close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల అభ్యర్థులకు దేహదారుఢ్య అర్హత పరీక్షలు నిర్వహించిన తరువాతే ధ్రువీకరణపత్రాల పరిశీలన నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అర్హత పరీక్షలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించింది.
https://tspsc.gov.in/


Posted on 25-01-2018