close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

తెలుగు సబ్జెక్టు మాత్రమే వాయిదా

* మిగతావన్నీ సెప్టెంబరు పదో తేదీనే: టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో పోస్టుల భర్తీకి తెలుగు మినహా మిగతా సబ్జెక్టులన్నిటికీ సెప్టెంబరు 10న ప్రిలిమినరీ పరీక్ష యథావిధిగా జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తామని, ప్రత్యేకంగా ప్రవేశపత్రాలు జారీ చేస్తామని వివరించారు.

Posted on 09-09-2017