Toppers

TS EAMCET - 2019

బట్టీ వ్యర్థం.. వేగం ముఖ్యం: రవిశ్రీతేజ
ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే అభినందిస్తాం. రెండు రాష్ట్రాల ఎంసెట్‌లలోనూ టాప్‌ ర్యాంకు వస్తే ఇంకా మెచ్చుకుంటాం. మరి రెండింటిలోనూ ప్రథమ ర్యాంకు తెచ్చుకుంటే? ఆ పనే చేసి ఆశ్చర్యపరిచాడు తాడేపల్లిగూడెం విద్యార్థి కురిశేటి రవిశ్రీతేజ. బట్టీ పట్టే విధానం ఎంసెట్‌లాంటి ఏ పోటీ పరీక్షకూ సరిపోదంటున్న ఇతడు తనకీ ఘనత ఎలా సాధ్యమైందో, అందుకు తను చేసిన కృషి ఏమిటో వివరిస్తున్నాడు..!

Read More...

NEET - 2019

సత్తా చాటారు
వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి 57,798 మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. వీరిలో 55,200 మంది పరీక్ష రాయగా 39,039 మంది (70.72%) అర్హత సాధించారు. కిందటేడాది 72.55 మంది అర్హత సాధించారు. ఓపెన్‌ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. . దేశవ్యాప్తంగా తొలి 20 ర్యాంకుల్లో ఐదుగురు అమ్మాయిలు ఉంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం.
నీట్‌ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఖురేషి అస్రా 16వ ర్యాంకు సాధించారు. విశాఖపట్నానికి చెందిన పి.భానుశివతేజ 40వ ర్యాంకు, కడపకు చెందిన సోదం శ్రీనందన్‌రెడ్డి 42, నెల్లూరు జిల్లావాసులైన జి.కృష్ణవంశీ 62, హర్షిత్‌ చౌదరికి 64వ ర్యాంకులు దక్కించుకున్నారు. విశాఖ నగరానికి చెందిన శ్రీ శ్రేయుకి 78వ ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో తొలి 50 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు రాగా ఇందులో రెండు ర్యాంకులు కడప జిల్లా విద్యార్థులే కైవసం చేసుకున్నారు.

Read More...

AP EAMCET - 2019

ఐఏఎస్‌గా సేవలందిస్తా - కురిశేటి రవిశ్రీతేజ, ప్రథమ ర్యాంకర్‌, తాడేపల్లిగూడెం
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే ర్యాంకును సులభంగా పొందవచ్చు. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా వినటంతోపాటు రోజుకు పది గంటలు చదువుకునేవాణ్ని. కష్టపడి కాకుండా ఇష్టంతో చదవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన గురి ఎప్పుడూ లక్ష్యంపైనే ఉండాలి. మా అమ్మానాన్నలు గీతాకుమారి, ఉమామహేశ్వరగుప్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రథమ ర్యాంకు సాధించా. ఐఏఎస్‌గా నిరుపేదలకు సేవ చేయాలన్నదే నా జీవితాశయం.

న్యూరోసర్జన్‌గా సేవలందించాలనేది నా లక్ష్యం. -ఎస్‌.సాయిస్వాతి, 1వ ర్యాంకు, తిరుపతి
ఏపీ ఎంసెట్‌లో 154 మార్కులు వచ్చాయి. 97.23 కంబైన్డ్‌ స్కోరు సాధించా. ఎంసెట్‌తో పాటు నీట్‌ రాశా. నీట్‌లో ర్యాంకు సాధించి డాక్టర్‌ కావాలన్నదే నా ఆశయం. మా నాన్న సంతోష్‌కుమార్‌ ఎల్‌ఐసీలో అధికారి. అమ్మ ప్రశాంతి ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అమ్మానాన్న, అక్క నాగశృతి ప్రోత్సాహంతో ర్యాంకు సాధించా.

Read More...

CA-CPT - 2018 Toppers

సూటిగా రాస్తేనే ధాటిగా మార్కులు!
కామర్స్‌ కోర్సుల్లో అఖిల భారత స్థాయి ర్యాంకు సాధించటం సులువేమీ కాదు. సీఎంఏ ఫైనల్‌లో ఆలిండియా రెండో ర్యాంకుతో సత్తా చాటాడు ఆకర్ష్‌. లక్ష్యం ఏర్పరచుకున్నాక వెనుదిరగకూడదనీ, పరీక్షకు అనుగుణంగా తయారీ విధానాన్ని రూపొందించుకోవాలనీ అంటున్నాడు. ఆ విజయగాథ అతడి మాటల్లోనే...!

