close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ప్రధాన పరీక్షలకు 87 శాతం మంది హాజరు

ఈనాడు, హైదరాబాద్: గురుకులాల్లో పీజీటీ ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పోస్టులకు బుధవారం(జులై 19) నిర్వహించిన ప్రధాన పరీక్షలకు 87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 11 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష రాసేందుకు 4778 మంది అర్హత సాధించారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 4162 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 4163 మంది హాజరయ్యారని వివరించారు. గురువారం(జులై 20) జరగనున్న టీజీటీ మేథమెటిక్స్, బయాలజికల్ సైన్సెస్ పరీక్షకు 16180 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Posted on 20-07-2017