UPSC - CIVILS 2016

 

సిక్కోలు యువకునికి సివిల్స్‌లో మూడో ర్యాంకు

శ్రీకాకుళంలోని మారుమూల గ్రామానికి చెందిన యువకుడు అద్భుతమైన ఘనత సాధించారు. ఎన్నో కష్టాలు, హేళనను దిగమింగుతూ.. ఒక్కో అడుగు ముందుకేస్తూ.. సివిల్స్‌ ఫలితాల్లో మూడోర్యాంకు సాధించారు. తెలుగు మాధ్యమంలోనే రోణంకి గోపాలకృష్ణ ఈ ఘనత సొంతం చేసుకున్నారు. వీధిబడిలో విద్యనభ్యసించిన గోపాలకృష్ణ కేవలం డిగ్రీతోనే ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆ డిగ్రీని కూడా ఆంధ్రావిశ్వవిద్యాలయం నుంచి దూర విద్యలోనే చేయడం మరో విశేషం...

Read More...

UPSC - CIVILS 2015

 

సివిల్స్‌ రాయాలని అప్పుడే నిర్ణయించుకున్నా!

ఓ వైపు ఐఆర్‌ఎస్‌ శిక్షణ, మరోవైపు మూడోసారి సివిల్స్‌ కోసం సిద్ధం కావడం.. అక్షరాలా రెండు పడవల్లో కాలుపెట్టినట్టే అనిపించింది నాకు గత ఏడాదంతా!! సమయపాలన పెద్ద సవాలుగా నిలిచినా పంతం పట్టి తయారయ్యాను. నిజానికి ఆ పట్టుదల అమ్మ నుంచే నాకు వచ్చింది. బంధువులంతా ‘ఆడపిల్లలకు చదువెందుకు.. పెళ్లి చేసేయొచ్చు కదా!’ అంటుంటే అమ్మ నేను బాగా చదువుకోవాలనే కోరుకుంది. ఆ తపనే నాలో కసిపెంచింది. చక్కటి ర్యాంకు అందుకోవడం వెనక ఉన్నది ఆ పట్టుదలే. దాని ఫలితమే ఈరోజు నా పద్నాలుగో ర్యాంకు...

Read More...

UPSC - IES TOPPER

 

మరీ కష్టమేమీ కాదు...ఐఈఎస్‌ పరీక్ష

దేశవ్యాప్త పోటీలో మేటి ర్యాంకు...! దానికెంత కృషీ, దీక్షా, ప్రణాళికా ఉండాలి! ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) పరీక్షలో తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయి టాపర్‌గా నిలిచాడు షేక్‌ సిద్ధిక్‌ హుస్సేన్‌. ఈ ఐఐటియన్‌ తన స్ఫూర్తిదాయక విజయం వెనక విశేషాలను ‘చదువు’తో పంచుకున్నాడు. అవన్నీ తన మాటల్లోనే...!

Read More...

UPSC - CIVILS 2015

 

వూడ్చే పనికీ అర్హత లేదన్నారు!

* ఇరా సింఘాల్‌, 1వ ర్యాంకర్‌
గది నం.209, వంశధార వసతి గృహం, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణం, జూబ్లీహిల్స్‌. హైదరాబాద్‌లోని ఈ చిరునామాపైనే ఇప్పుడు జాతీయ మీడియా దృష్టంతా! ఆ సందడంతా ఇరా సింఘాల్‌ కోసమేనని మీకప్పటికే అర్థమైపోయుంటుంది! ఇరా చూడటానికి పొట్టిమనిషే.. కానీ తను అందుకున్న విజయం ఎంతోమందికి అందనంత ఎత్తైంది!! సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి వికలాంగురాలిగా తన పేరు ఇక చరిత్రలో నిలిచిపోతుంది. అందుకోసం తను చేసిన ప్రయాణం కూడా ఓ చరిత్రే! ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...

Read More...

సివిల్స్‌లో మెరిసిన కృష్ణా జిల్లా కుర్రాడు

* జాతీయ స్థాయిలో 30వ ర్యాంకు
* నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపిక
* స్వస్థలం గుళ్లపూడిలో ఆనందోత్సాహం
గంపలగూడెం : కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడికి చెందిన పోట్రు గౌతమ్‌ ప్రతిష్టాత్మక సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 30వ ర్యాంకు సాధించాడు...

Read More...

UPSC - IFS 2014

 

'ప్రాథమిక ' మార్కులే ప్రధానం

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ సాధనలోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అఖిలభారత స్థాయిలో 21వ ర్యాంకు సాధించిన రంగనాథ రామకృష్ణ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే... మొదటి ప్రయత్నంలోనే ఈ సర్వీస్‌ సాధించటం విశేషం. తన విజయ ప్రస్థానం గురించి అతడి మాటల్లోనే...

