JEE (Advanced) 2018 - Toppers

మెయిన్స్‌ నేర్పిన పాఠంతో అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు!
జేఈఈ మెయిన్స్‌లో 59వ ర్యాంకు. దానిలో చేసిన చిన్నచిన్న తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని అడ్వాన్స్‌డ్‌లో ఆ పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడడంతో అడ్వాన్స్‌డ్‌లో అఖిలభారతీయ ఓపెన్‌ కేటగిరిలో ఐదో ర్యాంకు సాధించాడు మావూరి శివకృష్ణ మనోహర్‌. తన ప్రిపరేషన్‌, పరీక్ష రాయడంలో తీసుకున్న జాగ్రత్తలు అతడి మాటల్లోనే..!
ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌ చేయాలన్నది నా కల. జేఈఈలో మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకంతో ఏపీ ఎంసెట్‌ రాయలేదు. జేఈఈ మెయిన్స్‌లో చేసిన చిన్నచిన్న పొరపాట్ల కారణంగా 59వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌ వరకు ఇంటర్‌ విద్యతోపాటే జేఈఈ సిలబస్‌ను చదువుతూ వచ్చాను.
Read More...

JEE (Advanced) 2015 - Toppers

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2015 విజేతల మనోగతాలు
ఈనాడు - హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేరొందిన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో... తెలుగు విద్యార్థుల ప్రతిభ ఈసారీ వెలుగులీనింది. కానీ, ర్యాంకుల వేటలో మాత్రం వెనకబడ్డారు! ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ 18న వెల్లడించిన అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో దేశంలో సీబీఎస్ఈ విద్యార్థుల తర్వాత అత్యంత ఎక్కువమంది ఉత్తీర్ణులైంది తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల నుంచే! దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 1.17 లక్షల మందిలో మొత్తం 26,456 మంది అర్హత సాధించారు. వీరిలో 15,311 మంది సీబీఎస్ఈ విద్యార్థులు. తర్వాతి స్థానం మనవాళ్ళదే! ఆంధ్ర (2,155) తెలంగాణ (783) ఇంటర్మీడియెట్ బోర్డుల నుంచి పరీక్ష రాసినవారు మొత్తం 2,938 మంది అర్హత సాధించారు. ఇక అఖిల భారత ర్యాంకుల్లోని టాప్ 20లో 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 19, 20 ర్యాంకులు మన విద్యార్థుల సొంతమయ్యాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ లో టాపర్ల మనోగతాలు వారి మాటల్లేనే.....
చిన్నప్పటి నుంచి పరిశోధనలంటే ఇష్టం
మాది నెల్లూరు జిల్లా. 504 మార్కులకుగాను 442 సాధించడం గర్వంగా ఉంది. మాదాపూర్‌ శ్రీచైతన్యనారాయణ అకాడమీలో రోజుకు 14 గంటలు చదివా. కృషికి తగిన ఫలితం లభించింది. ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతా. చిన్నప్పటి నుంచి పరిశోధనలు అంటే ఇష్టం. నాన్న సుధాకర్‌రెడ్డి ప్రైవేట్‌ అధ్యాపకుడు. అబ్దుల్‌ కలాం నా స్ఫూర్తి ప్రధాత. నేర కథలు చదవడం ఇష్టం. Read More...
- కామన నాగేంద్రరెడ్డి (ఆల్‌ఇండియా 4వ ర్యాంకర్‌)
.............................................................................................................
తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం
మాది నల్గొండ జిల్లాలోని పోచంపల్లి. మధ్య తరగతి కుటుంబం. 430 మార్కులతో అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. మాదాపూర్‌లోని శ్రీచైతన్యనారాయణ అకాడమీలో చదివా. ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైంది.
- ఆహ్వాన్‌రెడ్డి, (ఆల్‌ ఇండియా 6వ ర్యాంకరు)
.............................................................................................................
14 గంటలు చదివా
చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం. ఎప్పుడూ తరగతిలో నేనే ఫస్ట్‌. 425 మార్కులతో జాతీయస్థాయిలో 8వ ర్యాంకు సాధించా. 14 గంటలు చదవడం వల్లే ఈ విజయం సాధ్యమయింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరవలేనిది. మాది హైదరాబాద్‌. నాన్న మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌. చెస్‌, క్రికెట్‌ ఆడుతా. బొంబాయి ఐఐటీలో చదవడం నా కల. అది సాకారం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది.
- సాయిసందీప్‌ (ఆల్‌ఇండియా 8వ ర్యాంకరు)
