close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ప్రశాంతంగా సీడీపీవో పరీక్ష

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి/అదనపు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి పోస్టుల భర్తీ కోసం జనవరి 4న నిర్వహించిన నియామక పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షకు 12,310 మంది దరఖాస్తు చేసుకోగా..ఉదయం నిర్వహించిన పరీక్షకు 7,357(59.76శాతం) మంది, మధ్యాహ్నం పరీక్షకు 7,353(59.73శాతం) మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొంది.
https://tspsc.gov.in


Posted on 05-01-2018