close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-1 అభ్యర్థి అప్పీలు కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన పరీక్షలన్నింటితో పాటు మౌఖిక పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే గ్రూప్‌-1 పోస్టులకు అర్హులనే టీఎస్‌పీఎస్సీ వాదనతో ఏకీభవిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. మెయిన్స్‌లో అన్ని పేపర్లు రాయలేదనే కారణంతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తనను ఇంటర్వ్యూకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కార్తీక్‌రెడ్డి అనే అభ్యర్థి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తొలుత అభ్యర్థి వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి విచారణ జరిపి కొట్టేశారు. ఆ ఉత్తర్వులను సవాలుచేస్తూ ధర్మాసనం ముందు అభ్యర్థి అప్పీలు దాఖలుచేశారు.

 

Posted on 05-11-2017