close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గురుకులాల ప్రధాన పరీక్షలో ప్రశ్నలు పునరుక్తం

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) ఉద్యోగాల నియామకానికి జులై 18న టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష ప్రశ్నపత్రంలో 10 ప్రశ్నలు పునరుక్తమయ్యాయని అభ్యర్థులు తెలిపారు. మొత్తం ఎ, బి, సి, డి కోడ్‌లతో నాలుగు ప్రశ్నపత్రాలను రూపొందించారు. అందులో ‘సి' కోడ్‌లో 91 నుంచి 100 వరకు ఇచ్చిన 10 ప్రశ్నలు 141 నుంచి 150 వరకూ నంబర్లతో మళ్లీ ముద్రితమయ్యాయని, పేర్కొన్నారు. దీనివల్ల ఎ, బి, డి కోడ్‌ల ప్రశ్నపత్రాలతో రాసిన విద్యార్థులు తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
Posted on 20-07-2017