gesture Controls కూడా ఉన్నాయి.ఇంతకీ దీని ధరెంతో తెలుసా? అక్షరాలా 9,99,000. ఇతర వివరాలకు http://goo.gl/A5aVV7

 

 

ఇంటెక్స్‌ 'ఐ4'

తెర అన్ని స్మార్ట్‌ మొబైళ్ల మాదిరిగానే పెద్దది. లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌. ఇంకేముంది ధర కూడా ఎక్కువే అనుకుంటారేమో. తక్కువ బడ్జెట్‌లోనే. రూ.7,600. ఇంటెక్స్‌ కంపెనీ అందిస్తున్న మొబైల్‌ పేరు Aqua i4. కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌తో పని చేస్తుంది. తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 480X854పిక్సల్స్‌. 1.2GHzడ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక ఆటో ఫోకస్‌తో 8 మెగాపిక్సల్‌ కెమెరా. ముందు వీడియో ఛాటింగ్‌కి 1.3 మెగాపిక్సల్‌ కెమెరాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 2000 mAh. మరిన్ని వివరాలకు http://goo.gl/oRLQyJ

ఫోనూ.. ట్యాబ్‌

అసుస్‌ కంపెనీ రూపొందించిన PadFone Mini గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో చూపిన మాదిరిగా మొబైల్‌ని ట్యాబ్‌లో డాక్‌ చేసుకుని వాడుకోవచ్చు. మొబైల్‌ తెర పరిమాణం 7 అంగుళాలు అయితే... ట్యాబ్‌ తెర సైజు 7 అంగుళాలు. దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే... ఫోన్‌ కాల్స్‌ చేసేప్పుడు సాధారణ మొబైల్‌లా వాడుకోవచ్చు. బ్రౌజింగ్‌ చేయాల్సివస్తే ఫోన్ని ట్యాబ్లెట్‌కి వెనక భాగంలో డాక్‌ చేసి ట్యాబ్‌లో బ్రౌజింగ్‌ చేయవచ్చు. డాక్‌ చేయగానే మొబైల్‌ తెర యథాతదంగా ట్యాబ్‌పైకి వచ్చేస్తుంది. ఫోన్‌ రిజల్యూషన్‌ 960X540పిక్సల్స్‌. 1.4Ghz Quad Core Snapdragon 400ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 8 మెగాపిక్సల్‌, ముందు 2 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో పని చేస్తాయి. ఇక డాకింగ్‌ ట్యాబ్‌ కాన్ఫిగరేషన్‌ విషయానికి వస్తే... ట్యాబ్‌ రిజల్యూషన్‌ 1280X720పిక్సల్స్‌. బ్యాటరీ సామర్థ్యం 2,200mAh.మరిన్ని వివరాలకు http://goo.gl/NvUmVrలింక్‌లోకి వెళ్లండి.

 


'జెస్ట్‌' వస్తోంది!

శామ్‌సంగ్‌ 'ఎస్‌' సందడి ఇంకా అలాగే ఉంది... ఇక 'జే' అంటూ కొత్త మోడల్‌తో శామ్‌సంగ్‌ సందడి షురూ చేస్తోంది. ఏడాది చివరినాటికిగానీ... కొత్త ఏడాది ప్రారంభంలోనో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. పేరు Samsung Galaxy J. ఇందులోని టెక్నాలజీ విషయానికొస్తే...ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.3 (జెల్లీబీన్‌) ఓఎస్‌తో ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్‌ 4.4 (కిట్‌కాట్‌) వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చు. 2.3GHz quad-core Snapdragon 800 ప్రాసెసర్‌ని వాడారు. 5 అంగుళాల తాకేతెర. Full-HD Super AMOLED డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ చూడొచ్చు. తెర రిజల్యూషన్‌ 1080X1920పిక్సల్స్‌. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13.2 మెగాపిక్సల్‌... ముందు వీడియో కాలింగ్‌కి 2.1 మెగాపిక్సల్‌ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ఒకేసారి డ్యుయల్‌ కెమెరాలతో వీడియో చిత్రీకరించొచ్చు. ర్యామ్‌ 3జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 64జీబీ వరకూ పెంచుకునే వీలుంది. బ్యాటరీ సామర్థ్యం 2600mAh. ఎరుపు, తెలుపు, నీలి రంగుల్లో ఫోన్‌ ఆకట్టుకుంటోంది. దేశీయ మార్కెట్‌లోకి రావాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.

క్వర్టీ కీబోర్డ్‌ కూడా...

ఐఫోన్‌ వాడకం బాగా పెరిగింది. వెర్షన్లు మార్చుకుంటూ మరింత స్లిమ్‌ అవుతూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరింత సౌకర్యంగా వాడుకునేలా ఐఫోన్‌కి క్వర్టీ కీబోర్డ్‌ని కూడా తగిలించొచ్చు. అదీ బ్లాక్‌బెర్రీలో ఉండే క్వర్టీ కీప్యాడ్‌ స్త్టెల్‌లో. ఆన్‌స్క్రీన్‌ కీబోర్డ్‌ నచ్చిన యూజర్లు ఈ క్వర్టీ కీప్యాడ్‌ని ఫోన్‌కి డాక్‌ చేసి వాడుకోవచ్చు. పేరు Typo Keyboard Case. ఐఫోన్‌ 5, 5ఎస్‌ మోడళ్ల అనువుగా కేస్‌ని రూపొందించారు. కచ్చితంగా చెప్పాలంటే కీబోర్డ్‌ 'బ్లాక్‌బెర్రీ బోల్డ్‌' మోడల్‌ని పోలి ఉంటుంది. దీని ద్వారా 50 శాతం వేగంగా టైప్‌ చేయవచ్చని రూపకర్తలు చెబుతున్నారు. బ్లూటూత్‌ ద్వారా కీబోర్డ్‌ని ఫోన్ని అనుసంధానం చేయవచ్చు. మైక్రోయూఎస్‌బీ పోర్డ్‌తో ఛార్జ్‌ చేయవచ్చు. రాత్రి సమయంలో అనువుగా టైప్‌ చేసుకునేందుకు Backlit ద్వారా కీబోర్డ్‌ మీటల వెనక లైటు వెలుగుతుంది. ఫోన్‌కి రక్షణ కవచం మాదిరిగా ఉపయోగపడుతుంది. త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ సందడి చేయనుంది. వివరాలకు http://typokeyboards.comలింక్‌లోకి వెళ్లండి.

 

 

బడ్జెట్‌ ఫోన్‌

తాకే తెర పరిమాణం 5 అంగుళాలు... లెడ్‌ స్క్రీన్‌... లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఓఎస్‌... 3జీ సౌకర్యం... గెలాక్సీ ఎస్‌2లా కనిపించే స్త్టెల్‌ డిజైన్‌... చూస్తుంటే ఇదేదో ఖరీదైన ఫోన్‌లా ఉందే అనుకుంటున్నారా? అదేం కాదు. ఇది బడ్జెట్‌ స్మార్ట్‌ మొబైల్‌. ధర కేవలం రూ.6,300. బీఎస్‌ఎన్‌ఎల్‌, పెన్‌లెట్‌ కంపెనీలు సంయుక్తంగా అందిస్తున్న మోడల్‌. పేరు Penta Smart PS501. తెర రిజల్యూషన్‌ 854X480పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.4.2 ఓఎస్‌ వెర్షన్‌తో ఫోన్‌ పని చేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌తో ఫోన్‌ వాడుకోవచ్చు. 3జీ నెట్‌వర్క్‌తో వీడియో కాలింగ్‌ చేసుకునే వీలుంది. 1.2Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ మెమొరీని పెంచుకోవచ్చు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరా. ఆటోఫోకస్‌తో ఫొటోలు తీయవచ్చు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 0.3 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వై-ఫై నెట్‌వర్క్‌ని వాడుకోవచ్చు. 3డీ వ్యూలో ఫొటోలు, వీడియోలు చూడొచ్చు. Gesture Typing, Speech to Text, Voice Based Search.. లాంటి మరిన్ని స్మార్ట్‌ సౌకర్యాల్ని నిక్షిప్తం చేశారు. ఇతర వివరాలకు http://goo.gl/HFSKLPలింక్‌లోకి వెళ్లండి.

 

మరింత స్మార్ట్‌గా...

టీవీలోనే మెయిల్స్‌ చెక్‌ చేస్తే! ఫేస్‌బుక్‌ని యాక్సెస్‌ చేస్తే! ట్విట్టర్‌లో అప్‌డేట్స్‌ని పోస్ట్‌ చేస్తే! సిస్టంలోని సేవ్‌ చేసిన హెచ్‌డీ సినిమాలు, వీడియోలను వీక్షిస్తే! ఇదంతా ఓ స్మార్ట్‌ బాక్స్‌తో సాధ్యమే. కావాలంటే Evo TV Smart Box XLమీడియా ప్లేయర్‌ని ప్రయత్నించొచ్చు. ఎలాంటి వైర్‌లు అవసరం లేకుండా ఇంట్లోని సిస్టం, మొబైల్‌, ట్యాబ్లెట్‌, ల్యాపీలను స్మార్ట్‌ టీవీకి అనుసంధానం చేస్తుంది. ఇంట్లో ఇదో ప్రత్యేక 'హోం నెట్‌వర్క్‌'ని ఏర్పాటు చేసుకుని పని చేస్తుంది. అందుకు అనువుగా 'స్మార్ట్‌ బాక్స్‌' సిస్టంని రూపొందించారు. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో (ఐస్‌క్రీం శాండ్‌విచ్‌) ఇది పని చేస్తుంది. ర్యామ్‌ 1 జీబీ. రిమోట్‌ కంట్రోల్‌తో బాక్స్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. ల్యాపీలోని మౌస్‌ప్యాడ్‌ మాదిరిగా తాకుతూనే రిమోట్‌ని బటన్స్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. టీవీ తెరని తాకేతెరలా మార్చేస్తుందన్నమాట. రిమోట్‌తో టీవీలో గేమ్స్‌ ఆడుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇడో 'హెచ్‌డీ మల్టీమీడియా ప్లేయర్‌' అన్నమాట. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన వై-ఫై, డీఎల్‌ఎన్‌ఏ సపోర్ట్‌తో నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇతర వివరాలకు http://goo.gl/Z5eySdలింక్‌లోకి వెళ్లండి.

 

 

ఇదే మొదటిది

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్యాబ్లెట్‌ త్వరలోనే దేశీయ మార్కెట్‌ని అలరించనుంది. అదే EVGA TEGRA Note 7. దీని తాకే తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. హెచ్‌డీ డిస్‌ప్లేతో దీన్ని వాడుకోవచ్చు. దీంట్లోని మరో ప్రత్యేకత గేమింగ్‌. ప్రముఖ గేమింగ్‌ ప్రాసెసర్ల తయారీ కంపెనీ Nvidiaఅందిస్తున్న Tegra 4ప్రాసెసర్‌ని దీంట్లో వాడారు. గేమింగ్‌కి అనువైన సౌండ్‌ సిస్టం, బ్యాటరీ బ్యాక్‌అప్‌ని ఏర్పాటు చేశారు. ఇన్‌బిల్ట్‌గా Nvidia Tegra గేమింగ్‌ కంట్రోల్స్‌ని నిక్షిప్తం చేశారు. మీలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అనువుగా Nvidia DirectStylusఉంది. స్త్టెలస్‌తో తాకేతెరపై కళాకారులు బొమ్మలు గీయవచ్చు. అందుకు అనువైన Tegra Draw ఆప్‌ ఉంది. ట్యాబ్లెట్‌కి ముందు భాగంలో రెండు స్పీకర్లు ఉన్నాయి. ట్యాబ్‌కి పక్కన మరో ప్రత్యేక 'బేస్‌పోర్ట్‌' ఉంది. దీంతో గేమ్స్‌ ఆడేప్పుడు సౌండ్‌ సిస్టం మరింత ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 8 గంటల పాటు వీడియోలను చూడొచ్చు. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. వీడియో కాలింగ్‌కి 'వీజీఏ' కెమెరాని ఏర్పాటు చేశారు. http://goo.gl/LlgJggలింక్‌లోకి వెళ్లండి.

 

 

తొమ్మిది రకాలు...

ఫొటో తీసిన తర్వాత సెట్టింగ్స్ ద్వారా వివిధ రకాలుగా మార్చుకుంటాం. నచ్చిన ఎఫెక్ట్‌లను అప్త్లె చేస్తుంటాం. కానీ.. ఇవేం చేయకుండానే క్లిక్ కొట్టగానే తొమ్మిది రకాల స్త్టెల్స్‌లో ఫొటో వచ్చేస్తే? వాటిల్లో కావాల్సిన ఫొటోని ఎంపిక చేసుకుంటే? ఇది సాధ్యమే. అందుకు తగిన కెమెరాని Casio కంపెనీ తయారు చేసింది పేరు Casio Ex-10. ఇలాంటి సౌకర్యంతో అందుబాటులోకి వచ్చిన మెమొరీ కెమెరా ఇదే. 12 మెగాపిక్సల్ CMOSsensor సామర్థ్యం. 4పఆప్టికల్ జూమ్ ఉంది. కెమెరా తాకే తెర పరిమాణం 3.5 అంగుళాలు. Tiltటచ్‌స్క్రీన్‌గా దీన్ని పిలుస్తున్నారు. కావాల్సినట్టుగా తెరని తిప్పుకుని ఫొటోలు చూడొచ్చు. హెచ్‌డీఎంఐ అవుట్, ఇన్‌బిల్ట్ వై-ఫై... లాంటి మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది.

బుల్లి కెమెరా

వేసుకున్న షర్ట్‌కో... తలకు పెట్టుకున్న టోపీకో... కెమెరాని తగిలించుకుని వీడియో తీయాలనుకుంటే Looxie 3 కెమెరా ఉంది. కేవలం 37 గ్రాముల బరువుడే కెమెరాతో వీడియోలు చిత్రీకరించొచ్చు. 750 పిక్సల్ రిజల్యుషన్‌తో రికార్డ్ చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన బ్యాటరీతో 1.5 గంటలు పని చేస్తుంది. దీంట్లో ఎస్‌కార్డ్ కూడా ఉంది. మెమొరీ సామర్థ్యం 64 జీబీ. ఫొటోలు కూడా తీసుకోవచ్చు. వై-ఫై ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీడియోలు చూడొచ్చు. యూఎస్‌బీ కేబుల్ ద్వారా పీసీని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. దుస్తుల్లో ఒదిగిపోయేలా వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. వీడియో స్ట్రీమింగ్‌కి ఐఓఎస్, ఆండ్రాయిడ్స్‌కి ప్రత్యేక ఆప్స్ కూడా ఉన్నాయి. కెమెరాని అమర్చుకునేందుకు ప్రత్యేక స్టాండ్స్, కవర్స్ కూడా ఉన్నాయి. ధర సుమారు రూ.6,300. http://goo.gl/9 T2VoD

ఇక హెచ్‌డీలోనూ...

