NEET 2017 - Toppers

కఠోరదీక్షే విజయ సోపానం
‘లక్ష్యం పెద్దదైనప్పుడు అందుకు తగిన కృషి, పట్టుదల, కఠోర దీక్ష అవసరమవుతుంది.. దీన్నే దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక తయారు చేసుకుని విజయాన్ని సాధించా’నని నీట్‌లో జాతీయస్థాయి 12వ ర్యాంకు సాధించిన లక్కింశెట్టి అర్ణవ్‌ త్రినాథ్‌ తెలిపారు. తెలంగాణలో ప్రథమస్థానంలో నిలిచిన అతడి విజయ ప్రస్థానం గురించి తన మాటల్లోనే...

Read More...

UPSC CIVILS 2017 - Toppers

* సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ
ఈనాడు - హైదరాబాద్‌: తెలుగు మాధ్యమంలో పరీక్ష.. ఐచ్ఛిక సబ్జెక్టు తెలుగు సాహిత్యం.. ముఖాముఖి కూడా తెలుగులోనే.. దూరవిద్యలో డిగ్రీ పూర్తి.. ఎక్కడా శిక్షణ లేదు.. సివిల్‌ సర్వీసెస్‌ మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ ప్రత్యేకతలివి. సివిల్‌ సర్వీస్‌ చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకోవడంతోపాటు తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్‌లో విజయం సాధించడానికి అద్భుతమైన తెలివితేటలేమీ అవసరం లేదని.. కఠోర శ్రమ, చుట్టూ సంభవించే పరిణామాలను భిన్న కోణాల్లో విశ్లేషించే సామర్థ్యం ముఖ్యమని గోపాలకృష్ణ చెబుతున్నారు.

Read More...

TELANGANA EAMCET 2017 - Toppers

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో తొలి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
* సివిల్స్‌కు ఎంపికై పేదలకు సేవ చేస్తా.. - గోరంట్ల జయంత్‌ హర్ష, టీస్ ఎంసెట్-2017 ఇంజినీరింగ్‌ మొదటి ర్యాంకు
కృషి, పట్టుదలతోనే మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని పరీక్ష రాసిన రోజే అధ్యాకులకు, అమ్మానాన్నలకు చెప్పా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు రాగా తెలంగాణ ఎంసెట్‌లో ప్రథమ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.

Read More...

GATE 2017 - Toppers

అఖిలభారత స్థాయిలో గేట్‌లో ఈసీఈ బ్రాంచి నుంచి ప్రథమ ర్యాంకు సాధించిన ఘనత సాయి ప్రమోద్‌రెడ్డిది. మొదటిసారి ‘గేట్‌’లో 1209 ర్యాంకు వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదతడు. పట్టుదలతో, కసితో కృషి చేశాడు. ఈసారి జాతీయస్థాయిలో ఏకంగా ఒకటో ర్యాంకు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఇతడు తన విజయ ప్రస్థానాన్ని ఇలా పంచుకున్నాడు!
గేట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటే.. గొప్ప తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడే స్వభావం మాత్రం ఉండాలి.....

Read More...

CA-CPT 2017 - Toppers

ప్రత్యేకత చూపించాలనుకున్నపుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే.. గెలుపు సాధ్యం. దృఢసంకల్పంతో కృషి చేస్తే మార్గం సుగమం అవుతుందని నిరూపించింది శ్రీవల్లి. ఇటీవల వెలువడిన సీపీ-ఐపీసీసీ ఫలితాల్లో అఖిలభారత స్థాయి 12వ ర్యాంకును సాధించిందీమె!
శ్రీవల్లి స్వస్థలం హైదరాబాద్‌. అమ్మ సత్య నాగవేణి. నాన్న భాస్కర్‌రెడ్డి. ఆయన అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను ఉన్నత స్థానంలో.....

Read More...

CA-CPT 2017 - Toppers

ఇటీవలే విడుదలైన సీఏ-సీపీటీ ఫలితాల్లో 200కు 195 మార్కులు సాధించి అఖిలభారత స్థాయిలో అత్యుత్తమంగా నిలిచాడు హేమంత్‌ కుమార్‌. లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసి సీఏ-సీపీటీలో అత్యధిక మార్కులతోపాటు జాతీయస్థాయిలో మెరిశాడు. తన విజయ ప్రస్థానం గురించి ‘చదువు’తో పంచుకున్న విశేషాలు... అతడి మాటల్లోనే!
మాది ఒడిశాలోని పల్లెటూరు. మా నాన్న నీలకంఠరావు, అమ్మ శ్రీలక్ష్మి.చిన్న చిల్లరకొట్టుతో వచ్చిన ఆదాయంతో నన్ను చదివించారు.....

