close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన

* 16 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు
* జనవరిలో రాత పరీక్షలు!

ఈనాడు, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ, గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1261 పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. స్టాఫ్ నర్సులు, ఫిజియోథెరపిస్టు, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తమాలిక్, రిఫ్రాక్షనిస్టు, గురుకు మహిళా డిగ్రీ కళాశాలల్లో హెల్త్ సూపర్‌వైజర్ పోస్టుల నియామకానికి ఆరు ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. అత్యధికంగా 1196 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని పోస్టులకు నవంబరు 16 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు డిసెంబరు 11తో ముగుస్తుందని వెల్లడించారు. రాత పరీక్షలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వ జీవో మేరకు ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ పోస్టులు..

పోస్టు ఉద్యోగాల సంఖ్య
స్టాఫ్ నర్సులు 1196
ఫిజియోథెరపిస్టు 06
రేడియోగ్రాఫర్ 35
ఆప్తమాలిక్ అధికారి 02
రిఫ్రాక్షనిస్టు 01
హెల్త్ సూపర్‌వైజర్ 21


Posted on 09-11-2017