close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ - 851 ఏఈవో పోస్టులు

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అగ్రికల్చ‌ర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీస‌ర్ (ఏఈవో) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* అగ్రికల్చ‌ర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీస‌ర్ (ఏఈవో) గ్రేడ్‌-II: 851 పోస్టులు
విభాగాలు: అగ్రిక‌ల్చ‌ర్‌, కోఆప‌రేష‌న్ డిపార్ట్‌మెంట్ (స‌బార్డినేట్ స‌ర్వీస్‌).
అర్హ‌త‌: బీఎస్సీ (అగ్రికల్చ‌ర్/ కమ‌ర్షియ‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ & బిజినెస్ మేనేజ్‌మెంట్‌)/డిప్లొమా (అగ్రికల్చ‌ర్ ఇంజినీరింగ్‌)/బీటెక్ (అగ్రికల్చ‌ర్ ఇంజినీరింగ్‌).
* విద్యార్హ‌త‌ల వారీగా ఖాళీలు...
1) డిప్లొమా (అగ్రిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్‌): 340
2) డిప్లొమా (అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌)/బీటెక్ (అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌): 88
3) బీఎస్సీ (అగ్రిక‌ల్చ‌ర్‌): 345
4) బీఎస్సీ (కమ‌ర్షియ‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ & బిజినెస్ మేనేజ్‌మెంట్‌): 78
వయ‌సు: 01.07.2017 నాటికి 18 - 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.22,460 - రూ.66,330.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ప‌రీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు ప‌రీక్ష ఫీజు నుంచి మిన‌హాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా (ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌).
ప‌రీక్ష విధానం: రాత‌ప‌రీక్ష‌లో మొత్తం రెండు పేప‌ర్లు ఉంటాయి.
పేప‌ర్‌-1: జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ & జ‌న‌ర‌ల్
ఎబిలిటీ, పేప‌ర్‌-2: సంబంధిత విభాగం ఉంటుంది. ఒక్కో పేప‌ర్‌లో 150 ప్ర‌శ్న‌ల‌కుగాను 150 మార్కుల చొప్పున 300 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష స‌మ‌యం-ఒక్కో పేప‌ర్‌కు 150 నిమిషాలు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.10.2017.
రాత‌ప‌రీక్ష తేది: 22.11.2017.
ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌.
Notification Online Application

Posted on 14-10-2017