MOBILES
512జీబీతో...
స్మార్ట్‌ ఫోన్లలో స్టోరేజ్‌ సామర్థ్యం 256 జీబీ వరకూ చూశాం. త్వరలోనే 512జీబీ మెమొరీని సపోర్ట్‌ చేసే ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌. శామ్‌సంగ్‌ కంపెనీ ఆ దిశగా స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసేందుకు సిద్ధం అవుతోంది. అవి గెలాక్సీ సరీస్‌ ఎస్‌9, ఎస్‌9 ప్లస్‌ ఫోన్లేనని నెట్టింట్లో వినికిడి. 4జీబీ ర్యామ్‌తో నాలుగు రకాల మెమొరీ శ్రేణుల్లో (64జీబీ, 128జీబీ, 256జీబీ, 512జీబీ) మోడళ్లు మార్కెట్‌లో హల్‌చల్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నాయట!
‘ఆనర్‌’ వచ్చేసింది
కృత్రిమ మేధస్సు (ఏఐ-ఎనేబుల్డ్‌) ఫోన్‌ని హ్యువాయ్‌ కంపెనీ దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. పేరు ‘ఆనర్‌ వ్యూ 10’. 5.99 అంగుళాల తాకేతెర. ఎస్‌సీడీ ఫిల్‌వ్యూ డిస్‌ప్లే. ర్యామ్‌ 6జీబీ. వెనక డ్యూయల్‌ కెమెరాలు (16 మెగాపిక్సల్‌, 20 మెగాపిక్సల్‌) ఉన్నాయి. ముందుభాగంలో 13 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ‘ఫేషియల్‌ అన్‌లాక్‌ టెక్నాలజీ’తో ముఖాన్ని గుర్తుపట్టి ఆన్‌లాక్‌ అవుతుంది. స్టోరేజ్‌ సామర్థ్యం 128జీబీ. మెక్రోఎస్‌డీ కార్డుతో 256జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 8.0 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. ఆన్‌లైన్‌ అంగడి అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ధర రూ.29,999.
బడ్జెట్‌లోనే...
దేశీయ కంపెనీ ఎం-టెక్‌ 4జీ బీఓఎల్‌టీఈ ఫీచర్‌ సపోర్ట్‌తో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు ‘ఈరోస్‌ ప్లస్‌’. ధర రూ.4,299. 5 అంగుళాల తాకేతెరతో దీన్ని తయారు చేశారు. డ్యూయల్‌ కెమెరాలు (వెనక 5 మెగాపిక్సల్‌, ముందు వీజీఏ కెమెరా) ఉన్నాయి. క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 64జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ ఎన్‌ 7.0 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2,000ఎంఏహెచ్‌.

రెండు కెమెరాలు ఒకేసారి...

మోడల్‌: నోకియా 8
ఫీచర్ ఫోన్లలో ఒకప్పుడు నోకియా ట్రెండ్‌ సెట్టర్‌. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలోనూ అదే హవా కొనసాగించేలా నోకియా 8 మోడల్‌తో ముందుకొచ్చింది. రెండు కెమెరాల్ని ఒకేసారి వాడుతూ జ్ఞాపకాల్ని పదిలం చేసుకోగలగడం దీంట్లోని ప్రత్యేకత. ‘షేర్‌ బోత్‌ సైడ్స్‌ ఆఫ్‌ ద స్టోరీ’ అంటూ మొబైల్‌ ప్రియుల్ని కట్టిపడేస్తోంది. దీంతో సెల్ఫీతో పాటు ‘బోతీ’ అనే కొత్త ట్రెండ్‌ని పరిచయం చేసింది. ఫోన్‌ ముందు ఉంచి మీతో పాటు మీ ముందు ఉన్నవారినీ ఒకేసారి సెల్ఫీలో చేర్చొచ్చు. ఇదే మాదిరిగా లైవ్‌ వీడియోలూ చిత్రీకరించొచ్చు. 4కే రిల్యూషన్‌తో 360 డిగ్రీల్లోనూ వీడియోలు తీసుకునే వీలుంది. దీన్నే ‘డ్యుయల్‌ సైట్‌ టెక్నాలజీ’గా పిలుస్తున్నారు. రెండు కెమెరాల సామర్థ్యం 13 మెగాపిక్సల్‌. ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 64 జీబీ. తెర పరిమాణం 5.3 అంగుళాలు. ధర రూ.36,999
ఇతర వివరాలకు: https://goo.gl/tjectV

బ్యాటరీ భళా..

మోడల్‌: కామియో
అందుబాటులో ఉన్న డేటా ప్యాకేజీలు... రూపుదిద్దుకుంటున్న ఆప్‌ సర్వీసులతో స్మార్ట్‌ ఫోన్‌లో నిత్యం ఏదోటి యాక్సెస్‌ చేస్తూనే ఉంటాం. దీంతో ఫోన్‌ బ్యాటరీ బ్యాక్‌అప్‌ ఎక్కువ ఉండేలా చూస్తున్నాం. మీరూ ఇదే ఆలోచనతో ఫోన్‌ని వెతుకుతున్నట్లయితే కామియో సరైన ఎంపిక. అదీ బడ్జెట్‌లోనే! ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చట. డ్యూయల్‌ కెమెరాల సామర్థ్యం 13 (ప్రైమరీ), 8 మెగాపిక్సల్‌. ర్యామ్‌ 3జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32జీబీ. తెర పరిమాణం 5.5 అంగుళాలు. ధర రూ.9,999
ఇతర వివరాలకు: https://goo.gl/w5sPqi

మ్యూజిక్‌ మస్తీ!

మోడల్‌: సోనీ ఎక్స్‌పిరియా టీ ఏ1 ప్లస్‌
అదిరే సౌండ్‌ సిస్టంతో మ్యూజిక్‌ ప్రియుల్ని కట్టిపడేసే స్మార్ట్‌ మొబైల్‌ ఇది. ‘క్లియర్‌ ఆడియోప్లస్‌, స్మార్ట్‌ యాప్లిఫైయర్‌’తో ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది. ‘బాస్‌’ని కావాల్సినట్టుగా మార్చుకునేందుకు ‘క్లియర్‌బాస్‌’ ఆప్షన్‌ ఉంది. అంతేకాదు... కెమెరా సామర్థ్యం కూడా ఎక్కువే. 23 మెగాపిక్సల్‌. ‘స్టడీషాట్‌’ ఆప్షన్‌తో బ్లర్‌ ఎఫెక్ట్‌ లేకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించొచ్చు. ముందు కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సల్‌. తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. పవర్‌ ఆన్‌, ఆఫ్‌ బటన్‌నీ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో తీర్చిదిద్దారు. బ్యాటరీ సామర్థ్యం 3,430 ఎంఏహెచ్‌. ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32జీబీ. ధర రూ.26,990
ఇతర వివరాలకు https://goo.gl/KbrZcf

రెండు కెమెరాలత ‘నోట్‌’

ఆరు అంగుళాల తాకే తెరతో శాంసంగ్‌ కొత్త ‘నోట్‌’ మొబైల్‌ను త్వరలో లాంచ్‌ చేయబోతోంది. 6.3 అంగుళాల తాకే తెర ఉండే ‘శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8’కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇందులో వెనుకవైపు 12 ఎంపీ, 13 ఎంపీ కెమెరాలుంటాయి. ఇవి వైడ్‌ యాంగిల్‌ సీఐఎస్‌ సపోర్టుతో డ్యూయల్‌ ఫొటోడయోడ్‌తో పని చేస్తాయి. 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ తెర గెలాక్సీ ఎస్‌ 8 తరహాలోనే కనిపిస్తోంది. మరోవైపు బ్యాటరీ పేలుడు కారణంగా వెనక్కి పిలిపించిన శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 మొబైళ్లను నోట్‌ 7 ఆర్‌గా మార్చి త్వరలో అమ్మకాలు ప్రారంభిస్తారు.

10,000 బ్యాటరీతో

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ అంటే మూడు వేల ఎంఏహెచ్‌, మహా అయితే ఐదు వేల ఎంఏహెచ్‌ చూస్తుంటాం. ఏకంగా పది వేల ఎంఏహెచ్‌తో ఓ మొబైల్‌ వస్తోంది. కె10000ప్రో పేరుతో చైనాకు చెందిన ఓకిటెల్‌ సంస్థ దీన్ని రూపొందించింది. వచ్చే నెల్లో ఇది చైనా మార్కెట్‌లోకి వస్తుంది. దీని స్పెసి ఫికేషన్లు చూస్తే... 5.5 అంగుళాల తాకేతెర, 1.5 జీహెచ్‌జెడ్‌ మీడియా టెక్‌ ఆక్టాకోర్‌ ప్రోసెసర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. ఫ్యాబ్రిక్‌ కవరింగ్‌ మెటల్‌ ఎడ్జెస్‌తో ఈ మొబైల్‌ వినూత్నంగా రూపొందింది.

ఫీచర్‌ మొబైల్‌లో 4జీ

వోల్టీ సదుపాయం ఉన్న ఫీచర్‌ మొబైళ్లు రాబోతున్నాయి అంటూ గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఆ దిశగా జియో ప్రయత్నాలు చేస్తోందనీ తెలిసింది. ఇప్పుడు లావా నుంచి 4జీ సదుపాయంతో Lava 4G Connect M1 లాంచ్‌ అయ్యింది. దీని ధర సుమారు రూ.3,333. కీప్యాడ్‌ ఉంటూ పాత తరం మొబైల్‌లా కనిపించే ఇందులో 4జీ నెట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. దేశంలో లాంచ్‌ అయిన తొలి 4జీ సదుపాయం ఉన్న ఫీచర్‌ ఫోన్‌ ఇది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా కొన్ని సామాజిక అనుసందాన వేదికల ఆప్‌లు, డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసు ఆప్‌లుంటాయి. స్పెసిఫికేషన్లు చూస్తే... 1.2 జీహెచ్‌జెడ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రోసెసర్‌ ఉంటుంది. 2.4 అంగుళాల తాకే తెర, 1750 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయి. 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. మెమొరీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. త్వరలో మార్కెట్‌లోకి వస్తాయి.

నోకియా నుంచి ‘ఆరు’

స్మార్ట్‌ఫోన్ల రంగంలో నోకియా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ‘నోకియా 6’ పేరుతో త్వరలో చైనాలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫోన్‌ స్పెషిఫికేషన్లు చూస్తే... 5.5 అంగుళాల తాకే తెర, స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రోసెసర్‌ ఉంటాయి. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ. డ్యూయల్‌ ఆంప్లిఫైర్స్‌తో డాల్బీ అట్మాస్‌ శబ్ద సాంకేతికత ఉంటుంది. వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంటాయి. 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. ధర సుమారు రూ.17 వేలు ఉంటుందని సమాచారం. ఈ మొబైల్‌ మన మార్కెట్‌లోకి ఏప్రిల్‌లో వస్తుందని సమచారం.

రెడ్‌మీ కొత్త మొబైల్‌

గతేడాది రెడ్‌ నోట్‌ మీ 3 మొబైళ్లతో దుమ్మురేపిన జియామీ ఈ ఏడాది రెడ్‌మీ సిరీస్‌లో మరో మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ నెల 19న దిల్లీలో జరగబోయే ఓ కార్యక్రమంలో రెడ్‌మీ నోట్‌ 4ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ మోడల్‌ ఇప్పటికే చైనాలో విడుదలైంది. ఇందులో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీ, 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు ఉన్నాయి. 5.5 అంగుళాల తాకే తెర ఉంటుంది. మీడియా టెక్‌ డెకా కోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. ముందువైపు 13 ఎంపీ కెమెరా, వెనుకవైపు 5 ఎంపీ కెమెరా. ఇందులో ఇన్‌ప్రారెడ్‌ సెన్సార్‌ సౌకర్యం, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయి.

ఎస్‌ పెన్‌ జోడీగా

స్టైలస్‌ పెన్‌ + ట్యాబ్‌... ఈ రెండింటి జోడీ సూపర్‌గా ఉంటుంది కదా. శామ్‌సంగ్‌ ఈ కొత్త జోడీని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటివరకు గెలాక్సీ 7 ఫోన్‌లో ఉన్న ‘ఎస్‌ పెన్‌’ను కొత్త Samsung Galaxy Tab A 10.1 (2016)లో ఇచ్చింది. ప్రస్తుతానికి దక్షిణ కొరియా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ కొత్త ట్యాబ్‌ త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది మేలో ‘శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎ’ విడుదలైంది. వై-ఫై, 4జీ సదుపాయంతో విడుదలైన ఆ ట్యాబ్‌ల్లో ‘ఎస్‌ పెన్‌’ సౌకర్యం లేదు. కొత్త ట్యాబ్‌లో ఉంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే... 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత సామర్థ్యం ఉంటాయి. మెమొరీ కార్డుతో 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ముందువైపు 2 ఎంపీ కెమెరా, వెనుకవైపు 8 ఎంపీ కెమెరా ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 7300 ఎంఏహెచ్‌. ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ధర సుమారు రూ. 30 వేలు.

వేలి ముద్రతో ప్లే చేద్దామా

పిన్‌, పాస్‌వర్డ్‌, ప్యాట్రన్‌... ఇప్పుడు ఫింగర్‌ ప్రింట్‌. మొబైల్‌ లాక్‌ ఆప్షన్‌లో ఇప్పుడు ఫింగర్‌ ప్రింట్‌ సెక్యూరిటీదే హవా. కొత్త తరం ఫోన్లలో ఈ ఆప్షన్‌ లేని ఫోన్‌ లేదంటే నమ్మండి. ఈ ఆప్షన్‌తో ఫోన్‌, ఆప్స్‌ అన్‌లాక్‌ చేయొచ్చు. ఇవేకాకుండా మరిన్ని ఆప్షన్లతో ‘ఇంటెక్స్‌ ఆక్వా ఎస్‌ 7’ విడుదలైంది. ఈ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్‌తో పాటలు, వీడియోలు ప్లే, పాస్‌ చేయొచ్చు. అంటే ఫింగర్‌ సెన్సార్‌ను ప్లే బటన్‌లా వాడుకోవచ్చన్నమాట. ఐదు అంగుళాల తాకే తెర ఉన్న ఈ ఫోన్‌ ధర రూ. 9,499. ముందు 5 ఎంపీ కెమెరా, వెనుక 13 ఎంపీ కెమెరా ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం 3,200 ఎంఏహెచ్‌. 3 జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం ఉంటుంది. మెమొరీ కార్డుతో స్టోరేజీని 64 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 4g Volte ఆప్షన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది.

సెల్ఫీ ప్రియుల కోసం

స్నేహితుల్ని కలిస్తే సెల్ఫీ, ఇష్టమైన ప్రదేశానికెళ్తే సెల్ఫీ... ఇలా సందర్భం ఏదైనా సెల్ఫీ మాత్రం కామన్‌. మీరూ ఇంతేనా? కానీ వెలుతురు తక్కువగా ఉన్నప్పుడో, లేకపోతే రాత్రి సమయాల్లో సెల్ఫీ తీసుకుందామంటే కుదరడం లేదని బాధ పడుతున్నారా? ఇలాంటి వాళ్ల కోసం జియోనీ... ఫ్రంట్‌ కెమెరాకు కూడా ఫ్లాష్‌ సౌకర్యం అందిస్తూ ‘జియోనీ ఎస్‌6ఎస్‌’ని విడుదల చేసింది. 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో రూపొందిన ఈ ఫోన్‌లో సెల్ఫీలు మరింత ప్రభావవంతంగా వస్తాయట. 5.5 అంగుళాల తాకే తెర ఉన్న ఈ ఫోన్‌లో 1.3 జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుక వైపు 13 ఎంపీ కెమెరా ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం ఉంటుంది. మెమొరీ కార్డుతో 128 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 3150 ఎంఏహెచ్‌.

మూడు కెమెరాలతో ‘కూల్‌’గా

స్మార్ట్‌ఫోన్లలో మూడు కెమెరాల ట్రెండ్‌ వూపందుకుంటోంది. ఇటీవల జియామీ మూడు కెమెరాలతో రెడ్‌మీ ప్రో ఫోన్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పుడు లెకో, కూల్‌ ప్యాడ్‌ వచ్చేశాయి. ఈ రెండు సంస్థలు కలసి ఇటీవల ‘కూల్‌’ సిరీస్‌ను ప్రారంభించాయి. అందులో భాగంగా ‘కూల్‌1 డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్పెసిఫికేషన్స్‌ చూస్తే... 5.5 అంగుళాల తాకే తెర ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌. ముందువైపు 8 ఎంపీ కెమెరా, వెనుకవైపు రెండు 13 ఎంపీ కెమెరాలుంటాయి. బ్యాటరీ సామర్థ్యం 4060 ఎంఏహెచ్‌. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత స్టోరేజీ ఉన్న ఫోన్‌ ధర సుమారు రూ.11 వేలు. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ర్యామ్‌ ఉన్న ఫోన్‌ ధర సుమారు రూ.15 వేలు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఫోన్‌ ధర సుమారు రూ.17 వేలు ఉంటుంది. ఈ నెల 24న నుంచి ఆయా సంస్థల వెబ్‌సైట్లలో ఈ ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయి.

