TECH. BITS
లింక్‌ల లంకెలేంటి?
మెయిల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌... ఇలా వాడుతున్న సర్వీసులకు ఏవొక లింక్‌లు వస్తూనే ఉంటాయి. ఏ మాత్రం ఆలోచన లేకుండా వాటిపై క్లిక్‌ చేస్తే కొన్నిసార్లు హ్యాకర్ల చేతికి చిక్కొచ్చు. అందుకే మీకు వచ్చిన లింక్‌లు సురక్షితమైనవో కాదో ముందు తెలుసుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. http://urlxray.com/ సైట్‌లోకి వెళ్లి మీకు వచ్చిన పొట్టి లింక్‌, మరేదైనా వెబ్‌ యూఆర్‌ఎల్‌ లింక్‌ల మాతృక ఎక్కడో స్కాన్‌ చేసి చూడొచ్చు. http://www.urlvoid.com/ దీంట్లోకి వెళ్లి మీకొచ్చిన వెబ్‌సైట్‌ ఎంత మేరకు సురక్షితమో తెలుసుకోవచ్చు.
పెద్దాయన ప్రయాణం
క్రికెట్‌, చదరంగం, యాక్షన్‌, రేసింగ్‌... ఇలా పలు రకాల గేమ్‌లు ఆడుంటారు. కానీ, జీవిత గమనానికి సరిపడే గేమ్‌ ఆడారా? అయితే, ‘ఓల్డ్‌ మ్యాన్స్‌ జర్నీ’ గేమ్‌ని ఆడి చూడండి. ఆట ఓ పజిల్‌ గేమే అయినప్పటికీ ఆడాక మాత్రం జీవిత సత్యం బోధపడుతుంది. ఓ పెద్దాయన ప్రయాణంలో వెంటే ఉంటూ వెళ్లే మార్గంలో సాయపడాలి. నిర్ణీత సమయం అంటూ లేదు. వీలు కుదిరినప్పుడు ప్రశాంతంగా ఆడుతూ టైమ్‌పాస్‌ చేయొచ్చు. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో గేమ్‌ని రూపొందించారు. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ స్టోర్‌ల నుంచి గేమ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్‌: https://goo.gl/CLxyAG
యాపిల్‌: https://goo.gl/nfvbJm

భలే ‘ముదురు
’ మీ స్మార్ట్‌ఫోన్‌లో అదే వాల్‌పేపరు రోజూ చూసి విసుగొస్తోందా? ‘ఏం చేస్తాం... నాకు ముదురు రంగులో ఉండే వాల్‌పేపర్లు అంటే ఇష్టం. అలాంటివి ఎక్కువ దొరకడం లేదు’ అంటారా. అయితే ఒకసారి Blacker : Dark Wallpaper (ఆప్‌ వాడి చూడండి. ఇందులో వెయ్యికిపైగా రకరకాల వాల్‌పేపర్లున్నాయి. అన్నీ నలుపు రంగు ప్రధానంగా ఉండేవే. వాటిలో మీకు నచ్చిన ఫొటోను వాల్‌పేపరుగా పెట్టుకోవచ్చు.
* https:///goo.gl/8u4fai

స్మార్ట్‌గా కాగితం విమానం
చిన్నప్పుడు చెడ్డీ బడ్డీలతో... కాలేజీ క్యాంపస్‌లో కొంటె స్నేహితులతో ఆడిన కాగితం విమానాన్ని స్మార్ట్‌గా మార్చేయవచ్చు తెలుసా? గాల్లోకి వదిలిన విమానాన్ని స్మార్ట్‌ఫోన్‌తో గతిని మార్చొచ్చు. అదెలాగంటే ‘పవర్‌ఆప్‌ డార్ట్‌’ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని కాగితం విమానానికి అమర్చితే చాలు. పరికరం బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఫోన్‌కి అనుసంధానమై కాగితం విమానం ఎగురుతుంది. గాల్లోకి వదిలిన తర్వాత మీరు చెప్పినట్టుగానే 10 నిమిషాల పాటు చక్కర్లు కొడుతుంది. ఫోన్‌లోని ఆప్‌ ద్వారా ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు. అంతేనా... దానంతట అదే టేకాఫ్‌ అవుతుంది. చెప్పినట్టుగా ల్యాండ్‌ అవుతుంది కూడా!
ఇతర వివరాలకు https://goo.gl/GMAHSH

ఐస్‌క్రీమ్‌ల దాడి చూశారా..?
భూమికి దూరంగా ఓ చిన్న గ్రహం... దాని మీద మీరొక్కరే ఉన్నారు. ఇంతలో మీ గ్రహం మీదకి దాడి మొదలైంది. అది మామూలు దాడి కాదు... ఐస్‌క్రీమ్‌ల దాడి. ఈ పరిస్థితుల్లో మీ గ్రహాన్ని కాపాడుకోవాలి. దీనికి మీరు సిద్ధమైతే SPD గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ ఆటను ఓపెన్‌ చేయగానే ఓ గ్రహం మీద చిన్న గన్‌ పట్టుకున్న బొమ్మ కనిపిస్తుంది. స్క్రీన్‌పై మీ వేలిని ఎటుతిప్పితే ఆ బొమ్మ అటు తిరుగుతూ తూటాల వర్షం కురిపిస్తుంది. అలా ఐస్‌క్రీమ్‌ల దాడిని ఎదుర్కోవాలి. ఎన్ని ఎక్కువ ఐస్‌క్రీమ్‌లను పేలిస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి.
* https://goo.gl/ufgLvf

మీ ప్రాంతానికో గుర్తింపు సంఖ్య!
క్రాస్‌ రోడ్స్‌ దాటాకా ముందుకళ్తే.. ఎడమవైపు కమాన్‌ వస్తుంది... ఆ దారిలో వచ్చేస్తే ఆఖరి ఇల్లు...! మీ ఇంటి చిరునామా చెప్పడానికి ఇలా రకరకాల బండ గుర్తుల్ని చెప్పే ఉంటారు. ఇటీవల వాట్సాప్‌లో లొకేషన్‌ షేర్‌ ఆప్షన్‌ వచ్చాక పని కాస్త సులువైంది. అలాకాకుండా మీరున్న ప్రాంతానికి ఓ గుర్తింపు సంఖ్య రూపొందించి చిరునామాగా వాడుకోవచ్చు. Lincodes ఆప్‌తో ఇది వీలవుతుంది. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే మీరున్న ప్రాంతానికి ఓ గుర్తింపు నంబరు కనిపిస్తుంది. మీ చిరునామా చెప్పాలనుకునేవారికి ఆ నంబరు పంపించాలి. అవతలి వ్యక్తి తన మొబైల్‌లోని లిన్‌కోడ్స్‌ ఆప్‌లో ఈ నెంబరుతో సెర్చ్‌ చేస్తే మీ ప్రాంతం కనిపిస్తుంది. ఆ తర్వాత గూగుల్‌ మ్యాప్స్‌ తరహాలో ఈ ఆప్‌లో ట్రాక్‌ చేస్తూ మీ ప్రాంతానికి చేరుకోవచ్చు.
* https://goo.gl/PguQ6Q

విమానం ఎక్కడుంది?
ప్రపంచంలో ఏ విమానం ఎక్కడుందో, ఎంతసేపటిలో గమ్య స్థానానికి చేరుకుంటుందో, ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్నవేంటి, రాబోయేవేంటి? ఇలాంటి వివరాలు చెప్పడానికి ఓ ఆప్‌ ఉంది. అదే Flightradar24 Flight Tracker. ఇందులో మీకు కావల్సిన విమానం నెంబరు ఇస్తే దాని ప్రస్తుత స్థితి కనిపిస్తుంది. అది గాల్లో ఎంత ఎత్తులో ఉంది, ఎంత వేగంగా ప్రయాణిస్తోంది, ఇప్పటివరకు ఎలా ప్రయాణించింది లాంటి వివరాలు ట్రాక్‌ ఆప్షన్‌లో తెలుసుకోవచ్చు. ఆ విమానం గత వారం రోజుల్లో ఎలా ప్రయాణించింది అనేదీ తెలుస్తుంది. దీంతోపాటు ఓ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న విమానాలు, ప్రయాణానికి సిద్ధమైన వాటి గురించి వివరంగా సమాచారం లభిస్తుంది.
* https:///goo.gl/k99f7G

చకా చకా ఎక్కేయండి
ఎప్పుడైనా రాక్‌ క్లైంబింగ్‌ చేశారా? పెద్ద పెద్ద కొండరాళ్లను వట్టి చేతులతో అధిరోహిస్తుంటారు. అమ్యూజ్‌మెంట్‌ పార్క్స్‌లో ఆ తరహా కొండల్ని కృత్రిమంగా ఏర్పాటు చేస్తుంటారు కూడా. కొంచెం కఠినమే అయినా సాహసోపేతంగా ఉంటుంది. ఎందుకులే అంత రిస్క్‌ అనుకుంటే... మొబైల్‌లోనే ఆ ఆటను ఆడేయండి. Climb The Wall గేమ్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని చకాచకా కొండలెక్కేయండి. ఇందులో ఛాలెంజ్‌, ఎండ్‌లెస్‌, రష్‌ అని మూడు విభాగాలున్నాయి. వాటిలో మీకు నచ్చింది ఎంచుకొని సరదాగా ఆడేయండి. థ్రిల్‌ పొందండి.
* https:///goo.gl/zJ81NW

ఇదో రకం బంతాట
ఓ చిన్న గదిలో బంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దానికి తెలియకుండా గీతలు గీస్తూ ఆ గది పరిమాణాన్ని తగ్గించాలి. ఈ క్రమంలో గీతకు బంతి తాకిందా మీరు ఓడిపోయినట్లే. ఈ ఆట ఎప్పుడో, ఎక్కడో చూసినట్లుంది కదా. పాత తరం విండోస్‌ కంప్యూటర్లలో ఇలాంటి ఆట ఉండేది. దీన్ని ఇప్పుడు మీ మొబైల్‌లోనూ ఆడాలంటే Scale గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇందులో లెవల్‌ మారే కొద్దీ ఆట క్లిష్టం అవుతుంది... మజా మొదలవుతుంది. బంతితో కొత్త ఆట ఆడాలంటే డౌన్‌లోడ్‌ చేసేసుకోండి.
* https:///goo.gl/drC7Hr

వాట్సాప్‌లో యూట్యూబ్‌
ఇప్పుడు వాట్సాప్‌లో యూట్యూబ్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే... యూట్యూబ్‌ ఆప్‌ ఓపెన్‌ అయ్యి వీడియో ప్లే అవుతోంది. త్వరలో యూట్యూబ్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లోనే ప్లే అవుతుంది. పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ ద్వారా ఇది వీలవుతుంది. ఇకపై లింక్‌ క్లిక్‌ చేయగానే వాట్సాప్‌ ఆప్‌ క్లోజ్‌ అవ్వకుండా చిన్న విండోలో వీడియోను వీక్షించొచ్చు. దానిపై క్లిక్‌ చేస్తే... యూట్యూబ్‌ ఆప్‌లోకి వెళ్తారు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ఆపిల్‌ మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఇక గీసి వెతకొచ్చు
మొబైల్‌లో ఎమోజీ కావాలంటే ఇప్పటి వరకు కీబోర్డులోని ఎమోజీ బటన్‌ను క్లిక్‌ చేసి వచ్చిన వాటిలోంచి కావల్సిన దాన్ని వాడుకున్నారు. ఇకపై మీకు కావల్సిన ఎమోజీని మీరే చేత్తో గీసి వెతుక్కోవచ్చు. కీబోర్డు మీద వేలితో ఎమోజీని గీస్తే... పోలికల్లో దానికి దగ్గరగా ఉండే ఎమోజీలు కనిపిస్తాయి. కీబోర్డులో ఎమోజీ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే పైన సెర్చ్‌ బటన్‌ పక్కన పెన్‌ ఆకారం ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే వచ్చే స్క్రీన్‌ మీద ఎమోజీని గీయొచ్చు.

వారధి నిర్మిస్తారా?
మొబైల్‌లో కార్లతో చాలా రకాల రేసులు ఆడుంటారు. రకరకాల కార్లతో గాల్లో ఎగురుతూ, బాంబులు పేల్చుతూ మజా చేసుంటారు. అయితే కారు ప్రయాణించడానికి బ్రిడ్జి కట్టారా? అయితే Build a Bridge డౌన్‌లోడ్‌ చేసుకోండి. గేమ్‌ ఓపెన్‌ చేయగానే ఒక కొండ అంచున కారు సిద్ధంగా ఉంటుంది. ఆ అంచు నుంచి పక్కన ఉండే మరో కొండకు వారధి నిర్మించాలి. దీని కోసం చెక్కలు, తాళ్లు సిద్ధంగా ఉంటాయి. వాటితో ఎంత నేర్పుగా వారధిని నిర్మిస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. సరైన అమరిక లేకుండా వారధి నిర్మిస్తే కూలిపోతుంది. దీంతో కారు లోయలో పడి పోతుంది. మరి వారధి కట్టడానికి సిద్ధమేనా?
https:///goo.gl/ i07WFa

కాగితపు పక్షితో...
చిన్నప్పుడు పుస్తకంలో కాగితం చింపి పక్షి బొమ్మ చేసి ఆడుకున్న రోజులూ గుర్తున్నాయా? ఆ రోజుల్ని మళ్లీ జ్ఞప్తికి తెచ్చేలా ప్లే స్టోర్‌లో ఓ ఆప్‌ ఉంది. అదే Paper Wings. దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓపెన్‌ చేస్తే... మీ కోసం ఓ కాగితపు పక్షి సిద్ధంగా ఉంటుంది. దానికి ఎగరడమైతే తెలుసు కానీ, అటు, ఇటు కదలడం రాదు. ఈ విషయంలో మీరు దానికి సాయం చేస్తే... అది మీకు కావల్సినంత వినోదాన్ని అందిస్తుంది. పై నుంచి కిందకు పడుతున్న బంగారు నాణాలను పక్షిని గాల్లో ఎగిరిస్తూ పట్టుకోవాలి. ఇందులో 25 రకాల పక్షులున్నాయి. మీరు పట్టుకున్న బంగారు నాణాలతో వాటిని కొనుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి... ఆడేయండి. https://goo.gl/WhPShq

ట్రూకాలర్‌ కొత్త హంగులు
ఇన్నాళ్లూ మీ మొబైల్‌కు ఎవరు కాల్‌ చేశారో మాత్రమే చెప్పిన ట్రూకాలర్‌... ఇప్పుడు కొత్త హంగులు అద్దుకొని వచ్చింది. బ్యాంకింగ్‌ సేవలు, మొబైల్‌ రీఛార్జ్‌, వీడియో కాల్స్‌... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో ట్రూకాలర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఇందులో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన, రాబోతున్న కొన్ని అంశాలివి!
ట్రూకాలర్‌ ఆప్‌ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు, అందుకోవచ్చు. ట్రూకాలర్‌ పే పేరుతో ఓ సర్వీసును ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఆప్‌లోని ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఓ యూపీఐ ఐడీ క్రియేట్‌ అవుతుంది. దీని ద్వారా ఏదైనా యూపీఐ ఐడీ, భీమ్‌ ఆప్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్‌ నంబరుకు డబ్బులు పంపించుకోవచ్చు. అంతేకాదు ఈ ఆప్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జిలూ చేసుకోవచ్చు.
* ట్రూకాలర్‌తో ఇకపై వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. గూగుల్‌ వీడియో కాలింగ్‌ ఆప్‌ డ్యుయోతో కలసి ట్రూకాలర్‌ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. త్వరలో ఈ ఆప్‌ నుంచి నేరుగా వీడియో కాల్స్‌ సౌకర్యం పొందొచ్చు.

ఒకేసారి ఒకరికిమించి
వాట్సాప్‌లో ఇద్దరు, ముగ్గురికి మెసేజ్‌ పంపాలంటే... వారిని సెలెక్ట్‌ చేసుకొని బ్రాడ్‌కాస్ట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. లేదంటే గ్రూప్‌ క్రియేట్‌ చేయొచ్చు. అలా కాకుండా ఎవరికివారికి వేర్వేరుగా పంపుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే త్వరలో మీరు ఆ పని చేయొచ్చు. మల్టిపుల్‌ కాంటాక్ట్‌ సెలక్షన్‌ ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది వాట్సాప్‌. ఇప్పటికే కొందరు దీన్ని వినియోగిస్తున్నారు. మొబైల్‌లో సాధారణ మెసేజ్‌లు పంపినప్పుడు ఎలా కాంటాక్ట్‌లు సెలెక్ట్‌ చేసుకుంటామో అలా వాట్సాప్‌లో ఎంచుకోవచ్చన్నమాట.
డబ్బు కూడా: వాట్సాప్‌లో ప్రస్తుతం మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు, డాక్యుమెంట్లు లాంటివి పంపిస్తున్నారు. త్వరలో దీని ద్వారా డబ్బు కూడా పంపించుకోవచ్చు. మనదేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ విభాగంలోకి వాట్సాప్‌ వస్తోందట. మొబైల్‌ నెంబరు ఆధారంగా ఈ ఆప్‌ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు, అందుకోవచ్చు. ఇప్పటికే దీనికి కోసం వాట్సాప్‌ సన్నాహాలు ప్రారంభించింది. యూపీఐ సాంకేతికత ఆధారంగా వాట్సాప్‌ డిజిటల్‌ పేమెంట్‌ ప్రక్రియ ఉండనుంది.

మెసెంజర్‌లో క్షణక్షణం ప్రత్యక్షం
* ఫలానా దగ్గర ఉన్నాను మరో అర గంటలో వచ్చేస్తాను...
* ఇప్పుడే బయలుదేరా ఇంటికి రావడానికి ఇంకా గంట పట్టొచ్చేమో...
మీ ఇంట్లో వాళ్లకు లేదా స్నేహితులకు ఇలా చాలాసార్లు చెప్పుంటారు. లేదంటే మీకు వాళ్లు చెప్పుంటారు. ఇలా ఎక్కడున్నారో ఎప్పటికప్పుడు కాల్‌ చేసి చెప్పే కన్నా మీ కదలికల్ని వాళ్లు మొబైల్‌లో చూసేటట్లయితే బాగుంటుంది కదా. ఇలాంటి ఆప్షనే అందిస్తోంది ఫేస్‌బుక్‌ మెసెంజర్‌. ఇప్పటివరకు మెసెంజర్‌లో మీరు ప్రస్తుతం ఉన్న లొకేషన్‌ను మాత్రమే షేర్‌ చేయగలరు. ఇకపై మీరున్న ప్రాంతాన్ని లైవ్‌లో ట్రాక్‌ చేసే అవకాశమూ వస్తోంది. అంటే మీరున్న ప్రాంతాన్ని మెసెంజర్‌లో షేర్‌ చేసి లైవ్‌ ట్రాకింగ్‌కు అనుమతిస్తే... అవతలి వ్యక్తి మిమ్మల్ని గంటపాటు ట్రాక్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా కొందరికి అందించారు. గూగుల్‌ మ్యాప్స్‌ కూడా ఆ ఆప్షన్‌ తీసుకొస్తోంది.

ఇక్కడ పార్క్‌ చేశారు
నా కారు ఎక్కడ పార్క్‌ చేశానబ్బా? మీకూ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి వచ్చే ఉంటుంది. షాపింగ్‌ మాల్స్‌, బహిరంగ సభలకు వెళ్లినప్పుడు పార్కింగ్‌ ఎక్కడో ప్లేస్‌ దూరంగా ఉండటం, మల్టీప్లెక్స్‌లయితే పార్కింగ్‌ ఫ్లోర్‌లన్నీ ఒకేలా ఉండటం వల్ల మీ బండి ఎక్కడ పార్క్‌ చేశారనేది మరచిపోవచ్చు. ఇలాంటి ఇబ్బంది లేకుండా గూగుల్‌ కొత్త ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. త్వరలో మీ గూగుల్‌ మ్యాప్స్‌లో మీరు బండి పార్క్‌ చేసిన ప్రాంతాన్ని నమోదు చేసి పెట్టుకోవచ్చు. తర్వాత అవసరమైనప్పుడు మ్యాప్స్‌ సాయంతో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగాత్మకంగా కొందరికి అందుబాటులో ఉంది.

ఫేస్‌బుక్‌లో స్టోరీస్‌
స్టేటస్‌, మెసెంజర్‌ డే... పేరు ఏదైనా ఆకారం, పరమార్థం ఒక్కటే. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కొత్తగా వచ్చిన ఆప్షన్లవి. వీటి ద్వారా ఫొటో, వీడియోను స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. అది 24 గంటలపాటు మీ స్నేహితులకు కనిపిస్తుంది. ఇలాంటి ఆప్షన్‌ త్వరలో ఫేస్‌బుక్‌లోకి వస్తోంది. దీన్ని స్టోరీస్‌ అంటారు. ఈ ఆప్షన్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొందరికి అందిస్తున్నారు. త్వరలో అందరూ వాడుకోవచ్చు. మరోవైపు ఫొటోలకు మెరుగులద్దడం, అదనపు హంగులు జోడించి షేర్‌ చేసుకోవడానికీ ఓ ఆప్షన్‌ సిద్ధమవుతోంది. మెసెంజర్‌లో ఉన్న ఫొటో ఫిల్టర్‌ ఆప్షన్‌ను ఫేస్‌బుక్‌లోకి తీసుకొస్తున్నారు.

మీకు నచ్చినట్లుగా
మీ మొబైల్‌ మీ ఇష్టం... మీకు నచ్చిన స్క్రీన్‌సేవర్‌ పెట్టుకోండి... నచ్చినట్లుగా ఐకాన్లు మార్చుకోండి. ఇది మేం చెబుతున్న మాట కాదు. గూగుల్‌ అంటోన్న మాట. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి, దానికి మీరు చెప్పిన సమాధానాలు ఆధారంగా మీ మొబైల్‌ స్క్రీన్‌ ఎలా ఉండాలనుకుంటున్నారో ఆండ్రాయిడ్‌ ఓ అంచనాకు వస్తుంది. దానికి తగ్గట్టుగా లాంచర్‌, ఆప్‌ ఐకాన్లు, వాల్‌పేపరు, కీబోర్డు, విడ్జెట్లను మీకు సూచిస్తుంది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీరు కోరినట్లుగా మీ మొబైల్‌ కనిపిస్తుంది. దీనికి మీరు సిద్ధమైతే మీ మొబైల్‌లో https:// www.android.com/myandroid/ ఓపెన్‌ చేయండి. వరుస ప్రశ్నలకు చకా చకా సమాధానాలివ్వండి. మీకు నచ్చినట్లుగా మీ మొబైల్‌ను చూసుకోండి.

గజిబిజి ఉండదిక
ఏదైనా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినప్పుడు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లో పేమెంట్‌ చేస్తునప్పుడు బ్యాంకు గేట్‌వేల దగ్గర క్యాప్చాలు చూస్తుంటాం. మీరు మనిషా లేక యంత్రమా అనేది ఈ క్యాప్చాల ద్వారా తెలుసుకుంటామని ఆయా వెబ్‌సైట్లు చెబుతుంటాయి. గజిబిజి అక్షరాలు ఇచ్చి వాటిని తిరగరాయమనడం, ఇచ్చిన బొమ్మలో ఒకే రకానికి చెందినవో చెప్పమనడం లాంటివి క్యాప్చాల కిందకి వస్తాయి. త్వరలో అంతర్జాల వినియోగదారులకు ఈ ఇబ్బంది తొలగిపోనుంది. అంతర్జాలం నుంచి క్యాప్చా విధానాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే ఎక్కడైనా సబ్మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తున్న విధానం పరిశీలించి కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేస్తున్నది మనిషా యంత్రమా అనేది తెలుసుకునేలా సాంకేతికతను సిద్ధం చేశారట. దీంతో క్యాప్చా అవసరం పోనుంది.

బకెట్‌లో బంతి పడితే
శూన్య ప్రదేశంలో రెండు చెక్కలపై ఒక బంతి... దిగువన వేలాడుతున్న ఒక బకెట్‌! ఆ బంతిని ఎలాగైనా బకెట్‌లో పడేయాలి. దీనికి కొన్ని డబ్బాలు (బ్లాక్‌లు) మీకు సాయం చేస్తాయి. ఈ ఆట ఆడటానికి మీరు సిద్ధమా? అయితే Drop Flip గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇందులో వందకుపైగా లెవల్స్‌ ఉన్నాయి. ఇక్కడో మెలిక ఏంటంటే... బ్లాకులు ఒకే పరిమాణంలో, అనువైన ప్రదేశాల్లో ఉండవు. అవసరానికి తగ్గట్టు వాటిని తిప్పుకుంటా, జరుపుకుంటూ ఆ బంతి జాగ్రత్తగా బకెట్‌లో పడేలా చూసుకోవాలి. ఈ ప్రయత్నంలో ఒకసారి విఫలమైతే మరో అవకాశం ఉంటుంది. అయితే తక్కువ బ్లాక్‌ కదలికలతో బంతిని గమ్యస్థానం చేరిస్తే మీకు బంగారు పతకం వస్తుంది. కదలికలు పెరిగితే వెండి, ఇత్తడి పతకాలు వస్తాయి. అయితే ఆటను డౌన్‌లోడ్‌ చేసుకొని పతకాలు సాధించండి.
* https://goo.gl/YeKaHj

హృతిక్‌ని నడిపించండి
అతని పేరు రోహన్‌ భట్నాగర్‌. మంచి సింగర్‌. కానీ ఒకటే సమస్య... కళ్లు కనిపించవు. మామూలుగా అయితే రోజూ రోడ్డు పక్క నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లి వస్తుంటాడు. కానీ ఈ రోజు ఎందుకో కాస్త ఆలస్యమైంది. అందుకే రోహన్‌ వీలైనంత త్వరగా స్టూడియోకు వెళ్లడానికి మీ సాయం కోరుతున్నాడు. మీరు సిద్ధమైతే Kaabil గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. వాహనాలు, మనుసుల రద్దీ ఎక్కువగా ఉన్న రహదారిపై రోహన్‌ను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేర్చడమే ఈ ఆట. హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన హిందీ చిత్రం ‘కాబిల్‌’ ఆధారంగా ఈ ఆటను రూపొందించారు. ఆప్‌ను ఓపెన్‌ చేయగానే రోడ్డు పక్కన రోహన్‌ సిద్ధంగా ఉంటాడు. రోడ్డుపై ఉన్న గీతల ఆధారంగా రోహన్‌ను ముందుకు నడిపించాలి. అడ్డుగా వచ్చే కొందరిని తప్పించుకుంటూ వీలైనన్ని తక్కువ అడుగుల్లో రోహన్‌ను గమ్యస్థానానికి చేర్చాలి. అతణ్నే కాదు సుప్రియ భట్నాగర్‌ (సినిమా కథానాయిక యామీ గౌతమ్‌ అవతార్‌)ను కూడా ఈ ఆట కోసం వినియోగించుకోవచ్చు.
* https://goo.gl/40haiq

అంతరిక్షంలో చిన్న బండితో...
ఎత్తైన కొండలు, మధ్యలో లోయలు, పైన ఆకాశంలో ధగధగా మెరిసిపోతున్న చుక్కులు, ఇంకోవైపు నింగి నుంచి రాలి పడుతున్న తోక చుక్కలు... వాతావరణం బాగుంది కదా. ఇలాంటి ప్రాంతంలో చిన్న బండిపై అలా షికారు వెళ్లాలనిపిస్తే The Lunar Explorer గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ ఆప్‌ ఓపెన్‌ చేసి మీరే ఒక చిన్న బండిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కొండలు, ఇసుక తిన్నెల మీద ఒడుపుగా నడపాలి. మధ్యలో కొన్ని వజ్రాలు గాల్లో తేలుతూ ఉంటాయి. వాటిని పట్టుకుంటే మీ వాహనానికి మరింత బలం చేకూరుతుంది. దాంతో మరిన్ని కొండలు ఎక్కి ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. అలా ఎక్కువ దూరం వెళ్లినవారు మేటిగా నిలుస్తారు. మీరు తయారు చేసుకున్న వాహనం ఆకారం మీదే మీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. అందుకే కొండల్లో ప్రయాణం చేయడానికి అనువైన వాహనం రూపొందించుకుంటే మీ పని సులభమవుతుంది. * https://goo.gl/T6IyNx

మారియో మళ్లీ వచ్చాడు!
ఒక బుల్లి యువరాజు... తన యువరాణిని వెతుక్కుంటూ రాజ్యాలు తిరుగుతుంటాడు. మధ్యలో ఎన్నో అడ్డంకులు, ఇంకెన్నో ఆపదలు! ఇదేదో ‘మారియో’ గేమ్‌ గురించి చెబుతున్నట్లుందే అంటారా? అవును. కొన్నేళ్ల క్రితం ప్లేస్టేషన్స్‌లో అదరగొట్టిన ఈ ఆట మొబైల్స్‌లోకి వచ్చేసింది. అదేంటి.. ఇప్పటికే ఈ ఆట మొబైల్స్‌లో ఉంది కదా అనుకోకండి. అవన్నీ మారియోని స్ఫూర్తిగా తీసుకొని రూపొందినవే. ఇప్పుడు నింటెండో అసలు సిసలు మారియోను తీసుకొచ్చింది. ‘సూపర్‌ మారియో రన్‌’ పేరుతో ఈ ఆటను ఐఫోన్లలో విడుదల చేసింది. ప్రస్తుతం అమెరికన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆట మన దేశంలోకి వచ్చే ఏడాది తొలి రోజుల్లో విడుదలవుతుందని సమాచారం. నింటెండో నుంచి ఇటీవల వచ్చిన ‘పోకెమన్‌ గో’ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మారియో అదే పనిలో ఉన్నాడు. గేమ్‌ విడుదలైన తొలి రోజే సుమారు 28.5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పటివరకు పోకెమన్‌ గో పేరు మీదున్న రికార్డు (9 లక్షలు)ను మారియో బద్దలు కొట్టాడు.

చెక్కల లంకె విడదీస్తే
పజిల్‌ గేమ్స్‌ అంటే మీకు ఆసక్తా! నెంబర్లు, కార్డులు, బొమ్మల్లో తప్పొప్పులు చూడటం... లాంటి ఆటలు ఆడి విసుగొచ్చిందా? అయితే interlocked ఒకసారి ఆడి చూడండి. ఒకదాంట్లో ఒకటి ఇరుకున్న చెక్క ముక్కలను నేర్పుగా విడదీయడమే ఈ ఆట. ఎన్ని తక్కువ మూవ్స్‌లో ఆ చెక్క ముక్కలను విడదీస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఆ చెక్క ముక్కలు త్రీడీ బొమ్మలా 360 డిగ్రీల్లో తిరుగుతాయి. అలా ఎక్కడ లంకె ఉందో చూసుకొని విడదీయాల్సి ఉంటుంది. ఈ ఆటలో నాలుగు రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌లో 27 చిక్కులు ఉంటాయి. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేస్తే కొత్త రౌండ్‌లు వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ లింకులో (https://goo.gl/qUEqjx) గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి... ముక్కల లంకెలు విడదీసేయండి.

ముచ్చట్లతో వార్తలు
ఏ క్షణానికి, ఏ మూల, ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే ఆసక్తా! వార్తల సంబంధిత ఆప్స్‌తో బోర్‌ కొట్టేసిందా? అయితే Quartz ఆప్‌ను ప్రయత్నించండి. జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని చిటికెలో సులభంగా తెలుసుకోవచ్చు. స్నేహితునితో ఛాటింగ్‌ చేస్తున్నట్లే ఈ ఆప్‌తో ఛాట్‌ చేస్తూ తాజా వార్తలు తెలుసుకోవచ్చు. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే మొబైల్‌ ఆప్‌ మీతో ఛాటింగ్‌ మొదలుపెడుతుంది. తర్వాత like this ట్యాబ్‌ను ఒత్తాలి. ఆ తర్వాత ఒక సంక్షిప్త వార్త తెరపైకి వస్తుంది. దాని కింద tell me more, anything else అప్షన్లు కనిపిస్తాయి. ‘టెల్‌ మీ మోర్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే పై వార్తకు సంబంధించిన అదనపు సమాచారం వస్తుంది. ‘ఎనీ థింగ్‌ ఎల్స్‌’ క్లిక్‌ చేస్తే... వేరే వార్త కనిపిస్తుంది. అలా వరుసగా వార్తలు చదువుకోవచ్చు. * https://goo.gl/fIwnnW

కారు...జాంబీలు..పోరు
రేసింగ్‌ ఆటలు అంటే మీకు ఇష్టమా... జాంబీలను హతమార్చే గేమ్స్‌ ఆడటమంటే మీకు ఆసక్తి ఉందా? ఈ రెండు రకాల ఆటలు ఒకే గేమ్‌లో ఉంటే బాగుంటుంది కదా! అయితే Zombie Derby 2 గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. రకరకాల కార్లతో రేసింగ్‌ ఆడుతూనే, మనుషుల రక్తం తాగే జాంబీలను హతమార్చి విజేతగా నిలవొచ్చు. ఈ ఆటలో ఏడు రకాల కార్లుంటాయి. ప్రతి లెవల్‌లో నేర్పుతో కార్లను నడుపుతూ నిర్ణీత సమయంలో గమ్య స్థానానికి చేరుకోవాలి. మధ్యలో జాంబీల నుంచి ప్రతిబంధకాలు ఎదురవుతుంటాయి. దీంతోపాటు దారిలో పెద్ద పెద్ద బస్సులు, లారీలు, బాంబుల డబ్బాలు, నీటి కుంటలు అడ్డుగా ఉంటాయి. వాటిని ఒడుపుగా దాటుకుంటూ ముందుకెళ్లాలి. ఇలా కారు నడపడానికి మీరు సిద్ధమైతే ఈ లింక్‌లో https://goo.gl/QU3br5 ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. కారులో దూసుకెళ్తూ జాంబీల భరతం పట్టండి.

