close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉద్యోగ వయోపరిమితి పెంపు

ఈనాడు-హైదరాబాద్: అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయో పరిమితిని మూడు సంవత్సరాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. అటవీశాఖ అధికారులు ఈ మేరకు టీఎస్‌పీఎస్సీకి బుధవారం (సెప్టెంబరు 13) లేఖ రాశారు.
2014లో ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వయోపరిమితి 28 సంవత్సరాలుగా నిర్ధారించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియామక ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. తాము మూడేళ్లు నష్టపోయాయని, ఈ మేరకు వయోపరిమితి పెంచాలన్న నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 31 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును కూడా పెంచాలని టీఎస్‌పీఎస్సీకి లేఖ రాసినట్లు అటవీశాఖ తెలిపింది.

Posted on 14-09-2017