close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

9, 10 తేదీల్లో పీజీటీ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో పీజీటీ పోస్టులకు (ఇంగ్లిష్‌, హిందీ భాషలు) సంబంధించి అక్టోబరు 9, 10 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ అక్టోబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులతో 1:2 నిష్పత్తి చొప్పున జాబితా రూపొందించామని పేర్కొన్నారు. ఈ మేరకు 235 పోస్టులకు... 434 మంది అభ్యర్థులను పిలవనున్నట్లు వివరించారు. ఉదయం 9 గంటల నుంచి మాసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. కులధ్రువీకరణ పత్రం తల్లి లేదా తండ్రి పేరిట తీసుకోవాలని, బీసీ అభ్యర్థులు నాన్‌క్రీమిలేయర్‌ పత్రం సంబంధిత నమూనాలో ఉండాలని స్పష్టం చేశారు.
https://tspsc.gov.in/

 

Posted on 18-09-2017