జీపీఎస్‌ లేకుండానే...
చిరునామా వెతకడం, అవసరమైన ప్రదేశానికి దారి కనుక్కోవడం... ఇలా దేనికైనా గూగుల్‌ మ్యాప్స్‌ లాంటి ఆప్సే ఆధారం. ఆ మ్యాప్స్‌కి జీపీఎస్‌ ఆధారం. ఇప్పుడు జీపీఎస్‌ అవసరం లేకుండా కూడా మ్యాప్స్‌ను వాడొచ్చట. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికతతో జీపీఎస్‌ అవసరం లేకుండానే వై-ఫై, మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా మ్యాప్స్‌ ప్రభావవంతంగా వాడొచ్చట. ప్రస్తుతం ఉన్న జీపీఎస్‌ సాంకేతికతను పరిశీలిస్తే... అన్ని ప్రాంతాల్లో సరైన సిగ్నల్స్‌ ఉండటం లేదు. దీంతోపాటు జీపీఎస్‌ను హ్యాక్‌ చేసే అవకాశమూ ఉందంటున్నారు నిపుణులు. దీంతో వై-ఫై, మొబైల్‌ డేటా ఆధారంగా ప్రత్యేక సాంకేతికతను సిద్ధం చేస్తున్నారు. మన పరిసరాల్లో ఉండే మొబైల్‌, రేడియో, టీవీ, వై-ఫై, మొబైల్‌ డేటా, శాటిలైట్‌ సిగ్నల్స్‌ ద్వారా నేవిగేట్‌ అయ్యేలా సాంకేతికతను రూపొందిస్తున్నారు. దీన్ని ‘సిగ్నల్స్‌ ఆఫ్‌ ఆపర్చునిటీ’ (ఎస్‌వోపీ) అని పేరు పెట్టారు. జీపీఎస్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించారు కూడా. డ్రైవర్‌ లేని కార్లు, డ్రోన్లలో ఈ ప్రయోగం జరిగిందట.

ఇక్కడ ఉంటూ అక్కడిలా
ఏదో సమాచారం కోసం అంతర్జాలంలో వెతుకుతుంటే... అడ్డంకులు ఎదురవుతున్నాయా? ఈ వెబ్‌సైట్‌ను యాక్సెస్‌ చేయలేరని చూపిస్తోందా? అయితే ఒపెరా బ్రౌజర్‌లోకి వెళ్లిపోండి. అక్కడ ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునే చిట్కా ఉంది. గత కొంతకాలంగా మొబైల్‌ బ్రౌజర్లలో మాత్రమే వాడుకోదగ్గ VPN సౌకర్యం ఇప్పుడు డెస్క్‌టాప్‌ ఒపెరా బ్రౌజర్‌లోనూ వచ్చేసింది. దీని కోసం ఒపెరా బ్రౌజర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత దాని సెట్టింగ్స్‌లో ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ VPN అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకుంటే సరి. సెర్చ్‌బార్‌లో సమాచారం వెతుకుతున్నప్పుడు దాని ఎడమవైపు నీలం రంగులో VPN అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే దిగువన వర్చువల్‌ లొకేషన్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, అమెరికా దేశాల పేర్లతో ఓ డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. వాటిలో ఒకటి ఎంచుకొని సమాచారం కోసం సెర్చ్‌ చేస్తే వచ్చే ఫలితాలు మారుతాయి. మీరు వీపీఎన్‌లో ఎంచుకున్న దేశంలో సెర్చ్‌ చేస్తే వచ్చే ఫలితాలు మీకు కనిపిస్తాయి.

లైట్‌ హౌస్‌ను వెలిగిస్తారా?
సముద్రపు ఒడ్డులో లైట్‌ హౌస్‌ను చూసినప్పుడల్లా... అది ఎక్కితే బాగుండు అనిపిస్తుంది! ఇంకొందరికి అందులో లైట్‌ ఎలా వెలుగుతుంది... దాన్ని ఆన్‌ చేసే అవకాశం నాకొస్తే బాగుండు అనిపిస్తుంది? మీకూ అలాంటి ఆలోచనే వచ్చిందా? ఇప్పటికిప్పుడు బీచ్‌ ఒడ్డులోని లైట్‌హౌస్‌ బల్బుని వెలిగించే అవకాశం రావడం కుదరకపోవచ్చు కానీ, మీ ఫోన్‌లో Light House గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే కావల్సినన్నిసార్లు లైట్‌హౌస్‌లోని లైట్‌ను వెలిగించొచ్చు. ఆప్‌ ఓపెన్‌ చేయగానే తొమ్మిది ప్యాక్స్‌ కనిస్తాయి. ఒక్కో ప్యాక్‌లో ఆరు రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌లో ఓ చివర బల్బు, మరో చివర లైట్‌హౌస్‌ ఉంటాయి. బల్బును టచ్‌ చేస్తే దాని నుంచి విద్యుత్తు శక్తి బయటకు వస్తుంది. అలా వచ్చిన విద్యుచ్ఛక్తిని నేర్పుగా లైట్‌ హౌస్‌ దగ్గరకు పంపించాలి. మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురవుతుంటాయి. దారిలో ఉండే కటకాలతో వాటిని అధిగమించి లైట్‌హౌస్‌కు విద్యుచ్ఛక్తి అందేలా చేయాలి. స్టేజీలు మారేకొద్దీ ఆటంకాలు ఎక్కువవుతాయి. నేర్పుగా కటకాలు అమర్చి విద్యుత్తును ఆదా చేసుకుంటూ లైట్‌హౌస్‌ను వెలిగించాలి. https://goo.gl/Vglm8q

సల్మాన్‌తో కలసి...
చుల్‌బుల్‌ పాండే, టైగర్‌, ప్రేమ్‌... బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఫేమస్‌ అవతారాలివి. ఈ క్యారక్టర్లలో సల్మాన్‌ ఖాన్‌ బాక్సాఫీస్‌ దగ్గర అదరగొట్టేశాడు. ‘దబాంగ్‌’లో చుల్‌బుల్‌పాండేగా అక్రమార్కుల భరతం పడితే, ‘ఏక్‌ థా టైగర్‌’లో ‘రా’ ఏజెంట్‌గా దుమ్ము రేపాడు... ప్రేమ్‌గా చాలా సినిమాల్లో రౌడీలను ఉతికి ఆరేశాడు. ఇప్పుడు ఆ ముగ్గురూ మీ స్నేహితులు అవ్వబోతున్నారు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్‌లో Being SalMan గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. ఈ గేమ్‌ ఓపెన్‌ చేయగానే ముంబయి మహానగరంలో చుల్‌బుల్‌పాండే, టైగర్‌.. మీ కోసం సిద్ధంగా ఉంటారు. వారిలో ఒకరిని ఎంచుకొని ఆట ప్రారంభించాలి. మీరు ఎంచుకున్న సల్మాన్‌ క్యారెక్టర్‌ను బట్టి ఆట తీరు ఉంటుంది. సల్మాన్‌ క్యారెక్టర్‌ వాడే ఆయుధాలు, చేసే ఫీట్లు కూడా మారుతుంటాయి. మీరు టైగర్‌ క్యారెక్టర్‌ను ఎంచుకుంటే కారు దిగి నడుచుకుంటూ వెళ్లే వ్యక్తిని పట్టుకో అనే తొలి టాస్క్‌ వస్తుంది. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే మరో టాస్క్‌ వస్తుంది. అలా ముంబయి చాప్టర్‌ పూర్తి చేయగానే జైసల్మేర్‌ చాప్టర్‌ అన్‌లాక్‌ అవుతుంది. దాన్ని పూర్తి చేస్తే మరొకటి ఓపెన్‌ అవుతాయి. ఒక్కో టాస్క్‌ పూర్తి చేస్తే మీకు కొన్ని బంగారు నాణేలు వస్తాయి. వాటి సాయంతో సల్మాన్‌ క్యారెక్టర్‌కు కావాల్సిన దుస్తులు, గన్‌లు, బుల్లెట్లు... లాంటివి కొనుక్కో వచ్చు. దీంతో పాటు ‘ప్రేమ్‌’ క్యారెక్టర్‌ను కొనుగోలు చేయొచ్చు. వీటితోపాటు డైలీ ఛాలెంజ్‌ ద్వారా కూడా మరికొన్ని బంగారు నాణేలు సంపాదించొచ్చు. ప్రతి టాస్క్‌ తర్వాత సల్మాన్‌ క్యారెక్టర్‌ చేసే డ్యాన్స్‌, పలికే మాటలు అసలు సల్మాన్‌ ఖాన్‌ను గుర్తు చేస్తాయి. మీరూ ఈ ఆటలో మజా పొందాలంటే ఈలింక్‌లో (https://goo.gl/qMjPvX) గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

సింధులా ఆడేయండి
స్మాష్‌, స్ట్రోక్‌, క్యారీ, యాలీ, క్లియర్‌... ఇదేంటి అన్నీ బ్యాడ్మింటన్‌కు సంబంధించిన పదాలే చెబుతున్నాం అనుకుంటున్నారా? రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం గెలుచుకున్నాక బ్యాడ్మింటన్‌ మీద అందరికీ ఆసక్తి పెరిగింది. మీకూ అలాంటి ఆసక్తే ఉందా? బ్యాడ్మింటన్‌ కోర్ట్‌కి వెళ్లి ఆ ఆట ఆడటం పక్కనపెడితే... ముందు మీ మొబైల్‌ని బ్యాడ్మింటన్‌ కోర్టుగా మార్చేయండి. Badminton గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఎంచక్కా మీ వేళ్లతో బ్యాడ్మింటన్‌ ఆడేయండి. ఈ గేమ్‌ ఆన్‌ చేయగానే ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్న పది అవతార్‌లు (బొమ్మలు) కనిపిస్తాయి. ఒక్కో అవతార్‌తో ఆట ఆడుకుంటూ కొత్త అవతార్‌లను అన్‌లాక్‌ చేయాలి. ఒక్కో గేమ్‌లో మూడు సెట్‌లు ఉంటాయి. మీ ప్రతిభతో ఎదుటి ఆటగాళ్లను బోల్తా కొట్టించి సెట్లు గెలవాలి. ఇందులో స్కిల్‌ అనే ట్యాబ్‌ ఉంటుంది. దాన్ని ఒత్తితే మీరు రాకెట్‌తో కొట్టే స్ట్రోక్‌ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎంత శక్తిమంతంగా ఆడితే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. దీంతోపాటు ఇందులో టాస్క్‌లుంటాయి. వాటిని పూర్తి చేస్తే గిఫ్ట్‌ కాయిన్స్‌ వస్తాయి. వాటి సాయంతో మీ ప్లేయర్‌కు కావాల్సిన రాకెట్‌, షూస్‌, డ్రెస్‌ లాంటివి కొనుక్కోవచ్చు.
* http://goo.gl/zcEZV3

 

 

 

 

సాహసాల శునకం
రోజంతా వూళ్లొ తిరిగి నిద్రపోదామని తన గూడులోకి వచ్చింది ఓ శునకం. అలా నిద్రలోకి జారుకుంటుంటే ఓ కోడి వచ్చి నిద్రలేపింది. తన స్నేహితులు ఆపదలో ఉన్నారని వాళ్లను రక్షించడం తనవల్ల కావడం లేదని వాపోయింది. దీంతో స్నేహితురాలి కోసం ఆ శునకం వాయువేగంతో బయలుదేరింది. అయితే సాహసాలు చేయడం శునకాలకు అంత సులభం కాదు కదా. అందుకే అడ్డంకుల దగ్గర ఆగిపోయింది. మీరు ఆ శునకానికి సాయపడాలంటే ‘మింపి డ్రీమ్స్‌’ ఆటను డౌన్‌లోడ్‌ చేసుకోండి. మంచి ఆలోచనతో బయలుదేరిన శునకానికి సాయపడి కోడి స్నేహితుల్ని కాపాడండి. ఈ ఆటలో వచ్చే అడ్డంకులు దాటుకుంటూ, పజిల్స్‌ చేధించుకుంటూ ముందుకెళ్లాలి. అలా ఎన్ని ఎక్కువ స్టేజీలు దాటితే అంతమంది స్నేహితుల్ని కాపాడొచ్చు. మధ్యలో సూచనలు, సలహాలు ఇవ్వడానికి కొందరుంటారులెండి. ఆప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ శునకాన్ని మీకు కావాల్సినట్లు అలంకరించుకోవచ్చు కూడా.
* http://goo.gl/zdzsCj

తప్పించుకోండి చూద్దాం
మీరో గదిలో చిక్కుకుపోయారు. బయటకు వెళ్లడానికి ఉన్న ఒక్క దారీ మూసేసి ఉంది. మరి తప్పించుకునేదెలా? మీకో క్లూ ఏంటంటే ఆ గది తలుపు తాళం చెవి ఆ గదిలోనే ఉంటుంది. దాన్ని వెతికి పట్టుకొని బయటకు వెళ్లొచ్చు. ఆసక్తికరంగా ఉంది కదా? You must escape అనే గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొండి. ఈ గమ్మత్తెన ఆట ఆడేయండి. గేమ్‌ ఓపెన్‌ చేయగానే ఓ గది కనిపిస్తుంది. అందులో టీవీ, ఫ్రిజ్‌, ల్యాప్‌టాప్‌, బెడ్‌ లాంటి వస్తువులు కనిపిస్తాయి. తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోవడానికి అవి క్లూస్‌గా పనికొస్తాయి. అలా ఒక్కో క్లూను పట్టుకుంటూ ఆ గది తాళం చెవి ఎక్కడుందో కనుక్కోవాలి. అలా దొరికిన తాళం చెవితో గది తలుపు తెరిస్తే మరో గదిలోకి వెళతారు. అలా ఒక్కో గదిలో తాళం చెవిని వెతుక్కుంటూ వెళ్తే ఆఖరి గది వస్తుంది.
* https://goo.gl/YN7FJq

దొంగ పిల్లిని పట్టుకోండి
టాకింగ్‌ టామ్‌తో మాట్లాడించి నవ్వుకున్నారు. దానికి భోజనం పెట్టి సరదా పడ్డారు. మీతోపాటు దాన్ని నిద్రపుచ్చారు! ఎప్పుడూ అదే పని చేసి బోర్‌ కొట్టిందా? ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనిపిస్తోందా? టామ్‌కు కూడా అదే అనిపించినట్లుంది అందుకే దొంగల్ని పట్టుకునే పనిలో పడింది. ‘టాకింగ్‌ టామ్‌ గోల్డ్‌ రన్‌’ గేమ్‌లో బ్యాంకును లూటీ చేసి పారిపోతున్న ఓ దొంగ పిల్లిని పట్టుకోవడానికి సిద్ధమైంది. ఆ దొంగ పిల్లిని మీ టామ్‌తో కలిసి పట్టుకోవాలంటే ఈ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొండి. మీ టామ్‌ను వేగంగా, నేర్పుగా పరిగెత్తిస్తూ దొంగ పిల్లిని పట్టేయండి. ‘సబ్‌వే సర్ఫర్స్‌’లా సాగే ఈ ఆటలో ఎనిమిది స్టేజ్‌లు ఉంటాయి. ఒక్కో స్టేజీలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తే కొత్త స్టేజ్‌ ఓపెన్‌ అవుతుంది. టామ్‌కు అధునాతన ఇల్లు నిర్మించడం, స్విమ్మింగ్‌పూల్‌ సిద్ధం చేయడం లాంటివి మీ లక్ష్యాలు. ఈ లింక్‌లో https://goo.gl/DC17He కొత్త టామ్‌ను మొబైల్‌లోకి దిగుమతి చేసుకొండి!

మార్చండి... పెయింట్లుగా
కుటుంబంతో విహార యాత్రకు వెళ్లారు. అక్కడి అందాలను మీ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో బంధించి... ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తున్నారు. మీ పోస్టులకు లైకులే లైకులు. అయితే అన్నీ అలాంటి సాధారణమైన ఫొటోలేనా? కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే బాగుండు అనిపిస్తోందా? అయితే ఈసారి మీ ఫొటోలను ఆర్ట్‌ పెయింట్లుగా మార్చేయండి. దీని కోసం Prisma అనే కొత్త ఆప్‌ వచ్చింది. గతంలో ఈ తరహా ఆప్‌లు కొన్ని వచ్చినా అవి అంత ప్రభావవంతంగా పని చేయలేదు. Prisma మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ ఆప్‌ ప్రస్తుతం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లు దీన్ని ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

భలే భారీ పవర్‌ బ్యాంక్‌
ఓ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌... ఇంకో చేతిలో పవర్‌ బ్యాంక్‌. ఇదీ చాలామంది పరిస్థితి. మీరు కూడా అలాంటివాళ్లే అయితే ఈ భారీ పవర్‌ బ్యాంక్‌ వివరాలు తెలుసుకోండి. CanX అనే ఈ పవర్‌ బ్యాంక్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌ను పదిసార్లు ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని బ్యాటరీ సామర్థ్యం 23,000 ఎంఏహెచ్‌. దీనిలో మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్నాయి. దీనికి మూడు ఛార్జింగ్‌ పోర్ట్‌లుంటాయి. అందులో ఒకటి టైప్‌ సి యూఎస్‌బీ పోర్ట్‌, మరొకటి సాధారణ యూఎస్‌బీ పోర్ట్‌. వీటితోపాటు 110 వాల్ట్‌ల విద్యుత్తును అందించే వాల్‌ పోర్ట్‌ కూడా ఉంది. దీని ద్వారా ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, ట్రిమ్మర్‌, హెయిర్‌ డ్రయర్‌ లాంటివాటిని ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ పవర్‌ బ్యాంక్‌తో ల్యాప్‌టాప్‌లను రెండుసార్లు ఛార్జ్‌ చేసుకోవచ్చట. అదే ట్యాబ్‌ల విషయానికొస్తే నాలుగుసార్లు ఛార్జ్‌ చేసుకోవచ్చు. మరి ఆ పవర్‌బ్యాంకును ఛార్జ్‌ చేయడానికి ఎంత టైమ్‌ పడుతుంది అంటారా... కేవలం రెండు గంటలే. అవును రెండే గంటల్లో పవర్‌ బ్యాంక్‌ను ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. బరువు తక్కువగా ఉండటం దీని మరో ప్రత్యేకత. మరిన్ని వివరాలకు: https://goo.gl/Z4FqfH

ఆట మారియో కొత్తగా వచ్చేశాడు
ఒక బుల్లి యువరాజు... యువరాణిని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఎత్తయిన స్తంభాలు, ఇటుకల గోడలు అడ్డు వస్తుంటాయి. మరుగుజ్జు దెయ్యాలు, మాయదారి తాబేళ్లు, గాల్లో ఎగురుతూ నిప్పులు చెరిగే జంతువులు అడ్డం పడుతుంటాయి. అలా అలా లెవల్స్‌ దాటుకుంటూ వెళ్లి రాక్షసుడిని చంపి యువరాణిని దక్కించుకుంటాడు ఆ యువరాజు. ఈ ఆటేంటో గుర్తొచ్చేసిందా... ఆ అదే మారియో. టీవీలకు ప్లేస్టేషన్లు జోడించి ఆడుకునే తొలినాళ్లలో బాగా ప్రాచుర్యం పొందిన ఆట ఇది. దీన్ని స్ఫూర్తిగా మొబైల్‌లో కొన్ని గేమ్‌లు వచ్చాయి. అలాంటిదే ఈ Super Bros World . ఇది అసలు సిసలు మారియో ఆడుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో మొత్తం 80 లెవల్స్‌ ఉంటాయి. ఒక్కో లెవల్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తూ ముందుకెళ్లాలి. ప్రతి లెవల్‌కు కొత్త రకం అడ్డంకులు వస్తుంటాయి. వాటి నుంచి ఎంత నేర్పుగా తప్పించుకుంటే అంత తర్వగా విజేత కావొచ్చు. ఈ లింక్‌లో (https://goo.gl/1FFyih) లో గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని... మీ మొబైల్‌లోకి మారియోను తీసుకురండి.

టకటకా చెప్పండి
ఎప్పుడూ కార్‌ రేసింగ్‌లు... రైలు మీద పరుగులేనా... సరదాగా ఓ క్విజ్‌ పోటీ ఆడండి. సరదాకి సరదా... విజ్ఞానానికి విజ్ఞానం. Donkeyquiz గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో అడిగే ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పండి... విజేతగా నిలవండి. ఈ గేమ్‌ ఆడుతుంటే మీకు చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ గేమ్‌లో అడిగే ప్రశ్నలకు మీరొక్కరే సమాధానాలు చెప్పరు. ఆన్‌లైన్‌లో నలుగురితో కలసి మీరు ఈ గేమ్‌ ఆడుతుంటారు. ఐదుగురిలో ఎవరు ముందు సమాధానం చెబితే వాళ్లకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఒక్కో టెస్ట్‌లో మొత్తం 12 ప్రశ్నలుంటాయి. ఎవరు ఎక్కువ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెబుతారో వారు గెలిచినట్లు. ఏయే విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు అడగాలనే విషయాన్నీ మీరే ఎంచుకోవచ్చు.
* https://goo.gl/dfjQbY

కూ... చుకు చుకు!
చెన్నై నుంచి బెంగళూరుకి రైలు నడపాలని ఉందా? అయితే Indian Train Simulator గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఎంచక్కా మీరే డ్రైవర్‌ అయిపోవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఆటలు వచ్చినా ఆ రైలు రూపం, అందులోని ప్రదేశాలు విదేశాలకు చెందినవిగా ఉండేవి. ఈ ఆట మాత్రం పూర్తిగా భారతీయ నగరాల పేర్లతో రూపొందింది. ఇందులో మీకు నచ్చిన రైలును ఎంచుకొని దాన్ని మీరు చెన్నై నుంచి బెంగళూరు మధ్య నడపొచ్చు. మధ్యలో వచ్చే స్టేషన్లలో రైలు ఆపి... ప్రయాణీకులను ఎక్కించుకొని సమయానికి గమ్యం చేరుకోవడమే మీ పని. ఎంత స్పీడులో రైలు నడపాలి... ఎక్కడ నిలపాలి అనే సూచనలు పాటిస్తూ నిర్ణీత సమయంలో మీరు గమ్యం చేరుకోవాలి. ఇందులో మీకు నచ్చిన రైలే కాదు, దాని బోగీలు, వాతావరణం లాంటి విషయాలను మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు మీకు రాత్రి సమయంలో జోరున వర్షం కురుస్తుండగా రైలు నడపాలనుకుంటే ఆప్షన్లలో ఎంచుకుంటే సరి. ఆ వాతావరణానికి తగ్గట్టే నేపథ్యంలో ఉరుములు, మెరుపులు, వర్షం శబ్దాలు వస్తుంటాయి. ఈ ఆటేంటో చూద్దామనుకుంటే... https://goo.gl/68cwIm లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

జేబులో కీబోర్డ్‌
ఫోన్‌ల మాదిరిగానే క్వర్టీ కీబోర్డ్‌లు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. తక్కువ బరువుతో నాజూకుగా తయారై జేబులోనే ఒదిగిపోతూ అలరిస్తున్నాయి. కావాలంటే Wekey Pocket కీబోర్డ్‌ని చూడండి. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువున్న పల్చటి క్వర్టీ కీబోర్డ్‌ట! దీని మందం ఎంతో తెలుసా? 6 మిల్లీమీటర్లు. బరువు 95 గ్రాములు. చిత్రంలో మాదిరిగా చొక్కా జేబులోనూ పట్టేస్తుంది. జేబులో మడిచి పెట్టుకునే కీబోర్డ్‌ని వాడేటప్పుడు తెరిస్తే కర్వీ కీబోర్డ్‌లా మారిపోతుంది. ఫోన్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్‌... వాడేది ఏదైనా వైర్‌లెస్‌ పద్ధతిలో బ్లూటూత్‌తో కీబోర్డ్‌ని కనెక్ట్‌ చేసి టైపింగ్‌ చేయవచ్చు. కీబోర్డ్‌ని ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే రెండు నెలల పాటు పని చేస్తుందట. Li Po 200mAh బ్యాటరీని వాడారు. నీళ్లు, కాఫీ ద్రవ పదార్థాలు కీబోర్డ్‌పై పడినా సరే పాడవకుండా వాటర్‌ ప్రూఫ్‌ రక్షణ ఉంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌ ఓఎస్‌లను సపోర్ట్‌ చేస్తుంది. మైక్రో యూఎస్‌బీ కనెక్టర్‌తో ఛార్జ్‌ చేయవచ్చు.
వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/GSZfJF

రాంబోలా దూసుకెళ్లడమే!
హాలీవుడ్‌ సినిమాలో రాంబోలా గెటప్‌... చేతిలో బోల్డన్ని మెషీన్‌ గన్‌లు... పడవపై ప్రయాణం... మరోవైపు పేరాషూట్‌లు, హెలీకాప్టర్‌లతో గాల్లో చుట్టూ శత్రువుల దాడులు... వారిని కాల్చి బూడిద చేస్తూ ముందుకు సాగాలి. అదే Ramboat వీడియో గేమ్‌. ఈ సాహస యాత్రలో రాంబో ఎవరో తెలుసా? ‘మాంబో’. ముందుగా ప్రయాణం మాంబోతోనే మొదలు. తర్వాత రోజ్‌, విన్సెంట్‌, ఆర్నాల్డ్‌ జత కలుస్తారు. తగిన స్కోర్‌ని సాధించి వీరిని అన్‌లాక్‌ చేయాలి. వీళ్లందరినీ శత్రు స్థావరం నుంచి బయటపడేలా చేయాలి. నీళ్లపై పడవని మెరుపు వేగంతో నడపడమే పెద్ద ఛాలెంజ్‌. ఎందుకంటే శత్రువులు గాల్లోనే కాదు. నీటి అడుగు నుంచి కూడా ఆయుధాల్ని ప్రయోగిస్తారు. పడవని గాల్లో ఎగిరేలా చేసి తప్పించుకోవాలి. పై నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌ల నుంచి తప్పించుకునేందుకు పడవని నీళ్లలోకి మునిగేలా చేయవచ్చు కూడా. పడవలో వెళ్తూ దార్లో ఎదురయ్యే పవర్‌ ప్యాక్‌లను సేకరిస్తూ గన్‌ల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు శత్రువుల్ని ఎదుర్కోగలరు. ఏడు భిన్నమైన స్టేజ్‌లను దాటుకుంటూ వెళ్లాలి. ఆట మొత్తంలో పలు రకాల పడవల్ని మార్చుకుంటూ ముందుకు సాగొచ్చు. శత్రువుల్ని మీరు ఎలా మట్టుబెట్టింది స్పష్టంగా చూసేందుకు ‘స్లో మోషన్‌’ ఆప్షన్‌ ఉంది. గేమ్‌ ఆడుతూ మీ ప్రదర్శనని సోషల్‌ వాల్స్‌పై షేర్‌ చేయవచ్చు కూడా. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో ఆటని తీర్చిదిద్దారు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/NMsMb8

వీడియో ప్రొఫైల్‌
ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ ఫొటోలు ఎన్ని సార్లని మారుస్తారు? ఇక ఆండ్రాయిడ్‌ యూజర్లు వీడియో ప్రొఫైల్‌ని క్రియేట్‌ చేయవచ్చు. ఎలాగంటే... మీరు మొబైల్‌లో ఫేస్‌బుక్‌ ఆప్‌ని యాక్సెస్‌ చేస్తున్నట్లయితే 7 సెకన్ల పాటు వీడియోని చిత్రీకరించి వీడియో ప్రొఫైల్‌గా సెట్‌ చేయవచ్చు. కావాలంటే ఎడిట్‌ ఫ్రొఫైల్‌లోకి వెళ్లండి. అక్కడ కనిపించే డ్రాప్‌డౌన్‌ మెనూ నుంచి Take a New Profile Video ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి 7 సెకన్ల పాటు వీడియోని చిత్రీకరించొచ్చు. ఒకవేళ గ్యాలరీ నుంచి వీడియోని సెలెక్ట్‌ చేసుకుందాం అనుకుంటే Select Profile Video ఆప్షన్‌ ఉంది. అంతేకాదు... ప్రొఫైల్‌ ఫొటో లేదా వీడియోని గంట, రోజు, వారం పాటు Make Temporary రూపంలో సెట్‌ చేసుకునే వీలుంది.