దేశీయ కంపెనీ కార్బన్ పూర్తిస్థాయి హెచ్‌డీ డిస్‌ప్లేతో మొబైల్‌ని అందుబాటులోకి తేనుంది. పేరు Titanium S7. తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్ 1920ప1080 పిక్సల్స్. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్ సిమ్‌తో వాడుకోవచ్చు. 1.5Ghz quad-coreప్రాసెసర్‌ని వాడారు. డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్... ముందు 2 మెగాపిక్సల్ సామర్థ్యంతో పని చేస్తాయి. వెనకున్న కెమెరాకి 'లెడ్‌ఫ్లాష్' సౌకర్యం ఉంది. ఇంటర్నల్ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. 3జీ, వై-ఫై, బ్లూటూత్.. నెట్‌వర్క్‌లతో వాడుకోవచ్చు. ధర సుమారు రూ.14,999. http://go o.gl/ARAoYc

పెద్ద 'సెంటరే'

చూడ్డానికి టీవీ మాదిరిగా ఉంటుంది.కానీ, అది కంప్యూటరే. తెర పరిమాణం ఎంతో తెలుసా? 27 అంగుళాలు. హెచ్‌డీ టచ్‌స్క్రీన్‌తో పని చేస్తుంది. హోం యూజర్లకు అనువుగా దీన్ని తయారు చేశారు. పేరు Lenovo Idea Centre Horizon. చిత్రంలో చూపిన మాదిరిగా సాధారణ కంప్యూటర్‌లానే కాకుండా 'టేబుల్‌ టాప్‌'గాను వాడుకోవచ్చు. థర్డ్‌ జనరేషన్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 8 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 1 టీబీ. విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన హెచ్‌డీ వెబ్‌ కెమెరాతో వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. వీడియో గేమ్స్‌ అడేందుకు అనువుగా పీసీని రూపొందించారు. వైర్‌లెస్‌ కీబోర్డ్‌, మౌస్‌తో దీన్ని సాధారణ పీసీలా వాడుకోవచ్చు. పీసీతో పాటు కొన్ని గేమింగ్‌ కంట్రోల్స్‌ని కూడా అందిస్తున్నారు. రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, కార్డ్‌ రీడర్‌ సౌకర్యాలు ఉన్నాయి. దీని ధరెంతో తెలుసా? రూ.1,36,990. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/l96FvC లింక్‌లోకి వెళ్లండి.

ఎక్కడికి వెళ్లాలన్నా...

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తున్నారా? వెళ్లాల్సిన చోటుకి చేరడం ఎలాగో తెలియడం లేదా? ఏం చింతించక్కర్లేదు. 'పర్సనల్‌ నేవిగేషన్‌ డివైజ్‌' చేతిలో ఉంటే సరి. కావాలంటే MapmyIndiaZx350 గురించి తెలుసుకోవాల్సిందే. 'మైమ్యాప్‌ఇండియా' సంస్థ దీన్ని రూపొందించింది. దేశంలోని 50 నగరాలకు సంబంధించిన డేటా దీంట్లో ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన '3డీ నేవిగేషన్‌' సిస్టం ద్వారా 3డీలో వెళ్లాల్సిన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ భాషల్లో దిశా నిర్దేశం చేస్తుంది. 'స్పీడ్‌ లిమిట్‌ వార్నింగ్‌' ద్వారా వేగాన్ని మానిటర్‌ చేస్తూ శ్రుతిమించినప్పుడు హెచ్చరిస్తుంది. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా దీంతో వాయిస్‌ కాల్స్‌ మాట్లాడొచ్చు. ఉదాహరణకు కార్‌ నడుపుతున్నప్పుడు ప్రయాణ మార్గాన్ని అన్వేషించడంతో పాటు ఫోన్‌ కాల్స్‌ మాట్లాడొచ్చన్నమాట. ధర సుమారు రూ.15,990. www.mamyindia.com/navigator/zx250

బుల్లి 3డీ...

ఇంట్లో 3డీ టీవీల సందడి అంతా ఇంతా కాదు. కాకపోతే ధరలే లక్షల్లో ఉన్నాయి. మరి, కాస్త తక్కువ చౌకగా 3డీ టీవీ కావాలంటే? AOC 23 HD 3D LED TV అందుబాటులో ఉంది. దేశంలోనే తొలిసారి అందబాటులోకి వచ్చిన బుల్లి 3డీ టీవీ ఇదే. ఫుల్‌ హెచ్‌డీ 3డీ టీవీగా వాడుకోవచ్చు. తెర పరిమాణం 23 అంగుళాలు. ఇన్‌బిల్ట్‌గా టీవీ ట్యూనర్‌ని అందిస్తున్నారు. యూఎస్‌బీ పోర్ట్‌ల ద్వారా సిస్టం, మొబైల్‌, ట్యాబ్‌లను కనెక్ట్‌ చేసి సినిమాలు, వీడియోలు, ఫొటోలు చూడొచ్చు. డ్యుయల్‌ హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్స్‌ ఉన్నాయి. టీవీతో పాటు నాలుగు జతల 3డీ కళ్లజోళ్లను అందిస్తున్నారు. యూఎస్‌బీ డ్రైవ్‌ నుంచే సరాసరి త్రీడీ వీడియోలు చూడొచ్చు. సాధారణ టీవీలతో పోల్చితే 40 శాతం విద్యుత్‌ని మాత్రమే తీసుకుంటుంది. ఇంతకీ దీని ధరెంతో తెలుసా? రూ.19,999. http://goo.gl/Y18zUp

టైపింగ్‌కి అనువు

డెస్క్‌టాప్‌ పీసీలో టైపింగ్‌కి సాధారణ కీబోర్డ్‌ వాడుతున్నారా? టైపింగ్‌కి అనువుగా లేదా? అయితే, మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న Sculpt Comfort Keyboard గురించి తెలుసుకోవాల్సిందే. బ్లూటూత్‌ కనెక్షన్‌ ద్వారా సిస్టంకి అనుసంధానం చేయవచ్చు. కంప్యూటర్‌, ల్యాపీలకే కాదు ట్యాబ్లెట్‌, కీబోర్డ్‌లకు కూడా కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. కీబోర్డ్‌ ఒంపు తిరిగి ఉండటం ద్వారా టైపింగ్‌ చేసేప్పుడు చేతులు ఒత్తిడికి లోను కావు. పేస్‌బార్‌ని రెండు భాగాలుగా విభజించారు. దీంతో టైపింగ్‌కి మరింత సులభం. ధర రూ.3,495. http://goo.gl/QO 7Fx

భలే యూఎస్‌బీలు!

నిశితంగా చూడొచ్చు
చీమల కళ్లు నల్లగా ఉంటాయా? నీలం రంగులో ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూశారా? అదెలా సాధ్యం. మా దగ్గరేం ఆధునిక మైక్రోస్కోప్‌ లేదు అంటారా. దీనికి మైక్రోస్కోపే అక్కర్లేదు. చిన్న యూఎస్‌బీ మైక్రోస్కోప్‌ ఉంటే చాలు. చిత్రంలో కనిపించేది అదే. దీన్ని సిస్టంకి కనెక్ట్‌ చేసి దేన్నయినా జూమ్‌ చేసి చూడొచ్చు. తెల్లని లెడ్‌ లైట్స్‌తో ఇది పని చేస్తుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా 30fps స్పీడ్‌తో వీడియోలు తీయవచ్చు. 640X480 పిక్సల్స్‌ నాణ్యతతో వీడియోలు చూడొచ్చు. ఫొటోల రిజల్యూషన్‌ ఎంతో తెలుసా? 1600X1200. యూఎస్‌బీ మైక్రోస్కోప్‌లు ధర రూ.2,699 నుంచి 5,000 మధ్య అందుబాటులో ఉన్నాయి. కావాలంటే http://goo.gl/4FU3Ql లింక్‌లోకి వెళ్లండి.
ఫ్యాను... లైటు!
రాత్రిళ్లు కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పని చేస్తున్నప్పుడు గదిలోని లైట్స్‌ వేయడం ద్వారా ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో మీ కంప్యూటర్‌కి అనుసంధానమై పని చేసే లైట్స్‌ని ఏర్పాటు చేసుకుంటే ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. కావాలంటే USB Powered LED ల్యాంప్‌లను ప్రయత్నించండి. వీటిని యూఎస్‌బీ డ్రైవ్‌ మాదిరిగా సిస్టం, ల్యాపీలకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. కొన్ని యూఎస్‌బీ ల్యాంప్స్‌కి చిన్న ఫ్యాన్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గదిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఫ్యాన్‌ కంప్యూటర్‌ని చల్ల బరుస్తుంది. లైట్‌ స్టాండ్‌లను మీకు కావాల్సినట్టుగా తిప్పుతూ అమర్చుకోవచ్చు. http://goo.gl/dD PRL4
వేడి వేడిగా...
సిస్టంపై పని చేస్తున్నప్పుడు తాగుతున్న కాఫీని ఆదమరిచి వదలేస్తాం. అది చల్లారిపోతుంది. అయ్యో... అని ఓ నిట్టూర్పు విడిచి వదిలేస్తాం. ఇలా జరగకుండా ఉండాలంటే? కాఫీని ఎంతసేపైనా వేడిగా ఉంచే USB Cup Warmer ప్రయత్నిస్తే సరి. చిత్రంలో కనిపిస్తున్న మాదిరిగా కాపీ క‌ప్పును స్టాండ్‌పైన పెట్టుకోవచ్చు. స్టాండ్‌ ముందు భాగంలో డిజిటల్‌ క్లాక్‌ ఉంది. అంతేకాదు.. నాలుగు యూఎస్‌బీ డ్రైవ్‌లను స్టాండ్‌కి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. అంటే యూఎస్‌బీ హబ్‌లా వాడుకోవచ్చన్నమాట. ధర సుమారు రూ.700. కావాలంటే http://goo.gl/iLUDtq లింక్‌లోకి వెళ్లండి.
చల్లగా...
కాఫీ వేడిగా ఉంటుంది సరే... మరి కూల్‌ డ్రింక్‌ సంగతేంటి? అనే వారికి USB Mini Cooling Fridge లేకపోలేదు. అన్ని యూఎస్‌బీ డ్రైవ్‌ల మాదిరిగానే దీన్ని పీసీ, ల్యాపీలకు కనెక్ట్‌ చేసి కూల్‌డ్రింక్స్‌ని చల్లబరుచుకోవచ్చు. ఆఫీస్‌.. ఇల్లు... ఎక్కడైనా అనువుగా వాడుకునేలా దీన్ని రూపొందించారు. ఎలాంటి డ్రైవర్‌ సాఫ్ట్‌వేర్‌లతో పని లేదు. సిస్టంకి అనుసంధానం చేసి వాడుకోవడమే. ధర సుమారు రూ.2,000. కావాలంటే http://goo.gl/ccHsjO లింక్‌లోకి వెళ్లండి.
ఇంట్లోనే త్రీడీ

ఇంటిని 3డీ సినిమా హాలుగా మార్చేయవచ్చు. అందుకు Epson EH-TW5200 హెచ్‌డీ 3డీ ప్రొజెక్టర్‌ ఉంటే సరి. చౌక ధరతో అందుబాటులోకి వచ్చిన ప్రొజెక్టర్‌గా చెబుతున్నారు. ధర రూ.98,699. ఇన్‌బిల్ట్‌గానే రెండు స్పీకర్లు ఉన్నాయి. 1080 పిక్సల్స్‌ క్వాలిటీతో సినిమాలు చూడొచ్చు. వీడియో గేమ్స్‌ ఆడొచ్చు. ప్రొజెక్టర్ల పరిభాషలో చెప్పాలంటే 2,000 lumens Brightness, 15,000 : 1 Contrast Ratio, 10 bit Colour Processing హంగులు ఉన్నాయి. దీన్నుంచి ప్రదర్శించే ఇమేజ్‌ పరిమాణం 300 అంగుళాలు ఉంటుంది. డ్యుయల్‌ హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్స్‌, D-Sub, 3.5 mm ఆడియో జాక్‌ సదుపాయాల్ని వాడుకోవచ్చు. ప్రొజెక్టర్‌ బరువు కేవలం 2.8 కేజీలే. ఇతర వివరాలకు http://goo.gl/67s6WP లింక్‌లోకి వెళ్లండి.

ఇలా వినండి

ల్యాపీలోని స్పీకర్ల సౌండ్‌ సినిమాలు చూసేందుకు అంతగా సరిపడవు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఎక్స్‌టర్నల్‌ స్పీకర్ల గురించి ఆలోచిస్తాం. అలాంటి వారు Amekette TruBeats స్పీకర్ల గురించి తెలుసుకోవాల్సిందే. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీటిని ల్యాపీ, మొబైళ్లకు కనెక్ట్‌ చేసి వినొచ్చు. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన మైక్రోఫోన్‌తో వాయిస్‌ కాల్స్‌ మాట్లాడొచ్చు. పైన ఏర్పాటు చేసిన కంట్రోల్స్‌తో సౌండ్‌ సిస్టంని కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలు పని చేస్తాయి. కార్‌లో ప్రయాణించేప్పుడు స్పీకర్‌ ఫోన్‌లా వాడుకోవచ్చు. ధర సుమారు రూ.2,495. కావాలంటే http://goo.gl/eb52Wt లింక్‌లోకి వెళ్లండి.

మరింత నాజూకు

ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉందా? తక్కువ బరువుతో నాజూకుగా ఉండేలా కెమెరా కావాలనుకుంటే నికాన్‌ అందిస్తున్న Nikon D610 గురించి తెలుసుకోవాల్సిందే. దీని బరువు 850 గ్రాములే. దుమ్ము, తేమల నుంచి తట్టుకునేలా కెమెరా బాడీని తీర్చిదిద్దారు. కెమెరా సామర్థ్యం 24MP FX Format Sensor. 39 పాయింట్‌ ఆటోఫోకస్‌ సిస్టం. దీంతో ఫుల్‌ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ కూడా చేయవచ్చు. సెకన్‌కి 60 ఫ్రేమ్‌లను (60fps) నిక్షిప్తం చేస్తుంది. 3.2 అంగుళాల ఎల్‌సీడీ తెర, ఇన్‌బిల్ట్‌ ఫ్లాష్‌, డ్యుయల్‌ ఎస్‌డీ స్లాట్‌లు, హెచ్‌డీఎంఐ అవుట్‌ పోర్ట్‌లు ఉన్నాయి. దీని ధరెంతో తెలుసా? రూ.1,29,950. కెమెరాకి సంబంధించిన ఇతర వివరాలకు http://goo.gl/jBBW0X లింక్‌లోకి వెళ్లండి.

తగిలిస్తే చాలు

త్రీడీ సినిమా చూడాలంటే? స్మార్ట్‌ టీవీనో... 3డీ ప్రొజెక్టరో... కళ్లజోడో... అబ్బో చాలా తతంగమే. ఇవేం లేకుండా 750 అంగుళాల తెరపై 3డీ వీక్షణం చేయవచ్చు. అదెలా సాధ్యం అంటారా? అయితే మీరు సోనీ కంపెనీ అందుబాటులోకి తేనున్న HMZ-T3W పరికరం ధరించాల్సిందే. చిత్రంలో చూపిన మాదిరిగా పరికరాన్ని కళ్లకు ధరించాలి. వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ద్వారా మొబైల్‌, ల్యాపీ, కంప్యూటర్‌, టీవీలకు అనుసంధానం చేసి త్రీడీలో వీడియోలను చూడొచ్చు. వీడియో గేమ్స్‌ ఆడొచ్చు. కనెక్ట్‌ చేసి 20 అడుగుల పరిధిలో ఎక్కడైనా కూర్చుని చూడొచ్చు. పరికరంలో ఏర్పాటు చేసిన బ్యాటరీలతో ఇది పని చేస్తుంది. వైర్‌లెస్‌ పద్ధతిలో వీడియోని చూస్తున్నట్లయితే మూడు గంటల పాటు ఛార్జింగ్‌ వస్తుంది. ఆడియో వినేందుకు ఇతర హెడ్‌సెట్‌లను పరికరానికి కనెక్ట్‌ చేయవచ్చు. 7.1 సరౌండ్‌ సౌండ్‌ సిస్టంతో పని చేస్తుంది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/SlguVX సైట్‌లోకి వెళ్లండి.

ఇదో 'ఛాంపియన్‌'

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో మరో సరికొత్త ఫ్యాబ్లెట్‌ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఛాంపియన్‌ కంప్యూటర్స్‌ కంపెనీతో కలిసి Trendy 531 మోడల్‌ని అందిస్తోంది. తాకేతెర పరిమాణం 5.3 అంగుళాలు. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. 1.2Ghz quad core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం 4 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. డ్యుయల్‌ సిమ్‌ సపోర్ట్‌తో ఫ్యాబ్లెట్‌ని వాడుకోవచ్చు. 3,200 mah బ్యాటరీ ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే ముందు వీడియో ఛాటింగ్‌కి 5 మెగాపిక్సల్‌ కెమెరాని అందిస్తున్నారు. వెనుక 13 మెగాపిక్సల్‌ ఉంది. 3జీ, వై - ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లతో పని చేస్తుంది. నెలకి 500ఎంబీ చొప్పున 3జీ డేటా ప్లాన్‌ని ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. ఇంతకీ దీని ధరెంతో తెలుసా? రూ.13,999. ఇతర వివరాలకు http://goo.gl/ qUbTy5

పది నిమిషాల్లోనే...