Read More...

UPSC - CIVILS 2016 - Toppers

సివిల్స్‌ రాయాలని అప్పుడే నిర్ణయించుకున్నా!
‘కంగ్రాట్యులేషన్స్‌ సివిల్స్‌లో 14వ ర్యాంకు నీకు..!!’ అని. కీర్తి ఆశ్చర్యపోవడం కాదు.. అస్సలు నమ్మలేదు! అవును.. మొదటి ప్రయత్నంలో 440వ ర్యాంకు, తర్వాత 512 తెచ్చుకున్న అమ్మాయి... మూడో ప్రయత్నంలో ఒక్కసారిగా 14వ ర్యాంకు ఎలా సాధించింది? ఓ వైపు ఐఆర్‌ఎస్‌ శిక్షణ, మరోవైపు మూడోసారి సివిల్స్‌ కోసం సిద్ధం కావడం.. అక్షరాలా రెండు పడవల్లో కాలుపెట్టినట్టే అనిపించింది నాకు గత ఏడాదంతా!!....

Read More...

AP Sr.INTER 2016 Toppers

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అవుతా..: రోషిణి (ఎంపీసీ 992)
భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావాలన్నదే తన లక్ష్యమని రోషిణి పేర్కొంది. జేఈఈ ద్వారా ఎన్‌టీఐ లేదా ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, ఎంటెక్‌ ఇంజినీరింగ్‌ చదవనున్నట్లు తెలిపింది. ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఈమె విజయనగరానికి చెందిన వారణాసి శ్రీనివాసరావు, ఉషారాణి దంపతుల రెండో కుమార్తె. రోజుకు 16 గంటలు సమయాన్ని చదువు కోసం కేటాయించానని చెప్పింది రోషిణి.

Read More...

TS Sr.INTER 2016 Toppers

కూలిపనులకెళ్లి చదువుకున్నా.. ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యం: హెచ్‌ఈసీలో టాపర్‌ స్నేహ మనోగతం (హెచ్‌ఈసీ 925
మారుమూల గిరిజన ప్రాంతం.. కూలికెళితేగానీ పూట గడవని కుటుంబ నేపథ్యం.. తండ్రి చనిపోవడంతో అక్కలతో పాటే కూలికెళ్లిన ఆ అమ్మాయి జీవితంతో పోరాడింది. కష్టాన్నే ఇష్టంగా మలుచుకుని ఇంటర్మీడియట్‌లో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతం చండ్రలగూడేనికి చెందిన మొల్కం నారాయణ, రాధమ్మల మూడో కుమార్తె స్నేహ. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో హెచ్‌ఈసీలో 925 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. స్నేహకు ఆర్నెల్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు.

Read More...

CAT Toppers

తొలి యత్నంలోనే క్యాట్‌ నెగ్గేయొచ్చు!
జాతీయస్థాయిలో జరిగే మేనేజ్‌మెంట్‌ ప్రవేశపరీక్ష- క్యాట్‌లో మొదటి ప్రయత్నంలోనే మంచి పర్సంటైల్‌ సాధించాడు తెలుగు విద్యార్థి సాయికృష్ణ. ఐఐటీ నేపథ్యమున్న ఈ యువకుడు ఐఐఎంలో చదవాలనే ఆకాంక్షను నెరవేర్చుకోబోతున్నాడు. క్యాట్‌లో తన విజయానికి ఏ అంశాలు దోహదపడ్డాయో ‘చదువు’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు...!

Read More...

UPSC - IES Toppers

మరీ కష్టమేమీ కాదు...ఐఈఎస్‌ పరీక్ష
దేశవ్యాప్త పోటీలో మేటి ర్యాంకు...! దానికెంత కృషీ, దీక్షా, ప్రణాళికా ఉండాలి! ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) పరీక్షలో తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయి టాపర్‌గా నిలిచాడు షేక్‌ సిద్ధిక్‌ హుస్సేన్‌. ఈ ఐఐటియన్‌ తన స్ఫూర్తిదాయక విజయం వెనక విశేషాలను ‘చదువు’తో పంచుకున్నాడు. అవన్నీ తన మాటల్లోనే...!

Read More...