ప్లంబర్‌ పజిల్‌
అదో ఏడాది ప్రాంతం. చుక్క నీరు వెతికినా కనిపించదు. అలాంటి చోట కుండీలో చిన్న మొక్క. పువ్వు పూసి నీటి కోసం ఎదురు చూస్తుంటోంది. ఏడాదిలో నీళ్లెలా వస్తాయని ఆలోచిస్తున్నారా? మీరే తీసుకురావాలి. ఓ పైప్‌లైన్‌తో! ఇక్కడ మలుపు ఏంటంటే? ముక్కలుగా ఉన్న పైపులను సరైన పద్ధతిలో అమర్చాలి. వాటి అమరిక కోసం పైపు ముక్కలపై తాకాలి. ఇలా ఒక్కో దాన్ని తాకుతూ పైపు లైన్‌ని సరైన పద్ధతిలో అమర్చితే మొక్కకి నీళ్లు అందుతాయి. ఆటకి ‘టైమ్‌ లిమిట్‌’ లేదు. ఆలోచించి పైపు ముక్కల్ని కలపొచ్చు. లెవల్‌కి నిర్ణీత moves మాత్రమే ఉంటాయి. ఆలోచించకుండా పైపు ముక్కిల్ని తాకుతూ ప్రయత్నిస్తే మీరు ఫెయిల్‌ అయినట్టే! ప్లంబర్‌ పజిల్‌ గేమ్‌లో 200 ఉచిత లెవల్స్‌ ఉన్నాయి.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/4IUY5l

కనెక్ట్‌ చేయక్కర్లేదు
అందరం యూఎస్‌బీ డ్రైవ్‌లను వాడుతూనే ఉన్నాం. కానీ, మీరెప్పుడైనా పెన్‌డ్రైవ్‌ని వైర్‌లెస్‌ పద్ధతిలో సిస్టంకి అనుసంధానం చేశారా? ఫోన్‌లోని డేటాని యూఎస్‌బీ డ్రైవ్‌లోకి పంపగలిగారా? వైర్‌లెస్‌ పద్ధతిలో డ్రైవ్‌లోని వీడియోలను స్ట్రీమింగ్‌ చేసుకుని ట్యాబ్‌లో చూశారా? ఎలా సాధ్యం అంటారా? అయితే, మీకు సాన్‌డిస్క్‌ కొత్త మార్కెట్‌లోకి తెచ్చిన SanDisk Connect Wireless Stick గురించి తెలియదన్నమాట. చిత్రంలో కనిపించే దీన్ని వై-ఫై నెట్‌వర్క్‌తో పీసీ, ఫోన్‌, ట్యాబ్‌లకు అనుసంధానం చేసి వాడుకోవచ్చు. అంటే... జేబులో ఉన్న పెన్‌డ్రైవ్‌ని బయటికి తీయకుండానే డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. మీరు వంట గదిలో ఉన్నా... హాల్లోని టేబుల్‌పై ఉన్న ఫ్లాష్‌డ్రైవ్‌ని ఇట్టే ఫోన్‌లో యాక్సెస్‌ చేయవచ్చు. ‘సాన్‌డిస్క్‌ కనెక్ట్‌ ఆప్‌’ని ఇన్‌స్టాల్‌ చేసుకుని డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడమే కాకుండా వీడియో, మ్యూజిక్‌ ఫైల్స్‌ని ప్లే చేయవచ్చు కూడా. ఫ్లాష్‌ డ్రైవ్‌లోని డేటాని ఒకేసారి మూడు పరికరాలకు షేర్‌ చేయవచ్చు. ఫొటోలు, వీడియోలను ఆటోమాటిక్‌గా డ్రైవ్‌లోకి బ్యాక్‌అప్‌ చేయవచ్చు. ప్లాష్‌ డ్రైవ్‌ మెమొరీ సామర్థ్యాలు వరుసగా 16, 32, 64, 128, 200 జీబీ. ఇతర వివరాలకు https://goo.gl/MRKe1a

తాకేతెరలా...
విండోస్‌ డెస్క్‌లాప్‌ని ఐప్యాడ్‌ లేదా మ్యాక్‌ తెరలా మార్చేసి అప్లికేషన్స్‌ని రన్‌ చేయాలంటే? అందుకో స్మార్ట్‌ అప్లికేషన్‌ లాంచర్‌ సిద్ధంగా ఉంది. పేరు PaperPlane. ఇన్‌స్టాల్‌ చేసి అప్లికేషన్‌ని రన్‌ చేయగానే డెస్క్‌టాప్‌ మొత్తం వరుస క్రమంలో ఐకాన్లతో నిండిపోతుంది. తాకేతెరపై మునివేళ్లతో స్క్రోల్‌ చేసినట్టుగా మౌస్‌ పాయింటర్‌తో జరుపుతూ చూడొచ్చు. కావాల్సిన అప్లికేషన్‌పై క్లిక్‌ చేస్తే రన్‌ అవుతుంది. ఒకవేళ లాంచర్‌లో మీకు కావాల్సిన వాటిని జత చేయాలంటే? రైట్‌క్లిక్‌ చేసి Add చేయవచ్చు. సిస్టం అప్లికేషన్స్‌నే కాకుండా ఫైల్స్‌, ఫోల్డర్లను కూడా లాంచర్‌లో పెట్టుకోవచ్చు. అందుకు రైట్‌క్లిక్‌ చేసి యాడ్‌ మెనూలోని System, Folder, File ఆప్షన్స్‌ని సెలెక్ట్‌ చేయవచ్చు. లాంచర్‌లోని ఐకాన్ల అమరికను మీకు కావాల్సినట్టుగా మార్పులు చేయడానికి View మెనూ ఉంది. విండోస్‌ డెస్క్‌టాప్‌తో సింక్‌ చేసుకుని లాంచర్‌ని వాడదాం అనుకుంటే రైట్‌క్లిక్‌ చేసి Desk Mode ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. లాంచర్‌ నుంచి బయటికి వచ్చేందుకు రైట్‌క్లిక్‌ చేసి Exit చేయవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://goo.gl/MS47rd

ఐఫోన్‌లకే!
సరికొత్త యాపిల్‌ ఫోన్‌ అయినా... ఉండేది ఒక్కటే తాకేతెర. మరైతే, ఉన్న ఫోన్‌కి మరో తాకేతెరని జత చేస్తే? అదీ 5 అంగుళాల తాకేతెర. అదెలా సాధ్యం అంటారా? అయితే, మీరు ఐఫోన్‌ సిరీస్‌లకు ప్రత్యేకంగా తయారు చేసిన popSLATE 2 గురించి తెలుసుకోవాల్సిందే. ఫోన్‌కి అమర్చుకునే కేస్‌లా దీన్ని తీర్చిదిద్దారు. చిత్రంలో మాదిరిగా ఫోన్‌కి తగిలించాక వెనక భాగాన్ని E-INK తాకేతెరగా వాడుకోవచ్చు. నలుపు, తెలుపు రంగుల్ని మాత్రమే సపోర్ట్‌ చేసే ఈ తాకేతెరపై ఫోన్‌కి వచ్చే అన్ని అప్‌డేట్స్‌ని చూడొచ్చు. ఈ-బుక్స్‌ని చదివేందుకు ఈ-రీడర్‌ కొనక్కర్లేదు. పాప్‌స్లేట్‌నే ఈ-రీడర్‌లా మార్చేసి పుస్తకాలు చదువుకోవచ్చు. కేస్‌లో నిక్షిప్తం చేసిన బ్యాటరీతో ఫోన్‌ని ఛార్జ్‌ చేయవచ్చు కూడా. నాజూకుగా ఫోన్‌కి అంటిపట్టుకుని ఉండేలా కేస్‌ని రూపొందించారు. నిత్యం తెరపై రోజువారీ అప్‌డేట్స్‌ని (తేదీ, సమయం, వార్తలు, స్టాక్‌అప్‌డేట్స్‌...) పొందొచ్చు. అంతేనా... ఫోన్‌కి కనెక్ట్‌ అయ్యి ఇన్‌స్టాల్‌ చేసిన అప్స్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని కూడా పాప్‌స్లేట్‌లోనే చూడొచ్చు. కేస్‌లోని బ్యాటరీతో ఫోన్‌ని ఛార్జ్‌ చేసి 9 గంటల పాటు ఫోన్‌ మాట్లాడొచ్చు. పాప్‌స్లేట్‌లోనే ఫొటో గ్యాలరీలను యాక్సెస్‌ చేయవచ్చు. తెరపై మూడు నావిగేషన్‌ బటన్లను నిక్షిప్తం చేశారు.
ఇతర వివరాలు: https://goo.gl/yKBiQj

స్మార్ట్‌ హెడ్‌సెట్‌
ఇప్పటి వరకూ హెడ్‌సెట్‌లో వినడం మాత్రమే చేసుంటారు. కానీ, హెడ్‌సెట్‌లోనే వినాలనుకునే పాటల్ని డౌన్‌లోడ్‌ చేశారా? ఆప్స్‌ని రన్‌ చేశారా? హెడ్‌సెట్‌లో ఇవన్నీ ఎలా అనేగా? అయితే, అమెరికాకి చెందిన మూర్‌ తయారీ సంస్థ తయారు చేసిన ఈ హెడ్‌సెట్‌ని చూడండి. దీని పేరు Smart Listening Device (ఎస్‌ఎల్‌డీ). ప్రపంచంలోనే తొలిసారి అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ హెడ్‌సెట్‌ ఇదేనట. బిల్ట్‌ఇన్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. దీంతో కావాల్సిన మీడియా ఫైల్స్‌ని సరాసరి హెడ్‌సెట్‌లోకే డౌన్‌లోడ్‌ చేయవచ్చు. వై-ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లను హెడ్‌ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. డౌన్‌లోడ్‌ చేసిన ఎంపి3 ట్రాక్స్‌ని ఇంటర్నల్‌ మెమొరీలోనే స్టోర్‌ చేయవచ్చు. మీడియా ఫైల్స్‌ని స్టోర్‌ చేసేందుకు 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంది. ఇక ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేందుకు బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌ ఉంది. హెడ్‌ఫోన్‌లోని మీడియా ఫైల్స్‌ని మేనేజ్‌ చేసేందుకు చిత్రంలో మాదిరిగా ఒకవైపు బుల్లి తాకేతెరని ఏర్పాటు చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ను దాంట్లోనే యాక్సెస్‌ చేయవచ్చు. బిల్ట్‌ఇన్‌ హెల్త్‌ ట్రాకర్‌తో ఫిట్‌నెస్‌ని మెరుగుపరుచుకోవచ్చు. ఎక్స్‌టర్నల్‌ స్పీకర్‌తో పాటల్ని బయటికి వినిపిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు పాటలు వినొచ్చు. మరో విషయం... దీంట్లో బిల్ట్‌ఇన్‌ కెమెరా కూడా ఉందట. రేడియో స్టేషన్లను ట్యూన్‌ చేసి వినొచ్చు. వీడియో, ఇతర వివరాలకు: https://goo.gl/wKIlao

సెల్ఫీతో చెల్లింపులు
ఆన్‌లైన్‌ అంగళ్లలో షాపింగ్‌ కొత్తేం కాదు. కొన్న వాటికి బ్యాంకింగ్‌ సైట్‌లు, ఆన్‌లైన్‌ వాలెట్‌ల నుంచి డబ్బు చెల్లిస్తుంటారు. ఏ లావాదేవీకైనా లాగిన్‌ తాళాల్ని ప్రతిసారీ టైప్‌ చేయాల్సిందే. కొన్ని సార్లు పాస్‌వర్డ్‌లు గుర్తుండవు కూడా. ఇంకొన్ని సార్లు చుట్టూ ఉన్న వారు చూస్తున్నారేమోనని కంగారు పడతాం. అందుకే ఆన్‌లైన్‌ చెల్లింపుల్ని చేసేందుకు లాగిన్‌ తాళాలకు బదులుగా సెల్ఫీ లేదా వీడియోని చిత్రిస్తే చాలు. Facial Recognition టెక్నాలజీతో మిమ్మల్ని గుర్తించి చిటికెలో చెల్లింపు ప్రక్రియ ముగుస్తుందట. ఈ తరహా చెల్లింపు విధానాన్ని ముందుగా అమెజాన్‌ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుందట. ఇదే పద్ధతి అందుబాటులోకి వస్తే ఆన్‌లైన్‌ చెల్లింపులు మరింత సురక్షితం అవుతాయి. వాడుతున్న పాస్‌వర్డ్‌ హ్యాకర్ల చేతికి చిక్కుతుందేమోననే భయం కూడా అక్కర్లేదు. ఏమంటారు?

మరో స్మార్ట్‌వాచ్‌
మార్కెట్‌లో ఫోన్‌లే కాదు. స్మార్ట్‌వాచ్‌లూ తెగ సందడి చేస్తున్నాయి. కావాలంటే Fitbit Blaze స్మార్ట్‌వాచ్‌ని చూడండి. ట్రెండీగా తీర్చిదిద్దిన ఈ వాచ్‌ మణికట్టుపై మాయలు చేస్తుంది. PurePulse Heart Rate సౌకర్యంతో నిత్యం గుండె లయని ట్రాక్‌ చేసి అందిస్తుంది. జీపీఎస్‌కి కనెక్ట్‌ అయ్యి ఎటు వెళ్లాలో దారి చూపిస్తుంది. అంతేకాదు.. ఎంత దూరం పరిగెత్తారు? ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యాయో ఎప్పటికప్పుడు చెబుతుంది. ఎక్కిన మెట్లనూ లెక్కిస్తుంది. On-Screen Workouts With FitStar సౌకర్యంతో వాచ్‌ ప్రత్యేక కోచ్‌లా మారి వ్యాయామ పద్ధతుల్ని చెబుతుంది. శ్రద్ధగా మీరు చేసే వర్క్‌అవుట్స్‌ని లెక్కిస్తుంది. ఆటోమాటిక్‌గా రోజూ మీరు ఎంత సమయం నిద్రిస్తున్నారో ట్రాక్‌ చేస్తుంది. రోజంతా ట్రాక్‌ చేసిన వాటని All-Day Activity రూపంలో రివ్యూ చేసి అందిస్తుంది. వాచ్‌లోనే అలారం సెట్‌ చేసుకుంటే ‘సైలెంట్‌ వైబ్రేషన్‌’తో మిమ్మల్ని నిద్ర లేపుతుంది. స్మార్ట్‌ఫోన్‌తో జతకట్టి వాచ్‌లోనే ఫోన్‌కాల్స్‌, టెక్స్ట్‌ మెసేజ్‌లు, క్యాలెండర్‌ ఎలర్ట్‌లను నోటిఫికేషన్స్‌ రూపంలో తెరపై డిస్‌ప్లే చేస్తుంది. ఫోన్‌లో పాటలు వింటున్నట్లయితే వాచ్‌ని మ్యూజిక్‌ కంట్రోల్‌గా మార్చుకుని కావాల్సిన పాటని ప్లే చేయవచ్చు. సౌండ్‌ పెంచొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేసిన వాచ్‌ని 5 రోజుల పాటు వాడుకోవచ్చు.ధర సుమారు రూ.20,000. ప్రస్తుతం అమెజాన్‌ ఆన్‌లైన్‌ అంగడి నుంచి కొనుగోలు చేయవచ్చు. వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/5dwc6a

హిమాలయాల్లో...
చోటా భీమ్‌తో కాసేపు హిమాలయాల్లో సాహసాలు చేసొద్దాం అనుకుంటే Chhota Bheem Himalayan Game గేమ్‌ ఆడాల్సిందే. స్కేటింగ్‌తో ఆట మొదలవుతుంది. చోటా భీమ్‌కి మీరు చేసే సాయం ఏంటో తెలుసా? దారి పొడవునా ఎదురయ్యే ప్రమాదాల నుంచి తప్పించాలి... పవర్‌ ప్యాక్స్‌ని అందుకుంటూ మెరుపు వేగంతో ముందుకెళ్లేలా చేయాలి. దారి పొడవునా ఎదురయ్యే జంతువులపై భీమ్‌ స్వారీ చేస్తాడు కూడా. అంతేనా... ఆటలోని మరో వింత ఏంటంటే... భీమ్‌ హిమాలయాల్లో ఆటో కూడా నడిపేస్తాడు. ఇలా చిత్రమైన విన్యాసాలు చేస్తూ కనిపించిన లడ్డూలను ఆరగిస్తూ ముందుకు సాగాలి. ఇంకా దారి పొడవునా చోటా భీమ్‌కి మిత్రుల పలకరింపులూ ఉంటాయి.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/HP7Tbm

చెక్కలు కాదు
చూస్తుంటే ఇవేవో చెక్క ముక్కల్లా ఉన్నాయేంటి? వీటిని గోడకి ఎందుకు ఇలా తగిలించాలి? అనే సందేహాలు వద్దు! ఎందుకంటే ఇవి సోలార్‌ లైట్‌లు. చిత్రంలో మాదిరిగా వీటిని గోడకి అమర్చుకుంటే సోలార్‌ పవర్‌ని స్వీకరించి సుమారు 4 గంటల పాటు వెలుగుతాయి. వీటిని ఆన్‌ చేయడానికి స్వీచ్‌లు అక్కర్లేదు తెలుసా? మీరు వస్తున్నారని గుర్తించి ఆటోమాటిక్‌గా వెలుగుతాయి. తిరిగి వెళ్లిపోగానే ఆఫ్‌ అవుతాయి. అందుకు బిల్ట్‌ఇన్‌ మోషన్‌ సెన్సర్లతో ప్రత్యేక సిస్టంని నిక్షిప్తం చేశారు. లైట్‌ని తాకుతూ వెలుతురుని కావాల్సినట్టుగా మార్చుకునే వీలుంది. గోడకి బిగించిన స్టాండ్‌కి లైట్‌ అయస్కాంత శక్తితో అతుక్కుంటుంది. దీంతో లైట్‌ని అవసరం మేరకు ఎప్పుడైనా స్టాండ్‌ నుంచి తీసుకుని వాడుకోవచ్చు. తిరిగి తగిలించొచ్చు. సూర్య కాంతిని గ్రహించి లైట్‌ ఛార్జ్‌ అయ్యేందుకు 7 నుంచి 10 గంటలు పడుతుంది. తర్వాత సుమారు 4 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతుంది. 15 అడుగుల దూరం వరకూ మోషన్‌ సెన్సర్లు పని చేస్తాయి.
వీడియో, ఇతర వివరాలకు: https://goo.gl/1CX4QW

మంచుపై సవారీ...
రేసింగ్‌ గేమ్‌ అంటే... రహదార్లూ... ట్రాఫిక్‌... ప్రమాదాలు... ఒక్కరే మెరుపు వేగంతో నడపాలి. ఇలా రోడ్లపై ఒక్కరే రైడ్‌కి వెళ్లడం బోర్‌ అనిపిస్తే Ski Safari2 గేమ్‌ ఆడేయండి.ఆటంతా మంచు కొండలపై స్కేటింగ్‌. గాల్లో గింగిరాలు తిరుగుతూ మెరుపు వేగంతో దూసుకెళ్లాలి. మీతో పాటు మార్గం మధ్యలో తారసపడే ధ్రువపు జంతువులు కూడా స్కేటింగ్‌లో మీకు సాయం చేస్తాయి. ఉదాహరణకు మంచు పర్వతాల్లో తిరిగే ఐస్‌మ్యాన్‌పై ఎక్కి స్కేటింగ్‌ చేయవచ్చు. బుజ్జి... బుజ్జి పెంగ్విన్‌లు కూడా మీకు తోడవుతాయి. ఉత్తినే స్కేటింగ్‌ చేస్తే ఏం మజా వస్తుంది? దార్లో కనిపించే నాణాల్ని తీసుకుంటూ వెళ్లాలి. ఎన్ని అందుకుంటే అంత స్కోర్‌. నాణాలు ఒక్కటే కాదు. పవర్‌ప్యాక్స్‌ని అందిపుచ్చుకుని అదనపు శక్తుల్ని పొందొచ్చు. మల్టీప్లేయర్‌ మోడ్‌లో స్నేహితులతో పోటీ పడొచ్చు. రికార్డ్‌ స్కోర్‌ సాధించి సవాల్‌ విసరొచ్చు. మూడు రకాల మంచు పర్వత ప్రాంతాల్లో స్కేటింగ్‌ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/46LqfX

క్రోమ్‌లో కొత్తగా...
సరదాగా ఏదైనా కథ రాయాలి అనుకుంటున్నారా? లేదా... మీరు క్లిక్‌ మనిపించిన ఫొటోలతో ఫొటో డైరీ రాయాలి అనుకుంటే... అందుకు తగిన ఆప్‌ ఒకటి ఉంది. ఆండ్రాయిడ్‌ ఆప్‌ ఏమో అనుకునేరు! అదేం కాదు. సిస్టంలో వాడుకునేందుకు అనువైన క్రోమ్‌ ఆప్‌. పేరు My Story Editor. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి ఆప్‌ని బ్రౌజర్‌లో పెట్టుకోవచ్చు. క్రోమ్‌కి జత చేయగానే క్రోమ్‌ ఆప్స్‌ జాబితాలోకి ‘మై స్టోరీ ఎడిటర్‌’ ఆప్‌ కూడా వెళ్లిపోతుంది. ఇక ఎప్పుడైనా వాడాలనుకుంటే డెస్క్‌టాప్‌ లేదా బ్రౌజర్‌లో కనిపించే క్రోమ్‌ ఆప్స్‌ని సెలెక్ట్‌ చేయాలి. ప్రత్యేక ఐకాన్‌ గుర్తుతో స్టోరీ ఎడిటర్‌ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే సిస్టంలోని అప్లికేషన్‌ మాదిరిగానే ప్రత్యేక విండోలో ఆప్‌ ఓపెన్‌ అవుతుంది. ఇంకేముందీ... మూడు పద్ధతుల్లో (TXT, Q&A, IMG) మీరు రాయాలనుకున్న కథల్ని సెట్‌అప్‌ చేయవచ్చు. ఒకవైపు టెక్స్ట్‌, మరోవైపు ఇమేజ్‌తో ఆకట్టుకునేలా ఫొటో డైరీలను రాసి సిస్టంలో సేవ్‌ చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసిన స్టోరీలను ఆప్‌లో కనిపించే డౌన్‌లోడ్‌ గుర్తుపై క్లిక్‌ చేసి జిప్‌ ఫార్మెట్‌లో సిస్టం లోకల్‌ హార్డ్‌డ్రైవ్‌ల్లో భద్రం చేసుకునే వీలుంది.
ఆప్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/wDGrhv

తెరపై ఏదైనా...
సిస్టం డెస్క్‌టాప్‌పై ఉన్న వాటిని సులువైన పద్ధతిలో స్క్రీన్‌షాట్స్‌ తీసుకునేందుకు Automatic ScreenShotter పోర్టబుల్‌ టూల్‌ సిద్ధంగా ఉంది. ఇన్‌స్టాల్‌ చేస్తే సిస్టం ట్రేలో ఒదిగిపోయి స్క్రీన్‌షాట్స్‌ని అందిస్తుంది. దీనికో ప్రత్యేకత ఉంది తెలుసా? అదేంటంటే... మీరు సెట్‌ చేసి పెట్టుకున్న నిర్ణీత సమయానికి ఆటోమాటిక్‌గా స్క్రీన్‌షాట్స్‌ తీసి ప్రత్యేక ఫోల్డర్‌లో భద్రం చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నిమిషానికోసారి తెరపై ఉన్న వాటిని స్క్రీన్‌ క్యాప్చర్‌ చేసి ఓ చోట భద్రం చేయాలనుకుంటే సిస్టం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి Capture Rate (1 minutes) సెట్‌ చేయాలి. తర్వాత అదే మెనూలోని Resume Capturing ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేస్తే చాలు. ఇక ఆటోమాటిక్‌గా ప్రతి నిమిషానికోసారి స్క్రీన్‌క్యాప్చర్‌ అయ్యి ప్రత్యేక ఫోల్డర్‌లో సేవ్‌ అవుతుంది. ఆయా స్క్రీన్‌షాట్స్‌ని చూద్దాం అనుకుంటే Launch Internal Screenshot Browser ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://goo.gl/OMSWC9

అన్నీ కలిపేయండి
పీసీపై పనంటే కచ్చితంగా పీడీఎఫ్‌ ఫైల్స్‌ని మేనేజ్‌ చేయాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకు ఏవైనా కొన్ని పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఒక్కటిగా కలిపేసి భద్రం చేయాలనుకుంటే? నెట్టింట్లో ఉన్న ఆన్‌లైన్‌ సర్వీసుల గురించో... ఉచిత టూల్స్‌ కోసమో వెతుకులాట మొదలుపెట్టక్కర్లేదు. వెంటనే PDF Combiner ఉచిత టూల్‌ని రన్‌ చేయండి చాలు. సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. జిప్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసిన ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయాలి. వచ్చిన exe ఫైల్‌ని రన్‌ చేసి పీడీఎఫ్‌లను మెర్జ్‌ చేసి ఒకే ఫైల్‌గా మార్చుకోవచ్చు. విడి పేజీలుగా ఉన్న పీడీఎఫ్‌ ఫైల్స్‌ని టూల్‌లోకి అప్‌లోడ్‌ చేసేందుకు Add files ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. ఒక్కసారి ఫైల్‌ని సెలెక్ట్‌ చేశాక వాటి వరుస క్రమాన్ని (Move up, Move down) కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అక్కర్లేని ఫైల్స్‌ని తొలగించేందుకు Remove file ఆప్షన్‌ ఉంది. ఫైల్స్‌ ఎంపిక ముగిశాక Combine PDFs ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసి అన్నింటినీ ఒకే ఫైల్‌గా మార్చేయవచ్చు. కన్వర్ట్‌ అయిన ఫైల్‌ని ఏదొక పేరుతో సేవ్‌ చేయాలి.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://goo.gl/wobGp5

బైక్‌పై రయ్‌... రయ్‌!!
ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడు బైక్‌ని వేగంగా నడపాల్సివస్తే! నిజ జీవితంలో అయితే ప్రమాదం. అందుకే వేగంగా వెళ్లకుండా ఆజా మరి, తాకేతెరపై గేమ్‌ అయితే? వెంటనే దూసుకెళ్లడమే. ఆకట్టుకునే హెచ్‌డీ గ్రాఫిక్స్‌తో గేమ్‌ని తీర్చిదిద్దారు. కావాలంటే Traffic Rider గేమ్‌ ఆడేయండి. ఆటలో మొత్తం 20 బైక్‌లను ఎంపిక చేసుకోవచ్చు. డీఫాల్ట్‌గా ఒక బైక్‌ కనేబుల్‌ అవుతుంది. మిగతా బైక్స్‌ని నడపాలంటే పాయింట్స్‌ని సంపాదించి అన్‌లాక్‌ చేయాలి. నిజమైన బైక్‌ నడుపుతున్నట్టుగానే శబ్దం వస్తుంది. స్టార్ట్‌ చేసిన వెంటనే మెరుపు వేగాన్ని అందుకుంటే అదనపు స్కోర్‌ వస్తుంది. నాలుగు రకాల మోడ్స్‌లో (Career, Endless, Time Trial, Free Mode) గేమ్‌ ఆడొచ్చు. కెరీర్‌ మోడ్‌లో 40 లెవల్స్‌ ఉంటాయి. బైక్‌ నడిపేటప్పుడు కెమెరా వ్యూని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. గేమ్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/Osf9UJ

మరో 13 భాషలు...
అంగుళాల తెరపై వెబ్‌ విహారాన్ని సులభతరం చేసిన ఒపేరా సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. 13 దేశీయ భాషల్ని సపోర్ట్‌ చేసేలా బ్రౌజర్‌ని అప్‌డేట్‌ చేశారు. దేశీయ భాషల్లో మన తెలుగు భాష కూడా ఉంది. ఇక మీదట మొబైల్‌ బ్రౌజింగ్‌ని ఒపేరాలో తెలుగులోనే చేయవచ్చన్నమాట. తెలుగుతో పాటు కన్నడ, అస్సామి, బెంగాలి, గుజరాతీ, మలయాళం, మరాఠి, ఒరియా, పంజాబి, తమిళం, ఉర్దూ, హిందీ భాషలు ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 99 భాషల్ని సపోర్ట్‌ చేస్తుందట. అంతేకాదు... బ్రౌజర్‌లోని మరో అప్‌డేట్‌ ఉంది తెలుసా? ‘క్యూఆర్‌ కోడ్‌’ని రీడ్‌ చేయాలన్నా... జనరేట్‌ చేయాలన్నా ఒపేరా బ్రౌజర్‌లోనే చిటికెలో చేయవచ్చట. ఉదాహరణకు ఏదైనా వెబ్‌ లింక్‌ని ఇతరులకు షేర్‌ చేయాల్సివస్తే ఇతర సర్వీసుల కోసం వెతక్కుండానే బ్రౌజర్‌లోనే లింక్‌కి క్యూఆర్‌ కోడ్‌ని జనరేట్‌ చేయవచ్చు!

తెలుగు పద్యాలు...
పిల్లలకు అచ్చ తెలుగులో పద్యాలు నేర్పిద్దాం అనుకుంటే? అందుకో ఆప్‌ ఉంది తెలుసా? పేరు కూడా Telugu Nursery Rhymes. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఫోన్‌ వాడుతున్నట్లయితే చిటికెలో ఇన్‌స్టాల్‌ చేసి పిల్లలకు చిట్టి పొట్టి పద్యాలు వినిపించొచ్చు. ‘భారత భూమికి జేజేలు... చిట్టి చిలకమ్మా... వచ్చే వచ్చే రైలు బండి... బావ బావ పన్నీరు...’ లాంటి మరిన్ని పద్యాల్ని ఒక్కొక్కటిగా సెలెక్ట్‌ చేస్తూ వినొచ్చు. మొత్తం 22 పద్యాలు ఉన్నాయి. ఆయా పద్యాలకు తగినట్టుగా బొమ్మలతో జాబితాని పొందుపరిచారు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/ lViXpM

యూట్యూబ్‌లో...
రోజులో ఎంతో కొంత సమయం యూట్యూబ్‌లో గడపాల్సిందే. నచ్చిన పాటలు, సీరియళ్లు, రియాలిటీ షోలు, వార్తలు... ఇలా ఏవేవో బ్రౌజ్‌ చేసి చూస్తుంటాం. మరి, మీరు యూట్యూబ్‌ వీడియోలు వీక్షించే సమయంలో వీడియో ప్లేయర్‌ని సులువుగా యాక్సెస్‌ చేసేందుకు షార్ట్‌కట్‌ మీటల్ని ఎప్పుడైనా ప్రయత్నించారా? ఉదాహరణకు ప్లే అవుతున్న వీడియోని ఆపేందుకు ప్లేయర్‌లోని Pause బటన్‌ని మౌస్‌ పాయింటర్‌తో కాకుండా కీబోర్డ్‌ని ఒక మీటని నొక్కితే చాలు. వీడియో ఆగిపోతుంది. కావాలంటే యూట్యూబ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు కీబోర్డ్‌లోని K మీటని నొక్కండి. వీడియోని 10 సెకన్ల పాటు వెనక్కి జరిపేందుకు J మీటని నొక్కొచ్చు. 10 సెకన్లు ముందుకు జరిపేందుకు L మీటని వాడొచ్చు. ప్లే అవుతున్న వీడియోని శాతాల వారీగా ముందుకు జరుపుతూ చూడాలనుకుంటే 1 నుంచి 10 వరకూ అంకెల్ని నొక్కితే సరి. తిరిగి వీడియోని ఎప్పుడైనా మొదటి నుంచి ప్రారంభించాలనుకుంటే 0 (సున్న) మీటని నొక్కొచ్చు.

ఇలా చిత్రీకరించారా?
ఫోన్‌ చేతిలో ఉందంటే సెల్ఫీలే కాదు. వీడియోలు కూడా చిత్రీకరించేస్తున్నారు. కానీ, ఫోన్‌తో మీరెప్పుడైనా ‘రివర్స్‌’ వీడియోలు తీసారా? ఉదాహరణకు... మీరు చిత్రీకరించిన వీడియోలో కింద ఉన్న కాగితం ముక్కలు మ్యాజిక్‌ చేసినట్టుగా చేతిలోకి వచ్చే చేరతాయి! గ్లాస్‌లో నీళ్లు పోస్తుంటే నిండకుండా ఖాళీ అవుతుంది! ఇంకా చెప్పాలంటే... తాగిన పళ్ల రసాన్ని గట గటా బయటికి తీయొచ్చు... ముక్కలుగా చింపిన కాగితాన్ని మ్యాజిక్‌ చేసినట్టుగా అతికించొచ్చు... ఇదంతా ఆప్‌తో చేసే అదిరే మ్యాజిక్‌. మీరూ చేద్దాం అనుకుంటే Reverse Movie FX - magic video ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. ఆప్‌ని ఓపెన్‌ చేసి సాధారణ వీడియో చిత్రీకరించినట్టుగానే వీడియోని షూట్‌ చేయాలి. తర్వాత వీడియో రివర్స్‌లో ప్రాసెస్‌ అయ్యి వస్తుంది. కావాలంటే వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను జోడించొచ్చు. ఇలా చిత్రీకరించిన వీడియోలు సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై షేర్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/kZScF9

కొడితే పడాల్సిందే!
గోడపై డబ్బాలు పేర్చి ఉంటాయి. వాటిని దూరం నుంచి గురి చూసి కొట్టాలి. కొట్టేందుకు మూడు బాల్స్‌... మూడే మూడు ఛాన్స్‌లు. ఆట పేరేంటో తెలుసా? Can Knockdown. మీరు సాధించిన స్కోర్‌ ఆధారంగా కొత్త లెవల్స్‌ అన్‌లాక్‌ అవుతాయి. లెవల్‌ మారుతున్న కొద్దీ గోడపై పడగొట్టాల్సిన డబ్బాల సంఖ్య పెరుగుతుంది. మీ గురి, వేగం ఆధారంగా అదనపు స్కోర్‌ లభిస్తుంది. మరి, ఈ పిట్ట గోడ ఆటని ఆడేద్దాం అనుకుంటే https://goo.gl/9wUX5r లింక్‌లోకి వెళ్లండి.

ఆంగ్లంపై పట్టు సాధించాలంటే?
ఆంగ్లంపై పట్టు సాధించాలంటే? కచ్చితంగా వ్యాకరణంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందే. Verb, Noun, Adjective, Adverb... లను వాడకంలో ఎప్పుడు ఎలా వాడాలో తప్పక తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడిప్పుడే ఇంగ్లిష్‌ నేర్చుకునే వారి కోసం ప్రత్యేక సైట్‌ సిద్ధంగా ఉంది. అదే www.ineedaprompt.com సైట్‌. పేరుకి తగినట్టుగానే వ్యాకరణంలో మీరేదైనా మర్చిపోతే వెంటనే 'ప్రాంప్ట్‌' చేస్తుంది. ఇకేముందీ... మీరు అందుకు అందరగొట్టేయవచ్చు. సైట్‌ హోం పేజీలో నీలి రంగులో I need a prompt బటన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే చాలు. మీరు కోరుకున్న వ్యాకరణ పదాలతో వాక్యాలు వచ్చేస్తాయి. ఉదాహరణకు Verb, Noun రెండిటితో కూడిన వాక్యం కావాలంటే జాబితాలో రెండిటినీ సెలెక్ట్‌ చేసి 'ఐ నీడ్‌ ప్రాప్ట్‌'ఫై క్లిక్‌ చేస్తే చాలు. క్షణాల్లో చక్కని వాక్యం ప్రత్యక్షమవుతుంది. ఇంకేముందీ... నీలి రంగు బటన్‌పై నొక్కుతూ ఎన్నియినా వాక్యాల్ని పొందొచ్చు.

విండోస్‌ వేదికపై...
ఆండ్రాయిడ్‌ వేదికపై కప్ప చేసిన సందడి గుర్తుందా? అదేనండీ... బుర్రకు పదును పెట్టేలా 'కట్‌ ది రోప్‌' పేరుతో తెగ సండి చేసింది కదా! ఇప్పుడు వెర్షన్‌ మార్చుకుని విండోస్‌ ఓఎస్‌పై చేరింది. విండోస్‌ 10 అప్‌డేటెడ్‌ ఓఎస్‌తో పీసీ, ల్యాపీ, ట్యాబ్‌... ఏదైనా వాడుతున్నట్లయితే ఆప్‌ స్టోర్‌లోకి Cut The Rope 2 గేమ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తాకేతెరలపైనే కాకుండా డెస్క్‌టాప్‌లపైనా ఆటను సులువుగా ఆడొచ్చు. ఆటేంటో తెలుసుగా? వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న ఛాక్లెట్‌లను తెలివిగా తాకుతూ కింద పడకుండా సరాసరి కప్ప నోట్లో పడేలా చేయాలి. వెలాడుతున్న తాడుని కత్తిరించే ముందు కాస్త తెలివిగా ఆలోచించాలి. ఒక్కో లెవల్‌ని పూర్తి చేస్తూ మ్యాప్‌పై కప్పని ముందుకు సాడేలా చేయాలి. ఆటలో మరో 7 సరికొత్త పాత్రల్ని జత చేశారట. అవసరం మేరకు అవి కప్పకి సాయం అందిస్తాయి. అదరగొట్టే గ్రాఫిక్స్‌తో ఆటని రూపొందించారు.