ఫోన్‌ ఛార్జ్‌ అవ్వడానికి ఎంత సమయం పడుతోంది? ఇంచు మించు గంట లేదంటే రెండు గంటలు. మరి, పది నిమిషాల్లో మొబైల్‌ ఛార్జ్‌ అయితే? రోజంతా ఫోన్‌ని వాడుకుంటే? అలాంటి ఫోన్‌ ఒకటి ప్రపంచ మార్కెట్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. అదే జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ కంపెనీ రూపొందించిన Arrows A301F మొబైల్‌. మరో అదనపు సౌకర్యం ఏంటంటే... ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్న 'ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌'. మీ వేలిముద్రని రీడ్‌ చేయడం ద్వారా ఫోన్‌ని 'ప్రైవసీ మోడ్‌' లో సెట్‌ చేసుకోవచ్చు. అంటే మీ వేలిముద్ర లేనిదే మొబైల్‌ని వాడ‌టం అసాధ్యం. 5 అంగుళాల తాకేతెరతో ఫోన్‌ని రూపొందించారు. వేగంగా ఛార్జ్‌ అయ్యేందుకు Quick Charge 2.0 టెక్నాలజీని వాడారు. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. http://goo.gl/u85XfG

మ్యూజిక్‌ ప్రియులా?

వాడుతున్న డివైజ్‌ ఏదైనా మ్యూజిక్‌ వినేందుకు అనువుగా ఉండే స్పీకర్‌ కావాలంటే? సోనీ కంపెనీ తయారు చేసిన GTK - N1BT వైర్‌లెస్‌ స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. అవుట్‌పుట్‌ సామర్థ్యం 100W. సబ్‌ వూఫ‌ర్లు, డ్యుయల్‌ ఫ్రంట్‌ స్పీకర్లు ఉన్నాయి. ముందు భాగంలో రంగులు మారే లెడ్‌ లైట్స్‌ని ఏర్పాటు చేశారు. కాకపోతే దీని బరువు ఎంతో తెలుసా? 8 కేజీలు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడం కొంచెం కష్టమే. http://go o.gl/SY43Ow

షేక్‌ చేస్తే చాలు

ఎక్కువ బడ్జెట్‌ పెట్టలేని కాలేజీ విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్‌ వాడాలంటే? సెల్‌కాన్‌ అందుబాటులోకి తెచ్చిన కొత్త మోడల్‌తో కాలేజీ క్యాంపస్‌లో సందడి చేయవచ్చు. కావాలంటే Campus A15 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. డ్యుయల్‌ సిమ్‌తో ఫోన్‌ని వాడుకోవచ్చు. తాకేతెర పరిమాణం 3.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 320X480 పిక్సల్స్‌. 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. 3.2 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ 4.2.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో తాకేతెరపై అద్భుతాలు చేయవచ్చు. ఇన్‌బిల్ట్‌గా 512 మెమొరీ ఉంది. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డేటాని కాపీ చేసుకోవాలంటే ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో మ్యూజిక్‌ వినొచ్చు. ఎడ్జెట్‌, వై - ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లతో పని చేస్తుంది. ధరెంతో తెలుసా? రూ.3,999.

రెండో తరం...

ఐప్యాడ్‌కి పోటీగా మైక్రోసాఫ్ట్‌ మరో తరం ట్యాబ్లెట్‌లను సిద్ధం చేసింది. అవే Surface 2, 2 Pro. వీటి తాకేతెర పరిమాణం 10.6 అంగుళాలు. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ని సపోర్ట్‌ చేస్తాయి. గేమింగ్‌ కోసం Nvidia Tegra 4 quad core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. 32, 64 జీబీ మెమొరీ సామర్థ్యం. రెండింటిలో సర్ఫేస్‌ 2 ట్యాబ్‌ Windows 4.1RT ఎడిషన్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పని చేస్తుంది.
* సర్ఫేస్‌ 2 ప్రొ ట్యాబ్‌ విషయానికొస్తే Windows 4.1 Pro ఓఎస్‌తో అందిస్తున్నారు. 'సర్ఫేస్‌ పెన్‌ స్టైలస్‌' తో ట్యాబ్‌కి ఇన్‌పుట్‌ ఇవ్వొచ్చు. ఫోర్త్‌ జనరేషన్‌ Intel core i5 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 8 జీబీ. 512 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యం. ఇతర వివరాలకు http://goo.gl/hjM4xK లింక్‌ని చూడండి.

గేమింగ్‌కి ప్రత్యేకం

చేతిలో ఐఫోన్‌ ఉందా? ఇన్‌స్టాల్‌ చేసిన గేమ్స్‌ని తాకేతెరపై ఆడటం కష్టంగా అనిపిస్తోందా? అయితే, Game Case గురించి తెలుసుకోవాల్సిందే. ఇది త్వరలో మీ ఐఫోన్‌పై కూర్చుని గేమింగ్‌ని మరింత సులభం చేయనుంది. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇది ఫోన్‌కి కనెక్ట్‌ అవుతుంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌లకు అనువుగా ఉండేలా వీటి రూపకల్పన చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్‌తో కంట్రోల్‌ పని చేస్తుంది. ఫోన్‌తో పాటు గేమ్‌కేస్‌ని రెండు చేతులతో పట్టుకుని ఆడుకోవచ్చు. అందుకు అనువుగా గేమింగ్‌ బటన్స్‌ని నిక్షిప్తం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అరచేతిలో ఒదిగిపోయే అంగుళాల తెరని ప్లేస్టేషన్‌లా మార్చేస్తుందన్నమాట. ఇతర వివరాలకు http://goo.gl/uHmQ13 లింక్‌లోకి వెళ్లండి.

ఇవీ నాజూకే!

ఎంత స్లిమ్‌గా ఉంటే అంత ఆదరణ. ఇక ప్రొజెక్టర్లు కూడా ఇదే కోవలోకి వస్తున్నాయి. అంతేకాదు... వీటిని 'ల్యాంప్‌ఫ్రీ' ప్రొజెక్టర్లుగా పిలుస్తున్నారు. ఎందుకంటే వీటిల్లో ల్యాంప్‌లకు బదులుగా లేజర్‌, LED టెక్నాలజీని వాడారు. కావాలంటే Casio Slim Series Projectors చూడండి. నాణ్యమైన అవుట్‌పుట్‌తో ప్రొజెక్టర్లు డేటాని ప్రదర్శిస్తాయి. అందుకు తగిన లెన్స్‌ని ప్రొజెక్టర్‌లో నిక్షిప్తం చేశారు. 2X పవర్‌ జూమ్‌తో లెన్స్‌ని వాడుకోవచ్చు. ప్రొజెక్టర్ల ఎత్తు 1.7 అంగుళాలే. బరువు 2.3 కేజీలు. రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్‌ సౌకర్యాలున్నాయి. http://goo.gl/X8NL34.

పీసీ కొనాలా?

మూడో జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌, ఇంటెల్‌ హెచ్‌డీ గ్రాఫిక్స్‌, 4 జీబీ ర్యామ్‌తో అసుస్‌ కంపెనీ డెస్క్‌టాప్‌ని పీసీని అందిస్తోంది. 8 జీబీ వరకూ ర్యామ్‌ని పెంచుకునే వీలుంది. పీసీ మోడల్‌ K5130 Desktop. హార్డ్‌డ్రైవ్‌ సామర్థ్యం 500 జీబీ. డీవీడీ రైటర్‌, కార్డ్‌ రీడర్‌, 6 ఛానల్‌ ఆడియో, డ్యుయల్‌ యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, ఈథర్నెట్‌ సౌకర్యాలు ఉన్నాయి. సీపీయూతో పాటు 19 అంగుళాల అసుస్‌ మానిటర్‌, కీబోర్డ్‌, మౌస్‌లను కూడా అందిస్తున్నారు. మూడేళ్ల పాటు ఉచితంగా 32 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని వాడుకోవచ్చు. డాస్‌ ఓఎస్‌ని మాత్రమే ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ధర సుమారు రూ.31,750. ఇతర వివరాలకు http://goo.gl/Hn6omN లింక్‌లోకి వెళ్లండి.

ఇదే మొదటిది!

హెచ్‌డీ నాణ్యతతో 3డీ సినిమాల్ని ఇంట్లోనే చూడాలనుకుంటే BenqW1500 ప్రొజెక్టర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలోనే తొలిసారి అందుబాటులోకి వచ్చిన 'హెచ్‌డీ 3డీ' ప్రొజెక్టర్‌ ఇదే. 'వైర్‌లెస్‌ హోం డిజిటల్‌ ఇంటర్ఫేస్‌' ద్వారా పని చేస్తుంది. అంటే ఇంట్లో ఉన్న నోట్‌బుక్స్‌, కంప్యూటర్‌లు, స్మార్ట్‌ మొబైళ్లకు వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ద్వారా కనెక్ట్‌ అవుతుంది. గేమింగ్‌ పరికరాలకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. WHDI అడాప్టర్‌, 3డీ కళ్లజోళ్ళతో ప్రొజెక్టర్‌ని అందిస్తున్నారు. 10,00 : 1 Contrast Ratio తో విజువల్స్‌ని చూడొచ్చు. 1.6ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఉంది. 2డీ, 3డీల్లో వీడియోలను చూడొచ్చు. డ్యుయల్‌ హెచ్‌డీఎంఐ అవుట్స్‌, డ్యుయల్‌ 10డ‌బ్ల్యూ స్పీకర్లు ఉన్నాయి. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/jE1GLC

గేమింగ్‌కి ప్రత్యేకం

నాజూకుగా... దృఢంగా... గేమింగ్‌కి అనువైన ల్యాప్‌టాప్‌ కావాలనుకుంటే డెల్‌ కంపెనీ తయారు చేసిన Alienware 17 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. 3.4Ghz ఫోర్త్‌ జనరేషన్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌తో రూపొందించారు. 8జీబీ డీడీఆర్‌3 ర్యామ్‌, 750జీబీ హార్డ్‌డిస్క్‌ స్పేస్‌, Nvidia Geforce 765M తో కూడిన 2 జీబీ మెమొరీ ప్రత్యేకం. 8-Cell బ్యాటరీతో పని చేస్తుంది. 17.3 అంగుళాలతో కూడిన తెర రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. 'యాంటీ గ్లేర్‌' సౌకర్యం ఉంది. ఆధునికంగా డిజైన్‌ చేసిన ల్యాపీ ప్యానల్‌ అదనపు ఆకర్షణ. backlit కీబోర్డ్‌, ట్రాక్‌ప్యాడ్‌ సౌకర్యాలున్నాయి. డ్యుయల్‌ డిజిట్‌ మైక్రోఫోన్స్‌తో హెచ్‌డీ 2 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. మల్టిపుల్‌ పోర్ట్‌లు, ఇన్‌బిల్ట్‌ స్పీకర్లు ఉన్నాయి. ధర సుమారు రూ.1,29.990. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/CAYsA4

నాజూకుగా...

6.98 ఎంఎం మందంతో కూడిన ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ మొబైల్‌ ఉంది. పేరు Xolo Q1000S. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేసే అత్యంత నాజూకైన మొబైల్‌. 1.5Ghz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌. తెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక ఏర్పాటు చేసిన 13 మెగాపిక్సల్‌ కెమెరాతో హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 5 మెగా పిక్సల్‌ కెమెరా ఉంది. త్రీజీ, వై - ఫై, బూట్లూత్‌ నెట్‌వర్క్‌లను యాక్సెస్‌ చేయవచ్చు. దీని బరువు ఎంతో తెలుసా? 158 గ్రాములే. ధర సుమారు రూ.18,999. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/h9bCxb

పరిధి పెరిగింది!

ఫోన్‌ పరిధిని పెంచుకుని స్టైలస్‌తో మరిన్ని ప్రయోజనాల్ని పొందేందుకు మైక్రోమ్యాక్స్‌ తయారు చేసిన Canvas Doodle2 వాడొచ్చు. తెర పరిమాణం 5.7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. స్టైలస్‌తో దీన్ని వాడుకోవచ్చు. 1.2Ghz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, జెల్లీబీన్‌ 4.2 వెర్షన్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. 26mAh బ్యాటరీని వాడారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలు మాట్లాడొచ్చు. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు 12 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ కెమెరాని వాడారు. ముందు భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. చిత్రకారులకు అనువైన ఆప్స్‌ని ప్రీలోడ్‌ చేసి అందిస్తున్నారు. ధర సుమారు రూ.19,990. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/wOdR81

ఇదే మొదటిది

మన దేశ తయారీగా మొదటిసారి డ్యుయల్‌కోర్‌ ప్రాసెసర్‌తో ముందుకొచ్చింది iBall Slide i9018 ట్యాబ్లెట్‌. 9 అంగుళాల తాకేతెరతో పని చేస్తుంది. తెర రిజల్యూషన్‌ 1024X600పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.2 ఓఎస్‌తో రన్‌ అవుతుంది. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. మెమొరీని పెంచుకోవడానికి 'మైక్రోఎస్‌డీ' స్లాట్‌ ఉంది. ట్యాబ్‌కి డ్యుయల్‌ కెమెరాలు (ముందు 2 మెగాపిక్సల్‌, వెనక 5 మెగాపిక్సల్‌) ఉన్నాయి. హెచ్‌డీఎంఐ అవుట్‌ ఉంది. బ్లూటూత్‌, వై - ఫై నెట్‌వర్క్‌లను వాడుకుని ఇతర పరికరాలకు అనుసంధానం చేయవచ్చు. జీపీఎస్‌ సౌకర్యంతో దిక్చూచిలా పని చేస్తుంది. ధర సుమారు రూ.9,990. మరిన్ని వివరాలకు http://goo.gl/VKAouy

అది కూడా...

పరికరాలన్నీ నాజూకుగా మారుతున్న ప్రస్తుత టెక్‌ ప్రపంచంలో కంప్యూటర్‌ కీబోర్డ్‌ కూడా చేరింది. అదే లాగీటెక్‌ తయారు చేసిన TK820. తక్కువ బరువుతో నాజూకుగా ఉండే ఈ కీబోర్డ్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. అంతేకాదు... కీబోర్డ్‌లో బిల్ట్‌ఇన్‌ టచ్‌ప్యాడ్‌ ఉంది. 13 రకాల విండోస్‌8 కమాండ్స్‌ని టచ్‌ప్యాడ్‌ చేయవచ్చు. అందుకు లాగీటెక్‌ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. టైప్‌ చేసేప్పుడు ఎలాంటి శబ్దం రాకుండా ఉండేలా మీటల్ని తీర్చి దిద్దారు. ఒక్కసారి ఛార్జ్‌ చేసిన కీబోర్డ్‌ని 6 నెలలు వాడుకోవచ్చు. ధర సుమారు రూ.6,500. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/fQ q1Qz

మ్యూజిక్‌ 'గుడ్డు'

స్మార్ట్‌ మొబైల్‌, ల్యాపీ, ఎంపీ3 ప్లేయర్స్‌లో పాటల్ని వింటుంటారా? సౌకర్యంగా వాడుకునేందుకు బ్లూటూత్‌ స్పీకర్‌ కావాలా? అయితే, F&D Swan Bluetooth స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. వైర్‌లెస్‌ పద్ధతిలో పని చేస్తుంది. గుడ్డులా కనిపించే స్పీకర్‌ పై భాగంలో కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. బ్లూటూత్‌ 4.0 టెక్నాలజీతో పరికరాలకు కనెక్ట్‌ అవుతుంది. ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్‌ అవ్వొచ్చు. బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌తో వాయిస్‌ కాల్స్‌ని చేయవచ్చు. దీంట్లో బ్యాటరీని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు పని చేస్తుంది. ఇతర వివరాలకు http://goo.gl/AdhvFX

ఇక 'నాలుగు'

ఆధునిక డెస్క్‌టాప్‌ని అన్ని అవసరాలకు వాడాలనుకుంటే Asus ET2301 all in one డెస్క్‌టాప్‌ పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. నాలుగో జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌తో రూపొందించారు. 23 అంగుళాల తాకేతెర ప్రత్యేకమైంది. ఐపీఎస్‌ డిస్‌ప్లేతో పని చేస్తుంది. రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. ర్యామ్‌ 8జీబీ. Nvidia GT740M గ్రాఫిక్స్‌ని వాడారు. మెమొరీ సామర్థ్యం 1టీబీ. ఐదు యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. భిన్న అవసరాలకు వాడే 'మల్టీ ఫార్మెట్‌ కార్డ్‌ రీడర్‌' ఉంది. బ్లూటూత్‌, వై - ఫై సదుపాయాలున్నాయి. మ్యూజిక్‌ ప్రియులకు 'ఇంటర్నల్‌ ఊఫర్‌' ఉంది. ప్రత్యేక స్టాండ్‌తో తెరని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. http://goo.gl/gsDkNB

లెనోవా కంపెనీ A1000, A3000 ట్యాబ్లెట్‌ల

లెనోవా కంపెనీ మరో మూడు ఆధునిక ట్యాబ్‌లను మన దేశ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. వాటిల్లో రెండు A1000, A3000. వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యంతో వాడుకోవచ్చు. తాకే తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1024X600 పిక్సల్స్‌. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. ట్యాబ్‌ ముందు భాగంలో వీజీఏ కెమెరా ఉంది. ఏ1000 మోడల్‌ డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తే... ఏ3000 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తో అలరిస్తోంది.
* మూడోది S6000. తెర పరిమాణం 10.1 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 1 జీబీ. 4 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌. హెచ్‌డీఎంఐ పోర్ట్‌ సౌకర్యం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 6,300mAh. ట్యాబ్లెట్‌ల ప్రారంభ ధర సుమారు రూ.8,999. http://goo.gl/jGCzob

చిత్రకారులా?

