GATE - Toppers


గేట్‌ టాపర్‌ సూర్యనారాయణ
టాపర్లపై ఉండే ఆరాధనతో వారి వ్యూహాలు తెలుసుకున్నాడు. ప్రేరణ పొందాడు. అధ్యాపకుల మార్గదర్శనంతో సరైన దిశలో కృషి చేశాడు. చివరకు తానే టాపర్‌గా నిలిచాడు! ప్రతిష్ఠాత్మక ‘గేట్‌’లో ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు సాధించిన సూర్యనారాయణ విజయ్‌కుమార్‌ వడ్డేపల్లి తన విజయరహస్యాలను ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే.....Read More...


సాధనలో మునిగి... ర్యాంకర్‌గా తేలాడు!
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌... గేట్‌! పరీక్ష చూస్తే...అఖిలభారత స్థాయి. దానికి సిద్ధమయ్యే తీరు మామూలుగా ఉంటే సరిపోతుందా? అది అత్యంత ఇష్టమైన వ్యాపకంగా సాగాలి. సమయం ఎలా ముగుస్తుందో కూడా తెలియనంతగా సాధనలో మునిగిపోవాలి. అలా చేశాడు కాబట్టే భువన్‌చంద్ర ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. గేట్‌-2018 ఫలితాల్లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ప్రథమ ర్యాంకర్‌గా నిలిచిన ఈ విద్యార్థి తన విజయరహస్యాలు ఇలా చెపుతున్నాడు...Read More...


సగటు విద్యార్థినే... అయినా సాధించా!
అఖిలభారత స్థాయిలో గేట్‌లో ఈసీఈ బ్రాంచి నుంచి ప్రథమ ర్యాంకు సాధించిన ఘనత సాయి ప్రమోద్‌రెడ్డిది. మొదటిసారి ‘గేట్‌’లో 1209 ర్యాంకు వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదతడు. పట్టుదలతో, కసితో కృషి చేశాడు. ఈసారి జాతీయస్థాయిలో ఏకంగా ఒకటో ర్యాంకు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఇతడు తన విజయ ప్రస్థానాన్ని ఇలా పంచుకున్నాడు! .... Read More...


'గేట్‌' ర్యాంకు గెలిచిన తీరు
మూడు రోజులే చదివి గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ ) రాశాడు- మూడో ర్యాంకు వచ్చింది. రెండోసారి రెండు వారాలు చదివి రాశాడు- అఖిలభారత స్థాయి ప్రథమ ర్యాంకు కైవసమయింది! ఈ విజేత- కడప జిల్లా రాయచోటికి చెందిన ఎస్‌. చంద్రకాంత్‌రెడ్డి. ఐఐటీ రూర్కీలో ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. జియోఫిజిక్స్‌ విభాగంలో అత్యుత్తమ గేట్‌ ర్యాంకును సాధించిన విశేషాలను ఇలా పంచుకున్నాడు.... Read More...


* గేట్- 2014 మైనింగ్ ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకర్ భరత్ రెడ్డి
హైదరాబాద్: ఇటీవల విడుదలైన గేట్- 2014 ఫలితాల్లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌కు చెందిన గోపు భరత్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా భరత్‌ను 'ఈనాడు' పలుకరించగా.... ఏ పరీక్షలో అయినా మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రాక్టీస్ బాగుండాలని, ప్రణాళికాబద్ధంగా చదవాలని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ప్రభుత్వరంగ కంపెనీల్లో స్థిరపడాలనుకుంటున్న భరత్ చెప్పిన విశేషాలు..... Read More...


గేట్‌ - 2013 ఫస్ట్‌ర్యాంకర్‌ సుజీత్‌కుమార్‌
'ఆత్మవిశ్వాసం' నా విజయంలో ప్రధాన పాత్ర వహించింది. కానీ ఈ నమ్మకం నాకు ఆఖరిదశలో... పరీక్ష రాసేరోజు మాత్రమే పూర్తిగా ఏర్పడింది. అనుకున్నట్టు కాకుండా రివిజన్‌ కొద్దిగా తగ్గిందని తెలుసు కానీ దాని గురించి ఆలోచించలేదు. కాన్సెప్టులు నాకు స్పష్టంగా ఉన్నాయని తెలుసు. అదే ధైర్యం! Read More...
గేట్‌ - 2013 రెండో ర్యాంకర్ రవితేజ
ఒక క్రికెటర్‌ ఫామ్‌లో ఉండాలంటే నిత్యం సాధన చేయాలి. అదే జరగకపోతే ఎంత గొప్ప క్రీడాకారుడైనా పోటీలో వెనకబడతాడు. 'గేట్‌'కు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం అవసరం. సబ్జెక్టును ప్రతిరోజూ మననం చేసుకుంటూ ఉండాలి. అది చేస్తే సగటు విద్యార్థి సైతం గేట్‌లో ర్యాంకు సాధించడం కష్టం కాదు. Read More...

Back
Entrance Exams