భారీ బ్యాటరీతో జియోనీ

పెద్ద తెర, భారీ బ్యాటరీ, ఎక్కువ స్టోరేజీ... స్మార్ట్‌ఫోన్‌ ఎంపికలో మీ ప్రాథమ్యాలు ఇవేనా. మీ కోసం జియోనీ ఇలాంటి ఫోన్లు తీసుకొచ్చింది. జియోనీ మారథాన్‌ సిరీస్‌లో ఎమ్‌ 6, ఎమ్‌ 6 ప్లస్‌ ఫోన్లను విడుదల చేసింది. ఎమ్‌ 6 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎమ్‌ఏహెచ్‌ కాగా, ఎమ్‌ 6 ప్లస్‌ బ్యాటరీ సామర్థ్యం 6020 ఎమ్‌ఏహెచ్‌. డ్యూయల్‌ ఛార్జ్‌ చిప్‌ ఆప్షన్‌ ద్వారా ఈ ఫోన్ల బ్యాటరీని వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. పవర్‌ బ్యాంకుతో ఛార్జింగ్‌ పెట్టినప్పుడు ఇతర ఫోన్ల కన్నా ఈ ఫోన్లు త్వరగా ఛార్జ్‌ అవుతాయట.
ఎమ్‌ 6 స్పెసిఫికేషన్స్‌ చూస్తే... 5.5 అంగుళాల తాకే తెర ఉంటుంది. మీడియా టెక్‌ ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌. 4 జీబీ ర్యామ్‌. వెనుకవైపు 13 ఎంపీ కెమెరా, ముందు 8 ఎంపీ కెమెరా. అంతర్గత స్టోరేజీ 64 జీబీ. మెమొరీ కార్డుతో 128 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ధర సుమారు 28 వేలు. ఇదే ఆప్షన్లతో ఉన్న 128 జీబీ వెర్షన్‌ ధర సుమారు రూ.30 వేలు. ఎమ్‌ 6 ప్లస్‌లో ఆరు అంగుళాల తాకే తెర ఉంటుంది. మిగిలిన అంశాలన్నీ ఎమ్‌ 6ను పోలి ఉంటాయి. 64 జీబీ వెర్షన్‌ ధర సుమారు రూ.31 వేలు, 128 జీబీ వెర్షన్‌ ధర సుమారు రూ.33 వేలు.

స్మార్ట్‌గా ‘జెడ్‌టీఈ’

బడ్జెట్‌లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌తో మరో స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే దేశీయ మార్కెట్‌లో ప్రవేశించనుంది. పేరు ZTE Blade A2. ఫోన్‌ మొత్తం లోహపు పోతే! అంతేకాదు... 4G VoLTE సపోర్ట్‌ ఉంది. 360 డిగ్రీల కోణంలో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ పని చేస్తుంది. దీంతో... వేలు సెన్సర్‌పై ఎలా పెట్టినా సెకన్లలో ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. ఇతర స్పెసిఫికేషన్స్‌... 5 అంగుళాల హెచ్‌డీ తాకేతెర. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. octa-core MediaTek MT6750 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌లో మెమొరీ సామర్థ్యాన్ని 128జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. ముందు 5 మెగాపిక్సల్‌. రెండు కెమెరాలకీ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఉంది. బ్యాటరీ సామర్థ్యం 2,500mAh. ఫోన్‌ ధర సుమారు రూ.7,000 ఉండొచ్చని అంచనా.

మరోటి స్మార్ట్‌గా...

బడ్జెట్‌లో లావా కంపెనీ మరో స్మార్ట్‌ మొబైల్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పేరు LAVA A79. ఫోన్‌ తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 800X480 పిక్సల్స్‌. 1.2GHz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8జీబీ. కావాలంటే మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 5 మెగాపిక్సల్‌. ముందు 2 మెగాపిక్సల్‌. ‘స్మార్ట్‌ మ్యూజిక్‌’ ఆప్షన్‌తో పాటలు వినేటప్పుడు ట్రాక్స్‌ని మార్చేందుకు స్లీప్‌ మోడ్‌లో ఉన్న ఫోన్‌ని ఆన్‌ చేయక్కర్లేదు. అన్‌లాక్‌తో పనే లేదు. తెరపై స్వైప్‌ చేస్తే చాలు. బ్యాటరీ సామర్థ్యం 2,200mAh. ధర: రూ.5,699. ఇతర వివరాలకు: http://goo.gl/z6MrrD

బడ్జెట్‌లో ‘మార్ష్‌మాలో’

ఆండ్రాయిడ్‌ సరికొత్త ఓఎస్‌ MARSHMALLOW ఫ్లాట్‌ఫామ్‌తో కూడిన బడ్జెట్‌ స్మార్ట్‌ మొబైల్‌ కావాలా? అయితే, ఇన్ఫోకస్‌ కంపెనీ అందిస్తున్న bingo 10 ఫోన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. అండ్రాయిడ్‌ 6.0 మార్షమాలో ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. డ్యూయల్‌ కెమెరాలతో ఫోన్‌ని తీర్చిదిద్దారు. రెండు కెమెరాల సామర్థ్యం 5 మెగాపిక్సల్స్‌. అంతేకాదు.. డ్యూయల్‌ ఫ్లాష్‌లతో ఫొటోలు, సెల్ఫీలు దిగొచ్చు. ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 4.5 అంగుళాలు. 1.3Ghz quad core Mediatek ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 64జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2000mAh. ధర రూ.4,299.
ఇతర వివరాలకు http://goo.gl/YkHX3v

రెడ్మీ 3 మరో వెర్షన్‌

త్వరలోనే రెడ్మీ 3 ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో సందడి చేయనుంది. ర్యామ్‌ కూడా 3జీబీకి అప్‌గ్రేడ్‌ కానుంది. ఈ సరికొత్త వెర్షన్‌ పేరు Redmi 3 Pro. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ని 32జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇతర కాన్ఫిగరేషన్‌ వివరాలు... తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. octa-core Qualcomm Snapdragon 616 ప్రాసెసర్‌ని వాడారు. మెమొరీ సామర్థ్యాన్ని మైక్రోఎస్‌డీ కార్డుతో 128జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 5 మెగాపిక్సల్‌. వెనక 13 మెగాపిక్సల్‌. బ్యాటరీ సామర్థ్యం ఎంతో తెలుసా? 4100 mAh.

22 భాషల్లో...

దేశీయ మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు ప్రత్యేక మొబైల్‌ని లావా కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. పేరు KKT Ultra+ Union. దేశంలోని 22 ప్రాంతీయ భాషల్ని సపోర్ట్‌ చేసేలా ఫోన్‌ని రూపొందించారు. ఇన్ని ప్రాంతీయ భాషల్ని సపోర్ట్‌ చేసే తొలి ఫోన్‌ కూడా ఇదేనట. అన్ని భాషల్లోనూ మెసేజ్‌లు పంపడంతో పాటు పొందొచ్చు కూడా. ఇక ఫోన్‌ కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... తెర పరిమాణం 2.4 అంగుళాలు. ఇంటర్నల్‌ మెమొరీ 32ఎంబీ. కానీ, మైక్రోఎస్‌డీ కార్డ్‌తో స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 32జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఫోన్‌ వెనక వీజీఏ కెమెరా ఉంది. డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. హెడ్‌సెట్‌ కనెక్ట్‌ చేయకుండానే ఎఫ్‌ఎం రేడియో వినొచ్చు. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 1750mAh.18 గంటల పాటు ఫోన్‌ మాట్లాడొచ్చట. రెండు రకాలుగా (Dual-Charging) ఫోన్‌ని ఛార్జ్‌ చేయవచ్చు. సన్న పిన్‌ ఛార్జర్‌తోనే కాకుండా యూఎస్‌బీ కేబుల్‌తోనూ ఛార్జ్‌ చేసుకునే వీలుందట. ఖరీదు ఎక్కువేమో అనుకునేరు! బడ్జెట్‌లోనే అందిస్తున్నారు. రూ.1,500.

లెనోవో ఫ్యాబ్లెట్‌

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ రక్షణతో కూడిన మరో స్మార్ట్‌ ఫ్యాబ్లెట్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది లెనోవో కంపెనీ. మోడల్‌ పేరు K5 Note. వెనక భాగంలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ని నిక్షిప్తం చేశారు. ఇక ఎప్పుడు ఫ్యాబ్లెట్‌ని అన్‌లాక్‌ చేయాలన్నా మీ వేలి ముద్ర ఉండాల్సిందే. దీని తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. హెచ్‌డీ డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. 1.8 GHz Octa-core MediaTek Helip P10 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. కావాలంటే మెమొరీ సామర్థ్యాన్ని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. (వెనక 13 మెగాపిక్సల్‌. ముందు 8 మెగాపిక్సల్‌) డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. 4జీ, 3జీ, వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఓఎస్‌ వెర్షన్‌ని సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3,500 mAh. ధర సుమారు రూ.11,350. త్వరలోనే దేశీయ మార్కెట్‌లోకి రానుంది.

ఇదే మొదటిది!

డిజిటల్‌ కెమెరాకి పోటీగా స్మార్ట్‌ ఫోన్‌తోనే నాణ్యమైన ఫొటోలు తీసేలా ఆసుస్‌ కంపెనీ సరికొత్త మోడల్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఫోన్‌ పేరు Zenfone Zoom. పేరుకి తగినట్టుగానే 3X జూమింగ్‌తో ఫొటోలు తీయవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాజూకైన ఫోన్‌గా ‘3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌’ స్మార్ట్‌ ఫోన్‌గా అందిస్తున్నారు. 10-element HOYA లెన్స్‌తో ఫొటోల క్వాలిటీ మరింత పెరుగుతుంది. OIS, Dual LED ఫ్లాష్‌తో తక్కువ వెలుతురులోనూ ఫొటోలు ఆకట్టుకుంటాయి. 0.03 సెకన్లలో లేజర్‌ ఆటో ఫోకస్‌తో క్లిక్‌ మనిపించొచ్చు. వాల్యూమ్‌ కీలతో జూమ్‌ఇన్‌, జూమ్‌ అవుట్‌ చేయవచ్చు. ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. Corning Gorilla Glass 4 రక్షణ ఉంది. రిజల్యూషన్‌ 1080X1980 పిక్సల్స్‌. ర్యామ్‌ 4జీబీ. మెమొరీ సామర్థ్యం 128జీబీ. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 5 మెగాపిక్సల్‌. వెనక 13 మెగాపిక్సల్‌ (‘పిక్సల్‌మాస్టర్‌ 2.0’ టెక్నాలజీతో 52 మెగాపిక్సల్స్‌ క్వాలిటీతో కూడిన ఫొటోలు తీయవచ్చు). బ్యాటరీ సామర్థ్యం 3000mAh.

4జీ డైమండ్‌

ఐదు అంగుళాల తాకేతెర... ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే... 4జీ నెట్‌వర్క్‌తో స్మార్ట్‌ ఫోన్‌ కొనాలంటే? కాస్త ఖరీదు ఎక్కువే ఉంటుందని ఆలోచిస్తాం. కానీ, బడ్జెట్‌లోనే కొనాలి అనుకుంటే సెల్‌కాన్‌ అందిస్తున్న Diamond 4G PLUS గురించి తెలుసుకోవాల్సిందే. 4జీ నెట్‌వర్క్‌తో డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... 5 అంగుళాల తాకేతెర.హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 720X1280పిక్సల్స్‌. 4xCortex A53, 64-Bit Quad Core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు (వెనక ఆటో ఫోకస్‌, ఫ్లాష్‌ లైట్‌తో 8 మెగాపిక్సల్‌. ముందు 3.2 మెగాపిక్సల్‌) ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 2,200mAh. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. ధరెంతో తెలుసా? రూ.6,333.

ఇదే మొదటిది!

కొత్త ఏడాదిలో లెనోవో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌తో ముందుకొచ్చింది. పేరు Vibe K4 Note. ‘థియేటర్‌మ్యాక్స్‌’ టెక్నాలజీతో ఫోన్‌లోని విజువల్‌ మీడియాని కళ్లకు కట్టినట్టుగా ‘వర్చువల్‌ రియాలిటీ’లో చూడొచ్చు. ఈ తరహా టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ మొబైల్‌ ఇదేనట. ఎలాంటి మల్టీమీడియా కంటెంట్‌ని అయినా వర్చువల్‌ రియాలిటీలోకి మార్చుకుని ప్రత్యేక VR హెడ్‌సెట్‌తో చూడొచ్చు. ఇక ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 1080X1920 పిక్సల్స్‌. Corning Gorilla Glass 3 రక్షణ ఉంది. 64-bit MediaTek octa-core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 3జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. కావాలంటే మెమొరీ సామర్థ్యాన్ని 128జీబీకి పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. ముందు 5 మెగాపిక్సల్‌. బ్యాటరీ సామర్థ్యం 3,300mAh. ఆన్‌లైన్‌ అంగడి అమెజాన్‌లో త్వరలోనే అమ్మకానికి పెట్టనున్నారు. ఫోన్‌ ధర సుమారు రూ.11,999. ఒకవేళ VR హెడ్‌సెట్‌తో పాటు కొనుగోలు చేయాలనుకుంటే రూ.12,500 చెల్లించాలి.

మరో మోడల్‌

తెర పరిమాణం పెంచుకుని సరికొత్త మోడల్‌తో ముందుకొచ్చింది Redmi Note Prime. తాకేతెర పరిమాణం ఎంతో తెలుసా? 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. ర్యామ్‌ 2జీబీ. 64-bit Qualcomm Snapdragon 410 ప్రాసెసర్‌ని వాడారు. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. లెడ్‌ ఫ్లాష్‌తో అదిరే ఫొటోలు తీయొచ్చు. 1080 పిక్సల్‌ క్వాలిటీతో హెచ్‌డీ వీడియోలు చిత్రీకరించొచ్చు. ముందు 5 మెగాపిక్సల్‌. 4జీ నెట్‌వర్క్‌తో డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌ వెర్షన్‌తో వాడుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.8,499. ఇతర వివరాలకు http://goo.gl/32xX5d లింక్‌ని చూడండి..

'క్లౌడ్‌' సిరీస్‌

ఇంటెక్స్‌ కంపెనీ 4జీ స్మార్ట్‌ ఫోన్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పేరు Cloud Flash. ఫోన్‌ తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. AMOLED డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ ఆకట్టుకుంటాయి. తెరకి Corning Gorilla Glass 3 రక్షణ ఉంది. 1.3GHz octa-core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. కావాలంటే మెమొరీ సామర్థ్యాన్ని ఎస్‌డీ కార్డ్‌తో 128జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 మెగాపిక్సల్‌. ముందు 5 మెగాపిక్సల్‌. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2,300mAh. ధరెంతో తెలుసా? రూ.9,999. ఆన్‌లైన్‌ అంగడి గ్యాడ్జెట్స్‌360 నుంచి కొనుగోలు చేయవచ్చు.