విజయ పథం
చదివిందేమో టెన్త్‌ వరకూ తెలుగు మాధ్యమంలో. ఇంటర్మీడియట్‌ (ఎంఈసీ)లో 935 మార్కులు. సీఏ- సీపీటీ, సీఏ ఇంటర్‌ల్లో అఖిల భారత ర్యాంకులు. ఇప్పుడు సీఏ ఫైనల్‌లోనూ అదే బాట పట్టాడు. లక్ష్యం ఏర్పరచుకోవాలేగానీ దాన్ని సాధించటం కష్టమేమీ కాదంటున్నాడు... సీఏ ఫైనల్‌ ఆలిండియా 9వ ర్యాంకర్‌ సాయి సుబ్రహ్మణ్యం. ఆ విజయ ప్రస్థానం తన మాటల్లోనే.

Read More...

AP EAMCET - 2018

టాప్‌-10లో ఏడుగురు ఇక్కడే చదివారు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. మే 2న‌ వెల్లడించిన ఫలితాల్లో టాప్‌-10లో ఏడు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. వీరిలో కొందరు ఏపీకి చెందిన వారు ఉన్నప్పటికీ తెలంగాణలో చదువుతూ ఇక్కడే ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో గట్టు మైత్రేయ 2వ ర్యాంకు, జి.వినాయక శ్రీవర్ధన్‌ 4వ, ఎస్‌.కె.వాజీద్‌ 5వ, బసవరాజు జిష్ణు 6వ, ఫణి వంశీనాథ్‌ 7వ, ఎం.విష్ణు మనోజ్ఞ 10వ, మెడిసిన్‌ విభాగంలో ఎం.జయసూర్య 6వ ర్యాంకులు సాధించారు.

Read More...

NEET - 2017

కఠోరదీక్షే విజయ సోపానం
‘లక్ష్యం పెద్దదైనప్పుడు అందుకు తగిన కృషి, పట్టుదల, కఠోర దీక్ష అవసరమవుతుంది.. దీన్నే దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక తయారు చేసుకుని విజయాన్ని సాధించా’నని నీట్‌లో జాతీయస్థాయి 12వ ర్యాంకు సాధించిన లక్కింశెట్టి అర్ణవ్‌ త్రినాథ్‌ తెలిపారు. తెలంగాణలో ప్రథమస్థానంలో నిలిచిన అతడి విజయ ప్రస్థానం గురించి తన మాటల్లోనే...

Read More...


TELANGANA EAMCET - 2017

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో తొలి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
* సివిల్స్‌కు ఎంపికై పేదలకు సేవ చేస్తా.. - గోరంట్ల జయంత్‌ హర్ష, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మొదటి ర్యాంకు
కృషి, పట్టుదలతోనే మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని పరీక్ష రాసిన రోజే అధ్యాకులకు, అమ్మానాన్నలకు చెప్పా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రాగా తెలంగాణ ఎంసెట్‌లో ప్రథమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.

Read More...

GATE - 2018

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌... గేట్‌! పరీక్ష చూస్తే...అఖిలభారత స్థాయి. దానికి సిద్ధమయ్యే తీరు మామూలుగా ఉంటే సరిపోతుందా? అది అత్యంత ఇష్టమైన వ్యాపకంగా సాగాలి. సమయం ఎలా ముగుస్తుందో కూడా తెలియనంతగా సాధనలో మునిగిపోవాలి. అలా చేశాడు కాబట్టే భువన్‌చంద్ర ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. గేట్‌-2018 ఫలితాల్లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ప్రథమ ర్యాంకర్‌గా నిలిచిన ఈ విద్యార్థి తన విజయరహస్యాలు ఇలా చెపుతున్నాడు...

Read More...

CA-CPT

ప్రత్యేకత చూపించాలనుకున్నపుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే.. గెలుపు సాధ్యం. దృఢసంకల్పంతో కృషి చేస్తే మార్గం సుగమం అవుతుందని నిరూపించింది శ్రీవల్లి. ఇటీవల వెలువడిన సీపీ-ఐపీసీసీ ఫలితాల్లో అఖిలభారత స్థాయి 12వ ర్యాంకును సాధించిందీమె!
శ్రీవల్లి స్వస్థలం హైదరాబాద్‌. అమ్మ సత్య నాగవేణి. నాన్న భాస్కర్‌రెడ్డి. ఆయన అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను ఉన్నత స్థానంలో..

