close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

'ఆబ్కారీ' అభ్యర్థులకు కంటిచూపు పరీక్షలుి

ఈనాడు, హైదరాబాద్‌: ఆబ్కారీ కానిస్టేబుల్‌ పోస్టుల పీఈటీ పరీక్షల్లో అర్హత సాధించినవారికి డిసెంబరు 12 నుంచి కంటిచూపు పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పురుష అభ్యర్థులకు డిసెంబరు 12-15వరకు, మహిళా అభ్యర్థులకు 16న ఉదయం 9గంటలకు మెహిదీపట్నంలోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు హాల్‌టికెట్‌, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు కార్డుతో పాటు రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలని కమిషన్‌ సూచించింది. వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది.
https://tspsc.gov.in

Posted on 09-12-2017