రేస్‌కి వస్తారా?
పనిలో కాస్త విరామం తీసుకుని సరదాగా గేమ్‌ ఆడదాం అనుకుంటే స్నేహితులతో కలిసి రేస్‌లో పాల్గొనండి. గేమ్‌ పేరు Mini Racing Adventures. రేసింగ్‌ అంటే రోడ్డుపై ఎలాగైనా దూసుకెళ్లిపోవడమే అనుకుంటే మీ బండి బోల్తా పడినట్టే. ఎందుకంటే రోడ్డు అంత క్లిష్టంగా ఉంటుంది. తెలివిగా బుర్రని వాడి వాహనాన్ని నడపాలి. బైకు, కారు... మీ అభిరుచి మేరకు సెలెక్ట్‌ చేసుకుని రేస్‌లో పాల్గొనొచ్చు. 21 రకాల భిన్నమైన వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనాన్ని అన్‌లాక్‌ చేసుకుంటూ అన్నిటినీ ప్రయత్నించొచ్చు. 9 రకాల ప్రమాదకరమైన దారుల్లో రేస్‌ని కొనసాగించాలి. నెట్‌కి అనుసంధానమై ఉన్నప్పుడు స్నేహితులు ఎక్కడున్నా అందరూ కలిసి రేస్‌లో ఆడొచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ మల్టీప్లేయర్‌ మోడ్‌ ఉంది. ఆకట్టుకునే 3డీ గ్రాఫిక్స్‌తో గేమ్‌ని తీర్చిదిద్దారు. మీరు సాధించిన స్కోర్‌, వ్యక్తిగత రికార్డ్‌లను సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై షేర్‌ చేయవచ్చు. ఆట మధ్యలో ఆపాల్సివస్తే 'క్లౌడ్‌సేవ్‌' ఆప్షన్‌ ఉంది. దీన్ని వాడుకోవాలంటే మీరు వాడే గూగుల్‌ ఎకౌంట్‌తో నెట్‌కి అనుసంధానమవ్వాల్సిందే. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఆటని పొందొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/AMfFGN

నాసా రింగ్‌టోన్లు
పాటలో... మ్యూజిక్‌ ట్రాక్స్‌నో... ఇష్టమైన హీరో డైలాగ్స్‌నో రింగ్‌టోన్లుగా పెట్టుకోవడం మామూలే. కాస్త భిన్నంగా ఆలోచించండి. ప్రయోగశాల నుంచి దూసుకెళ్తున్న అంతరిక్ష నౌక శబ్దాన్నో... అంతరిక్షం నుంచి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పంపిన సందేశాలనో... ప్రయోగించిన ఉపగ్రహాలు చేసే శబ్దాలనో... రింగ్‌టోన్లుగా పెట్టుకుంటే! ఆ థ్రిల్లే వేరు కదా! ఎక్కడ దొరుకుతాయి అనేగా? నాసా వెబ్‌ సైట్‌ జాబితాగా వీటిని అందిస్తోంది. Discovery, Shuttle and Station, Missions, Beeps and Bites... లాంటి ఇతర విభాగాల్లో రింగ్‌టోన్లను బ్రౌజ్‌ చేసి వినొచ్చు. MP3, M4R ఫార్మెట్‌లో వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుతున్న ఫోన్లలో రింగ్‌టోన్లుగా పెట్టుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... http://www.nasa.gov/connect/sounds/index.html సైట్‌ని ఓపెన్‌ చేయండి.

భీమ్‌తో పరుగు భలేగా!
ఎన్నో పరుగు పందాల్లో పాల్గొని ఉంటారు. కానీ, చోటా భీమ్‌ మిత్ర బృందంతో పరుగు పోటీ కిక్కే వేరు. కావాలంటే Chhota Bheem Race గేమ్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. చిటికెలో భీమ్‌ మిత్ర బృందం తెరపై ప్రత్యక్షమవుతారు. వారిలో మీరు ఎవర్ని సెలెక్ట్‌ చేయాలనేది Spin చేసి నిర్ణయించాలి. ఎవరి దగ్గర స్పిన్‌ ఆగిందో వారినే మీరు గెలిపించాలి. పరుగు మధ్యలో అనేక పవర్‌ అప్స్‌ ఉంటాయి. అందుకుని అమాంతం దూసుకెళ్లడమే. కొన్ని పవర్‌ అప్స్‌తో ముందు వేగంగా వెళ్లేవారిని నెమ్మదయ్యేలా చేయవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/SMuHJ

గల్లీ క్రికెట్‌ ఆ'డేద్దాం!
చిన్నప్పుడు ఇంటి సందు చివరో... కాలేజీ రోజుల్లో పిట్ట గోడల పక్కనో... మీరు బాగా ఆడిన గేమ్‌ ఏదంటే వెంటనే వచ్చే సమాధానం గల్లీ క్రికెట్‌. కొట్టే సొగసైన షార్ట్‌లతో పక్కింటి కిటికీలు పగలగొట్టడం... పార్క్‌ చేసున్న వాహనాల్ని పాడు చేయడంలో ఉండే కిక్కే వేరు కదా! అంతటి ఆనందాన్ని పంచిన గల్లీ క్రికెట్‌ కేవలం జ్ఞాపకాలకే పరిమితం చేయాల్సిందేనా? ఏం అక్కర్లేదు. జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ తీయండి. గల్లీ క్రికెట్‌ ఆడేయండి. ఆటలో అన్నీ అవే పరిమితులు... ఓవర్లు... ఫీల్డింగ్‌ పద్ధతులు... మీరు ఆడినట్టుగానే ఆటని డిజైన్‌ చేశారు. స్నేహితులతో ఆడినట్టుగానే మీరో టీమ్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. టీమ్‌లో అమ్మాయిలూ ఉన్నారు. పరిమిత ఓవర్ల గేమ్‌తో సాధన చేయవచ్చు. తర్వాత టోర్నమెంట్‌లు ఉండనే ఉన్నాయి. ఐదుగురు సభ్యులు, 30 బాల్స్‌తో మ్యాచ్‌ ఆడొచ్చు. మీరు ఒక్కరే బ్యాటింగ్‌ చేస్తూ సాధన చేయడానికి One Wicket సెలెక్ట్‌ చేయవచ్చు. టీమ్‌తో టోర్నమెంట్‌ ఆడడం మామూలే. ఆటలో అన్ని రకాల షార్ట్‌లను కొట్టొచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/kttTcd

కొండలు పిండే!
ఎత్తయిన కొండలపై నుంచి వేలాడుతూ ఎప్పుడైనా దిగారా? అయితే, సరదాగా Radical Rappelling గేమ్‌ ఆడేయండి. కొండ దిగడం అంటే తాడుకు వేలాడుతూ జారడమే కదా అనుకునేరు! జారడంలోనే అసలు మాజా ఉంటుంది. కొండను అనుకునే అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు. ఆట ప్రారంభంలో RIP, ROXY సిద్ధంగా ఉంటారు. మీకు ఇష్టమైన వారిని సెలెక్ట్‌ చేసుకుంటే చాలు. తాడు పట్టుకుని మెరుపు వేగంతో జారడం మొదలు పెడతారు. ఇక మీరు వారిని జాగ్రత్తగా దించుతూ విజయాన్ని అందించాలి. దిగేందుకు తెరపై కనిపించే బాణం గుర్తుని నొక్కి ఉంచితే చాలు. మధ్యలో దొరికే నాణాల్ని తీసుకుంటూ స్కోర్‌ సాధించాలి. కొండ చెరియల్లో ఎదురుపడే పవర్‌ప్యాక్స్‌ తీసుకుంటూ మెరుపు వేగంతో కిందికి జారొచ్చు. ఆన్‌లైన్‌లో స్నేహితులతో పోటీ పడుతూ గేమ్‌ ఆడొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/Dds19e

ఎఫ్‌బీలో...
ఫేస్‌బుక్‌లో ఎవరితోనైనా ఛాట్‌ చేయాలంటే? ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉండాల్సిందే. అంటే... ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి, ఆహ్వానాన్ని మన్నించాకే ఫేస్‌బుక్‌లో ఎవరితోనైనా ఛాట్‌ చేయగలం. మరి, కొత్త వ్యక్తితో ఛాట్‌ చేయాలంటే? ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపకుండా... సరాసరి 'మెసేజ్‌ రిక్వెస్ట్‌' పంపొచ్చు తెలుసా? అందుకు కొత్తగా ఫేస్‌బుక్‌ వెబ్‌ ఫ్లాట్‌ఫాంపై ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకసారి బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అవ్వండి. 'మెసేజ్‌' విభాగంలోకి వెళ్తే... మెసెంజర్‌లోని ఫ్రెండ్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. ఒక్కొరిపై క్లిక్‌ చేసి ఛాటింగ్‌ చిట్టా చూడొచ్చు. ఇవన్నీ తెలిసినవే! ఇప్పుడు ఇన్‌బాక్స్‌ పక్కనే Other మెనూపై క్లిక్‌ చేయండి. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీకు వచ్చిన మెసేజ్‌ల జాబితాని చూడొచ్చు. అవన్నీ మీకు వచ్చిన 'మెసేజ్‌ రిక్వెస్ట్‌'లే అన్నమాట. మేసేజ్‌పై క్లిక్‌ చేస్తే 'ఛాట్‌ రిక్వెస్ట్‌'ని మన్నించినట్టే! మీరు మెసేజ్‌ చూసినట్టుగా, ఆహ్వానాన్ని మన్నించినట్టుగా సెండర్‌కి తెలుస్తుందేమో అనే సందేహం అక్కర్లేదు. మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మీకు ఇష్టమైతే సరాసరి సెండర్‌తో ఛాట్‌ చేయవచ్చు. ఫైల్స్‌, ఫొటోలు ఎటాచ్‌చేసి పంపొచ్చు. ఎమోటికాన్స్‌, స్టిక్కర్లతో కబుర్లు చెప్పుకోవచ్చు.

డిష్యుం... డిష్యుం
మీరెప్పుడైనా సన్నగా పుల్లల్లా కనిపించే వారి మధ్య వీరోచితంగా జరిగే పోరాటాలకు సంబంధించిన గేమ్‌ ఆడారా? అయితే, మీకు స్టిక్కీమ్యాన్‌ల ఫైటింగ్‌ గురించి తెలియదన్నమాట. మరింకే... వెంటనే Stickman Fighting Deluxe గేమ్‌ ఆడేయండి. మీరు విండోస్‌ 10 ఓఎస్‌ వాడుతున్నట్లయితే ఆప్‌ స్టోర్‌లోకి వెళ్లి గేమ్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. రన్‌ చేయగానే ఇద్దరు స్టిక్కీమ్యాన్‌లతో గేమ్‌ ఓపెన్‌ అవుతుంది. ఇద్దరూ నల్లగానే ఉంటారు. వారిలో పచ్చ రంగు బ్యాడ్జ్‌తో ఉన్న స్టిక్కీమ్యాన్‌ మీ ప్రత్యర్థి అన్నమాట. ఎవరైతే ఎక్కువ దెబ్బలు తింటారో వారు ఎరుపు రంగులో మారుతూ కనిపిస్తారు. ఇలా మారే క్రమంలో మధ్యలో పవర్‌ప్యాక్‌ గుర్తులు గాల్లో కనిపిస్తాయి. తెరకి ఇరువైపులా చేయి, కాలు గుర్తులతో బటన్లు ఉంటాయి. ఒక్కో లెవల్‌ని పూర్తి చేసుకుంటూ వెళ్లే క్రమంలో స్కోర్‌ వస్తుంది. మీరు సాధించిన పాయింట్స్‌తో ఆయుధాల్ని కొనుగోలు చేయవచ్చు. అన్‌లాగ్‌ చేస్తూ గేమ్‌లోని లెవల్స్‌ని పూర్తి చేయాలి. మరెందుకు ఆలస్యం ఆడదాం అనుకుంటే విండోస్‌ ఆప్‌ స్టోర్‌లో గేమ్స్‌ విభాగంలోకి వెళ్లి ఆటని ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

అలెక్స్‌ పోరాటం...
ఒక యువరాజు. పేరు అలెక్స్‌. రాజ్యంలోని ప్రజల కోసం యుద్ధం మొదలు పెట్టాడు. శత్రువు ఎవరో తెలుసా? ఒక భయంకరమైన సైతాను. దాని పేరు బజూక. గాలి, చెట్లు, పువ్వులు, నీళ్లు, పళ్లు... లాంటి విలువైన సంపదల్ని దోచుకుపోతుంది. దీంతో యువరాజు వాటన్నింటినీ తిరిగి తెచ్చేందుకు సైతానుపై యుద్ధం మొదలెడతాడు. ఇదంతా ఓ ఆట వెనకున్న కథ అన్నమాట. పేరేంటంటే... Magic Runner. ఆటలోని యువరాజు అలెక్స్‌కి మీరు సాయం చేయాలి. ఆడడం ఎలా అంటే... అలెక్స్‌ మెరుపు వేగంతో పరిగెడుతుంటాడు. తెరపై కనిపించే రెండు బాణం గుర్తులతో యువరాజుని ఎరిగేలా లేదంటే నేలకి అతుక్కుని దొర్లేలా చేయవచ్చు. ఎందుకంటే శత్రువు బజూక సైన్యం రెండు రూపాల్లో దాడికి దిగుతుంది. ఎగురుతూనో లేదంటే నేలకి అతుక్కుని దొర్లుతూనో వాటి నుంచి తప్పించుకోవాలి. లెవల్‌లో మొత్తం మూడు లైఫ్‌లు ఉంటాయి. మూడు సార్లు ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తే లెవల్‌ని మళ్లీ ఆడాల్సిందే. దారి పొడవునా అందుకున్న నాణాలతో పవర్‌అప్స్‌ని కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకో వచ్చు. https://goo.gl/8N5Dfg

మ్యూజిక్‌ మస్తీ...
కాస్త ఖాళీ దొరికినా... బోర్‌ అనిపించినా... మొబైల్‌లో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఓపెన్‌ చేసేస్తాం. ఇక పాటలే... పాటలు! మరి, మ్యూజిక్‌ మస్తీని మరింత ఆహ్లాదకరంగా మార్చాలంటే? Music Volume EQ ఆప్‌ ఉండాల్సిందే. దీంతో మ్యూజిక్‌ ట్రాక్స్‌ సౌండ్‌ క్వాలిటీని మీకు కావాల్సినట్టుగా సెట్‌ చేసుకోవచ్చు. పాటల్ని ప్లే చేసిన తర్వాత మ్యూజిక్‌ ఆప్‌ని ఓపెన్‌ చేసి వాల్యూమ్‌ లెవల్స్‌ని మార్చుకోవచ్చు. Five Band Equalizer సిస్టంతో ట్రాక్స్‌ని నచ్చినట్టుగా వినొచ్చు. బాస్‌తో కూడిన మ్యూజిక్‌ మీకు ఇష్టమైతే Bass boost ఎఫెక్ట్‌ని కావాల్సినంత పెంచుకోవచ్చు. 9 రకాల బిల్ట్‌ఇన్‌ ఈక్వలైజర్స్‌ ఉన్నాయి. 'ప్రీసెట్స్‌'ని క్రియేట్‌ చేసి సేవ్‌ చేసుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. https://goo.gl/CvkYb8

బుర్రకు మేత!
ఎప్పుడూ యాక్షన్‌ గేమ్‌లే ఆడితే ఏం బాగుంటుంది! అప్పుడప్పుడు ప్రశాంతంగా కూర్చుని పజిల్‌ గేమ్‌లు ఆడితే ఆ కిక్కే వేరు! ఏమంటారు? కావాలంటే Roll the Ball పజిల్‌ గేమ్‌ ఆడేయండి. చాలా సులువైన ఇంటర్ఫేస్‌తో గేమ్‌ని రూపొందించారు. ఆటని ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేస్తే Beginner, Medium, Hard, Advanced, Extreme Pack బటన్లతో లెవల్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఒక్కో దాంట్లో 60 లెవల్స్‌ ఉన్నాయి. మొదట్లో గేమ్‌ని సాధన చేసేందుకు 'బిగినర్‌ ప్యాక్‌'ని సెలెక్ట్‌ చేసుకోండి. ఇక ఆటలో ఏం చేయాలంటే... బ్లాకుల మధ్యలో ఉన్న బంతికి తోవని క్రియేట్‌ చేసి గమ్య స్థానానికి చేరేలా చేయాలి. బ్లాకుల్ని వాడుకుని బంతికి తోవని క్రియేట్‌ చేయడమే బుర్రకు మేత అన్నమాట. సులువైన లెవల్స్‌లో 'టైం లిమిట్‌' ఉండదు. లెవల్స్‌ మారుతున్న కొద్దీ బంతి నిర్ణీత సమయానికి కదలడం ప్రారంభమవుతుంది. ఇంతలోపే తికమకగా ఉన్న తోవని సరిగా సెట్‌ చేయాలి. మీ వేగానికి గేమ్‌లో రేటింగ్‌ ఉంటుంది. అంతేకాదు... మీరు ఎన్ని సార్లు బ్లాకుల్ని కదిపారో కూడా రికార్డ్‌ అవుతుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. https://goo.gl/2giul1

ఫొటోలపై కాపీరైట్‌ ఇలా...
మీరు ఫొటోగ్రాఫరా? అభిరుచి మేరకు ఫొటోలు తీసి ప్రత్యేక గ్యాలరీని సిద్ధం చేస్తున్నారా? అయితే, మీరు తీసిన ఫొటోలకు మీదైన కాపీరైట్‌ని జత చేయాలంటే? పెద్ద కష్టమేం కాదు. ఉచిత పీసీ సాఫ్ట్‌వేర్‌తో చిటికెలో సాధ్యం. ఇన్‌స్టాల్‌ చేయగానే తెరపై కాపీరైట్‌ గుర్తుతో షార్ట్‌కట్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. టూల్‌ని రన్‌ చేస్తే Image, Copyright Sytle, Image Watermark, Output ట్యాబ్‌ మెనూలతో టూల్‌ ఓపెన్‌ అవుతుంది. కాపీరైట్‌ గుర్తుని పెట్టుకోవాలనుకునే ఫొటోలను 'ఇమేజ్‌' ట్యాబ్‌లోకి వెళ్లి సెలెక్ట్‌ చేసుకోవాలి. ఒక్క ఫొటోకి మాత్రమే కాపీరైట్‌ పెట్టేందుకు Unique file ద్వారా డ్రైవ్‌ల్లోని ఫొటోని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఫోల్డర్‌లోని అన్ని ఫొటోలకు కాపీరైట్‌ గుర్తుని ఇన్‌సర్ట్‌ చేసేందుకు Directory మెనూని సెలెక్ట్‌ చేయాలి. ఫొటోల ఎంపిక ముగిశాక Image watermark ట్యాబ్‌లోకి వెళ్లి కాపీరైట్‌ గుర్తుని సెలక్ట్‌ చేయాలి. ఫొటోపై ఎంత మేరకు గుర్తుని పెట్టుకోవాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. కాపీరైట్‌ గుర్తు Position, Size, Opacity ప్రాపర్టీలను కావాల్సినట్టుగా మార్పులు చేయవచ్చు. చివరిగా కాపీరైట్‌ గుర్తుతో కూడిన ఫొటోలు ఎక్కడ సేవ్‌ అవ్వాలనేది అవుట్‌పుట్‌ ట్యాబ్‌ ద్వారా సెట్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/pWQkDM లింక్‌ని చూడండి.

తూటాలా దూసుకెళ్తాడు!
స్పైడర్‌ మ్యాన్‌... సూపర్‌ మ్యాన్‌... ఐరన్‌ మ్యాన్‌! వీళ్లని సినిమాల్లోనూ... వీడియో గేమ్స్‌లోనూ చూసుంటారు. కానీ, మీరెప్పుడైనా 'బుల్లెట్‌ బాయ్‌'ని చూశారా? అయితే, జేబులోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ తీయండి. గూగుల్‌ ప్లేలోకి వెళ్లి Bullet Boy గేమ్‌ని ఇన్‌స్టాల్‌ చేయండి. ఆట ప్రారంభంలో నెత్తికి తూటా తగిలించుకుని దూసుకొస్తాడు. అక్కడి నుంచి తన ప్రయాణం మీ పూచీనే. సురక్షితంగా ఒక ఫిరంగి నుంచి మరో ఫిరంగిలోకి బుల్లెట్‌ బాయ్‌ని దూసుకెళ్లేలా చేయడమే ఆట. చాలా సింపుల్‌ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే... ఫిరంగులు కదలకుండా ఉంటే సరే. కొన్ని మాత్రం కదులుతూనే ఉంటాయి. అంతేకాదు... ఫిరంగుల చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటికి బుల్లెట్‌ బాయ్‌ తగిలితే అంతే సంగతులు! ఆటలో మొత్తం లెవల్స్‌ 30కి పైనే! 3డీ గ్రాఫిక్స్‌తో ఆకట్టుకునేలా గేమ్‌ని రూపొందించారు. తెలివిగా బుల్లెట్‌బాయ్‌ని ఫైర్‌ చేస్తూ... పవర్‌ అప్స్‌ అందుకుంటూ లక్ష్యాన్ని చేరుకునేలా చేయాలి. మరెందుకు ఆలస్యం... బుల్లెట్‌ బాయ్‌ని బుల్లి తెరపైకి పిలిచేద్దాం అనుకుంటే https://goo.gl/WHcvgX లింక్‌లోకి వెళ్లండి.
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. https://goo.gl/a3XRMw

ఇన్‌స్టాగ్రామ్‌లో..
ఫొటోలు పంచుకోవడానికి ప్రత్యేకంగా వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్‌లో మీరూ సభ్యులా? అయితే, ఫొటోలను మరింత యూజర్‌ ఫ్రెండ్ల్లీగా షేర్‌ చేసేందుకు కొత్త 'లేఅవుట్‌ ఆప్షన్స్‌'ని అందిస్తోంది. అంటే... ఫొటోలను కేవలం నిర్ణీత పరిమాణంలో మాత్రమే షేర్‌ చేయాలనే నిబంధన లేదు. ఫొటోలు అడ్డం లేదా నిలువుగా ఉన్నా పూర్తి పరిమాణంతోనే షేర్‌ చేయవచ్చు. అందుకు Portrait, Lanscape ఫార్మెట్స్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వెబ్‌ వేదికపైనా... ఆప్‌ ఫ్లాట్‌ఫాంల్లోనూ వాడుకోవచ్చు.

కొత్త ఫేస్‌బుక్‌ అసిస్టెంట్‌
వర్చువల్‌ అసిస్టెంట్‌లు కొత్తేం కాదు. యాపిల్‌ అందుబాటులోకి తెచ్చిన 'సిరి' వాడాం. మొన్నీ మధ్యే మైక్రోసాఫ్ట్‌ 'కార్టోనా'ని పలకరించాం. ఇక ఇప్పుడు ఫేస్‌బుక్‌ కూడా ప్రత్యేక వర్చువల్‌ అసిస్టెంట్‌ని సిద్ధం చేస్తోంది. పేరు M. అంతే... ఒక్క అక్షరమే. దీన్ని ఫేస్‌బుక్‌ అందించే మెసెంజర్‌ సర్వీసులో వాడుకోవచ్చు. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌ అతి కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఫేస్‌బుక్‌ యూజర్లు మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టొచ్చు. మెసెంజర్‌లో పోస్ట్‌ అయిన జోకుల్ని చదివి వినిపిస్తుంది. అంతేనా... స్నేహితుడి పుట్టిన రోజుకు మీ తరుపున చక్కని బహుమతిని వెతికి పంపేస్తుంది. మీరు అడిగితే చాలు. చాలా చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. త్వరలోనే ఈ 'ఫేస్‌బుక్‌ ఎం' అసిస్టెంట్‌ అందరి మెసెంజర్లలో ప్రవేశించేలా ఎఫ్‌బీ రంగం సిద్ధం చేస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఛాటింగ్‌
ఆన్‌లైన్‌ అంగడుల్లో షాపింగ్‌ సర్వసాధారణం అయిపోయింది. అందరూ హాయిగా నీడపట్టుకునే కూర్చుని కావాల్సిన వాటిని కొనేస్తున్నారు. మరి, మీరు ఎప్పుడైనా ఫ్లిప్‌కార్ట్‌ని వాడారా? ఓ కొత్త సౌకర్యం బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. అదే Ping. ఇదో వాట్స్‌ఆప్‌ మెసెంజర్‌ లాంటిదట. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు నచ్చిన ఆఫర్లను ఇతరులతో పంచుకునేందుకు అనువుగా మెసెంజర్‌ వ్యవస్థని రూపకల్పన చేశారట. వాట్స్‌ఆప్‌లో మాదిరిగానే వాడుతున్న మొబైల్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ అవ్వాలి. బాగుందే! వాడి చూద్దాం అనిపిస్తే... ఫ్లిప్‌కార్ట్‌ని ఓపెన్‌ చేయగానే ప్రత్యేక ఐకాన్‌ రూపంలో పింగ్‌ మెంజర్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేసి ఫ్లిిప్‌కార్ట్‌ లాగిన్‌ వివరాలతో సైన్‌ఇన్‌ అవ్వాలి. తర్వాత వాడుతున్న మొబైల్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేసి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి. ఇక మిత్రుడి నుంచి ఆహ్వానం అందితే చాలు. మెసెంజర్‌లో మాటలు కలిపేయవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉండడంతో పరిమిత యూజర్లకు మాత్రమే ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా పింగ్‌ని అందించేంత వరకూ వేచి చూడాల్సిందే.

హ్యాంగ్‌ అవుట్స్‌కోసం
జీటాక్‌ స్థానంలో జీమెయిల్‌లో ప్రవేశించిన హ్యాంగ్‌అవుట్స్‌ గురించి తెలుసుగా? ఇప్పుడు హ్యాంగ్‌అవుట్స్‌కి గూగుల్‌ ప్రత్యేక స్థానం కల్పిస్తూ వెబ్‌ సర్వీసులా అందిస్తోంది. ప్రయత్నిద్దాం అనుకుంటే https://hangouts.google.com సైట్‌ని ఓపెన్‌ చేయండి. మెసేజింగ్‌, వాయిస్‌, వీడియో కాల్స్‌కి అనువుగా వెబ్‌ సర్వీసుని తీర్చిదిద్దారు. 100 మంది సభ్యులతో గ్రూపుగా ఏర్పడి Group Conversation చేయవచ్చు. 10 సభ్యులతో గ్రూపుగా ఏర్పడి గ్రూపు వాయిస్‌, వీడియో కాల్స్‌ కూడా చేసుకునే వీలుంది. బ్రౌజర్‌లో హ్యాంగ్‌అవుట్స్‌ని ఓపెన్‌ చేయగానే హోం పేజీలో మెయిన్‌ మెనూతో పాటు వీడియో కాల్‌, ఫోన్‌ కాల్‌, మెసేజ్‌లకు ప్రత్యేక విభాగాలు కనిపిస్తాయి. ఎడమవైపు మెయిల్‌ కాంటాక్ట్‌లు కనిపిస్తాయి. సెర్చ్‌తో కావాల్సిన కాంటాక్ట్‌లను వెతకొచ్చు. ఇక అవసరం మేరకు కాంటాక్ట్‌లను ఎంపిక చేసుకుని వీడియో, ఫోన్‌ కాల్స్‌తో పాటు టెక్స్ట్‌ మెసేజింగ్‌ కూడా చేయవచ్చు. కంప్యూటర్‌, ట్యాబ్‌, ఫోన్‌... దేంట్లో హ్యాంగ్‌అవుట్స్‌ని వాడినా అన్నింటిలోనూ సింక్‌ అవుతుంది. ఆప్‌ రూపంలో హ్యాంగ్‌అవుట్స్‌ స్మార్ట్‌ ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు మెయిన్‌ మెనూలోని App Downloads విభాగంలోకి వెళ్లండి. హ్యాంగ్‌అవుట్స్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేసేందుకు మెయిన్‌ మెనూలో 'సెట్టింగ్స్‌' ఉన్నాయి.

ఇలా ఛార్జింగ్‌!
స్త్టెల్‌గా జీన్స్‌ ప్యాంట్‌ వేసుకుంటారు. వెనక జేబులో ఐఫోన్‌ని పెడతారు. దీంట్లో కొత్తేం లేదు. కానీ, వేసుకున్న జీన్స్‌ ఛార్జర్‌లా పని చేస్తే! జేబులోని ఐఫోన్‌ని ఛార్జ్‌ చేస్తే! కచ్చితంగా విడ్డూరమే కదా! Joe's జీన్స్‌ 'హలో!' పేరుతో ఈ తరహా ప్యాంట్‌లను రూపొందించింది. చిత్రంలో మాదిరిగా ప్యాంట్‌ వెనక జేబు పై భాగంలో పోర్టబుల్‌ బ్యాటరీతో కూడిన పాకెట్‌ని నిక్షిప్తం చేశారు. ప్రత్యేక మైక్రో యూఎస్‌బీ కేబుల్‌తో సులభంగా ఫోన్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. ఐఫోన్‌ 5, 5ఎస్‌, 6 మోడళ్లను ప్యాంట్‌ సపోర్ట్‌ చేస్తుంది. దీంట్లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ ప్యాక్‌ ఐఫోన్‌ 5, 5ఎస్‌ మోడళ్లను 85 శాతం వరకూ ఛార్జ్‌ చేస్తుంది. ఐఫోన్‌ 6ని మాత్రం 70 శాతం ఛార్జ్‌ చేస్తుందట. ఇంతకీ ప్యాంట్‌ ఖరీదు ఎంతో తెలుసా? సుమారు రూ.12,000. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/cEJ7Hv లింక్‌ని చూడండి.

మారియోలానే...
డెస్క్‌టాప్‌ తెరలపై ఒకప్పటి మారియోని పలకరించని వారు ఎవరుంటారు? అదే తరహాలో బుల్లి తెరపై మరో ఆట ఉంది తెలుసా? కాకపోతే ఆటలో మారియో కాకుండా బుజ్జి పెంగ్విన్‌ దర్శనమిస్తుంది. దానికి మీరు సాయం చేస్తూ అన్ని లెవల్స్‌ని దాటుకుంటూ ముందుకు సాగేలా చేయాలి. గేమ్‌ పేరు Artie. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆటలో మొత్తం 50 లెవల్స్‌ ఉన్నాయి. దారిపొడవునా కనిపించే నాణాల్ని తీసుకుంటూ వెళ్తే చాలు. https://goo.gl/MWhDJZ

బుల్లెట్‌ దిగాల్సిందే!
మీరో సైనికుడు... సోలోగా పోరాడాలి... గురి తప్పకుండా ఒక్కొక్కర్ని మట్టుబెడుతూ శత్రు స్థావరాల్లోకి గుట్టు చప్పుడు కాకుండా దూసుకెళ్లాలి... అప్పగించిన బాధ్యతని వీరోచితంగా ముగించాలి... ఇంతకీ ఆటేంటో తెలుసా? Kill Shot. పేరుకి తగ్గట్టుగానే చేతి నుండా అత్యాధునిక తుపాకీలు ఉంటాయి. అవసరం మేరకు వాటిని మార్చుకుని గురి చూసి తూటా పేలిస్తే శత్రువు గుండెల్లో దిగాల్సిందే. తూటా వెళ్లి శత్రువు గుండెల్లో దిగిన వైనాన్ని స్లో మోషన్‌లో చూడొచ్చు. ఆటలో మొత్తం 65 రకాల తుపాకీలను సొంతం చేసుకుని వాడొచ్చు. ఒక్కో తుపాకీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దూరంగా ఉన్న వారిని జూమ్‌ చేసి గురి చూసేందుకు తెరపై స్క్రోల్‌ బార్‌ని ఏర్పాటు చేశారు. కావాల్సినట్టుగా జరుపుతూ గురి పెట్టొచ్చు. ఆకట్టుకునే 3డీ గ్రాఫిక్స్‌తో గేమ్‌ని రూపొందించారు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/3dagFU

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా...
ఫొటోలకు పుట్టిల్లుగా మారిపోయిన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరూ వాడుతున్నారా? అయితే, వెబ్‌ వేదికపై కొత్త సౌకర్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ అందుబాటులోకి తెచ్చింది. అదే 'సెర్చ్‌'. ఇక మీదట ఫోన్‌లోనే కాకుండా వెబ్‌ బ్రౌజర్‌లోనూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై కావాల్సిన ఫొటోలను వెతకొచ్చు. సైట్‌లోకి లాగిన్‌ అయితే హోం పేజీలోనే సెర్చ్‌బాక్స్‌ కనిపిస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన అంశాన్ని టైప్‌ చేస్తే చాలు. డ్రాప్‌డౌన్‌ మెనూలో ఇన్‌స్టాగ్రామ్‌ సభ్యుల ప్రొఫైల్స్‌ కనిపిస్తాయి. క్లిక్‌ చేసి ఫొటోలను బ్రౌజ్‌ చేయవచ్చు. నచ్చితే ఫాలో అవ్వొచ్చు.