పెన్సిల్‌... బ్రెష్‌లు పట్టుకుని ఛార్ట్‌లపై బొమ్మలు వేసే రోజులు ఒకప్పుడు. ఇప్పుడు అంతా డిజిటల్‌ మీడియా పైనే. కంప్యూటర్‌, మ్యాక్‌లకు ప్రత్యేకంగా తయారు చేసిన డ్రాయింగ్‌ ట్యాబ్‌లను కనెక్ట్‌ చేసి గ్రాఫిక్స్‌ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంతో తయారు చేసిందే Wacom Cintiq 13HD. ఇదో 'పెన్‌ డిస్‌ప్లే' ట్యాబ్‌. 13.3 అంగుళాల తెరతో దీన్ని రూపొందించారు. దీన్ని వెనక భాగంలో ఏర్పాటు చేసిన స్టాండ్‌తో డ్రాయింగ్‌ ట్యాబ్‌ని కావాల్సినట్టుగా అమర్చుకుని బొమ్మలు గీయవచ్చు. ట్యాబ్‌పై వాడేందుకు అనువుగా Pro Pen ఉంది. ట్యాబ్‌ బరువు 1.2 కేజీలు. ప్రత్యేక కేబుల్‌తో కంప్యూటర్‌, మ్యాక్‌లకు అనుసంధానం చేయవచ్చు. http://goo.gl/ UwnYQk

జేబులోనే ప్రింటర్‌!

షర్ట్‌ జేబులో స్మార్ట్‌ ఫోన్‌... ప్యాంట్‌ జేబులో ప్రింటర్‌! ఆ ప్రింటర్‌తో ఫొటోలు ప్రింట్‌ తీస్తే! ఫోన్‌ వరకూ ఫర్వాలేదుగానీ... జేబులో ప్రింటర్‌ ఎలా పడుతుంది? దాంతో ప్రింట్‌లు ఎలా తీస్తాం? అని ఆలోచిస్తున్నారా? అయితే, మీరు ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన PD233 Pocket Photo Printer గురించి తెలుసుకోవాల్సిందే. దీన్ని బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కి కనెక్ట్‌ చేసి ఫొటోలను ప్రింట్‌ తీసుకోవచ్చు. ఫొటోల పరిమాణం 2X3. రిజల్యూషన్‌ 640X1223 పిక్సల్స్‌. ఇతర డివైజ్‌లకు యూఎస్‌బీ పోర్ట్‌ ద్వారా కనెక్ట్‌ చేయవచ్చు. బ్యాటరీతో ప్రింటర్‌ ఛార్జ్‌ అవుతుంది. ధర సుమారు రూ. 14,990. http://goo.gl/sivjE3

చేతిలో స్కానర్‌

ఏ4 పరిమాణంలో ఉన్న పేజీలను స్కాన్‌ చేయాలంటే పెద్ద స్కానరే అక్కర్లేదు. 1.44 అంగుళాల తెరతో అరచేతిలో ఒదిగిపోయే పోర్టబుల్‌ స్కానర్‌ ఉంటే సరి. అలాంటిదే Portronics Scanny 6. ఒక పేజీని 3 సెకన్లలోనే స్కాన్‌ చేస్తుంది. స్కాన్‌ చేసిన పేపర్‌ని బుల్లి తెరపై జూమ్‌ చేసుకుని చూడొచ్చు. 700mAh రీఛార్జబుల్‌ బ్యాటరీని వాడారు. దీన్ని ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 1000 పేజీలను స్కాన్‌ చేస్తుంది. స్కాన్‌ చేసిన వాటిని స్కానర్‌ ఇంటర్నల్‌ మెమొరీతో సేవ్‌ చేయవచ్చు. ఎస్‌బీ కార్డ్‌తో 32 జీబీ వరకూ మెమొరీని పెంచుకోవచ్చు. స్కాన్‌ చేసిన వాటిని జేపీజీ, పీడీఎఫ్‌ ఫార్మెట్‌ల్లో అవుట్‌పుట్‌ ఇస్తుంది. ధర సుమారు రూ.6,999. వివరాలకు http://goo.gl/iafls0

తోషిబా 'తాకిడి'

విండోస్‌ 8 ఓఎస్‌పై మునివేళ్లతో తాకుతూ ల్యాపీపై పని చేసుకునేలా తోషిబా కొత్త మోడల్‌ని అందిస్తోంది. అదే Satellite P50. తెర పరిమాణం 15.6 అంగుళాలు. రిజల్యూషన్‌ 1366X768 పిక్సల్స్‌. 24ఎం ఎంతో నాజూకుగా కనిపిస్తుంది. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఐ5 ప్రాసెసర్లు వాడారు. Harmon Kardon స్పీకర్లతో ఆడియో అవుట్‌పుట్‌ పెరిగింది. ర్యామ్‌ 16 జీబీ. హార్డ్‌డ్రైవ్‌ సామర్థ్యం 750 జీబీ. రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు. హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్‌, వీజీఏ ఇతర సదుపాయాలు. LED Backlit సౌకర్యంతో కీబోర్డ్‌ని రూపొందించారు. ల్యాపీ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా యూఎస్‌బీ పోర్ట్‌లతో మొబైల్‌, ట్యాబ్లెట్‌, ఇతర యూఎస్‌బీ పరికరాల్ని ఛార్జ్‌ చేయవచ్చు. మెషీన్‌ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఎంపీ3 ప్లేయర్‌ని ల్యాపీ కనెక్ట్‌ చేసి మ్యూజిక్‌ వినొచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/yuFwFD

మిలటరీ రక్షణ!

మీరు కొనాలనుకునే ల్యాపీ ఆటుపోట్లకు తట్టుకునేలా దృఢంగా ఉండాలనుకుంటే లెనొవా కంపెనీ తయారు చేసిన Thinkpad L430 గురించి తెలుసుకోవాల్సిందే. 14 అంగుళాల తెరతో రూపొందించారు. డిస్‌ప్లే రిజల్యూషన్‌ 1600X900పిక్సల్స్‌. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్స్‌ని వాడారు. తేమ, ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు తట్టుకునేలా దృఢంగా రూపొందించారు. ర్యామ్‌ 4 జీబీ. హార్డ్‌డ్రైవ్‌ సామర్థ్యం 500 జీబీ. Intel HD4000 గ్రాఫిక్స్‌తో పని చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 9 గంటలు పని చేస్తుంది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/J6NWC

మినీ పీసీ

పర్సనల్‌ డెస్క్‌టాప్‌ అంటే సీపీయూనే ప్రధాన వ్యవస్థ. ఎక్కువ స్పేస్‌ని ఆక్రమించినప్పటికీ ఇదే మూలాధారం. దాన్ని టిఫిన్‌ బాక్స్‌ పరిమాణంలో మార్చేసి మినీ పీసీగా ముందుకొచ్చింది ZOTAC ZBOX nano ID65 PLUS. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 4 జీబీ. హార్డ్‌డ్రైవ్‌ సామర్థ్యం 500 జీబీ. Intel HD 4000 గ్రాఫిక్‌ కార్డ్‌ ఉంది. ఆరు యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఇతర వివరాలకు http://goo.gl/sAlP2

ఇదే తొలిసారి

ప్రపంచంలోనే అత్యంత పల్చటి తెరతో మొబైల్‌ స్క్రీన్‌ని ఎల్‌జీ కంపెనీ తయారు చేసింది. అదే HD LCD Display. తెర మందం ఎంతో తెలుసా? 2.2 మిల్లీమీటర్లు. తెర పరిమాణం 5.2 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080X1920 పిక్సల్స్‌. ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని హెచ్‌డీ మొబైళ్ల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/4gONq

ఆటలే ఆటలు

పిల్లలకు అరచేతిలోనే ఆట స్థలాన్ని సృష్టించేలా సిద్ధమైంది మితాషీ కంపెనీ తయారు చేసిన‌ GameIn Thunderbolt పరికరం. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకేతెర పరిమాణం 4.3 అంగుళాలు. పరికరం చుట్టూ ఆటలకు అనువైన గేమింగ్‌ బటన్లను ఏర్పాటు చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గేమ్స్‌ని డివైజ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 1 Ghz ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే వీలుంది. డ్యుయల్‌ కెమెరాలతో (వెనక 2 మెగాపిక్సల్‌, ముందు వీజీఏ కెమెరాలు) డివైజ్‌ పని చేస్తుంది. ధర సుమారు రూ.6,799. ఇతర వివరాలకు http://goo.gl/3yJZT

వినండిలా!

బోస్‌ కంపెనీ మొదటిసారిగా వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Bose AE2w. చక్కని క్వాలిటీతో మ్యూజిక్‌ వినొచ్చు. కేవలం వినడమే కాదు. మీ స్మార్ట్‌ఫోన్‌కి వచ్చిన కాల్‌ని మాట్లాడొచ్చు. చెవులకు అనువుగా ఉండేలా హెడ్‌ఫోన్‌ని రూపొందించారు. హెడ్‌ఫోన్‌ని ఒకేసారి రెండు డివైజ్‌లకు అనుసంధానం చేయవచ్చు. మ్యూజిక్‌ వినిపిస్తూనే చిటికెలో కాల్స్‌ మాట్లాడే హెడ్‌ఫోన్‌గా మారిపోతుంది. 30 అడుగుల దూరం వరకూ పని చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 గంటలు వాడుకోవచ్చు. ఛార్జ్‌ అవ్వడానికి పట్టే సమయం 3 గంటలు. యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్‌ చేయవచ్చు. బరువు 150 గ్రాములు. ధర సుమారు రూ.19,000. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/rdh6U

ఇదే మొదటిది

విండోస్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం, 8.1 అంగుళాల తాకేతెరతో మొదటిసారి అందుబాటులోకి వచ్చింది Acer Iconia W3. దీని బరువు 540 గ్రాములు. రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. డ్యుయల్‌ కోర్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌ని వాడారు. ఇంటర్నల్‌ మెమొరీ 32జీబీ. బ్యాటరీ బ్యాక్‌అప్‌ 8 గంటలు. బ్లూటూత్‌ కీబోర్డ్‌తో ట్యాబ్లెట్‌ని వాడుకోవచ్చు. చిత్రంలో మాదిరిగా ట్యాబ్‌ని కీబోర్డ్‌లో డాక్‌ చేసి వాడొచ్చు. ధర సుమారు రూ.30,399. మరిన్ని వివరాలకు http://goo.gl/TS1nO

* ఏసర్‌ 15.6 అంగుళాల తాకేతెరతో మరో ట్యాబ్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Aspire R7. నోట్‌బుక్‌, ట్యాబ్‌లా వాడుకునేందుకు అనువుగా ప్రత్యేక స్టాండ్‌తో ఇది పని చేస్తుంది. Notebook, Eze, Pad, Display మోడ్స్‌లో పని చేస్తుంది. అవసరం మేరకు తిప్పుతూ వాడుకోవచ్చు. హెచ్‌డీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/yLvfa

ఇదో ఫ్యాబ్లెట్‌

డ్యుయల్‌ సిమ్‌తో ఫోన్‌ వాడుంటారు. మరి, ట్యాబ్లెట్‌లానే కనిపిస్తూ ఫ్యాబ్లెట్‌లా ముందుకొచ్చిన MTV Volt 1000 డివైజ్‌ని వాడారా? ఎంటీవీ, స్వైప్‌ టెలికామ్‌ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. దీంట్లో ప్రత్యేకంగా నిక్షిప్తం చేసిన టీవీ ప్లేయర్‌తో ఎంటీవీని చూడొచ్చు. తాకే తెర పరిమాణం 6 అంగుళాలు. రిజల్యూషన్‌ 854X480 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.1 ఎస్‌తో పని చేస్తుంది. 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. బ్యాటరీ సామర్థ్యం 2,850 mAh. వెనక భాగంలో 8 మెగాపిక్సల్‌, ముందు 1.3 మెగాపిక్సల్‌ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. బ్లూటూత్‌ 4.0, ఎఫ్‌ఎం సదుపాయాలున్నాయి. ఇతర వివరాలకు http://goo.gl/a5ThQ

ధర తక్కువే

కాస్త తక్కువ ధరలో ట్యాబ్లెట్‌ని కొనాలంటే Simmtronics ట్యాబ్లెట్‌ పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. 7 అంగుళాల తాకే తెరతో రూపొందించారు. ధర సుమారు రూ.5,999. పేరు ఎక్స్‌ప్యాడ్‌ ఎక్స్‌ 722. 1Ghz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512ఎంబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనక భాగంలో 3 మెగాపిక్సల్‌, ముందు 0.3 మెగాపిక్సల్‌ కెమేరాల్ని నిక్షిప్తం చేశారు. http://goo.gl/0l0yq

కొత్త స్పీకర్లు

టీవీ పరిమాణంలోనే కాదు. స్పీకర్లలోనూ నాణ్యమైనవి కావాలనుకుంటే సోనీ కంపెనీ తయారు చేసిన Sony 4K Bravia గురించి తెలుసుకోవాల్సిందే. 55, 65 అంగుళాల తెర పరిమాణాలతో ఆకట్టుకుంటున్నాయి. రిజల్యూషన్‌ 3840X2160 పిక్సల్స్‌. Magnetic Fluid Speaker డిజైన్‌తో రూపొందిన మొట్టమొదటి టీవీ స్పీకర్లు ఇవే. నాజూకుగా కనిపిస్తూ ఎక్కువ అవుట్‌పుట్‌ని అందిస్తాయి. వై-ఫై, యూఎస్‌బీ, 3జీ, ఎన్‌ఎఫ్‌సీ... సౌకర్యాలు అదనం. http://goo.gl/7tQDD

కాస్త హుందాగా...