UPSC - CIVILS 2015 - Toppers

వూడ్చే పనికీ అర్హత లేదన్నారు!
* ఇరా సింఘాల్‌, 1వ ర్యాంకర్‌
గది నం.209, వంశధార వసతి గృహం, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణం, జూబ్లీహిల్స్‌. హైదరాబాద్‌లోని ఈ చిరునామాపైనే ఇప్పుడు జాతీయ మీడియా దృష్టంతా! ఆ సందడంతా ఇరా సింఘాల్‌ కోసమేనని మీకప్పటికే అర్థమైపోయుంటుంది! ఇరా చూడటానికి పొట్టిమనిషే.. కానీ తను అందుకున్న విజయం ఎంతోమందికి అందనంత ఎత్తైంది!! సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి వికలాంగురాలిగా తన పేరు ఇక చరిత్రలో నిలిచిపోతుంది. అందుకోసం తను చేసిన ప్రయాణం కూడా ఓ చరిత్రే! ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...

Read More...

JEE (Advanced) 2015 - Toppers

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2015 విజేతల మనోగతాలు
ఈనాడు - హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేరొందిన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో... తెలుగు విద్యార్థుల ప్రతిభ ఈసారీ వెలుగులీనింది. కానీ, ర్యాంకుల వేటలో మాత్రం వెనకబడ్డారు! ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ 18న వెల్లడించిన అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో దేశంలో సీబీఎస్ఈ విద్యార్థుల తర్వాత అత్యంత ఎక్కువమంది ఉత్తీర్ణులైంది తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల నుంచే! దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 1.17 లక్షల మందిలో మొత్తం 26,456 మంది అర్హత సాధించారు. వీరిలో 15,311 మంది సీబీఎస్ఈ విద్యార్థులు. తర్వాతి స్థానం మనవాళ్ళదే! ఆంధ్ర (2,155) తెలంగాణ (783) ఇంటర్మీడియెట్ బోర్డుల నుంచి పరీక్ష రాసినవారు మొత్తం 2,938 మంది అర్హత సాధించారు. ఇక అఖిల భారత ర్యాంకుల్లోని టాప్ 20లో 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 19, 20 ర్యాంకులు మన విద్యార్థుల సొంతమయ్యాయి.

Read More...

TS EAMCET 2015 Toppers

* రోజుకు 14 గంటలు సాధన చేశా - ఉప్పలపాటి ప్రియాంక, మొదటి ర్యాంకరు

మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. మాది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, నాగులపాలెం గ్రామం. నాన్న జగదీష్ వ్యాపారి. అమ్మ ఉమాలక్ష్మి గృహిణి. ఇంటర్‌లో 983 మార్కులు వచ్చాయి. రోజుకు 14 గంటల పాటు చదివా. ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. ఆంధ్రా మెడికల్ కళాశాలలో చేరాలనుకుంటున్నా. కార్డియాలజీ విభాగంపై ఆసక్తి ఉంది. చిత్రలేఖనం, నవలలు చదవడం నా అభిరుచులు.

Read More...

* ఐఐటీ ముంబయిలో చదివి శాస్త్రవేత్తనవుతా - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకర్, కుత్బుల్లాపూర్

మొదటి ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లోనూ ఆరో ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం ముంబయిలోని ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదివి, శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో రెండో ర్యాంకు సాధిస్తా. మా కుటుంబం గుంటూరు జిల్లా లెమెళ్లపాటు నుంచి నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆదర్శ్‌నగర్‌లో స్థిరపడింది. తమ కుమారుడికి ఊహించిన ర్యాంకే వచ్చిందని సందీప్ తల్లిదండ్రులు రవి, కృష్ణకుమారి చెప్పారు.

Read More...

Sr. Inter 2015 Toppers

ప్రణాళికాబద్ధంగా చదివా.. వి.రమ్య (ఎంపీసీ 993)

ప్రణాళికాబద్ధంగా చదవడం, ఏరోజుకారోజు సందేహాలను నివృత్తి చేసుకోవడంతో ఈ మార్కులు సాధించా. తెనాలి వివేకా మహిళా జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు ప్రోత్సహించారు. పాఠాలను అవగాహన చేసుకోవడం, విశ్లేషణాత్మకంగా చదవడం కలిసివచ్చింది. మా అమ్మానాన్నలిద్దరూ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. కంప్యూటర్‌ ఇంజినీర్‌ కావాలనేది నా కోరిక.

Read More...