Read More...

CIVILS 2014

 

నాలుగో సారి... గెలుపు స్వారీ!

సుదీర్ఘ పోరాట పటిమకు మారుపేరు సివిల్స్‌! అభ్యర్థుల సంకల్ప బలాన్నీ, సత్తానూ ఇది నిలువెల్లా పరీక్షిస్తుంది. అందుకే సివిల్స్‌ విజయానికి ఎనలేని ప్రాముఖ్యం! 30వ ర్యాంకు సాధించిన కృత్తిక జ్యోత్స్న ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాల సివిల్స్‌ 2014 విజేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. మూడు వరస ప్రయత్నాల్లో ఓటమి ఎదురైనా చివరకు తానెలా లక్ష్యాన్ని చేరుకోగలిగిందీ ఆమె వివరించారు. స్ఫూర్తిదాయకమైన ఆ విజయగాథ ఆమె మాటల్లోనే...!

Read More...

ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడగలేదు!

'నువ్వేమీ చేయలేవ్‌..' అంటూ ఎంతోమంది నిన్ను వెనక్కిలాగొచ్చు. వాళ్ల వైపు తిరిగి ఒకే మాట చెప్పు 'నన్ను చూస్తూ ఉండండి. సాధించి చూపిస్తా!' అని.- తెలుగమ్మాయి నేలపాటి బెనో జెసిఫ్‌ ఫేస్‌బుక్‌ పేజీ తెరవగానే మనకు కనిపించే తొలి వాక్యం ఇది! పుట్టుకతో చూపులేకున్నా సివిల్స్‌ 2014లో 343వ ర్యాంకు సాధించడం చూస్తే, ఆ వాక్యాన్ని ఎంతగా ఆచరణలో పెట్టిందో అర్థమవుతుంది. ఈ సివిల్స్‌ విజయం వెనకున్న స్ఫూర్తి ఏమిటో తన మాటల్లోనే....

Read More...

అవకరాన్ని జయించి ఐఏఎస్‌!

మూడు లక్షల ఇరవై నాలుగువేల మంది రాసిన సివిల్స్‌ ఫలితాలొచ్చాయి. 1122 మంది కలలు నెరవేరాయి. ఇప్పుడు వాళ్లంతా హీరోలు. వాళ్లలో ఒరిస్సా అమ్మాయి సారికా జైన్‌ మరీ ప్రత్యేకం. అంతా ప్రతిభతో మెరిస్తే తను పోలియాతోనూ పోరాడింది. ఆమెది యువత ఆదరించాల్సిన స్ఫూర్తిగాథ....

Read More...

పాలిటెక్నిక్‌ లెక్చరర్‌

 

హరిత.. చదువుల్లో విజేత..

నిజామాబాద్ జిల్లా (భిక్కనూరు): ఓటమి విజయానికి తొలిమెట్టంటారు.. తొలి పరాజయానికి కుంగకుండా మరింత కసితో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారామే. ముందుగా జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగం 0.5 మార్కు తేడాతో చేజారింది. తర్వాత పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుని ఉద్యోగం సాధించారు. అంతకుముందే తెవివిలో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపడంతో తెవివి దక్షిణ ప్రాంగణంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు డాక్టర్‌ లక్కరాజు హరిత. ఆమె ఈ స్థాయికి చేరుకున్న ప్రస్థానం.. పడ్డ కష్టాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Read More...

VRO Toppers

గ్రూప్స్‌ సన్నద్ధత పనికొచ్చింది

మందడి శ్యామ్‌సుందర్‌రెడ్డి, చిల్పంకుంట్ల (నల్గొండ జిల్లా)
1. వీఆర్‌ఓ పరీక్షకు ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. దీన్నే లక్ష్యం చేసుకుని చదవలేదు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటలవరకూ- మళ్ళీ రాత్రి కాసేపు చదువుతూవచ్చాను. వీఆర్‌ఓ పరీక్ష కోసం నిజానికి ఎక్కువ సమయం చదవలేదనే చెప్పాలి.

Read More...

రేడియో విన్నా! పత్రికలు చదివా!!

