close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

బీసీ క్రీమీలేయర్‌ ధ్రువీకరణ గడువు 5

* అభ్యంతరాల నేపథ్యంలో సమయమిచ్చిన టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ జారీచేసిన నమూనాలోనే అభ్యర్థులు క్రీమీలేయర్‌ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది. ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి ప్రత్యేక నమూనాను తమ కమిషన్‌ సిఫార్సు చేయదని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లోనే ధ్రువీకరణ పత్రాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబరు 26న పీజీటీ పోస్టుల ధ్రువీకరణ పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదురైన అభ్యర్థులు అక్టోబరు 5లోగా సంబంధిత నమూనాలో పత్రాలు ఇవ్వాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన మెమో నెం.2009 ప్రకారం... ఆయా పత్రాలు ఉండాలని వెల్లడించారు. గడువులోగా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని కోరారు.

 

Posted on 18-09-2017