UPSC - IFS 2014 Toppers

'ప్రాథమిక ' మార్కులే ప్రధానం

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ సాధనలోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అఖిలభారత స్థాయిలో 21వ ర్యాంకు సాధించిన రంగనాథ రామకృష్ణ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే... మొదటి ప్రయత్నంలోనే ఈ సర్వీస్‌ సాధించటం విశేషం. తన విజయ ప్రస్థానం గురించి అతడి మాటల్లోనే....

Read More...

ICWA New Syllabus 2013 Toppers

కష్టమన్నారు... ఫస్టొచ్చా!

''ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే జయం మనవెంటే. అది నా విషయంలో నిజమైంది'' అంటోంది దేవినేని తులజా భవాని. 2013 ఐసీడబ్ల్యూఏ కొత్త సిలబస్‌లో దేశవ్యాప్తంగా మూడో ర్యాంకు, మహిళా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన ఆమె తన ప్రయాణాన్ని ఇలా చెబుతోంది.

Read More...

CA - CPT 2014 Toppers

శ్రీకాకుళం చిన్నోడు... ఆల్ ఇండియా మొనగాడు

* సీఏ సీపీటీలో ఫ‌స్ట్ ర్యాంకు సొంతం చేసుకున్న తెలుగు తేజం విశ్వేశ్వర‌రావు

ఆ కుర్రోడు ఒక ద‌శ‌లో సీఏ సీపీటీలో ఎందుకు చేరాన‌బ్బా అంటూ త‌ల‌ప‌ట్టుకున్నాడు. నెమ్మదిగా ఆ స్థాయి నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలాగైనా స‌రే అర్హత సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నాడు. ఇంత‌కు ముందెప్పుడూ ఎదురుకాని అకౌంట్స్‌, లా స‌బ్జెక్టుల‌ను అర్థం చేసుకుంటూ క‌ష్టప‌డి చ‌ద‌వ‌డం మొద‌లెట్టాడు.

Read More...

CAT Toppers

* కృషి + సాధన = క్యాట్‌ గెలుపు!

అన్ని సందర్భాల్లోనూ విజయం సులువుగా, తొలిసారే దక్కకపోవచ్చు. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా ఆశించిన స్థాయిని అందుకోనపుడు నిరాశతో ప్రయత్నాన్నే విరమించుకుంటే? సత్ఫలితాన్ని దూరం చేసుకున్నట్టే. తన నాలుగో ప్రయత్నంలో క్యాట్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన ఉత్తమ్‌ తన కలను నిజం చేసుకున్న తీరును స్వయంగా చెపుతున్నాడు...

Read More...

* రికార్డు విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేహా మాంగ్లిక్

క్యాట్ పేరెత్తగానే అమ్మో నా వ‌ల్ల కాద‌ని త‌ప్పుకునేవాళ్లే ఎక్కువ‌. ఎందుకంటే భార‌త‌దేశంలో అత్యంత విశిష్టమైన‌ , ప్రపంచంలో క‌ఠిన‌మైన ప్రవేశ ప‌రీక్షల్లో కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (క్యాట్‌) ఒక‌టి. ఈ ప‌రీక్షలో 100 ప‌ర్సెంటైల్ సాధించ‌డం అంత సులువేమీ కాదు. అయితే సాదించాల‌నే త‌ప‌న‌ స‌రైన‌ ప్రణాళిక‌, త‌ప్పుల నుంచి నేర్చుకోవ‌డం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండ‌డం ద్వారా టాప‌ర్‌గా నిల‌వ‌డం సాధ్యమేనంటోంది నేహా మాంగ్లిక్‌....

Read More...

CA - IPCC 2014 Toppers

* సి.ఎ. ఐ.పి.సి.సి.లో ద్వితీయ ర్యాంకర్ గౌరవ్‌ ఆనంద్‌

సబ్జెక్టును ఇష్టపడాలి. పరీక్షల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయని టాపర్లు రుజువు చేస్తూనే ఉన్నారు. సి.ఎ. ఇంటర్లో 566 మార్కులతో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన గౌరవ్‌ తాను చేసిన కృషిని వివరిస్తూ 'ర్యాంకు నాకు బోనస్‌' అంటున్నాడు...

Read More...

CA - CPT 2014 Toppers

సీఏ-సీపీటీ 2014లో మొదటి ర్యాంకర్ బొర్రా మురళీమోహన్‌

జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించటం అంటే ఆ సంతోషమే వేరు! సీఏ-సీపీటీలో ఆ ఘనతను తొలి ప్రయత్నంలోనే సాధించాడు బొర్రా మురళీమోహన్‌. తన విజయానికి దోహదం చేసిన అంశాలను 'ఈనాడు'తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే...

