close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

తెలంగాణ గ్రూప్‌-1 టాపర్‌గా మహిళా అభ్యర్థి

* ఫలితాలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 కొలువులకు 121 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అక్టోబరు 28న ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 127 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దివ్యాంగుల కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో ఆరు పోస్టులు ఖాళీగా మిగిలాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 టాపర్‌గా ఓ మహిళా అభ్యర్థి నిలిచారు. జోన్‌-6కు చెందిన ఆమె అత్యధిక మార్కులు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’లో కొన్ని తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా తుది కీని సవరించి, ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఏపీ, తెలంగాణ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్లను 2016 జూన్‌ 29న ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ 2016 సెప్టెంబరు 14 నుంచి 24 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 1,792 మంది హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. మౌఖిక పరీక్షలు ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 10 వరకు జరిగాయి. ఈ ఫలితాలు వెంటనే విడుదల చేయాలని భావించినప్పటికీ హైకోర్టులో దాఖలైన న్యాయవివాదాల కారణంగా సాధ్యం కాలేదు. టీఎస్‌పీఎస్సీ హైకోర్టు సమ్మతి తీసుకుని ఎట్టకేలకు ఫలితాలు విడుదల చేసింది.
తెలంగాణ గ్రూప్ 1 (18/2011) తుది ఫలితాలు
Website

 

Posted on 23-10-2017