ఇంట్లోనో... ఆఫీస్‌లోనో వాడేందుకు ప్రొఫెషనల్‌గా కనిపించే మానిటర్‌ కావాలనుకుంటే BenQ BL2411PT మానిటర్‌ని ప్రయత్నించొచ్చు. తెర పరిమాణం 24 అంగుళాలు. రిజల్యూషన్‌ 1920X1200 పిక్సల్స్‌. చూసేందుకు అనువుగా కావాల్సిన ఎత్తులో సెట్‌ చేసుకోవచ్చు. 'లైట్‌ సెన్సర్‌' తో ఆటోమాటిక్‌గా మానిటర్‌ బ్రైట్‌నెస్‌ని మార్చేస్తుంది. మీరు సిస్టంని వదిలి కొంతసేపు ఎక్కడికైనా వెళితే 'ఎకో సెన్సర్‌' తో ఆటోమాటిక్‌గా ఎకో మోడ్‌లోకి మారిపోతుంది. దీంతో మానిటర్‌ మన్నిక పెరుగుతుంది. HAS (Ultra flexible Height Adjustment System) తో మానిటర్‌ని కావాల్సిన కోణంలోకి తిప్పుకుని వాడుకోవచ్చు. http://goo.gl/PsM1T

గేమింగ్‌ అడ్డా

మీరు గేమింగ్‌ ప్రియులైతే ప్రత్యేక ప్లే స్టేషన్‌ సిద్ధంగా ఉంది. అదే OUYA Gaming Console ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. మూడు అంగుళాల పరిమాణంలో రూపొందించారు. ప్రత్యేక కేబుల్‌ ద్వారా టీవీ, కంప్యూటర్‌కి అనుసంధానం చేసి గేమ్స్‌ ఆడుకోవచ్చు. 1.7Ghz quad-core ARM నుంచి అందుబాటులోకి వచ్చిన NVIDIA Tegra 3 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 3 జీబీ. NVIDIA ULP Geforce గ్రాఫిక్స్‌ని వాడారు. హెచ్‌డీఎంఐ అవుట్‌తో టీవీకి కనెక్ట్‌ చేసి 1080 పిక్సల్‌ రిజల్యూషన్‌లో గేమ్స్‌ ఆడుకునే వీలుంది. ధర సుమారు రూ.5,800. http://goo.gl/ lf6dV

టేబుల్‌లో కంప్యూటర్‌!

కూర్చుని కాఫీ తాగే డైనింగ్‌ టేబుల్‌ కంప్యూటర్‌లా పని చేస్తే! ఇలాంటిదే Table PC MTT300. తెర పరిమాణం 22 అంగుళాలు. తెర రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. మల్టీ టచ్‌స్క్రీన్‌తో కంప్యూటర్‌ని వాడుకోవచ్చు. Intel Atom D2700 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 2 జీబీ. NVIDIA GF119 గ్రాఫిక్స్‌ని వాడారు. 128 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ డ్రైవ్‌ ఉంది. ఈథర్నెట్‌, వై-ఫై సదుపాయాలు ఉన్నాయి. విండోస్‌ 7 ఓఎస్‌తో పని చేస్తుంది. మల్టీ టచ్‌తో మునివేళ్లపైనే ఆప్షన్లు కదలాడతాయి. టేబుల్‌ కంప్యూటర్‌కి యూఎస్‌బీ పోర్ట్‌లు, మైక్రోఫోన్‌, హెడ్‌ఫోన్‌ జాక్‌లను ఏర్పాటు చేశారు. దీంతో టేబుల్‌ పీసీని ఇతర పరికరాలకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. http://goo.gl/ROXqx

మీడియా ప్యాడ్‌

10.1 అంగుళాల తాకేతెర పరిమాణంతో ట్యాబ్లెట్‌ వాడాలనుకుంటే Huawei కంపెనీ తయారు చేసిన 'మీడియాప్యాడ్‌ 10 లింక్‌' ట్యాబ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. తెర రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. మందం 9.9 ఎంఎం. 1.2Ghz quad core processor వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 6,600mAh. వీడియో ప్లేబ్యాక్‌ టైం 6 గంటలు. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ కెమెరాలు (ముందు భాగంలో వీజీఏ, వెనక 3 మెగాపిక్సల్‌). వై-ఫై, బ్లూటూత్‌, డ్యుయల్‌ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ డిజిటల్‌ సరౌండ్‌ మ్యూజిక్‌ సిస్టం ఉంది. ధర సుమారు రూ.24,990. ఇతర వివరాలకు http://goo.gl/P8Flu

క్రొత్తగా మరోటి

సోనీ కంపెనీ 1.5ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో ప్రొజెక్టర్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు VPL-CX275 Projector. ఆఫీస్‌ సమావేశాలకు, తరగతి గదుల్లోనూ వాడుకునేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. 5,200 lumens బ్రైట్‌నెస్‌తో ప్రొజెక్టర్‌ పని చేస్తుంది. రిజల్యుషన్‌ 1024X768 పిక్సల్స్‌. కాంట్రాస్ట్‌ నిష్పత్తి 3,000:1. ప్రొజెక్టర్‌లోనే బిల్డ్‌ఇన్‌ స్పీకర్‌ని ఏర్పాటు చేశారు. కెపాసిటీ 10 వోల్ట్స్‌. హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌... లాంటి మరిన్ని అదనపు సౌకర్యాలున్నాయి. ధర సుమారు రూ. 1,56,000. ఇతర వివరాలకు http://goo.gl/SuL4g

రాసింది రాసినట్టే!

పేపర్‌పైన ఏది రాసినా తక్షణమే అది డిజిటలైజ్‌ అయ్యే సాధనం ఉంది. అదే Staedtler Digital Pen.చిత్రంలో మాదిరిగా పెన్నుని ల్యాపీ, ట్యాబ్‌, పీసీలకు అనుసంధానం చేసి వాడుకోవచ్చు. ప్రత్యేక 'రిసీవర్‌ క్లిప్‌'ని నోట్‌బుక్‌పై భాగంలో ఏర్పాటు చేస్తారు. డిజిటల్‌ పెన్నుతో రాసిన మేటర్‌ని 'హ్యాండ్‌రైటింగ్‌ రికగ్నిషన్‌' సాఫ్ట్‌వేర్‌ ద్వారా రిసీవర్‌ క్లిప్‌ డిజిటలైజ్‌ చేసి సిస్టంలో భద్రం చేస్తుంది. 22 భాషల్ని పెన్ను సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా పెన్నుని సిస్టంకి కనెక్ట్‌ చేయవచ్చు. http://goo.gl/nX9HT

ఎక్కడైనా సరే!

ఎలాంటి ప్రతికూల సందర్భాల్లోనైనా వాడుకునేలా రూపొందించిన ట్యాబ్లెట్‌పీసీనే Toughbook H2. ప్యానాసోనిక్‌ కంపెనీ తయారు చేసిన దీన్ని ఇంజినీరింగ్‌ పనులు, రహదారి నిర్మాణాల్లాంటి సందర్భాల్లో మండుటెండలో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. అందుకు అనువుగా తాకేతెరని రూపొందించారు. సెకండ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ని వాడారు. విండోస్‌ 7 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకేతెర పరిమాణం 10.1 అంగుళాలు. 'డ్యుయల్‌ టచ్‌' దీని ప్రత్యేకత. ర్యామ్‌ 4 జీబీ. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 6 గంటలు వాడుకోవచ్చు. http://goo.gl/jq9AQ

స్పీకర్‌ కేక!

వ్యాపారం.. ఉద్యోగ నిమిత్తం ఎక్కువ ఫోన్‌కాల్స్‌కి స్పందించాల్సిన అవసరం ఉంటే Plantronics K100 స్పీకర్‌ ఫోన్ని వాడొచ్చు. తక్కువ పరిమాణంలో రూపొందడం దీని ప్రత్యేకత. దీంట్లో డ్యుయల్‌ మైక్రోఫోన్లు ఉన్నాయి. బయటి శబ్దాల్ని పూర్తిగా నియంత్రిస్తుంది. పెద్దగా ఏర్పాటు చేసిన కంట్రోల్స్‌తో వాల్యూమ్‌ని మేనేజ్‌ చేసుకోవడం సులువు. కారు జీపీఎస్‌ నుంచి తీసుకున్న ఆదేశాల్ని వినిపిస్తుంది. ఎఫ్‌ఎం కూడా వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 17 గంటలు మాట్లాడొచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/G7yji

Eveready UM 22 Power bank

ప్రయాణంలో బ్యాటరీ ఛార్జింగ్‌తో అసౌకర్యం లేకుండా ఉండేందుకు పోర్ట్‌బుల్‌ ఛార్జర్లను వాడొచ్చు. ఆయా ఛార్జర్లలో ముందే నిక్షిప్తం చేసిన ఛార్జింగ్‌తో ఫోన్‌, ట్యాబ్లెట్‌లను ఛార్జ్‌ చేయవచ్చు. వాటిల్లో Eveready UM 22 Power bank ఒకటి. యూఎస్‌బీ కేబుల్‌తో దీన్ని ఛార్జ్‌ చేయవచ్చు. 30 రోజుల స్టాండ్‌బై టైంతో పని చేస్తుంది. ధర సుమారు రూ. 1350. మరిన్ని వివరాలకు http://goo.gl/cPz2R

ఇదే చిన్నది!

సోనీ కంపెనీ తయారు చేసిన 'సైబర్‌షాట్‌ డబ్యుజెడ్‌300' ప్రపంచంలోనే అతి చిన్న డిజిటల్‌ కెమెరాగా టెక్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. బరువు ఎంతో తెలుసా? కేవలం 166 గ్రాములే. 20ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. 18 మెగాపిక్సల్‌ కెమెరాతో దీన్ని వాడుకోవచ్చు. వేగంగా ఆటోఫోకస్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 500 ఫొటోలు తీసుకోవచ్చు. దీంట్లో ఇన్‌బిల్డ్‌గా అందిస్తున్న వై-ఫై నెట్‌వర్క్‌తో తీసుకున్న ఫొటోలు, వీడియోలను పీసీ, స్మార్ట్‌ఫోన్‌లకు సులువుగా కాపీ చేయవచ్చు. 3 అంగుళాల తెరపై తీసిన ఫొటోలు వీడియోలను చూడొచ్చు. హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ ఉంది. ఇన్‌బిల్డ్‌ ఫ్లాస్‌, ఎస్‌బీ కార్డ్‌ స్లాట్స్‌ కూడా ఉన్నాయి. ధర సుమారు రూ.19,990. మరిన్ని వివరాలకు http://goo.gl/ySLJM

మొత్తం టీవీనే!

టీవీ, కంప్యూటర్‌, ల్యాపీ... దేని తెరైనా ఎంతో కొంత ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది. మరి, ఫ్రేమ్‌ లేకుండా తయారు చేసిన టీవీ తెలుసా? అదే ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన LA8600 LED TV. 55 అంగుళాల తెరతో త్రీడీ టీవీని రూపొందించారు. డిస్‌ప్లే హెచ్‌డీ రిజల్యుషన్‌లోనే ఉంటుంది. వాయిస్‌ కమాండ్స్‌, కదలికలతోనూ టీవీని ఆపరేట్‌ చేయవచ్చు. స్మార్ట్‌ మొబైల్స్‌, ట్యాబ్లెట్‌లను టీవీని అనుసంధానం చేయవచ్చు. బిల్టిన్‌ కెమెరాతో స్కైప్‌లో వీడియో ఛాటింగ్‌ చేయవచ్చు. వై-ఫై సౌకర్యంతో నెట్‌ని వాడుకోవచ్చు. ధర సుమారు రూ.51,990. మరిన్ని వివరాలకుhttp://goo.gl/0EGNc

రెండిటికీ ఒక్కటే!

ట్యాబ్లెట్‌గానూ... ల్యాపీగానూ వాడుకునేలా లెనోవా కంపెనీ కొత్త పరికరాన్ని అందిస్తోంది. అదే IdeaPadLynx K3011. మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న విండోస్‌ ఎనిమిదితో ఐడియా ప్యాడ్‌ పని చేస్తుంది. ఎప్పుడైనా దీన్ని ట్యాబ్లెట్‌లా వాడుకోవాలనుకుంటే కీబోర్డ్‌ని తొలగించి వాడుకోవచ్చు. కీబోర్డ్‌తో కలుపుకుని దీని బరువు 1.3 కేజీలు. కీబోర్డ్‌ లేకుండా ట్యాబ్‌ ఒక్కటే 667 గ్రాములు. తాకేతెర పరిమాణం 11.6 అంగుళాలు. రిజల్యుషన్‌ 1366X768 పిక్సల్స్‌. 1.8Ghz డ్యుయల్‌ కోర్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌కిగానూ 64 జీబీ ఫ్లాష్‌ మెమొరీని వాడారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ట్యాబ్‌ ఒక్కదాన్నే 8 గంటలు వాడుకోవచ్చు. కీబోర్డ్‌ని అనుసంధానం చేస్తే మరో ఎనిమిది గంటలు. 2 మెగాపిక్సల్‌ కెమెరా, మైక్రో హెచ్‌డీఎంఐ, డ్యుయల్‌ స్పీకర్‌ సదుపాయాలు ఉన్నాయి. ధర సుమారు రూ.51,990. మరిన్ని వివరాలకు http://goo.gl/ZgUdm

మరో ట్యాబ్‌

త్రీజీ సిమ్‌తో వాడుకునేలా సెల్‌కాన్‌ కంపెనీ తయారు చేసిన ట్యాబ్లెట్‌ మార్కెట్‌లో సందడి చేస్తోంది. పేరు CT888. 7 అంగుళాల తాకేతెర. 1.2Ghz సూపర్‌ ఫాస్ట్‌ డ్యుయల్‌కోర్‌ ప్రాసెసర్‌. రిజల్యుషన్‌ 1024X600 పిక్సల్స్‌. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వీలుంది. వెనక 2 మెగాపిక్సల్‌, ముందు వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీం శాండ్‌విచ్‌ ఓఎస్‌తో వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6 గంటలు వాడుకోవచ్చు. ట్యాబ్‌ మందం 9.9 ఎంఎం. బరువు 200 గ్రాములు. ధర సుమారు రూ.7,999. http://goo.gl/gmle0

ఇదే మొదటిది!

తక్కువ పరిమాణంలో ఉండి స్మార్ట్‌గా అందుబాటులోకి వచ్చింది నికాన్‌ కంపెనీ తయారు చేసిన CoolPixA. 16.2 మెగాపిక్సల్‌ డీఎక్స్‌ ఫార్మెట్‌తో తయారు చేశారు. ఇదే మొదటి 'కాంపాక్ట్‌ కెమెరా'గా టెక్‌ ప్రియులు పొగిడేస్తున్నారు. 18.5 ఎంఎం ఎఫ్‌2.8 లెన్స్‌ని కెమెరాతో పాటు అందిస్తున్నారు. హెచ్‌డీ వీడియోలను చిత్రీకరించేందుకు కెమెరా అనువైంది. 4ఎఫ్‌పీఎస్‌ షూటింగ్‌ స్పీడ్‌తో క్యాప్చర్‌ చేయవచ్చు. తక్కువ వెలుగులో కూడా ఫొటోల నాణ్యత బాగుంటుంది. ఫ్లాష్‌గన్‌, ఐఆర్‌ రిమోట్‌, ఎక్స్‌టర్నల్‌ ఫ్లాష్‌లను అమర్చుకునేందుకు అనువుగా కెమెరాని రూపొందించారు. 3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌, బిల్డ్‌ఇన్‌ష్లాష్‌, హెచ్‌డీఎంఐ... సౌకర్యాలున్నాయి. ధర సుమారు రూ.54,950. http://goo.gl/gBg2i

ప్లేయర్‌ ప్రత్యేకం

పాటలు వినేందుకు ప్లేయర్‌ కావాలంటే Transcend MP350 గురించి తెలుసుకోవాల్సిందే. దీన్ని నీళ్లలో పడేసినా ఏం కాదు. 8జీబీ మెమొరీ. 'బిల్టిన్‌ ఫిట్నెస్‌ ట్రాకర్‌'తో రోజువారీ వ్యాయామాన్ని మానిటర్‌ చేయవచ్చు. అంగుళం పరిమాణంతో కనిపించే తెరపై పాటల పేర్లను సులువుగా ఎంపిక చేయవచ్చు. OLED టెక్నాలజీతో తెరని రూపొందించారు. దీంతో సూర్యకాంతిలోనూ తెరపై ట్రాక్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. బరువు కేవలం 22 గ్రాములే. వేసుకున్న దుస్తులకు తగిలించుకునేలా క్లిప్‌ని ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఎం, వీడియో రికార్డింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. ఎంపీ3, డబ్యుఎంఏ, డబ్యుఏవీ మ్యూజిక్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 12 గంటలు వినొచ్చు. ధర సుమారు రూ. 2,650. http://goo.gl/awpji

ల్యాపీలానూ...

