close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

జులై 24 నుంచి గ్రూప్-1 మౌఖిక పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-1 మౌఖిక పరీక్షలు జులై 24 నుంచి మొదలుకానున్నాయి. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల రోల్‌నంబర్ల వారీగా, వారికి పరీక్షలు జరిగే తేదీ, సమయాన్ని పొందుపరిచారు. ఉదయం సెషన్ 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కొనసాగుతుంది.
Posted on 20-07-2017