CIVILS - Toppers

 

2017 సివిల్స్ విజేత‌ల మ‌నోగ‌తాలు

అవగాహన.. సాధనలే గెలుపు సూత్రాలు!
అనుదీప్‌...
సివిల్స్‌ టాపర్‌! యువతకు సరికొత్త స్ఫూర్తి!!
ఇతడికి వైఫల్యాలు మూడుసార్లు ఎదురయ్యాయి. నిరాశ పడలేదు. పట్టుదల కనబరిచాడు. అనుకున్న లక్ష్యం కోసం ఏళ్ల తరబడి నిరంతరం శ్రమించాడు. ఐఆర్‌ఎస్‌ ఉద్యోగ శిక్షణ సమయంలో ఆయుధ‘గురి’లో చూపిన పట్టు మరింత బలాన్ని ప్రోది చేసింది. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తీవ్రమైన పోటీలో అగ్రస్థానంలో నిలిచాడు; గెలిచాడు!
‘అధ్యయనం ఎంత ముఖ్యమో పునశ్చరణ అంతకన్నా ముఖ్యం. ఇది ఎంత బాగా చేస్తే అంతమంచి ప్రతిభను పట్టుకోవచ్చు. ఈ విషయం ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.’
‘చెట్టు కనిపిస్తోందా..?’ ‘లేదు’. ‘కొమ్మ?’ ‘లేదు’.
‘పిట్ట కనిపిస్తోందా?’ ‘లేదు’. ‘పిట్ట కన్ను?’ ‘కనిపిస్తోంది!’
భారతంలో అర్జునుడి సునిశిత లక్ష్యశుద్ధి ఇది! అత్యున్నత పోటీపరీక్ష అయిన సివిల్‌ సర్వీసెస్‌లో నెగ్గటానికి కావలసిందిదే! తన లక్ష్యంపై అలాగే గురిపెట్టాడు అనుదీప్‌. ఐఏఎస్‌ను అత్యున్నత ప్రతిభతో సాధించగలిగాడు! సివిల్స్‌-2017లో జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన తీరు.. సన్నద్ధతలో చూపిన జోరు... విజయ రహస్యాలను ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు... అతడి మాటల్లోనే! Read More...


 

గ‌త విజేత‌ల మ‌నోగ‌తాలు

 

2016 సివిల్స్ విజేత‌ల మ‌నోగ‌తాలు

తెలుగుతో తెలివిగా..
* సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ
ఈనాడు - హైదరాబాద్‌: తెలుగు మాధ్యమంలో పరీక్ష.. ఐచ్ఛిక సబ్జెక్టు తెలుగు సాహిత్యం.. ముఖాముఖి కూడా తెలుగులోనే.. దూరవిద్యలో డిగ్రీ పూర్తి.. ఎక్కడా శిక్షణ లేదు.. సివిల్‌ సర్వీసెస్‌ మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ ప్రత్యేకతలివి. సివిల్‌ సర్వీస్‌ చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకోవడంతోపాటు తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్‌లో విజయం సాధించడానికి అద్భుతమైన తెలివితేటలేమీ అవసరం లేదని.. కఠోర శ్రమ, చుట్టూ సంభవించే పరిణామాలను భిన్న కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం ముఖ్యమని గోపాలకృష్ణ చెబుతున్నారు. Read More...


 

2015 సివిల్స్ విజేత‌ల మ‌నోగ‌తాలు

2015 సివిల్స్ ఫ‌లితాలను యూపీఎస్సీ 2016 మే 10న విడుదల చేసింది. పరీక్షల్లో తెలుగు అభ్యర్థులు మెరిశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని పలు ప్రాంతాల నుంచి సివిల్స్‌ పరీక్షలు రాసి విజయం సాధించిన అభ్యర్థుల వివరాలివీ..


సమయం లేక ఏడ్చేశా..!
హైదరాబాద్‌లోని కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌. కీర్తి చేకూరికి ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఇది రెండో రోజు. రాత్రి నుంచే తనలో ఆందోళన. ఉదయాన్నే సివిల్స్‌ ఫలితాలు కదా.. అని! పగటిపూట మొబైల్‌ వాడకం పనికి చేటని.. దాన్ని మూగనోము పట్టించింది. విరామం వేళ చూస్తే.. లెక్కలేనన్ని వాట్స్‌యాప్‌ నోటిఫికేషన్‌లు. ‘కంగ్రాట్యులేషన్స్‌ సివిల్స్‌లో 14వ ర్యాంకు నీకు..!!’ అని.... Read More...