Read More...

CA-CPT

ఇటీవలే విడుదలైన సీఏ-సీపీటీ ఫలితాల్లో 200కు 195 మార్కులు సాధించి అఖిలభారత స్థాయిలో అత్యుత్తమంగా నిలిచాడు హేమంత్‌ కుమార్‌. లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసి సీఏ-సీపీటీలో అత్యధిక మార్కులతోపాటు జాతీయస్థాయిలో మెరిశాడు. తన విజయ ప్రస్థానం గురించి ‘చదువు’తో పంచుకున్న విశేషాలు... అతడి మాటల్లోనే!
మాది ఒడిశాలోని పల్లెటూరు. మా నాన్న నీలకంఠరావు, అమ్మ శ్రీలక్ష్మి.చిన్న చిల్లరకొట్టుతో వచ్చిన ఆదాయంతో నన్ను చదివించారు.

Read More...

CAT

తొలి యత్నంలోనే క్యాట్‌ నెగ్గేయొచ్చు!
జాతీయస్థాయిలో జరిగే మేనేజ్‌మెంట్‌ ప్రవేశపరీక్ష- క్యాట్‌లో మొదటి ప్రయత్నంలోనే మంచి పర్సంటైల్‌ సాధించాడు తెలుగు విద్యార్థి సాయికృష్ణ. ఐఐటీ నేపథ్యమున్న ఈ యువకుడు ఐఐఎంలో చదవాలనే ఆకాంక్షను నెరవేర్చుకోబోతున్నాడు. క్యాట్‌లో తన విజయానికి ఏ అంశాలు దోహదపడ్డాయో ‘చదువు’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు...!.

Read More...

JEE (Advanced) 2015

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2015 విజేతల మనోగతాలు
ఈనాడు - హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేరొందిన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో... తెలుగు విద్యార్థుల ప్రతిభ ఈసారీ వెలుగులీనింది. కానీ, ర్యాంకుల వేటలో మాత్రం వెనకబడ్డారు! ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ 18న వెల్లడించిన అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో దేశంలో సీబీఎస్ఈ విద్యార్థుల తర్వాత అత్యంత ఎక్కువమంది ఉత్తీర్ణులైంది తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల నుంచే! దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 1.17 లక్షల మందిలో మొత్తం 26,456 మంది అర్హత సాధించారు. వీరిలో 15,311 మంది సీబీఎస్ఈ విద్యార్థులు. తర్వాతి స్థానం మనవాళ్ళదే! ఆంధ్ర (2,155) తెలంగాణ (783) ఇంటర్మీడియెట్ బోర్డుల నుంచి పరీక్ష రాసినవారు మొత్తం 2,938 మంది అర్హత సాధించారు. ఇక అఖిల భారత ర్యాంకుల్లోని టాప్ 20లో 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 19, 20 ర్యాంకులు మన విద్యార్థుల సొంతమయ్యాయి.

Read More...

 

TS EAMCET 2015

'ఎయిమ్స్‌' పైనే టాపర్ల దృష్టి
* రోజుకు 14 గంటలు సాధన చేశా - ఉప్పలపాటి ప్రియాంక, మొదటి ర్యాంకరు
మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, నాగులపాలెం గ్రామం. నాన్న జగదీష్ వ్యాపారి. అమ్మ ఉమాలక్ష్మి గృహిణి. ఇంటర్‌లో 983 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరాలనుకుంటున్నా. కార్డియాలజీ విభాగంపై ఆసక్తి ఉంది. చిత్రలేఖనం, నవలలు చదవడం నా అభిరుచులు. Read More...

ఐఐటీలో చేరతాం... లక్ష్యం సాధిస్తాం
* ఐఐటీ ముంబయిలో చదివి శాస్త్రవేత్తనవుతా - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకర్, కుత్బుల్లాపూర్
ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదివి, శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో రెండో ర్యాంకు సాధిస్తా. మా కుటుంబం గుంటూరు జిల్లా లెమెళ్లపాటు నుంచి నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆదర్శ్‌నగర్‌లో స్థిరపడింది. తమ కుమారుడికి ఊహించిన ర్యాంకే వచ్చిందని సందీప్ తల్లిదండ్రులు రవి, కృష్ణకుమారి చెప్పారు. Read More...