.............................................................................................................
ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌నవుతా...
మాది కడప జిల్లా రాయచోటి. 424 మార్కులతో 9వ ర్యాంకు సాధించా. విజయవాడ చైనా అకాడమీలో చదివాను. నాన్న వెంకటసుబ్బారెడ్డి వ్యాపారం చేస్తారు. ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరి ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌నవుతా. రోజుకు 13 గంటలు చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.
- కె. విష్ణువర్థన్‌రెడ్డి, (ఆల్‌ ఇండియా 9వ ర్యాంకరు)
.............................................................................................................
జీఎమ్మార్‌ మాదిరిగా వ్యాపారవేత్తనవుతా..
మాది శ్రీకాకుళం జిల్లా రాజాం. 417 మార్కులతో ఐఐటీ అడ్వాన్స్‌లో 11వ ర్యాంకు సాధించా. నాన్న వెంకట్‌ నాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జీఎమ్మార్‌ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జున్‌రావు నాకు స్ఫూర్తి. ఆయన లాగే పెద్ద వ్యాపారవేత్త కావాలనేదే నా లక్ష్యం. బొంబాయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరి నా కల నిజం చేసుకుంటా.
- బూరి విద్యాసాగర్‌ నాయుడు (ఆల్‌ ఇండియా 11వ ర్యాంకరు)
.............................................................................................................
సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపిస్తా
అడ్వాన్స్‌డ్‌లో 386 మార్కులు సాధించి ఎస్సీ విభాగంలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచా. ఓపెన్‌ కేటగిరీకి వస్తే 39వ ర్యాంకు దక్కింది. బొంబాయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరి ఇంజినీరింగ్‌ చేసిన అనంతరం సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించాలని అనుకుంటున్నా. ఇంటర్‌మీడియట్‌ను విజయవాడలో పూర్తిచేశా. మాది గుంటూరు జిల్లా తెనాలి. నాన్న అక్కడ దుస్తుల వ్యాపారం చేస్తారు. అమ్మ గృహిణి.
- టి.భవన్‌ (ఎస్సీ విభాగంలో మొదటి ర్యాంకర్‌)
.............................................................................................................
తల్లిదండ్రులే స్ఫూర్తి
మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. నాన్న శ్రీనివాస్ టీఎస్ జెన్‌కోలో ఉద్యోగి. 413 మార్కులతో 12వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఈ విజయం సాధించడానికి నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తినిచ్చారు. బొంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతాను. డిటెక్టివ్ నవలలు, కథలు చదువుతా. క్రికెట్ అంటే ప్రాణం. ఎవన్‌బాల్ డక్కీ రాసిన టోటల్ కంట్రోల్ నవలంటే నాకు చాలా ఇష్టం.
- కొండపల్లి అనిరుధ్‌రెడ్డి (ఆల్ ఇండియా 12వ ర్యాంకరు)
.............................................................................................................
సోదరి ప్రోత్సాహం వల్లే
చిన్నప్పటి నుంచి శ్రీచైతన్య టెక్నోస్కూల్‌లో చదివా. 402 మార్కులతో 25వ ర్యాంకు సాధించా. కుటుంబ సభ్యుల సహకారం, ముఖ్యంగా నా సోదరి నన్ను ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లే నేనీ స్థాయికి చేరుకున్నా. నాన్న భెల్‌లో ఏజీఎంగా పనిచేస్తున్నారు. ఉత్కంఠభరిత కథలు, నవలలంటే చాలా ఇష్టం. ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ చదవాలనేది నా లక్ష్యం.
- జి. హర్షిత్, (ఆల్ ఇండియా 25వ ర్యాంకర్)

JEE (Advanced) 2013 - Toppers

 

వేగానికి మార్గం... సాధనే!


* మొదటి ర్యాంకర్ సాయి సందీప్ రెడ్డి
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని సరైన ప్రణాళికతో చదివితే, దేన్నయినా సులభంగా సాధించవచ్చని అంటున్నాడు సాయి సందీప్‌రెడ్డి.

Read More...

ప్రతి పాఠ్యాంశాన్ని ఆసక్తితో చదవాలి
* రెండో ర్యాంకర్ రవిచంద్ర

ఇష్టంతో పనిచేస్తే ఏ పనిలోనైనా అద్భుత విజయాలు సాధించవచ్చని అంటున్నాడు అద్దంకి రవిచంద్ర.

Read More...

Back
Entrance Exams