మోడల్‌ అదిరింది

సరికొత్త డిజైన్‌తో Obi Worldphone SF1 స్మార్ట్‌ఫోన్‌ దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. చిత్రంలో కనిపించే ఫోన్‌ అదే. రెండు రకాల కాన్ఫిగరేషన్స్‌తో ఫోన్‌ని అందిస్తున్నారు. 2జీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో కూడిన మోడల్‌ ధర రూ.11,999. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ మోడల్‌తో రూపొందించిన ఫోన్‌ ధర రూ.13,999. మైక్రోఎస్‌డీ కార్డ్‌లతో రెండు మోడళ్ల మెమొరీ సామర్థ్యాన్ని 64 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తెర పరిమాణం 5 అంగుళాలు. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 1080X1920 పిక్సల్స్‌. 1.5GHz octa-core Qualcomm Snapdragon 615 MSM8939 ప్రాసెసర్‌ని వాడారు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. ముందు 5 మెగాపిక్సల్‌. 3జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ల సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3000 mAh. క్విక్‌ ఛార్జ్‌ 1.0 సౌకర్యంతో ఫోన్‌ని వేగంగా ఛార్జ్‌ చేయవచ్చు. Dolby Audio సౌండ్‌ సిస్టంతో స్పీకర్లను నిక్షిప్తం చేశారు. డిసెంబరు 7 నుంచి ఆన్‌లైన్‌లో గ్యాడ్జెట్స్‌360.కామ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. అందుకు సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాల్సిందే. https://goo.gl/n8cj8D

మైక్రోమ్యాక్స్‌ 4జీ

బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అదీ 4జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తోనా? అయితే, కొత్తగా మైక్రోమ్యాక్స్‌ మార్కెట్‌లోకి తెచ్చిన Canvas Pace 4G స్మార్ట్‌ ఫోన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. నెట్‌వర్క్‌లో ఫోన్‌ పనితనం గురించి చెప్పాలంటే అప్‌లోడ్‌ స్పీడ్‌ 50 ఎంబీపీఎస్‌, డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 150 ఎంబీపీఎస్‌. ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 480x854 పిక్సల్స్‌. 1.1 GHz Quad Core Qualcomm Snapdragon ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. ఎస్‌డీ కార్డ్‌తో కావాలంటే 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 5 మెగాపిక్సల్‌. ముందు 2 మెగాపిక్సల్‌. ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2500 mAh. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. ఇంతకీ ధరెంత? అనేగా సందేహం... రూ. 6,821. ఆన్‌లైన్‌ అంగడి ఈబే నుంచి కొనుగోలు చేయవచ్చు.

డ్యూయల్‌ సిమ్‌లతో ట్యాబ్‌

3జీ నెట్‌వర్క్‌తో ఫోన్‌ కాలింగ్‌ సౌలభ్యం ఉన్న ట్యాబ్లెట్‌ని వాడదాం అనుకుంటే Smart SQ718 3G ట్యాబ్‌ ఉంది. దేశీయ కంపెనీ Creative Peripherals దీన్ని తయారు చేశారు. డ్యూయల్‌ సిమ్‌లతో ట్యాబ్‌ని వాడుకోవచ్చు. తాకేతెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 600X1024 పిక్సల్స్‌. quad-core MediaTek MT8382 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. లెడ్‌ ఫ్లాష్‌తో వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరా. ముందు 2 మెగాపిక్సల్‌ కెమెరా. 3జీ, బ్లూటూత్‌, వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ ఓటీజీ కేబుల్‌ని సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3000mAh. ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ 4.4.2 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. ఆన్‌లైన్‌ అంగడి ఈబే.ఇన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ధర రూ.8,999.

2 టీబీతో...

మొబైళ్లలో స్టోరేజ్‌ మెమొరీ జీబీల్లో వాడుతున్నాం. కానీ, టీబీల్లో కూడా వాడొచ్చని ఎప్పుడైనా వూహించారా? హెచ్‌టీసీ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చేసింది. పేరు HTC 728G. దీని స్టోరేజ్‌ మెమొరీ ఎంతో తెలుసా? ఏకంగా 2టీబీ. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. ముందు 5 మెగాపిక్సల్‌. 64-bit MediaTek 1.3GHz octa-core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1.5జీబీ. ఇంటర్నట్‌ మెమొరీ 16 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 2టీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2800mAh. దీని ధరెంతో తెలుసా? రూ.17,990.

చౌకగా... స్మార్ట్‌గా!

4.5 అంగుళాల తాకేతెర... హెచ్‌డీ డిస్‌ప్లే... డ్యూయల్‌ కెమెరాలు... క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌... 4జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌... చూస్తుంటే ఖరీదు కాస్త ఎక్కువే ఉంటుందే అనిపిస్తోంది కదూ! ఏం కాదు! ఇదో చౌక స్మార్ట్‌ ఫోన్‌. పేరు Swipe Elite 2. ధర రూ.4,666. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌కి ప్రత్యేకం. ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... 4.5 అంగుళాల qHD IPS డిస్‌ప్లే. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. రెండు సిమ్‌లూ 4జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేయడం ప్రత్యేకత. 64 bit 1.3 GHz quad-core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. కావాలంటే ఎస్‌డీకార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 5 మెగాపిక్సల్‌. వెనక 8 మెగాపిక్సల్‌. ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ 5.1 ఓఎస్‌ వెర్షన్‌. 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ, జీపీఎస్‌ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 1,900 mAh.
ఇతర వివరాలకు http://justswipe.com/elite2/

ముందు... వెనక... ఒకటే!

మార్కెట్‌లోకి వచ్చేవన్నీ స్మార్ట్‌ ఫోన్‌లే. అన్నిటికీ డ్యూయల్‌ కెమెరాలే. కానీ, రెండు కెమెరాలు ఒకే మెగాపిక్సల్‌ సామర్థ్యంతో ఉండేవి కొన్నే. ఇప్పుడు ఎసర్‌ కంపెనీ తయారు చేసిన 'లిక్విడ్‌' సిరీస్‌ మోడళ్లు చేరాయి. పేర్లు Acer Liquid Z530, Liquid Z630. వీటి డ్యూయల్‌ కెమెరాల సామర్థ్యం 8 మెగాపిక్సల్‌. 'వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌'తో ఎక్కువ మందిని సెల్ఫీలో వచ్చేలా చేయవచ్చు. 1080 పిక్సల్‌ క్వాలీటీతో సెల్ఫీ వీడియోలను చిత్రీకరించొచ్చు. ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... జెడ్‌530 మోడల్‌ తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. 1.3 GHz quad core MediaTek ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. ఎస్‌డీ కార్డ్‌తో 32జీబీ వరకూ పెంచుకోవచ్చు. 4జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఓఎస్‌ వెర్షన్‌తో వాడుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2420mAh. రెండో మోడల్‌ జెడ్‌630 తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. ర్యామ్‌ 3జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32జీబీ. 64-bit octa core MediaTeck MT6735 ప్రాసెసర్‌ని వాడారు. బ్యాటరీ సామర్థ్యం 4000mAh. వీటి ఖరీదు వరుసుగా జెడ్‌530 రూ.6,999. జెడ్‌630 రూ.10,999. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌.కామ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

సోనీ 'ప్రీమియం'

ఇప్పటి వరకూ 4కే వీడియోలను స్మార్ట్‌ టీవీల్లోనే చూసుంటారు. ఇక మీదట స్మార్ట్‌ ఫోన్‌లోనూ చూడొచ్చు. ఎందుకంటే సోనీ కంపెనీ సరికొత్త మొబైల్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలిసారి ముస్తాబయిన 4కే ఫోన్‌ ఇదే. పేరు Xperia Z5 Premium. 4కే ఆల్ట్రా హెచ్‌డీ డిస్లేపేతో గ్రాఫిక్స్‌ కట్టిపడేస్తాయి. కేవలం చూడడమే కాదు. 23 మెగాపిక్సల్‌ కెమెరాతో 4కే వీడియోలను చిత్రీకరించొచ్చు. వీడియోల నుంచి 8 మెగాపిక్సల్‌ క్వాలిటీతో స్క్రీన్‌షాట్స్‌ తీసుకోవచ్చు. ఇక 'ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌'తో ఫోన్‌ని సురక్షితంగా వాడుకోవచ్చు. ఫోన్‌ని ఆన్‌లాక్‌ చేయాలంటే మీ వేలిముద్ర ఉండాల్సిందే. తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 3840X2160 పిక్సల్‌. Qualcomm Snapdragon 810 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 3జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 200 జీబీ వరకూ పెంచుకోవచ్చు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు ఫోన్‌ని వాడుకోవచ్చట. వాటర్‌ప్రూఫ్‌ రక్షణ ఉంది. ధర రూ.52,990. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/vxNbc5

ఇదేమో 'పీ1'

లెనోవో మరో సరికొత్త ఫ్యాబ్లెట్‌తో సందడి చేస్తోంది. పేరు Lenovo Vibe P1. దీని ప్రత్యేకతేంటో తెలుసా? బ్యాటరీ సామర్థ్యం. ఏకంగా 5,000mAh. వేగంగా ఛార్జ్‌ చేయవచ్చు కూడా. కేవలం 5 నిమిషాలు ఛార్జ్‌ చేసి కొన్ని గంటల పాటు మాట్లాడొచ్చట. అంతేనా... 'ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌'తో ఫోన్‌ని సురక్షితంగా వాడొచ్చు. ఇతరులు ఎవరైనా ఫోన్‌ని వాడాలంటే వేలిముద్రలతో రిజిస్టర్‌ అవ్వాల్సిందే. డ్యూయల్‌ సిమ్‌లతో ఫ్యాబ్లెట్‌ని వాడుకోవచ్చు. తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. Gorilla Glass 3 రక్షణ ఉంది. రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. octa core Snapdragon 615 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32 జీబీ. కావాలంటే మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 128జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌. ముందు 5 మెగాపిక్సల్‌. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. 4జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తుంది. ధర రూ.15,999. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/Q4WSXL

ఫ్యాబ్లెట్‌ 'లేజర్‌'

అసుస్‌ బడ్జెట్‌లో అందుబాటులోకి ఫ్యాబ్లెట్‌ వెర్షన్‌ జెన్‌ఫోన్‌ మరో సరికొత్త అప్‌గ్రేడ్‌ వెర్షన్‌తో ముందుకొచ్చింది. పేరు Zenfone 2 Laser 5.5. ఫ్యాబ్లెట్‌ ర్యామ్‌ ఎంతో తెలుసా? 3జీబీ. octa core Snapdragon 615 ప్రాసెసర్‌ని వాడారు. తాకేతెర పరిమాణ 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. తెరకి Corning Gorilla Glass 4 రక్షణ ఉంది. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు. వెనక 13 మెగాపిక్సల్‌. ముందు 5 మెగాపిక్సల్‌. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 3,000 mAh. ధర రూ.13,999. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. వీడియో, ఇతర వివరాలకు https://goo.gl/Ki9v41

'టైప్‌ సీ'తో...

డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి మాత్రమే కాదు. ఛార్జింగ్‌కీ ఎక్కువ శాతం యూఎస్‌బీ కేబుల్‌నే వాడేస్తున్నాం. కానీ, మొబైల్‌ పోర్ట్‌ని చూడకుండా యూఎస్‌బీ కేబుల్‌ని ఫోన్‌కి కనెక్ట్‌ చేశారా? కొంచెం క్లిష్టమైన పనే. ఎందుకంటే పోర్ట్‌ని అనుకూల రీతిలో కనెక్ట్‌ చేస్తేనే అనుసంధానం అవుతుంది. కానీ, ఇక మీదట అంత కష్టం అక్కర్లేదు. USB Type-C పోర్ట్‌తోఫోన్‌కి కేబుల్‌ని ఎలాగైనా కనెక్ట్‌ చేయవచ్చు. ఈ తరహాలో ఇప్పటికే యాపిల్‌ కంపెనీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా Xiaomi Mi 4c మోడల్‌ మార్కెట్‌లో ప్రవేశించింది. ఫోన్‌ కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. హెచ్‌డీ క్వాలిటీ. రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. 64-bit Snapdragon 808 చిప్‌సెట్‌ని వాడారు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వైడ్‌ యాంగిల్‌తో కూడిన 5 మెగాపిక్సల్‌ కెమెరా. వెనక 13 మెగాపిక్సల్‌. బ్యాటరీ సామర్థ్యం 3080 mAh. 4జీ నెట్‌వర్క్‌తో డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ.

బడ్జెట్‌లోనే...

కాస్త తక్కువ ధరలో స్మార్ట్‌ మొబైల్‌ని వాడదాం అనుకుంటే ఐబాల్‌ కంపెనీ మరో సరికొత్త మోడల్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పేరు iBall Andi 5U Platino. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడొచ్చు. 5 అంగుళాల తాకేతెరతో రూపొందించారు. రిజల్యూషన్‌ 960X540 పిక్సల్స్‌. 1.2Ghz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. కావాలంటే మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమెరా. వెనక ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2,000mAh. వై-ఫై, 3జీ, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీతో వాడుకోవచ్చు. ధర సుమారు రూ.4,599. ఇతర వివరాలకు http://goo.gl/oZj0Gi లింక్‌లోకి వెళ్లండి.

ఫొటోలకు ప్రత్యేకం

లావా కంపెనీ మరో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌తో మార్కెట్‌లో సందడి చేస్తోంది. పేరు Lava Pixel V2. దీంట్లో ప్రధానమైన ఆకర్షణ కెమెరా క్వాలిటీ. ప్రైమరీ కెమెరాని (వెనక) 13 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో అందిస్తున్నారు. డ్యూయల్‌ లెడ్‌ ఫ్లాష్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. 1.4 Micron Large Pixel పరిమాణంతో ఫొటో క్వాలిటీ ఆకట్టుకుంటుంది. కెమెరా లెన్స్‌కి 'బ్లూ గ్లాస్‌ ఫిల్టర్‌' ఉంది. ఇక సెకండరీ కెమెరా (ముందు) సామర్థ్యం 8 మెగాపిక్సల్‌. 84 degree wide angle లెన్స్‌తో సెల్ఫీలు తీసుకోవచ్చు. బిల్ట్‌ఇన్‌గా అందించే ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లతో ఫొటోలను ఆకట్టుకునేలా మార్చుకోవచ్చు. అందుకు Beauty-fi, Pro Focus, Pano Selfie, Night Pro, Night Pro V లాంటి మరిన్ని బిల్ట్‌ఇన్‌ సౌకర్యాలు ఉన్నాయి. ఇతర ఫోన్‌ కాన్ఫిగరేషన్‌ వివరాలిలా... 64బిట్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. తాకే తెర పరిమాణం 5 అంగుళాలు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 5.1 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2,500 mAh. ధర సుమారు రూ.10,750. https://goo.gl/ZTtgX8

256 జీబీ

ఏంటిదీ... సిస్టం హార్డ్‌డిస్క్‌ స్టోరేజ్‌ సామర్థ్యమేమో అనుకుంటున్నారా? ఏం కాదు. అసుస్‌ కంపెనీ అందుబాటులోకి తేనున్న స్మార్ట్‌ ఫోన్‌ ఇంటర్నల్‌ మెమొరీ. ఫోన్‌ పేరేంటో తెలుసా? Asus Zenfone 2 Deluxe Special Edition. చిత్రంలో కనిపిస్తున్న ఫోన్‌ అదే. దీని తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080X1920 పిక్సల్స్‌. గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌. 2.5GHz 64-Bit Intel Atom Z3580 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 4 జీబీ. డ్యూయల్‌ కెమెరాలు (ముందు 5 మెగాపిక్సల్‌, వెనక 13 మోగాపిక్సల్‌) ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ 5.0 ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 3000mAh. బ్రెజిల్‌ మార్కెట్‌లో సందడి చేస్తున్న ఫోన్‌ని త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ ఫోన్ల ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ ఉంటేనే ఎక్కువ. 128 జీబీ ఉంటే అబ్బో చాలా ఎక్కువని ఆశ్చర్యపోవాల్సిందే. ఏకంగా 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ విడ్డూరమే!! ఇక ఎక్స్‌టర్నల్‌ మెమొరీ కార్డ్‌ల కోసం వెతకక్కర్లేదు అనుకుంటా!

అదిరే డిజైన్‌

ఆకట్టుకునే బ్యాక్‌ కవర్‌తో Oppo కంపెనీ సరికొత్త మోడల్‌ని మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. పేరు Mirror 5. పేరుకి తగ్గట్టుగానే ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ డిజైన్‌ని వజ్రాకారపు అద్దం తళుకులతో రూపొందించారు. చిత్రంలో మాదిరిగా బ్యాక్‌ కవర్‌ కనిపిస్తుంది. కేవలం పై మెరుగులే కాదు. ఫోన్‌ కాన్ఫిగరేషన్‌ కూడా అదుర్సే! తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 960X540 పిక్సల్స్‌. 1.2 GHz Qualcomm Snapdragon Quad-Core 64 bit ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 16జీబీ. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు (ముందు 5 మెగాపిక్సల్‌, వెనక 8 మెగాపిక్సల్‌) ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. ColorOS 2.1 ఓఎస్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఓఎస్‌ని బ్యాక్‌ఎండ్‌గా చేసుకుని కొత్త ఓఎస్‌ని రూపొందించారు. బ్యాటరీ సామర్థ్యం 2420mAh. ఇతర వివరాలకు http://goo.gl/ebQ0hY

బడ్జెట్‌లో 'లవ్‌'

తాకేతెర ఫోన్‌... 3జీ సపోర్ట్‌... ప్రాంతీయ భాషలు... వీటితో ఏదైనా బడ్జెట్‌ ఫోన్‌ కావాలనుకుంటే పెనాసోనిక్‌ అందిస్తున్న Love T10 గురించి తెలుసుకోవాల్సిందే. 3.5 అంగుళాల తాకేతెరతో రూపొందించారు. రిజల్యూషన్‌ 480X800 పిక్సల్స్‌. 1GHz డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. డ్యూయల్‌ కెమెరాలు (ముందు వీడియో ఛాటింగ్‌కి జుబితి కెమెరా, వెనక 2 మెగాపిక్సల్‌) ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. 21 ప్రాంతీయ భాషల్ని ఫోన్‌ సపోర్ట్‌ చేయడం దీంట్లోని ప్రత్యేకత. వాటిల్లో తెలుగు కూడా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 1400mAh. ధరెంతో తెలుసా? సుమారు రూ.3,690.