CA-CPT 2014

శ్రీకాకుళం చిన్నోడు... ఆల్ ఇండియా మొనగాడు
* సీఏ సీపీటీలో ఫ‌స్ట్ ర్యాంకు సొంతం చేసుకున్న తెలుగు తేజం విశ్వేశ్వర‌రావు
ఆ కుర్రోడు ఒక ద‌శ‌లో సీఏ సీపీటీలో ఎందుకు చేరాన‌బ్బా అంటూ త‌ల‌ప‌ట్టుకున్నాడు. నెమ్మదిగా ఆ స్థాయి నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలాగైనా స‌రే అర్హత సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నాడు. Read More...

CAT

కృషి + సాధన = క్యాట్‌ గెలుపు!
అన్ని సందర్భాల్లోనూ విజయం సులువుగా, తొలిసారే దక్కకపోవచ్చు. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా ఆశించిన స్థాయిని అందుకోనపుడు నిరాశతో ప్రయత్నాన్నే విరమించుకుంటే? సత్ఫలితాన్ని దూరం చేసుకున్నట్టే. తన నాలుగో ప్రయత్నంలో క్యాట్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన ఉత్తమ్‌ తన కలను నిజం చేసుకున్న తీరును స్వయంగా చెపుతున్నాడు....... Read More...

రికార్డు విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేహా మాంగ్లిక్
క్యాట్ పేరెత్తగానే అమ్మో నా వ‌ల్ల కాద‌ని త‌ప్పుకునేవాళ్లే ఎక్కువ‌. ఎందుకంటే భార‌త‌దేశంలో అత్యంత విశిష్టమైన‌ , ప్రపంచంలో క‌ఠిన‌మైన ప్రవేశ ప‌రీక్షల్లో కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (క్యాట్‌) ఒక‌టి. ఈ ప‌రీక్షలో 100 ప‌ర్సెంటైల్ సాధించ‌డం అంత సులువేమీ కాదు. అయితే సాదించాల‌నే త‌ప‌న‌ స‌రైన‌ ప్రణాళిక‌, త‌ప్పుల నుంచి నేర్చుకోవ‌డం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండ‌డం ద్వారా టాప‌ర్‌గా నిల‌వ‌డం సాధ్యమేనంటోంది నేహా మాంగ్లిక్‌....... Read More...

JIPMER

 

* వేలల్లో ఒక్కడు!
ఎంబీబీఎస్‌లో ఆశించిన ర్యాంకు రాకపోయినా నిరాశపడలేదు. కృషి చేసి రెండో ప్రయత్నంలో ఉచిత సీటు సాధించాడు. ఆ పట్టుదలే పీజీ ప్రవేశపరీక్షలోనూ కొనసాగింది. జిప్‌మర్‌లో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన సూరంపల్లి విజయ్‌ విజయానికి ఏ అంశాలు దారితీశాయి?
జిప్‌మర్‌ (జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌)లో మూడేళ్ల ఎండీ/ ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే దేశంలోని అన్ని ప్రాంతాల వారితోనూ పోటీ పడాలి. ఆ పోటీని విజయ్‌ విజయవంతంగా ఎదుర్కొని తృతీయ స్థానంలో నిలిచాడు.... Read More...

HORTICET

 

* పాఠ్య పుస్త‌కాల‌తోనే ఫ‌స్ట్ ర్యాంక్‌: హార్టీ సెట్ టాప‌ర్ వైష్ణ‌వి
బిఎస్సీ (హార్టికల్చ‌ర్‌) కోర్సులో ప్ర‌వేశానికి డాక్ట‌ర్ వైఎస్ఆర్ హార్టిక‌ల్చ‌రల్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన హార్టీ సెట్‌లో వైష్ణ‌వి ఫ‌స్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె రామ‌గిరి ఖిల్లా హార్టిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో డిప్లొమా కోర్సు పూర్తిచేయ‌డ‌మే కాకుండా 95 శాతం మార్కుల‌తో యూనివ‌ర్సిటీ (ఓయూ) టాప‌ర్‌గానూ నిలిచారు.. కేవ‌లం పాఠ్యాంశాల‌ను సాధ‌న చేయ‌డం ద్వారానే ప్ర‌థ‌మ ర్యాంక్ సాధించాన‌ని వైష్ణ‌వి ఈనాడు ప్ర‌తిభ‌తో అన్నారు. ప్రిప‌రేష‌న్ స్లాన్‌, స‌క్సెస్ స్టోరీ ఆమె మాట‌ల్లోనే.... Read More...

