JEE (Mains) 2019 - Toppers

పట్టు పెంచుకో.. ర్యాంకు తెచ్చుకో!
* కార్తికేయ (జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు )
ప్రస్తుతం నేను రెండు లక్ష్యాలు పెట్టుకున్నా. ఒకటి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరటం. రెండోది ఇంటర్నేషనల్‌ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో బంగారు పతకం పొందటం. మొదటి లక్ష్యం చేరువలోనే ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పూర్తయ్యాక ఒలింపియాడ్‌ ఉంటుంది. దీనికి ఎంపికవ్వడం అంత సులువైనదేమీ కాదు. ఇక కెమిస్ట్రీ ఒలింపియాడ్‌ను ఎంచుకుని పోటీపడటానికి కారణం- బహశా ఇది నా అభిమాన సబ్జెక్టు అవటం కారణం.

Read More...


లక్ష్యంలో స్పష్టత ఉండాలి
* సాయికిరణ్‌ (ఏడో ర్యాంకు)
లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించేందుకు దీర్ఘకాల ప్రణాళికతో నిరంతరం శ్రమించాలి. ఉన్నతంగా ఎదగాలనే బలమైన కాంక్ష ఉంటే ఏ పరీక్షలోనైనా విజయం దక్కుతుందని నా ఉద్దేశం. మాది మర్కూక్‌ మండలంలోని పాములపర్తి. ఎనిమిదో తరగతిలో ఉండగానే ఐఐటీలో చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఇంటర్మీడియెట్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివా. అక్కడ రోజూ దాదాపు 14 గంటల సమయం చదువుకోవడానికి కేటాయించా. పదో తరగతి పూర్తయ్యే సరికే అన్ని అంశాలపై సమగ్ర అవగాహన రావటం వల్ల ఇంటర్‌లో అన్నీ పునశ్చరణ చేసుకోవడానికి వీలయింది. నమూనా పరీక్షలు ఎంతగానో ఉపకరించాయి. ఈ పరీక్షల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకొని అవి పునరావృతం కాకుండా చూసుకునేవాడిని.

Read More...


ర్యాంకులను ఆశిస్తూ చదవొద్దు
* విశ్వంత్‌ (ఎనిమిదో ర్యాంకు)
మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం. ఈ ర్యాంకు వెనుక దాదాపు రెండేళ్ల శ్రమ ఉంది. రోజులో ఉదయం 6 గంటలకు స్టడీ అవర్‌తో ప్రారంభమయ్యే టైంటేబుల్‌ రాత్రి 10 గంటలకు ముగిసేది. మధ్యలో రెండు గంటలు బ్రేకులు, మరో రెండు గంటలకు ఆటలకు కేటాయించేవారు. మిగిలిన 12 గంటలు చదివేవాళ్లం. చాలామంది విరామ సమయాల్లో కూడా పుస్తకాలతో కుస్తీ పడుతుండేవారు. అలా చేయాల్సిన పనిలేదు. మంచి మార్కులు రావాలని ఒత్తిడి గురయితే.. నష్టం జరుగుతుంది. చదివినంతసేపు ఇష్టంతో ప్రతి అంశాన్నీ కూలంకషంగా అవగాహన చేసుకోవాలి.

Read More...


JEE (Mains) 2018 - Toppers

 

కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా
* సూరజ్‌కృష్ణ, ప్రథమ ర్యాంకు
జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు వస్తుందని ముందే అనుకున్నా. ప్రాథమిక ‘కీ’ చూసిన తర్వాత పదిలోపు స్థానాల్లో ఉంటానని భావించా. మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్డ్‌లో ఉత్తమ ర్యాంకు ఆశిస్తున్నా. దాంతో ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతాను. విజయవాడలో ఇంటర్‌ చదివాను. ఇంటర్‌లో 976 మార్కులు సాధించా. మాది శ్రీకాకుళం. నాన్న వ్యాపారం చేస్తున్నారు.

పరిశోధన దిశగా సాగుతా..
* హేమంత్‌, ద్వితీయ ర్యాంకు

రెండో స్థానంలో ఉండటం ఆనందంగా ఉంది. ఇంటర్మీడియట్‌లో 960 మార్కులు పొందా. అడ్వాన్స్డ్‌లోనూ ఇదేస్థాయిలో ర్యాంకు సాధిస్తా. పరిశోధనపై ఆసక్తి. అందుకు మొదట ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చేసి తుది లక్ష్యం నిర్దేశించుకుంటా. మాది విశాఖపట్టణం. నాన్న నాగరాజు పీడబ్ల్యూడీలో ఇంజినీరు.

అడ్వాన్స్డ్‌ ర్యాంకును బట్టి నిర్ణయించుకుంటా
* గట్టు మైత్రేయ, 5వ ర్యాంకు

ఇప్పుడు నా దృష్టంతా జేఈఈ అడ్వాన్స్డ్‌పైనే ఉంది. అందులో మంచి ర్యాంకు సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నా. ఆ ర్యాంకును బట్టి ఐఐటీ బొంబాయిలో బీటెక్‌ చేస్తా. సొంతూరు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్‌. అయితే హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. నాన్న అదానీ గ్రూపు సంస్థలో చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ (సీఓఓ) గా ఉన్నారు.

