Top Story

దేశంలోని విద్యాసంస్థల జాతీయ ర్యాంకులు

* అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్‌సీ
* విద్యాసంస్థల జాతీయ ర్యాంకుల విడుదల
* ర్యాంకులతో విద్యార్థులకు అవగాహన: స్మృతిఇరానీ

దిల్లీ: దేశంలో ఉత్తమ విద్యాసంస్థలకు కేటాయించిన ర్యాంకుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ) 91.81 పాయింట్లతో దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. సాంకేతిక విద్యాసంస్థల్లో మద్రాస్‌ ఐఐటీ (89.41 పాయింట్లు), వాణిజ్య విద్యలో బెంగళూరు ఐఐఎం (93.04 పాయింట్లు) అగ్రపీఠాన్ని అధిరోహించాయి. ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల విభాగంలో మొత్తం పది స్థానాలనూ ఐఐటీలే ఆక్రమించాయి.



Stories

ర్యాంకింగ్‌ ఇలా...

* 5 కొలమానాలతో వడపోసిన కేంద్రం
విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ప్రకటించేందుకు కేంద్రం ఐదు కొలమానాలను ప్రామాణికంగా తీసుకుంది. వాటి ఆధారంగానే ర్యాంకులను ప్రకటించింది. అవేమిటంటే..

వ‌ర్సిటీ ర్యాంకింగ్‌ల్లో తెలగు రాష్ట్రాలెక్కడ?

* టాప్‌ 10లో రెండింటికే చోటు
* టాప్‌ 100 వర్సిటీల్లో ఆరింటికి స్థానం

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ కళాశాలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకు నాలుగుతో ప్రారంభమైంది. విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే నాలుగో ర్యాంకు సాధించింది.

ప్రపంచ ర్యాంకులకు ఎంతో దూరం!

మన దేశంలో ఎంతో పేరున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు ప్రపంచంలో వందలోపు ర్యాంకులు దక్కడం లేదు. ఏటా కొన్ని సంస్థలు ప్రకటించే ర్యాంకుల్లో ఏ ఒక్కటీ స్థానం సాధించడంలేదు. ఆసియాలో మాత్రం వందలోపు స్థానాల్లో నిలుస్తున్నాయి. సాధారణంగా ర్యాంకులిచ్చే సంస్థలు సంస్థలు అమెరికా లాంటి అగ్ర దేశాల పరిస్థితులను బట్టి కొలమానాలను నిర్ణయిస్తాయి.

ర్యాంకింగ్‌లో పాల్గొనని విద్యాసంస్థలపై అనుమానాలు

* డొల్లతనం బయటపడుతుందని యాజమాన్యాల భావన
ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీ పెంచేందుకు, వాటి పనితీరు ఎలా ఉందో అందరికీ తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ర్యాంకుల యజ్ఞం తొలి దశ దాటింది.