close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

స్టాఫ్‌నర్సు మెరిట్‌ జాబితా విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో స్టాఫ్‌నర్సు పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో కనీస అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్‌ జాబితా (ర్యాంకులు)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సొసైటీల్లో 533 పోస్టులకు 17,868 మంది పరీక్ష రాశారు. వీరిలో 15,969 మంది కనీస అర్హత మార్కులు సాధించారు. మెరిట్‌ జాబితా నుంచి 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తామని కమిషన్‌ వెల్లడించింది. హాల్‌టికెట్‌ నంబరు, బుక్‌లెట్‌ సిరీస్‌ తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులను తిరస్కరించి, వారి వివరాలు జాబితాలో చేర్చలేదని స్పష్టం చేసింది.
మెరిట్‌ జాబితా
వెబ్‌సైట్‌


Posted on 22-06-2018