close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-2పై త్వరలో సవరణ షెడ్యూలు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2 ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మార్గం సుగమం అయింది. తుది తీర్పునకు లోబడి నియామకాల ప్రక్రియ ప్రారంభించవచ్చని హైకోర్టు అనుమతివ్వడంతో ఆ మేరకు సవరణ షెడ్యూలు ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా షెడ్యూలు ప్రకటించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయాలని భావిస్తోంది. అలాగే... గ్రూప్‌-1పై కీలకమైన మరో కేసు సెప్టెంబరు 15న విచారణకు రానున్నట్లు తెలిసింది. ఈ కేసుపై న్యాయస్థానం నిర్ణయం వెలువడితే ఆ మేరకు ఫలితాలు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోంది.

 

Posted on 15-09-2017