బ్యాటరీ ఆదా
ఐఫోన్‌, ఐప్యాడ్‌ వాడుతున్నారా? మీ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేలా ఆపరేటింగ్‌ సిస్టంలో సరికొత్త అప్‌డేట్‌ త్వరలోనే రానుంది. అదే యాపిల్‌ iOS 9. దీంతో బ్యాటరీ సామర్థ్యం నాలుగు గంటలు పెరుగుతుందట. అందుకు తగినట్టుగా కొత్త ఓఎస్‌ వెర్షన్‌లో మార్పులు చేశారు. తక్కువ బ్యాటరీని వాడుకుని ఫోన్‌ వేగంగా పని చేసేందుకు అనువుగా ఓఎస్‌ని తీర్చిదిద్దడం పైనే దృష్టి పెట్టామని యాపిల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఓఎస్‌లో మరో విశేషం ఏంటంటే... కావాలంటే ఫోన్‌ని Low Power Mode లో సెట్‌ చేసుకుని అదనంగా మరో మూడు గంటల బ్యాటరీ లైఫ్‌ని పెంచుకోవచ్చట. ఇంకా చెప్పాలంటే నెట్టింట్లో వెతుకులాటని మరింత సులభం చేస్తూ 'స్పాట్‌లైట్‌ సెర్చ్‌'ని అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాదు... ఎప్పటి నుంచో యాపిల్‌ ప్రత్యేకతని చాటుతూ వచ్చిన 'సిరి' మరో అడుగు ముందుకేసి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లోని 'గూగుల్‌ నౌ'కి పోటీ ఇవ్వనుందట. టెక్స్ట్‌ లేదా వాయిస్‌ కమాండ్స్‌తో మరింత అనువుగా డేటా, ఆప్స్‌ని యాక్సెస్‌ చేసే వీలుకల్పిస్తున్నారు. వార్తాంశాల్ని మరింత విస్తృతంగా అందించేందుకు కొత్త ఓఎస్‌ వెర్షన్‌లో News విభాగాన్ని ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తున్నారట. అలాగే, కొత్త ఓఎస్‌ని ఇన్‌స్టాల్‌ చేయడానికి తీసుకునే మెమొరీ కూడా తక్కువే. ఫోన్‌లో 1.3 జీబీ ఖాళీగా ఉంటే చాలు. కానీ, ఇప్పుడున్న ఓఎస్‌ 8 వెర్షన్‌కి ఏకంగా 4 జీబీ పడుతుందట.

గుడ్డు పగలాలి!
రంగు రంగుల్లో గుడ్లు...అన్నీ వరుసగా ఉంటాయి...ఒక్కో దాన్ని తాకుతూ పగలగొట్టాలి... ఇదో పజిల్‌ గేమ్‌... పేరు Crack Attack. ఒకే రంగులో ఉన్న వాటిని కలుపుతూ పజిల్‌ గేమ్‌లు ఆడి బోర్‌ అనిపిస్తే ఈ గుడ్లు పగలగొట్టే ఆట ఆడొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు ఆయా అధికారిక ఆప్‌ స్టోర్‌ల నుంచి గేమ్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. ఆట ప్రారంభంలో గడులతో కూడిన బోర్డ్‌పై గుడ్లు ఉంటాయి. అక్కడి బోర్డ్‌పైనే వివిధ రంగుల్లో కొన్ని గుడ్లు వస్తాయి. రంగుల ఆధారంగా వరుస క్రమంలోనే గుడ్లని గుర్తించాలి. మ్యాచింగ్‌ చేసేందుకు ఎంత సమయమైనా తీసుకోవచ్చు అనుకుంటే పోరబాటే. నిర్ణీత సమయంలోనే ముగించాలి. లేదంటే బాక్స్‌లో కనిపించే నిర్ణీత Movesతోనే మ్యాచ్‌ చేస్తే లెవల్‌ ముగించ డానికి అవసరమైన స్కోర్‌ని సాధించాలి. బాగానే ఉందిగానీ లెవల్‌... లెవల్‌కీ మాకొచ్చే కిక్‌ ఏంటి? అనేగా... మీరు తాకి పగలగొట్టిన గుడ్లలోనే గిఫ్ట్‌లు ఉన్నాయి. ఇలా లెవల్స్‌ ముగిస్తూ Creature Collectionsజమ చేసుకోవాలి. అంతేనా... సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చు. వాల్‌పై స్నేహితులకు ఛాలెంజ్‌లు విసరొచ్చు. గేమ్‌లో మొత్తం లెవల్స్‌ వందకు పైనే. ఆండ్రాయిడ్‌ యూజర్లు డౌన్‌లోడ్‌ కోసం https://goo.gl/hZbfeL లింక్‌లోకి వెళ్లండి.
* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. https://goo.gl/MgcxrH

దూసుకెళ్లాలి!
అదో ఆకాశ మార్గం... కిందేమో ద్వీప సముదాయాలు.. గుంపులుగా శత్రువిమనాలు... వీటి మధ్య వీరుడిలా దూసుకువెళ్లాలి...విజయం సాధించాలి!! ఆటేంటో తెలుసా? Shoot n Scroll 3D. ఆటని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఏం కష్టం కాదు. ఇంట్లో నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. http://goo.gl/AIWxdO లింక్‌లోకి వెళ్లి గేమ్‌ని చిటికెలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆటలోకి వెళ్లగానే ముందుగా మీరు ఏ హెలీకాప్టర్‌తో దాడి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. దాంట్లో ఏ రకమైన ఆయుధాలు లోడ్‌ చేయాలో కూడా సెలెక్ట్‌ చేసుకుని రంగంలోకి దిగాలి. మీ విమానం దూసుకుంటూ ముందుకు వెళ్తుంటే శత్రువులు మీపైకి గుంపులుగా దాడికి దిగుతారు. మీరు తప్పించుకుని వారిపై గుళ్ల వర్షం కురిపించాలి. ఫైరింగ్‌ చేయడానికి మీరేం కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఆటోమాటిక్‌గానే హెలీకాప్టర్‌ నుంచి బుల్లెట్లు దూసుకెళ్తుంటాయి. మీరు చేయాల్సిదంల్లా శత్రువులు పేల్చే తూటాల నుంచి తప్పించుకోవడమే. అందుకు ఏవేవో గేమింగ్‌ కంట్రోల్స్‌ వాడాలేమో అనుకునేరు. ఏం అక్కర్లేదు. మౌస్‌ని చురుకుగా కదుపుతూ వెళ్లడమే. వెళ్తూ దార్లో వచ్చే లైఫ్‌లు, పవర్‌ ప్యాక్‌లను తీసుకుంటూ ముందుకు సాగడమే. లెవల్‌ మారుతున్న కొద్దీ శత్రువుల దాడిలో తీవ్రత పెరుగుతుంది. ఆటలో లెవల్స్‌ మారుతూ స్కోర్‌ పెంచుకుంటూ మూడు రకాల హెలీకాప్టర్‌లను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. మొత్తం పది లెవల్స్‌ ఉంటాయి. 3డీ గ్రాఫిక్స్‌తో ఆటని ఆకట్టుకునేలా రూపొందించారు.

బుల్లితెరపై మరోటి!
యాంగ్రీ బర్డ్స్‌ గేమ్‌ ఆడారుగా? ఎన్ని రోజులనీ ఒకేలా ఆడతారు. మరోలా ఆడితే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? అయితే, మీరు Angry Birds Stella POP గేమ్‌ని ఆడొచ్చు. యాంగ్రీ బర్డ్స్‌ గేమింగ్‌ రూపకర్తలే ఈ ఆటనీ రూపొందించారు. ఇదో పజిల్‌ గేమ్‌ అన్నమాట. అయితే, గేమ్‌లో యాంగ్రీబర్డ్స్‌, బుల్లి పంది పిల్లల సందడే సందడి అన్నమాట. తెరపై వివిధ రంగుల్లో బుడగలు ఉంటాయన్నమాట. ఒకే రంగులో ఉన్న బుడగల్ని మ్యాచింగ్‌ చేసి పేల్చాలి. ఎందుకంటే బుడగల లోపల బుజ్జి పంది పిల్లలు ఉంటాయి. వాటిని బయటికి లాగి స్కోర్‌ సాధించాలంటే బుడగల్ని మ్యాచింగ్‌ చేయాల్సిందే. అయితే, మ్యాచింగ్‌ చేసేప్పుడు కొన్ని పవర్‌ ప్యాక్స్‌ కూడా వస్తాయి. వాటిని ప్రయోగించి మరింత సులువుగా లెవల్స్‌ని పూర్తి చేయవచ్చు. ఒక్కరే ఏం ఆడతాం అనిపిస్తే... సోషల్‌ నెట్‌వర్క్‌ స్నేహితులతో జతకట్టొచ్చు. స్కోర్‌తో ఛాలెంజ్‌లు విసరొచొచ్చు. మొబైల్‌, ట్యాబ్లెట్‌లోనూ ఆట ప్రొగ్రస్‌ని సింక్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ గూగుల్‌ ప్లే నుంచి ఆటని పొందొచ్చు. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/vqqY5p లింక్‌ని చూడండి.

ప్లంబర్‌ పనే!
ఎప్పుడూ రేస్‌లు, రైడ్‌లు, ఫైట్‌లేనా? కాసేపు బుర్రకు పదును పెట్టే పజిల్‌ గేమ్‌ ఆడండి. అదీ బుల్లి తెరపై. ఆటేంటో తెలుసా? Plumber 2. పేరుకి తగ్గట్టుగానే తెరపై ముక్కలు ముక్కలుగా పైపులు ఉంటాయి. ఒకవైపు నీళ్లతో నిండిన పెద్ద పైపు ఉంటుంది. మరో వైపు అదే పరిమాణంలో ఖాళీ పైపు ఉంటుంది. ఆ రెండిటికి మధ్య ఉన్న చిన్న చిన్న పైపు ముక్కల్ని కలుపుతూ నీళ్లని మరో పైపులోకి ప్రవహించేలా చేయాలి. మీరు ఏ మాత్రం పైపుల్ని తప్పుగా బిగించినా ఆట అటకెక్కినట్టే. ఆటలో మరో విషయం ఏంటంటే... పైపుల్లో కొన్ని క్రిములు ఉంటాయి. అవి ఉన్న పైపుల్ని అనుసంధానం చేసి నీళ్లు వెళ్లేలా చేస్తే అదనపు స్కోర్‌ వస్తుంది. ఆటలో మొత్తం 1,000 లెవల్స్‌ ఉన్నాయి. లెవల్‌ మారుతున్న కొద్దీ బుర్రకు ఎక్కువ పని పెట్టాల్సి వస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు https://goo.gl/j84M5e లింక్‌లోకి వెళ్లండి.

తెలుగులోనే...
అన్నీ స్మార్ట్‌ మొబైల్‌ నుంచే. మెసేజ్‌లు, మెయిల్స్‌, ఛాటింగ్‌లు... ఇలా అన్నీ ఇంగ్లిష్‌లోనేనా? తెలుగులోనూ చేస్తే! అదెలా తెలుగులో టైపింగ్‌? అనే సందేహం అక్కర్లేదు. మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌ ఆప్‌లో Just Telugu Keyboard ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఆప్‌లోకి వెళ్లి టైపింగ్‌ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. ఆప్‌ని సెట్‌అప్‌ చేసుకునే విధానం, కీబోర్డ్‌ లేఅవుట్‌, టైపింగ్‌ చిట్కాల్ని చూడొచ్చు. తెలుగు కీబోర్డ్‌నే డీఫాల్ట్‌ ఇన్‌పుట్‌ కీబోర్డ్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా తిరిగి ఆండ్రాయిడ్‌ కీబోర్డ్‌ని పొందాలంటే టైపింగ్‌ విండోలోకి వెళ్లగానే తెర పై భాగంలో కీబోర్డ్‌ గుర్తు కనిపిస్తుంది. అదే Choose input method. దాంట్లోని English Google కీబోర్డ్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆప్‌ని గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/jGXs2x

గురి పెట్టండి!
మీరు ఎప్పుడైనా విల్లు ఎక్కు పెట్టారా? గురి చూసి బాణం వదిలారా? అయితే, Archery Master 3D గేమ్‌ ఆడొచ్చు. పూర్తిగా 3డీ గ్రాఫిక్స్‌తో ఆటని రూపొందించారు. ఆట ప్రారంభంలో రెండు లెవల్స్‌ కనిపిస్తాయి. Normal, Challenge మోడ్స్‌ ఉంటాయి. మొదటిది సెలెక్ట్‌ చేసుకుని ముందు సాధన చేయవచ్చు. Pine Forest, Archery Field, Deadly Desert, Rain Forest విభాగాలు ఉంటాయి. మొదటిది సెలెక్ట్‌ చేసి 10 లెవల్స్‌ పాస్‌ అయితే అప్పుడు ఛాలెంజ్‌కి అర్హులు అవుతారు. ఆటలో కంట్రోల్స్‌ ఏముంటాయి? అనేగా సందేహం. వేలితో తెరని తాకి విల్లుని ఎక్కు పెట్టి గురి చూడడమే. వేలు తెరపై నుంచి తీసేస్తే చాలు. బాణం దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. లెవల్స్‌ దాటుతూ వేళ్లే క్రమంలో లక్ష్యం కదులుతూ కనిపిస్తుంది. ప్రతి లెవల్‌లోనూ ఒరలో ఉన్న బాణాలతో నిర్ణీత స్కోర్‌ సాధించాలి. అప్పుడే లెవల్‌ని దాటగలరు. నార్మల్‌ మోడ్‌లో వందకుపైనే లెవల్స్‌ ఉన్నాయి. ఛాంపియన్‌లా కంప్యూటర్‌తో పోటీ పండేందుకు ఛాలెంజ్‌ మోడ్‌లోకి వెళ్లండి. ఆడి చూద్దాం అనుకుంటే http://goo.gl/5Ae0as లింక్‌లోకి వెళ్లండి.

ప్రింట్‌లో ఆదా!
వర్డ్‌ ప్రాసెసింగ్‌ టూల్స్‌తో తయారు చేసిన డాక్యుమెంట్‌లు ప్రింట్‌ తీసుకునేటప్పుడు అన్ని ప్రింట్‌ సెట్టింగ్స్‌ సరిగా ఉన్నవో లేదో చెక్‌ చేసుకుని మరీ ప్రింట్‌లు తీసుకుంటాం. కానీ, నెట్టింట్లో వెబ్‌ పేజీలను ప్రింట్‌ తీసుకునేటప్పుడు మెనూలు, లోగోలు, వెబ్‌ డిజైనింగ్‌ గ్రాఫిక్స్‌ ఉంటాయి. వాటితో మీకు అవసరం ఉండదు. టెక్స్ట్‌ మాత్రం ప్రింట్‌ తీసుకుంటే చాలు అనుకుంటారు. అదెలా సాధ్యం? క్రోమ్‌ బ్రౌజర్‌ వాడితే చిన్న అదనపు చిట్కాని బ్రౌజర్‌కి జత ప్రింట్‌ ప్రివ్యూలో అక్కర్లేని వాటిని తీసేయవచ్చు. Print Edit వెబ్‌ స్టోర్‌ ఎక్స్‌టెన్షనే ఆ చిట్కా. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ని నుంచి బ్రౌజర్‌కి జత చేయాలి. దీంతో అడ్రస్‌బార్‌ పక్కనే ఐకాన్‌ గుర్తు వస్తుంది. ఇక ఏదైనా వెబ్‌ పేజీని ప్రింట్‌ తీసుకునే ముందు అక్కర్లేని వాటిని తొలగించేందుకు పేజీకి కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేసి 'ప్రింట్‌ ఎడిట్‌' ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. దీంతో అదనపు ఆప్షన్లతో కొత్త ట్యాబ్‌లో పేజీ ఓపెన్‌ అవుతుంది. Edit ఆప్షన్‌పై క్లిక్‌ చేసి అక్కర్లేని వాటిని సెలెక్ట్‌ చేసి డిలీట్‌ చేయవచ్చు. బొమ్మలు, ఇతర హెడ్డింగ్స్‌, లింక్స్‌, బాక్స్‌లు... పేజీలో కనిపించే అన్నీ ఒక్కొక్కటిగా సెలెక్ట్‌ అవుతాయి. పొరబాటున డిలీట్‌ చేసి Undo చేయవచ్చు. అసలు డిలీట్‌ చేయడం ఎందుకు అనుకుంటే Hide చేయవచ్చు.పేజీలో సెలెక్ట్‌ చేసినవి కాకుండా మిగతా మొత్తం తొలగిపోవాలంటే Delete Except ఆప్షన్‌ ఉంది.చివరిగా పేజీని ప్రింట్‌ తీసుకుందాం అనుకుంటే Print ఆప్షన్‌ ఉంది. ఎక్స్‌టెన్షన్‌ డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/1llMdd లింక్‌లోకి వెళ్లండి.

అన్నీ ఒకే చోట
నెట్‌ బ్రౌజింగ్‌లో ఏవేవో చూస్తుంటాం. కొన్ని సైట్‌లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాంటి వెబ్‌ పేజీలను తీరిగ్గా చదువుదాం అనుకుంటారు. వీడియోలనూ తర్వాత చూద్దాంలే అనుకుంటారు... ఇలా అనుకున్న వాటిని ఓ స్థావరంగా పెట్టుకుని సులువుగా మేనేజ్‌ చేసుకుందాం అనుకుంటే? http://feedly.com సైట్‌లోకి వెళ్లండి. నెట్టింట్లో చదివే అన్ని వార్తాంశాలు, వారపత్రికలు, బ్లాగుల్లోని వ్యాసాల్ని గుత్తగా సైట్‌లో పెట్టుకుని తీరిగ్గా బ్రౌజ్‌ చేయవచ్చు. హోం పేజీలోని 'ఎక్స్‌ప్లోర్‌' ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు. సెర్చ్‌ ద్వారా కావాల్సిన అంశం అప్‌డేట్స్‌ని వెతకొచ్చు. సైట్‌లో సభ్యులై ఇతరుల స్థావరాల్ని యాక్సెస్‌ చేయవచ్చు. నచ్చిన అప్‌డేట్స్‌ని సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై పోస్ట్‌ చేసే వీలుంది. కంప్యూటర్‌లోనే కాదు. ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీల్లోకి సింక్‌ చేసుకుని అన్నింటిలోనూ వాడుకోవచ్చు.

పెంగ్విన్‌తో పాటు...
సరదాగా కాసేపు మంచు పర్వాతాల్లో విహరిద్దాం అనుకుంటే ఈ పెంగ్విన్‌కి తోడుగా మీరు వెళ్లండి. ఎందుకంటే ఇది మంచు పర్వతాలపై స్కేటింగ్‌ చేస్తుంది. దానికి మీరు సాయం చేయాలన్నమాట. ఆటేంటో తెలుసా? Club Penguin Sled Racer. డిస్నీ సంస్థ ఆటని రూపొందించింది. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే అన్ని హంగులతో పెంగ్విన్‌ సిద్ధంగా ఉంటుంది. మీ సాయంతో పెంగ్విన్‌ ఎంత దూరం ప్రయాణం చేయగలితే అంత స్కోర్‌ మీరు సాధించినట్టు. పెంగ్విన్‌ ఏ దిశగా ప్రయాణించాలనేది తెరపై కంట్రోల్స్‌తో మీరు నిర్దేశించొచ్చు. ఏముందిలే... నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్లొచ్చు అనుకుంటే పోరబాటే. ఎతైన మంచు పర్వతాలపై నుంచి పెంగ్విన్‌ మెరుపు వేగంతో దూసుకుపోతుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా పెంగ్విన్‌ ప్రాణం పోయినట్టే. దార్లో పవర్‌ ప్యాక్స్‌ని తీసుకుని దూసుకెళ్లొచ్చు. Parachute పవర్‌ ప్యాక్‌తో కాసేపు గాల్లో ఎగురుతూ ప్రయాణించొచ్చు. Tube Wax, Toot Blaster, Revive... లాంటి మరిన్ని పవర్‌ ప్యాక్స్‌ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. మరెందుకు ఆలస్యం... http://goo.gl/MQ8cMK లింక్‌ని చూడండి.

టైమర్‌ కావాలా?
సిస్టంపై చేస్తున్న పనిలో కాస్త విరామం తీసుకోవడానికో లేదా ఏదైనా పనిని పూర్తి చేయడానికి నిర్ణీత సమయాన్ని సెట్‌ చేయడానికో ఇంకా మరేదైనా పనికో టైమర్‌ని సెట్‌ చేసుకుంటాం. సిస్టంలో ఈ టైమర్‌ని సెట్‌ చేయాలంటే ఏం చేస్తారు? ఏవైనా ఉచిత టూల్స్‌ ఉన్నాయేమో చూస్తాం అంటారా? అంత కష్టపడక్కర్లేదు. సింపుల్‌గా http://e.ggtimer.com సైట్‌లోకి వెళ్లండి. Start a timer బాక్స్‌లో టైంని ఎంటర్‌ చేయాలి. ఒకవేళ టైమర్‌ పూర్తయ్యాక ఏదైనా ఎలర్ట్‌ తెరపై రావాలి అనుకుంటే పక్కనే ఉన్న ఆప్షన్స్‌పై క్లిక్‌ చేయాలి. వచ్చిన మెనూబార్‌లోని Alert Type, Alert Volume, Alert Box ఆప్షన్స్‌లో మీకు కావాల్సినట్టుగా ఎలర్ట్‌ని సెట్‌ చేసుకోవచ్చు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక బివీ బటన్‌పై నొక్కాలి. అంతే... టైమర్‌ స్టార్ట్‌ అవుతుంది. పూర్తవ్వగానే అలర్ట్‌ చేస్తుంది.

నీళ్లపై దూసుకెళ్లండి
ఎప్పుడూ బైకులు... కార్లు... విమానాలు... ఏం నడుపుతారు. కాసేపు స్పీడ్‌బోట్‌ నడపండి. దాంట్లో ఏముందీ సోలోగానేగా అనుకునేరు. అదో పడవల పోటీ. ఆటేంటో తెలుసా? Boat Racing. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో నీళ్లపై రేస్‌ని రూపొందించారు. పోటీ పడే కాలువల్ని 8 రకాల నేపథ్యాల్లో రూపొందించారు. ఉదాహరణకు మీకు ద్వీప సముదాయంలో పోటీ పడాలనుకుంటే Islands సెలెక్ట్‌ చేయవచ్చు. ఒకవేళ పర్వతాల మధ్య ప్రవహించే నదిలో పోటీ పడాలనుకుంటే Mountain మోడ్‌ ఉంది. పడవల్ని మీకు నచ్చినట్టుగా మార్పులు చేయవచ్చు. Single Race, Championship, Free మోడ్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... ఆడేద్దాం అనుకుంటే http://goo.gl/mr9Ww8 లింక్‌లోకి వెళ్లండి.

మీరూ కప్‌ అందుకోండి!
వరల్డ్‌ కప్‌ వేడి మరింత పెరిగింది. క్రికెట్‌ ప్రియులందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. మీరూ అదే కోవకి వస్తారా? అయితే, మ్యాచ్‌ విరామ సమయాల్లో మీరూ క్రికెట్‌ ఆడేయండి. అంటే... బ్యాట్‌, బాల్‌ పట్టుకుని బయటికి వెళ్లమంటారా? అని అడగొద్దు. జేబులో నుంచి ఫోన్‌ తీయండి. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అయితే గూగుల్‌ ప్లే ఓపెన్‌ చేయండి. World Cup Cricket Champs- 2015 గేమ్‌ని పొందండి. మీరూ స్క్వేర్‌ కట్‌లు, హెలికాప్టర్‌ షాట్‌లు కొట్టొచ్చు. Net Practice, Tournament మోడల్స్‌లో ఆటని ప్రారంభించొచ్చు. 14 దేశాల క్రికెట్‌ టీంలను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని రకాల బౌలర్స్‌ని ఎదుర్కొనొచ్చు. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌, యానిమేషన్స్‌తో గేమ్‌ని డిజైన్‌ చేశారు. అన్ని రకాల షాట్‌లను ఆడేందుకు ప్రయత్నించొచ్చు. ఆటని పొందేందుకు http://goo.gl/qkEp2r లింక్‌లోకి వెళ్లండి.

యుద్ధం చేస్తారా?
కార్లు, బైకులు ఏంతసేపని... కాసేపు విమానం నడపండి! వూరికే ఆకాశంలో విహారం అనుకునేరు! యుద్ధం చేయాలి! బాంబులు విసరాలి! చాకచక్యంగా నడుపుతూ శత్రువుల్ని మట్టు పెట్టాలి! ఏంటా ఆట? పేరు Big Air War పీసీ యూజర్లకు ప్రత్యేకం!
విమానం నడపడం అంటే ఆటలో గేమింగ్‌ ఆప్షన్లు ఎక్కువగా ఉంటాయోమో? అనే సందేహం అక్కర్లేదు. కేవలం మౌస్‌ ఒక్కటే వాడితే సరిపోతుంది. ఆటని ఇన్‌స్టాల్‌ చేసుకునేందుకు http://goo.gl/Iqrk9t లింక్‌లోకి వెళ్లండి. సెట్‌అప్‌ని డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయడమే. ఎలాంటి అదనపు టూల్స్‌తో పని లేదు. ఆట ప్రారంభంలో విమానాన్ని నడిపేందుకు తగిన సాధన అవసరం అనుకుంటే 'న్యూ గేమ్‌'లోకి వెళ్లి 'ఈజీ' మోడ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. సాధన తర్వాత 'మీడియం, హార్డ్‌' లెవల్స్‌ని ప్రయత్నించొచ్చు. అలాగే, లెవల్స్‌ మారుతున్న కొద్దీ శత్రువుల నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు దాడికి దిగుతాయి. వాటి నుంచి తప్పించుకుంటూ తెలివిగా మట్టుబెట్టాలి. మీరు ప్రయాణించే విమాన సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు తెర పై భాగంలో స్టేటస్‌ బార్‌ కనిపిస్తుంది.

బుల్లి తెరపై పజిల్‌ గేమ్‌
డెస్క్‌టాప్‌పై యుద్ధం చేసి అలసిపోతే.... జేబులోని స్మార్ట్‌ ఫోన్‌ తీయండి. కాసేపు పజిల్‌ గేమ్‌ ఆడదాం. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ అయితే గూగుల్‌ స్టోర్‌లోకి వెళ్లండి. దాంట్లో Block Puzzle King గేమ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. అన్ని పజిల్‌ గేమ్‌లకు భిన్నంగా దీన్ని రూపొందించారు. తెరపై విడిగా కొన్ని భాగాలు (బ్లాక్స్‌), ఖాళీ బాక్స్‌ ఉంటాయి. బయట విడిగా ఉన్న బ్లాక్స్‌ని ఖాళీ బాక్స్‌లో సరిగ్గా సరిపోయేలా అమర్చాలి. ఆటలో మొత్తం ఆరు (Classic, Double, Shape, Spin, Trick, Fusion) రకాల విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు 'స్పిన్‌' విభాగాన్ని సెలెక్ట్‌ చేసుకుంటే బ్లాక్స్‌ని తిప్పుతూ బాక్స్‌లో అమర్చుతూ పజిల్‌ని పూర్తి చేయవచ్చు. తిప్పేందుకు అనువుగా బ్లాక్స్‌ పక్కనే వృత్తాకారపు గుర్తు కనిపిస్తుంది. మల్టీప్లేయర్‌ సపోర్ట్‌తో స్నేహితులు కలిసి ఆడుకోవచ్చు. ట్యాబ్లెట్‌లపైనా గేమ్‌ని ఆడుకోవచ్చు. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/aAXGmm లింక్‌లోకి వెళ్లండి.

క్రేజీగా నడపండి
కాసేపు సరదాగా క్రేజీ కారు డ్రైవర్‌ అవతారం ఎత్తాలంటే? చేతిలోకి స్మార్ట్‌ మొబైల్‌ లేదా ట్యాబ్‌ తీయండి. Crazy Taxi City Rush గేమ్‌ని ఆడేయండి. గేమ్‌ని ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత మీకు నచ్చిన అవతార్‌ని మీ పేరుతో క్రియేట్‌ చేయవచ్చు. ఇంకేముందీ... కారు, కస్టమర్లు సిద్ధంగా ఉంటారు. మీరిక దూసుకెళ్లిపోవడమే. ట్రాఫిక్‌ ఉంటుంది. కానీ, ఎలాంటి రూల్స్‌ ఉండవు. గాల్లోకి లేపి పల్టీలు కొడుతూనే కారుని గమ్య స్థానానికి చేర్చొచ్చు. దార్లో మీరెన్ని డాలర్లు అందుకుంటే అంత సంపాదన. నెట్‌కి అనుసంధానమైతే ఫేస్‌బుక్‌లో స్నేహితులకు సవాల్‌ విసరొచ్చు కూడా. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/H0dRdZ లింక్‌లోకి వెళ్లండి.

తెరపైనే క్యాలెండర్‌
నిత్యం ఏదో ఒక పనితో బిజీ బిజీగా గడుపుతారా? అయితే, మొత్తం పనులు, అపాయింట్‌మెంట్స్‌ని మేనేజ్‌ చేసుకునేందుకు అనువుగా చాలానే డెస్క్‌టాప్‌ టూల్స్‌ ఉన్నాయి. కానీ, మీరు ఎప్పుడైనా DesktopCal సాఫ్ట్‌వేర్‌ని వాడారా? ఇదో ఉచిత సాఫ్ట్‌వేర్‌. తెరపై క్యాలెండర్‌ పరిమాణాన్ని మార్చుకునేందుకు Adjust గుర్తుపై క్లిక్‌ చేయాలి. క్యాలెండర్‌ సెలెక్ట్‌ అయ్యాక కావాల్సిన మేరకు మార్పులు చేయవచ్చు. ఒకవేళ తెరపై లేకుండా మాయం చేయాలంటే More పై క్లిక్‌ చేసి Hide Calendar ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. థీమ్‌ స్త్టెల్‌ని మార్చుకునేందుకు Settings మెనూ ఉంది. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/RXPBcw లింక్‌లోకి వెళ్లండి.

డబ్బులూ పంపొచ్చు!
వాట్సప్‌.. హైక్‌.. టెలికామ్‌.. ఇలాంటి మెసెంజర్‌లతో ఏమేం చేయొచ్చు? సందేశాలు, ఫొటోలు, వీడియోలు.. పంపొచ్చు. కొన్నింట్లో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అంతేగా! వీటితోపాటు డబ్బులూ పంపించే సదుపాయం కల్పిస్తోంది స్నాప్‌చాట్‌ మెసెంజర్‌. ఇందులో మన డెబిట్‌, క్రెడిట్‌ కార్డు అకౌంట్‌ ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. మనం ఎవరి అకౌంట్‌కైనా నగదు బదిలీ చేయొచ్చు. మొబైల్‌ పేమెంట్స్‌ సంస్థ 'స్వేర్‌'తో కలిసి ఈ కొత్త సదుపాయం ప్రారంభించారు. ఈ లావాదేవీలను 'స్నాప్‌ క్యాష్‌'గా పరిగణిస్తారు. ఉపయోగించేవారి వయసు పద్దెనిమిదేళ్లు దాటాలనేది నియమం.

నచ్చిన పాటలు ఒకే దగ్గర..
యూట్యూబ్‌లో మీకు నచ్చిన పాటలను వెతుక్కోవడం కొంచెం కష్టమే. సెర్చ్‌లోకి వెళ్లి వెతికే అవకాశమున్నప్పటికీ అందులో అన్నీ గంపగుత్తగా వచ్చి చేరుతాయి. పాటలను వినాలనుకునేవారికి సౌలభ్యంగా ఉండటానికి యూట్యూబ్‌ కొత్త ఆప్షన్‌ను తెచ్చి పెట్టింది. అందులోకెళ్తే ప్రపంచ సంగీతంలో పాటలు ఉంటాయి. సినిమా, గాయకుడు, సంగీత దర్శకుడు... ఇలా వివిధ విభాగాలు ప్లే లిస్ట్‌ రూపంలో ఉంటాయి. ఒక్కో ప్లేలిస్ట్‌లో 10 నుంచి 15 పాటలుంటాయి. అలా గంటపాటు నాన్‌స్టాప్‌ పాటలను వినే, చూసే అవకాశం సులభంగా దొరుకుతుంది.

