close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్-1 మౌఖికపరీక్షల మండలిలో సీనియర్ ఐఏఎస్‌లు

* తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోని గ్రూప్-1 మౌఖిక పరీక్ష నిర్వహణ బోర్డులో సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం(జులై 18) ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ వినతిమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు ప్రభుత్వం తరపున గ్రూప్-1 మౌఖిక పరీక్షల నిర్వహణకు హాజరవుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. పరిపాలనపరమైన సమస్యలుంటే వారితరపున శాఖాధిపతులు హాజరుకావచ్చన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి మౌఖిక పరీక్షల షెడ్యూలుపై ఆయా ప్రభుత్వ శాఖలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Posted on 20-07-2017