Top Story

వినూత్నంగా తెలంగాణ ఐటీ విధాన ఆవిష్కరణ!

* మరుక్షణమే సుమారు రూ.2,700 కోట్ల విలువైన ఒప్పందాలు
* 25 వేల ఉద్యోగాల వరకు అవకాశం
* తెలంగాణది ప్రపంచస్థాయి: నారాయణమూర్తి
* శభాష్‌ అన్న గవర్నర్‌ నరసింహన్‌
* రండి కలసి ఎదుగుదాం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

ఈనాడు - హైదరాబాద్‌: రాష్ట్రంలోని పల్లెలకూ ప్రపంచానికి వారధిగా నిలుస్తూ.. ఆలోచనల్లోనే కాకుండా ఆచరణలోనూ వినూత్నతకు పెద్దపీట వేస్తూ.. ఆరంభంలోనే దాదాపు రూ.2,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఐటీ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. తెలంగాణ తొలి ఐటీ విధానం ఏప్రిల్ 4న ఆవిష్కృతమైంది. ఐటీ మంత్రి కేటీఆర్‌ మానసపుత్రికగా అభివర్ణిస్తున్న ఈ ఐటీ పాలసీతో పాటు గ్రామీణ సాంకేతిక కేంద్రాల విధానం (రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ పాలసీ), కొత్త ఆవిష్కరణల (ఇన్నోవేషన్‌) విధానం, ఎలక్ట్రానిక్స్‌ విధానం, ఇమేజ్‌ (గేమింగ్‌, యానిమేషన్‌) విధానాలను కూడా వెల్లడించారు.



Stories

తెలంగాణ ఐటీ విధానం... ఆవిష్కరణే అద్భుతం

ఐటీ స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటికి భారీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ఏప్రిల్ 4న కొత్త ఆవిష్కరణ విధానం (ఇన్నోవేషన్‌ పాలసీని) ప్రకటించింది.

ప్రతి విద్యార్థికీ కొలువు దక్కేలా నైపుణ్యం

* పరిశ్రమలు, విద్యారంగ అనుసంధానంతోనే సాధ్యం
* ఐటీ విధానంలో మరో కీలక లక్ష్యం

తెలంగాణలో ప్రతి విద్యార్థీ ఉద్యోగార్హుడయ్యేలా అవసరమైన సాంకేతిక, నిర్వహణ, జీవన నైపుణ్యాలను అందించడం తెలంగాణ ఐటీ విధానంలోని మరో కీలకాంశం. పరిశ్రమలను విద్యారంగంతో అనుసంధానిస్తేనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్న ప్రభుత్వం దీనికి ‘టాస్క్‌’ను వారధిగా వినియోగించబోతోంది.

పల్లెల్లోనూ ఐటీ సొబగులు..

* ప్రతి జిల్లాలో గ్రామీణ సాంకేతిక కేంద్రాల ఏర్పాటు
* వీటి ద్వారా 2500 మందికి ఉపాధి
* పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు

తెలంగాణలో ఐటీ ఆధారిత సేవలు, అనుబంధ రంగాలను పల్లెలకు విస్తరించేలా ప్రభుత్వం కొత్త ఐటీ విధానాన్ని తీసుకొచ్చింది. .

రూ.2,700 కోట్ల ఒప్పందాలు...25,000 ఉద్యోగాలు..

* కుదిరిన 28 ఎంఓయూలు
సమాచారం సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) విధానంతోపాటు మరో నాలుగు విధానాలను ఏప్రిల్ 4న ప్రకటించిన సందర్భంగా తయారీ, శిక్షణ, కార్యకలాపాల విస్తరణకు వివిధ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం, టి-హబ్‌, టాస్క్‌లు మొత్తం 28 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో ఇమేజ్‌ సిటీ..

* గేమింగ్‌, యానిమేషన్‌ రంగాల అభివృద్ధి
* ఇమేజ్‌ పాలసీని ఆవిష్కరించిన తెలంగాణ

భవిష్యత్తులో యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, కామిక్స్‌, గేమింగ్‌ ఇండస్ట్రీ (ఏవీసీజీఐ)కు తెలంగాణ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆకాంక్షించింది. ఆయా రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత ఆకర్షణీయ నగరమని పేర్కొంది.