close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పీజీటీ పోస్టుల ద్రువీకరణకు మరికొందరికి అవకాశం

ఈనాడు, హైదరాబాద్: గురుకులాల్లో పీజీటీ ఫిజికల్ సైన్స్ పోస్టుల్లో కొన్ని కేటగిరీల్లో సరిపడిన సంఖ్యలో అభ్యర్థులు లేకపోవడంతో... మరికొందరికి అవకాశం కల్పించినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా అభ్యర్థులకు డిసెంబరు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్య భవన్‌లో ద్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఫలితాలు, తదుపరి సమాచారం కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.

Posted on 14-12-2017