కొన్నది ట్యాబ్లెట్టే! కానీ, దాన్ని ల్యాప్‌టాప్‌ మాదిరిగానూ వాడుకోవచ్చు. అదే విష్‌టెల్‌ తయారు చేసినIRA Capsule. DE తెర పరిమాణం 10.1 అంగుళాలు. రిజల్యుషన్‌ 1024X768 పిక్సల్‌. క్వర్టీ కీప్యాడ్‌ కేస్‌తో కలిపి ట్యాబ్లెట్‌ని వాడుకోగలగడం దీంట్లోని ప్రత్యేకత. కీబోర్డ్‌ని ట్యాబ్‌ని అనుసంధానం చేసి చిత్రంలో మాదిరిగా ల్యాపీలా వాడుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌తో పని చేస్తుంది. 1.6Ghzడ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వీడియో ఛాటింగ్‌ ముందు వీజీఏ కెమెరా ఉంది. 3జీ సేవలతో సిమ్‌ వేసి వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు పని చేస్తుంది. ధర సుమారు రూ.16,000. http://goo.gl/TS6hQ

మీరు డిజైనరా?

మీరు గ్రాఫిక్‌ డిజైనరైతే, లెనోవా తయారు చేసిన మానిటర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. పేరు ThinkVision LT3053p. తెర పరిమాణం 30 అంగుళాలు. రిజల్యుషన్‌ ఎంతో తెలుసా? 2560X1600పిక్సల్స్‌. అడోబ్‌ ఫొటోషాప్‌తో పని చేసేవారికి రంగుల నాణ్యత చాలా స్పష్టంగా తెలుస్తుంది. తెరపై కనిపించే విజువల్స్‌ని మరింత స్పష్టంగా చూసేందుకు అనువుగా మానిటర్‌పైన బాక్స్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. చిత్రంలో చూపిన మాదిరిగా మానిటర్‌ అమరిక ఉంటుంది. 1.07 బిలియన్ల రంగుల కలర్‌ డెప్త్‌తో వాడుకోవచ్చు. రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, మూడు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు ఉన్నాయి. http://goo.gl/mtK6U

ఎటైనా సరే!

వాడుతున్న నోట్‌బుక్‌ తెర ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా? కావాల్సినట్టుగా ఎటైనా తిప్పేసుకునేలా ఉండాలంటే లెనోవా తయారు చేసిన ThinkPad Twist ఆల్ట్రాబుక్‌ గురించి తెలుసుకోవాల్సిందే. విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. నాలుగు రకాల మోడ్స్‌లో (ల్యాప్‌టాప్‌, స్టాండ్‌, ట్యాబ్లెట్‌, టెంట్‌) థింక్‌ప్యాడ్‌ని వాడుకోవచ్చు. 20ఎంఎం మందంతో నాజూకుగా తయారు చేశారు. బరువు కేవలం 1.6 కేజీలు. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌. 500 జీబీ హార్డ్‌డ్రైవ్‌. తాకేతెర పరిమాణం 12.5 అంగుళాలు. రిజల్యుషన్‌ 1366X768 పిక్సల్స్‌. హెచ్‌డీ వెబ్‌కెమెరా, ఫుల్‌సైజు క్వర్టీ కీబోర్డ్‌, ట్రాక్‌ప్యాడ్‌, ట్రాక్‌పాయింట్‌లతో వాడుకోవచ్చు. మిని హెచ్‌డీఎంఐ, మిని డిస్‌ప్లేపోర్ట్‌, కార్డ్‌ రీడర్‌, రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, ఈథర్నెట్‌ సదుపాయాలున్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6 గంటలు పని చేస్తుంది. http://goo.gl/la34R

ముట్టుకుంటే చాలు!

నెట్‌బుక్స్‌, నోట్‌బుక్స్‌ వాడుతున్నారా?ఇన్‌బిల్డ్‌గా ఏర్పాటు చేసిన టచ్‌ప్యాడ్‌తో పని సజావుగా సాగడం లేదా? అయితే, మీరు లాగీటెక్‌ కంపెనీ తయారు చేసిన వైర్‌లెస్‌ టచ్‌ప్యాడ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. పేరు Wireless Rechargeable TouchPad T650. అన్ని అవసరాలకు సరిపడేలా 'మల్టీ టచ్‌ప్యాడ్‌'గా దీన్ని పిలుస్తున్నారు. విండోస్‌ 8, 7 ఓఎస్‌లతో వాడుకోవచ్చు. సుమారు 13 రకాల వేళ్ల కదిలికలతో (Gestures) పనుల్ని పూర్తి చేయవచ్చు. ప్యాడ్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నెల రోజులు వాడుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో అనుసంధానం చేయవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్‌ని ఇండికేటర్‌ ద్వారా మానిటర్‌ చేయవచ్చు. ఐదు అంగుళాల పరిమాణంతో రూపొందించారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/1h7pK

ఐఫోన్‌ వాడుతున్నారా?

స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే హైరిజల్యుషన్‌ వీడియోలు చిత్రిస్తుంటాం. ఈ నేపథ్యంలో ఐఫోన్‌తో వీడియోలు చిత్రీకరిస్తున్నారా? అయితే, మీరు 'ఐపోల్‌' గురించి తెలుసుకోవాల్సిందే. పేరుకి తగ్గట్టుగానే ఐఫోన్‌కి ప్రత్యేకంగా రూపొందించారు. చేతికి అందనంత ఎత్తులో వీడియో చిత్రీకరణ చేయాల్సివస్తే ఐపోల్‌ని వాడుకుని క్వాలిటీ వీడియోలు తీయవచ్చు. చిత్రంలో మాదిరిగా ఫోన్‌ని పోల్‌కి కనెక్ట్‌ చేసి వాడుకునేలా రూపొదించారు. అల్యుమినియం మెటరీయల్‌ వాడి తక్కువ బరువుతో పోల్‌ని తయారు చేశారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/AzOa4

కాస్త బడ్జెట్‌లో...

ట్యాబ్లెట్‌ ఆధునికంగా ఉండాలి. కానీ, బడ్జెట్‌లో చౌకగా అందుబాటులో ఉండాలి. అలాంటి ట్యాబ్‌ గురించి తెలుసుకోవాలంటే Zync Quad 8.0, 9.7 ట్యాబ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. 1.5 Ghz క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్లను వాడారు. Eight-Core గ్రాఫిక్స్‌కి నిక్షిప్తం చేశారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. పేర్లలో నెంబర్ల మాదిరిగానే వీటి తెరల పరిమాణం 8 అంగుళాలు, 9.7 అంగుళాలు. 8.0 వెర్షన్‌ తెర రిజల్యుషన్‌ 1024X768. 9.7 వెర్షన్‌ తెర రిజల్యుషన్‌ 2048X1536. రెండు ట్యాబ్లెట్‌లు ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తాయి. వీడియోలు, ఫొటోల చిత్రీకరణకు వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 2 మెగాపిక్సల్‌ ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 12,990, రూ.13,990. మరిన్ని వివరాలకు http://goo.gl/a7Qht

చూడ్డానికే స్మార్ట్‌

పరికరం ఏదైనా అందమైన డిజైన్‌తో పాటు అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంటే!! వాడుకునేప్పుడు విసుగు లేకుండా ఉంటుంది. ఇదే కోవలోకి వస్తుంది డెల్‌ కంపెనీ రూపొందించిన Latitude 6430U ఆల్ట్రాబుక్‌. చేస్తున్న పనికి తగ్గట్టుగా అల్ట్రాబుక్‌ అవతారాలు మార్చేస్తుంది. 14 అంగుళాల హెచ్‌డీ తెర (1366X768), ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 128జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌, హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్‌, వీజీఏ, కార్డ్‌రీడర్‌, వెబ్‌ కెమెరా, వై-ఫైలతో పని చేస్తుంది. బరువు 1.69 కేజీలు. హైక్వాలిటీ ఇన్‌బిల్డ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు. ధర సుమారు రూ.69,990. మరిన్ని వివరాలకు http://goo.gl/Ht2wy

నానో పీసీ!

టిఫిన్‌ బాక్స్‌ పరిమాణంలో ఉండి మ్యాక్‌పై మ్యాజిక్‌ చేసిన 'మ్యాక్‌ మిని' గురించి తెలిసిందే. ఫాక్స్‌కాన్‌ కంపెనీ తయారు చేసిన దీని పేరు NanoPC AT-5250. ఇంటెల్‌ ఆటమ్‌ 1.8Ghz ప్రాసెసర్‌ని వాడారు. ఇంటెల్‌ 3650HD గ్రాఫిక్స్‌ వాడారు. నాజూకు కనిపించే ఈ బాక్స్‌కి మానిటర్‌ లేదా స్మార్ట్‌ టీవీ వెనక భాగంలో పెట్టుకుని వాడుకోవచ్చు. దీంట్లో ఇన్‌బిల్డ్‌గా వై-ఫై పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, నాలుగు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, గిగాబిట్‌ ఈథర్నెట్‌, హెడ్‌ఫోన్‌, మైక్రోఫోన్‌ జాక్స్‌, మల్టీ కార్డ్‌ రీడర్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి. ఈ పీపీ రన్‌ అవ్వడానికి అయ్యే కరెంటు ఖర్చు 24W. మరిన్ని వివరాలకు http://goo.gl/sR3DF

మౌస్‌ అనుకునేరు!

చూస్తుంటే ఇదేదో మౌస్‌లా ఉందే అనుకుంటే పొరబాటే. ఇదో బ్లూటూత్‌ స్పీకర్‌. పేరు Portronics Pebble. దీంట్లో బిల్డ్‌ఇన్‌ మైక్రోఫోన్‌ కూడా ఉంది. లెడ్‌ డిస్‌ప్లేతో కంట్రోల్స్‌ని వాడుకోవచ్చు. స్పీకర్‌పై కనిపించే కంట్రోల్స్‌ మౌస్‌ బటన్ల మాదిరిగానే రూపొందించారు. టచ్‌ ప్యానల్‌తో కంట్రోల్స్‌ని వాడుకోవచ్చు. బరువు 137 గ్రాములు. మైక్రోఎస్‌డీ స్లాట్‌తో కార్డ్‌ని ఇన్‌సర్ట్‌ చేసి ఎంపీ3 సాంగ్స్‌ని వినొచ్చు. 32 జీబీ వరకూ సపోర్ట్‌ చేస్తుంది. 3.5 ఎంఎంతో టీవీ, ల్యాపీ, కంప్యూటర్‌, ఎంపీ3 ప్లేయర్లకు అనుసంధానం చేసి మ్యూజిక్‌ వినొచ్చు. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో సుమారు 10 మీటర్ల పరిధిలో పని చేస్తుంది. ధర సుమారు రూ.3,499. యూఎస్‌బీతో ఛార్జ్‌ చేయవచ్చు. మరిన్ని వివరాలకు http://goo.gl/GAWxY

'స్మార్ట్‌' పీసీ

ట్యాబ్లెట్‌ కొనాలా? నోట్‌బుక్‌ తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే, కాస్త ఖర్చయినా పర్వాలేదు అనుకుంటే... శామ్‌సంగ్‌ కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకే తెర పరిమాణం 11.6 అంగుళాలు. రిజల్యుషన్‌ 1366X768పిక్సల్స్‌. 1.8Ghzడ్యుయల్‌ కోర్‌ ఇంటెల్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 64 జీబీ. ప్రత్యేక డాకింగ్‌ సిస్టం ద్వారా క్వర్టీ కీబోర్డ్‌ని అనుసంధానం చేసి నోట్‌బుక్‌ మాదిరిగా వాడుకోవచ్చు. 9.9ఎంఎం. బరువు 744 గ్రాములు. కీబోర్డ్‌తో కలిపితే 1.45 కేజీలు. రెండు ఇన్‌బిల్డ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో వీడియో ఛాటింగ్‌ 2 మెగాపిక్సల్‌ కెమెరా, వెనక 8 మెగాపిక్సల్‌ని ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు http://goo.gl/lclGU

చాలా 'స్లిమ్‌'

* ప్రపంచంలోనే తొలి నాజుకైన ట్యాబ్లెట్‌!

* మందం 6.9 ఎంఎం. బరువు 495 గ్రాములు! ట్యాబ్‌ పేరేంటో తెలుసా? 'ట్యాబ్లెట్‌ జెడ్‌'

సోనీ కంపెనీ తొలిసారి నాజూకైన ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తేనుంది. దీని తెర పరిమాణం 10.1 అంగుళాలు. రిజల్యుషన్‌ 1920X1200. ఐప్యాడ్‌ మందం 9.4 ఎంఎం. బరువు 662 గ్రాములు). హెచ్‌డీ రిజల్యుషన్‌తో గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ 4.1 (జెల్లీబీన్‌) ఓఎస్‌తో పని చేస్తుంది. ప్రాసెసింగ్‌ వేగం ఏ మాత్రం తక్కువ కాకుండా 1.5Ghz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. బ్యాటరీ సామర్థ్యం 6,000 mAh. బ్లూటూత్‌, వై-ఫై, 3జీ సేవలతో పాటు 4జీ నెట్‌వర్క్‌ని ట్యాబ్‌లో అందిస్తున్నారు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 1 మెగాపిక్సల్‌ కెమెరాని, వెనక 8 మెగాపిక్సల్‌ కెమెరాని నిక్షిప్తం చేశారు. ధర సుమారు రూ.27,000 ఉండొచ్చని అంచనా.