సెల్‌కాన్‌ Millennia Xplore

సెల్‌కాన్‌ కంపెనీ Millennia Xplore స్మార్ట్‌ మొబైల్‌తో ముందుకొచ్చింది. ఐదు మునివేళ్లను తాకేతెరపై కదిలిస్తూ 5 Point Touch సౌకర్యంతో గేమింగ్‌ ప్రియుల్ని అలరించేలా ఫోన్‌ని తయారు చేశారు. అంతేకాదు... మీకు సెల్ఫీలపై మోజు ఎక్కువ ఉంటే 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాతో అదిరే స్టిల్స్‌ని క్లిక్‌ మనిపించొచ్చు. తెరపై వేలితో గీస్తూ 'స్మార్ట్‌ కమాండ్స్‌'ని అందించొచ్చు కూడా. రెండు సార్లు తెరపై (Double Tap) తాకితే ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది. ఫోన్‌ కెమెరాని పొందేందుకు తెరపై C అక్షరాన్ని రాస్తే చాలు. బ్రౌజర్‌ కోసం e, మ్యూజిక్‌ కావాలంటే m, ప్లే స్టోర్‌ ఓపెన్‌కి O, ఫైల్‌ మేనేజర్‌కి W అక్షరాల్ని తెరపై రాస్తే చాలు. 'స్మార్ట్‌ కమాండ్స్‌'ని కావాల్సినట్టుగా మార్పులు కూడా చేసుకునే వీలుంది. ఇక ఫోన్‌ వెనక కెమెరా సామర్థ్యం ఎంతో తెలుసా? 13 మోగాపిక్సల్‌. ఆటో ఫోకస్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. 'మోషన్‌ ట్రాక్‌ మోడ్‌'లో ఒకే క్లిక్‌తో 40 షాట్స్‌ని చిత్రీకరించొచ్చు. 1080 పిక్సల్‌ హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను తీయొచ్చు. ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... ఐదు అంగుళాల తాకేతెర. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. Quad core 1.3Ghz ప్రాసెసర్‌. ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ ఓఎస్‌. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. కావాలంటే 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. ఫోన్‌తో పాటు స్మార్ట్‌ కవర్‌ని ఉచితంగా అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం 2000mAh. ధర రూ.6,999.

Andi సిరీస్‌లో మరో రెండు

ఐబాల్‌ కంపెనీ అందిస్తున్న Andi సిరీస్‌లో మరో రెండు సరికొత్త మోడళ్లు సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. మొదటిది iBall Andi Avonte 5. దీంట్లోని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకే కెమెరాని డ్యూయల్‌ కెమెరాల్లా వాడుకోగలగడం. అదెలా సాధ్యమంటే... ఫోన్‌కి రొటేటింగ్‌ కెమెరా ఉంది. 8 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో కెమెరా పని చేస్తుంది. ఆటోఫోకస్‌, డ్యూయల్‌ లెడ్‌ ఫ్లాష్‌లతో ఫొటోలు తీసుకోవచ్చు. తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 480X854 పిక్సల్స్‌. 1.3GHz quad-core ప్రాసెసర్‌. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2150 mAh. ధరెంతో తెలుసా? సుమారు రూ.6000. రెండోది Andi4 B20. 3జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో ఫోన్‌ని వాడుకోవచ్చు. తాకేతెర పరిమాణం 4 అంగుళాలు. రిజల్యూషన్‌ 800X480 పిక్సల్స్‌. 1 GHz Cortex A7 Advanced ప్రాసెసర్‌ని వాడారు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక లెడ్‌ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సల్‌, ముందు వీడియో ఛాటింగ్‌కి 0.3 మెగాపిక్సల్‌. ర్యామ్‌ 256 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 512 ఎంబీ. ఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. బ్యాటరీ సామర్థ్యం 1250 mAh. ఆటోకాల్‌ రికార్డింగ్‌ సదుపాయం ఉంది. ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ ఓఎస్‌తో రన్‌ అవుతుంది. ఇతర వివరాలకు http://goo.gl/le9Ce0 లింక్‌లోకి వెళ్లండి.

కూల్‌గా...

బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటే 'కూల్‌'గా మరోటి అందుబాటులోకి వచ్చింది. అదే Coolpad Dazen 1. దీని తాకే తెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. హెచ్‌డీ డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ ఆకట్టుకుంటాయి. ర్యామ్‌ ఎంతో తెలుసా? 2 జీబీ. Snapdragon 410 64 Bit ప్రాసెసర్‌ని వాడారు. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు క్వాలిటీ సెల్ఫీలు తీసుకునేందుకు 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. వెనక 8 మెగాపిక్సల్‌. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌ వెర్షన్‌తో వాడుకోవచ్చు. డ్యూయల్‌ సిమ్‌లను సపోర్ట్‌ చేస్తుంది. 4జీ నెట్‌వర్క్‌తో నెట్టింట్లో విహరించొచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2500 mAh. ఇంతకీ ధరెంతో చెప్పలేదు కదూ! రూ.6,999. ఆన్‌లైన్‌ అంగడిలో విడుదలై Xiaomi Redmi 2 మోడల్‌తో పోటీ పడుతోంది. ఇతర వివరాలకు http://goo.gl/KKVJPV లింక్‌ని చూడండి.

2జీబీ ర్యామ్‌

లెనోవో ప్రవేశపెట్టిన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తెగ సందడి చేస్తోంది. అదే Lenovo A6000 Plus. దీంట్లోని ప్రత్యేకత ఏంటో తెలుసా? 2జీబీ ర్యామ్‌. 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ. 7.9 ఎంఎం మందంతో నాజూకుగా రూపొందించారు. ఇక ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. హెచ్‌డీ తెర రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. 1.2Ghz quad core Snapgragon 410 ప్రాసెసర్‌ని వాడారు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 2 మెగాపిక్సల్‌. వెనక ఆటోఫోకస్‌తో కూడిన 8 మెగాపిక్సల్‌ కెమెరా. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. డ్యూయల్‌ సిమ్‌ల సపోర్ట్‌తో ఫోన్‌ని వాడుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2,300mAh. బిల్ట్‌ఇన్‌గా రెండు స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. Dolby Digital Audio సిస్టంతో మ్యూజిక్‌ మస్తీనే. 4జీ, వై-ఫై, బ్లూటూత్‌ 4.0 నెట్‌వర్క్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. ఫోన్‌ బరువు 128 గ్రాములు. ఇంతకీ ధరెంతో చెప్పలేదు అనేగా? రూ.7,500. ఆన్‌లైన్‌ అంగడి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

రిమోట్‌లానూ...

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌తో టీవీ ఛానళ్లు మార్చేస్తే... ఏసీ రిమోట్‌లా వాడేస్తే... హోం థియేటర్‌ వాల్యూమ్‌ తగ్గిస్తే... డీవీడీ ప్లేయర్స్‌తో జతకట్టి పని చేసేలా చేస్తే. విడ్డూరమే కదా! కానీ, ఇంటెక్స్‌ కంపెనీ తయారు చేసిన Aqua Y2 Remote మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌తో సాధ్యమే. ఈ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన తొలి బడ్జెట్‌ మొబైల్‌ ఇదేనట. ధర సుమారు రూ.4,390. దీంట్లో బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేసిన ప్రత్యేక ఆప్‌ ద్వారా ఫోన్‌ని రిమోట్‌లా మార్చేయవచ్చట. అందుకు ఆప్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో జాబితాని ఏర్పాటు చేశారు. జాబితా నుంచి పరికరాన్ని సెలెక్ట్‌ చేసుకుని ఫోన్‌ని రిమోట్‌లా జత చేయాలన్నమాట. ఇక మొబైల్‌ కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... 4 అంగుళాల తాకేతెర. రిజల్యూషన్‌ 480X800 పిక్సల్స్‌. 1.2GHz డ్యూయల్‌కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. డ్యూయల్‌ కెమే రాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌కి 2 మెగాపిక్సల్‌ కెమేరా. వెనక 5 మెగాపిక్సల్‌ కెమేరాని ఏర్పాటు చేశారు. బ్యాటరీ సామర్థ్యం 1500mAh. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది.

బడ్జెట్‌లోనే స్మార్ట్‌ మొబైల్‌...

స్మార్ట్‌ మొబైల్‌ని కాస్త తక్కువ బడ్జెట్‌తో కొనాలనుకుంటున్నారా? అయితే, లావా కంపెనీ తయారు చేసిన Iris X1 Grand గురించి తెలుసుకోవాల్సిందే. 5 అంగుళాల తాకేతెరతో దీన్ని అందిస్తున్నారు. IPS డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 854X480 పిక్సల్స్‌. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. 1.3Ghz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 4.4 వెర్షన్‌తో పని చేస్తుంది. కావాలంటే ఆండ్రాయిడ్‌ 5.0 వెర్షన్‌కి అప్‌డేట్‌ అయ్యే వీలుంది. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌ 2 మెగాపిక్సల్‌. వెనక 8 మెగాపిక్సల్‌. 1080 పిక్సల్స్‌ హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలు చిత్రీకరించొచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2,200mAh. 3జీ, వై-ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. దీంట్లో మరో ఆకట్టుకునే విషయం intelligent flip cover. కవర్‌ ఓపెన్‌ చేయకుండానే బ్యాటరీ అలర్ట్‌లు, ఫోన్‌ కాల్స్‌, ప్లే అయ్యే మ్యూజిక్‌ ట్రాక్‌లను చూడొచ్చు. నిత్యం తేదీ, సమయం చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆడియో నాణ్యత అదిరేలా ఫోన్‌లో బిల్ట్‌ఇన్‌గా రెండు స్పీకర్‌లను ఏర్పాటు చేశారు. ఫోన్‌ బరువు 138 గ్రాములు. ధరెంతో తెలుసా? సుమారు రూ.7,500. ఇతర వివరాలకు http://goo.gl/zbcomS

మళ్లీ 'ఫ్లిప్‌'

ఒకప్పటి ఫ్లిప్‌ ఫోన్లు మళ్లీ మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. కావాలంటే ఎల్‌జీ అందుబాటులోకి తేనున్న Ice Cream Smart ఫోన్‌ని చూడండి. దీని తాకేతెర పరిమాణం 3.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 320X480 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం 8 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీజీఏ కెమెరా. వెనక 8 మెగాపిక్సల్‌. బ్యాటరీ సామర్థ్యం 1700mAh. ఫోన్‌ ధర సుమారు రూ.17,000 ఉండొచ్చని అంచనా. త్వరలోనే దేశీయ మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.

చోటా భీమ్‌ ట్యాబ్‌

మీరూ ఇంట్లోని బుజ్జి పిల్లలకో ట్యాబ్‌ కొనాలనుకుంటున్నారా? అయితే, మీరు Mosti అందుబాటులోకి తెచ్చిన Chhota Bheem Tab గురించి తెలుసుకోవాల్సిందే. ఇదో ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌. పిల్లలకు అనువుగా ట్యాబ్‌ హార్డ్‌వేర్‌ రూపకల్పన చేశారు. అనుకోకుండా కింద పడినా పగలకుండా రబ్బర్‌తో కూడిన ప్లాస్టిక్‌ని వాడారు. ట్యాబ్‌లోని నావిగేషన్‌ బటన్స్‌ని కూడా పెద్దగా అమర్చారు. పిల్లలు వీడియో, రైమ్స్‌ లేదా మారేదైనా చూస్తున్నప్పుడు ట్యాబ్‌లోని ఏవైనా బటన్స్‌ నొక్కినా ఏం కాకుండా Child lock బటన్‌ని ఏర్పాటు చేశారు.పిల్లల అభిరుచి మేరకు ఆప్స్‌, వీడియో ఛానల్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌ని జాబితాగా సెట్‌ చేసేందుకు వీలుంటుంది. ప్రీలోడెడ్‌ 'స్టోరీటెల్లర్‌' ఆప్స్‌తో చక్కని కథల్ని చదివి వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గేమ్స్‌, పజిళ్లు... ఇంకా చాలానే ఉన్నాయి. అంతేనా... దీంట్లో మరో సూపర్‌ హీరో ప్రత్యేకత కూడా ఉంది. అతనే చోటా భీమ్‌. Bheem series విభాగంలోకి వెళ్తే చోటా భీమ్‌తో కలిసి పాఠాలు నేర్చుకోవచ్చు. తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 800X480 పిక్సల్స్‌. ఓఎస్‌ వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ 4.0.4 ఐస్‌క్రీం శాండ్‌విచ్‌. ప్రాసెసర్‌ 1GHz Cortex A8. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. దీని ధర చెప్పలేదు కదూ! రూ.6,375. www.chhotabheemtab.com

బడ్జెట్‌లోనే ఆండ్రాయిడ్‌ ఫ్యాబ్లెట్‌..

స్మార్ట్‌ మొబైల్‌ అయ్యిండాలి. తెర కాస్త పెద్దగా ఉండాలి. బడ్జెట్‌లోనే ఫోన్‌ని కొనాలి... అనే ఆలోచనతో ఉన్నారా? అయితే, సెల్‌కాన్‌ కంపెనీ తయారు చేసిన XION S CT695 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఫ్యాబ్లెట్‌ పేరుతో పరిచయం చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. తెర పరిమాణం ఎంతో తెలుసా? 6.95 అంగుళాలు. రిజల్యూషన్‌ 600X1024 పిక్సల్స్‌. డ్యూయల్‌ సిమ్‌లతో వాడుకోవచ్చు. 1.2GHz Dual core Cortex-A7 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు (వెనక 5 మెగాపిక్సల్‌, ముందు 0.3 మెగాపిక్సల్‌ కెమెరా) ఉన్నాయి. 3జీ, వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2,500mAh. నలుపు రంగులో ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇంతకీ ధరెంతో? అనేగా సందేహం. రూ.7,299.

పెద్దల ఫోన్లు

పెద్ద అక్షరాలతో పెద్దలు అనువుగా వాడుకునేలా ఇప్పటికే మార్కెట్‌లో కొన్ని ఫోన్లు సందడి చేశాయి. ఇప్పుడు వాటి జాబితాలోకి ఫిలిప్స్‌ కంపెనీ తయారు చేసిన ఫోన్‌ చేరింది. పేరు Xenium X2566. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్‌. దీంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆప్షన్‌తో ఫోన్‌ని 'డిజిటల్‌ టెక్స్ట్‌ మాగ్నిఫైయర్‌'గా వాడుకోవచ్చు. అంతే పత్రిక చదివేటప్పుడు అక్షరాలు సరిగా కనిపించకుంటే ఫోన్‌లోని ఆప్షన్‌తో జూమ్‌ చేసుకుని చదవొచ్చు. 2.4 అంగుళాల తెరతో ఫోన్‌ని రూపొందించారు. తెరపై ఫాంట్‌లు పెద్దగా కనిపిస్తాయి. ఇక ఫోన్‌పైన కనిపించే నెంబర్‌ ప్యాడ్‌ చిత్రంలో మాదిరిగా పెద్ద పెద్ద అంకెలతో కనిపిస్తుంది. 16 జీబీ మెమొరీ కార్డ్‌ని సపోర్ట్‌ చేస్తుంది. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్‌ని వాడుకోవచ్చు. వీజీఏ కెమెరా ఉంది. కెమెరా రిజల్యూషన్‌ 640X480పిక్సల్స్‌. ఇక SOSఆప్షన్‌తో క్లిష్టమైన సందర్భాల్లో ఎమర్జెన్సీ కాల్‌ చేయవచ్చు. ధరెంతో తెలుసా? రూ.3,800. ఇతర వివరాలకు http://goo.gl/W5ZnA6
* పెద్దలకు మరో స్మార్ట్‌ మొబైల్‌ మితాషీ కంపెనీ తయారు చేసిన Play Senior Friend. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. తాకేతెర పరిమాణం 4 అంగుళాలు. 1.2GHz œూ్యయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. పెద్ద ఫాంట్‌లు, ఎస్‌ఓఎస్‌ బటన్ల సౌకర్యాలు ఉన్నాయి.

