close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వైద్యశాఖలో 2,108 పోస్టుల భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వైద్యవిద్య సంచాలకుల పరిధిలో 2,108 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తూ ఆర్థికశాఖ డిసెంబరు 13న ఉత్తర్వులిచ్చింది. ఇందులో 1,603 పోస్టులు నర్సులవి కాగా మిగిలినవి 505 సాంకేతిక సహాయకుల పోస్టులు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, పేట్లబురుజు, ఎంజీఎం సహా రాష్ట్రంలోని పలు బోధనాసుపత్రుల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. మూణ్నాలుగు వార్డులకు కూడా ఇద్దరే నర్సులు సేవలందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 1,603 నర్సుల పోస్టులు భర్తీ చేస్తే బోధనాసుపత్రుల్లో నర్సింగ్‌ సేవలు మెరుగవుతాయని భావిస్తున్నారు. సరిపడా సాంకేతిక సహాయకులు బోధనాసుపత్రుల్లో రోగనిర్ధారణ పరీక్షల్లో జాప్యం జరుగుతోంది. భారీగా సాంకేతిక సహాయక పోస్టులను బోధనాసుపత్రుల కోసం భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతించడంతో ఈ ఇబ్బందీ తీరనుంది.
ఊపందుకున్న నియామక ప్రక్రియ: డిసెంబరు 11న తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 2,517 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2016 జులై 13న 2118 పోస్టులు, 2017 మే 18న 660 పోస్టుల భర్తీకి ఉత్తర్వులిచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల ప్రక్రియ ఊపందుకుంది.

Posted on 14-12-2017