Read More...

AIIMS - 2014 Toppers

ఇష్టపడి చదివా.. నంబర్‌వన్‌ అయ్యా!

ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రవేశ పరీక్షకి... ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు పోటీపడతారు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలో నంబర్‌ వన్‌గా నిలిచింది వైజాగ్‌ అమ్మాయి శ్రీవిద్య. అంతేకాదు, ఎయిమ్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి తెలుగు విద్యార్థినిగానూ గుర్తింపు సాధించుకుంది. 'మార్కుల కోసం కాకుండా.. మనసుపెట్టి చదువుకున్నా, ర్యాంకు సాధించా' అంటున్న ఆ అమ్మాయి తనెలా సిద్ధమైందో వివరిస్తోందిలా!

Read More...

CIVILS - 2014 Toppers

నాలుగో సారి... గెలుపు స్వారీ!

సుదీర్ఘ పోరాట పటిమకు మారుపేరు సివిల్స్‌! అభ్యర్థుల సంకల్ప బలాన్నీ, సత్తానూ ఇది నిలువెల్లా పరీక్షిస్తుంది. అందుకే సివిల్స్‌ విజయానికి ఎనలేని ప్రాముఖ్యం! 30వ ర్యాంకు సాధించిన కృత్తిక జ్యోత్స్న ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాల సివిల్స్‌ 2014 విజేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. మూడు వరస ప్రయత్నాల్లో ఓటమి ఎదురైనా చివరకు తానెలా లక్ష్యాన్ని చేరుకోగలిగిందీ ఆమె వివరించారు. స్ఫూర్తిదాయకమైన ఆ విజయగాథ ఆమె మాటల్లోనే...!

Read More...

ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడగలేదు!

'నువ్వేమీ చేయలేవ్‌..' అంటూ ఎంతోమంది నిన్ను వెనక్కిలాగొచ్చు. వాళ్ల వైపు తిరిగి ఒకే మాట చెప్పు 'నన్ను చూస్తూ ఉండండి. సాధించి చూపిస్తా!' అని.- తెలుగమ్మాయి నేలపాటి బెనో జెసిఫ్‌ ఫేస్‌బుక్‌ పేజీ తెరవగానే మనకు కనిపించే తొలి వాక్యం ఇది! పుట్టుకతో చూపులేకున్నా సివిల్స్‌ 2014లో 343వ ర్యాంకు సాధించడం చూస్తే, ఆ వాక్యాన్ని ఎంతగా ఆచరణలో పెట్టిందో అర్థమవుతుంది. ఈ సివిల్స్‌ విజయం వెనకున్న స్ఫూర్తి ఏమిటో తన మాటల్లోనే....

Read More...

అవకరాన్ని జయించి ఐఏఎస్‌!

మూడు లక్షల ఇరవై నాలుగువేల మంది రాసిన సివిల్స్‌ ఫలితాలొచ్చాయి. 1122 మంది కలలు నెరవేరాయి. ఇప్పుడు వాళ్లంతా హీరోలు. వాళ్లలో ఒరిస్సా అమ్మాయి సారికా జైన్‌ మరీ ప్రత్యేకం. అంతా ప్రతిభతో మెరిస్తే తను పోలియాతోనూ పోరాడింది. ఆమెది యువత ఆదరించాల్సిన స్ఫూర్తిగాథ....

Read More...

EAMCET - 2014 Toppers

* 2014 ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ నందిగం పవన్‌కుమార్‌
ఇంట్లో తల్లితండ్రులు, కాలేజీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించా. కేవీపీవై ఫెలోషిప్‌ పొందా. ఎంసెట్‌లో 158 మార్కులు పొందడం సంతోషంగా ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలోనూ మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాను.
* 2014 ఎంసెట్‌లో మెడిసిన్‌ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ సాయిశ్రీనివాస్‌

మంచి న్యూరాలజిస్ట్‌ కావడమే నా లక్ష్యం. తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే ముఖాముఖికి అర్హత సాధించా. ఏఐఐఎంఎస్‌, జిప్‌మర్‌ ఫలితాలు రావాల్సి ఉంది. విజయవాడ శ్రీచైతన్యకు చెందిన గోశాల భరద్వాజ భవన్‌ ప్రాంగణంలో చదివా.

Read More...