పత్రికా వ్యాసాల చర్చలు పట్టు పెంచాయి
పరిజ్ఞానానికి పదును పెట్టుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, 65వ ర్యాంకుతో ఆశించిన ఐఏఎస్‌ను మూడో ప్రయత్నంలో సాధించింది వల్లూరు క్రాంతి. కర్నూలుకు చెందిన ఈమె తన సివిల్స్‌ ప్రస్థాన విశేషాలు తన మాటల్లోనే.... Read More...


విజయవాడ యువకుడికి 84వ ర్యాంకు
విజయవాడకు చెందిన చిట్టూరి రామకృష్ణ సివిల్స్‌ ఫలితాల్లో 84వ ర్యాంకు సాధించారు. 2013లో 257 ర్యాంకును సాధించిన రామకృష్ణ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకుని పశ్చిమ బెంగాల్‌లో విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ... Read More...


ఆటబొమ్మల కంటే పుస్తకాలే ఎక్కువ కొన్నారు!
తన రెండో ప్రయత్నంలో 101 ర్యాంకు సాధించిన వి. విద్యాసాగర్‌ నాయుడు విజయం వెనక మూడేళ్ళ తీవ్రమైన కృషి ఉంది. సుదీర్ఘమైన అధ్యయనం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహకారం... ఇవన్నీ ఉన్నాయి. ఆ విజయగాథను అతడే స్వయంగా చెపుతున్నాడు... Read More...

వూడ్చే పనికీ అర్హత లేదన్నారు!


- ఇరా సింఘాల్‌, 1వ ర్యాంకర్‌
గది నం.209, వంశధార వసతి గృహం, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణం, జూబ్లీహిల్స్‌. హైదరాబాద్‌లోని ఈ చిరునామాపైనే ఇప్పుడు జాతీయ మీడియా దృష్టంతా! ఆ సందడంతా ఇరా సింఘాల్‌ కోసమేనని మీకప్పటికే అర్థమైపోయుంటుంది! ఇరా చూడటానికి పొట్టిమనిషే.. కానీ తను అందుకున్న విజయం ఎంతోమందికి అందనంత ఎత్తైంది!! సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి వికలాంగురాలిగా తన పేరు ఇక చరిత్రలో నిలిచిపోతుంది. అందుకోసం తను చేసిన ప్రయాణం కూడా ఓ చరిత్రే! ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే... Read More...

తల్లిదండ్రుల దగ్గరే మౌఖిక పరీక్షకు సన్నద్ధం


- సాకేత రాజా, 14వ ర్యాంకర్‌
తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంది. నా అంచనా ప్రకారం 215 అటుఇటుగా స్థానం వస్తుందని ఆశించా. కష్టానికి అదృష్టంతోడై 14వ ర్యాంకు వచ్చింది. అమ్మ ఛాయారతన్‌ (విశ్రాంత ఐఏఎస్‌), నాన్న రతన్‌ (విశ్రాంత ఐపీఎస్‌)ల వద్ద నమూనా మౌఖిక పరీక్షలతో సిద్ధపడ్డా. Read More...

నమ్మకం, ఓర్పుతో లక్ష్య సాధన


- సాయికాంత్‌వర్మ, 18వ ర్యాంకర్‌
నమ్మకం, ఓపిక ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అన్నయ్య శశికాంత్‌వర్మను ఆదర్శంగా తీసుకుని, ఆయన గైడెన్స్‌లో సివిల్స్‌కు సిద్ధపడ్డా. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. Read More...

పటిష్ఠ ప్రణాళిక... సమర్థ ఆచరణతో విజయం


- గిరిప్ప లక్ష్మికాంత్‌రెడ్డి, 21వ ర్యాంకర్‌
గ్రామీణుల సమస్యలపై అవగాహన ఉన్న నాకు వారికి సేవచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. మాది కర్ణాటకలోని రాయచూరు పట్టణం సమీపాన గుంజెహెళ్లే గ్రామం. నాన్న శరత్‌చంద్రరెడ్డి, అమ్మ వరలక్ష్మి వ్యవసాయదారులు. Read More...

సివిల్స్‌లో మెరిసిన కృష్ణా జిల్లా కుర్రాడు


* జాతీయ స్థాయిలో 30వ ర్యాంకు
* నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపిక
* స్వస్థలం గుళ్లపూడిలో ఆనందోత్సాహం

గంపలగూడెం : కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడికి చెందిన పోట్రు గౌతమ్‌ ప్రతిష్టాత్మక సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 30వ ర్యాంకు సాధించాడు. శనివారం(జులై 4న) ప్రకటించిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2015 ఫలితాల ద్వారా గౌతమ్‌ ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. Read More...