తాళం వేయండి..
పాస్‌వర్డ్‌ మర్చిపోతామనే బెంగ లేదు. ఎవరైనా దొంగిలిస్తారనే భయం అక్కర్లేదు. 'గూగుల్‌ సెక్యూరిటీ యూఎస్‌బీ స్టిక్‌' వాడితే మీ గూగుల్‌, జీమెయిల్‌ అకౌంట్‌ ఇక పదిలమే. దీంతో ఇంటికి తాళం వేసుకున్నట్టే మన అకౌంట్‌కి తాళం వేసుకోవచ్చు. కీచైన్‌ మాదిరిగానే వాడుకోవచ్చు. పీసీ, ల్యాపీ, ట్యాబ్‌లకు అనుసంధానం చేయగానే పాస్‌వర్డ్‌ అడుగుతుంది. మ్యాచ్‌ అయితేనే అకౌంట్‌ తెరుచుకుంటుంది. పాస్‌వర్డ్‌ లేకుండా కేవలం స్టిక్‌ పెట్టగానే నేరుగా అకౌంట్‌ ఓపెన్‌ అయ్యేలా కూడా సెట్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ధర సుమారు రూ.1200.

ఓపెన్‌గా చదవండి
విద్యార్థి దశలో పాఠ్యాంశాల్లో ఎన్నో సందేహాలు. ఉపాధ్యాయుల్ని... వెంటే ఉండే ఫ్రెండ్స్‌ని అడుగుతాం. నివృత్తి చేసుకుంటాం. వారెవరూ లేనప్పుడు ఏం చేస్తారు? నెట్టింట్లో స్నేహితుల్ని అడిగితే సరి. అదెలాగో తెలియాలంటే http://openstudy.com సైట్‌ ఓపెన్‌ చేయండి. ఇదో ఆన్‌లైన్‌ కమ్యూనిటీ. సభ్యుల సంఖ్య ఒక మిలియన్‌కి చేరింది. 190 గ్రూపులు ఉన్నాయి. మరెందుకాలస్యం... సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకుని సభ్యులైపోండి.

కార్డులు కరిగిపోతాయి
అన్ని చోట్లా డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులే! జేబులో క్యాష్‌ ఉండాలన్న మాటే లేదు. ఇలాంటి సందర్భాల్లో పర్సుతోపాటు కార్డులు పోయే అవకాశాలూ ఎక్కువే. అప్పుడేం చేస్తాం. కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి కార్డ్‌ల వాడకాన్ని బ్లాక్‌ చేస్తాం. కానీ, భవిష్యత్‌లో ఏం చేస్తామో తెలుసా? సింపుల్‌గా కార్డ్‌ని కరిగిపోయేలా చేయవచ్చు. అందుకు తగిన సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ మెటీరియల్స్‌ తయారీలో అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు వాడే మెటీరియల్స్‌ని Transient ఎలక్ట్రానిక్స్‌గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకూ రక్షణ, వైద్య రంగాల్లో మాత్రమే వాడారట. ఉదాహరణకు వైద్యం నిమిత్తం చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని శరీరంలోకి పంపుతారు. దాని పని పూర్తయ్యాక ఎలాంటి హానీ లేకుండా కరిగిపోయేలా చేస్తారట. అలాగే, శత్రువుల స్థావరంలోకి చిన్న మిలటరీ పరికరాన్ని పంపుతారు. కావాల్సిన సమాచారాన్ని సేకరించాక చిటికెలో కరిగిపోయేలా చేస్తారు. ఇవన్నీ ప్రస్తుత అత్యాధునిక టెక్‌ ప్రపంచంలో ఎలా సాధ్యమవుతున్నాయో... భవిష్యత్‌లో ఈ తరహా ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీని ఇతర రంగాల్లోనూ వాడుకునేలా lowa State విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ప్రయత్నిస్తోంది. సింపుల్‌గా... కార్డులో ఏర్పాటు చేసిన 'ట్రిగ్గర్‌'ని యాక్టివేట్‌ చేయడం ద్వారా కరిగిపోయేలా చేయవచ్చట. ఇంకేముందీ... భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మొబైల్‌ పోయిందనో... క్రిడిట్‌ కార్డు కొట్టేశారనో చింతించక్కర్లేదు. పనికిరాకుండా కరిగిపోయేలా చేయవచ్చు.

ఎక్కడున్నా సరే...
అందరూ ఏదో ఒక మెస్సేజింగ్‌ సర్వీసుని వాడుతూనే ఉంటారు. కానీ, బృందంగా ఏర్పడి ఏదైనా వ్యాపారమో, ప్రాజెక్ట్‌ వర్కో చేస్తున్నప్పుడు ఎలాంటి మెస్సేజింగ్‌ సర్వీసుని వాడతారు? ఏదో ఒకటి వాడితే సురక్షితం కాదు. Cotap సర్వీసుని ప్రయత్నించి చూడండి. ఉచితంగా సభ్యులై వాడుకోవచ్చు. సభ్యులందరూ గ్రూపుగా ఏర్పడి మెసేజింగ్‌ చేసుకోవచ్చు. ఫోటోలు, ఫైల్స్‌ని షేర్‌ చేసుకునే వీలుంది. అందుకు క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసులతో (బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌) ఆప్‌ సింక్‌ అయ్యి పని చేస్తుంది. షేర్‌ చేసిన ఫైల్స్‌ని ఆప్‌లోనే ఓపెన్‌ చేసుకుని చూడొచ్చు. సురక్షితంగా మెసేజింగ్‌ వ్యవస్థ పని చేస్తుంది. ల్యాపీ, ట్యాబ్‌, మొబైల్‌... అన్నింటిలోనూ మెసేజింగ్‌ సర్వీసు సింక్‌ అయ్యి పని చేస్తుంది. అంటే మొబైల్‌, ట్యాబ్‌ల్లోనూ ఆప్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని వాడుతుంటే గూగుల్‌ ప్లే నుంచి ఆప్‌ని నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/ LwbK0v
* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడితే ఐట్యూన్స్‌ని ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/Uliu2H

ఉంగరం చదువుతుందయా!
అంధులు, దృష్టి లోపం ఉన్నవారికి టెక్నాలజీ అండగా నిలుస్తోంది. మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రత్యేక బృందం రూపొందించిన ఓ కొత్త గ్యాడ్జెట్‌ అందుకు తాజా ఉదాహరణ. చిత్రంలో వేలికి కనిపించేది అదే. పేరు Finger Reader. అంధులు, కంటి చూపు సరిగా లేని వారు దీన్ని చూపుడు వేలికి ధరించి ఏదైనా మేటర్‌పై ఉంచితే చాలు. చదివి వినిపిస్తుంది. చూపుడు వేలిని లైను వెంబడి తీసుకెళ్తే చాలు. పుస్తకాలు, పేపర్‌పై టెక్ట్స్‌ని మాత్రమే కాదు. కంప్యూటర్‌, ట్యాబ్‌, మొబైల్స్‌లోని మేటర్‌ని కూడా చదివి వినిపిస్తుంది. వేలికి ధరించిన ఈ యంత్రం ఎలా చదువుతుందో తెలుసా? ఉంగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరా కంటితో. రింగ్‌కి పై భాగంలో కెమెరా ఉంది. వేలిని జరుపుతూ వెళ్లేప్పుడు కెమెరా టెక్ట్స్‌ని స్కాన్‌ చేసి సాఫ్ట్‌వేర్‌కి పంపుతుంది. పరికరంలో నిక్షిప్తం చేసిన సాఫ్ట్‌వేర్‌ స్కాన్‌ చేసిన పదాల్ని గుర్తించి చదివి వినిపిస్తుంది. ఒకవేళ చూపుడు వేలు టెక్ట్స్‌ లైన్‌ని తిన్నగా చూపించకుంటే రింగ్‌ వెంటనే వైబ్రేట్‌ అవుతుంది. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ రింగ్‌ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/pbyRHS లింక్‌ని చూడండి.

 

 

 

వీడియో... ఆడియో
యూట్యూబ్‌లో కాలక్షేపానికి వీడియోలు చూస్తుంటాం. వాటిల్లో కొన్ని వీడియోలు బాగా నచ్చుతాయి. ఉదాహరణకు పాటలు. మరి, మీకు నచ్చిన పాటని యూట్యూబ్‌ నుంచి సరాసరి డౌన్‌లోడ్‌ చేసుకుంటే? ఏదైనా సాఫ్ట్‌వేర్‌ వాడాలేమో అనుకునేరు. ఏం అక్కర్లేదు. మీరు ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే యాడ్‌ఆన్‌ రూపంలో Youtube Video and Audio Downloader సర్వీసుని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. ఇక మీరు వీక్షించే వీడియోల కింది భాగంలో Downloadఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి కావాల్సిన ఫార్మెట్‌లో ఆడియో, వీడియో ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపీ4, ఎఫ్‌ఎల్‌వీ, 3జీపీ ఫార్మెట్‌ల్లో వీడియోలను వివిధ పిక్సల్స్‌ క్వాలిటీతో పొందొచ్చు. డౌన్‌లోడ్‌ చేసిన వాటిని ఫార్మెట్‌ని కూడా యాడ్‌ఆన్‌తో మార్చుకోవచ్చు. http://goo.gl/A0TpZX.

డ్రైవ్‌ మాదిరిగానే!
క్లౌడ్‌ స్టోరేజ్‌లు ఒకటా రెండా? ఉచిత సర్వీసులు చాలానే ఉన్నాయి. వాటిల్లో డ్రాప్‌బాక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి, డ్రాప్‌బాక్స్‌ సర్వీసుని సిస్టంలో సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. అంటే... సిస్టంలోనే 2 జీబీ మెమొరీతో ప్రత్యేక డ్రైవ్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేసుకున్నట్టే అన్నమాట. కావాలంటే Dropbox 2.8.0 సెట్‌అప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఐకాన్‌ గుర్తు తెరపై కనిపిస్తుంది. ఇక ఎప్పుడైనా కావాల్సిన ఫైల్స్‌ని 'డ్రాప్‌బాక్స్‌'లోకి సింక్‌ చేసుకోవచ్చు. సిస్టంలో చేసినట్టుగానే డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఫైల్స్‌్‌ని భద్రం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే... ముఖ్యమైన ఫైల్స్‌కి ఇదో ఆన్‌లైన్‌ బ్యాక్‌అప్‌ అన్నమాట. ఫోల్డర్‌లోకి సింక్‌ చేసిన ఫైల్స్‌ని ఎక్కడైనా ఓపెన్‌ చేసుకుని ఆన్‌లైన్‌లో చూడొచ్చు. సెట్‌అప్‌ http://goo.gl/0n wUFw లింక్‌ని చూడండి.

మ్యూజిక్‌తో...
మీరేదైనా కథ రాశారా? లేదా బ్లాగ్‌లో వ్యాసం రాశారా? లేదంటే.... మనస్సుకు హత్తుకునే కవిత రాశారా? అయితే, వాటికి మంచి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ని జత చేయవచ్చు తెలుసా? అదెలాగో తెలియాలంటే www.booktrack.com సైట్‌లోకి వెళ్లండి. ఉచితంగా వెబ్‌ సర్వీసుని వాడుకోవచ్చు. హోం పేజీలో ఉన్న పుస్తకాల్ని చదవొచ్చు. ఒకవేళ మీరు రాసిన వాటికి మ్యూజిక్‌ ట్రాక్‌కి జత చేయాలంటే Create Your ownపై క్లిక్‌ చేయండి. ఫేస్‌బుక్‌, జీమెయిల్‌ ఐడీ వివరాలతో లాగిన్‌ అవ్వొచ్చు. లేదా ప్రత్యేకంగా ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆప్‌ రూపంలో మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/FYe4UF* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. http://goo.gl/k4LZ5D

పీడీఎఫ్ లో ఎడిటింగ్
నెట్‌ నుంచి అనేక రకాల పీడీఎఫ్‌ ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేస్తుంటాం. సిస్టంలో క్రియేట్‌ చేస్తుంటాం. మరి, ఎప్పుడైనా వాటిని ఎడిట్‌ చేసుకోవాలంటే? ఉదాహరణకు ఏదైనా పీడీఎఫ్‌ ఫైల్‌లోని ఇమేజ్‌నో... టెక్స్ట్‌ మేటర్‌లో తొలగించాలంటే? ఫొటోషాప్‌ లాంటి టూల్స్‌నే వాడక్కర్లేదు. సులువైన ఇంటర్ఫేస్‌తో కూడిన అప్లికేషన్లు చాలానే ఉన్నాయి. కావాలంటే PDFEraser టూల్‌ని ప్రయత్నించండి. ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని టూల్‌బార్‌లోని Small, Medium, Large Eraser ఆప్షన్లతో ఎంపిక చేసుకున్న పీడీఎఫ్‌లో కావాల్సిన వాటిని చెరపొచ్చు. ఆ చెరిపిన చోటే కొత్త ఇమేజ్‌లను పెట్టుకోవచ్చు. Add Text ద్వారా మేటర్‌ని కూడా జత చేయవచ్చు. అన్ని మార్పులు చేసిన తర్వాత Save PDF ఆప్షన్‌తో ఫైల్‌ని సేవ్‌ చేయాలి. ఫాంట్‌ రంగులు కూడా మార్చుకునే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/H2S3Zi లింక్‌లోకి వెళ్లండి.

ఎడిట్ చేయాలా?
సిస్టంలో వీడియో ఫైల్స్‌ ఎడిటింగ్‌ అంటే... సాఫ్ట్‌వేర్‌లు వెతకాలి. ఇన్‌స్టాల్‌ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్‌ అనుకుంటాం. కానీ, ఇవేం అక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే ఉచితంగా ఎడిట్‌ చేయవచ్చు. అందుకు అనువైనదే www.videotoolbox.com వెబ్‌ సైట్‌. దీంట్లో ఉచితంగా సభ్యులై వీడియోలను ఎడిట్‌ చేయవచ్చు. 600 ఎంబీ మెమొరీ ఫైల్స్‌ని సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసుకుని ఎడిట్‌ చేయవచ్చు. అప్‌లోడ్‌ చేసిన వీడియోలను కావాల్సిన ఫార్మెట్‌లోకి కన్వర్ట్‌ చేసుకునే వీలుంది. ఎడిట్‌ చేసిన వీడియో పైన టెక్స్ట్‌, వాటర్‌ మార్క్‌లను పెట్టుకోవచ్చు కూడా. ముక్కలుగా ఉన్న వీడియో ఫైళ్లను ఒకే ఫైల్‌గా 'మెర్జ్‌' చేయవచ్చు. వీడియో ఫైల్‌ నుంచి ఆడియో, సబ్‌ టైటిల్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేయవచ్చు. కొత్తగా వీడియోకి సబ్‌ టైటిల్స్‌ని యాడ్‌ చేయవచ్చు. వీడియో ఫైల్‌ నుంచి కావాల్సిన భాగాన్ని 'క్రాప్‌' చేసుకునే వీలుంది.

ఇదో ప్రత్యేక వేదిక
మొబైల్‌, పీసీ, ట్యాబ్లెట్‌, నోట్‌బుక్‌... ఏది వాడుతున్నా అన్నింటిలోనూ కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు సింక్‌ చేసుకుని బ్యాక్‌అప్‌ అయ్యేలా చేసేందుకు అనువైన వేదిక ఒకటి ఉంది. అదేPhonecopy. కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, క్యాలెండర్‌ ఎంట్రీలను బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. అందుకు సైట్‌లో సభ్యులై ఫోన్‌కాపీ అప్లికేషన్‌ని వాడుతున్న అన్ని డివైజ్‌ల్లోనూ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. బ్యాక్‌అప్‌ చేసిన డేటా ఫోన్‌కాపీ సర్వర్‌లో సేవ్‌ అవుతుంది.
* ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/9rJ8lD
* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌లోకి వెళ్లండి. http://goo.gl/TuDcYM
* పీసీ యూజర్లు www.phonecopy.com సైట్‌ని చూడండి.

క్రోమ్‌ వాడుతున్నారా?
వెబ్‌ విహారానికి గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నారా? మరి, దాంట్లో పెట్టుకున్న బుక్‌మార్క్‌లు, ఎక్స్‌టెన్షన్లు, థీమ్స్‌, ఆప్స్‌, హిస్టరీ, సెట్టింగ్స్‌ని ఇతర సిస్టమ్స్‌లోని బ్రౌజర్లలో కూడా పొందాలంటే? సెట్టింగ్స్‌ మెనూలోకి వెళితే Sign into Chrome ఆప్షన్‌ కనిపిస్తుంది. క్లిక్‌ చేసి జీమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. ఇక మీదట మీరు ఏ సిస్టంలోనైనా క్రోమ్‌ బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసి జీమెయిల్‌ వివరాలతో లాగిన్‌ అవ్వగానే అన్ని బుక్‌మార్క్‌లు, ఎక్స్‌టెన్షన్లు, థీమ్స్‌... అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఏవైనా మార్పులు చేస్తే ఎకౌంట్‌లో సేవ్‌ అవుతాయి. తిరిగి వేరే సిస్టంలో క్రోమ్‌ని వాడితే అక్కడా అప్‌డేట్‌ అవుతాయి. ఒకవేళ గూగుల్‌ ఎకౌంట్‌ని డిస్‌కనెక్ట్‌ చేయాలనుకుంటే 'ఎకౌంట్‌ సెట్టింగ్స్‌'లోకి వెళ్లి Disconnect your Google Account పై క్లిక్‌ చేయండి. సింక్రనైజ్‌ సెట్టింగ్స్‌ని మార్చేందుకు Advanced Sync Settings మెనూలోకి వెళ్లండి.

తెలుగులోనే!
ఫలానా పండగ ఎప్పుడు వచ్చింది? ఈ రోజు నక్షత్రం, తిధి ఏంటి? రాహు కాలం ఎప్పుడు?... లాంటి విషయాలు తెలియాలంటే తెలుగు క్యాలెండర్‌ ఎక్కడుందా అని వెతకక్కర్లేదు. సింపుల్‌గా చేతిలోకి స్మార్ట్‌ మొబైల్‌ తీసుకోండి. ఆండ్రాయిడ్‌ స్టోర్‌లోకి వెళ్లి Telugu Calendar ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. రాహుకాలం, యమగండం ఎప్పుడో తెలుసుకోవచ్చు. కావాలంటే http://goo.gl/9VLWBK లింక్‌లోకి వెళ్లండి.

చిమ్మ చీకట్లో ఆట!
ఒక్కసారి వూహించండి... అదో వీడియో గేమ్‌. కారు చీకట్లో... ఒక్కడే బిక్కు బిక్కుమంటూ చూస్తుంటాడు. ఏవేవో భయంకరమైన అరుపులు. చిత్ర విచిత్రమైన శబ్దాలు. ఎటు వైపు నుంచి ఏం వస్తాయో అని టెన్షన్‌. ఇంతలోపే దయ్యాల గుంపు. సరాసరి అతనిపైకి వచ్చేస్తాయి! దాడి చేస్తాయి! అప్పుడు అతను ఏం చేస్తాడు? మీ సాయం కోరతాడు. అప్పుడు మీరు సింపుల్‌గా అతని చేతిలోని తుపాకీతో ఎదురు దాడికి దిగాలి. కాల్చి బూడిద చేయాలి. దీంతో బోల్డంత స్కోరు. ఇంతకీ ఇది ఏం ఆట అనేగా మీ సందేహం. పేరు Hopeless: The Dark Cave. బుల్లి తెరపై ఆట భలే సరదా ఉంటుంది. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌... అమ్మో అనిపించే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌. దయ్యాలపై దాడికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని సమీపించే లోపే వాటిని కాల్చి పారేయాలి. ఆటలో రివార్డ్‌ పాయింట్స్‌ కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోండి. http://goo.gl/A9T4Ys
* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి ఆటని పొందొచ్చు. http://goo.gl/i1DvXB

 


మ్యాజిక్‌ చేస్తారా?
కంప్యూటర్‌.. ల్యాపీ.. ట్యాబ్లెట్‌.. మొబైల్‌ వాడేది ఏదైనా..! వ్యక్తిగత డేటాని ఇట్టే వెతికి పట్టేయవచ్చు! 'క్లౌడ్‌ మ్యాజిక్‌'తో చాలా సులభం! అదెలాగో చూద్దాం!
రోజువారీ వ్యవహారాలకు చాలానే సర్వీసుల్ని వాడుతుంటాం. మెయిల్స్‌ని చెక్‌ చేస్తుంటాం. సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని ఫాలో అవుతుంటాం. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఏదైనా అంశంపై మీ ఇన్‌బాక్స్‌కి చేరిన మెయిల్స్‌ని వెతకాలంటే? ఉదాహరణకు జీమెయిల్‌, యాహూ, హాట్‌మెయిల్‌.. సర్వీసుల్ని వాడుతున్నట్లయితే ఆయా సర్వీసుల్లో ఒకేసారి మీకు కావాల్సిన మెయిల్‌ని వెతకొచ్చు. కావాలంటే https://cloudmagic.com సైట్‌లోకి వెళ్లండి. జీమెయిల్‌, యాహూమెయిల్‌, హాట్‌మెయిల్‌, గూగుల్‌ ఆప్స్‌, ఆఫీస్‌ 365, ఐక్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ ఎక్సేంజ్‌... సర్వీసుల్ని సపోర్ట్‌ చేస్తుంది. 5 ఈమెయిల్‌ ఎకౌంట్‌లను వేగంగా సపోర్ట్‌ చేస్తుంది. సెర్చ్‌ ఫలితాలు వేగంగా కనిపిస్తాయి. పీసీ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌' నుంచి క్లౌడ్‌మ్యాజిక్‌ ఆప్‌ని పొందొచ్చు. http://goo.gl/yX3E8L
* మొబైల్‌, ట్యాబ్‌ల్లో ఆప్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. మెయిళ్లకు రిమైండర్స్‌ని పెట్టుకునే వీలుంది. డేటాని సురక్షితంగా వేతికేందుకు పాస్‌వర్డ్‌తో తాళం వేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/p5jWju
* యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాలంటే http://goo.gl/yiXA6k లింక్‌లోకి వెళ్లండి.

 

బుర్రకి పదును
పజిల్‌ గేమ్‌లు చాలానే ఉన్నాయి. వాటిల్లో Ultimate Block Puzzle గేమ్‌ ఒకటి. పేరుకి తగ్గట్టుగానే తెరపై వచ్చిన బ్లాక్స్‌ని సరైన పద్ధతిలో అమర్చాలి. అంటే... విడిగా ఉన్న బ్లాక్స్‌కి ఒకే బ్లాక్‌గా అమర్చాలన్నమాట. సుమారు 4,000 లెవల్స్‌ ఉన్నాయి. తీరిక సమయాల్లో టైంపాస్‌ చేయడానికి ఇదో చక్కని పజిల్‌ గేమ్‌. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. కావాలంటే http://goo.gl/HMl95p లింక్‌లోకి వెళ్లండి.

సాఫ్ట్‌వేర్‌ అక్కర్లేదు
కొన్నిసార్లు ఫైల్‌ ఫార్మెట్‌ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సిస్టంలో సాఫ్ట్‌వేర్‌లనే ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. ఉచితంగా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. కావాలంటే https://cloudconvert.org వెబ్‌ సర్వీసులోకి వెళ్లండి. సుమారు 178 ఫార్మెట్‌లను సైట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో, వీడియో, డాక్యుమెంట్‌, ఫొటోలు, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రజంటేషన్స్‌, ఈ-బుక్స్‌... ఏదైనా దీంట్లోకి అప్‌లోడ్‌ చేసి కన్వర్ట్‌ చేయవచ్చు. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని మెయిల్‌కి వచ్చేలా చేయవచ్చు. అందుకు Mail me when it is finishedఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. ఒకవేళ మీరు క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్ని వాడుతున్నట్లయితే 'డ్రాప్‌బాక్స్‌', 'గూగుల్‌ డ్రైవ్‌'లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని సరాసరి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి చేరేలా చేయవచ్చు. అందుకు Send it into my Dropbox, Google Drive ఆప్షన్ని చెక్‌ చేయాలి.

 

మళ్లీ కొత్తగా...
ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన pacmanఆట గుర్తుందా? అలాంటి గేమ్‌ని మళ్లీ ఆడాలనుకుంటే Pacxon 2 గేమ్‌ని ఆడొచ్చు. ఆన్‌లైన్‌లోనేమో అనుకునేరు. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడొచ్చు. పెద్దగా మెమొరీ తీసుకోదు. ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌లోనే కాకుండా విండోస్‌ మోడ్‌లోనూ గేమ్‌ని ప్లే చేయవచ్చు. మొత్తం 50 లెవల్స్‌ ఉంటాయి. ఒక్కో లెవల్‌ని ముగిస్తూ ముందుకు సాగే క్రమంలో 'పవర్‌ఆప్స్‌'ని తీసుకోవాలి. దీంతో మిమ్మల్ని వెంటాడే దయ్యాలను బలహీనమయ్యేలా చేయవచ్చు. కొన్ని పవర్‌అప్స్‌ని తీసుకుని దయ్యాల్ని మీరే మింగేయవచ్చు. కొన్నింటితో వాటిని కదలకుండా చేయవచ్చు. కావాలంటే http://goo.gl/DR0LyMలింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆడుకోండి...
పండగ పూట సరదాగా గడపాలనుకుంటే ఈ గేమ్స్‌ ఆడేయండి. పీసీ... మొబైల్‌... ట్యాబ్‌ ఏదైనా... అన్ని గేమ్స్‌ ఉచితమే! ఇన్‌స్టాల్‌ చేసుకునే ముందు లేటెస్ట్‌ యాంటీవైరస్‌తో స్కాన్‌ చేయండి.
* కళ్లకు పని చెప్పి... నక్కిన వాటిని ఠక్కున పట్టుకునే ఆటే Fishdom H20. వెతుకులాట సముద్రం అడుగున అన్నమాట. సుమారు వెతకాల్సినవి 1000 ఉన్నాయి. http://goo.gl/3UVsW0
* కాసేపు పజిల్‌ గేమ్‌ ఆడదాం అనుకుంటే Experiment 2 గేమ్‌ ఆడొచ్చు. మూడు రంగుల్ని కలుపుతూ ఆడే ఆట. http://goo.gl/dQJJE8
* మొబైల్‌ తెరపై పజిల్‌ గేమ్‌ ఆడాలనుకుంటే Larva Link గేమ్‌ ఆడొచ్చు. యానిమేషన్‌తో గేమ్‌లోని కార్టూన్‌లు ఆకట్టుకుంటాయి. http://goo.gl/j7YkbX
* భిన్నమైన గ్రాఫిక్స్‌తో కారు గేమ్‌ కావాలంటే RE-VOLT2ఉంది. త్రీడీలో దీన్ని రూపొందించారు. http://goo.gl/mS2Jvkబస్సు... ట్రక్కు!
కార్లు.. బైక్‌లు.. నడిపే గేమ్‌లు చాలానే ఆడుంటారు. కానీ, బస్సులు ఎప్పుడైనా నడిపారా? బస్‌ స్టాప్‌లో ఆపి పాసింజర్లను ఎక్కించుకున్నారా? అయితే, Bus Simulator 3D వీడియో గేమ్‌ ఆడేయండి. పీసీలో అనుకునేరు! జేబులోని స్మార్ట్‌ మొబైల్‌లోనే. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని వాడుతున్నట్లయితే గూగుల్‌ ప్లే నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. స్టీరింగ్‌ తిప్పుతూ వెళ్తే సరిపోతుందిలే! అనుకుంటే పొరబాటే. ట్రాఫిక్స్‌ రూల్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. డ్రైవింగ్‌ని స్మార్ట్‌గా చేసేందుకు బస్‌లోని 'ఇంటీరియర్‌ కెమెరా'లనూ వాడుకోవచ్చు. అభిరుచి మేరకు రకరకాల బస్సులు ఎంపిక చేసుకోవచ్చు. ఆడదాం అనుకుంటే http://goo.gl/CsV220 లింక్‌ నుంచి పొందొచ్చు. ఇదే మాదిరిగాTruck Simulator 3D గేమ్‌ని ఆడొచ్చు. http://goo.gl/rlRCJK

ఆవు... అదిరే సాహసాలు
మనకు తెలిసిన ఆవులన్నీ... సాధు జంతువులే! అవి మనం చూసినవి! మరి, మీకు Super Cow తెలుసా? గాల్లో ఎగురుతుంది... సాహసాలు చేస్తుంది... సాటి జంతువుల్ని కాపాడుతుంది... కావాలంటే ఈ గేమ్‌ ఆడండి!
ఓ దొంగ జంతువులు నివాసముండే ఫార్మ్‌లోకి చొరబడి కొన్నింటిని ఎత్తుకుపోతాడు. దీంతో వయసు మళ్లిన జంతు నాయకుడు వాటిని రక్షించేవారు ఎవరా? అని ఆరా తీస్తాడు. అప్పుడే 'సూపర్‌ కౌ'కి విషయం చేరుతుంది. ఎత్తుకుపోయిన జంతువుల్ని రక్షించి తీసుకొచ్చే బాధ్యతని సూపర్‌ కౌకి అప్పగిస్తుంది. అదీ విషయం...ఆవు ప్రయాణంలో భాగంగా ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. రాక్షస జంతువులు పొంచి ఉంటాయి. తెలివిగా వాటిపై దూకుతూ చంపేసి స్కోర్‌ సాధించొచ్చు. లెవల్‌ మారుతున్న కొద్దీ ప్రమాదాలు పెరుగుతాయి. దారిలో దొరికే పాలు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా లెవల్స్‌ దాటుతుంటే లక్ష్యం దగ్గరవుతుంది. మొత్తం ఆటలోని లెవల్స్‌ 50. ఆట ఫుల్‌ స్క్రీన్‌లో అక్కర్లేదనుకుంటే ఆప్షన్స్‌లోకి వెళ్లి Full Screen ఆప్షన్ని అన్‌చెక్‌ చేయండి. ఆడాలనుకుంటే http://goo.gl/FnbXmj లింక్‌లోకి వెళ్లండి.

 

 


క్లిక్‌ చాలు
వెబ్‌ విహారానికి ఏదో ఒక బ్రౌజర్‌ వాడాలి. ప్రైవసీ నిమిత్తం ఎప్పటికప్పుడు బ్రౌజింగ్‌ హిస్టరీపై ఓ కన్నేస్తుండాల్సిందే. అక్కర్లేని వాటిని... ఇతరుల కంటపడకూడదు అనుకున్నవాటిని హిస్టరీ నుంచి తొలగిస్తుంటాం. అందుకు బ్రౌజర్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఆప్షన్లు ఉన్నాయి. వాటితో పనేం లేకుండా ఒకే క్లిక్‌తో మొత్తం వెబ్‌ ప్రైవసీని మేనేజ్‌ చేయవచ్చు. అందుకు తగిన వెబ్‌ సర్వీసు సిద్ధంగా ఉంది. అదే Click & Clean. ఫైర్‌ఫాక్స్‌, క్రోమ్‌ యూజర్లు దీన్ని ఎక్స్‌టెన్షన్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. మీరు ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నట్లయితే http://go o.gl/8wVfMx లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజర్‌కి యాడ్‌ చేసి రీస్టార్ట్‌ చేయాలి. దీంతో అడ్రస్‌బార్‌ పక్కనే ప్రత్యేక ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి 'బ్రౌజర్‌ హిస్టరీ'ని మేనేజ్‌ చేయవచ్చు. మొత్తం హిస్టరీని తొలగించాలనుకుంటే Clear Browsing Data ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. కావాలంటే Alt+C షార్ట్‌కట్‌ని కూడా వాడుకోవచ్చు. యాడ్‌ఆన్‌తో ట్యాబ్‌ విండోలను కూడా మేనేజ్‌ చేయవచ్చు. ప్రైవేటు బ్రౌజింగ్‌ చేయడానికి Incognito ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. బ్రౌజర్‌ 'కూకీస్‌'పైనా ఓ కన్నేయాలనుకుంటే Cookies మెనూలోకి వెళ్లొచ్చు. జాబితాని బ్రౌజ్‌ చేసి కావాల్సిన వాటిని తొలగించొచ్చు. 'ప్రైవసీ టెస్ట్‌' కూడా చేయవచ్చు.

 

 

ధూమ్‌ 3
హై టెక్‌ దొంగతనాలు... పట్టుకునేందుకు పోలీసులు... ఛేజింగ్‌లు... ఫైరింగ్‌లు... అర్థమయ్యిందిగా... ధూమ్‌ 3 సినిమా అని... వీడియో గేమ్‌ కూడా ఉంది! ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆడేయండి!
మీ స్మార్ట్‌ మొబైళ్లలోనూ గేమ్‌ సందడిని షురూ చేయవచ్చు. ఆదరగొట్టే గ్రాఫిక్స్‌తో గేమ్‌ని రూపొందించారు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆట పేరు కూడా Dhoom 3. రోడ్డుపై కనిపించే బంగారు నాణాల్ని సేకరించడం ద్వారా మీరు స్కోర్‌ని సాధించొచ్చు. ఇలా సంపాదించిన మొత్తంతో కొత్త బైక్‌లను కొనుగోలు చేయవచ్చు. 'రేసింగ్‌ సూట్స్‌'ని కొనొచ్చు కూడా. బైక్‌ వేగాన్ని పెంచే 'పవర్‌ అప్స్‌'ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఆడాలనుకుంటే http://goo.gl/js2ldll లింక్‌ నుంచి పొందొచ్చు.
* విండోస్‌ ఫోన్‌ వాడుతున్నట్లయితే 'విండోస్‌ ఫోన్‌' ఆప్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://goo.gl/ZxVQ9F
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. కావాలంటే http://goo.gl/mmKN8Q లింక్‌లోకి వెళ్లండి.
* జావా ఫోన్‌ వాడే యూజర్లు http://goo.gl/TzoCdV లింక్‌లోకి వెళ్లండి.