'లెడ్‌' సీరిస్‌
మానిటర్‌ని మార్చాలనుకుంటే వ్యూసోనిక్‌ కొత్తగా రూపొందించిన లెడ్‌ సీరిస్‌ మానిటర్ల గురించి తెలుసుకోవాల్సిందే. పేరు VX2770Smh LED మానిటర్‌. 1080 పిక్సల్స్‌ హెచ్‌డీ స్క్రీన్‌తో వీటిని అందిస్తున్నారు. తెర పరిమాణం 27 అంగుళాలు. హెచ్‌డీఎంఐ, డీవీఐ, వీజీఏ కనెన్షన్స్‌తో వాడుకోవచ్చు. 'యాంటీ గ్లేర్‌' మరో అదనపు ఆకర్షణ. మానిటర్‌ సెట్టింగ్స్‌ని మార్చుకునేందుకు 'టచ్‌ సెన్సిటీవ్‌' బటన్లను ఏర్పాటు చేశారు. ఈ లెడ్‌ మానిటర్లు వాడడం ద్వారా 40 శాతం విద్యుత్‌ని ఆదా చేయవచ్చట. ఇన్‌బిల్డ్‌ ఆడియో స్పీకర్లు ఉన్నాయి. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/ubz86

లెడ్‌ టెక్నాలజీతో!
ఎసర్‌ 1.2 కేజీల బరువుతో సరికొత్త పోర్టబుల్‌ ప్రొజెక్టర్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Acer L51W Projector. 'లెడ్‌ లైట్‌ సోర్స్‌'తో ఇది పని చేస్తుంది. రిజల్యుషన్‌ 1280X768. హెచ్‌డీఎంఐ అవుట్‌, యూఎస్‌బీ పోర్ట్‌లతో రూపొందించారు. ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌తో మెమొరీ కార్డ్‌లను అనుసంధానం చేసి వాడుకోవచ్చు. పోర్ట్‌లకు కనెక్ట్‌ చేసిన యూఎస్‌బీల్లోని డేటాని రీడ్‌ చేసి ప్లే చేయడం దీంట్లోని ప్రత్యేకత. ఉదాహరణకు పెన్‌డ్రైవ్‌, మెమొరీ కార్డ్‌ల్లో సేవ్‌ చేసిన ఫొటోలు, వీడియోలను ప్రొజెక్టర్‌కి కనెక్ట్‌ చేసి ప్రదర్శించి చూడొచ్చు. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌లను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ధర సుమారు రూ.85,000. http://goo.gl/3KfgG

'మి-301' ప్రింటర్‌
'మి-301' ప్రింటర్‌! దీన్ని వాడాలంటే.. ప్రత్యేక టేబుల్‌ అక్కర్లేదు! వైర్‌లతో కూడా పని లేదు. ట్యాబ్లెట్‌... మొబైల్స్‌తో కలిసి పని చేస్తుంది. ఇది ప్రంచంలోనే తొలి బుల్లి ప్రింటర్‌ కూడా! ఎప్సన్‌ కంపెనీ రూపొందించిన దీని పూర్తి పేరు Expression Me-301. అందుకు ఎప్సన్‌ DURABrite Ultra Inkసౌకర్యాన్ని అందిస్తోంది. నాణ్యతతో కూడిన ఫొటో ప్రింట్‌లను తీసుకునే ముందు ప్రింటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బటన్స్‌తో ఫొటోలను ఎడిట్‌ చేయవచ్చు. 'రెడ్‌ఐ కరక్షన్‌'కి ప్రత్యేక బటన్‌ ఉంది. Epson Photo Enhanceతో 'స్కిన్‌టోన్స్‌, ఎక్స్‌పోజర్‌ లెవల్స్‌, కలర్‌ కాస్ట్‌'లను కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ప్రింటింగ్‌ మ్యాక్స్‌ రిజల్యుషన్‌ 5760X1440.మ్యాక్‌ ఓఎస్‌తో కలిపి వాడుకునే వీలుంది. మరిన్ని వివరాలకుhttp://goo.gl/z5tHR

మరో ట్యాబ్‌
డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో కంప్యూటర్‌లు వాడాం. ఇక ట్యాబ్‌లను కూడా వాడొచ్చు. ఎందుకంటే Swipe Velocity ట్యాబ్‌ని ARM Cortex- A9 డ్యుయల్‌ కోర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ర్యామ్‌ 1 జీబీ. తాకే తెర పరిమాణం 8 అంగుళాలు. రిజల్యుషన్‌ 1024X768 పిక్సల్స్‌. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. వెనక భాగంలో 2 మెగాపిక్సల్‌ కెమెరా, ముందు 1.3 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. బరువు 437 గ్రాములు. తక్కువ మందంతో నాజూకుగా కనిపించడం ట్యాబ్‌ ప్రత్యేకత. ధర సుమారు రూ.13,999. మరిన్ని వివరాలకు http://goo.gl/GMm8U

వినేందుకు ఒకటి
ల్యాప్‌, ట్యాబ్‌, మొబైల్‌లో మ్యూజిక్‌ వినేందుకు ఇష్టపడుతుంటారా? అయితే, అనువైన మ్యూజిక్‌ సాధనం Portronics Pure Sound Pro గురించి తెలుసుకోవాల్సిందే. దీని బరువు సుమారు 1 కేజీ. ముందు భాగంలో ఏర్పాటు చేసిన చిన్న ఎల్‌సీడీ తెరతో స్పీకర్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. Turbo Bass మోడ్‌లో మరింత క్వాలిటీతో మ్యూజిక్‌ వినొచ్చు. ఎఫ్‌ఎం, ఎంపీ3 ప్లేయర్‌ కూడా ఉన్నాయి. యూఎస్‌బీ డ్రైవ్‌, ఎస్‌కార్డ్‌తో పాటల్ని వినొచ్చు. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే సుమారు ఎనిమిది గంటలు పని చేస్తుంది. ధర రూ. 3,499. http://goo.gl/sRyiW

ఇదే మొదటిది!
కార్లో వెళ్లేప్పుడు ఫోన్‌ మాట్లాడాల్సి వస్తే సింపుల్‌గా JabraTour స్పీకర్‌ ఫోన్‌ని ఆన్‌ చేస్తే సరి. మన దేశంలో తొలిసారి 'కార్‌ స్పీకర్‌ఫోన్‌'గా అందుబాటులోకి వచ్చింది. ఒక వేళ మీరు ఐఫోన్‌ వాడుతున్నట్లయితే Siriఆప్‌ సేవల్ని వాడుకోవచ్చు. ఫోన్‌ చేయాల్సివస్తే ఫోన్‌ తీసి నెంబర్‌ వెతుక్కుని డయల్‌ చేయాల్సిన అవసరం లేదు. హాయిగా కారు డ్రైవ్‌ చేస్తూనే పేరు పలితే చాలు. వ్యక్తికి కాల్‌ వెళ్లిపోతుంది. పక్కసీట్లో కూర్చున్న మాదిరిగా ఫోన్‌ మాట్లాడి పెట్టేయవచ్చు. అందుకు అనువుగా స్పీకర్‌ లోపల హెచ్‌డీ మైక్రోఫోన్‌ని ఏర్పాటు చేశారు. 'నోయిస్‌ కాన్సిలేషన్‌' ఉండడం వల్ల ఎలాంటి శబ్దాలు వినిపించవు. బ్లూటూత్‌ కనెక్షన్‌తో అన్ని మొబైల్స్‌తోనూ స్పీకర్‌ని వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://goo.gl/CakxB

రెండు రకాలుగా...
అవసరానికి ల్యాపీ... లేదంటే ట్యాబ్లెట్‌. అదీ Stylistic Q702. పుజిస్టు కంపెనీ తయారు చేసిన ఇది విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. 11.6 అంగుళాల తాకేతెర. క్వర్టీ కీబోర్డ్‌ని డాక్‌ చేసి వాడుకోవచ్చు. కీబోర్డ్‌ లేకుండా దీని బరువు 850 గ్రాములు. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ ఐ3 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, ఇంటెల్‌ హెచ్‌డీ 4000 గ్రాఫిక్స్‌, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌. యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ, కార్డ్‌ రీడర్‌, ఈథర్నెట్‌, బ్లూటూత్‌ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 9 గంటలు పని చేయవచ్చు. http://goo.gl/xpSti

ఇలా మార్చేయండి
అందరి ఇళ్లలోనూ స్మార్ట్‌ టీవీలే. వాటిని మరిన్ని సౌకర్యాలతో వాడుకోవాలంటే Woxi SmartPod ఉంటే సరి. ముఖ్యంగా టీవీలు, ఎల్‌సీడీ మానిటర్‌లను కంప్యూటర్‌లా మార్చేస్తుంది. దీనికి ఏర్పాటు చేసిన ప్రత్యేక యూఎస్‌బీ పోర్ట్‌లతో ఇతర మీడియా డివైజ్‌లను కనెక్ట్‌ చేయవచ్చు. క్లౌడ్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఇంటర్నెట్‌ ఛానళ్లను చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో ఉచితంగా ఉన్న అన్ని వీడియో గేమ్స్‌ని ఆడొచ్చు. ఫొటోలు, మ్యూజిక్‌, సినిమాలు... ఇతర మీడియా ఫైల్స్‌ని సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. 1Ghzప్రాసెసర్‌, మాలి 400 గ్రాఫిక్స్‌, 512 ఎంబీ ర్యామ్‌, బిల్డ్‌ఇన్‌ వై-పై, ఈథర్నెట్‌ పోర్ట్‌, 1 టీబీ ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డ్రైవ్‌ ఉన్నాయి. రిమోట్‌ కంట్రోల్‌తో స్మార్ట్‌పాడ్‌ని వాడుకోవచ్చు. టైపింగ్‌కి అనువుగా క్వర్టీ కీప్యాడ్‌ని రిమోట్‌పై రూపొందించారు. ధర సుమారు రూ.9,499. http://goo.gl/Pmvbb

చిటికెలో ఫొటోలు!
వచ్చేదంతా పండగ వాతావరణమే. మరి, ఇంట్లోనూ, బయట 'క్లిక్‌ క్లిక్‌..' సందడులే. తీసుకున్న ఫొటోలను సిస్టంలో దాచుకోవడం మామూలే. ప్రింట్‌లు తీసుకోవాలంటే? స్టూడియోకి వెళ్లాల్సిందేనా? ఏం అక్కర్లేదు. బడ్జెట్‌ ప్రింటర్‌ ఉంటే సరి. పేరు MFCJ625DW Brother. ధర సుమారు రూ.7,000. 1.9 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే తాకేతెరతో ఇది పని చేస్తుంది. వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఎన్ని సిస్టంలకైనా కనెక్ట్‌ చేయవచ్చు. తాకేతెర ఆధారంగా ఫొటోలను కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకోవచ్చు. 'డుప్లెక్స్‌' ప్రిటింగ్‌తో పేపర్‌కి రెండువైపులా ప్రింట్స్‌ తీసుకోవచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/NktPv

ఇదే తొలిసారి!
చూడ్డానికి 21.5 అంగుళాల మానిటర్‌లానే ఉంటుంది. కానీ, అదో లెడ్‌ టచ్‌స్క్రీన్‌ మానిటర్‌. ఆడ్రారయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. మునివేళ్లతో తాకుతూ మెయిల్స్‌ చెక్‌ చేయవచ్చు. వీడియోలు బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో ట్యాబ్లెట్‌లా పని చేసే మానిటర్‌ అన్నమాట. దీన్ని సాధారణ ప్రాసెసర్‌కి కనెక్ట్‌ చేసి మానిటర్‌లా కూడా వాడుకునే వీలుంది. డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వై-ఫై, మైక్రోఎస్‌డీ స్లాట్‌, మూడు యూఎస్‌బీ పోర్ట్‌లు, స్పీకర్లతో మానిటర్‌ని తయారు చేశారు. 1.3 మోగాపిక్సల్‌ వెబ్‌ కెమెరా ఉంది. హెచ్‌డీ రిజల్యుషన్‌ 1920X1080. ధర సుమారు రూ.31,999. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/u4kqt

ది 'క్రోమ్‌బుక్'
నోట్‌బుక్‌లు... ఆల్ట్రాబుక్‌లు కాకుండా, కొత్తగా క్రోమ్‌బుక్ ఏంటబ్బా అనుకుంటున్నారా? గూగుల్ తయారు చేసిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంతో ఇది పని చేస్తుంది. పేరు Acer C7 ChromeBook. 11.6 అంగుళాల తెరతో రూపొందించారు. స్క్రీన్ రిజల్యుషన్ 1366x768 పిక్సల్స్. డ్యుయల్ కోర్ ఇంటెల్ Celeron ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 320 జీబీ హార్డ్‌డ్రైవ్, 3 యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ, వీజీఏ, కార్డ్‌రీడర్, ఈథర్నెట్‌పోర్ట్, హెచ్‌డీ వెబ్‌కెమెరా... సౌకర్యాలతో రూపొందించారు. బ్యాటరీ బ్యాక్అప్ నాలుగు గంటలు. 100 జీబీ స్పేస్‌ను రెండేళ్లపాటు గూగుల్ డ్రైవ్ నుంచి పొందొచ్చు. బరువు కేవలం 1.3 కేజీలు. ఇతర వివరాలకు http://goo.gl/1RGtN

ఒక్కటే.. కానీ రెండు!
ఆధునిక ఆల్ట్రాబుక్‌ని కొనుగోలు చేసి దాన్నే ట్యాబ్లెట్‌లా వాడుకోవాలంటే డెల్‌ కంపెనీ తయారు చేసిన XPS 12 Ultrabook గురించి తెలుసుకోవాల్సిందే. 12.5 అంగుళాల తాకే తెరతో రూపొందించారు. రిజల్యుషన్‌ 1920X1080. చిత్రంలో మాదిరిగా తెరని తిప్పి ట్యాబ్లెట్‌లా వాడుకునే వీలుంది. అందుకు అనువుగా అల్యూమినియం రిమ్‌ని తెర చుట్టూ ఏర్పాటు చేశారు. అల్ట్రాబుక్‌ బరువు 1.5 కేజీలు. 'విండోస్‌ 8 ప్రో' ఓఎస్‌తో పని చేస్తుంది. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, ఇంటెల్‌ హెచ్‌డీ 4000 గ్రాఫిక్స్‌, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌, గ్లాస్‌ టచ్‌ప్యాడ్‌, యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లతో రూపొందించారు. ధర సుమారు రూ.90,490. మరిన్ని వివరాలకు http://goo.gl/CVMmZ

అలా అనుకునేరు!
చూస్తుంటే ఇదేదో టేప్‌రికార్డర్‌లా ఉందే అనుకునేరు. ఇదో బ్లూటూత్‌ స్పీకర్‌. పేరు Harman JBL OnBeat aWake. ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఐపాడ్‌లకు ప్రత్యేకం. అలారం సెట్‌ చేసుకోవచ్చు. అందుకు అనువైన AmpUp అప్లికేషన్‌ని డివైజ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. చిత్రంలో మాదిరిగా స్పీకర్‌కి ముందు భాగంలో డిస్‌ప్లేని ఏర్పాటు చేశారు. దాంట్లోని కంట్రోల్స్‌తో స్పీకర్‌ని వాడుకో వచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/w4wjf

ఫోనూ... ప్రింటర్!
ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైళ్లను వాడుతున్నారా? అయితే, మొబైల్‌లో తీసుకున్న ఫొటోలను చిటికెలో ఫొటో ప్రింట్స్ తీసుకోవచ్చు. అందుకు Bolle BP-10 Photo Printer ఉంటే చాలు. చిత్రంలో చూపిన మాదిరిగా మొబైల్‌ని బుల్లి ప్రింటర్‌కి కనెక్ట్ చేసి ఫొటోలు ప్రింట్ ఇవ్వొచ్చు. 4x6 అంగుళాల పరిమాణంలో ప్రింట్స్ వస్తాయి. రిజల్యుషన్ 300 డీపీఐ. ప్రింటర్‌లో ఎలాంటి ఇంక్ క్యాడ్రిడ్జ్‌ని వాడకపోవడం దీంట్లోని ప్రత్యేకత. వాడే పేపర్‌లోనే రంగుల్ని నిక్షిప్తం చేశారు. దీంట్లో డాక్ చేసిన పరికరాల్ని ఛార్జ్ చేస్తుంది కూడా. ధర సుమారు రూ.8,800. మరిన్ని వివరాలకు http://goo.gl/2udnV

మరో రెండు ట్యాబ్‌లు!
బడ్జెట్ ట్యాబ్లెట్‌ల జోరు పెరుగుతోంది. WickedLeak కంపెనీ రెండు ట్యాబ్‌లు అందుకు ఉదాహరణ. వీటి పేర్లు Wammy Desire & Athena. రెండూ ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్‌తో పని చేస్తాయి. 1.5 Ghz డ్యుయల్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, mali 400 గ్రాఫిక్స్‌ని వాడారు. డిజైర్ తాకేతెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్ 800x480. ఇంటర్నల్ స్టోరేజ్ 8 జీబీ. ముందుభాగంలో వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. ధర సుమారు రూ.6,500. ఇక Athena ట్యాబ్ తెర సైజు 9.7 అంగుళాలు. రిజల్యూషన్ 1024x768 పిక్సల్స్. ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబీ. 2 మెగాపిక్సల్ పరిమాణం ఉన్న డ్యుయల్ కెమెరాల్ని వాడారు. ధర సుమారు రూ.13,999. రెండిటిలోనూ వై-ఫై, హెచ్‌డీఎంఐ అవుట్‌పుట్ సదుపాయాలు ఉన్నాయి. http://goo.gl/m5fO1

