APPSC Group - I 2016 Toppers

 

మూసలో రాస్తే ఫలితం సున్నా..!


పేరు: వెంఅప్పేచెర్ల నిషాంత్‌రెడ్డి, ర్యాంకు: ఒక‌టి

లక్షణమైన ఉద్యోగం. అయినా ఆ కుర్రాడికి విజయదాహం తీరలేదు. లక్షలమంది యువత పోటీ పడే గ్రూపు-1 పరీక్షలకు తానూ సన్నద్ధం అయ్యాడు. ప్రణాళిక ప్రకారం చదివి గ్రూప్‌-1 పరీక్షల్లో రెండు విజయాలు చవిచూశాడు. అప్పేచెర్ల నిషాంత్‌రెడ్డికి ఈ విజయం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. పదేళ్లపాటు వివిధ పరీక్షలు రాసిన అనుభవం తోడవడంతో తొలి ప్రయత్నంలో నాలుగో ర్యాంకూ, రెండో ప్రయత్నంలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకూ సాధించాడు. ఆ విజయగాథ అతడి మాటల్లోనే!
Read More...


కథలా చదివా... సాధనతో గెలిచా!


పేరు: రామచంద్ర మధుసూదన్‌ , ర్యాంకు: రెండు

ఇంజినీరింగ్‌ అంటే కొందరికి ఆవిష్కరణల స్వర్గం... మరికొందరికి కొలువుల మార్గం. అయితే అతడికి మాత్రం అది సేవాభావం వైపు మరల్చిన సాధనం. పేదలకు మేలు చేయాలన్న తపనతో అత్యున్నత కొలువు సాధించాలనుకున్నాడు. చివరకు కళాశాల స్ఫూర్తితో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. పోటీపరీక్షల యజ్ఞంలో విజయం సాధించాడు. ఇటీవల ప్రకటించిన ఏపీపీఎస్‌సీ గ్రూపు-1 ఫలితాల్లో తిరుపతికి చెందిన గజ్జెల రామచంద్ర మధుసూదన్‌ ఓపెన్‌ కేటగిరిలో రెండో ర్యాంకు సాధించాడు. తన విజయానికి పడిన శ్రమ... సంసిద్ధతలను ‘చదువు’తో ఇలా పంచుకున్నాడు..
Read More...


APPSC Group - I 2011 Toppers

 

ఇలా నిలిచాం...గెలిచాం!


పేరు: వెంకటరమణ, ర్యాంకు: ఒక‌టి

పరీక్ష స్థాయి కంటే పైస్థాయిలో ప్రిపేర్‌ కావాలనేది నా సలహా. గ్రూప్స్‌లో నెగ్గాలంటే..సివిల్స్‌కు సిద్ధం కావాలి.
రాష్ట్రప్రభుత్వ అత్యుత్తమ సర్వీసుకు నిర్వహించే పరీక్షలో అగ్రశ్రేణిలో నిలవడమంటే అంత సులువు కాదు. అందుకు ఏయే అంశాలు దోహదపడతాయో గమనిస్తే... భావి అభ్యర్థులకు అవి మార్గదర్శకం. మన ముందుకు ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 (2011) మొదటి, రెండో ర్యాంకర్లు వచ్చారు. ఒకరిది ప్రకాశం జిల్లా, మరొకరిది శ్రీకాకుళం జిల్లా. స్ఫూర్తిదాయకమైన వారి ప్రిపరేషన్‌ వ్యూహాలు పరిశీలిద్దాం! భారీ పోటీలో దూసుకువెళ్ళటానికి పట్టుదలతో వారు చేసిన అలుపెరగని కృషిని తెలుసుకుందాం! వారి సూచనలతో ప్రయోజనం పొందుదాం!
Read More...

సన్నద్ధత నిరంతరం


పేరు: కనుగుల హేమలత, ర్యాంకు: రెండు

ఓటమికి కుంగుబాటు సహజం. దాన్ని అధిగమించి, మరో లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగినవారే విజేత. అలా ఒక్కో సోపానాన్ని జాగ్రత్తగా నిర్మించుకుంటూ గ్రూప్‌-1లో రెండో ర్యాంకును సాధించారు కనుగుల హేమలత. తన విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..
చిన్నప్పటినుంచీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. దాంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనుకునేదాన్ని. అందుకే నా లక్ష్యం పబ్లిక్‌ సర్వీస్‌ అయ్యింది. నిజానికి నాకు ఫిజిక్స్‌ అంటే ఇష్టం. చిన్నపుడు ఏరోనాటిక్స్‌ చేయాలనుకునేదాన్ని.
Read More...

Back
Competitive Exams