close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

15లోగా ఆప్షన్లు ఇవ్వాలి: టీఎస్‌పీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ద్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు జిల్లాల ఎంపిక ఆప్షన్లను అక్టోబరు 15లోగా ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు వాటిని సవరించుకోవచ్చని పేర్కొన్నారు.
పీసీబీలో పోస్టులకు....కాలుష్య నియంత్రణ మండలిలో స్టెనో కమ్‌ టైపిస్టు పోస్టులకు సంబంధించి ద్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆయా అభ్యర్థులకు అక్టోబరు 21న టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ కార్యాలయంలో ద్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.

 

Posted on 13-10-2017