చదువుకు అధ్యయనం విశ్లేషణ తోడవ్వాలి


- మహమ్మద్‌ రోషన్‌, 44వ ర్యాంకర్‌
మాది హైదరాబాద్‌లోని విజయనగర్‌కాలనీ. ఆంథ్రోపాలజీ ఐచ్ఛికాంశంగా సివిల్స్‌ రాశాను. దేవుడు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు.. ఆంథ్రోపాలజీ నిపుణుడు డాక్టర్‌ లక్ష్మయ్య మార్గదర్శకం ర్యాంకు సాధనకు తోడ్పడ్డాయి. Read More...

సృజనాత్మకంగా పనిచేస్తా


- రాజగోపాల్‌ సుంకర, 49వ ర్యాంకర్‌
సివిల్‌ సర్వీసెస్‌లో పనిచేయాలన్నది నా జీవిత లక్ష్యం. చదువుతోపాటు సంగీతం, క్రీడల్లోనూ పాల్గొనేవాడిని. పదోతరగతి వరకు హైదరాబాద్‌లోని గీతాంజలి పాఠశాలలో చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అగ్రికల్చర్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌లో డ్యూయల్‌ డిగ్రీ చదవడం నా జీవితంలో గొప్ప మలుపు. Read More...

దిల్లీలో ఏడాదిపాటు కష్టపడ్డా


- పాటి క్రాంతికుమార్‌, 50వ ర్యాంకర్‌
మాది వరంగల్‌ జిల్లా గిర్మాజీపేట. నాన్న సురేందర్‌ మహారాష్ట్రలో నవోదయ పాఠశాల ప్రధానాచార్యులు. అమ్మ జ్యోతి గృహణి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఐదోతరగతి వరకు, ఏలూరు నవోదయలో 7 వరకు, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 10 వరకు చదువుకున్నా. పుణెలో బీకాం, సీఏ (ఇంటర్మీడియెట్‌) పూర్తిచేశా. Read More...

పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధ్యమే


- మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ, 66వ ర్యాంకర్‌
కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌ రావడం ఆనందంగా ఉంది. మాది గుంటూరు జిల్లా, చిలకలూరిపేట. నాన్న శివానందకుమార్‌, అమ్మ భువనేశ్వరిల ఆశీస్సులు ప్రోత్సహించాయి. Read More...

ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో చదివా


- పింగళి సతీష్‌రెడ్డి, 97వ ర్యాంకర్‌
మాది వరంగల్‌ జిల్లా, హన్మకొండలోని అడ్వకేట్స్‌కాలనీ. నాన్న సీతారాంరెడ్డి న్యాయవాది. అమ్మ విజయలక్ష్మి గృహిణి. ఎన్‌ఐటీ వరంగల్‌లో 2012లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. Read More...

సానుకూల దృక్పథం.. స్పష్టమైన ల‌క్ష్యం.. విజ‌య సూత్రం!


సివిల్స్‌-2013 ఫ‌స్ట్ ర్యాంక‌ర్ గౌర‌వ్ అగ‌ర్వాల్‌
వ్యక్తిగ‌త ఆస‌క్తి, లక్ష్యంపై స్పష్టత‌, ప్రణాళికాబ‌ద్ధమైన స‌న్నద్ధత‌...వీటిద్వారా అనుకున్న ల‌క్ష్యాన్నిచేరుకోవ‌డం సాధ్యమ‌వుతుంద‌ని 2013 సివిల్స్ ఫ‌లితాల్లో అఖిల భార‌త స్థాయిలో ప్రథ‌మ స్థానంలో నిలిచిన గౌర‌వ్ అగ‌ర్వాల్ అన్నారు. Read More...

చ‌దివిన పుస్తకాలే మ‌ళ్లీ మ‌ళ్లీ చ‌దివా...!


* సివిల్స్ 2013 టాప‌ర్ శుభ‌మ్‌ చౌదురి
ప‌ద‌కొండో త‌ర‌గ‌తిలో డెవ‌ల‌ప్‌మెంట‌ల్ ఎక‌నామిక్స్ చ‌దువుతున్నప్పుడు భ‌విష్యత్తులో దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాల‌ని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి ఎమ్మే ఎక‌నామిక్స్ చ‌దివి క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ ద్వారా బ్యాంకులో ఉన్నతోద్యోగానికి ఎంపికైంది. ఏడాదిపాటు అందులో ప‌ని చేసిన త‌ర్వాత త‌న ల‌క్ష్యానికి, చేస్తున్నదానికి పొంత‌న లేద‌ని ఉద్యోగం మానేసింది. త‌ను చ‌దివిన దిల్లీ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లోనే అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వహిస్తూ సివిల్స్‌కు స‌న్నద్ధమైంది. Read More...