ICET - 2014 Toppers

చివరి నిమిషంలో దరఖాస్తు చేశా

* 2014 ఐసెట్ స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌ అనుభవ్ కున్నెల్
ఐసెట్ పరీక్ష రాయాలని చివరి నిమిషంలో నిర్ణయించుకున్నానని, మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన అనుభవ్ కున్నెల్ తెలిపారు. తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన తాను గతంలో క్యాట్‌లో 99.73 శాతం, ఆట్‌లో 99.38 శాతం మార్కులు సాధించినట్లు చెప్పారు. ఆ విశేషాలు...

Read More...

ECET - 2014 Toppers

సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి!

* ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఏ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై గట్టి అవగాహన ఉండాలని ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప అన్నారు. మే 2014లో ప్రకటించిన ఈసెట్ ఫలితాల్లో అయ్యప్ప రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించారు.ఈ సందర్భంగా ఆయనను న్యూస్‌టుడే పలకరించింది. ఆ విశేషాలు...

Read More...

PGMET - 2014 Toppers

చదవడంలో ప్రణాళిక తప్పనిసరి

* పీజీమెట్ - 2014 ప్రథమ ర్యాంకర్ శ్రీరాంరెడ్డి
గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: 'ప్రణాళిక ప్రకారం చదివితే విజయం తప్పక వరిస్తుందని పేర్కొంటున్నారు 2014 పీజీ మెట్ ప్రథమ ర్యాంకర్ శ్రీరాం రెడ్డి. ఎన్టీఆర్ వర్సిటీ ఇటీవల ప్రకటించిన పీజీమెట్- 2014లో గాంధీమెడికల్ కళాశాలకు చెందిన వైద్యవిద్యార్థి శ్రీరాంరెడ్డి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. ప్రణాళిక ప్రకారం చదవడంవల్లే తనకీ ర్యాంకు వచ్చినట్లు తెలిపారు.

Read More...

JEE(Main) - 2014 Toppers

ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని ఉంది

* జేఈఈ మెయిన్స్‌ - 2014 వాకచర్ల ప్రమోద్‌, 355 మార్కులు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న వాకచర్ల భగవాన్‌ బాపూజీ వీధిలో చంద్రా ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ జయశ్రీ గృహిణి. పదో తరగతి గుడివాడలోని కె.కె.ఆర్‌ గౌతమ్‌కాన్సెప్ట్‌ స్కూల్‌లో చదివి 98 శాతం మార్కులు సాధించా. ఇంటర్‌లో ఎంపీసీలో చేరి 978 మార్కులు తెచ్చుకున్నా. ఇప్పుడు జేఈఈ మెయిన్స్‌లో 355 మార్కులు వచ్చాయి. గతంలో గణిత ఒలింపియాడ్‌కు, నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కు కూడా ఎంపికయ్యాను.

Read More...

Sr.Inter - 2014 Toppers

ఇష్టంతోనే విజయం..

* బైపీసీలో రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ మొదలి రిషిత
రాత్రంతా కష్టపడి.. తిండి నిద్ర లేకుండా.. చదవడం కంటే ఇష్టపడి చదివితే విజయం మీ దరి చేరుతుందని ఇంటర్ బైపీసీ- 2014 పరీక్షల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకర్‌గా నిలిచిన మొదలి రిషిత అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన రిషిత తన సత్తా చాటింది. ఐటీ రంగంలో వెళ్లానుకున్న రిషిత.. బైపీసీలో చేరి ఏ విధంగా అధిక మార్కులు సాధించారో.. ఏ ప్రణాళికతో ముందుకెళ్లిందో .. న్యూస్‌టుడేకు వివరించింది.

Read More...

పాలిటెక్నిక్‌ లెక్చరర్‌

హరిత.. చదువుల్లో విజేత..

నిజామాబాద్ జిల్లా (భిక్కనూరు): ఓటమి విజయానికి తొలిమెట్టంటారు.. తొలి పరాజయానికి కుంగకుండా మరింత కసితో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారామే. ముందుగా జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగం 0.5 మార్కు తేడాతో చేజారింది. తర్వాత పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుని ఉద్యోగం సాధించారు. అంతకుముందే తెవివిలో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపడంతో తెవివి దక్షిణ ప్రాంగణంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు డాక్టర్‌ లక్కరాజు హరిత. ఆమె ఈ స్థాయికి చేరుకున్న ప్రస్థానం.. పడ్డ కష్టాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Read More...Competitive Exams