సోనీ ఎక్స్‌పెరియా టిప్
సోనీ తయారు చేసిన ఎక్స్‌పెరియా గురించి తెలిసిందే. ఆ కోవలోకి చెందేలా మరో బుల్లి మొబైల్‌ని అదే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. పేరు Experia Tip. 3.2 అంగుళాల తాకేతెరతో తేెలికైన మొబైల్‌గా ముందుకొచ్చింది. రిజల్యుషన్ 320x480 పిక్సల్. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.0 వెర్షన్‌తో ఇది పని చేస్తుంది. 800Mhz Qualcomm ప్రాసెసర్‌ను వాడారు. 512 ఎంబీ ర్యామ్, Adreno 200 గ్రాఫిక్స్, 2.9 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3.2 మెగాపిక్సల్ కెమెరా... సదుపాయాలతో రూపొందించారు. బాక్స్.నెట్ క్లౌడ్ స్టోరేజ్ నుంచి 50 జీబీ స్టోరేజ్ స్పేస్‌ని అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటలు మాట్లాడుకోవచ్చు. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. http://goo.gl/2PyoZ
కొత్తగా 'ఫన్‌బుక్'
మైక్రోమ్యాక్స్ వాయిస్ కాల్, బిల్డ్ఇన్ సిమ్‌కార్డ్ సదుపాయాలతో Funbook Talk ట్యాబ్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇదో బడ్జెట్ ట్యాబ్లెట్‌గా టెక్ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. 7 అంగుళాల తాకే తెర, 512 ఎంబీ ర్యామ్, 1Ghz ప్రాసెసర్, Dual mali 400 GPU, 4జీబీ ఇంటర్నట్ స్టోరేజ్, మైక్రోఎస్‌డీ స్లాట్, మిని హెచ్‌డీఎంఐ, మిని యూఎస్‌బీలతో ట్యాబ్‌ని రూపొందించారు. USB Dongle సపోర్ట్‌తో త్రీజీ సేవల్ని వాడుకోవచ్చు. బ్యాటరీ బ్యాక్అప్ 5 గంటలు. ధర సుమారు రూ. 7,300 వివరాలకు http://goo.gl/Ckq2D
పెంటా టీ ప్యాడ్ టాబ్లెట్లు
* డాంగిల్ ఆధారితం రూ.7,499
* సిమ్ అమర్చుకునేది రూ.14,699
* బీఎస్ఎన్ఎల్ డేటా ఆఫర్లతో లభ్యం

రాష్ట్ర విపణిలోకి బీఎస్ఎన్ఎల్ డేటా ఆఫర్లతో రెండు టాబ్లెట్ పీసీలను పాంటెల్ టెక్నాలజీస్ (పీపీటీఎల్) విడుదల చేసింది. 7 అంగుళాల కెపాసిటివ్ తాకే తెర, 1 జీబీ ప్రాసెసర్, 8జీబీ అంతర్గత మెమొరీ, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ డాంగిల్ అమర్చుకునే సదుపాయం, ఆండ్రాయిడ్ 4.0.3 (ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఐఎస్703సీ టాబ్లెట్ ధర రూ.7,499 కాగా, రూ.1,500 విలువైన బీఎస్ఎన్ఎల్ 3జీ డాంగిల్ ఉచితంగా ఇస్తారు.
అకాయ్ స్మార్ట్ బాక్స్
టీవీల్లోనే అంతర్జాలాన్ని శోధించడానికి ఉపయోగపడే 'స్మార్ట్ బాక్స్'ను అకాయ్ ప్రవేశపెట్టింది. ధర రూ.6,590. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఇది పనిచేస్తుంది. 1.25 జీహెచ్‌జడ్ ప్రాసెసర్‌ను, 4జీబీ అంతర్గత మెమొరీని జత చేశారు. దీనిని 32 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. నేవిగేషన్ కోసం ఒక వైర్‌లెస్ మౌస్ ఇస్తారు. ఇది వైఫై, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను ఉపయోగించి వీడియోలు, గేములు, వెబ్‌సైట్‌ల వంటి కంటెంటును వినియోగదారులు యాక్సెస్ చేసుకొనేందుకు తోడ్పడుతుంది. స్మార్ట్ బాక్స్‌కు 4 యూఎస్‌బీ పోర్టులు, హార్డ్ డ్రైవ్‌లు ఉంటాయి. ఈ పరికరం ల్యాన్, వైఫైలతో పాటు 3జీని ఉపయోగించుకొంటూ అంతర్జాలానికి అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది.
కొత్తగా కీబోర్డ్‌లు
ట్యాబ్లెట్ యూజర్లకు అదనపు క్వర్టీ కీబోర్డు అవసరం ఎక్కువే. అలాంటి వారికి లాగీటెక్ కంపెనీ కొత్తగా కీబోర్డ్ కేస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఐప్యాడ్‌కి ఇవి ప్రత్యేకం. చిత్రంలో చూపిన మాదిరిగా కీబోర్డ్‌ని పల్చటి కవర్, సోలార్ సెల్స్‌తో రూపొందించారు. బ్లూటూత్ కనెక్షన్‌తో ట్యాబ్‌ని కీబోర్డ్‌కి కనెక్ట్ చేయాలి. టైపింగ్‌కి అనువుగా ట్యాబ్‌ని కావాల్సిన యాంగిల్‌లో పెట్టుకోవచ్చు. కేస్‌లో ఏర్పాటు చేసిన సోలార్ సెల్స్ ద్వారా బ్లూటూత్ కీబోర్డ్ ఎప్పటికప్పుడు ఛార్జ్ అవుతుంది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/QbluV, http://goo.gl/Uipk6
హెచ్‌సీఎల్ ఆల్ట్రాబుక్‌
హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి తొలిసారి ఆల్ట్రాబుక్‌ను మార్కెట్‌లోకి వచ్చింది. పేరు HCL ME 3074. 14 అంగుళాల తెర. రిజల్యుషన్ 1366X768 పిక్సల్స్. బరువు 1.7 కేజీలు. మరి, దీని మందం ఎంతో తెలుసా? 18 మిల్లీమీటర్లు. థర్డ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, హెచ్‌డీ గ్రాఫిక్స్, హైబ్రీడ్ స్టోరేజ్ (32 జీబీ ఎస్ఎస్‌డీ+500 జీబీ హెచ్‌డీడీ), మూడు యూఎస్‌బీ పోర్టులు, హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్, మెమొరీ కార్డ్ రీడర్, 1.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా.... దీంట్లోని ప్రత్యేకతలు. విండోస్ సెవెన్ హోం బేసిక్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 7 గంటలు. ధర సుమారు రూ.51,990. http://goo.gl/9zEUZ
గెలాక్సీ నోట్‌ II వచ్చేసింది
శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజా ఆవిష్కరణ గెలాక్సీ నోట్‌II ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. 5.5 అంగుళాల హై డెఫినిషన్‌ సూపర్‌ అమోల్డ్‌ తాకేతెర, 1.6 గిగాహెట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 మెగాపిక్సెల్‌ కెమెరా (1.9 మెగాపిక్సెల్‌ ముందుకెమెరా), 16 జీబీ అంతర్గత మెమొరీ, 3,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ 3జీ ఫాబ్లెట్‌ (స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌ ఫీచర్లు కలిగినది) ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మెమొరీని 64 జీబీ వరకు పెంచుకోవచ్చు. అత్యంత స్పష్టత కలిగిన తెరపై వీడియోను తిలకిస్తూనే, నెట్‌ బ్రౌజింగ్‌ వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించుకునే (మల్టీటాస్కింగ్‌) వీలున్న గెలాక్సీ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో, సిమ్‌ కార్డు పొందుపరచే వీలున్న 3జీ ఆధారిత స్మార్ట్‌ కెమెరాలను కూడా ప్రదర్శించారు. ఈ 16 మెగాపిక్సెల్‌ కెమెరాలతో, తీసిన చిత్రాలను వెంటనే ఇతరులకు పంపుకోవచ్చు.
ఒకేదాంట్లో రెండు!
దీన్ని అదే Padfone ట్యాబ్లెట్'గా పిలుస్తున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పని చేస్తుంది. పోర్టబుల్‌గా చిన్న తెరపై వాడుకోవాలనుకుంటే మొబైల్‌గానూ, పెద్ద తెరపై వాడుకోవాలనుకుంటే ట్యాబ్లెట్‌గానూ వాడుకోవచ్చు. మొబైల్ తెర పరిమాణం 4.3 అంగుళాలు. ట్యాబ్ తెర సైజు 10.1 అంగుళాలు. బ్యాటరీ బ్యాక్అప్ ఎక్కువ సమయం రావాలంటే మొబైల్‌ని ట్యాబ్‌లో పెట్టుకునే వాడాలి. డ్యుయల్‌కోర్ 1.5Ghz Qualcomm ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, మెక్రోఎస్‌డీ స్లాట్, 8 మెగాపిక్సల్ కెమెరాతో మొబైల్‌ని రూపొందించారు. ట్యాబ్లెట్‌కి ప్రత్యేక క్వర్టీ కీబోర్డ్‌ని డాక్ చేసి వాడుకోవచ్చు.
http://in.asus.com/mob ile/padfone/
ఈ-ట్యాబ్ తెలుసా?
మొబైల్ తయారీ కంపెనీ లావా తక్కువ ధరకే ట్యాబ్లెట్‌ని రూపొందించింది. పేరు Lava ETab Z7H తెర పరిమాణం 7 అంగుళాలు. 1.2Ghz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 512 ఎంబీ, ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ, మైక్రోఎస్‌డీ స్లాట్, వీజీఏ కెమెరా, 800ప480 పిక్సల్స్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌ని నిక్షిప్తం చేశారు. వివిధ రకాల ప్రీలోడెడ్ అప్లికేషన్లు, గేమ్స్‌ని అందిస్తున్నారు. 3G Dongles సపోర్ట్‌తో త్రీజీ సేవల్ని వాడుకోవచ్చు. లావా అందిస్తున్న ఫ్యుజన్ స్టోర్ నుంచి మ్యూజిక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ధర సుమారు రూ.5,500. వీడియో, ఇతర వివరాలకు www.lavamobiles.com/etab/
లెనోవో ఆల్ట్రాబుక్‌
లెనోవో కంపెనీ సరికొత్త ఆల్ట్రాబుక్‌ తో ముందుకొచ్చింది. పేరు Lenovo ThinkPadX1 Carbon.. ప్రపంచంలోనే అతి తేలికైన ఆల్ట్రాబుక్‌గా పేరొందింది. బరువు కేవలం 1.36 కేజీలు. తెర పరిమాణం 14 అంగుళాలు. హైడెఫినెషన్ డిస్‌ప్లేతో గ్రాఫిక్స్ చూడొచ్చు. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 8 జీబీ. స్టోరేజ్ కెపాసిటీ 256జీబీ ఎస్ఎస్‌డీ. రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, కార్డ్ రీడర్, మినీ డిస్‌ప్లే పోర్ట్‌లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8.2 గంటలు పని చేస్తుంది. 'ర్యాపిడ్ ఛార్జ్' సౌకర్యంతో కేవలం అరగంటలోనే 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. http://goo.gl/YRFrl
మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్
మైక్రోమ్యాక్స్ రూపొందించిన ఫన్‌బుక్ మరో కొత్త అవతారంతో ముందుకొచ్చింది. పేరు Funbook Alpha. మధ్య తరగతి వారికిదో బడ్జెట్ ట్యాబ్‌గా చెప్పుకోవచ్చు. 7 అంగుళాల తాకే తెరతో రూపొందించారు. రిజల్యుషన్ 800X480. ఆండ్రాయిడ్ 4.0 ఓఎస్. Ghz ప్రాసెసర్. ర్యామ్ 512 ఎంబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. USB Dongle తో త్రీజీ సేవల్ని వాడుకోవచ్చు. వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. కొన్ని ఫ్రీలోడ్ అప్లికేషన్లు కూడా అందిస్తున్నారు. ఇతర వివరాలకు www.micromaxfunbook. com/features-alpha.html .
హెచ్‌సీఎల్ కొత్త ట్యాబ్లెట్ వెర్షన్‌
హెచ్‌సీఎల్ మరో కొత్త ట్యాబ్లెట్ వెర్షన్‌ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పేరు HCL ME Y2. ఇన్‌బిల్డ్‌గా ఏర్పాటు చేసిన 3జీ సౌకర్యంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేక సిమ్‌కార్డ్ స్లాట్ ఉంది. దీని తాకే తెర పరిమాణం అంగుళాలు. రిజల్యుషన్ 1024x600 పిక్సల్స్. ఆండ్రాయిడ్ 4.0, 1 జీబీ ర్యామ్, మాలి 400 జీపీయూ, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా, ముందు వీజీఏ కెమెరా, హెచ్‌డీఎంఐ, మినీ యూఎస్‌బీ పోర్ట్ సౌకర్యాలతో పని చేస్తుంది. హెచ్‌సీఎల్ అందిస్తున్న ME App Store నుంచి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. దీని బరువు 368 గ్రాములు. ధర సుమారు రూ.14,999. http://goo.gl/wHL3f
కొత్త వెర్షన్
శామ్‌సంగ్ మరో కొత్త ట్యాబ్లెట్‌తో సందడి చేయనుంది. అదే Samsung Galaxy Tab 2 310. ఆండ్రాయిడ్ సరికొత్త ఓఎస్ వెర్షన్ 4.0 (ఐస్‌క్రీం శాండ్‌విచ్) దీంట్లో ఇన్‌బిల్డ్‌గా అందిస్తున్నారు. 7 అంగుళాల తాకేతెరతో రూపొందించారు. 3జీ, వై-ఫై సేవల్ని వాడుకునేలా తయారు చేశారు. 1Ghz డ్యుయల్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, యూఎస్‌బీ పోర్ట్, వెనక భాగంలో 3 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో వీజీఏ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ధర సుమారు రూ.23,250. మే నెల నాటికి మన దేశ మార్కెట్‌లోకి రావచ్చని అంచనా. http://goo.gl/ad0Ck
మరోటి కొత్తగా!
డ్యుయల్ సిమ్ కార్డ్స్‌తో డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నారు టీన్స్. వారికి మరో బిస్కెట్ వేసేందుకు శామ్‌సంగ్ సిద్ధం అయిపోయింది. జీఎస్ఎం, సీడీఎంఏ కార్డ్స్‌తో వాడుకునేలా Samsung Galaxy S11 Duos ముందుకొచ్చింది. డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తో ఈ మోడళ్లు పని చేస్తాయి. 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ కెమెరా, ఆండ్రాయిడ్ 2.3 ఓఎస్‌తో పని చేస్తాయి. వీటి తాకేతెర పరిమాణం 4.5 అంగుళాలు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5 ఎంఎంజాక్, మైక్రోఎస్‌డీ కార్డ్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీలతో రూపొందించారు. 32 జీబీ వరకూ మెమొరీ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.
ప్రింట్ వచ్చేస్తుంది
కెమెరాలో అలా క్లిక్ కొట్టగానే ఇలా ప్రింట్ వచ్చేస్తే! Polaroid Instant Digital Cameraకెమెరా ప్రత్యేకత అదే. ఫొటో తీసి ఎడిట్ చేసి వెంటనే ప్రింట్ తీసుకోవచ్చు. అంతా ఒక్క నిమిషంలోనే! 2X3 అంగుళాల సైజులో ఫొటోలు అందిస్తుంది. కెమెరాలో అమర్చిన పేపర్ Zink's Heat Based Technology తో పని చేస్తుంది. 10 మెగాపిక్సల్ సెన్సర్‌తో ఫొటోలు తీయవచ్చు. ఎస్‌డీకార్డ్ స్లాట్, బిల్డ్ఇన్ స్పీకర్, మైక్రోఫోన్, 3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే సదుపాయాలు ఉన్నాయి. http://goo.gl /bpJK1
త్రీడీ కంప్యూటర్
దేశంలోనే తొలిసారి త్రీడీ పర్సనల్ కంప్యూటర్‌ను హెచ్‌పీ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. పేరు TouchSmart 620 3D Edition. 23 అంగుళాల తాకేతెరపై ఫుల్ హెచ్‌డీ వీడియోలను త్రీడీలో చూడొచ్చు. అందుకు ప్రత్యేక కళ్లజోడు పెట్టుకోవాల్సిందే. త్రీడీ వెబ్ కెమెరాని కూడా ఏర్పాటు చేశారు. దీంతో త్రీడీ వీడియోలను తయారు చేసే వీలుంది. ఇంటెల్ ఐ5 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 1 టీబీ డ్రైవ్, బ్లూ రే డ్రైవ్, AMD Radeon గ్రాఫిక్స్‌తో దీన్ని తయారు చేశారు. సిస్టంతో పాటు రెండు జతల కళ్లజోళ్లను అందిస్తున్నారు. ధర సుమారు రూ. 92,999. http://goo.gl/uOiao