 

 

అంతా ఆటోమాటిక్‌
ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ని వాడుతున్నారా? మీ బ్రౌజింగ్‌ విహారంలోని ఆనవాళ్లను ఎవ్వరికీ చిక్కకుండా ఎప్పటికప్పుడు ఆటోమాటిక్‌గా తొలగిపోవాలంటే? అందుకో చిట్కా ఉంది. అదే Self-Destructing Cookies. ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు యాడ్‌ఆన్‌ రూపంలో బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసుకుని వాడుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే టూల్‌బార్‌లో కొత్త ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి కుకీస్‌ ఆటోమాటిక్‌గా తొలగిపోయేలా చేయవచ్చు. ట్యాబ్‌ని క్లోజ్‌ చేసిన వెంటనే కూకీస్‌ డిలీట్‌ అవ్వాలనుకుంటే After you close its tabs ఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఒకవేళ మొత్తం బ్రౌజర్‌ని క్లోజ్‌ చేయగానే తొలగిపోవాలనుకుంటే After you close the browser ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. కుకీస్‌ సేవ్‌ అయ్యి ఉండేందుకు Never సెలెక్ట్‌ చేస్తే సరి. చిట్కా కావాలంటే http://go o.gl/Yh7RWJ లింక్‌లోకి వెళ్లండి.

విండోస్‌ వాడితే...
మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న విండోస్‌ ఫోన్‌ ఓఎస్‌తో మొబైల్‌ని వాడుతున్నారా? అయితే, అదే సంస్థ అందించే 'స్కైడ్రైవ్‌'ని ఆప్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. విండోస్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ క్లౌడ్‌ స్టోరేజ్‌ ద్వారా 25 జీబీ ఉచితంగా వాడుకోవచ్చు. అన్ని రకాల డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్‌ చేసుకుని భద్రం చేసుకోవచ్చు. ఇక ఫొటోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీసిన ఫొటోలను తీసినట్టే క్లౌడ్‌లోకి అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇతరులకు షేర్‌ చేయవచ్చు కూడా. కావాలంటే http://goo.gl/ANMbni లింక్‌ నుంచి పొందొచ్చు.
ఫొటోలే స్క్రీన్‌సేవర్‌
సిస్టంలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న వాటిని స్క్రీన్‌సేవర్‌గా పెట్టుకోవడం మామూలే. లేదంటే... ఏదైనా యానిమేషన్‌తో కూడిన గ్రాఫిక్స్‌నీ పెట్టుకోవడం చూశాం. ఇవేం కాకుండా మీకు నచ్చిన ఫొటోలను స్క్రీన్‌సేవర్‌గా సెట్‌ చేసుకుంటే! స్త్లెడ్‌షో మాదిరిగా అన్ని ఫొటోలను యానిమేషన్‌ ఎఫెక్ట్‌లతో చూస్తే! JPEG Saver టూల్‌తో సాధ్యమే. ఇదో స్క్రీన్‌సేవర్‌ టూల్‌. ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. స్క్రీన్‌సేవర్‌ విండోలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫొటోలు ఉన్న ఫోల్డర్‌ని ఎంపిక చేసుకోవాలి. అందుకు Folders ట్యాబ్‌లోని 'యాడ్‌'పై క్లిక్‌ చేసి ఫోల్డర్‌ని ఎంపిక చేసుకోవాలి. డీఫాల్ట్‌గా 'మై డాక్యుమెంట్స్‌'లోని 'మై పిక్చర్స్‌' ఫోల్డర్‌లో ఉన్న వాటిని స్క్రీన్‌సేవర్‌లోకి తీసుకుంటుంది. http://goo.gl/TXEgMa లింక్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
ఇవన్నీ అదనం
డాక్యుమెంట్స్‌, డిజైనింగ్‌, కరపత్రాల్లో కొన్ని ప్రత్యేక గుర్తుల అవసరం ఏర్పడుతుంటుంది. కానీ, వాడుతున్న ఆయా సాఫ్ట్‌వేర్‌లలో కావాల్సిన గుర్తులు కొన్ని ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలి? నెట్టింట్లో వెతుకులాట సాగించకుండానే ప్రత్యేక టూల్‌తో గుర్తుల్ని పొందొచ్చు. అందుకు Extra Keys టూల్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రేలో ఒదిగిపోతుంది. ఇక కావాల్సిన లాంగ్వేజి ఆధారంగా గుర్తుల్ని వెతికి ఇన్‌సర్ట్‌ చేసుకోవచ్చు. కీబోర్డ్‌లో అందుబాటులో లేని అనేక గుర్తుల్ని టూల్‌ నుంచి పొందొచ్చు. కావాలంటే http://goo.gl/JPTSzf యూఆర్‌ఎల్‌ నుంచి పొందండి.


రక్షణ అవసరం
బ్లాక్‌బెర్రీ మొబైల్‌ అంటే ధర ఎక్కువే. అయినా... కొంటాం... వాడేస్తాం. మరి, రక్షణ మాటేంటి? ఎవరైనా దొంగిలిస్తే... మీరే ఎక్కడైనా మర్చిపోతే... BlackBerry Protect ఆప్‌ ద్వారా డేటాని సురక్షితం చేసుకోవచ్చు. ఫోన్ని ఇతరులు వాడకుండా లాక్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక బ్లాక్‌బెర్రీ అధికారిక సైట్‌లోకి లాగిన్‌ అయ్యి మొబైల్‌ని మానిటర్‌ చేయవచ్చు. సైట్‌ నుంచే ఫోన్ని పాస్‌వర్డ్‌తో తాళం వేయవచ్చు. కావాలంటే ఫోన్‌లోని డేటాని పూర్తిగా తొలగించొచ్చు. ఎక్కువ వాల్యూమ్‌తో ఫోన్ని రింగ్‌ చేసి ఎక్కడ ఉందో చూడొచ్చు. డిస్‌ప్లే మెసేజ్‌ని సెట్‌ చేసి మీ వివరాల్ని తెరపై కనిపించేలా చేయవచ్చు. సైట్‌ నుంచే డేటాని బ్యాక్‌అప్‌ తీసుకునే వీలుంది. http://goo.gl/AgVdbW

క్షణాల్లోనే...
ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? క్షణాల్లో మీరు అమ్మిన మెటీరియల్‌కి 'ఇన్‌వాయిస్‌' క్రియేట్‌ చేసి ఇవ్వొచ్చు. అందుకు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ అక్కర్లేదు. క్రోమ్‌ వాడుతున్నట్లయితే FreeInvoice Maker ఆప్‌ని వాడొచ్చు. అందుకు మీ సిస్టంలో క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడితే సరి. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లోకి వెళ్లి ఆప్‌ని బ్రౌజర్‌కి యాడ్‌ చేయాలి. ఆప్‌ లాంచర్‌ నుంచి ఆప్‌ని ఓపెన్‌ చేస్తే హోంపేజీలో Invoice Form కనిపిస్తుంది. వివరాల్ని ఎంటర్‌ చేసి Next ద్వారా మొత్తం ఇన్‌వాయిస్‌ని పూర్తి చేయాలి. చివరి ఫాంలో కనిపించే 'డౌన్‌లోడ్‌' పై క్లిక్‌ చేసి పీడీఎఫ్‌ ఫైల్‌ని పొందొచ్చు. కరెన్సీ గుర్తుని మార్చుకునే వీలుంది. అలాగే, ఇన్‌వాయిస్‌లో కొత్తగా ఏదైనా లైన్‌ని పొందుపరచాలంటే New Line ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. http://goo.gl/d5Wx0b

చెత్తకి చెక్‌.. చిటికెలో!
అన్ని మెయిల్‌ సర్వీసుల్లో మాదిరిగానే ప్రమాదకరమైన మెయిల్స్‌కి స్పాం విభాగం ఉంటుంది. అలాంటి మెయిల్స్‌ ఆటోమేటిక్‌గా స్పాంలోకి వెళ్లేలా చేస్తుంటాం. నిర్ణీత సమయం తర్వాత వాటిని డిలీట్‌ చేస్తుంటాం. మరి, మీకు తెలుసా? స్పాంకి చేరే మెయిల్స్‌ని అప్పటికప్పుడే డిలీట్‌ చేయొచ్చని. అందుకు 'ఫిల్టర్‌'ని సెట్‌ చేసుకోవాలి. మెయిల్‌లోకి లాగిన్‌ అయ్యాక Settings లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే మెనూల్లోని Filters పై క్లిక్‌ చేసి Create a new filter ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన విండోలోని Has the words బాక్స్‌లో in:spam టైప్‌ చేసి Next Step లోకి వెళ్లండి. అక్కడ వచ్చిన వాటిల్లో Delete it ఆప్షన్‌ని చెక్‌ చేయండి. అలాగే, Also filter to 0 matching conversations ఆప్షన్ని చేసి 'క్రియేట్‌ ఫిల్టర్‌'ని ఎంచుకోవాలి. ఇక మీదట స్పాం విభాగం ఎప్పటికప్పుడు క్లియర్‌ అవుతుంది.

కొంచెం విశ్రాంతి
పని ఒత్తిడి పెరిగితేనో... ఇంట్లో బోర్‌గా అనిపిస్తేనో... ఆన్‌లైన్‌లో Fishdom 3 వీడియో గేమ్‌ ఆడేయండి. ఇదో పజిల్‌ గేమ్‌. కొత్త వెర్షన్‌తో పజిల్‌ గేమ్‌లో మరిన్ని అప్‌డేట్స్‌ని చూడొచ్చు. గేమ్‌ ప్రారంభంలో ఆటకు సంబంధించిన డెమో వస్తుంది. మొదటి లెవల్‌ని ఎంచుకోగానే సముద్ర గర్భంలో ఆట మొదలవుతుంది. ఏదైనా మూడు రకాల సముద్ర జీవుల్ని జత చేయడం ఆటలోని పజిల్‌. గేమ్‌లో సంపాందించిన బంగారు నాణాలతో ఆటలో షాపింగ్‌ చేయవచ్చు. మరి, మీరు ఆడాలంటే http://goo.gl/huvmJy లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజర్‌లోనూ ఎలాంటి ప్లగ్గిన్స్‌ అవసరం లేకుండానే గేమ్‌ని ఆడొచ్చు.

జీమెయిల్‌లో కొత్తగా
గూగుల్‌ అందిస్తున్న మొత్తం సర్వీసుల్ని చూడాలంటే ఏంటి దారి? ఇప్పుడు జీమెయిల్‌ నుంచే గూగుల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీసుల్ని ఒకే క్లిక్కుతో యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా జీమెయిల్‌ ప్రొఫైల్‌ ఫొటో పక్కనే కనిపించే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. క్లిక్‌ చేయగానే డ్రాప్‌డౌన్‌ మెనూలో గూగుల్‌ ప్లస్‌, యూట్యూబ్‌, ప్లే, న్యూస్‌, డ్రైవ్‌... సేవల్ని జాబితాగా పొందొచ్చు. ఇదే మాదిరిగా గూగుల్‌ ప్లస్‌కి చేరిన అప్‌డేట్‌ నోటిఫికేషన్స్‌ని మెయిల్‌లో ఉండే చూడొచ్చు. అందుకు ఆప్స్‌ ఐకాన్‌ పక్కనే కనిపించే 'గంట' గుర్తుపై క్లిక్‌ చేయాలి. ప్లస్‌ నెట్‌వర్క్‌లో ఏదైనా షేర్‌ చేయాలంటే నెట్‌వర్క్‌లోకి సైన్‌ఇన్‌ అవ్వక్కర్లేదు. Share బాక్స్‌పై క్లిక్‌ చేసి ఫొటోలు, లింక్స్‌, వీడియో, ఈవెంట్స్‌ని షేర్‌ చేయవచ్చు.

3డీలో కావాలా?
ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో స్మార్ట్‌ మొబైల్‌ని వాడుతున్నారా? 2డీ మోడ్‌లో కనిపించే మొబైల్‌ తెరని 3డీలో ఆకట్టుకునేలా మార్చేస్తే! SPB Shell 3D ఆప్‌తో సాధ్యమే. హోం స్క్రీన్‌ దగ్గర్నుంచి అన్నింటినీ 3డీలోకి మార్చేస్తుంది. అందుకో 3D Home Screen / Launcher ప్రత్యేకమైంది. ఆప్షన్స్‌ని తెరపై 3డీలో తిప్పుతూ కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. 'స్మార్ట్‌ ఫోల్డర్ల' ను క్రియేట్‌ చేసుకునే వీలుంది. అలాగే, 3D Widgets క్రియేట్‌ చేసుకుని అదనపు హంగులు అద్దొచ్చు. ఇదో కమర్షియల్‌ వెర్షన్‌. కావాలంటే http://goo.gl/ZqiorC నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఆంగ్ల వ్యాకరణం
ఆండ్రాయిడ్‌ మొబైల్‌కి ఆప్స్‌ మాత్రమే కాదు. ఈ-పుస్తకాలు కూడా కోకొల్లలు. లైబ్రరీలో ఉచిత పుస్తకాలు చాలానే ఉన్నాయి. తాకేతెరపైనే ఇంగ్లిష్‌ గ్రామర్‌ని నేర్చుకునేందుకు ఉచితంగా An English Grammar పుస్తకం ఉంది. మొత్తం 526 పేజీలు. మొబైల్‌, ట్యాబ్లెట్‌, ఈ - రీడర్‌ల్లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. స్కానింగ్‌ పద్ధతిలో పుస్తకాన్ని నిక్షిప్తం చేశారు. పోర్టబుల్‌ డివైజ్‌ లేకపోతే బ్రౌజర్‌లోనూ పుస్తకాన్ని ఓపెన్‌ చేసుకుని చదువుకోవచ్చు. కావాలంటే http://goo.gl/9xT1wj లింక్‌లోకి వెళ్లండి.

కాపాడండి!
బుజ్జి.. బుజ్జి.. చీమలు. వాటి క్రమశిక్షణే వేరు. కష్టపడి ఆహారాన్ని పోగేసుకుంటాయి. అలాంటి చీమల నోటి దగ్గరి కూడును కొన్ని కీటకాలు నాశనం చేయడానికి ప్రయత్నిస్తే! చీమలు ఎదురు తిరిగి వాటిని అడ్డుకుంటే! అదే BugBits వీడియో గేమ్‌. ఆన్‌లైన్‌లో అనుకునేరు. అదేంకాదు.. ఉచితంగా నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో ఫుల్‌స్క్రీన్‌లో గేమ్‌ని ఆడొచ్చు. ఆట మొత్తం మౌస్‌తోనే. Two Players మోడ్‌లో ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/px2 tZS లింక్‌ని చూడండి.

ఇలా వీక్షించండి
నెట్లో లైవ్‌ టీవీలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీరు టెక్నాలజీ ప్రియులైతే http://twit.tv సైట్‌లోకి వెళ్లండి. ఇదో టెక్నాలజీ అప్‌డేట్స్‌ని అందించే లైవ్‌ టీవీ. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న 'టెక్నాలజీ షో' లను చూడొచ్చు. మార్కెట్‌లోకి ప్రవేశించిన గ్యాడ్జెట్‌లను కూడా బ్రౌజ్‌ చేయవచ్చు. టెక్నాలజీ రంగంలోని మార్పుల్ని విశ్లేషిస్తూ 'వారాంతపు షో' లను అందిస్తున్నారు.

రెండో 'మ్యాచ్‌'
ఫైటింగ్‌లు... రేసింగులు... ఫైరింగ్‌లు చేసి విసుగు పుట్టిందా? శాంతంగా ఏ పజిల్‌ గేమో ఆడానుకుంటున్నారా? అయితే, మూడు రంగుల్ని జత చేసే గేమ్‌ ఆడేయండి. అదే Fishdom. రెండో వెర్షన్‌తో అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఆడాలనుకుంటే నెట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేయవచ్చు. అందుకు http://goo.gl/6ihE5w లింక్‌లోకి వెళ్లండి. ఒక్కో లెవల్‌ని పూర్తి చేస్తూ డాలర్స్‌ సంపాదించొచ్చు. మొత్తం ఆటలో లెవల్స్‌ 120 ఉంటాయి. అందులో 30 బోనస్‌ లెవల్స్‌గా పొందొచ్చు. అన్ని విండోస్‌ ఓఎస్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఆడొచ్చు.

రోవర్‌ నడపండి!
బైకు, కారు, లారీ, బస్సు.... చెప్పాలంటే రోడ్లపై దూసుకెళ్లే అన్ని వీడియో గేమ్స్‌ని ఆడే ఉంటారు. కానీ, వేరే గ్రహంపై ప్రయాణించే రోవర్‌ని నడిపారా? అదీ నెప్ట్యూన్‌ గ్రహంపైన. అదెలాగో తెలియాలంటే Neptune Rover గేమ్‌ ఆడాల్సిందే. డౌన్‌లోడ్‌ చేయక్కర్లేదు. ఆన్‌లైన్‌లోనే ఆడొచ్చు. కీబోర్డ్‌లోని బాణం గుర్తులతో నడపడమే. ఒకవేళ రోవర్‌ గమనాన్ని మార్చాలంటే 'ఎంటర్‌' నొక్కితే సరి. గ్రహంపైన రోడ్డేం సాఫీగా ఉండదు. గుంతలు, ప్రమాదాలు అనేకం. 'చెక్‌పాయింట్స్‌' ని దాటుకుంటూ వెళ్లాలి. ఆడాలంటే http://goo.gl/maZnp

చూస్తే చాలు
ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించేందుకు ఆన్‌లైన్‌లో చాలానే వేదికలున్నాయి. మెటీరియల్‌లా కాకుండా తరగతి గదిలో టీచర్‌ చెప్పినట్టుగా ఇంగ్లిష్‌ని అభ్యసించాలంటే? అందుకు యూట్యూబ్‌లో Let's Talk ఛానల్‌ ఉంది. ఎప్పటికప్పుడు దీంట్లో వీడియో 'లెసన్స్‌' ని పోస్ట్‌ చేస్తున్నారు. పదాల ఉచ్చారణ, వాక్యాల వాడకం, వ్యాకరణం... ఇలా చెప్పాలంటే చాలా చిట్కాల్ని నేర్చుకోవచ్చు. http://goo.gl/xQ7Hv

మెయిల్‌లో ట్యాబ్‌లు
జీమెయిల్‌లో ఇన్‌బాక్స్‌కి చేరే అన్ని రకాల మెయిల్స్‌ గుత్తగా వచ్చి చేరుతున్నాయా? వాటిల్లో వ్యక్తిగత మెయిల్స్‌కి, సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌కి తేడా తెలియడం లేదా? వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన మెయిల్స్‌ని ప్రత్యేకంగా చూడాలనుకుంటున్నారా? అయితే, జీమెయిల్‌ కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్‌ విభాగాల్ని గమనిస్తే సరి. హోం పేజీలో కొత్తగా 'ప్రైమరీ, సోషల్‌, ప్రమోషన్స్‌' ట్యాబ్‌లు వచ్చి చేరాయి. వీటి ద్వారా మీకొచ్చే మెయిల్స్‌ ఆటోమాటిక్‌గా ఆయా విభాగాల్లోకి చేరతాయి. ఉదాహరణకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ అన్నీ 'సోషల్‌' ట్యాబ్‌లోకి చేరిపోతాయి. వ్యక్తిగత మెయిల్స్‌ అన్నీ 'ప్రైమరీ' లో చూడొచ్చు.

u ట్యూబ్‌
పిల్లలకు ప్రత్యేకం
టీవీలో ఇష్టమైన ప్రోగ్రాం వస్తున్నప్పుడు పిల్లలు కార్టూన్‌ ఛానల్‌ పెట్టమని పోరు పెడుతున్నారా? వాళ్లని నొప్పించకుండా మీరు టీవీ చూడాలంటే అందుకు యూట్యూబ్‌ ఛానల్‌ని పెడితే సరి. దాంట్లో Hoopla Kidsz ఛానల్‌ ఉంది. అన్నీ పిల్లలకు సంబంధించిన వీడియోలే. నర్సరీ రైమ్స్‌ అయితే లెక్కలేనన్ని. అంకెలు, అక్షరాలు చెప్పే వీడియోలూ ఉన్నాయి. సిస్టం, నెట్‌ ఉంటే వెంటనే లింక్‌లోకి వెళ్లండి. http://goo.gl/pWP70
* ఆప్‌ రూపంలో మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు ఆయా స్టోర్స్‌ నుంచి ఆప్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు ఉచితంగానే.

 

 

ఆడుకోండి హాయిగా!
పిల్లి మామ ప్రయాణం!

జీన్స్‌ప్యాంట్‌... పైన కోటు... తలపై పెద్ద టోపీ...చేతులకు తొడుగులు! సాహసానికి సిద్ధం! ఎవరో తెలుసా? ఓ పిల్లి మామ గారు!!
నిధి కోసం వేట. బయలు దేరిన పిల్లికి మీరు సాయం చేయాలి. ఏదో మాట సాయం అనుకునేరు! పెద్ద సాహస యాత్రే.. ఆట పేరు Alex Gordon. ఆట మొదటవ్వగానే పేరు ఎంటర్‌ చేసి గేమ్‌లోకి వెళ్లాలి. మొదటి లెవల్‌లో ప్రయాణం మొత్తం నేలపైనే. మార్గంలో ఎదురయ్యే బంగారు నాణాల్ని అందుకుంటూ ముందుకు సాగాలి. ప్రయాణంలో కనిపించే బాణం గుర్తుల ఆధారంగా ముందుకు సాగాలి. లెవల్‌ని పూర్తి చేయాలంటే అందుకు అవసరమైన లైఫ్‌లు, స్కోర్‌ సాధించాలి. అందుకున్న బంగారు నాణాలతో పిల్లికి ద్వీపాన్ని కొనివ్వొచ్చు. మొత్తం 10 లెవల్స్‌ ఉన్నాయి. లెవల్‌ మారుతున్న కొద్దీ ప్రమాదాలు పెరుగుతుంటాయి. అంతేనా! మార్గ మధ్యలో పిల్లికి ఫ్యాన్స్‌ కూడా ఎదురవుతారు. 'ఐ లవ్‌ యూ అలెక్స్‌!' అని చెబుతూ ఉత్సాహపరుస్తారు. http://goo.gl/hoUQJ

 

 

 

ఇల్లు కావాలా?
ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా... కొనాలన్నా... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిపట్టునే కూర్చుని నెట్లో వెతికేస్తే! ఆ వీలు కలిగించేదే http://housing.co.in ప్రధాన నగరాల్లోని ప్రాంతాల్ని బ్రౌజ్‌ చేసి నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌ని సెలెక్ట్‌ చేస్తే Rent, Buy ట్యాబ్‌ విండోలతో పేజీ వస్తుంది. అక్కడ కనిపించే సెర్చ్‌బాక్స్‌లో ఏ లొకేషన్‌లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో ఎంటర్‌ చేయాలి. మ్యాపింగ్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల వివరాలు కనిపిస్తాయి. సింగిల్‌ బెడ్‌రూం, డబుల్‌, త్రిబుల్‌... విభాగాలు ఉన్నాయి. కావాల్సిన ఇంటి ఫొటోలు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఇంటికి దగ్గర్లో ఉన్న రవాణా సౌకర్యాలు, షాపింగ్‌ మాల్స్‌, పాఠశాలలు, ఆసుపత్రులు ఏమేం ఉన్నాయో చూడొచ్చు. ఇల్లు నచ్చితే సంబంధిత వ్యక్తిని కాంటాక్ట్‌ చేయవచ్చు. 'ఫిల్టర్స్‌' మెనూలోకి వెళ్లి కావాల్సిన సౌకర్యాలతో ఇళ్లను వెతికే వీలుంది.

క్లిక్‌తో ఈటీవీ U ట్యూబ్‌!
రిమోట్‌ పట్టుకుని... టైం చూసుకుని... టీవీ ప్రోగ్రాములు చూడ్డం ఒకప్పుడు. ఇప్పుడు క్లిక్‌తోనే టీవీ ఛానళ్లను చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే మీ టీవీలో ప్రసారం కాని ఛానళ్లను కూడా సిస్టంలో చూడొచ్చు. అందుకు అనువైనది యూట్యూబ్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంట్లో ఉచిత ఛానళ్లు చాలానే ఉన్నాయి. ఈ వారం యూట్యూబ్‌లో 'ఈటీవీ' ని చూడొచ్చు. దీంట్లో ఎప్పటికప్పుడు మీ అభిమాన టీవీ ప్రోగ్రాంలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఉదాహరణకు మీరు గతవారం 'జబర్దస్త్‌' షోని చూడకపోతే నెట్టింట్లో హాయిగా చూడొచ్చు. అందుకు www.youtube.com/etvtelugu లింక్‌లోకి వెళ్లండి. అప్‌లోడ్‌ చేసిన వాటిని విభాగాల వారీగా చూడొచ్చు. ఈమెయిల్‌ ఐడీతో సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ఇన్‌బాక్స్‌కి అప్‌డేట్స్‌ వస్తాయి. నచ్చిన షోలపై కామెంట్‌ చేయవచ్చు.

పీసీలోనూ...
గూగుల్‌, ఆండ్రాయిడ్‌ మొబైళ్లలో సందడి చేస్తున్న రైల్‌రష్‌ వరల్డ్స్‌ ఆటని పీసీలో ఎలాంటి డౌన్‌లోడ్స్‌, ఇన్‌స్టాల్‌ ప్రక్రియలు లేకుండా ఆడుకోవచ్చు. గనిలో బంగారపు ముద్దల్ని ఏరుకుంటూ వెళ్లాలి. నడుస్తూనో... పరిగెత్తుతూనో అనుకునేరు! మైనింగ్‌ రవాణాకి వాడే రైలు పట్టాలపైన బండి నడుపుతూ వెళ్లాలి. పట్టాల మధ్యలో అడ్డంకులు వస్తాయి. బండిని వాటిపై నుంచి పోనివ్వాలి. అనుకోకుండా రైలు పట్టాలు తొలగిపోయి కాస్త దూరంలో కనిపిస్తాయి. రెప్పపాటులో బండిని కనిపించే రైలు పట్టాలపైకి దూకించాలి. బండిని నడిపేందుకు బాణం గుర్తుల్ని వాడుకోవాలి. బంగారు ముద్దల్ని అందుకునేందుకు A, D మీటల్ని నొక్కాలి. ఇలా ఆరు లెవల్స్‌ని దాటాలి. http://goo.gl/uXzMK

ఐకాన్స్ కావాలా?
మీరో వెబ్ డిజైనరా? సైట్ డిజైనింగ్‌ల్లో ఆకర్షణీయమైన ఐకాన్స్‌ని వాడాలనుకుంటున్నారా? అందుకు అనువైన అడ్డా ఉంది. దాంట్లో సుమారు 1200 ఐకాన్స్ జాబితాగా నిక్షిప్తం చేశారు. కావాల్సిన వాటిని ఉచితంగా పొందొచ్చు. 40ప40సైజులో వాటిని వాడుకోవాలి. కావాలంటే http://goo.gl/H DDML

కత్తి దూయాల్సిందే!
ముఖానికి ముసుగు, చేతిలో కత్తితో ప్రత్యర్థితో తలపడాలంటే Mini Ninjas గేమ్‌ ఆడాల్సిందే. సెట్‌అప్‌లు, డౌన్‌లోడ్స్‌, ఇన్‌స్టలేషన్‌ లాంటి ప్రక్రియలు లేకుండా క్రోమ్‌ బ్రౌజర్‌లో ఆడేయవచ్చు. అందుకు మీరు చేయాల్సిందాల్లా క్రోమ్‌ వెబ్‌స్టోర్‌లోకి వెళ్లాలి. దాంట్లోని గేమ్స్‌ విభాగంలోకి వెళ్లి గేమ్‌ని సెలెక్ట్‌ చేయాలి. పక్కన కనిపించే Add to Chrome పైన క్లిక్‌ చేయాలి. దీంతో గేమ్‌ బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఇక క్రోమ్‌ హోం ట్యాబ్‌ విండోలో కనిపించే గేమ్‌ ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ఆడుకోవచ్చు. బ్రౌజర్‌లో గేమ్‌ని కావాల్సిన అదనపు ప్లగ్గిన్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయాలి. http://goo.gl/PZySz

ముందే చూడొచ్చు
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌ లేదా మరెక్కడైనా ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ని ఓపెన్‌ చేయాలంటే క్లిక్‌ చేసి కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేయాల్సిందేనా? లింక్‌పైన పాయింటర్‌ని పెట్టగానే పేజీ ప్రివ్యూ కనిపిస్తే! ఇది SwiftPreview వెబ్‌ సర్వీసుతో సాధ్యామే. హోం పేజీలో కనిపించే Try Now పైన క్లిక్‌ చేసి సర్వీసుని వాడుకోవచ్చు. ఈ వెబ్‌ సర్వీసు క్రోమ్‌ బ్రౌజర్‌లో పని చేస్తుంది. ఇతర వివరాలకు www.swiftpreview.com చూడండి.

