close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వ్యవసాయ వర్సిటీలో 109 పోస్టుల భర్తీకి పచ్చజెండా

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 109 జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్టు పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 17న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టాలని సూచించింది. ఖాళీల వివరాలు, రోస్టర్‌, విద్యార్హతలు ఇతర సమాచారాన్ని వెంటనే ఆర్థిక శాఖకు అందించాలని పేర్కొంది.


Posted on 18-01-2018