AP GENCO 2017 > AE Notification

ఏపీజెన్‌కోలో 94 ఏఈ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్‌కో) రాష్ట్రంలోని వివిధ విద్యుదుత్పాదన ప్రాజెక్టుల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు.......
* ట్రెయినీ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)
పోస్టుల సంఖ్య: 94
బ్రాంచులవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ - 44, మెకానికల్ - 26, ఎలక్ట్రానిక్స్ - 06, సివిల్ - 18
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 42 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంది.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
రాతపరీక్ష తేది: 23.04.2017
రాతపరీక్ష కేంద్రం: విజయవాడ కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్షలో ఏయే అంశాలుంటాయి? రాతపరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. సెక్షన్ ఎలో కోర్ కరిక్యులమ్ (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్), సెక్షన్ బిలో అనలిటికల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించాలి. ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులైతే 30 శాతం మార్కులు రావాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500; బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.03.2017
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు గడువు: 04.04.2017
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 05.04.2017

Notification Syllabus
Fee Payment & Online Application

Posted on 06-03-2017