close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీజీటీ దివ్యాంగ అభ్యర్థులు 66 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ గురుకుల విద్యాసంస్థల్లో టీజీటీ కింద దివ్యాంగుల విభాగంలో 66 మందిని ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. మొత్తం 187 ఖాళీలుండగా 66 మందిని ఎంపిక చేశారు. తగిన అభ్యర్థులు లేనందున 131 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారు. ఎంపికైన వారి జాబితా వెబ్‌సైట్లో ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు.
సహాయ ఆచార్యులుగా 20 మంది :
దంత విభాగంలో సహాయ ఆచార్యులుగా 20 మందిని ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 403 మంది పోటీపడ్డారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచుతామని కార్యదర్శి పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌ విధానంలో డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష:
డిపార్ట్‌మెంటల్‌ టెస్టులను ఆన్‌లైన్‌ విధానంలో జరపాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు ఉన్న సౌకర్యాలు, అవకాశాలను బట్టి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్లో ఓఎంఆర్‌ పత్రాలు:
టీఆర్‌టీకి సంబంధించి తుది కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి పేర్కొన్నారు. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.
Website : https://tspsc.gov.in/TSPSCWEB0508/





Posted on 13-06-2018