close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

అటవీ ఉద్యోగాల అభ్యర్థులకు టీశాట్‌ ప్రత్యేక కార్యక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: అటవీశాఖలో ప్రకటించిన ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సెప్టెంబరు 16 నుంచి ప్రత్యేక బోధన కార్యక్రమాలను టీశాట్‌ ప్రసారం చేయనుంది. 40 రోజుల పాటు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వివిధ సబ్జెక్టులపై ప్రసారాలు ఉంటాయని తెలిపింది. ఇవన్నీ యూట్యూబ్‌, వెబ్‌సైట్‌, టీశాట్‌ యాప్‌లో అందుబాటులో ఉంటాయని టీశాట్‌ సెప్టెంబరు 14న ఒక ప్రకటనలో పేర్కొంది.

 

Posted on 15-09-2017