నాలుగో సారి... గెలుపు స్వారీ!


సుదీర్ఘ పోరాట పటిమకు మారుపేరు సివిల్స్‌! అభ్యర్థుల సంకల్ప బలాన్నీ, సత్తానూ ఇది నిలువెల్లా పరీక్షిస్తుంది. అందుకే సివిల్స్‌ విజయానికి ఎనలేని ప్రాముఖ్యం! 30వ ర్యాంకు సాధించిన కృత్తిక జ్యోత్స్న ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాల సివిల్స్‌ 2014 విజేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. మూడు వరస ప్రయత్నాల్లో ఓటమి ఎదురైనా చివరకు తానెలా లక్ష్యాన్ని చేరుకోగలిగిందీ ఆమె వివరించారు. స్ఫూర్తిదాయకమైన ఆ విజయగాథ ఆమె మాటల్లోనే...! Read More...

ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడగలేదు!


'నువ్వేమీ చేయలేవ్‌..' అంటూ ఎంతోమంది నిన్ను వెనక్కిలాగొచ్చు. వాళ్ల వైపు తిరిగి ఒకే మాట చెప్పు 'నన్ను చూస్తూ ఉండండి. సాధించి చూపిస్తా!' అని.- తెలుగమ్మాయి నేలపాటి బెనో జెసిఫ్‌ ఫేస్‌బుక్‌ పేజీ తెరవగానే మనకు కనిపించే తొలి వాక్యం ఇది! పుట్టుకతో చూపులేకున్నా సివిల్స్‌ 2014లో 343వ ర్యాంకు సాధించడం చూస్తే, ఆ వాక్యాన్ని ఎంతగా ఆచరణలో పెట్టిందో అర్థమవుతుంది. ఈ సివిల్స్‌ విజయం వెనకున్న స్ఫూర్తి ఏమిటో తన మాటల్లోనే... Read More...

అవకరాన్ని జయించి ఐఏఎస్‌!


మూడు లక్షల ఇరవై నాలుగువేల మంది రాసిన సివిల్స్‌ ఫలితాలొచ్చాయి. 1122 మంది కలలు నెరవేరాయి. ఇప్పుడు వాళ్లంతా హీరోలు. వాళ్లలో ఒరిస్సా అమ్మాయి సారికా జైన్‌ మరీ ప్రత్యేకం. అంతా ప్రతిభతో మెరిస్తే తను పోలియాతోనూ పోరాడింది. ఆమెది యువత ఆదరించాల్సిన స్ఫూర్తిగాథ... Read More...


* సహనం... శ్రద్ధ... శ్రమ...! విజయానికి మార్గాలు
* సివిల్స్ 2012 టాపర్ ప్రిన్స్ ధావన్ (పురుషుల్లో మొదటి ర్యాంకర్, మొత్తం మీద 3వ స్థానం)

జీవితానికో లక్ష్యం ఉండాలని, అనుకున్నది సాధించడానికి అలుపెరుగని శ్రమతోపాటు ఓపిక కూడా అవసరమని సివిల్స్ 2011 -12 టాపర్ ప్రిన్స్ ధావన్ అన్నారు. Read More...
స్వదేశంలోనే సేవలు చేయాలని..
* 20 వ ర్యాంకర్ మల్లికార్జున (కడప జిల్లా)
మాది కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లె. తల్లిదండ్రులు రాములమ్మ, నాగమల్లయ్య. మేము ముగ్గురం. అన్న రామ్మూర్తి, చెల్లెలు మల్లీశ్వరి. మాకు రెండెకరాల పొలం ఉంది. నాన్ననిత్యం కడప నగరానికి సైకిల్‌పై వెళ్లి ఇంటింటికీ పాలుపోసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పరిస్థితులు. Read More...
నాన్న కష్టాన్ని తలచుకుని కసిగా చదివా
* 53వ ర్యాంకర్ మాలపాటి పవన్‌కుమార్
నా చదువు కోసం నాన్న కష్టపడిన తీరు తలచుకుంటే ఏడుపు వస్తుంది. ఆయన కష్టం నిత్యం కళ్లల్లో మెదులుతూ ఉంది. అందుకే కసితో చదివి సివిల్స్ సాధించా. నాన్న తన కష్టాన్ని నా భవిష్యత్తు కోసం ధారపోశారు. అన్న, అక్క, బావ కృషి, ప్రోత్సాహాన్ని జీవితంలో మరిచిపోలేను సివిల్స్‌లో విజయం సాధించిన మాలపాటి పవన్‌కుమార్ అన్న మాటలవి. Read More...

Back
Competitive Exams