close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పీజీటీ పోస్టులకు 7, 8 తేదీల్లో జోనల్ ఐచ్ఛికాల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్: గురుకులాల్లో పీజీటీ హిందీ, ఆంగ్లం భాషల పోస్టులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబరు 7, 8 తేదీల్లో వెబ్‌సైట్లో జోనల్ ఐచ్ఛికాలు(ఆప్షన్లు) ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశామని ఇంగ్లిష్ పోస్టులకు 9న, హిందీ పోస్టులకు 10న మాసాబ్‌ట్యాంక్ ఆవరణలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
ప్రాథమిక కీపై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
గురుకుల కళాశాలల్లో ప్రిన్సిపల్, గ్రంథపాలకులు, ఫిజికల్ డైరెక్టర్, జూనియర్, డిగ్రీ అధ్యాపకుల పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ప్రాథమిక కీ శుక్రవారం (అక్టోబరు 6) నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. కీపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు 10వ తేదీ వరకు తెలియజేయాలని, అభ్యర్థనలు ఆంగ్లంలోనే ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

 

Posted on 06-10-2017