close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ: ఐదు ప్రకటనలు.. 2,786 పోస్టులు

* గ్రూప్-4 కింద 1,521, వీఆర్‌వో 700
* పాత జిల్లాల ప్రాతిపదికగా వీఆర్‌వో పోస్టుల భర్తీ
* జూన్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* ప్రాథమిక షెడ్యూలు వెల్లడించిన కమిషన్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా టీఎస్‌పీఎస్సీ 2,786 పోస్టులతో ఐదు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. వీటిలో కీలకమైన గ్రూప్-4, వీఆర్‌వోతో పాటు సీనియర్ స్టెనో, ఆర్టీసీ, అర్థ గణాంక శాఖల నోటిఫికేషన్లు ఉన్నాయి. అత్యధికంగా గ్రూప్-4లో 1,521 పోస్టులు, రెవెన్యూలో 700 వీఆర్‌వో, అర్థ గణాంకశాఖలో 474 మండల ప్రణాళిక, గణాంక అధికారులు/ సహాయ గణాంక అధికారుల పోస్టులు ఉన్నాయి. వీఆర్‌వో పోస్టులను పూర్వజిల్లా ప్రాతిపదికన భర్తీ చేయనుంది. మండల ప్రణాళిక, గణాంక అధికారుల పోస్టులు జోనల్ విధానంలో ఉంటాయి. కొత్తగా ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలకు జూన్ 7 నుంచి నోటిఫికేషన్ల వారీగా దరఖాస్తులను ఆన్‌లైన్లో స్వీకరించనుంది. పరీక్షల్లో ప్రతిభ, జిల్లా స్థానికత, అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్ల మేరకు పోస్టింగులు ఉంటాయని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
* గ్రూప్‌-4 పోస్టులు
మొత్తం ఖాళీలు: 1521
1) జూనియర్ స్టెనో
అర్హత: డిగ్రీతో పాటు హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌, షార్ట్‌ హ్యాండ్‌ తప్పనిసరి. ఈ అర్హతలున్న అభ్యర్థులు అందుబాటులో లేకుంటే లోయర్‌ గ్రేడ్‌ అభ్యర్థులతో ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. తెలుగు టైప్‌ రైటింగ్‌కు ప్రభుత్వ స్టాండర్డ్‌ కీబోర్డుపై పరీక్ష ఉంటుంది.
2) టైపిస్ట్
అర్హత: డిగ్రీతో పాటు హయ్యర్‌ గ్రేడ్‌ తెలుగు టైప్‌ రైటింగ్‌ కలిగి ఉండాలి. ఒకవేళ హయ్యర్‌ గ్రేడ్‌ అర్హత లేకుంటే లోయర్‌ గ్రేడ్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు టైప్‌ రైటింగ్‌ అభ్యర్థులు లేకుంటే ఆంగ్లం వచ్చిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఎంపికైన అభ్యర్థులు ఏడాదిలోగా తెలుగు అర్హత సాధించాల్సి ఉంటుంది.
3) జూనియర్ అసిస్టెంట్
అర్హత: డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.
పరీక్ష తేది: 07.10.2018
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 07.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 06.07.2018

Notification

------------------------------------------------------------------------------------------
* జూనియర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు: 72
1) జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్): 33
అర్హత: డిగ్రీతో పాటు తెలుగు లేదా ఇంగ్లిష్‌ టైప్ రైటింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ పాసై ఉండాలి.
2) జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్): 39
అర్హత: కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.
పరీక్ష తేది: 07.10.2018
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.120 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 07.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 06.07.2018

Notification

------------------------------------------------------------------------------------------
* మండల ప్రణాళిక, గణాంక అధికారి/ సహాయ గణాంక అధికారి
మొత్తం ఖాళీలు: 474
జోన్లవారీ ఖాళీలు: జోన్ 5 పరిధిలో 195, జోన్ 6 పరిధిలో 279.
అర్హత: స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుగా డిగ్రీ లేదా గణితం లేదా కామర్స్‌ లేదా ఎకనామిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత. అయితే స్టాటిస్టిక్స్‌ ఏదైనా సంవత్సరంలో ఒక పేపరుగా చదివి ఉండాలి.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
పరీక్ష తేది: 02.09.2018
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018

Notification

------------------------------------------------------------------------------------------
* విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ)
మొత్తం ఖాళీలు: 700
జిల్లాలవారీ ఖాళీలు: ఆదిలాబాద్-107, ఖమ్మం-19, వరంగల్-49, కరీంనగర్-90, మహబూబ్ నగర్-155, నల్గొండ-83, నిజామాబాద్-50, హైదరాబాద్-07, రంగారెడ్డి-90, మెదక్-50
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
పరీక్ష తేది: 16.09.2018
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018

Notification

------------------------------------------------------------------------------------------
* సీనియర్ స్టెనో
మొత్తం ఖాళీలు: 19
అర్హత: డిగ్రీతో పాటు హయ్యర్‌ గ్రేడ్‌ షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ అర్హత కలిగి ఉండాలి. తెలుగు టైప్‌రైటింగ్‌ పరీక్ష స్టాండర్డ్‌ కీబోర్డుపై ఉంటుంది.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 11.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018

Notification

------------------------------------------------------------------------------------------

Posted on 2-06-2018