మరో రెండు స్మార్ట్‌ మొబైల్స్‌

సెల్‌కాన్‌ కంపెనీ మరో రెండు సరికొత్త స్మార్ట్‌ మొబైళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. పేర్లు వరుసగా Millennium Power Q3000, Millennium Elite Q470. వీటిలో మొదటి మోడల్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా? బ్యాటరీ బ్యాక్‌అప్‌. సామర్థ్యం 3000mAh. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల పాటు ఫోన్‌ మాట్లాడడమే కాదు, నిరంతరాయంగా అప్లికేషన్స్‌ని కూడా వాడుకోవచ్చు. రెండు మోడళ్లు కిట్‌క్యాట్‌ ఓఎస్‌తోనే పని చేస్తాయి. ఇక మొదటి మోడల్‌ కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... తాకే తెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 854X480 పిక్సల్స్‌. 1.3Ghz Quad Core ప్రాసెసర్‌ని వాడారు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక ఆటో ఫోకస్‌తో 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ముందు వీడియో ఛాటింగ్‌కి 1.3 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. మెమొరా సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ సిమ్‌లతో ఫోన్ని వాడుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.8,999. ఇక రెండో మోడల్‌ ఎలైట్‌ క్యూ470 విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 4.7 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ ఎంతో తెలుసా? ఏకంగా 16 జీబీ. కావాలంటే మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌కి 2 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వెనక ఆటోఫోకస్‌, ఫ్లాష్‌లైట్‌తో 8 మెగాపిక్సల్‌ ప్రైమరీ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 1800mAh. దీని ధర రూ.11,999. రెండు ఫోన్లకూ ఉచితంగా ఫ్లిక్‌ కవర్లను అందిస్తున్నారు.

 

 

 

 

'సెల్ఫీ'లు తీస్తారా?

మొబైల్‌ ఫోన్‌ ఫొటోగ్రఫీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం 'సెల్ఫీ'. ఎవరి మొబైల్‌తో వారే ఫొటో తీసుకోవడం అన్నమాట. మరి, ఈ సెల్ఫీ షాట్‌ తీసుకోవడానికి అనువైనదే మొబైల్‌కి ముందు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా. దాని సామర్థ్యాన్ని మరింత పెంచుతూ ముందుకొచ్చింది సోనీ కంపెనీ. మోడల్‌ పేరు Xperia C3. ముందు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా సామర్థ్యం 5 మెగాపిక్సల్‌. ఆటోఫోకస్‌ ద్వారా సెల్ఫీ ఫొటోలు తీసుకోవచ్చు. LEDఫ్లాష్‌ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే సెల్ఫీ తీసుకునే ముందే ఫ్రేమ్‌ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. వెనక భాగంలో 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఇక కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X1280 పిక్సల్స్‌. హెచ్‌డీ డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. Quad Core Snapdragon 400 Chipset వాడారు. ర్యామ్‌ 1 జీబీ. 7.6 ఎంఎం మందంతో నాజూకుగా కనిపిస్తుంది. బరువు 150 గ్రాములు. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ ఓఎస్‌తో పని చేస్తుంది.

శామ్‌సంగ్‌ గెలాక్సీ కే జూమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అత్యాధునిక డిజిటల్‌ కెమేరా అమర్చిన 3జీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ కే జూమ్‌ను శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆవిష్కరించింది. ఈ కెమెరాతో తక్కువ కాంతిలోనే హైడెఫినిషన్‌ చిత్రాలు రికార్డు చేయవచ్చని సంస్థ ప్రకటించింది. వెనుక వైపు 10ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ చేయగల 20.7 మెగాపిక్సెల్‌ కెమెరా, ముందువైపు 2 మెగాపిక్సెల్‌ కెమెరా కలిగిన ఈ 4.8 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. హెగ్జాకోర్‌ (1.3 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌, 1.7 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌కోర్‌) ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, 8జీబీ అంతర్గత మెమొరీ కలిగి 64 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.29,999.

'స్పైసీ' వాచ్‌ కావాలా?

స్మార్ట్‌ మొబైల్స్‌ వెంటే ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌ల హవా కూడా పెరుగుతోంది. కావాలంటే స్పైస్‌ కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ వాచ్‌ని చూడండి. పేరు Smart Pulse M 9010. మన దేశంలో తొలిసారి పరిచయమైన 'సిమ్‌ ఎనేబుల్డ్‌' స్మార్ట్‌ వాచ్‌ ఇదేనట. సాధారణ మొబైల్‌ మాదిరిగానే డ్యూయల్‌ సిమ్‌లతో వాచ్‌ని వాడుకోవచ్చు. దీని తాకేతెర పరిమాణం 1.4 అంగుళాలు. రిజల్యూషన్‌ 240X320 పిక్సల్స్‌. వాచ్‌లో 1.3 మెగాపిక్సల్‌ కెమెరా కూడా ఉంది. 8 జీబీ ఎక్స్‌టర్నల్‌ మెమొరీ సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో, వీడియో ప్లేయర్‌తో పాటు ఎఫ్‌ఎం రేడియోని కూడా వాచ్‌లో వినొచ్చు. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా మొబైల్స్‌కి అనుసంధానం చేయవచ్చు. ఒక్కసారి మొబైల్‌కి కనెక్ట్‌ అయ్యాక వాచ్‌లోనే ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్స్‌, మెసేజ్‌లు, కాల్స్‌ని చూడొచ్చు. బ్యాటరీ సామర్థ్యం 420mAh. ఇంతకీ దీని ధరెంతో తెలుసా? రూ.3,999.

మైక్రోమ్యాక్స్‌ విండోస్‌ ఫోన్లు

ఈనాడు, హైదరాబాద్‌: విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రెండు డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్లను మైక్రోమ్యాక్స్‌ ఆవిష్కరించింది. కేన్వాస్‌ విన్‌ శ్రేణిలో రూపొందించిన ఈ ఫోన్లలో ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 11ను నిక్షిప్తం చేశారు.
కేన్వాస్‌ విన్‌ డబ్ల్యు121: అయిదు అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ తాకేతెర, 1.2 గిగాహెర్ట్జ్‌ క్వాల్‌కామ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, వెనుక-ముందు 8-2 మెగాపిక్సెల్‌ కెమేరాలు, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8జీబీ అంతర్గత మెమొరీతో పాటు ఎస్‌డీ కార్డుతో 32 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.9,500.
కేన్వాస్‌ విన్‌ డబ్ల్యు92: నాలుగు అంగుళాల ఐపీఎస్‌ తాకే తెర, 1.2 గిగాహెర్ట్జ్‌ క్వాల్‌కామ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, వెనుక-ముందు 5-0.3 మెగాపిక్సెల్‌ కెమేరాలు, 1,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.6,500.

జోలో కొత్త స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: 'జోలో క్యూ1200' పేరిట ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 ధరతో జోలో కంపెనీ విపణిలోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు జెశ్చర్‌ ఫీచర్లు, స్మార్ట్‌ వాయిస్‌ కంట్రోళ్లు వంటివి జత చేశారు. ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌పై పనిచేసే ఈ ఫోన్‌ ఆధునిక కిట్‌కాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు మారడానికీ అనువుగా తీర్చిదిద్దారు. 8ఎంపీ కెమేరా, ముందు 2 ఎంపీ కెమేరా. 1.3 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం (దీనిని 32 జీబీ వరకు కూడా పెంచుకోవచ్చు), 5 అంగుళాల హైడెఫినిషన్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ ఇతర ప్రత్యేకతలు.

రూ.1,099కే ఇంటర్నెట్‌ ఫోన్‌

* బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరణ
బెంగళూరు, న్యూస్‌టుడే: కేవలం రూ.1,099 ధరకే అంతర్జాలం (ఇంటర్నెట్‌) సదుపాయం కలిగి ఉండే ఫోన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చింది. పెంటెల్‌ టెక్నాలజీస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన పెంటా భారత్‌ ఫోన్‌ విశేషాలు
* 3 అంగుశాల తెర
* డ్యూయల్‌ సిమ్‌ సౌలభ్యం
* సంగీతం, వీడియోలు, జావా గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం
* 1.3 మెగా పిక్సెల్‌ కెమేరా
* 64 ఎంబీ ర్యామ్‌, 64 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* మొబైల్‌ ట్రాకర్‌, ఆటో వాయిస్‌ కాల్‌ రికార్డింగ్‌, స్టీరియో ఎఫ్‌ఎం

కిట్‌క్యాట్‌తో... XOLO Q600s

ఆండ్రాయిడ్‌ అందించే సరికొత్త ఓఎస్‌ కిట్‌క్యాట్‌ 4.4 ఓఎస్‌తో స్మార్ట్‌ మొబైల్‌ అంటే రేటు ఎక్కువే అనుకుంటాం. కానీ, మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లోనే స్మార్ట్‌ మొబైల్‌ సందడి మొదలైంది. వాటిల్లో XOLO Q600s ఒకటి. ధరెంతో తెలుసా? రూ.8,499. శ్నాప్‌డీల్‌.కామ్‌లో సుమారు రూ.7,499కే కొనుగోలు చేయవచ్చు. దీని తాకే తెర పరిమాణం రూ.4.5 అంగుళాలు. స్క్రీన్‌ రిజల్యూషన్‌ 960X540 పిక్సల్స్‌. One Glass Solution టెక్నాలజీతో తాకేతెరని రూపొందించారు. 1.2GHz Broadcom quad-core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమెరాని ఏర్పాటు చేస్తే... వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. లెడ్‌ ఫ్లాష్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 2000mAh బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 11 గంటలు మాట్లాడొచ్చు. డ్యూయల్‌ సిమ్‌తో ఫోన్ని వాడుకోవచ్చు. 3జీ, బ్లూటూత్‌, జీపీఎస్‌ నెట్‌వర్క్‌లను వాడుకోవచ్చు.

తాకేతెర పైనా... క్వర్టీ కీప్యాడ్‌

అది స్మార్ట్‌ మొబైలే. తాకేతెర పైనా... క్వర్టీ కీప్యాడ్‌ కింద... కానీ, బడ్జెట్‌లోనే కొనొచ్చు. స్పైస్‌ కంపెనీ తయారు చేసిన మోడల్‌ పేరు Spice Stellar 360. ధర సుమారు రూ.4,799. ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే... ఆండ్రాయిడ్‌ 4.2 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకే తెర పరిమాణం 3.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 480X320పిక్సల్స్‌. 1.3GHzడ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌కి 1.3 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వెనుక 3.2 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. లెడ్‌ ఫ్లాష్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. జీపీఆర్‌ఎస్‌, ఎడ్జ్‌, 3జీ, బ్లూటూత్‌, వై-ఫై... సేవల్ని వాడుకోవచ్చు. ఇంటర్నల్‌ మెమొరీ 4జీబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. 2జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం 1500mAh. ఇన్‌బిల్ట్‌గా Whatsapp, BBM, Opera, Twitter...లాంటి మరిన్ని ఆప్స్‌ని ఉచితంగా అందిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్‌ సరికొత్త 'నోకియా 225'

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ డివైజెస్‌ 'నోకియా 225' పేరుతో సరికొత్త మొబైల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.3,329. సింగిల్‌, డ్యుయల్‌ సిమ్‌ రకాల్లో ఇది లభ్యం కానుంది. దేశంలో మరో కోటి మందిని ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేసే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. కొత్త మొబైల్‌లో నోకియా ఎక్స్‌ప్రెస్‌ బ్రౌజర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని పొందొచ్చని పేర్కొంది. 2.8 అంగుళాల తెర, 2 మెగాపిక్సెల్‌ కెమేరా, 1200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎఫ్‌ఎమ్‌ రేడియో, 32 జీబీ వరకు మెమొరీని విస్తరించుకునే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని పేర్కొంది.

'నోకియా ఎక్స్‌ఎల్‌'

న్యూఢిల్లీ: నోకియా 'ఎక్స్‌' శ్రేణిలో పెద్ద తెరతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోనును మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ విడుదల చేసింది. 'నోకియా ఎక్స్‌ఎల్‌'గా వ్యవహరించే ఈ స్మార్ట్‌ఫోను రూ.11,489 ధరతో లభ్యమవుతోంది. ఐపీఎస్‌ సామర్థ్యం గల 5 అంగుళాల తాకే తెర, ముందు వైపు 2 మెగాపిక్సెల్‌ కెమేరా, వెనుక 5 మెగాపిక్సెల్‌ కెమేరా, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 1 గిగాహెర్ట్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 768 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ మెమొరీతో పాటు 32 జీబీ వరకు విస్తరించుకునే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

ఇంటెక్స్‌ 'ఆక్వా ఐ5 హెచ్‌డీ'
న్యూఢిల్లీ: ఇంటెక్స్‌ 'ఆక్వా ఐ5 హెచ్‌డీ' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోనును విడుదల చేసింది. దీని ధర రూ.9,990. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో లభించనుండగా.. జూన్‌ నెలాఖరు కల్లా కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. 1.3 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, డ్యుయల్‌ సిమ్‌, 5 అంగుళాల హెచ్‌డీ.. ఓజీఎస్‌ తెర, 1 జీబీ రామ్‌, 4 జీబీ అంతర్గత మెమొరీ (32 జీబీ వరకు విస్తరణ సామర్థ్యం), వెనక 13 మెగాపిక్సెల్‌ కెమేరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్‌ కెమెరా, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

పిల్లల ట్యాబ్‌
ఖరీదైన ట్యాబ్లెట్‌ని పిల్లల చేతికి ఇవ్వలేం. ఎందుకంటే జార విడుస్తారేమో అనే భయం. స్త్టెలిష్‌ ట్యాబ్‌ కాస్త కింద పడితే అంతే సంగతులు. అదే పిల్లలకు అనువైన ట్యాబ్లెట్‌ ఉంటే? ఎన్ని సార్లు కింద పడేసినా ఏం కాకుంటే? అదెలా సాధ్యం అంటారా? అయితే, మీరు Leapfrog LeapPad Ultra ట్యాబ్లెట్‌ గురించి తెలుసుకోవాల్సిందే. 3 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ట్యాబ్‌ని ప్రత్యేకంగా రూపొందించారు. కింద పడినా పాడవ్వకుండా ఉండేలా ప్రత్యేక కేస్‌తో దీన్ని రూపొందించారు. పిల్లలకు అనువుగా ఉండే ప్రత్యేక ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. వెబ్‌ బ్రౌజర్‌, ఎంపీ3 ప్లేయర్‌, ఆప్‌ స్టోర్‌లు కూడా ఉన్నాయి. పిల్లల్ని ఆకట్టుకునే అప్స్‌ని స్టోర్‌ నుంచి పొందొచ్చు. ట్యాబ్‌ తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1024X600పిక్సల్స్‌. 800Mhzప్రాసెసర్‌ని వాడారు. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 8 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 8 గంటలు. 2 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. 480 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వీడియోలు చిత్రీకరించొచ్చు. ధరెంతో తెలుసా? రూ.17,999.

మరింత సామర్థ్యం...
స్మార్ట్‌ మొబైల్‌తోనే డాక్యుమెంటరీ సినిమాలు, ఫొటో ఆల్బమ్‌లు రూపొందిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారికి లావా కంపెనీ మరో సరికొత్త మోడల్‌ని అందిస్తోంది. అదే Lava Iris 504Q+. దీంట్లోని కెమెరా సామర్థ్యం 10 మెగాపిక్సల్‌. అంతేకాదు... Sony Exmor RS Sensor టెక్నాలజీతో కెమెరా పని చేస్తుంది. దీంతో తక్కువ లైటింగ్‌లోనూ ఫొటోలు తీసుకోవడం సులభం. ఆటోఫోకస్‌ కూడా ఉంది. 'హై డైనమిక్‌ రేంజ్‌' ద్వారా వీడియోలను హెచ్‌డీ క్వాలిటీతో చిత్రీకరించొచ్చు. ఫొటోలు, వీడియోలను గ్యాలరీలోకి వెళ్లి చూసేప్పుడు తెరని తాకాల్సిన పని లేదు. తెర ముందు చేతిని ఉంచి కదలిస్తే చాలు. ఫొటోలు ఒక్కోటీ స్క్రోల్‌ అవుతూ వెళ్తాయి.వాయిస్‌ కంట్రోల్‌ ద్వారా కూడా ఫోన్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. ఫోన్‌ చూడ్డానికి 7.9 అంగుళాల మందంతో నాజూకుగా కనిపిస్తుంది. తెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. 1.3Mhz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. Mali 400 Graphics నిక్షిప్తం చేశారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. కావాలంటే 32 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వీలుంది. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 2 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ధర సుమారు రూ.13,990.