CA-IPCC 2014

* సి.ఎ. ఐ.పి.సి.సి.లో ద్వితీయ ర్యాంకర్ గౌరవ్‌ ఆనంద్‌
సబ్జెక్టును ఇష్టపడాలి. పరీక్షల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయని టాపర్లు రుజువు చేస్తూనే ఉన్నారు. సి.ఎ. ఇంటర్లో 566 మార్కులతో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన గౌరవ్‌ తాను చేసిన కృషిని వివరిస్తూ 'ర్యాంకు నాకు బోనస్‌' అంటున్నాడు.... Read More...

AIIMS 2014

* ఎయిమ్స్‌ 2014 ప్రథమ ర్యాంకర్ శ్రీవిద్య.
ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రవేశ పరీక్షకి... ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు పోటీపడతారు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలో నంబర్‌ వన్‌గా నిలిచింది వైజాగ్‌ అమ్మాయి శ్రీవిద్య. అంతేకాదు, ఎయిమ్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి తెలుగు విద్యార్థినిగానూ గుర్తింపు సాధించుకుంది. Read More...

LAWCET 2014

* లాసెట్ 2014 (5 సంవత్సరాలు) ప్రథమ ర్యాంకర్ గంగాధర్.
ఏ పరీక్షకు సిద్ధమైనా లక్ష్యంతో, ఏకాగ్రతతో చదవాలంటున్నారు లాసెట్ 2014 (5 సంవత్సరాలు) ప్రథమ ర్యాంకర్ వన్నెల గంగాధర్. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఈ ర్యాంకును అందుకున్న గంగాధర్ గ్రూప్స్ సాధనే లక్ష్యంగా కృషిచేసున్నారు. ఈ సందర్భంగా 'న్యూస్‌టుడే' అతడిని పలుకరించింది. ఆ వివరాలు.... Read More...

EDCET 2014

* ఎడ్‌సెట్- 2014 ఇంగ్లిష్ టాపర్ శామ్యూల్
డిఫెన్స్ కాలనీ (సికింద్రాబాద్), న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రతి రోజూ చదవాల్సిందేనంటున్నారు సి.శామ్యూల్. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ -2014లో ఆగ్లంలో 111మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాదించిన శామ్యూల్‌ను న్యూస్‌టుడే పలుకరించింది. ఆ వివరాలు.... Read More...

* ఎడ్‌సెట్ - 2014 సోషల్ స్టడీస్ మొదటి ర్యాంకర్ నందీశ్వరకుమార్
ఇస్కాల (పాములపాడుగ్రామీణ), న్యూస్‌టుడే: శ్రీశైల ముఖద్వారంగా పిలిచే నందీశ్వరక్షేత్ర గ్రామంలోని నందీశ్వరకుమార్ బీఈడీ ప్రవేశ పరీక్ష ఎ సాంఘీకశాస్త్ర విభాగంలో ప్రథమ స్థానం పొందాడు. పాములపాడు మండలంలోని ఇస్కాల గ్రామానికి చెందిన నంది బత్తిన నాగమల్లప్ప, దేవమ్మ దంపతుల కుమారుడు నందీశ్వరకుమార్ రాష్ట్ర స్థాయి ఎడ్‌సెట్ -2014 లో ప్రవేశ పరీక్షలో పాల్గొని తన ప్రతిభ చాటి సాంఘీకశాస్త్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. Read More..

 

EAMCET 2014

* 2014 ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ నందిగం పవన్‌కుమార్‌
ఇంట్లో తల్లితండ్రులు, కాలేజీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించా. కేవీపీవై ఫెలోషిప్‌ పొందా. Read More...

* 2014 ఎంసెట్‌లో మెడిసిన్‌ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ సాయిశ్రీనివాస్‌
మంచి న్యూరాలజిస్ట్‌ కావడమే నా లక్ష్యం. తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే ముఖాముఖికి అర్హత సాధించా. Read More..

