TS NPDCL > Notification

టీఎస్ఎన్‌పీడీసీఎల్‌లో 565 ఎస్ఈ, ఏఈ పోస్టులు

వ‌రంగ‌ల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన‌సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్‌పీడీసీఎల్‌) సబ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ కొలువుల భర్తీకి మే 25న‌ ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివ‌రాలు.....
1) స‌బ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌)
మొత్తం పోస్టుల సంఖ్య: 497
అర్హత‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌.

2) అసిస్టెంట్ ఇంజినీర్
మొత్తం పోస్టుల సంఖ్య: 68 (ఎలక్ట్రికల్-66, సివిల్-02)
అర్హత‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఏఎంఐఈ పరీక్ష ఉత్తీర్ణత‌.

వ‌య‌సు: 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.
ప‌రీక్ష విధానం: మొత్తం 100 మార్కుల‌కు 100 మ‌ల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. కాల వ్యవ‌ధి 2 గంట‌లు. కోర్ టెక్నిక‌ల్ స‌బ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు వ‌స్తాయి.
ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ, వ‌రంగ‌ల్ జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలోని కేంద్రాల్లో.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి (రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు).

ముఖ్యమైన తేదీలు
సబ్ ఇంజినీర్
ఫీజు చెల్లింపు ప్రారంభం: 04.06.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 05.06.2018
ఫీజు చెల్లింపు, ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.06.2018
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 30.06.2018
పరీక్ష తేది: 08.07.2018 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.

ముఖ్యమైన తేదీలు
అసిస్టెంట్ ఇంజినీర్
ఫీజు చెల్లింపు ప్రారంభం: 12.06.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 13.06.2018
ఫీజు చెల్లింపు, ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.06.2018
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 09.07.2018
పరీక్ష తేది: 15.07.2018 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.

Sub Engineer Notification Assistant Engineer Notification Website Website

posted on 26-05-2018