గెలాక్సీ ఎస్‌5 వచ్చేసింది
శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తమ అధునాతన హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎస్‌5ను విపణిలోకి విడుదల చేసింది. 5.1 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ సూపర్‌ అమోల్డ్‌ తాకేతెర, 2.5 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ అప్లికేషన్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీతో పాటు ఎస్‌డీకార్డుతో 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం, 2,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వెనుక-ముందు 16-2 మెగాపిక్సెల్‌ హెచ్‌డీఆర్‌ కెమెరాలు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.4.2 కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 42 ఎంబీపీఎస్‌ వేగంతో 3జీ నెట్‌ బ్రౌజ్‌ చేసే అవకాశం ఉన్న ఈ ఫోన్‌ను దుమ్ము-నీరు ఏమీ చేయలేవని శామ్‌సంగ్‌ ప్రకటించింది. కెమెరాకు ఉన్న ఫాస్ట్‌ ఆటో ఫోకస్‌ ఫీచర్‌ వల్ల, వేగవంతమైన కదలికలను, హెచ్‌డీఆర్‌ పద్ధతిలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు మరింత స్పష్టంగా చిత్రీకరించవచ్చు. సెలెక్టివ్‌ ఫోకస్‌ పద్ధతిలో అవసరమైన వ్యక్తులను స్పష్టంగా, మిగిలినవి బూదర (బ్లర్‌)గా చేయవచ్చు.
హృదయ స్పందన (హార్ట్‌రేట్‌) నమోదు: ఫోన్‌ వెనుక భాగాన చేతివేలును ఉంచడం ద్వారా హృదయ స్పందన నమోదు చేయవచ్చని, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని శామ్‌సంగ్‌ ప్రకటించింది. పెడోమీటర్‌ ద్వారా రోజువారీ వ్యాయామాలను నమోదు చేస్తుందని, వినియోగదారు లక్ష్యాన్ని చేరుతున్నారో లేదో తెలిసిపోతుందని ప్రకటించింది. డౌన్‌లోడ్‌ బూస్టర్‌తో ఎల్‌టీఈ, వైఫైని ఒకేసారి వినియోగించుకోవచ్చు. చేతివేలు స్కానింగ్‌ ద్వారా ఫోన్‌ను లాక్‌/అన్‌లాక్‌ చేయవచ్చు. ధర రూ.51,500.

సెల్‌కాన్‌ క్యాంపస్‌ ఏ125
క్యాంపస్‌ శ్రేణిలో సరికొత్త 3జీ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏ125ను విపణిలోకి విడుదల చేసినట్లు సెల్‌కాన్‌ మొబైల్స్‌ ప్రకటించింది. 4.5 అంగుళాల కెపాసిటివ్‌ తాకే తెర, 1.3 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌కోర్‌ ప్రాసెసర్‌, వెనుక-ముందు 5-1.3 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.2.2 జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ అంతర్గత మెమొరీ ఉండగా, ఎస్‌డీకార్డుతో 32 జీబీకి పెంచుకోవచ్చు. మాతృభాషలో మెసేజింగ్‌కు వీలుగా 9 భాషలను సపోర్ట్‌ చేస్తుంది. 3జీ వీడియో కాలింగ్‌కు అవకాశం ఉన్న ఈ ఫోన్‌లో 'షేక్‌ అండ్‌ షేర్‌', మల్టీప్లేయర్‌ గేమింగ్‌, డూడ్లింగ్‌ వంటి ఫీచర్లు నిక్షిప్తం చేశామని పేర్కొన్నారు. ఈ ఫోన్‌తో ఫ్లిప్‌కవర్‌ ఉచితంగా అందిస్తున్నారు. ధర రూ.6,399.

ఇదే మొదటిది
కార్బన్‌ మొబైల్‌ కంపెనీ కొత్త ప్రాసెసర్‌తో స్మార్ట్‌ మొబైల్‌ని అందిస్తోంది. మోడల్‌ Karbonn Titanium Hexa. తొలిసారి Mediatek's Six Core (Hexa)ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చిన మొబైల్‌ ఇదే. డ్యూయల్‌ సిమ్‌లతో వాడుకోవచ్చు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వీడియో ఛాటింగ్‌కి5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంటే.. వెనక 13 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 4.4 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకే తెర పరిమాణం 5.5 అంగుళాలు. హెచ్‌డీ డిస్‌ప్లే. ర్యామ్‌ 2 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 16 జీబీ. ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీని పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2,050mAh. ఇంతకీ దీని ధరెంతో తెలుసా? రూ.16,990.

నోకియా ట్యాబ్లెట్‌
స్మార్ట్‌ మొబైళ్లలో పేరొందిన నోకియా మోడల్‌ Lumia ట్యాబ్లెట్‌గానూ అలరించేందుకు సిద్ధం అవుతోంది. పేరు Nokia Lumia 2520. విండోస్‌ ఓఎస్‌తో తాకేతెరపై అదనపు సౌకర్యాల్ని అందిస్తుంది. తాకేతెర పరిమాణం 10.1 అంగుళాలు. మల్టీటచ్‌తో తెరని అనువుగా వాడుకోవచ్చు. తక్కువ మందంతో నాజూకుగా తీర్చిదిద్దారు. 8.9ఎంఎం సైజులో స్లిమ్‌గా కనిపిస్తుంది. బరువు 615 గ్రాములు. Snapdragon 800 quad core ప్రాసెసర్‌ని వాడారు. స్టోరేజ్‌ సామర్థ్యం 32 జీబీ. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక ఏర్పాటు చేసిన కెమెరా సామర్థ్యం 6.7 మెగాపిక్సల్‌. ముందున్న కెమెరా 2 మెగాపిక్సల్‌. చిత్రంలో మాదిరిగా 'నోకియా పవర్‌ కీబోర్డ్‌'ని ట్యాబ్లెట్‌కి కనెక్ట్‌ చేసి టైప్‌ చేసుకోవచ్చు. కీబోర్డ్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌బిల్ట్‌ బ్యాటరీ ద్వారా ట్యాబ్‌ని 5 గంటలు వాడుకోవచ్చు. కీబోర్డ్‌లో టచ్‌ప్యాడ్‌తో పాటు యూఎస్‌బీ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. కీబోర్డ్‌ని ట్యాబ్‌కి కనెక్ట్‌ చేస్తే ల్యాపీలా వాడుకోవచ్చన్నమాట. త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ సందడి చేయనుంది. ధర సుమారు రూ.31,200. మరిన్ని వివరాలకు http://goo.gl/LhlEmB లింక్‌లోకి వెళ్లండి.
ఇది మరోటి
ఫోన్‌, ట్యాబ్లెట్‌కి మధ్యలో అవతరించిన ఫ్యాబ్లెట్‌ మరోటి అందబాటులోకి వచ్చింది. దేశీయ కంపెనీ లావా అందుబాటులోకి తెచ్చిన దీని పేరు Xolo Q2000. 5.5 అంగుళాల హెచ్‌డీ తాకేతెరతో రూపొందించారు. రిజల్యుషన్‌ 1280X720 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. వెనక 13 మెగాపిక్సల్‌... ముందు 2 మెగాపిక్సల్స్‌ సామర్థ్యంతో డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. 2,600mAh బ్యాటరీతో 3జీ నెట్‌వర్క్‌ని 12 గంటలు వాడుకోవచ్చు. 2జీ నెట్‌వర్క్‌పై బ్యాటరీ 17 గంటల పాటు ఛార్జింగ్‌ని అందిస్తుంది. ధర సుమార రూ.14,999. ఇతర వివరాలకు http://goo.gl/T19TDj యూఆర్‌ఎల్‌ని చూడండి.

 

 
ఇదే మొదటిది
ఇప్పటి వరకూ మీరు టచ్‌స్క్రీన్‌ మొబైల్స్‌ని తెరపై మాత్రమే తాకుతూ వాడుతున్నారు. ఇక మీదట ఫోన్‌ వెనకభాగంలో తాకుతూ కూడా మెనూలను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అదెలా సాధ్యమో తెలియాలంటే Oppo N1 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. 'టచ్‌ సెన్సిటివ్‌ బ్యాక్‌ ప్యానల్‌' తో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి ఫోన్‌ ఇదే. ఆప్స్‌, ఫోన్‌ ఐకాన్స్‌ని వెనక నుంచి కూడా సెలెక్ట్‌ చేస్తూ ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీని తాకేతెర పరిమాణం 5.9 అంగుళాలు. హెచ్‌డీ డిస్‌ప్లేతో గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. 9 మిల్లీ మీటర్ల మందంతో నాజూకుగా తయారు చేశారు. 1.7Ghz quad core Snapdragon 600 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. 16 జీబీ, 32 జీబీ మెమొరీతో మోడళ్లను అందిస్తున్నారు. దీంట్లో మరో ప్రత్యేకమైన సౌకర్యం ఏంటంటే... ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన కెమెరా. ఫోన్‌కి పై భాగంలో ఏర్పాటు చేసిన కెమెరాని ముందుకి, వెనక్కి తిప్పుతూ వాడుకోవచ్చు. 13 మెగాపిక్సల్‌ సామర్థ్యం. O Click అనే ప్రత్యేక రిమోట్‌తో 50 మీటర్ల దూరం నుంచి ఫోన్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ ద్వారా ఇది ఫోన్‌కి కనెక్ట్‌ అవుతుంది. రిమోట్‌తో కెమెరాని యాక్సెస్‌ చేసి ఫొటోలు కూడా తీయవచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/ KppOgn లింక్‌లోకి వెళ్లండి.

కాస్త తక్కువకే...
తాకేతెర మొబైళ్లను కాస్త తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తున్న సెల్‌కాన్‌ ఇప్పుడు Monalisa ML - 5 మోడల్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. 4.5 అంగుళాల తాకేతెరతో దీన్ని రూపొందించారు. రిజల్యూషన్‌ 960X540 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లిబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4జీబీ. డ్యుయల్‌ కెమెరాలు (వెనక 8 మెగాపిక్సల్‌, ముందు 2 మెగాపిక్సల్‌) ఉన్నాయి. లైన్‌ సెన్సర్‌ సౌకర్యం ఉంది. 3జీ, వై - ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లను యాక్సెస్‌ చేయవచ్చు. 1,800mAh బ్యాటరీతో పని చేస్తుంది. 32 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. ధర సుమారు రూ.10,999. ఇతర వివరాలకు http://goo.gl/tNYWXh లింక్‌ని చూడండి.

Lava 3G 356, 402 త్రీజీ మొబైల్‌
త్రీజీ మొబైల్‌ వాడాలంటే ఖరీదైన స్మార్ట్‌ ఫోన్లే వాడక్కర్లేదు. కాస్త తక్కువ ధర మొబైళ్లూ ఉన్నాయి. కావాలంటే Lava 3G 356, 402 మోడళ్లు చూడండి. వీటి ధర రూ.4,499 నుంచి ప్రారంభం. రెండు ఫోన్లూ డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్లతో పని చేస్తాయి. ర్యామ్‌ 256 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం 512 ఎంబీ. మెమొరీని పెంచుకునే వీలుంది. 356 మోడల్‌ తెర పరిమాణం 3.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 480X320పిక్సల్స్‌. డ్యుయల్‌ కెమెరాలు. (ముందు వీజీఏ కెమెరా, వెనక 1.3 మెగాపిక్సల్‌) 402 మోడల్‌ తెర పరిమాణం 4 అంగుళాలు. రిల్యూషన్‌ 800X480 పిక్సల్స్‌. ముందు భాగంలో 1.3 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. వెనక 3 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. రెండింటిలోనూ వై - ఫై, బ్లూటూత్‌, జీసీఎస్‌ సేవలు ఉన్నాయి. http://goo.gl/rnjMy3

సెల్‌కాన్‌ A63 Campus
ఆధునిక ఆండ్రాయిడ్‌ 4.2 ఓఎస్‌తో మొబైల్‌ని వాడాలనుకుంటే సెల్‌కాన్‌ అందిస్తున్న A63 Campus గురించి తెలుసుకోవాల్సిందే. ధర కూడా తక్కువే. సుమారు రూ.4,499. 4 అంగుళాల తాకేతెరతో పని చేస్తుంది. రిజల్యూషన్‌ 800X480పిక్సల్స్‌. మరో విశేషం ఎంటంటే... మొబైల్‌ డ్యుయల్‌ కెమెరాలతో (వెనక 3.2 మెగాపిక్సల్‌, ముందు వీజీఏ కెమెరా) పని చేస్తుంది. 1.2Ghzడ్యుయల్‌కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 256ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 512 ఎంబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీని పెంచుకోవచ్చు. వై - ఫై, బ్లూటూత్‌, 2జీ సౌకర్యాలున్నాయి. మరిన్ని వివరాలకు http://goo.gl/JVKael

త్రీడీలో...
కాస్త తక్కువ ధరకే త్రీడీ డిస్‌ప్లేతో మొబైల్‌ని కొనాలనుకుంటే లావా కంపెనీ తయారు చేసిన Aspirational A3 గురించి తెలుసుకోవాల్సిందే. ధర రూ.12,000. డ్యుయల్‌ సిమ్‌తో పని చేస్తుంది. తెర పరిమాణం 4.3 అంగుళాలు. కళ్లజోడు లేకుండా త్రీడీ గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. రిజల్యూషన్‌ 960X540 పిక్సల్స్‌. 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. డ్యుయల్‌ (వెనక 8 మెగాపిక్సల్‌, ముందు 2 మెగాపిక్సల్‌) కెమెరాలు ఉన్నాయి. 8 మెగాపిక్సల్‌ కెమెరాతో 2డీ, 3డీ వీడియోలను చిత్రీకరించొచ్చు. 3జీ నెట్‌వర్క్‌తో వీడియో కాలింగ్‌ చేయవచ్చు.

ఇదే నాజూకైంది!
ప్రపంచంలో అత్యంత నాజూకైన మొబైల్‌ ఏదంటే? సోనీ కంపెనీ తయారు చేసిన Xperia Z Ultra మొబైల్‌ అనాల్సిందే. ఫుల్‌ హెచ్‌డీ స్మార్ట్‌ మొబైల్‌గా పిలుస్తున్నారు. దీని మందం ఎంతో తెలుసా? 6.5 ఎంఎం. బరువు 212 గ్రాములే. తెర పరిమాణం 6.4 అంగుళాలు. 'వాటర్‌ఫ్రూఫ్‌' రక్షణ వ్యవస్థ మరో ప్రత్యేకత. స్క్రీన్‌ రిజల్యూషన్‌ 1920X1080పిక్సల్స్‌. ఆటోఫోకస్‌తో 8 మెగాపిక్సల్‌ కెమెరాని వాడొచ్చు. http://goo.gl/nc73dG

చాలా చౌకగా...
డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌... ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌ ఓఎస్‌... డ్యుయల్‌ కెమెరాలు... సదుపాయాలతో స్మార్ట్‌ మొబైల్‌ అంటే ఖరీదు ఎక్కువే. కానీ, ఇంటెక్స్‌ అందిస్తున్న Cloud X3 మాత్రం తక్కువ ధరతో మార్కెట్‌లో సందడి చేస్తోంది. ధరెంతో తెలుసా? రూ.3,790. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ మొబైళ్లలో ఇదే చవకైన మొబైల్‌. డ్యుయల్‌ సిమ్‌తో ఫోన్‌ వాడుకోవచ్చు. తెర పరిమాణం 3.5 అంగుళాలు. డ్యుయల్‌ కెమెరాలు (వెనక 2 మెగాపిక్సల్‌, వెనక వీజీఏ కెమెరాలు) ఉన్నాయి. 256 ఎంబీ ర్యామ్‌. ఇంటర్నల్‌ మెమొరీ 115 ఎంబీ. 32 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే వీలుంది. వై-ఫై, జీపీఎస్‌, ఎఫ్‌ఎం ఇతర సదుపాయాలు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6 గంటలు మాట్లాడొచ్చు. http://goo.gl/b234RM

మరో మెట్టు!
ఇక మీదట స్మార్ట్‌ మొబైల్‌ ప్రత్యేక గేమింగ్‌ అడ్డాగా మారిపోతుంది. అందుకు అనువుగా Nvidia Tegra 3 quad core ప్రాసెసర్‌ సౌకర్యాలతో మొట్టమొదటిగా Xolo T1000 ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. తెర పరిమాణం 4.7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X720 పిక్సల్స్‌. 12 core GeForce GPU ప్రాసెసర్‌తో మొబైల్‌ని ప్లేస్టేషన్‌గా మార్చేయవచ్చు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 4.1 (జెల్లీబీన్‌) ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ (వెనక 8 మెగాపిక్సల్‌, ముందు 2 మెగాపిక్సల్‌) కెమెరాలున్నాయి. కెమెరాతో హెచ్‌డీ వీడియోలు చిత్రీకరించొచ్చు. Tegrazone నుంచి గేమ్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ధర సుమారు రూ. 15,999. http://goo.gl/Q0zyN5