అదో రణరంగమే!
అదో ఆయుధ విమానం...మీకో లక్ష్యం ఉంటుంది... శత్రుస్థావరాలపై బాంబులు వేయాలి...వారి రాకెట్‌ లాంచర్ల నుంచి తప్పించుకోవాలి... చూస్తే అక్కడంతా రణరంగమే!! అదే Air Hawk వీడియో గేమ్‌!. జాబితాలో పొందుపరచిన యుద్ధ విమానాల్లో కావాల్సిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. లెవెల్స్‌ మారుతున్న కొద్దీ విమానాల సామర్థ్యం పెరగుతుంది. విమానాన్ని నడిపేందుకు బాణం గుర్తుల్ని వాడొచ్చు. ఆటలో మొత్తం లెవెల్స్‌ 18. ఒక్కో లెవెల్‌లో శత్రు స్థావరాలు మారిపోతుంటాయి. 10 రకాల శక్తివంతమైన ఆయుధాల్ని లెవెల్స్‌ మారేప్పుడు వశం చేసుకోవచ్చు. శత్రు విమానాలు ఊహించని రీతిలో మిమ్మల్ని చుట్టుముడతాయి. తెలివిగా తప్పించుకోకపోతే వారు వదిలే మిసైల్స్‌కి బలి అవ్వాల్సిందే. లింక్‌లోకి వెళ్లి గేమ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. http://goo.gl/ynvNv

ఏకంగా లారీనే!
ఎప్పుడైనా మీరు పెద్ద లారీని పార్క్‌ చేశారా? అయితే, Park My Big Rig 2 ఆన్‌లైన్‌ వీడియోగేమ్‌ ఆడేయండి. ఇట్టే డ్రైవింగ్‌ నేర్చేసుకోవచ్చు. గేమ్‌ని ఓపెన్‌ చేయగానే.. భవన సముదాయం, స్తంభాలు, రాళ్ల నడుమ మీకు కనిపిస్తుంది. కీబోర్డ్‌లోని బాణం గుర్తులతో నిర్దేశించిన పార్కింగ్‌ స్థలంలో లారీని జాగ్రత్తగా పార్క్‌ చేయాలి. రాళ్లు, స్తంభం, భవనం... ఇలా దేనికి లారీ తాకినా గేమ్‌ ముగిసినట్టే. ఆడేందుకు మీరు సిద్ధమా? బెస్ట్‌ ఆఫ్‌ లక్‌! http://goo.gl/DHZ43

కాస్త హుందాగా!
ఎప్పుడూ కారు, బైకు, విమానం ఆటలేనా? రేస్‌లు, యుద్ధాలేనా? కాస్త రూటు మార్చండి. ప్రొఫెషనల్‌గా బిలియర్డ్స్‌ అడేయండి. గేమ్‌ పేరు Billiard Masters. ఆన్‌లైన్‌ గేమ్‌ అనుకునేరు. నెట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నిక్షిప్తం చేసేందుకు ఎలాంటి అదనపు టూల్స్‌ అక్కర్లేదు. ఇన్‌స్టాల్‌ చేయగానే తెర బుల్లి బిలియర్డ్స్‌ క్లబ్‌గా మారిపోతుంది. గేమ్‌ని రన్‌ చేయగానే One Player, Two Players, Traning నుంచి ఆడాలనుకునే ఆటని ఎంపిక చేసుకోవాలి. ట్రైనింగ్‌లోకి వెళ్లి సాధన చేయవచ్చు. కీబోర్డ్‌లోని A మీటని నొక్కి టేబుల్‌ వ్యూని పై నుంచి చూడొచ్చు. Z నొక్కి జూమ్‌ చేసుకోవచ్చు. త్రీడీలో టేబుల్‌ చుట్టూ తిరుగుతూ ఆడేలా రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత. డౌన్‌లోడ్‌, వివరాలకు http://goo.gl/ wlPrn

ఇలా 'ఫిట్‌...'
కొవ్వు తగ్గించుకుని స్లిమ్‌గా ఉండాలనుకుంటున్నారా? శరీర ఆకృతిని ఆకర్షణీయంగా మార్చుకోవాలా? వ్యాయామ శాలలో పాటించదగ్గ చిట్కాల్ని తెలుసుకోవాలా? వీటన్నింటి కోసం నెట్‌లో విహారం చేయక్కర్లేదు. ఒక ఈ-పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి. ఎక్కడా? ఉచితంగానేనా? అనుకుంటున్నారా? అయితే, గూగుల్‌ ప్లేలోని 'మై బుక్స్‌'లోకి వెళ్లండి. అక్కడ కనిపించే జాబితా నుంచి Get-Fit Guys పుస్తకాన్ని ఉచితంగా పొందొచ్చు. వాడుతున్న మొబైల్‌, ట్యాబ్లెట్‌, ఈ-రీడర్‌.. ఏదైనా చిటికెలో సొంతం చేసుకోవచ్చు. మొత్తం 32 పేజీల పుస్తకం. చక్కని ఉదాహరణలతో పుస్తకంలోని చిట్కాల్ని పాటించొచ్చు. అన్ని అంశాల్ని అధ్యాయాల వారీగా చదువుకునే వీలుంది. డౌన్‌లోడ్‌ కోసం http://goo.gl/oP7OW

యుద్ధం మొదలైంది!
అంతరిక్షంలో పోరాటం... సోలోగా ఫైరింగ్‌ చేయాల్సిందే! వింతైన జీవులు, మెషీన్లు... వాటి నుంచి ఎదురయ్యే ప్రమాదాలు! అలుపెరుగకుండా యుద్ధం చేయాల్సిందే! ఆటేంటో తెలుసా?Star Defender 4 స్పేస్‌లోకి విమానం ప్రవేశించింది మొదలు. గుంపులుగా ఒకేసారి విమానాన్ని చుట్టు ముడతారు. మౌస్‌తో విమానాన్ని కదుపుతూ శత్రువులు విసిరే బాంబుల నుంచి తప్పించుకోవాలి. మౌస్‌ని నిత్యం క్లిక్‌ చేస్తూ ఫైరింగ్‌ చేస్తూనే ఉండాలి. స్కోరు పెరిగిన కొద్దీ లేజర్‌రేస్‌ ఫైరింగ్‌, బుల్లెట్‌ప్రూఫ్‌లాంటి అదనపు శక్తులు వశమవుతాయి. లెవల్స్‌ మారుతున్న కొద్దీ ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. ఆప్షన్స్‌లోకి వెళ్లి గేమింగ్‌ కంట్రోల్స్‌ని మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు మౌస్‌తో ఇబ్బంది అనిపిస్తే కీబోర్డ్‌ని కంట్రోల్‌లా మార్చుకునే వీలుంది. http://goo.gl/ThaeE

'క్రేజీ'గా ఆడండి
మొబైల్‌లో బర్డ్స్‌తో గేమ్స్‌ ఆడడం మామూలే. అదే పీసీలో ఆడాలంటే Crazy Birds వీడియో గేమ్‌ సిద్ధంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఆడాలేమో అనుకునేరు. నెట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆడేందుకు ఎలాంటి అదనపు సాఫ్ట్‌వేర్‌లు అక్కర్లేదు. ఇదో పజిల్‌ గేమ్‌. తెరపై కనిపించే తీగపై భిన్నమైన రంగుల పక్షులు వాలుతుంటాయి. అవి కదులుతూ వరుసక్రమంలో జరుగుతుంటాయి. వాటిల్లో కలిసే పక్షులు జత చేయాలి. ఆటలో మొత్తం లెవల్స్‌ 250. మరి, ఆడేందుకు మీరు సిద్ధమేనా? అయితే, లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. http://goo.gl/Li3PZ

గూగుల్‌ప్లే' లో పుస్తకాలు
మీరు పుస్తక ప్రియులా?ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నారా?అయితే, తాకేతెర ఓ గ్రంథాలయం అయిపోతుంది! అందుకు గూగుల్‌ ప్లేలో 'మై బుక్స్‌' ఉన్నాయి! ఆప్స్‌తో అదరగొట్టిన గూగుల్‌ ప్లే ఈ-పుస్తకాల స్థావరంగా మొబైల్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. Biographies, Business, Economics, Children's Books, Cooking, Fiction, Literature, Religion, Spirituality, Romance... లాంటి విభాగాలున్నాయి. ధరల వారీగా పుస్తకాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఉచిత పుస్తకాల్ని Top Free మెనూలోకి వెళ్లి బ్రౌజ్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్తగా స్టోర్‌లో నిక్షిప్తం చేసిన వాటిని New Arrivals విభాగంలో పొందొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన పుస్తకాల్ని 'ఎడిటర్స్‌ పిక్స్‌'లో చూడొచ్చు. http://play.google.com/books

ఒకటే 'ఫన్‌'!
మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో పిల్లలకు కూడా ప్రత్యేక వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు 'ఫన్‌' ఆప్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అందుకు www.allfunapps.com సైట్‌లోకి వెళ్లండి. ఇంగ్లిష్‌ అక్షరాల్ని నేర్చుకోవడం దగ్గర్నుంచి మెదడుకి పదునుపెట్టే 'పజిల్స్‌' కూడా సిద్ధంగా ఉన్నాయి. జంతువుల పేర్లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్‌ ఉంది. కిండిల్‌, నూక్‌ ఈ-బుక్స్‌లో కూడా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. గూగుల్‌ వెబ్‌స్టోర్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని బ్రౌజర్‌లోనే వాడుకోవచ్చు.

ఆదా చేస్తుంది
బ్లాక్‌బెర్రీ ఫోన్‌ ఛార్జింగ్‌ త్వరగా ఖాళీ అయిపోతోందా? అయితే, బ్యాక్‌గ్రౌండ్‌ రన్‌ అయ్యే ఏయే అప్లికేషన్లు ఛార్జింగ్‌ని లాగేస్తున్నాయో తెలుసుకోవాలంటే అందుకు ఆప్‌వరల్డ్‌లో ఉచితంగా ఆప్‌ ఉంది. అదే BlackBerry Application Resouce Monitor. ఇన్‌స్టాల్‌ చేయగానే హోంస్క్రీన్‌పైన ప్రత్యేక ఐకాన్‌లా కనిపిస్తుంది. ఫోన్‌లో రన్‌ అవుతున్న అన్ని ప్రొగ్రాంలను మానిటర్‌ చేసి ఎక్కువ ఛార్జింగ్‌ని హరించే వాటిని చూపిస్తుంది. వాటి అవసరం లేదనుకుంటే క్లోజ్‌ చేయవచ్చు. http://goo.gl/asVJb

పిల్లలకు ఆ 'ఒక్కటి'
ఇంట్లో కంప్యూటర్‌తో పాటు నెట్‌ కనెక్షన్‌ కూడా ఉందా? అయితే, భాషల్ని బోధించే ఆన్‌లైన్‌ గురుపుని పెట్టుకుని పిల్లలకు నాలుగు భాషల్ని నేర్పించొచ్చు. అదెలా సాధ్యమో తెలియాలంటే http://kids one.in వెబ్‌ సర్వీసులోకి వెళ్లండి. మన మాతృభాషతో పాటు హిందీ, తమిళ్‌, ఇంగ్లిష్‌ భాషల్ని సులువైన మార్గాల్లో అభ్యసించొచ్చు. ఉదాహరణకు తెలుగులోకి వెళ్లి 'ఈ-పెద్దబాల శిక్ష, పద్యాలు, కథలు, ఆటలు...' లాంటి మరిన్ని అభ్యాస పద్ధతుల్లో తెలుగుపై పిల్లలు పట్టు సాధించొచ్చు. పద్యాల విభాగంలో వేమన, సుమతి శతకాలున్నాయి. 'కిడ్స్‌స్టోన్‌ స్లేట్‌'లోకి వెళ్లి అక్షరాభ్యాసం చేయించొచ్చు. అంటే కంప్యూటర్‌ని పలకగా చేసి మౌస్‌ని బలపకంగా మార్చేసి అక్షరాల్ని దిద్దించొచ్చు. కథలతో కూడిన ఈ-పుస్తకాల్ని కూడా అందిస్తున్నారు.

తెలివైన గురి!
యుద్ధాలు... ఫైరింగ్‌లు... రేస్‌లు... రక్తపాతాలు... ఇలాంటి గేమ్స్‌ని క్లోజ్‌ చేసి కాసేపు బుర్రకు పదును పెట్టే గేమ్‌ ఆడదామా? పేరు Deepica. గేమ్‌లో కనిపించే ఏవైనా మూడు రంగులు కలిసిన వాటిని గురి చూసి కొట్టాలి. ఆటలో ట్విస్ట్‌ ఏంటంటే బాల్స్‌ గుండ్రంగా తిరుగుతూ కనిపిస్తాయి. ఆ కదులుతున్న వాటిల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ రంగుతో కలిసున్న వాటిని చూస్తూ ఆడాలి. మొత్తం ఆరు లెవల్స్‌ ఉన్నాయి. బాల్స్‌లో ఏర్పాటు చేసిన బాంబుల్ని పేల్చడం ద్వారా మరింత స్కోర్‌ సాధించొచ్చు. ఇది డౌన్‌లోడ్‌ చేసి ఆడుకునే గేమ్‌. తక్కువ మెమొరీతో ఎలాంటి అదనపు అప్లికేషన్లు లేకుండా ప్లే అవుతుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/Hsrnz

మళ్లీ వచ్చాడు!
జమానాలో జంపులు చేసి... ప్రమాదాల్ని ఎదుర్కొని... ప్రపంచ వ్యాప్తంగా వినోదాన్ని పంచిన మారియో మళ్లీ వచ్చాడు. న్యూ మారియో పేరుతో పీసీల్లో సందడి చేస్తున్నాడు! మీరూ ఓ సారి పలకరిద్దాం అనుకుంటే New Super Mario Forever గేమ్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి! ఇదేదో ఖర్చుతో కూడుకున్నది అనుకుంటే పొరబాటే. ఉచితంగా నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు http://goo.gl/c0Lv1 లింక్‌లోకి వెళ్లండి. జాయ్‌స్టిగ్స్‌ కనెక్ట్‌ చేసి కూడా ఆడుకోవచ్చు. బాక్స్‌లో దాగున్న నాణాల్ని, అదనపు శక్తుల్ని వెతికితీస్తూ ప్రయాణం సాగించాలి. ఈ క్రమంలో ఎదురుపడే ప్రమాదాలపై జంపులు చేస్తూ... బాంబులు విసురుతూ... సాహసాలు చేయాల్సిందే. తెరపై గేమ్‌ని కావాల్సిన సైజులో పెట్టుకోవడం దీంట్లోని ప్రత్యేకత. ఒకవేళ ఫుల్‌స్క్రీన్‌లో కావాలనుకుంటే 'మ్యాక్సిమైజ్‌' బటన్‌ని క్లిక్‌ చేయాలి. ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ని నిక్షిప్తం చేశారు.

ఇలా వెతకొచ్చు!
ఫేస్‌బుక్‌ లాగిన్‌ పేజీలో కొత్తగా కనిపించే 'గ్రాఫ్‌ సెర్చ్‌' చూశారుగా? నెట్‌వర్క్‌లోని స్నేహితులకు సంబంధించిన విశేషాల్ని వెతికేందుకు ఇదో కొత్త వారధి. దీన్ని ప్రొఫైల్‌కి అనుసంధానం చేసి సెర్చ్‌ ద్వారా కావాల్సిన డేటాని వెతకొచ్చు. ఉదాహరణకు మీరు ఇప్పటి వరకూ 'లైక్‌' కొట్టిన పొటోలను చూడాలంటే Photos i like అని టైప్‌ చేసి సెర్చ్‌ కొడితే సరి. అలాగే, 2000 ఏడాదికి ముందు ఫొటోలను చూడాలంటే Photos before 2000 అని టైప్‌ చేస్తే సరి. మీ నెట్‌వర్క్‌లో సభ్యులు ఎవరెవరు మీ జన్మస్థలం నుంచి వచ్చారో తెలుసుకోవాలంటే People who came from hometown అని సెర్చ్‌ కొట్టాలి. చెప్పాలంటే ఇలా చాలానే విషయాల్ని తెలుసుకునే వీలుంది. బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టిన దీన్ని వాడుకునేందుకు కాస్త వేచి చూడాల్సిందే. www.facebook.com/about/graphsearch

కొక్కొరొక్కో...కోడి!
పులితో పోరాటం... సింహంతో చెలగాటం...తొడేలుతో వెటకారం...ఎవ్వరైనా చేస్తారు! కానీ, మీరెప్పుడైనా కోడితో ఫైట్‌ చేశారా? వెటకారం అనుకోకండి! నిజంగా కోళ్లతోనే! అదీ ఎక్కడో తెలుసా? అంతరిక్షంలో... అవి అక్కడికెలా వెళ్లాయంటారా? అయితే, మీరు Chicken Invaders వీడియో గేమ్‌ ఆడాల్సిందే!
కోడి... అంతరిక్షం... పోరాటం అంటున్నారు. గేమ్‌ కొనాలేమో అనుకునేరు. ఇది పూర్తిగా ఉచితం. http://goo.gl/w nrn5 లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎక్కువ మెమొరీ, ర్యామ్‌ అక్కర్లేదు. చిటికెలో సిస్టంలో ఒదిగిపోయి ఆడేందుకు సిద్ధం అవుతుంది. ఫుల్‌స్క్రీన్‌ మోడ్‌లో ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో గేమ్‌ ఆడొచ్చు.

'సేఫ్‌'గా ఉండాలి!
వెతుకులాటలో కొన్ని సార్లు అసభ్యకరమైన సైట్‌లు, ఇమేజ్‌లు తారసపడుతుంటాయి. అలాంటివి కనిపించకుండా సేఫ్‌గా 'సెర్చ్‌' చేయాలంటే SafeSearch ఫిల్టర్‌ని ఎప్పుడూ ఆన్‌ చేసి పెట్టుకోవడం మంచిది. హోం పేజీలో సెర్చ్‌ కొట్టగానే కుడివైపు కనిపించే సెట్టింగ్స్‌ ఐకాన్‌ పై క్లిక్‌ చేసి 'సెర్చ్‌ సెట్టింగ్స్‌'ని ఎంచుకోండి. వచ్చిన పేజీలోని Filter Explicit Results ఆప్షన్‌ని చెక్‌ చేసి సేవ్‌ చేయండి. మరింత కట్టుదిట్టంగా సేఫ్‌సెర్చ్‌ని కొనసాగించాలంటేmore about SafeSearchలోకి వెళ్లొచ్చు. సేఫ్‌సెర్చ్‌ని ఆఫ్‌ చేయకుండా గూగుల్‌ ఎకౌంట్‌తో లాక్‌ చేయవచ్చు. అందుకు Lock SafeSearchపై క్లిక్‌ చేయండి.
ఇట్టే చెప్పేస్తుంది!
ఇంట్లో వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌తో నెట్‌ని వాడుతున్నప్పుడు ఇతరులెవరైనా మీ నెట్‌వర్క్‌ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారేమో తెలుసుకోవాలంటే అందుకో ప్రత్యేక గార్డ్‌ని పెట్టుకోవచ్చు. అదే SoftPerfect WiFi Guard. అప్లికేషన్‌ని రన్‌ చేయగానే నెట్‌వర్క్‌లోని సిస్టంలను స్కాన్‌ చేసి అనధికారికంగా గూపులో చేరిన వాటిని అలర్ట్‌ చేసి చూపిస్తుంది. గుర్తు తెలియని డివైజ్‌లను Unrecognised Devices గా చూపిస్తుంది. సెట్టింగ్స్‌ ద్వారా నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. http://goo.gl/EdgNM
నోరూరాలంటే?
నిత్యం ఏదోక కొత్త వంటకాన్ని చేసుకుని ఆస్వాదించాలంటే http://allrecipes.comలోకి వెళ్లాల్సిందే. మెనూల వారీగా కావాల్సిన వంటకాన్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. వీడియోలతో కూడిన వంటకాలకు ప్రత్యేక మెనూ ఉంది. పండగలకు మరింత ఉత్సాహాన్ని అందించే వంటకాల చూడాలంటే 'హాలీడేస్‌' మెనూలోకి వెళ్లండి. హోం పేజీలో కనిపించే సెర్చ్‌బాక్స్‌లో కావాల్సిన వంటకాన్ని టైప్‌ చేసి వెతికే వీలుంది.
కాస్త కళాత్మకంగా...
మీ ఫొటోలను కళాత్మకంగా చిత్రించుకునేలా రూపొందించిన మరో ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ FlauntR.Get photos ద్వారా సిస్టంలోని ఫొటోలను సైట్‌లోకి తెచ్చుకోవచ్చు. పికాసా, ఫ్లిక్కర్‌, ఫేస్‌బుక్‌, బిబో... లాంటి ఫొటో షేరింగ్‌ సైట్‌ల నుంచి కూడా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెల్‌ఫోన్‌ వాల్‌పేపర్లను రూపొందించుకునేలా mobilRను ఈ సైట్‌లో ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు www.flauntr.com చూడండి.
సెర్చ్‌ కొడితే చాలు
ప్రపంచంలో ఏదైనా దేశంలోనో, నగరంలోనో టైం ఎంతో తెలుసుకోవాలంటే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌ అప్లికేషన్లు అక్కర్లేదు. గూగుల్‌ సెర్చ్‌బాక్స్‌లో ప్రత్యేక గూగుల్‌ కీవర్డ్‌తో తెలుసుకోవచ్చు. అందుకు సెర్చ్‌బాక్స్‌లో What time is it అని టైప్‌ చేసిన తర్వాత దేశం, ప్రాంతం పేరుని టైప్‌ చేయాలి. గూగుల్‌ ఫలితాల్లోని మొదటి వరుసలో టైం కనిపిస్తుంది.
నేర్చుకున్నంత!
జావా, సీ, సీ ప్లస్‌ ప్లస్‌, లినక్స్‌... లాంటి ఐటీ పాఠాల్ని నేర్చుకోవాలంటే ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీలో చేరిపోండి. అందుకు వేదికగా నిలుస్తోంది http://showmedo.comవెబ్‌ సర్వీసు. దీంట్లో సభ్యులై కమ్యూనిటీ సభ్యులు పోస్ట్‌ చేసిన టుటోరియల్స్‌తో అవగాహన పెంచుకోవచ్చు. వీడియోలు, స్క్రీన్‌షాట్‌లతో పాఠాల్ని అందిస్తున్నారు. కావాల్సిన వాటిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మరింత చౌకగా!
వీడియో కాలింగ్, సిమ్‌కార్డ్ స్లాట్‌తో కాస్త తక్కువ ధరకు కావాలనుకుంటే WishTel IRA Icon Triple Play గురించి తెలుసుకోవాల్సిందే. ధర సుమారు రూ.10,500. బడ్జెట్ ట్యాబ్లెట్‌గా దీన్ని పిలుస్తున్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. 1.2Ghz ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ కెమెరాలు (వెనక 2 మెగాపిక్సల్, ముందు వీజీఏ కెమెరా), మిని యూఎస్‌బీ పోర్ట్, హెచ్‌డీఎంఐ, మైక్రో ఎస్‌డీ స్లాట్ సౌకర్యాలతో రూపొందించారు. బరువు 400 గ్రాములు. Wish Learning, Wish TV, Wish News, Wish Video calling అప్లికేషన్స్‌ని ప్రీలోడెడ్‌గా అందిస్తున్నారు. 4 గంటల బ్యాటరీ సామర్థ్యం. బీఎస్ఎన్ఎల్ త్రీజీ సిమ్‌ని ఉచితంగా అందిస్తున్నారు. www.wishtel.com/icon_2.html
ఇవో రెండు
తక్కువ ధరకే నాజూకు ట్యాబ్లెట్ కావాలంటే Winknet Ultimate, Wonder ట్యాబ్లెట్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. వీటి మందం 9.9 మిల్లీమీటర్లే 1.5Ghz ప్రాసెసర్‌తో వాటిని రూపొందించారు. తాకే తెర పరిమాణం 9.7 అంగుళాలు. రిజల్యుషన్ 1024X768 పిక్సల్స్. ర్యామ్ 1జీబీ. సోరేజ్ సామర్థ్యం 16 జీబీ. వెనకభాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా, వీడియో ఛాటింగ్‌కి ముందు వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. బరువు 643 గ్రాములు. ఇక 'వండర్' మోడల్‌కి వస్తే తెర పరిమాణం 7 అంగుళాలు, 512 ఎంబీ ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం 8 జీబీ, ముందు భాగంలో వీజీఏ కెమెరాతో తయారు చేశారు. బరువు 369 గ్రాములు. రెండిటిలోనూ హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, 3జీ డొంగుల్ సపోర్ట్, వై-ఫై సదుపాయాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.0 ఓఎస్‌తో పని చేస్తాయి. ధర సుమారు 7,999. మరిన్ని వివరాలకు http://goo.gl/LZlux
ప్లగ్ చేస్తే చాలు
స్పీకర్ అంటే వైర్‌లు, అడాప్టర్‌లు, యూఎస్‌బీ కనెక్షన్లు... పెద్ద పనే! ఇవేం లేకుండా ప్లగ్ లైట్ మాదిరిగా స్విచ్‌బోర్డ్‌కి కనెక్ట్ చేసి వాడుకునేలా ఉంటే? JBL Soundfly అలాంటిదే. చిత్రంలో మాదిరిగా స్పీకర్‌ని పవర్ అవుట్‌లెట్‌ని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఫోన్, ల్యాప్‌టాప్, ఎంపీ3 ప్లేయర్లకు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. బ్లూటూట్ నెట్‌వర్క్ ద్వారా డివైజ్‌లకు కనెక్ట్ చేయాలి. దీని సౌండ్ అవుట్‌పుట్ 20w RMS. డివైజ్‌లకు కనెక్ట్ అయ్యిందీ లేనిది వాయిస్ కమాండ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జేవీఎల్ కంపెనీ తయారు చేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని స్పీకర్ వాల్యూమ్ కంట్రోల్, ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ని యాక్సెస్ చేయవచ్చు. దీని బరువు కేవలం 420 గ్రాములే. వీడియో ఇతర వివరాలకు http://goo.gl/Q5 KZT
బైక్‌కి కూడా!

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అడ్రస్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా? వాడుతున్న సాధారణ మొబైల్‌లో జీపీఎస్ మ్యాపింగ్ సదుపాయం లేదా? అయితే, ప్రత్యేక జీపీఎస్ డివైజ్ వాడేస్తే సరి! తక్కువ పరిమాణంలో జేబులోనూ ఒదిగి పోతుంది. బైక్‌పైన అనువుగా వాడుకునేలా దీన్ని రూపొందించారు. పేరు Garmin ZUMO 350LM. ఇదో వాటర్‌ప్రూఫ్ జీపీఎస్ డివైజ్. 4.3 అంగుళాల తాకే తెరతో రూపొందించారు. పగటిపూట కూడా తెరను అనువుగా వాడుకోవచ్చు. 480X272 పిక్సల్స్‌తో మ్యాపింగ్‌ని చూడొచ్చు. మీరు వెళ్లాలనుకున్న గమ్యాన్ని సెట్ చేశాక ప్రతి మలుపుని చూపిస్తూ దిశానిర్దేశం చేస్తుంది. బ్లూటూత్ హెడ్‌సెట్‌తో వాయిస్ కమాండ్స్‌ని వినొచ్చు కూడా. బరువు 270 గ్రాములు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 7 గంటలు పని చేస్తుంది. పరిధిని మించిన వేగంతో బైక్‌ని నడిపితే స్పీడ్ ఇండికేటర్ ఎలర్ట్ చేస్తుంది. వీడియో, ఇతర వివరాలకు http://sites.garmin.com/zumo/

సురక్షితం... సౌకర్యం
వేలు పోసి కొన్న మొబైల్‌కి కచ్చితంగా ఖరీదైన మొబైల్ పౌచ్‌నే వాడతాం. కాకపోతే ఫోన్ కాల్ వచ్చినా... కాల్ చేయాలన్నా పౌచ్‌ని తీసి కాల్ చేస్తున్నది ఎవరో చూసి గానీ మాట్లాడలేం. ఇంత కష్టం లేకుండా కాలర్ ఐడీని మాత్రమే డిస్‌ప్లే చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినదే Capdase ID Case. ధర సుమారు రూ.850. మరిన్ని మొబైల్ కేస్‌ల కోసం http://goo.gl/meYDu

ఆటలకో కొత్త వేదిక...
నిజ జీవితానికి దూరంగా రోజులో కొన్ని గంటలైనా వీడియో గేమింగ్ ప్రపంచంలో విహరిస్తారా? అయితే, మీరు Asus అందుబాటులోకి తెచ్చిన ROG TYTAN CG8580 డెస్క్‌టాప్ పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. థర్డ్ జనరేషన్ ఇంటెల్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్‌డ్రైవ్, 128 జీబీ ఎస్ఎస్‌డీ, Nvidia GTX 680 గ్రాఫిక్స్ కార్డ్, Asus Xonar Sound Card, బ్లూ రే రైటర్‌లతో దీన్ని రూపొందించారు. ప్రత్యేక గేమింగ్ కీబోర్డ్, గేమింగ్ మౌస్‌లతో పీసీని అందిస్తున్నారు. ప్రత్యేక 'లిక్విడ్ కూలింగ్ సిస్టం'తో దీన్ని రూపొందించారు. దీంతో పీసీ తొందరగా వేడెక్కదు. ఇతర వివరాలకు http://goo.gl/PxSfC

ఇది 'సూపర్'!
ఏదైనా మేటర్‌ని కాపీ చేసి మరోచోట పేస్ట్ చేయడానికి సాధారణంగా copy ఆప్షన్ వాడతాం. దీంతో ఇంతకు ముందు కాపీ చేసింది మాత్రమే మెమొరీలో ఉంటుంది. గతంలో కాపీ చేసినవి చెరిగిపోతాయి. అలాకాకుండా కాపీ చేసినవి అన్నీ మెమొరీలో సేవ్ అయి ఉండాలంటే SuperCopyPaste టూల్‌తో సాధ్యమే. ఇక మీరు కాపీ చేసిన అన్ని యాక్షన్స్ టూల్‌లో సేవ్ అవుతాయి. Stored Archive ఇవన్నీ ఉంటాయి. హిస్టరీని తొలగించాలంటే Clear Archive చేస్తే సరిపోతుంది. టూల్‌ని వాడుకోవాలంటే సిస్టంలో ముందుగా డాట్‌నెట్ ఫ్రేమ్‌వర్క్ వెర్షన్4 ఇన్‌స్టాల్ చేసుకోవాలి. http://goo.gl/npQOv.

ఇలా మార్చొచ్చు
ఫైల్ ఫార్మెట్‌లను మార్చే టూల్స్‌లో JPEG to PDF ఒకటి. ఇది ఇమేజ్ ఫైల్స్‌ని పీడీఎఫ్ ఫార్మెట్‌లోకి మార్చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఇమేజ్‌లను కలిపి ఒకే పీడీఎఫ్‌గా మార్చుకునే వీలుంది. ఫైల్స్ ఆటోమాటిక్‌గా పేజీకి సరిపడేలా మారిపోతాయి. పేజీ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు కూడా. విండోలోని Add files తో ఇమేజ్‌లను జాబితాగా పెట్టుకోవచ్చు. తర్వాత అవుట్‌పుట్ ఫోల్డర్‌ని సెట్ చేసుకోవాలి. పేజీ సైజు మార్చాలనుకుంటే Specify Page Size సెట్ చేసుకోవాలి. అంతా పూర్తయ్యాక Save PDF క్లిక్ చేస్తే సరి. http://goo.gl/fTwYp
అన్నీ ఒకేచోటే!
మొబైల్ అప్లికేషన్లు కావాలంటే .www.wapdan.com/web/ లోకి వెళ్లండి. మ్యూజిక్ క్లిప్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్లు, వాల్‌పేపర్లు, యానిమేషన్స్, వీడియోలు, రింగ్‌టోన్లు సిద్ధంగా ఉన్నాయి. మీరు వాడుతున్న మోడల్‌ని సెలెక్ట్ చేసుకుని కావాల్సిన వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీసీ నుంచే కాకుండా సరాసరి మొబైల్ నుంచి కూడా పొందే వీలుంది. లింక్స్‌లో నచ్చిన వాటిని ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల్లో పోస్ట్ చేసే వీలుంది

ఐదు నిమిషాలే!
ఏదైనా టెక్స్ట్ డేటా కోసం వికీపీడియాలోకి వెళ్లడం మామూలే. మరి, ఏదైనా వీడియో సమాచారం కావాలంటే? అందుకూ .www.5min.com ఉంది. విభాగాల వారీగా వీడియోలు కనిపిస్తాయి. కావాల్సిన దాంట్లోకి వెళ్లి బ్రౌజ్ చేసి చూడొచ్చు. సెర్చ్ ద్వారా వెతికే వీలుంది. టెక్నాలజీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్స్‌ని చూడాలంటే Tech Highlights లోకి వెళితే సరి. ఎక్కువ మంచి నెటిజన్లు వీక్షించిన వాటిని Most Viewed లో చూడొచ్చు.
ఈ-లెర్నింగ్‌కి వెళతారా?
ఆన్‌లైన్‌లోనే ఇంజినీరింగ్ పాఠాల్ని అభ్యసించాలంటే http://nptel.iitm.ac.in వెబ్ సర్వీసులోకి వెళ్లండి. విభాగాల వారీగా వీడియో పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. కావాల్సిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ముందుగానే డిజైన్ చేసిన టెంప్లెట్స్‌లోకి ఫొటోలను అప్‌లోడ్ చేసి ఆకట్టుకునేలా క్రియేట్ చేయాలంటే http://picjoke.net లోకి వెళ్లండి. హోం పేజీలోని దేశాన్ని ఎంచుకోగానే డిజైన్స్ కనిపిస్తాయి.
* ఇలాంటిదే మరోటి www.photofacefun.com విభాగాలుగా ఉన్న డిజైన్లను బ్రౌజ్ చేసి నచ్చిన వాటిల్లోకి ఫొటోలను అప్‌లోడ్ చేయవచ్చు.
* www.photofunia.com కూడా అలాంటిదే.
అలా మారిపోతుంది!
సిస్టం, ల్యాపీల్లో మీరు వాడుతున్న విండోస్ 7 వెర్షన్‌ను కొత్తగా అందుబాటులోకి రానున్న విండోస్ 8 మాదిరిగా మార్చేయాలంటే? Windows 8 UK Pack 6.0 ఉంటే సరి. ఇన్‌స్టాల్ చేసి సిస్టంని రీస్టార్ట్ చేయగానే లాగిన్ స్క్రీన్, డెస్క్‌టాప్ థీమ్ అన్నీ మారతాయి. థీమ్స్, వాల్‌పేపర్లు చాలానే ఉన్నాయి. http://goo.gl/n7ocF
ఉచితంగా వెబ్‌సైట్
వ్యాపార అవసరాలకో, వ్యక్తిగత వివరాలకో ప్రత్యేక వెబ్‌సైట్, ఈమెయిల్ ఐడీలను వాడాలనుకుంటే www.indiagetonline.in వెబ్ సర్వీసులో సభ్యులైపోండి. దీంట్లో ఉచితంగా వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ఒక ఏడాది పాటు నచ్చిన 'డొమైన్‌నేమ్'తో వెబ్‌సైట్‌ని ఉచితంగా వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. మీకు నచ్చిన డొమైన్ నేమ్‌తో ఈమెయిల్ ఐడీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
త్రీడీలో చేయండి!
మీ పేరుని త్రీడీ యానిమేషన్‌తో క్రియేట్ చేయాలంటే? సాఫ్ట్‌వేర్‌లు కొనక్కర్లేదు. ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు. www.3dtextmaker.com లోకి వెళితే సరి. హోం పేజీలో ఏర్పాటు చేసిన Click Here to Create 3D text పై క్లిక్ చేసి డిజైన్ చేయవచ్చు. ఫాంట్, రంగులు, డైమెన్షన్స్... సెట్ చేసుకుని టెక్స్ట్‌ని ఎంటర్ చేసి Make 3D Text పై క్లిక్ చేయాలి.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు...
మీరు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా? అయితే, ఆన్‌లైన్‌లోనే బిల్లుల వివరాలు, ఫోన్ కాల్స్ వివరాలు, రోజువారీ చేసిన కాల్స్ బిల్లు వివరాల్ని ఒకేచోట చూడొచ్చు. ఎకౌంట్ నెంబర్ ఆధారంగా http://selfcare.sdc.bsnl.co.in లోకి వెళితే చాలు. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వొచ్చు. బిల్లు చెల్లింపు చేయడం మాత్రమే కాకుండా బ్రాడ్‌బ్యాండ్ పాస్‌వర్డ్‌ని మార్చుకునే వీలుంది. మీకున్న సెట్‌వర్క్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.