 

చివరి నిమిషంలో దరఖాస్తు చేశా

* 2014 ఐసెట్ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ అనుభవ్ కున్నెల్
ఐసెట్ పరీక్ష రాయాలని చివరి నిమిషంలో నిర్ణయించుకున్నానని, మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన అనుభవ్ కున్నెల్ తెలిపారు. తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన తాను గతంలో క్యాట్‌లో 99.73 శాతం, ఆట్‌లో 99.38 శాతం మార్కులు సాధించినట్లు చెప్పారు. ఆ విశేషాలు...


Read More...

 

సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి!

* ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఏ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై గట్టి అవగాహన ఉండాలని ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప అన్నారు. మే 2014లో ప్రకటించిన ఈసెట్ ఫలితాల్లో అయ్యప్ప రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించారు.ఈ సందర్భంగా ఆయనను న్యూస్‌టుడే పలకరించింది. ఆ విశేషాలు...


Read More...

మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయాలి


* పాలీసెట్ ఏడో ర్యాంకర్ రామ్ చరణ్ రాయ్
సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేటకు చెందిన పేర్నీడి వీవీఎస్ఎస్ రామ్‌చరణ్ రాయ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలీసెట్-2014)లో రాష్ట్ర స్థాయి ఏడో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా ర్యాంకు సాధనలో రాయ్ చేసిన కృషిపై 'న్యూస్‌టుడే పలకరించగా తన మాటల్లోనే ఆ వివరాలను వెల్లడించాడు.


Read More...

చదవడంలో ప్రణాళిక తప్పనిసరి


* పీజీమెట్ - 2014 ప్రథమ ర్యాంకర్ శ్రీరాంరెడ్డి
గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: 'ప్రణాళిక ప్రకారం చదివితే విజయం తప్పక వరిస్తుందని పేర్కొంటున్నారు 2014 పీజీ మెట్ ప్రథమ ర్యాంకర్ శ్రీరాం రెడ్డి. ఎన్టీఆర్ వర్సిటీ ఇటీవల ప్రకటించిన పీజీమెట్- 2014లో గాంధీమెడికల్ కళాశాలకు చెందిన వైద్యవిద్యార్థి శ్రీరాంరెడ్డి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు.

Read More...

ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని ఉంది


* జేఈఈ మెయిన్స్‌ - 2014 వాకచర్ల ప్రమోద్‌, 355 మార్కులు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న వాకచర్ల భగవాన్‌ బాపూజీ వీధిలో చంద్రా ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ జయశ్రీ గృహిణి. పదో తరగతి గుడివాడలోని కె.కె.ఆర్‌ గౌతమ్‌కాన్సెప్ట్‌ స్కూల్‌లో చదివి 98 శాతం మార్కులు సాధించా. ఇంటర్‌లో ఎంపీసీలో చేరి 978 మార్కులు తెచ్చుకున్నా. ఇప్పుడు జేఈఈ మెయిన్స్‌లో 355 మార్కులు వచ్చాయి. గతంలో గణిత ఒలింపియాడ్‌కు, నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కు కూడా ఎంపికయ్యాను.

Read More...

పోటీ పరీక్షలకు ప్రాక్టీస్ బాగుండాలి!


* గేట్- 2014 మైనింగ్ ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకర్ భరత్ రెడ్డి
హైదరాబాద్: ఇటీవల విడుదలైన గేట్- 2014 ఫలితాల్లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌కు చెందిన గోపు భరత్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా భరత్‌ను 'ఈనాడు' పలుకరించగా.... ఏ పరీక్షలో అయినా మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రాక్టీస్ బాగుండాలని, ప్రణాళికాబద్ధంగా చదవాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ప్రభుత్వరంగ కంపెనీల్లో స్థిరపడాలనుకుంటున్న భరత్ చెప్పిన విశేషాలు......

Read More...

ప్రాథమిక అంశాలపై అవగాహనే ప్రధానం


* క్యాట్ 2014 టాపర్ తోటకూర శివసూర్య తేజ.
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ( ఐఐఎం)లు, ఇతర బిజినెస్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఎంబీఏ, తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో ర్యాంక్ సాధించడం అంత ఈజీ కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ సబ్జెక్టు ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన పెంచుకుంటే క్యాట్ రాయడం, టాపర్‌గా నిలవడం కష్టమేమీ కాదని అంటున్నారు క్యాట్- 2014 టాపర్ తోటకూర శివసూర్య తేజ.

Read More...

Back
Entrance Exams