'పది' లో మరోటి
బ్లాక్‌బెర్రీ 10 ఓఎస్‌తో మరో మోడల్‌ మార్కెట్‌లో సందడి చేస్తోంది. అదే 'బ్లాక్‌బెర్రీ క్యూ5'. తాకేతెర, క్వర్టీ కీప్యాడ్‌తో ఫోన్‌ని వాడుకోవచ్చు. తాకేతెర పరిమాణం 3.1 అంగుళాలు. రిజల్యూషన్‌ 720X720 పిక్సల్స్‌. Qualcomm Snapdragon 1.2Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. డ్యుయల్‌ (వెనక 5 మెగాపిక్సల్‌, ముందు 2 మెగాపిక్సల్‌) కెమెరాలున్నాయి. రెండు కెమెరాల్ని ఒకేసారి వాడొచ్చు. 3జీ, వై-ఫై, బ్లూటూత్‌ 4.0, ఎన్‌ఎఫ్‌సీ సౌకర్యాలు అదనం. 2,180mAhబ్యాటరీ వాడారు. యువతని ఆకట్టుకునేలా ఎరుపు, గులాబీ రంగుల్లోనూ బ్లాక్‌బెర్రీ ఆకట్టుకుంటోంది. ధర సుమారు రూ.24,990. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/K4B5AB

'క్లౌడ్‌'తో పాటు
బ్యాక్‌అప్‌కి క్లౌడ్‌ స్టోరేజ్‌ ప్రత్యామ్నాయంగా మారుతోందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే స్పైస్‌ కంపెనీ వినూత్న సదుపాయంతో ముందుకొచ్చింది. అదే 'స్పైస్‌ క్లౌడ్‌'. 2జీబీ బ్యాక్‌అప్‌ స్పేస్‌. దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌... డేటా ఏదైనా క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఇదెక్కడ ఉంటుందంటారా? కంపెనీ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశపెట్టిన Stellar Virtuoso Pro మోడల్‌లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఫోన్‌ తెర పరిమాణం 4.5 అంగుళాలు. రిజల్యూషన్‌ 857X480పిక్సల్స్‌. 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. (ముందు 1.3 మెగాపిక్సల్‌, వెనక 5 మెగాపిక్సల్‌) 1,700mAh బ్యాటరీని వాడారు. మరిన్ని వివరాలకు http://goo.gl/kTq3e

ఒకటి... రెండు
కాస్త తక్కువ బడ్జెట్‌లో సీడీఎంఏ, జీఎస్‌ఎంలతో డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ని వాడాలనుకుంటే MTS Duet గురించి తెలుసుకోవాల్సిందే. ధర సుమారు రూ.4,799. 1GHzSingle Core Qualcomm Snapdragon S1ప్రాసెసర్‌ని వాడారు. తాకేతెర పరిమాణం 3.5 అంగుళాలు. తెర రిజల్యుషన్‌ 320X480పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 2.3 Gingerbread ఓఎస్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 256 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం 512 ఎంబీ. మైక్రోఎస్‌డీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 3 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4 గంటలు. ఇతర వివరాలకు http://goo.gl/2Jn6l

అత్యంత నాజూకు!
లెనోవొ కంపెనీ నాజూకైన ఫోన్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పేరు K900.దీని మందం 6.9 మిల్లీమీటర్లు. బరువు 162 గ్రాములు. తాకే తెర పరిమాణం 5.5 అంగుళాలు. ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో వాడుకోవచ్చు. రిజల్యుషన్‌ 1920X1080 పిక్సల్స్‌. 2Ghz Intel CloverTrail+dual core processor తో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే. లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ 4.2 ఓఎస్‌తో దీన్ని వాడుకోవచ్చు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. డ్యుయల్‌ కెమెరాలు (ముందు భాగంలో 2 మెగాపిక్సల్‌, వెనక 13 మెగాపిక్సల్‌). రెండు కెమెరాలతోనూ హెచ్‌డీ వీడియోలను చిత్రీకరించొచ్చు. బ్యాటరీ సామర్థ్యం2,500mAh. మొబైల్‌ ప్యానల్‌ మొత్తాన్ని Steel-Polycarbonateమెటీరియల్‌తో రూపొందించారు. ధర సుమారు రూ.32,900. ఇతర వివరాలకు http://goo.gl/jB0bu

చాలా చౌకగా..
కాస్త తక్కువ ధరకే 5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ మొబైల్‌ని కొనాలనుకుంటే స్పైస్‌ కంపెనీ తయారు చేసిన Smart Flo Pace2 Mi 502మొబైల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ధరెంతో తెలుసా? రూ.6,999. తెర రిజల్యుషన్‌ 800X480పిక్సల్స్‌. 9.6 ఎంఎం మందంతో నాజూకుగా ఆకట్టుకుంటోంది. 1Ghzడ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 512 ఎంబీ. 32 జీబీ వరకూ మెమొరీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ని ఏర్పాటు చేశారు. డ్యుయల్‌ లెడ్‌ ఫ్లాష్‌ని కెమెరాని వాడుకోవచ్చు. ముందు 1.3 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. 2,100 mAhబ్యాటరీని వాడారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు ఫోన్‌ మాట్లాడొచ్చు. స్క్రీన్‌ ప్రొటెక్టర్‌, ఫోన్‌ కేస్‌ని మొబైల్‌తో పాటు పొందొచ్చు. http://goo.gl/UAvLW

పలక.. బలపం
చదువుకోవడానికైనా... బ్రౌజింగ్‌ చేయడానికైనా అనువుగా ఉండేలా రూపొందించిందే 'గేలాక్సీ నోట్‌ 510' ట్యాబ్లెట్‌. తెర పరిమాణం 8 అంగుళాలు. రిజల్యుషన్‌ 1280X800 పిక్సల్స్‌. ట్యాబ్లెట్‌తో పాటు 'ఎస్‌పెన్ను'ని వాడుకునే వీలుంది. Wacom digitizer touchscreenటెక్నాలజీని వాడారు. హర్డ్‌వేర్‌ విషయానికొస్తే... 1.6 Ghz Quad Coreప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరా, ముందు 1.3 మెగాపిక్సల్‌ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. 4,600 mAhబ్యాటరీని వాడారు. ట్యాబ్‌ బరువు 338 గ్రాములు. మందం 8 మిల్లీ మీటర్లు. ధర సుమారు రూ.30,900. మరిన్ని వివరాలకు http://goo.gl/ScHH

ఒక 'ఐడియా'
కాస్త తక్కువ ధరలో ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌ ఓఎస్‌తో స్మార్ట్‌ మొబైల్‌ని వాడాలనుకుంటే Aurus II గురించి తెలుసుకోవాల్సిందే. డ్యుయల్‌ సిమ్‌ సౌలభ్యం కూడా ఉంది. ఐడియా అందిస్తున్న మొదటి ఆండ్రాయిడ్‌ మొబైల్‌గా చెప్పుకోవచ్చు. 3.5 అంగుళాల తాకేతెరతో పని చేస్తుంది. రిజల్యుషన్‌ 320X480 పిక్సల్స్‌. 1 Ghz ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 3జీ, వై-ఫై, బ్లూటూత్‌ సౌకర్యాలున్నాయి. వెనక 3.2 మెగాపిక్సల్‌ కెమెరా, ముందు వీజీఏ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. 1.6 జీబీ త్రీజీ డేటా, మూడు నెలల సభ్యత్వంతో ఐడియా టీవీలను మొబైల్‌లో అందిస్తున్నారు. ధర సుమారు రూ.6,490. http://goo.gl/1BXyJ

ఇదే మొదటిది
ఫేస్‌బుక్‌ అందిస్తున్న 'హోం' యూజర్‌ ఇంటర్ఫేస్‌ని కలిగిన మొదటి ఫోన్‌ HTC First. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌తో త్వరలో మార్కెట్‌లో సందడి చేయనుంది. ఫేస్‌బుక్‌ హోంతో మొబైల్‌ హోం స్క్రీన్‌లోనే అప్‌డేట్స్‌, నోటిఫికేషన్స్‌... లాంటి ఇతర అప్‌డేట్స్‌ని పొందొచ్చు. ఫేస్‌బుక్‌ అభిమానులకు ఇదో ప్రత్యేక వారధి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పటికప్పుడు 'న్యూస్‌ఫీడ్‌'ని కూడా పొందే వీలుంది. ఇదే మాదిరిగా Instagramఅప్‌ని మొదటిసారి ఇన్‌బిల్డ్‌గా అందిస్తున్నారు. ఫొటోలను కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకుని ఇతరులతో పంచుకునేందుకు ఇదో సులువైన వేదిక. 1.4Ghz Qualcomm డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 2,000mAhబ్యాటరీలతో పని చేస్తుంది. తెర పరిమాణం 4.3 అంగుళాలు. స్క్రీన్‌ రిజల్యుషన్‌ 1280X720పిక్సల్స్‌. లెడ్‌ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సల్‌ కెమెరాని వాడుకోవచ్చు. http://goo.gl/XdXhuv

తక్కువకే 'విండోస్‌'
విండోస్‌ ఫోన్‌ 8 ఓఎస్‌తో ఫోన్‌ వాడాలంటే? భారీ బడ్జెట్‌ అక్కర్లేదు. కాస్త తక్కువ ధరలోనూ సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఫోనే Nokia Lumia 520. చౌకగా అందుబాటులోకి వచ్చిన విండోస్‌ ఫోన్‌గా టెక్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ధరెంతో తెలుసా? రూ.10,500. దీనికి 4 అంగుళాల తాకే తెరే కాదు. Scratch-resistant డిస్‌ప్లే కూడా. అంటే తెరపై గీతలు పడతాయన్న భయాన్ని వదిలేయొచ్చు. 1Ghz dual core Snapdragon ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 512 ఎంబీ. ఇన్‌బిల్డ్‌ మెమొరీ 8 జీబీ. 64 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వీలుంది. 5 మెగాపిక్సల్‌ కెమెరాతో 720 పిక్సల్స్‌ నాణ్యత కలిగిన వీడియోలను చిత్రీకరించొచ్చు. మ్యాప్స్‌, డ్రైవ్‌, మ్యూజిక్‌... లాంటి ఇన్‌బిల్డ్‌ నోకియా సర్వీసుల్ని ఫోన్‌లో యాక్సెస్‌ చేయవచ్చు. మూడు నెలల పాటు బిగ్‌ఫ్లెక్స్‌ వీడియో స్ట్రీమింగ్‌ సేవాల్ని వాడుకోవచ్చు.వివిధ రంగుల్లో బ్యాక్‌కవర్స్‌ని మార్చుకోవచ్చు. http://goo.gl/WqCzW

వెనక 12... ముందు3
తాకే తెర పరిమాణాన్ని మరింత పెంచుతూ సెల్‌కాన్‌ మరో స్మార్ట్‌ మొబైల్‌ని అందిస్తోంది. పేరు A119 Signature HD. తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌తో అందుబాటులోకి దీని తెర రిజల్యుషన్‌ 720X1280పిక్సల్స్‌. 1Ghzడ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 1 జీబీ.2100 mAh బ్యాటరీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. వీడియో చిత్రీకరణకు ఏకంగా 12 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. లెడ్‌ ఫ్లాష్‌ కూడా ఉంది. దీంతో హెచ్‌బీ వీడియోలను చిత్రీకరించొచ్చు. 3జీ కనెక్టివిటీతో వీడియో కాలింగ్‌ చేయవచ్చు. అందుకు అనువుగా 3 మెగాపిక్సల్‌ కెమెరాని ముందు భాగంలో ఏర్పాటు చేశారు. 9.3 అంగుళాల మందంతో మొబైల్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. బరువు 177 గ్రాములే. 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో పాటలు వినొచ్చు. దీని ధరెంతో తెలుసా? రూ.13,499. వీడియో ఇతర వివరాలకు http://goo.gl/6xdDC

అదిరే డిస్‌ప్లే!
కాస్త తక్కువ ధరకే నాణ్యమైన డిస్‌ప్లేతో కూడిన మొబైల్‌ని వాడాలనుకుంటే Retina A 27 మోడల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. కార్బన్‌ మొబైల్‌ కంపెనీ దీన్ని తయారు చేసింది. డ్యుయల్‌ సిమ్‌తో వాడుకోవచ్చు. తెర పరిమాణం 4.3 అంగుళాలు. రిజల్యుషన్‌ 960X540 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌ని నిక్షిప్తం చేశారు. 1.2 Ghz Qualcomm Snapdragon dual కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌; 4 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌. 8 మెగాపిక్సల్‌ కెమెరాతో వీడియోలను చిత్రీకరించొచ్చు. వీడియో ఛాటింగ్‌ ముందు భాగంలో 2 మెగాపిక్సల్‌ని ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు http://goo.gl/Etp5a

ఇక 'ప్యాడ్‌ఫోన్‌'
ఇప్పటి వరకూ ఫోన్‌, ట్యాబ్లెట్‌ అంటూ వేరు వేరుగా విన్నాం. రెండిటినీ కలిపేసి Asus కంపెనీ సరికొత్త Padfone Infinityని అందుబాటులోకి తెస్తోంది. 5 అంగుళాల తాకేతెరతో ఫోన్‌ని రూపొందింస్తే... 10.1 అంగుళాల తాకేతెరతో ట్యాబ్‌ స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు. ఫోన్‌ని ట్యాబ్‌ వెనుక భాగంలో డాక్‌ చేసి హెచ్‌డీ డిస్‌ప్లేతో (1920X1200 Pixel) ట్యాబ్లెట్‌లా వాడుకోవచ్చు. ట్యాబ్‌ స్క్రీన్‌ ముందు భాగంలో 1 మెగాపిక్సల్‌ కెమెరాని నిక్షిప్తం చేశారు. అదే ఫోన్‌లో వీడియో, ఫొటోల చిత్రీకరణకు 13 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. 1.7Ghz Quad-core ప్రాసెసర్‌ని వాడారు. ఆండ్రాయిడ్‌ 4.0 వెర్షన్‌తో ఫోన్‌ పని చేస్తుంది. ర్యామ్‌ 2జీబీ, ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 32జీబీ. 2,400mAh బ్యాటరీ. ఫోన్‌ని ట్యాబ్‌లో డాక్‌ చేసి ఛార్జ్‌ చేసుకోవచ్చు కూడా. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/NuZem

తక్కువలో కావాలా?
కాస్త తక్కువ ఖర్చుతో స్మార్ట్‌ మొబైల్‌ని వాడాలనుకుంటే మైక్రోమ్యాక్స్‌ రూపొందించిన Bolt A35 గురించి తెలుసుకోవాల్సిందే. ఆండ్రాయిడ్‌ 2.3 ఓఎస్‌తో అందిస్తున్నారు. ధర సుమారు రూ.4,250. నాలుగు అంగుళాల తాకేతెరతో రూపొందించారు. 1Ghzప్రాసెసర్‌ని వాడారు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. వెనక భాగంలో 2 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. వై-ఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌ సేవల్ని వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 4.5 గంటలు మాట్లాడుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 1,500 mAh. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 160 ఎంబీ. 16 జీబీ వరకూ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://goo.gl/rM9Gs

'స్పైసీ'గా..!!
స్పైస్‌ కంపెనీ రూపొందించిన Stellar Pinnacle Mi-530 గురించి తెలుసుకోవాల్సిందే. ఆసక్తికరమైన సదుపాయం ఏంటంటే 'ఇంటిలిజంట్‌ ఆన్సర్‌'. ఫోన్‌ కాల్‌ వస్తే చెవి దగ్గర మొబైల్‌ని పెట్టుకుంటుండగానే కాల్‌ లిప్ట్‌ అవుతుంది. Hi-Connectఆప్షన్‌తో వై-ఫై ద్వారా మొబైల్‌ని పీసీ నుంచి ఆపరేట్‌ చేయవచ్చు. తాకేతెర పరిమాణం 5.3 అంగుళాలు. 1.2Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. 2,250 mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 4 గంటలు పైబడే మాట్లాడొచ్చు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. వెనక 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. మరిన్ని వివరాలకు http://goo.gl/MTsji

బ్యాటరీ భలే!
అదిరే ఆండ్రాయిడ్‌ మొబైలే అయినా ఛార్జింగ్‌ విషయానికొస్తే ఎక్కువ సామర్థ్యం ఉన్నవి తక్కువే. పేరు Salora PowerMaxx Z1. 3200 mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి వచ్చింది. 2జీ నెట్‌వర్క్‌తో 18 గంటలు మాట్లాడొచ్చు. అదే 3జీ అయితే 22 గంటలు. 42 గంటల పాటు మ్యూజిక్‌ వినొచ్చు. 10 గంటల వీడియోని ప్లే చేయవచ్చు. వై-ఫై నెట్‌వర్క్‌తో 13 గంటలు పని చేస్తుంది. తెర పరిమాణం 4.5 అంగుళాలు. 1Ghz డ్యుయల్‌కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌ని నిక్షిప్తం చేశారు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 1.3 మెగాపిక్సల్‌ కెమెరా, వెనక 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. స్క్రీన్‌ రిజల్యుషన్‌ 960X540. 'డ్యుయల్‌ మైక్‌' సదుపాయంతో కాల్స్‌, ఆడియో నాణ్యత అదనపు ఆకర్షణ. డ్యుయల్‌ సిమ్‌తో ఫోన్‌ని వాడుకోవచ్చు.