ఎం. నరేంద్రరెడ్డి, మదనపల్లె (చిత్తూరు జిల్లా)
1. నాది ఎంపీసీ కాబట్టి గణితంతో సంబంధమున్న నలబై మార్కుల భాగాన్ని వారంలో పూర్తి చేసుకున్నాను. దాంతో తేలికయింది. మోడల్‌ పేపర్‌ ఎలా ఉందో పరిశీలించి తగినట్టుగా సమయం కేటాయించుకున్నాను. ప్రణాళికతో ప్రిపరేషన్లో ముందుకువెళ్ళాను.

Read More..

ఆ రెండు మార్కులే పట్టుదల పెంచాయి!
-సీతామహాలక్ష్మి
ఎక్కడ అడుగు వెనక్కి అడుగు పడుతుందో... అక్కడి నుంచే పైకి లేవాలి. ప్రతిభ చూపాలి. ప్రత్యేకత కనబరచాలి. విజయవాడకు చెందిన సీతామహాలక్ష్మి ఇటువంటి పట్టుదలనే కనబరిచింది. పదకొండు లక్షల మంది రాసిన వీఆర్‌వో పరీక్షల్లో 96 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంది. 'చదువుకీ, ప్రతిభకీ పేదరికం అడ్డు రాదు' అంటున్న ఆమెతో వసుంధర మాట్లాడింది.
                                              Read More..

 

UPSC - IFS Topper

సబ్జెక్టులపై అవగాహన బాగుండాలి

* ఐఎఫ్ఎస్ ట్రెయినీ (డెహ్రాడూన్) సంజీవరెడ్డి
ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: అనుకున్న రంగంలో ఎదగాలనే ఆకాంక్ష, అందుకు తగ్గ కృషి, పట్టుదలతో పరితపించిన ఆ యువకుడు.. లక్ష్యాన్ని సాధించాడు. ప్రభుత్వం రంగంలో అప్పటికే పెద్ద కొలువులో ఉన్నా దేశంలోనే అత్యుత్తమ సేవా రంగంలో పనిచేయాలనే ఆసక్తి. వెరసి.. ఆ ఉద్యోగిని ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)లో చేరేందుకు ప్రేరణనిచ్చాయి. ఫలితంగా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే.. క్రమశిక్షణతో కృషి చేసి విజయం సాధించాడు.

Read More...

చదివేటప్పుడు సబ్జెక్టు గురించే ఆలోచించాలి!

* ఐఎఫ్ఎస్ 12వ ర్యాంకర్ కొమ్మిశెట్టి మురళీధర్.
బీటెక్, ఎంటెక్ వంటి సాంకేతిక కోర్సులు చదివే చాలామంది అభ్యర్థుల ప్రస్తుత లక్ష్యం ఐటీ ఉద్యోగం, లక్షల్లో ఆదాయం సంపాదించడం. లేదంటే ప్రభుత్వ రంగంలో చేరడం. వీటన్నింటికీ భిన్నంగా ప్రజా సేవకు అవకాశం ఉన్న ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత రంగాల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో కృషిచేసి అనుకున్నది సాధించారు కొమ్మిశెట్టి మురళీధర్.

Read More..

APPSC Group - II Toppers

ఓపిక, పట్టుదల అవసరం
* గ్రూప్-2 ఫలితాల్లో మొదటి ర్యాంకర్ వెంకటేశ్వరరావు

కలల తీరానికి చేరువయ్యే మార్గంలో ఓ తప్పటడుగు పడినా కుంగిపోలేదు.లక్ష్యసాధనలో కోరుకున్న కుర్చీ దక్కకపోయినా దిగులు చెందలేదు. సహనం, పట్టుదలను ఆయుధాలుగా మలచుకుని గమ్యానికి చేరుకున్నారు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న వెంకటేశ్వరరావుతో 'న్యూస్‌టుడే' మాట్లాడింది.

Read More...

సమయ పాలన, స్వీయ ప్రేరణతోనే విజయం
* గ్రూప్-2 ఉమెన్ టాపర్: జయలక్ష్మీ పద్మజ
ప్రభుత్వం ఏప్రిల్ 21న ప్రకటించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మల్లిబోయిన పద్మ 491/500 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. గుంటూరులోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో ఎం.ఇ.సి.తో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన పద్మ తన విజయాన్ని వివరించింది.

Read More...

నిరుత్సాహ పడకూడదు, పట్టుదలతో చదవాలి
* గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్: మునగల రాజ్యలక్ష్మి
పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివిన వారికి విజయం సొంతం అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలకు తరచూ నిరుత్సాహ పూరిత వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించాలనే తపనతో కృషిచేసిన వారికి విజయం తలొంచక తప్పదు. ఈ కోవకు చెందిన వారే కోసూరు రాజ్యలక్ష్మి.

Read More...

Back
Competitive Exams