close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎఫ్‌బీవో పోస్టులకు 5569 మంది

హైదరాబాద్‌: అటవీశాఖలో 1857 అటవీ బీట్‌ అధికారుల (ఎఫ్‌బీవో) పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1 : 3 నిష్పత్తిలో 5569 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది. ఈ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలకు దాదాపు 4.11 లక్షల మంది హాజరయ్యారు. 1 : 3 నిష్పత్తిలో ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లో జులై 2 నుంచి దేహదారుఢ్య పరీక్షలు (పీఈటీ) ఉంటాయని కమిషన్‌ వెల్లడించింది. జిల్లాలు, తేదీలవారీగా పరీక్ష ప్రదేశాలు షెడ్యూలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. పీఈటీ, ఈవెంట్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామని వివరించింది.
ఎంపికైన అభ్యర్థుల జాబితా
https://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp


Posted on 21-06-2018