Sr. Inter - Toppers

ఏపీ 'ఇంటర్‌' టాపర్ల మనోగతాలు
సీనియర్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. ఆయా కోర్సుల్లో అగ్రగణ్యులుగా నిలిచిన విద్యార్థుల అభిప్రాయాలు, లక్ష్యాలివి.
ఇంజినీర్‌ కావాలని ఉంది: కాళె వీరోజీ (ఎంపీసీ, 994)
మాది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం వాగుమడుగు. నాన్న బ్రహ్మయ్య రైతు. అమ్మ మహాలక్ష్మి గృహిణి. ముగ్గురు సంతానంలో నేను రెండో అబ్బాయిని. అమ్మానాన్న నన్ను బాగా చదివించాలని తపించేవారు. వారి ఆకాంక్ష మేరకు మంచి మార్కులు సాధించడంతో ఆనందంగా ఉంది. రోజుకు పది గంటలు చదివేవాణ్ని. శ్రీప్రతిభ అధ్యాపకుల సూచనలతో మంచి మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో బిట్స్‌ పిలానీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ పెడతా: నల్లూరి వెంకటేష్‌బాబు (ఎంపీసీ 994)
మా స్వగ్రామం ఒంగోలు గ్రామీణ మండలం సర్వేరెడ్డిపాలెం. నాన్న శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. అమ్మ శ్యామల గృహిణి. కాయకష్టం చేసి నన్ను చక్కగా చదివించారు. పెదనాన్న నల్లూరి వెంకట్రావు ప్రోత్సాహంతో బాగా చదవగలిగా. పదో తరగతిలోనూ పదికి పది పాయింట్లు సాధించా. జేఈఈ మెయిన్స్‌లో 192 మార్కులు తెచ్చుకున్నా. భవిష్యత్తులో ఐఐటీ చదివి సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ పెడతా.
ప్రణాళికాబద్ధంగా చదివా.. వి.రమ్య (ఎంపీసీ 993)
ప్రణాళికాబద్ధంగా చదవడం, ఏరోజుకారోజు సందేహాలను నివృత్తి చేసుకోవడంతో ఈ మార్కులు సాధించా. తెనాలి వివేకా మహిళా జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు ప్రోత్సహించారు. పాఠాలను అవగాహన చేసుకోవడం, విశ్లేషణాత్మకంగా చదవడం కలిసివచ్చింది. మా అమ్మానాన్నలిద్దరూ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. కంప్యూటర్‌ ఇంజినీర్‌ కావాలనేది నా కోరిక.
ఐఐటీలో రాణిస్తా.. లక్ష్మీరాజేశ్‌ (ఎంపీసీ 991)
మా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. జేఈఈలో మంచి ర్యాంకుకు ప్రయత్నిస్తున్నా. మెయిన్స్‌లో 230 మార్కులు వచ్చాయి. ఐఐటీలో రాణించాలనేదే లక్ష్యం. మా నాన్న శ్రీనివాసరావు కాకినాడలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన ప్రోత్సాహం, భాష్యం అధ్యాపక బృందం మార్గదర్శనంతో మంచి మార్కులు సాధించా.
సివిల్స్‌ ర్యాంకు సాధిస్తా: సాయిప్రహర్ష్‌ భగవాన్‌ (ఎంపీసీ 991)
మాది చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు. మా అమ్మానాన్నలు ఉపాధ్యాయులైన సత్యనారాయణరావు, మంజుల దంపతుల ప్రోత్సాహంతో చదువుకున్నా. మదనపల్లె కృష్ణారెడ్డి సిద్దార్థ కళాశాల ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించారు. పాఠ్యాంశాలతో పాటు పత్రికల్లో వచ్చే నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేసేవాణ్ని. బాగా చదివి ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం.
వైద్యుడిగా రాణిస్తా: సి.వి.సాయిచందన్‌ (బైపీసీ 993)
మా స్వస్థలం తిరుపతి. నాన్న సీపీ రెడ్డి, అమ్మ కృష్ణవేణి ప్రోత్సాహంతోపాటు భాష్యం అధ్యాపక బృందం కృషితో బైపీసీలో అత్యుత్తమ మార్కులు సాధించగలిగా. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించా. వైద్యుడిగా రాణించాలనే ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు అనుక్షణం కష్టపడతా. ఎయిమ్స్‌లో సీటు సాధించి కార్డియాలజిస్టుగాసేవలందించాలనేదే నా ఆశయం.
క్యాన్సర్‌ పీడితులకు సేవచేస్తా: నారాయణసింధు (బైపీసీ 991)
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. స్వస్థలం నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని నారాయణగూడెం. నాన్న పాపిరెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. వైద్యురాలిగా క్యాన్సర్‌ పీడితులకు సేవచేయడమే నా లక్ష్యం. ఎయిమ్స్‌లో ఆంకాలజీ చేయాలని నిర్ణయించుకున్నా.