ఇదే మొదటిది!
తాకేతెర స్మార్ట్‌ మొబైళ్లు తెర పరిమాణాన్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే తొలిసారి 5.9 అంగుళాల తెరతో కార్బన్‌ కంపెనీ A30మోడల్‌ని అందుబాటులోకి తెచ్చింది. రిజల్యుషన్‌ 800X480 పిక్సల్స్‌. డ్యుయల్‌ సిమ్స్‌తో ఇది పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌, 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ కెమెరా, ముందు భాగంలో 1.3 మెగాపిక్సల్‌ కెమెరాలతో రూపొందించారు. కెమెరాకి లెడ్‌ ఫ్లాష్‌ ఉంది. వై-ఫై హాట్‌స్పాట్‌, 3జీ, బ్లూటూత్‌ కూడా ఉన్నాయి. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. http://goo.gl/cMhyv

ఒకటేమో త్రీజీ...
డ్యుయల్‌ సిమ్‌లు ఎప్పటినుంచో వాడేస్తున్నాం. కాస్త కొత్తగా ఒకటేమో 3జీ సిమ్‌.. మరోటి 2జీ సిమ్‌తో వాడుకునేలా ఉంటే! ఇలాంటి డ్యుయల్‌ సిమ్‌ మొబైలే Lava Xolo A700. 4.5 అంగుళాల తాకేతెరతో రూపొందించారు. రిజుల్యుషన్‌ 960X540 పిక్సల్స్‌. 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ స్టోరేజ్‌, మైక్రోఎస్‌బీ కార్డ్‌, ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరా, వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో వీజీఏ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. బరువు కేవలం 115 గ్రాములే. 9,1 ఎంఎం మందంతో నాజూకుగా తయారు చేశారు. మరిన్ని వివరాలకు http://goo.gl/7VelC

9 అంగుళాలు
ఇప్పటి వరకూ చౌక ట్యాబ్లెట్‌ల తెర పరిమాణం 7 అంగుళాలే. కాస్త పెద్దగా ఉండే 9 అంగుళాలు కావాలంటే బడ్జెట్ డబుల్ అయినట్టే! కానీ, కొత్తగా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన Zen Ultratab A900 ట్యాబ్ ధర సుమారు రూ.7,999. తెర సైజు 9 అంగుళాలు. రిజల్యుషన్ 800x480 పిక్సల్స్. 1.5Ghz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 512 ఎంబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ, 1.3 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. మరిన్ని వివరాలకు http://goo.gl/YyTHI

లెనోవోలో మొబైల్‌ ఫోన్లు కూడా
ఇప్పటి వరకూ పీసీలు, ల్యాపీలతో ఆకట్టుకున్న లెనోవో కంపెనీ మొబైల్‌ ఫోన్లపైనా దృష్టిపెట్టింది. ఫ్యాబ్లెట్‌ అంటూ సరికొత్త మొబైల్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. పేరు Ideaphone K860. 9.5 మిల్లీమీటర్ల మందంగా నాజూకుగా ఆకట్టుకుంటోంది. బరువు 190 గ్రాములు. తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. రిజల్యుషన్‌ 1280X720 పిక్సల్స్‌. 1.4Ghz Quad Core Exynos ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, Quad Core mali 400 గ్రాఫిక్స్‌, 8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. వెనక 8 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ కెమెరా, వీడియో కాలింగ్‌కి 2 మెగాపిక్సల్‌ కెమెరాల్ని పొందుపరిచారు. ఇతర వివరాలకు http://goo.gl/FQStO

ఐడియా నుంచి 3జీ స్మార్ట్‌ఫోన్‌ ఆరస్‌
* ధర రూ.7,190, రూ.2,340 విలువైన ఆఫర్లు
హైదరాబాద్‌ : వీడియో కాలింగ్‌కు అనువైన 3జీ స్మార్ట్‌ఫోన్‌ ఆరస్‌ను ఐడియా సెల్యులార్‌ విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 2.3 (జింజర్‌బ్రెడ్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 800 మెగాహెట్జ్‌ ప్రాసెసర్‌, 3.5 అంగుళాల తాకేతెర, 1,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 5 మెగాపిక్సెల్‌ కెమెరా ఈ డ్యూయల్‌సిమ్‌ ఫోన్‌కు ఉన్నాయి. రూ.7,190 విలువైన ఆరస్‌ ఫోన్‌ను ఐడియా విక్రయశాలలతో పాటు ప్రధాన మొబైల్‌ దుకాణాల్లోనూ కొనుగోలు చేసి, రూ.259తో రీచార్జి చేసుకుంటే రూ.2,340 విలువైన టాక్‌టైమ్‌, డేటా వంటివి పండుగ ఆఫర్లుగా సంస్థ ప్రకటించింది. 4జీబీ మెమొరీకార్డు, హెడ్‌ఫోన్లు ఉచితంగా ఇస్తున్నారు. 3 నెలల పాటు 2జీబీ చొప్పున 3జీ డేటా (విలువ రూ.1500), ఐడియా టీవీ ఉచితంగా తిలకించే అవకాశం (విలువ రూ.450), రోజుకు 10 నిమిషాల చొప్పున లోకల్‌ టాక్‌టైం ఉచితంగా లభిస్తుందని ఐడియా సెల్యులార్‌ ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ చెప్పారు.

 

టాబ్లెట్‌ నుంచీ ఫోన్‌ కాల్స్‌
* సెల్‌టాబ్‌ను ఆవిష్కరించిన సెల్‌కాన్‌
* ధర రూ.7499

7 అంగుళాల కెపాసిటివ్‌ టచ్ స్క్రీన్ , 512 ఎంబీ ర్యామ్‌, 1 జీబీ ప్రాసెసర్‌, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వైఫై, బ్లూటూత్‌, హెచ్‌డీఎంఐ అవుట్‌పుట్‌ కలిగిన ఈ టాబ్లెట్‌ ఆండ్రాయిడ్‌ 4.0.3 (ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది. 3జీ డాంగిల్‌ను అమర్చుకునే సదుపాయం కూడా ఉంది. ఈ టాబ్లెట్‌కు ఇయర్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ అమర్చి వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపారు. 4జీబీ అంతర్గత మెమొరీతో పాటు 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే వీలున్నందున, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్లు అధికంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.

 

సోనీ ఎక్స్‌పీరియా టిపో ఫోన్‌ విడుదల
* ప్రారంభ ధర రూ.9,999
ప్రారంభ స్థాయి ఎక్స్‌పీరియా టిపో ఫోన్‌ను సోనీకంపెనీ న్యూఢిల్లీలో విడుదల చేసింది. రూ.10 వేల కన్నా తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ల విపణిలోకి తాజాగా అడుగు పెట్టిన కంపెనీగా నిలిచింది. భారత్‌లో బ్రాండ్‌ పురోభివృద్ధికి మొబైల్‌ ఫోన్‌ అంతర్‌ భాగమైంది. భారత వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీ కృషి చేస్తోందని సోనీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెనిచిరో హిబి తెలిపారు. ఎక్స్‌పీరియా శ్రేణిలో టిపో అత్యంత చౌక ఫోన్‌. దీని ధర రూ.9,999.

 

పెద్దలకు అనువుగా!
వయసు మళ్లిన అమ్మమ్మకో... తాతయ్యకో మొబైల్ కొనివ్వాలనుకుంటున్నారా? అయితే, వారు అనువుగా వాడుకునేలా ఐబాల్ కంపెనీ Aasaan ఫోన్‌ని రూపొందించారు. సీనియర్ సిటిజన్స్ మొబైల్‌గా దీన్ని పిలుస్తున్నారు. చిత్రంలో మాదిరిగా పెద్ద పెద్ద అంకెలతో కీప్యాడ్‌ని ఏర్పాటు చేశారు. బ్యాక్‌లైట్ కూడా ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎల్‌సీడీ తెరపై టైప్ చేసే అంకెలుగానీ, లెటర్స్‌గానీ పెద్ద సైజులో కనిపిస్తాయి. రింగ్‌టోన్ల వాల్యూమ్ కూడా ఎక్కువే. బిల్డ్ఇన్ టార్చ్‌లైట్ కూడా ఉంది. అత్యవసర సందర్భాల్లో ప్రత్యేక (ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్) అలారాన్ని మోగించొచ్చు. వెంటనే ఎంచుకున్న నెంబర్‌ని ఎలర్ట్ మెసేజ్ వెళుతుంది.
www.iballmobiles.co. in/product_senior.php

 

రేటెంతో తెలుసా?
ఎంత స్మార్ట్ మొబైల్ అయినా ఎక్కువలో ఎక్కువ ఒక లక్ష అనుకుందాం! కానీ, చిత్రంలో కనిపించే మొబైల్ రేటెంతో ఊహించగలరా? అక్షరాలా రూ.2,10,000. ఎందుకంత? అనేముందు వివరాలు తెలుసుకోవాల్సిందే. పేరు Tag Heuer Racer. ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా పిలుస్తున్నారు. సాధారణ మొబైళ్లలో వాడే మెటీరీయల్స్‌తో దీన్ని తయారు చేయలేదు. రేసింగ్ కార్లు, విమానాల్లో వాడే టైటానియం, కార్బన్ పైబర్, స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందించారు. మొబైల్ కూడా చూడ్డానికి రేస్ కారు మాదిరిగానే కనిపిస్తుంది. తాకేతెర పరిమాణం 3.5 అంగుళాలు. ఆండ్రాయిడ్ 2.3 ఓఎస్‌తో పని చేస్తుంది. ప్రీలోడ్ చేసిన Tag Heuer వాల్‌పేపర్లు, ఐకాన్లు, రింగ్‌టోన్లు ఉన్నాయి. 1Ghz ప్రాసెసర్‌ని దీంట్లో వాడారు. 5 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో వీజీఏ కెమెరా, ఇన్‌బిల్డ్ మెమొరీ సదుపాయాలు ఉన్నాయి. వీడియో, ఇతర వివరాలకు http://racer.tagheuer.com

 

రక్షణ కవచాలు!
వేల రూపాయలు పోసి కొన్న స్మార్ట్ మొబైల్ అనుకోకుండా కింద పడితేనో... నీళ్లలో పడితేనో... ఎలా ఉంటుంది? అందుకే సరైన మొబైల్ 'కేస్'ను ఎంచుకుంటే సరి. ఐఫోన్ వాడుతున్నట్లయితే Seidio Convert Plus గురించి తెలుసుకోవాల్సిందే. ఇది కేవలం కేస్ మాత్రమే కాదు. అదనపు బ్యాటరీతో పని చేస్తుంది. ఫోన్‌ని దీంట్లో అమర్చడం చాలా సులభం. చిత్రంలో చూపిన మాదిరిగా దీన్ని కేస్‌లో అమర్చి వాడుకోవచ్చు. ధర సుమారు రూ.5,400. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/nOx0M
* నీళ్లలో పడినా కంగారుపడక్కర్లేదనుకుంటే 'లైఫ్‌ఫ్రూఫ్' కేస్ ఉంటే సరి. ధర సుమారు రూ.4,437. కేస్‌ని మొబైల్‌కి తొగిగాక నీళ్లలో ఫోన్ మాట్లాడొచ్చు. పాటలు వినొచ్చు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/DsRyn

 

సందడే సందడి!
మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే పిలిప్స్ కంపెనీ తయారు చేసిన FlexiDock స్పీకర్ గురించి తెలుసుకోవాల్సిందే. మోడల్ AS111.. బ్లూటూత్‌తో స్పీకర్‌ని మొబైల్‌కి కలపొచ్చు. 360 డిగ్రీల్లో మొబైల్‌ని డాకింగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. లెడ్ డిస్‌ప్లేతో స్పీకర్‌ని రూపొందించారు. స్టీరియో ఎఫ్ఎం, అలారం క్లాక్ సదుపాయాలు కూడా ఉన్నాయి. http://goo.gl/QTOHt
* యాపిల్ తయారు చేస్తున్న ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్‌లకు కూడా ప్రత్యేక డాకింగ్ స్పీకర్లను రూపొందించారు. అవే AJ32070D, AJ7030D, DS1150 మోడళ్లు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/Ppt3q

 

డ్యుయర్ కోర్!!
మొబైల్, ట్యాబ్లెట్.. వాడేది ఏదైనా ప్రాసెసర్ ప్రధానం. డ్యుయర్ కోర్ ప్రాసెసర్‌తో ముందుకొచ్చింది మైక్రోమ్యాక్స్ తయారు చేసిన A100 Superfone Canvas. ప్రపంచంలోనే తొలిసారి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన డ్యుయల్‌కోర్ ప్రాసెసర్ మొబైల్‌గా టెక్ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. 5 అంగుళాల తాకేతెరతో దీన్ని రూపొందించారు. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.0, 1Ghz డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ కెమెరా, లెడ్ ఫ్లాష్, వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో వీజీఏ కెమెరా, 5 గంటల బ్యాటరీ బ్యాక్అప్‌తో పని చేస్తుంది. బరువు 168 గ్రాములు. ధరెంతో తెలుసా? రూ.9,999. .www.micromaxsuperfone.com/products/A100.html

 

ప్రొజెక్టర్ ఫోన్
శ్యామ్‌సంగ్ కంపెనీ తొలిసారి ప్రొజెక్టర్‌తో కూడిన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Samsung Galaxy Beam. LED ప్రొజెక్టర్‌తో దీన్ని రూపొందించారు. 640X360 పిక్సల్ రిజల్యుషన్‌తో వీడియోలను ప్లే చేయవచ్చు. సుమారు 50 అంగుళాల దూరం నుంచి కూడా ఇమేజ్‌లను ప్రొజెక్ట్ చేయవచ్చు. 4 అంగుళాల తాకేతెరతో మొబైల్‌ని తయారు చేశారు. ఆండ్రాయిడ్ 2.3 ఓఎస్, 1Ghz డ్యుయల్‌కోర్ ప్రాసెసర్, 768ఎంబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వై-ఫై, బ్లూటూత్, త్రీజీ సౌకర్యాలున్నాయి. వెనక భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా, ముందు 1.3 మెగాపిక్సల్ కెమెరాల్ని వాడారు. ఒక్కసారి ఛార్జ్ చేసి ప్రొజెక్టర్‌ని మూడు గంటలు వాడుకోవచ్చు. http://goo.gl/yxMrg

 

'బీట్' అదుర్స్!
కనిపించేది బ్లూటూత్ హెడ్‌సెట్. పేరు BlackBeat Go. కేవలం 13 గ్రాముల బరువుతో స్మార్ట్‌గా తయారు చేశారు. బ్లూటూత్‌తో మొబైల్, ట్యాబ్లెట్‌కి అనుసంధానం అయ్యి సౌకర్యంగా వాడుకోవచ్చు. హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన 'ఇన్‌లైన్ కంట్రోల్స్'తో కాల్స్‌ని Accept/Reject చేయవచ్చు. వాల్యూమ్‌ని కంట్రోల్ చేయవచ్చు కూడా. ప్రత్యేక 'ఇయర్‌టిప్స్'తో హెడ్‌సెట్‌ని మరింత సౌకర్యంగా చెవులకు పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4.5 గంటలు పని చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఉచిత అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని హెడ్‌సెట్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. www.plantronics.com/ in/product/backbeat-go

 

విండోస్ ఫోన్
శ్యామ్‌సంగ్ కొత్తగా విండోస్ మొబైల్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Samsung Omnia M. నాలుగు అంగుళాల తాకేతెరని Super Amoled డిస్‌ప్లేతో తయారు చేశారు. 1 Ghz ప్రాసెసర్ వాడారు. ర్యామ్ 384 ఎంబీ. ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ 4జీబీ. త్రీజీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 5 మెగాపిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, లెడ్ ఫ్లాష్ ఇతర సదుపాయాలు. ధర సుమారు రూ. 16,400. http://goo.gl/qajR2