TSPSC Group - I 2011 Toppers

 

ఉద్యోగం మానేశా...


పేరు: మాధురి, ర్యాంకు: ఒక‌టి

కాలంతో పోటీపడి కార్పొరేట్‌ కొలువుని అందుకున్నా ఏదో అసంతృప్తి. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం వెనకాడలేదు. అసలు నాకు గ్రూప్స్‌ రాయాలన్న ఆలోచన కన్నా మందు నాకు సివిల్స్‌ హాజరవ్వాలనే ఆలోచన వచ్చింది. రెండు సార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ విజయం సాధించలేదు. ఈ గ్రూప్స్‌ విజయంతో త్వరలో అదీ సాధిస్తాననుకుంటున్నా. నిజానికి ఈ ఆలోచనకు రెండుకారణాలు. ఒకటి నాకు స్వతహాగా జనరల్‌ నాలెడ్జ్‌ అంటే ఇష్టం. ఇక, నాన్నా, తాతయ్య ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఇందుకు మరో కారణం. సివిల్స్‌ ఆలోచన వచ్చినా గ్రూప్స్‌ రాయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు డిప్యుటీ కలెక్టర్‌గా అర్హత సాధించా.
Read More...


కోచింగ్‌ లేకున్నా...కొట్టొచ్చు గ్రూప్స్‌!
పేరు: ఉదయ్‌రెడ్డి, ర్యాంకు: రెండు
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించాడు- నూకల ఉదయ్‌రెడ్డి. గ్రూప్స్‌- 2011 నోటిఫికేషన్లో ఐదో ర్యాంకు సాధించి, న్యాయవివాదాల మూలంగా తిరిగి నిర్వహించిన పోటీలో ఇప్పుడు అంతకంటే మెరుగైన ర్యాంకును తెచ్చుకోగలగడం విశేషం.
Read More...


కొత్త పథకాల అమలుకు కృషిచేస్తా
పేరు: రోహిత్‌సింగ్‌, ర్యాంకు: మూడు
ర్యాంకు తప్పకుండా వస్తుందని, అనుకున్న హోదా లభిస్తుందని ముందే వూహించా. తల్లి ప్రోత్సాహం, సోదరి ఆర్థిక అండదండలు, స్నేహితుడు దినేష్‌ తోడ్పాటుతో విజయం సాధించా.
Read More...


వేగంగా రాయడం నేర్చుకున్నా...
పేరు: నెల్లూరి వాణి, ర్యాంకు: నాలుగు
జీవితంలో ఒక లక్ష్యం సరిపోదు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు పెట్టుకుంటేనే మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఈ పోటీ ప్రపంచంలో పరుగెత్తగలుగుతామని నమ్ముతాను. అందుకే ఏ లక్ష్యం పెట్టుకున్నా నాకెప్పుడూ అలసట అనిపించలేదు.
Read More...


మారుమూల గ్రామాలకు సేవలందిస్తా
పేరు: బెన్‌షాలోమ్‌,ర్యాంకు: ఎనిమిది
చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ అధికారి కావాలనే లక్ష్యంతో చదివా. తండ్రిని ఆదర్శంగా తీసుకొని గ్రూప్‌-1కు సన్నద్ధమయ్యా. మారుమూల గ్రామాల ప్రజలకు సేవలందించాలని ఉంది. ఆ దిశగా విధులు నిర్వర్తిస్తా.
Read More...


పద్దెనిమిదేళ్లకే పెళ్లయినా...
పేరు: ప్రశాంతి, ర్యాంకు: తొమ్మిది
లక్ష్యాన్ని గుర్తించడమే మొదటి మెట్టు. అది స్థిరంగా ఉన్నప్పుడు అపజయాలకు కారణాలేవీ అడ్డురావు. ఒకవిధంగా దానికి నేనే ఉదాహరణ. ప్రస్తుతం గ్రూప్‌ ఫలితాల్లో నాకు అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డా.
Read More...

Back
Competitive Exams