కార్డియాలజిస్ట్‌నవుతా: పరిటాల లక్ష్మీప్రసన్న (బైపీసీ 990)

మాది ప్రకాశం జిల్లా పొదిలి మండలం గొట్లగట్టు. నాన్న శ్రీనివాసులు వీఆర్వో. ఇద్దరమ్మాయిల్లో నేను పెద్దమ్మాయిని. పాఠ్యపుస్తకాలు ఎక్కువగా అనుసరించడంతోనే అత్యధిక మార్కులు సాధించగలిగా. బాబాయి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం దరి చేరింది. కార్డియాలజిస్ట్‌ కావాలనేది నా కల
.
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే...నాగసాయి నిర్మలాదేవి, 987 (ఎంఈసీ ప్రథమ ర్యాంకర్‌)
మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న తురగా నాగరాజు పౌరోహిత్యం చేస్తారు. అమ్మ నాగ శశిశ్రీ గృహిణి. వీరిద్దరి ప్రోత్సాహంతోనే ఎంఈసీ విభాగంలో 987 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమురాలిగా నిలిచా. తెనాలి వివేకా జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివా. భవిష్యత్తులో సీఏ చేస్తా.
సివిల్స్‌ లక్ష్యం.. కె.జ్యోతిష్‌చంద్ర (సీఈసీ ప్రథమ ర్యాంకర్‌ 963)
ఐఏఎస్‌ సాధించాలనేది లక్ష్యం. మంచి మార్కులు సాధించాలని మొదటినుంచి లక్ష్యంగా పెట్టుకున్నా. తల్లిదండ్రులు న్యాయవాది కూచి రాజేశ్వరశాస్త్రి, లక్ష్మీఉమతో పాటు విద్యానిధి కళాశాల ప్రిన్సిపల్‌ సుధీర్‌బాబు సహకారం ఉంది.
ఐఏఎస్‌నవుతా.. సాధు అశోక్‌ (హెచ్‌ఈసీ ప్రథమ ర్యాంకరు 948)
మాది పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి. మా నాన్న పోస్టుమెన్‌గా పనిచేసే ప్రభాకర్‌రావు కష్టాన్ని కళ్లారా చూశా. అందుకే కష్టపడి చదివా. భవిష్యత్తులోనూ మరింత బాగా చదివి ఐఏఎస్‌ కావాలని ఉంది.

 

ఇష్టంతోనే విజయం..
* బైపీసీలో రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ మొదలి రిషిత

రాత్రంతా కష్టపడి.. తిండి నిద్ర లేకుండా.. చదవడం కంటే ఇష్టపడి చదివితే విజయం మీ దరి చేరుతుందని ఇంటర్ బైపీసీ- 2014 పరీక్షల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకర్‌గా నిలిచిన మొదలి రిషిత అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన రిషిత తన సత్తా చాటింది.
Read More...

 

సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కావాలని..
* ఎంపీసీలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకరు - నిఖిల్‌బాబు(994), శ్రీ చైతన్య కళాశాల,ఖమ్మం

ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని ఉంది.మాది వరంగల్ జిల్లా మంగపేట మండలం ఓడగూడెం. అశ్వాపురంలో అమ్మమ్మ దగ్గర ఉండి పదో తరగతి వరకు అక్కడే చదివాను.
Read More...

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన చంద్ర'బింబం

* హెచ్ఈసీలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకరు - చంద్రకాంత్
కష్టపడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే లక్షల్లో ఒక్కడిగా నిలవొచ్చని నిరూపించాడు ఓ విద్యార్థి. పట్టణాల్లో, నగరాల్లో చదివితేనే ఉత్తమ ర్యాంకులు, ఫలితాలు సాధింలేమని.. లక్ష్య సాధనపై గురి ఉంటే ఎక్కడి నుంచైనా అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని గ్రామీణ విద్యార్థి నిరూపించాడు.
Read More...

 

ఉపాధ్యాయుల సలహాలు పాటిస్తే విజయం మీదే!
* సీనియర్ ఇంటర్ హెచ్ఈసీ ద్వితీయ ర్యాంకర్ శ్వేత

ఉపాధ్యాయుల సలహాలు పాటిస్తే విజయం సొంతం చేసుకోవచ్చని అంటోంది రాష్ట్ర స్థాయిలో హెచ్ఈసీ ద్వితీయ ఇంటర్లో రెండో ర్యాంకర్‌గా నిలిచిన శ్వేత.
Read More...
రాష్ట్ర స్ధాయిలో.. శ్రీలేఖ
* ఎంఈసీలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకరు - శ్రీలేఖ
మందమర్రి పట్టణం: మందమర్రి ప్రాణహిత కాలనీకి చెందిన ఇప్ప శ్రీలేఖ ఎంఈసీ విభాగంలో (హాల్ టికెట్ నెం.1415245968) 981/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించింది. శ్రీలేఖ హైదరాబాద్‌లోని సీఎంఎస్ ప్రైవేట్ కళాశాలలో చదివింది. మొదటి సంవత్సరంలో 491/500 మార్కులు సాధించింది.
Read More...
ఇదే పట్టుదలతో సివిల్స్ సాధిస్తా
* సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకరు - నూస్రత్ ఫాతిమా, సీఈసీ(956) అల్ఫోర్స్ కళాశాల
సీసీసీ గాంధీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు అజీమోద్దిన్ - జియా ఫాతిమాల కూతురు నూస్రత్ ఫాతిమా ఇంటర్ ఫలితాల్లో సీఈసీ విభాగంలో 956 మార్కులు సాధించింది. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న నూస్రత్ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తి సాధన చేసి సివిల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.
Read More...

Back
Academic Exams