కంపెనీ నెలకొల్పాలన్నదే లక్ష్యం
* దాకారపు భరత్‌, ఎనిమిదో ర్యాంకు

మాది శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం. తండ్రి రమేశ్‌ కేబుల్‌ ఆపరేటర్‌. తల్లి లిఖిత గృహిణి. చిన్నప్పటినుంచి చదువులో ప్రతిభ చాటడంతో ఆరో తరగతిలోనే గుంటూరు భాష్యం ఐఐటీ అకాడమీలో ఉచిత విద్యకు అవకాశం లభించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో తరగతి గదిలో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచేవాడిని. పదోతరగతిలో పదికి పది జీపీఏ సాధించడంతోపాటు ఇంటర్‌లో 987 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 345 మార్కులు పొందా. ప్రణాళికాబద్ధంగా చదవడం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ సాధన చేయడం ద్వారానే ఈ ర్యాంకు పొందాను. ముంబయి ఐఐటీలో సీఎస్‌ఈ విభాగంలో చేరతా. సొంత కంపెనీ నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.

కృత్రిమ మేధపై పరిశోధన చేస్తా
* గోసుల వినాయక శ్రీవర్ధన్‌, 10వ ర్యాంకు

మాది హైదరాబాద్‌. ఇంటర్‌లో 985 మార్కులు పొందా. అడ్వాన్స్డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధిస్తా. కృత్రిమ మేధపై పరిశోధన చేయాలనేది నా లక్ష్యం. అందుకే ఐఐటీ బొంబాయిలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతాను. నాన్న లక్ష్మణ్‌రావు ముంబాయిలో ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో మెకానికల్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అమ్మ రుక్మిణి గృహిణి.

అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే...
* పిన్నమరెడ్డి లోకేశ్వర్‌రెడ్డి, 15వ ర్యాంకు

మాది గుంటూరు జిల్లాలోమాది కడప జిల్లా బద్వేల్‌. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చదివా. ఇంటర్‌లో 968 మార్కులు వచ్చాయి. అడ్వాన్స్డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు శ్రమిస్తున్నా. ఆ ర్యాంకుతో ఐఐటీ బొంబాయిలో చేరతా.

   

 

JEE (Mains) 2014 - Toppers

 


ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని ఉంది
* వాకచర్ల ప్రమోద్‌, 355 మార్కులు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న వాకచర్ల భగవాన్‌ బాపూజీ వీధిలో చంద్రా ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ జయశ్రీ గృహిణి. పదో తరగతి గుడివాడలోని కె.కె.ఆర్‌ గౌతమ్‌కాన్సెప్ట్‌ స్కూల్‌లో చదివి 98 శాతం మార్కులు సాధించా. ఇంటర్‌లో ఎంపీసీలో చేరి 978 మార్కులు తెచ్చుకున్నా. ఇప్పుడు జేఈఈ మెయిన్స్‌లో 355 మార్కులు వచ్చాయి.

Read More...

ఐఐటీ ముంబయిలో చేరాలని..
* మహ్మద్‌ అక్రమ్‌ ఖాన్‌, 350 మార్కులు

నాకు ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో 350 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేట మా సొంతూరు. మా నాన్న ఎజాజుల్లాఖాన్‌ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణిలో సివిల్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ కె.కె.ఆర్‌. గౌతమ్‌ స్కూల్‌లో పదో తరగతి చదివాను.

Read More...

ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలి
* కృష్ణ చైతన్య, 345 మార్కులు

మాది అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన వ్యవసాయ కుటుంబం. జేఈఈలో 345 మార్కులొచ్చాయి. నారాయణ శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్‌ చదివా. అందులో 979 మార్కులు సాధించా. ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలన్నది ప్రస్తుతం నా లక్ష్యం. అందుకే ఇప్పుడు దృష్టంతా ఐఐటీ అడ్వాన్స్‌పైనే ఉంది.

Read More...

మధ్య తరగతి కుటుంబం నుంచి...
* కె.వీరవెంకట సతీష్‌, 345 మార్కులు

మాది తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని మధ్యతరగతి కుటుంబం. నాన్న వెంకటరమణ స్థానికంగా ఒక ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో 976 మార్కులు సాధించాను. జేఈఈ పరీక్షలో 345 మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉంది.

Read More...

సొంతంగా కంపెనీ స్థాపిస్తా
* పూసా నిహాల్‌, 345 మార్కులు

మా నాన్న వసంతకుమార్‌ సింగరేణిలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌. అమ్మ సునీతాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాకు ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని అనుకుంటున్నాను.

Read More...

వ్యవసాయ కుటుంబ నేపథ్యం..
* కె.జయచంద్ర, 345 మార్కులు

మాది గుంటూరు జిల్లాలోని నరసరావుపేట. మా నాన్న వెంకటేశ్వరరావు వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ సీతామహాలక్ష్మి గృహిణి. బాగా చదువుకొని మంచి స్థాయిలోకి రావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. అందుకు తగ్గట్లుగానే పట్టుదలగా చదివాను.

Read More...

ఎలక్ట్రానిక్స్‌లో పరిశోధన చేస్తా
* భావినేని ఈశ్వర్‌, 345 మార్కులు

మాది విజయవాడ. నాన్న శ్రీనివాసరావు వి.ఆర్‌. సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌. అమ్మ మాధవి గృహిణి. మొదటి నుంచి కష్టపడి చదువుతున్నాను. ఇంటర్‌లో 954 మార్కులు వచ్చాయి. అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించడం వల్లే జేఈఈ మెయిన్స్‌లోనూ 345 మార్కులు సాధించాను.

Read More...

సివిల్‌ సర్వీస్‌ నా లక్ష్యం
* వినోద్‌రెడ్డి, 345 మార్కులు

సివిల్‌ సర్వీస్‌కు ఎంపికవ్వడం నా లక్ష్యం. జేఈఈలో మంచి మార్కులు వచ్చాయి. వరంగల్‌ ఎస్‌ఆర్‌ కళాశాలలో అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ మార్కులు సాధించా. దేశంలోని ఉత్తమ ఐఐటీలో చేరి బీటెక్‌ పూర్తి చేస్తా.

Read More...
Entrance Exams